Matthew 21

Matthew 21:1

యేసు తన శిష్యులకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు ఏమి కనబడుతుందని చెప్పాడు?

శిష్యులు వెళ్ళినప్పుడు వారికి కట్టబడియున్న ఒక గాడిద, దానితో గాడిద పిల్ల కనబడతాయని యేసు చెప్పాడు (21:2).

Matthew 21:4

ఈ సంఘటనను ప్రవక్త ఏ విధంగా ప్రవచించాడు?

ప్రవక్త, ఇదిగో నీ రాజు గాడిదను, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచించాడు (21:4-5).

Matthew 21:6

యెరూషలేము వీధుల్లో యేసు ప్రయాణిస్తున్నపుడు జనసమూహములు ఏమి చేశారు?

యెరూషలేము వీధుల్లో యేసు ప్రయాణిస్తున్నపుడు జనసమూహములు పైబట్టలు, చెట్ల కొమ్మలు దారి వెంట పరిచారు (21:8).

Matthew 21:9

యేసు వెళ్తుండగా జనసమూహం ఏమని కేకలు వేసారు?

జనసమూహం "దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము" అని కేకలు వేశారు (21:9). .

Matthew 21:12

యెరూషలేము దేవాలయములో ప్రవేశించినప్పుడు యేసు ఏమి చేశాడు?

దేవాలయములో ప్రవేశించి యేసు, క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి, గువ్వలను అమ్మేవారి బల్లలను పడదోశాడు (21:12).

దేవుని మందిరాన్ని వ్యాపారులు ఏమి చేశారని యేసు అన్నాడు?

దేవుని మందిరాన్ని వ్యాపారులు దొంగల గుహవలె చేశారని యేసు అన్నాడు (21:13).

Matthew 21:15

యేసును గూర్చి చిన్న పిల్లలు కేకలు వేస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు అభ్యంతరం తెలిపినప్పుడు యేసు వారితో ఏమి అన్నాడు?

బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్దింపజేసితివి అని ప్రవక్తలచే పలుకబడిన ప్రవచనం యేసు వారికి గుర్తు చేశాడు (21:15-16).

Matthew 21:18

యేసు అంజూరపు చెట్టును ఏమి చేశాడు? ఎందుకు?

అది కాపు లేకుండా ఉన్నందువల్ల యేసు ఆ చెట్టుని శపించాడు (21:18-19).

Matthew 21:20

అంజూరపు చెట్టు ఎండిపోయిన సందర్భంలో ప్రార్థన గురించి యేసు తన శిష్యులకు ఏమి బోధించాడు?

వారు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటన్నిటినీ పొందుతారని యేసు బోధించాడు (21:20-22).

Matthew 21:23

యేసు బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి యేసును ఏమని ప్రశ్నించారు?

ప్రధాన యాజకులు, పెద్దలు యేసు దగ్గరకు వచ్చి, ఏ అధికారంతో యేసు ఈ పనులన్నీ చేస్తున్నాడని అడిగారు (21:23).

Matthew 21:25

ప్రధాన యాజకులు, పెద్దలు అడిగిన ప్రశ్నకు బదులుగా యేసు వారిని ఏమని అడిగాడు?

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, లేక మనుషులనుండి కలిగిందా అని యేసు వారిని ప్రశ్నించాడు (21:25).

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెప్పడానికి ఎందుకు సందేహించారు?

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెబితే, యోహానును ఎందుకు నమ్మలేదని యేసు ప్రశ్నించవచ్చు (21:25).

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం మనుషులనుండి కలిగింది అని చెప్పడానికి ఎందుకు సందేహించారు?

బాప్తిసమిచ్చే యోహానును ఒక ప్రవక్తగా భావిస్తున్న ప్రజలకు భయపడి ఏ జవాబూ చెప్పలేదు (21:26).

Matthew 21:28

యేసు చెప్పిన కథలో ఇద్దరు కుమారులలో ఎవరు తండ్రి చెప్పిన పని చేశారు?

మొదటి కుమారుడు ముందు వెళ్లనని చెప్పినప్పటికీ తరువాత తన మనస్సు మార్చుకొని వెళ్లి పని పూర్తిచేశాడు (21:28-31).

Matthew 21:31

ప్రధాన యాజకులు, శాస్త్రుల కంటే ముందుగా సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ఎందుకు చెప్పాడు?

సుంకరులు, వేశ్యలు యోహాను నీతి మార్గమును నమ్మారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యోహాను నీతి మార్గమును నమ్మక పశ్చాత్తాపపడలేదు (21:31-32).

Matthew 21:35

పంట యజమాని తన భాగం కోసం సేవకులను పంపినప్పుడు గుత్త కాపులు ఏమిచేశారు?

గుత్త కాపులు సేవకులలో ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరియొకరిపై రాళ్ళు రువ్వారు (21:35-36).

చివరకు యజమాని ఏమి చేశాడు?

చివరగా యజమాని తన కుమారుణ్ణి పంపించాడు (21:37).

Matthew 21:38

చివరగా యజమాని పంపిన వ్యక్తిని గుత్త కాపులు ఏమిచేశారు?

యజమాని కుమారుణ్ణి గుత్త కాపులు చంపివేశారు (21:38-39).

Matthew 21:40

తరువాత ఏమి చేయమని మనుషులు యజమానికి చెప్పారు?

ఆ దుర్మార్గులైన గుత్త కాపులను సంహరించి పంటలో భాగం ఇచ్చే వేరే కాపులకు ఇవ్వమని చెప్పారు (21:40-41).

Matthew 21:42

యేసు లేఖనాన్ని ప్రస్తావించి చెప్పినట్టు, నిషేధించబడిన రాయి ఏమవుతుంది?

ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది (21:42).

Matthew 21:43

యేసు ప్రస్తావించిన లేఖనం ప్రకారం, ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యము ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు ప్రజల యొద్దకు తీసుకురాబడుతుంది (21:43).

Matthew 21:45

ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును వెంటనే ఎందుకు బంధించలేకపోయారు?

యేసును ప్రజలు ప్రవక్త అని భావించినందువల్ల ప్రధాన యాజకులు, పరిసయ్యులు ప్రజలకు భయపడి యేసును బంధించలేకపోయారు (21:46).