ఈ అధ్యాయములో, సముద్రపు దరిని యేసు పడవలో కూర్చొని పెద్ద జనసమూహముతో దేవుని రాజ్యాన్ని వివరించే రకరకాల ఉపమానాలు తెలియజేసాడు.
● ఆ దినాన
ముందటి అధ్యాయములో వలెనే ఈ సంగతులు కూడా ఒకే దినాన సంభవించాయి.
● ఇంటిలో నుండి బయటకు
ఎవరి ఇంటిలో యేసు నిలిచియున్నాడో ప్రస్తావించబడలేదు.
● పడవలోనికి వెళ్ళి
బహుశా ఇది పై కప్పు లేకుండా తెరచాపతో ఉన్న చిన్న పడవ అయి ఉంటుంది.
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెప్పాడు.
● యేసు అనేక విషయాలను ఉపమానములుగా వారికి చెప్పాడు
"ఉపమానములలో యేసు వారికి అనేక విషయాలు చెప్పాడు"
● వారికి
సమూహములోనున్న ప్రజలకు
● ఇదిగో
ప్రత్యామ్నాయ అనువాదం: "చూడండి" లేక "వినండి" లేక "నేను మీకు చెప్పబోయే దానిని మనస్సు పెట్టి వినండి"
● విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను
"ఒక రైతు పొలంలో విత్తనాలు జల్లుటకు వెళ్లెను"
● ఆయన విత్తుచుండగా
"విత్తువాడు విత్తుచుండగా"
● దారి ప్రక్కన
పొలాన్ని ఆనుకొని ఉన్న "బాట.” ప్రజలు అందులో నడుస్తారు కావున నేల గట్టిగా ఉంటుంది.
● నోట్లో వేసుకు పోయాయి
"విత్తనాలన్నిటిని తినివేసాయి"
● రాతి నేల
"రాళ్ల మీదనున్న తక్కువ మన్ను"
● వెంటనే అవి మొలిచెను
"విత్తనాలు త్వరగా మొలకెత్తి పెరిగెను."
● అవి వాడిపోయినవి
"మొక్కలను ఎండ మాడ్చి వేసినందున వేడికి అవి తట్టుకోలేకపోయాయి." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● అవి మాడి పోయినవి
"మొక్కలు ఎండిపోయి చనిపోయాయి"
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● ముండ్ల పొదలలో పడినవి
"ముండ్ల పొదలు మొలుచు చోట పడినవి."
● వాటిని అణచి వేసినవి
"కొత్త మొలకలను అణచి వేసినవి." మొక్కలు సరిగా పెరగకుండా కలుపు మొక్కలు అడ్డుకుంటున్నాయి అని చెప్పుటకు వాడే సాధారణ పదం వాడండి.
● విత్తనంలను ఫలించెను
"పంట పండెను" లేక "ఎక్కువ విత్తనాలు వచ్చెను" లేక "ఫలములను ఇచ్చెను."
● చెవులు గల వాడు, వినును గాక
కొన్ని భాషలలో మధ్యమ పురుష వాచకం వాడటం చాలా సాధారణముగా ఉంటుంది: "నీకు వినటానికి చెవులుంటే, విను." (చూడండి: ఉత్తమ, మధ్యమ లేక ప్రథమ పురుష వాచకములు).
● చెవులు గలవాడు
"ఎవరైనా వినగలిగినవారు" లేక "ఎవరైనా నా మాటలు వినగలవారు"
● అతడు వినును గాక
"అతడు మంచిగా వినును గాక" లేక "నేను చెప్పుచున్నదానికి అతడు సావధానత చూపును గాక"
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● వారితో
శిష్యులతో.
● పరలోక రాజ్యాన్నిగూర్చిన మర్మములు తెలిసికొను ఆధిక్యత మీకు మాత్రం ఇవ్వబడినది, కాని వారికి అది ఇవ్వబడలేదు
దీనిని దాగి ఉన్న భావాన్ని తెలియజేస్తూ సకర్మక క్రియా రూపములో ఈ విధంగా తర్జుమా చేయవచ్చును: "పరలోకమును గూర్చిన మర్మములను తెలుసుకొనే ఆధిక్యతను దేవుడు మీకు అనుగ్రహించాడు, కాని ఈ ప్రజలకు దేవుడు అనుగ్రహించలేదు" లేక "పరలోక రాజ్యాన్ని గూర్చిన మర్మములను గ్రహించే సామర్థ్యము గల వారిగా దేవుడు మిమ్మును చేసాడు, కాని ఈ ప్రజలకు ఆ శక్తిని ఇవ్వలేదు." (చూడండి: సకర్మక క్రియ కర్మార్థక క్రియ, స్పష్టమైన, అస్పష్టమైన వాచకములు).
● మీరు
శిష్యులు
● మర్మములను
దాచబడిన సత్యములను కాని యేసు వాటిని ఇప్పుడు బయలు పరుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మర్మములు" లేక "దాచబడిన సత్యములు" (యుడిబి చూడండి).
● ఎవరికున్నదో
"ఎవరికి గ్రహించే శక్తి ఉన్నదో" లేక "నేను చెప్పే మాటలను స్వీకరించే వారు"
● అతనికి ఎక్కువ ఇవ్వబడుతుంది
దీనిని సకర్మక క్రియ రూపములో వ్రాయవచ్చును: "దేవుడు వానికి ఎక్కువ గ్రహింపు శక్తిని ఇస్తాడు." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● అతనికి ఎక్కువ సమృద్ది కలుగును
"అతడు తేటగా అర్థం చేసుకుంటాడు"
● ఎవనికి లేదో
"ఎవరికి గ్రహించే శక్తిలేదో వానికి" లేక "నేను చెప్పే మాటలను స్వీకరించలేని వానికి"
● అతని యొద్దనుండి అతనికి కలిగినది కూడా తీసివేయబడుతుంది
దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చును: "అతనికి కలిగిని దానిని కూడా దేవుడు తీసివేస్తాడు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు.
● నేను వారితో మాట్లాడితిని
ఇక్కడ వాడిన "వారితో" అనే సర్వ నామము ఈ రెండువచనాలలోను అక్కడి జనసమూహములోని ప్రజలను సూచిస్తుంది.
● వారు చూచినను, నిజముగా చూడలేదు, వారు విన్నను నిజముగా వినలేదు కాబట్టి
అర్థం చేసుకోవటానికి ప్రజలు తృణీకరిస్తున్నారు అని శిష్యులతో చెప్పటానికి యేసు ఈ అనురూపతను వాడుతున్నాడు. (చూడండి: అనురూపత).
● వారు చూచినను నిజముగా వారు చూడలేదు
"వారు చూచినను వారు తెలుసుకోరు" క్రియా పదానికి కర్మ సహాయము కావలసి వస్తే, దానిని ఈ విధంగా తర్జుమ చేయాలి, "వారు సంగతులను చూసినను, వాటిని వారు గ్రహించలేదు" లేక "జరిగిన సంగతులను వారు చూసినను, వాటి అర్థమేమిటో వారు గ్రహించలేదు" (చూడండి: క్రియా పదాలు).
● వారు వినినప్పటికి, నిజముగా వినలేదు అర్థం కూడా చేసుకోలేదు
"వారు విన్నప్పటికి, వారు అర్థం చేసుకోలేదు" క్రియా పదానికి కర్మ సహాయము కావలసి వస్తే, దానిని ఈ విధంగా తర్జుమా చేయాలి, "ఉత్తరువులను వారు విన్నను, సత్యమును వారు గ్రహించలేదు"
● వినేటప్పుడు వింటారు కాని, ఏ మాత్రం అర్థం చేసుకోరు; చూసేటప్పుడు మీరు చూస్తారు కాని ఏ మాత్రం గ్రహింపరు
యెషయా కాలంలోనున్న అవిశ్వాసులైన ప్రజలను గూర్చి ప్రవక్తయైన యెషయా చెప్పిన లేఖనం ఇక్కడ ఉటంకించబడింది. ఈ దృష్టాంతమును తన మాటలు వింటున్న జనసమూహము ఎలాంటివారో తెలియజేయుటకు యేసు ఉపయోగిస్తున్నాడు. ఇది మరొక అనురూపత. (చూడండి: అనురూపత).
● వినేటప్పుడు వింటారు, కాని మీరు ఏవిధంగాను అర్థం చేసుకోరు
దీనిని ఈ విధంగా తర్జుమా చేయవచ్చు "మీరు వింటారు, కాని మీరు అర్థం చేసుకోరు." క్రియాపదానికి కర్మ సహాయము కావలసి వస్తే, దీనిని ఈ విధంగా తర్జుమా చేయాలి, "మీరు సంగతులను వింటారు, మీరు వాటిని గ్రహించరు "
● చూఛేటప్పుడు చూస్తారు, కాని మీరు ఏమాత్రం తెలుసుకోరు
"మీరు చూస్తారు, కాని మీరు తెలుసుకోరు." క్రియా పదానికి కర్మ సహాయము కావలసి వస్తే, దీనినిఈ విధంగా తర్జుమా చేయవచ్చు "సంగతులను మీరు చూస్తారు, కాని వాటిని మీరు తెలుసుకోరు."
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు. ఆయన యెషయా 13:14లోని మాటలను పునరుచ్చరించుచున్నాడు.
● ఈ ప్రజల హృదయం మందమైనది
"ఈ ప్రజలు ఇక ఎంతకాలం నేర్చుకొనరు" (యుడిబి చూడండి).
● వారి చెవులు వినుటకు బరువెక్కిపోయాయి
"వినటానికి వారు ఎంతమాత్రం ఇష్టపడటము లేదు" (యుడిబి చూడండి).
● వారి కన్నులు మూయబడియున్నవి
"వారు తమ కన్నులు మూసుకున్నారు" లేక "వారు చూడటానికి నిరాకరించుచున్నారు"
● వారు తమ కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మరలా తిరగకుండా
"కావున వారు మరలా తిరగకుండునట్లు తమ కన్నులతో చూడలేరు, తమ చెవులతో వినలేరు, తమ హృదయంతో గ్రహించలేరు.
● మరలా తిరుగుట
"వెనుకకు మళ్ళుట" "మారు మనస్సు పొందుట"
● నేను వారిని స్వస్థ పరచునట్లు
"నన్ను స్వస్థపరచనీయునట్లు." ప్రత్యామ్నాయ అనువాదం: "వారిని మరలా నేను స్వీకరించేలా." (చూడండి: రూపకాలంకారము).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు.
● మీ. మీరు
శిష్యులతో యేసు మాట్లాడుతున్నాడు.
● వారు చూసిరి
"వారు చూడగలరు" లేక "వారు చూడగల సమర్థులు."
● వారు వినుచున్నారు
"వారు వినగలరు" లేక "వారు వినగల సమర్థులు."
● మీరు చూచుచున్న సంగతులు
"నేను చేయటం మీరు చూసిన సంగతులు."
● మీరు వినుచున్న సంగతులు
"నేను చెప్పటము మీరు విన్న సంగతులు''
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు. ఇక్కడ 13:8లో ఆయన చెప్పిన ఉపమానమునే వివరిస్తున్నాడు.
● తన హృదయంలో విత్తబడిన దానిని దుష్టుడు వచ్చి లాక్కుపోతాడు
"తన హృదయంలో ఉన్న దేవుని వాక్యం మరచి పోయేలా సాతాను చేస్తాడు."
● లాక్కుపోవటం
సోత్తుదారుని చేతిలోనుండి ఏదైనా ఎవరైనా గుంజుకొని తీసుకు పోతున్నారు అని భావమిచ్చే మాటను వ్రాయటానికి ప్రయత్నించండి.
● తన హృదయంలో విత్తబడినది
దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చు: "దేవుని వాక్యం తన హృదయంలో విత్తబడింది." (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● తన హృదయంలో
వినుచున్నవాని హృదయం
● దారి ప్రక్కన విత్తబడినవాడు ఇతడే
అక్షరార్థం చేసిన తర్జుమా సరైన భావము నీయక పోతే, యేసు విత్తువాడు అని సందేశము విత్తనం అని, వినువాడు దారి ప్రక్కన ఉన్న పొలం అని చదువుచున్నవారు అర్థం చేసుకొనేలా తర్జుమా చేయండి. సాధ్యమైన తర్జుమా ఏమనగా: "దారి ప్రక్కన విత్తబడినదానికి ఇలా జరుగుతుంది." దీనిని 13:4 తర్జుమా చేసిన విధంగా నీవు తర్జుమా చేయాలి.
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు. ఇక్కడ ఆయన 13:8లో చెప్పిన ఉపమానమునే వివరిస్తున్నాడు.
● రాతి నేలను విత్తబడినవాడు ఎవరనగా
అక్షరార్థముగా చేసిన తర్జుమా సరైన అర్థంనీయకపోతే, చదువుచున్నవారు అర్థం చేసుకొనేలా యేసు విత్తువాడు అని, సందేశము విత్తనం అని, వినువాడు రాతినేల అని తర్జుమా చేయండి. సాధ్యమైన తర్జుమా ఏదనగా, "రాతి నేలను విత్తబడిన వాడు ఇలాగుండును. (చూడండి: ఉపమాలంకారము, అధ్యారోపము).
● అతనికి వేరు లేనందున
"అతనికి లోతులేని వేరులున్నవి" లేక "లేత మొక్క వేరులు తన్నటానికి అతను అనుమతివ్వలేదు" (చూడండి: అతిశయోక్తి, అన్యాపదేశము).
● వాక్యం బట్టి
"సందేశమును బట్టి."
● వెంటనే తొట్రుపడును
"వెంటనే అతను పడిపోవను" లేక "వెంటనే అతడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టును." (చూడండి: జాతీయం).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● ముండ్ల పొదలలో విత్తబడినవాడు. మంచి నేలను విత్తబడిన వాడు
అక్షరార్థముగా చేసిన తర్జుమా సరైన అర్థంనీయకపోతే, చదువుచున్నవారు అర్థం చేసుకొనేలా యేసు విత్తువాడు అని, సందేశము విత్తనం అని, వినువాడు ముండ్ల పొదలలో విత్తబడినవాడు అని తర్జుమా చేయండి. సాధ్యమైన తర్జుమా ఏదనగా: "ముండ్లపొదలలో విత్తబడిన విత్తనాలు ఇలా ఉంటాయి.. మంచి నేలను విత్తబడిన విత్తనాలు ఇలా ఉంటాయి." (చూడండి: ఉపమాలంకారము, అధ్యారోపము).
● వాక్యం
"సందేశము"
● ఇహలోకముపట్ల చింత ధన మోహము వాక్యాన్ని నులిమివేస్తాయి, , అతడు నిష్ఫలమైపోతాడు
దీనిని ఈ విధంగా తర్జుమా చేయవచ్చు, "కలుపు మొక్కలు మంచి మొక్కలను ఎదగకుండా చేసిన రీతిగా, ఇహలోకమును గూర్చిన చింత, ధనమోహము ఒక వ్యక్తి ఫలభరితుడవకుండా అడ్డుకుంటాయి" (చూడండి: రూపకాలంకారము).
● ఇహలోకమును గూర్చిన చింత
"ప్రజలు చింతించే ఈ లోక విషయాలు"
● నిష్ఫలమవ్వటం
"ఫలములేనివాడు అవుతాడు"
● నిజముగా ఫలించువాడు ఇలా ఉంటాడు
"వీరు విశ్వాసం కలిగి ఫలభరితులుగా ఉంటారు" లేక "మంచి ఫలములనిచ్చు మంచి మొక్కలవలె ఈ ప్రజలు కూడా ఫలభరితముగా ఉంటారు" (చూడండి: రూపకాలంకారము, ఉపమాలంకారము).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● యేసు మరొక ఉపమానమును వారికి తెలియజేసాడు
"యేసు మరియొక ఉపమానమును కూడివచ్చిన జన సమూహమునకు చెప్పాడు"
● పరలోక రాజ్యం ఒక మనుష్యుని వలె ఉన్నది
తర్జుమాచేసేటప్పుడు పరలోక రాజ్యం మనుష్యునితో సమానముగా ఉంటుందనే భావము రాకూడదు, కాని పరలోక రాజ్యం ఈ ఉపమానములో వివరించబడిన పరిస్థితులవలె ఉంటుందనే భావము కనపడాలి (యుడిబి చూడండి).
● మంచి విత్తనం
"మంచి ఆహారపు విత్తనాలు" లేక "మంచి ధాన్యపు విత్తనాలు." వినుచున్నవారు యేసు గోదుమ గింజలను గూర్చి మాట్లాడుతున్నాడు అనుకున్నారు. (చూడండి: స్పష్టమైన అస్పష్టమైన).
● అతని శతృవు వచ్చి
"అతని శతృవు పొలంనకు వచ్చి"
● కలుపు మొక్కలు
దీనిని "చెడ్డ విత్తనం" లేక "కలుపు మొక్కల విత్తనాలు" అని తర్జుమా చేయవచ్చును. ఈ కలుపు మొక్కలు చిన్నప్పుడు ఆహారపు మొక్కలవలెనే కనబడతాయి, కాని వాటి పంట విషపూరితము.
● ఆకులు పెరిగినప్పుడు
"గోదుమ గింజలు మొలకెత్తినప్పుడు" లేక "మొక్కలు పెరిగినప్పుడు"
● వాటి పంట చేతికొచ్చినప్పుడు
"ధాన్యము పండినప్పుడు" లేక "గోదుమలు పండినప్పుడు"
● కలుపు మొక్కలు కూడా కనిపించినాయి
ప్రత్యామ్నాయ అనువాదం: "అప్పుడు ప్రజలు పొలంలో కలుపు మొక్కలు కూడా కనబడటం చూసారు"
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు. ఈ వచనాలలో కలుపుమొక్కలను గూర్చిన ఉపమానము కొనసాగుతుంది.
● పొలం యజమాని
పొలంలో మంచి విత్తనంలను విత్తిన వ్యక్తే ఇతను.
● నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తలేదా?
"నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తినావు." పొలం యజమాని బహుశా తన సేవకుల చేత పొలంలో విత్తనాలు వేయించి ఉంటాడు (యుడిబి చూడండి). (చూడండి: అలంకార సంబంధిత ప్రశ్న), ప్రత్యామ్నాయ అనువాదంe: అన్యాపదేశము /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion
● అతను వారితో ఇలా చెప్పెను
"పొలం యజమాని సేవకులతో ఇలా చెప్పెను"
● మేము. నీకిష్టమా
"మేము" అనే పదం సేవకులను సూచిస్తుంది."
● వాటిని పోగుచేయుట
"కలుపు మొక్కలను పెరికి వేసి" పారవేయుట (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు. ఈ వచనాలు కలుపు మొక్కల ఉపమానమును పూర్తి చేస్తాయి.
● పొలం యజమాని చెప్పెను
"పొలం యజమాని సేవకులతో ఇలా చెప్పెను"
● పంట కోయువారికి నేను ఇలా చెప్తాను, "మొదట కలుపు మొక్కలను పెరికి వేసి కట్ట కట్టి కాల్చి వేయండి, కాని గోదుమలను నా కొట్టులోనికి చేర్చి పెట్టండి"
దీనిని నీవు పరోక్ష ఉల్లేఖనముగా ఇలా వ్రాయవచ్చు: "మొదట కలుపు మొక్కలను పోగు చేసి కట్టలు కట్టి కాల్చి వేయండి, తరువాత గోదుమలను నా కొట్లలోనికి చేర్చండి అని పంట కోయువారితో నేను చెప్తాను" (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
● నా కొట్టు
"ధాన్యాగారము" లేక "ధాన్యమును నిలవ వుంచుటకు వాడే భవనము"
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడి వచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● యేసు వారికి మరొక ఉపమానము తెలియ చేసాడు
"జన సమూహమునకు యేసు మరొక ఉపమానమును తెలియజేసాడు"
● పరలోక రాజ్యం. పోలియున్నది
13:24లో దీనిని ఎలా తర్జుమా చేసావో చూడు.
● ఆవగింజ
చాలా చిన్న గింజ కాని పెద్ద చెట్టుగా ఎదుగుతుంది (చూడండి: తెలియని వాటి తర్జుమా).
● ఈ గింజ నిజానికి మిగిలిన అన్నిగింజలకంటే చిన్నది
ఆవగింజలు చాలా చిన్నవని నాడు వింటున్న శ్రోతలకు తెలుసు. (చూడండి: స్పష్టమైన , అస్పష్టమైన).
● కాని అది పెరిగినప్పుడు
"కాని మొక్క పెరిగినప్పుడు."
● ఒక వృక్షమైంది
"పెద్ద పొదగా మారింది" (చూడండి: అతిశయోక్తి, ఉపమాలంకారము, తెలియని వాటి తర్జుమా).
● ఆకాశ పక్షులు
"పక్షులు" (చూడండి: జాతీయం).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను యేసు కూడివచ్చిన జనసమూహానికి చెబుతున్నాడు.
● అప్పుడు యేసు వారితో మరొక ఉపమానము చెప్పెను
"యేసు జనసమూహమునకు మరొక ఉపమానము చెప్పెను"
● పరలోక రాజ్యం. పోలియున్నది
13:24లో దీనిని ఎలా తర్జుమా చేసావో చూడు. పరలోక రాజ్యం పులిసినపిండి కాదు గాని, పరలోక రాజ్యం వ్యాప్తి చెందుటయనేది పులిసిన పిండిలా ఉంటుంది. (చూడండి: ఉపమాలంకారము).
● మూడు పరిమాణముల పిండి
"పెద్ద మొత్తములో పిండి" లేక మీ సంస్కృతిలో పిండిని కొలిచే పెద్ద కొలత ఏమిటో ఆ పదజాలమును వాడండి (యుడిబి చూడండి).
● అది పొంగే వరకు
పిండి ముద్ద పొంగే వరకు. భావ గర్భితమైన అర్థమేమనగా పులుపు , మూడు పరిమాణముల పిండి కలిసి రొట్టె కాల్చుటకు కావలసిన విధంగా పిండి పొంగటానికి కారణమయ్యాయి. (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేసే రకరకాల ఉపమానాలను కూడివచ్చిన జనసమూహానికి యేసు చెబుతున్నాడు.
● ఈ సంగతులన్నియు యేసు ఉపమానరీతిగా ప్రజలకు చెప్పెను; ఉపమానము లేకుండా వారికి ఏమియు చెప్పలేదు
"ఉపమానరీతిగా. చెప్పెను.. ఉపమానము .. చెప్పలేదు" అను ఈ క్రమము ఆయన వారితో ఉపమాన రీతిగా మాట్లాడెను అను మాటలను ఉద్ఘాటిస్తుంది.
● ఈ సంగతులన్నియు
ఇది 13:1 ప్రారంభములో యేసు చెప్పినదానిని సూచిస్తుంది.
● ఉపమానము లేకుండ ఆయన వారికి ఏమియు చెప్పలేదు
"ఉపమానముల ద్వారా తప్ప ఆయన వారికి ఏమియు చెప్పలేదు." ప్రత్యామ్నాయ అనువాదం: "వారికి చెప్పిన ప్రతిదానిని ఆయన ఉపమానములలో చెప్పెను" (చూడండి: అతిశయోక్తి , ఆక్షేపాలంకారము).
● ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు, అతను చెప్పిన దేమనగా
దీనిని సకర్మక క్రియారూపములో వ్రాయవచ్చు: "చాలా కాలం క్రితం వ్రాయమని ప్రవక్తలలో ఒకరిని దేవుడు చెప్పినది ఆయన నెరవేర్చెను" (యు డి బి). (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● ఆయన చెప్పినప్పుడు
"ప్రవక్త చెప్పినప్పుడు"
● మరుగైన విషయములు
దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చును: "దేవుడు మరుగుగా వుంచిన విషయములు" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● లోకము పుట్టినది మొదలుకొని
"లోకము ప్రారంభమైనది మొదలుకొని" లేక "దేవుడు లోకమును చేసినది మొదలుకొని"
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లెను.
● ఇంటిలోనికి వెళ్లెను
"ఇంటిలోపలికి వెళ్లెను" లేక "ఆయన నివసిస్తున్న ఇంటికి వెళ్లెను"
● విత్తుచున్నవాడు
"విత్తువాడు"
● మనుష్యకుమారుడు
యేసు తనను గురించి తాను చెప్పుకొనుచున్నాడు.
● రాజ్యపు కుమారులు
"రాజ్యంనకు చెందిన ప్రజలు"
● దుష్టుని కుమారులు
"దుష్టునికి చెందిన కుమారులు"
● వాటిని విత్తిన శత్రువు
కలుపు మొక్కలను విత్తిన శతృవు.
● లోకము అంతమున
"యుగము అంతమున"
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు.
● కాబట్టి, కలుపు మొక్కలు పోగు చేయబడి అగ్నితో కాల్చబడిన రీతిగా
దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చును: "కాబట్టి, ప్రజలు కలుపు మొక్కలను పోగు చేసి వాటిని అగ్నితో కాల్చిన రీతిగా" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● లోకము అంతమున
"యుగము అంతమున"
● మనుష్యకుమారుడు తన దూతలను పంపును
యేసు ఇక్కడ తనగురించి తాను చెప్పుకొనుచున్నాడు. దీనిని ఈ విధంగా తర్జుమా చేయవచ్చును, "మనుష్యకుమారుడనైన నేను నా దూతలను పంపుతాను"
● అక్రమము జరిగించిన వారు
"అన్యాయము చేసిన వారు" లేక "చెడ్డ ప్రజలు"
● మండుచున్న అగ్ని గుండము
"వేడిమిగల మండుచున్న అగ్ని గుండము." అగ్ని గుండము అంటే తెలియక పోతే, "ఆవం" లేక "కొలిమి" అని వాడవచ్చు
● సూర్యుని వలె ప్రకాశించెదరు
"సూర్యుని చూచినంత తేలికగా" (చూడండి: ఉపమాలంకారము).
● చెవులు గలవాడు వినును గాక
కొన్ని భాషలలో మధ్యమ పురుష వాడటం చాలా సాధారణముగా ఉంటుంది: "చెవులు కలిగిన నీవు, విను" లేక "నీకు చెవులున్నవి, కావున విను" (చూడండి: ఉత్తమ పురుష, మధ్యమ పురుష లేక ప్రథమ పురుష).
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు. ఈ రెండు ఉపమానములలో పరలోక రాజ్యం అంటే ఏమిటో శిష్యులకు బోధించుటకు యేసు రెండు ఉపమాలంకారములను ఉపయోగిస్తున్నాడు. (చూడండి: ఉపమాలంకారము).
● పరలోక రాజ్యం. పోలియున్నది
13:24లో దీనిని ఎలా తర్జుమా చేసావో చూడు (చూడండి: ఉపమాలంకారము).
● పొలంలో దాచబడిన ధనము
ధననిధి చాలా విలువైనది, ప్రశస్తమైనది లేక అనేక వస్తువుల సముదాయము. దీనిని సకర్మక క్రియా రూపములో వ్రాయవచ్చు: "పొలంలో ఒకరు దాచుకొనిన ధననిధి" (చూడండి: సకర్మక క్రియ లేక కర్మార్థక క్రియ).
● దానిని దాచిపెట్టి
"దానిని కప్పివేసెను"
● తనకు కలిగిన సమస్తమును అమ్మివేసి, ఆ పొలాన్ని కొనెను
భావగర్భితమైన అర్థమేమనగా ఆ వ్యక్తి అందులో దాచబడిన ధనమును తీసుకొనుటకు ఆ పొలాన్ని కొనెను. (చూడండి: స్పష్టమైన, అస్పష్టమైన).
● ఒక వర్తకుడు
వర్తకుడు అనగా వ్యాపారి లేక టోకు వర్తకుడు, తరచుగా దూర ప్రాంతంల నుండి సరుకును తెచ్చుకొనేవాడు.
● విలువైన ముత్యాలను కొరకు వెదకుచున్న
దాగియున్న భావమేమనగా ఆ మనిషి విలువైన ముత్యాలను కొనటము కోసము వెదకుచున్నాడు. (చూడండి: స్పష్టమైన , అస్పష్టమైన).
● విలువైన ముత్యాలు
దీనిని "మంచి ముత్యాలు" లేక "అందమైన ముత్యాలు" అని తర్జుమా చేయవచ్చును. "ముత్యము" నున్నగాను, గట్టిగాను, మెరుస్తూ, తెల్లని పూసగా లేక లేత రంగు పూసగా సముద్రములోపలి ఆల్చిప్పలలో సహజ సిద్దంగా రూపించబడుతుంది రత్నమంత విలువైనది లేక విలువైన నగల హారము చేయటానికి ఉపయోగపడుతుంది.
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు. ఈ ఉపమానములోను, పరలోక రాజ్యం అంటే ఏమిటో తన శిష్యులకు తెలియజేయుటకు యేసు మరలా ఉపమాలంకారమును వాడుతున్నాడు. (చూడండి: ఉపమాలంకారము).
● పరలోక రాజ్యం. పోలియున్నది
13:24లో దీనిని ఎలా తర్జుమా చేసావో చూడు (చూడండి: ఉపమాలంకారము).
● సముద్రములో వేయబడిన వలను పోలియున్నది
దీనిని సకర్మక క్రియా రూపములో తర్జుమా చేయవచ్చును: "సముద్రములో ఒక జాలరి విసిరిన వలను పోలియున్నది"
● సముద్రములో విసిరిన వల
"సరస్సులోనికి వేసిన ఒక వల"
● అన్నిజాతుల జీవులను పోగు చేసిన
"అన్ని రకాల చేపలను పట్టిన"
● తీరమునకు తీసుకొనిరాగా
"తీరమునొద్దకు వలను లాక్కొని వచ్చిరి" లేక "తీరమునకు వలను లాగిరి"
● మంచి వాటిని
మంచి చేపలను
● పనికిమాలినవాటిని
"చెడ్డ చేపలను" లేక "తినటానికి పనికిరాని చేపలను"
● పారవేసెను
"భధ్రము చేయలేదు."
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు.
● లోక అంతమున
"యుగ సమాప్తినందు."
● బయటకు వచ్చి
"బయటకు వచ్చి" లేక "బయటకు వెళ్ళి" లేక "పరలోకమునుండి వచ్చి."
● వారిని పడవేయును
"చెడ్డవారిని పడవేయును."
● మండుచున్న అగ్ని గుండము
దీనిని "వేడిమిగల మండుచున్న అగ్ని గుండము" గా తర్జుమా చేయవచ్చును. పాత నిబంధన వాక్యభాగము దానియేలు 3:6లో ఉపయోగించిన పదాలను దృష్టాంతములుగా తీసుకొని పాతాళములోని అగ్నికి రూపకాలంకారముగా వాడిన మాటలు ఇవి (చూడండి: రూపకాలంకారము). అగ్ని గుండము అంటే తెలియక పోతే, "ఆవం" లేక "కొలిమి" అని వాడవచ్చు.
● అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును
"అక్కడ చెడ్డ ప్రజలు ఏడ్చుచు, తమ పండ్లు కొరుక్కొనుచూ ఉంటారు."
పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానములను వివరించుటకు యేసు తన శిష్యులతో కూడా ఒక ఇంటిలోనికి వెళ్లి వివరణ చెప్పుటను కొనసాగిస్తున్నాడు.
● "ఈ విషయములన్నిటిని మీరు గ్రహించితిరా?" "శిష్యులు ఆయనతో "గ్రహించితిమి" అనిరి
అవసరమైతే దీనిని పరోక్ష ఉల్లేఖనము వ్రాయవచ్చు, "ఇదంతయు వారు అర్థం చేసుకున్నారా అని యేసు వారిని అడిగాడు, వారు అర్థం చేసుకున్నాము అని చెప్పారు. (చూడండి: సంవాద ఉల్లేఖనములు).
● శిష్యునిగా మారిన
"సంగతి నేర్చుకున్నాడు."
● ధన నిధి
ధననిధి చాలా విలువైనది, ప్రశస్తమైనది లేక అనేక వస్తువుల సముదాయము. ప్రశస్తమైన వస్తువులు పెట్టుకునే స్థలముగా, "ధనాగారము" లేక "నిల్వ వుంచు గది" సూచిస్తుంది.
ఇది యేసు సొంత ఊరిలోని సమాజ మందిరములో మాట్లాడుచుండగా అక్కడి ప్రజలు ఆయనను ఏ విధంగా తృణీకరించారో తెలియజేసే వృత్తాంతం.
● తన సొంత ప్రాంతం
"తన సొంత ఊరు" (యుడిబి చూడండి).
● వారి సమాజ మందిరములో
"వారి" అనే సర్వనామము ఆ ప్రాంత ప్రజలను సూచిస్తుంది.
● వారు విస్మయమొందిరి
"వారు ఆశ్చర్యపడిరి."
● ఈ అద్భుతములు
"ఈ అద్భుతములను చేయుటకు ఆయన ఎక్కడినుంచి శక్తిని పొందుకున్నాడు." (చూడండి: అధ్యారోపము).
● వడ్లవాని కుమారుడు
వడ్లవాడు అనగా కర్రతోగాని రాయితో గాని వస్తువులను చేయువాడు. మీకు వడ్లవాడు అంటే తెలియకపోతే "వడ్రంగి" అని వ్రాయండి.
ఇది యేసు సొంత ఊరిలోని సమాజ మందిరములో మాట్లాడుచుండగా అక్కడి ప్రజలు ఆయనను తృణీకరించిన విధానంను తెలియజేసే వృత్తాంతం ఇక్కడ కొనసాగుతుంది.
● ఆయన వలన వారు నొప్పించబడిరి
"యేసు సొంత ఊరు ప్రజలు ఆయన మీద కోపం తెచ్చుకొనిరి" లేక "వారాయనను అంగీకరించలేదు."
● ప్రవక్త గౌరవము లేకుండా లేడు
"ప్రవక్త ప్రతిచోట గౌరవించబడతాడు" లేక "ప్రవక్త ప్రతిచోట గౌరవమును పొందుకుంటాడు" లేక "ప్రజలు ప్రవక్తను ప్రతిచోటా గౌరవిస్తారు"
● తన సొంత గ్రామంలో
"తన సొంత ప్రాంతంలో" లేక "తన సొంత ఊరిలో."
● తన సొంత కుటుంబము
"తన సొంత ఇంటివారు"
● అక్కడ ఎక్కువ అద్భుతములను ఆయన చేయలేకపోయెను.
యేసు తన సొంత ఊరులో ఎక్కువ అద్భుతములను చేయలేకపోయెను."