Matthew 11

Matthew 11:1

బాప్తిసమిచ్చు యోహాను శిచ్యులకు యేసు ఏమి సమాధానం ఇచ్చాడో ఆ వివరాలు ఇక్కడ మొదలవుతాయి.

● చాలించిన తరువాత

ఇక్కడ మరో కొత్త సంఘటన మొదలవుతుందని చెప్పడానికి ఈ పదాన్ని వాడారు. మీ భాషలో కొత్త సంఘటన మొదలైందని చెప్పడానికి ఏదైనా పద్ధతి ఉంటే దాన్ని ఇక్కడ ఉపయోగించండి. దీన్ని "అప్పుడు' లేక ఆ తరువాత" అని అనువదించవచ్చు.

● ఆజ్ఞాపించుట

దీన్ని "బోధించడం" లేక "ఆదేశించడం" అని అనువదించవచ్చు.

● తన పన్నెండుమంది శిష్యులకు

వీరు అపొస్తలుల గా యేసుచే ఎన్నుకోబడినవారు.

● అంతట

"ఆ సమయంలో.” దీన్ని రాయకుండా వదిలి పెట్టవచ్చు (యుడిబి చూడండి).

●యోహాను చెరసాలలో విని

దీన్ని మరో విధంగా: "జైలులో ఉన్న యోహాను విన్నప్పుడు", లేక "జైలులో ఉన్న యోహానుకు ఎవరో చెప్పినప్పుడు"

● ఆయన్ని అడుగుటకు తన శిష్యులనంపెను

బాప్తిసమిచ్చు యోహాను తన శిష్యుల ద్వారా యేసుకు సందేశాన్ని పంపుతున్నాడు.

● ఆయన్ను అడుగుటకు

ఇక్కడ "ఆయన్ను" అనే సర్వనామం యేసును సూచిస్తుంది.

● రాబోవు వాడవు నీవేనా

దీన్ని "వచ్చేవాడు" లేక "వస్తాడని మేము ఎదురుచూస్తున్నవాడు," అని ఎలా రాసినా ఇది "మెస్సియా"ను గూర్చి చెప్పిన అతిశయ వాక్యం ("క్రీస్తు,"యు డి బి).

● మరియొకని కొరకు కనిపెట్టవలెనా

"మేము ఎదురు చూస్తున్నవాడు.” ఇక్కడ "మేము' అనే సర్వనామం యోహాను శిష్యులే కాకుండా యూదులనందరినీ ఉద్దేశించినది.

Matthew 11:4

బాప్తిసమిచ్చు యోహాను శిష్యులకు యేసు ఇచ్చిన సమాధానం ఇక్కడ ముగుస్తుంది.

● యోహానుకు తెలుపుడి

"యోహానుకు చెప్పండి"

Matthew 11:7

యేసు బాప్తిసమిచ్చు యోహాను గూర్చి తన చుట్టూ ఉన్న జనంతో మాట్లాడుతున్నాడు.

● మీరు ఏమి చూచుటకు. వెళితిరి?

యేసు ఈ పదాలను మూడు అలంకారిక ప్రశ్నలలో ఉపయోగిస్తూ బాప్తిసమిచ్చు యోహాను ఎలాటి వ్యక్తో ఆలోచించమని ప్రజలకు చెబుతున్నాడు. దీన్ని ఇలా అనువదించవచ్చు: "మీరు చూడటానికి బయటకు వెళ్ళారా?. వెళ్లి ఉండకపోవచ్చు!" లేక "మీరు తప్పకుండ చూడటానికి బయటకు వెళ్లి వుండరు!” (అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● గాలికి కదలుచున్న రెల్లునా

దీన్ని 1). యోర్దాను నదీప్రాంతంలో పెరుగుతున్న మొక్కలను గూర్చి అయి ఉండొచ్చు (యుడిబి చూడండి). లేక 2) ఒక రకమైన వ్యక్తిని గూర్చి చెప్పే రూపకం అయి ఉండొచ్చు : "గాలికి కదిలి పోయే వ్యక్తి .” (ఉపమ చూడండి). ఈ వుపమానానీకి రెండు అర్ధాలు ఉండొచ్చు : అటువంటి వ్యక్తి 1).గాలికి త్వరగా కదిలిపోయేవాడు, బుద్ధిని త్వరగా మార్చుకునేవాడికి ఇది రూపకాలంకారం, లేక 2).గాలి కొట్టినప్పుడు చప్పుడు చేయడం, పనికిరాని మాటలు ఎక్కువ మాట్లాడడానికి ఇది ఒక రూపకం. (రూపకాలంకారం చూడండి).

● రెల్లు

ఎత్తుగా పెరిగే గడ్డి మొక్క.

● సన్నపు నార బట్టలు ధరించుకున్న

'బాగా ఖరీదైన బట్టలు వేసుకున్న.” బాగా డబ్బున్న వాళ్ళు ఇటువంటి బట్టలు వేసుకుంటారు.

● అవును గాని

ఈ పదాన్ని సాధారణంగా “ఇదిగో" అని అనువదిస్తారు. ముందు జరగబోయే సంఘటనలకు ముఖ్యమైనవని చెప్పడానికి వాడుతారు. దీన్ని "నిజానికి" అని అనువదించవచ్చు.

Matthew 11:9

యేసు బాప్తిసమిచ్చు యోహాను గూర్చి తన చుట్టూ ఉన్న జనంతో ఇంకా మాట్లాడుతున్నాడు.

● మరి ఏమి చూడ వెళ్లితిరి

బాప్తిసమిచ్చు యోహాను గూర్చి వేస్తున్న అలంకారిక ప్రశ్నలలో ఇది ఒకటి. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవును గాని . మీతో చెప్పుచున్నాను

ఇక్కడ "మీరు" అనే సర్వనామం చూట్టు ఉన్న ప్రజలను ఉద్దేశించింది.

● ప్రవక్త కంటే గొప్పవానినని

"మామూలు ప్రవక్త కాదు" లేక "మామూలు ప్రవక్త కంటే చాలా ముఖ్యమైన ప్రవక్త."

●ఇతడే

ఇక్కడ "ఇతడు" అంటే బాప్తిసమిచ్చు యోహాను అని.

● ఎవనిని గూర్చి రాయబడెనో

ఇక్కడ "ఎవరిని" అంటే తర్వాత వాక్యంలోని "దూత"ను ఉద్దేశించింది.

●ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును

మలాకీ గ్రంథంలోని వచనాలను యేసు ఇక్కడ ప్రస్తావిస్తూ, మలాకీ 3:1 లో పేర్కొన్న దూత యోహానని చెబుతున్నాడు.

● నేను నా దూతను పంపుచున్నాను

"నేను" "నా" అనే సర్వనామాలు దేవుడిని ఉద్దేశించినవి. ఈ పాతనిబంధన గ్రంథకర్త దేవుడు తెలిపిన దానిని ప్రవచనంగా రాశాడు.

● నీ ముందర

"నీకు ముందుగా" లేక "నీకు ముందుగా వెళ్ళు." ఇక్కడ "నీ" అనే సర్వనామం ఏకవచనం. ఎందుకంటే ఈ వాక్యంలో దేవుడు మెస్సియతో మాట్లాడుతున్నాడు. (నీ అనే వాక్య రూపాలు చూడండి).

Matthew 11:11

యేసు బాప్తిసమిచ్చు యోహాను గూర్చి తన చుట్టూ ఉన్న జనంతో ఇంకా మాట్లాడుతున్నాడు.

● స్త్రీలు కనిన వారిలో

"ఆడవారు జన్మనిచ్చిన వారిలో" లేక " ఇంతవరకు జీవించిన వారిలో” (యుడిబి చూడండి).

● బాప్తిసమిచ్చు యోహానుకంటే గొప్పవాడు

"బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు"

● పరలోక రాజ్యంలో

దేవుడు ఏర్పాటు చేయబోయే రాజ్యంలో. "దేవుని రాజ్యంలో ప్రవేశించేవారిలో."

● అతనికంటే గొప్పవాడు

"యోహాను కంటే చాలా ముఖ్యమైన వాడు"

● బాప్తిసమిచ్చు యోహాను దినంలు మొదలుకొని ఇప్పటి వరకు

"యోహాను సందేశాన్ని చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి"

● పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు

దీనర్ధాలు 1). హింసాత్మకులు దానిలో హింసాత్మక పనులు చేస్తారు(యుడిబి చూడండి). లేక 2)."పరలోక రాజ్యంలోని వారిని ప్రజలు హింసిస్తారు, క్రూరమైన వాళ్ళు దాన్ని స్వాధీన పరచుకోవాలని చూస్తారు" లేక 3). పరలోక రాజ్యం బలంగా విస్తరిస్తుంది, బలవంతులు దాంట్లో పాలు పంచుకోవాలని చూస్తారు."

Matthew 11:13

బాప్తిసమిచ్చు యోహాను గూర్చి యేసు జనసమూహంతో మాట్లాడటం కొనసాగుతుంది.

● ధర్మశాస్త్రం

"మోషే ధర్మశాస్త్రం."

● యోహాను

"బాప్తిసమిచ్చు యోహాను."

● మీకు

ఈ సర్వనామం చుట్టూ ఉన్న జనాలను ఉద్దేశించింది.

● ఏలీయా ఇతడే

"ఇతడే" అంటే బాప్తిసమిచ్చు యోహాను. పాత నిబంధనలో ఏలీయా చెప్పిన ప్రవచనంలోని వ్యక్తి బాప్తిసమిచ్చె యోహానని చెప్పే పర్యాయపదం ఇది. అయితే బాప్తిసమిచ్చే యోహానే ఏలీయా అని చెప్పడం లేదు. (పర్యాయ పదాలు చూడండి).

● చెవులు గలవాడు విను గాక

కొన్ని భాషాల్లో ఇతరులను సంబోధిస్తూ "మీకు వినే శక్తి వుంటే (చెవులు ఉంటే) వినండి అని అంటారు." "మీలో ఎవరికీ చెవులు ఉన్నాయో వాళ్ళు వినండి.” (ఉత్తమ, మధ్యమ, ప్రధమ పురుషలు చూడండి).

● చెవులు గల వాడు వినును గాక

"ఎవరికి చెవులు ఉంటాయో వారు" లేక "నా మాటలు ఎవరు వింటారో."

● వినును గాక

"అతడిని బాగా విననియ్యండి" లేక "నేను చెప్పే మాటలను శ్రద్ధగా విననియ్యండి."

Matthew 11:16

బాప్తిసమిచ్చు యోహాను గూర్చి యేసు జనసమూహంతో మాట్లాడటం కొనసాగుతుంది.

● దేనితో పోల్చుదును

అలంకారిక ప్రశ్న వేయడం ఇక్కడ మొదలవుతుంది. యేసు దీని ఉపయోగిస్తూ అక్కడి ప్రజలను , సంతలో మాట్లాడుకునే పిల్లలతో పోలుస్తున్నాడు. దీన్ని ఆయన అలంకారిక ప్రశ్నతో మొదలుపెడుతున్నాడు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● సంత వీధులలో కూర్చుని యుండి. పిలుపులాట లాడుకోను పిల్లకాయలను పోలియున్నారు

ఈ ఉపమానానికి అర్ధం 1). యేసు "పిల్లనగ్రోవి ఊదాడు" యోహాను "ప్రలాపించాడు", "ఈ తరము వారు" నాట్యం చేయడానికి, సంతాప పడడానికి (ఈ పదాలు విధేయతకు సూచన). ఒప్పుకోలేదు. లేక 2) మోషే ధర్మ శాస్త్రానికి తాము చేర్చిన చట్టాలను పాటించడం లేదని ప్రజలను పరిసయ్యులు ఇతర మత నాయకులు విమర్శిస్తున్నారు. (రూపకాలంకారం చూడండి).

● ఈ తరం

"ప్రస్తుత కాలంలో జీవిస్తున్న వారు" లేక "ఈ ప్రజలు" లేక "ఈ తరంలో జీవిస్తున్న ప్రజలారా.” (యుడిబి చూడండి).

● సంత వీధులలో

ప్రజలు తమ వస్తువులను అమ్మడానికి తీసుకువచ్చే బహిరంగ విశాలప్రదేశం.

● మీకు పిల్లనగ్రోవి వూదితిమి

ఇక్కడ వూదిన వారు అక్కడ సంతలో ఉన్న పిల్లలు “మీకు” అంటే "ఈ తరము వారు" లేక వారి సంగీతాన్ని విని కూడా స్పందించని ప్రజలు.

● పిల్లనగ్రోవి

ఇది చెక్కతో బోలుగా చేసిన పొడవైన కర్రలాంటి వాయిద్యం, దీనిపైన లేక ఒక చివరి నుండి గాలిని ఊదడం ద్వారా మోగిస్తారు.

● మీరు నాట్యమాడరైతిరి

"మీరు సంగీతానికి నాట్యం చేయలేదు"

● మీరు రొమ్ముకొట్టుకొనరైతిరి

"మీరు మాతో పాటు సంతాప పడలేదు"

Matthew 11:18

బాప్తిసమిచ్చు యోహాను గూర్చి యేసు జనసమూహంతో మాట్లాడటం ముగుస్తుంది.

● తినకయు

"ఏమీ ఆహరం తీసుకొనకుండా. " దీని మరో విధంగా "తరచూ ఉపవాసం ఉంటూ" లేక "మంచి ఆహారం తీసుకోకుండా" అని రాయొచ్చు(యుడిబి). యోహాను అసలు ఏమీ తినలేదని అర్ధం కాదు.

● వీడు దయ్యం పట్టినవాడని వారనుచున్నారు

యోహాను గూర్చి ప్రజలు ఏమంటున్నారో దాన్ని ఇక్కడ యేసు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దీన్ని పరోక్ష ప్రస్తావనగా :"అతడికి దయ్యం పట్టిందని వాళ్ళు అంటున్నారు" లేక "అతడికి దయ్యం ఆవహించిందని ఆరోపిస్తున్నారు." అని రాయొచ్చు. (ఉల్లేఖనాలు చూడండి).

● వారు

ఇక్కడ "వారు" అనే సర్వనామం ఆ కాలంలోని ప్రజలను గూర్చిన సంబోధన. (16వ వచనం).

● మనుష్య కుమారుడు

యేసు తానే "మనుష్య కుమారుడని" అక్కడున్న వారు గ్రహించాలని కోరుకుంటున్నాడు కాబట్టి దీన్ని "మనుష్య కుమారుడైన నేను" అని రాయొచ్చు.

● వీడి తిండిపోతును

"ఆత్రంగా తినే వాడు" లేక "అతడు మామూలుగా ఎక్కువ తింటాడు"

● మద్యపాని

"త్రాగుబోతు" లేక "త్రాగుడుకు బానిస"

● జ్ఞానమని వాని క్రియలనుబట్టి తీర్పుపొందునని

ఇది బహుశా ఒక సామెత కావొచ్చు. దీన్ని ఈ పరిష్టితిని వర్ణించడానికి యేసు ఉపయోగించాడు, ఎందుకంటే తనను, యోహానును తిరస్కరిస్తున్న ప్రజలు బుద్ధిగలిగిన వారు కాదు. యుడిబి లో లాగ దీని కర్త ప్రధాన వాక్యాలుగా అనువదించవచ్చు. (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).

● జ్ఞానమని తీర్పు పొందును

ఇక్కడ మానవీకరణ గా వాడిన జ్ఞానం అనే పదానికి అర్ధం దేవుడు ఎదుట ప్రదర్శించే జ్ఞానమని కాదు, నిజమని నిరూపించబడిన జ్ఞానం. (మానవీకరణ చూడండ్).

● దాని క్రియలను

ఇక్కడ "దాని" అనే సర్వనామం జ్ఞానానికి మానవీకరణ గా వాడినది.

Matthew 11:20

యేసు తాను అధ్భుత కార్యాలు చేసిన పట్టణాలలో ప్రజలను విమర్శించే సంఘటన వివరాలు మొదలవుతాయి.

● పట్టణములను గద్దింపసాగెను

యేసు ఇక్కడ అన్యాపదేశాన్ని ఉపయోగించి ఈ పట్టణముల వారు తప్పు చేస్తున్నారని చీవాట్లు పెడుతున్నారు. (అన్యాపదేశం చూడండి).

● పట్టణములు

ఆ టౌన్లు

● ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో

దీన్ని కర్తరీ ప్రయోగాన్ని ఉపయోగించి "ఆయన అద్భుతాలు చేసిన పట్టణాలు” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).

● అద్భుతములు

దీన్ని "గొప్పకార్యాలు" లేక "శక్తిగల కార్యాలు" లేక "ఆశ్చర్య కార్యాలు" అని రాయొచ్చు. (యుడిబి).

● వారు మారుమనస్సు పొందకపోవుట వలన

"వారు" అనే సర్వనామం ఇతర పట్టణాల్లో పశ్చాత్తాప పడని వారిని ఉద్దేశించింది.

● అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా,

ఇక్కడ కొరాజీనా, బేత్సయిదా నగరాల ప్రజలు తన మాటాలు వింటున్నట్టు చెబుతున్నాడు కానీ వారు అక్కడ లేరు. (సంగ్రహంగా రాయడం చూడండి).

● కొరాజీనా. బెత్సయిదా . తూరు . సీదోను

ఈ పట్టణాల్లోని ప్రజలను గూర్చి చెప్పడానికి ఈ పట్టణాల పేర్లను అన్యాపదేశంగా వాడుతున్నారు. (అన్యాపదేశం చూడండి).

● మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల

దీని కర్తరీ వాక్యంలో ఇలా అనువదించవచ్చు: "నేను మీకు చేసిన అద్భుత కార్యాలను తూరు సీదోను పట్టణాల్లో చేసి యుండిన ఎడల (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).

● అయ్యో. మీ మధ్యను చేయబడిన అద్భుతములు = ఇక్కడ "మీ" అనే సర్వనామం ఏకవచనం.

● వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని యుందురు

"వారు" అనే సర్వనామం ఇక్కడ తూరు సీదోను ప్రజలనుద్దేశించినది.

● మారుమనస్సు

"వారు వారి పాపాల కొరకుపశ్చాత్తాప పడి ఉండేవారు:

● విమర్శ దినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టాణముల వారి గతి ఓర్వతగినదై యుండునని

"తీర్పు దినమందు దేవుడు మీ పట్ల కంటే కూడా తూరు సీదోను వారికి ఎక్కువ కనికరం చూపుతాడు " లేక "తీర్పు దినమందు దేవుడు తూరు సీదోను ప్రజలకంటే మిమ్మల్ని ఎక్కువ శిక్షిస్తాడు” (యుడిబి). ఇందులో దాగి ఉన్న అసలు అర్ధం ఏమిటంటే "మీరు నేను అద్భుతాలు చేయడం చూసి కూడా నన్ను నమ్మలేదు మారుమనస్సు పొందలేదు.” (స్పష్ట విస్పష్ట చూడండి).

● మీ కొరకు

"మీ" అనే సర్వనామం కొరజీనా బెత్సయిదా వారిని ఉద్దేశించింది.

Matthew 11:23

యేసు తాను అధ్భుత కార్యాలు చేసిన పట్టణాలలో ప్రజలను విమర్శిస్తున్న సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.

● కపెర్నహూమా

ఇక్కడ కపెర్నహూము పట్టాణ ప్రజలు తన మాటలు వింటున్నట్టు చెబుతున్నాడు కానీ వారు అక్కడ లేరు. (సంగ్రహంగా రాయడం చూడండి). "నీవు' అనేది ఏకవచనం, ఈ రెండు వచనాలలో దీన్ని కపెర్నహూమును సంబోధించడానికి వాడారు.

● కపెర్నహూము. సోదొమ

ఈ పట్టణాల పేర్లు కపెర్నహూము, సోదొమలో నివసిస్తున్న ప్రజలను ఉద్దేశించిన పర్యాయ పదాలు. (పర్యాయ పదాలు చూడండి).

● ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా

యేసు ఈ అలంకారిక ప్రశ్నను వేస్తూ కపెర్నహూము ప్రజల గర్వాన్ని తిడుతున్నాడు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి). దీన్ని కర్త ప్రధాన వాక్యంగా "నీవు ఆకాశానికి ఎక్కుతాను అనుకుంటున్నావా? " లేక "నిన్ను దేవుడు గౌరవిస్తాడని అనుకుంటున్నావా?” (కర్హ లేక కర్మ ప్రధాన వాక్యాలు చూడండి).

● హెచ్చింప బడెదవా

"గౌరవాన్ని పొందుతావా." (జాతీయాలు చూడండి).

● నీవు పాతాళము వరకు దిగి పొయెదవు

దీన్ని కర్త ప్రధాన వాక్యంగా: "దేవుడు నిన్ను పాతాళానికి దించుతాడు." అని రాయొచ్చు.(కర్హ లేక కర్మ ప్రధాన వాక్యాలు చూడండి).

● నీలో చేయబడిన అద్భుతములు సొదొమలొ చేయబడిన యెడల

దీని కర్త ప్రధాన వాక్యంగా: "నేను నీలో చేసిన గొప్ప కార్యాలను సొదొమలొ చేసుంటే." (కర్హ లేక కర్మ ప్రధాన వాక్యాలు చూడండి).

● అద్భుతములు

"అద్భుత కార్యాలు" లేక "శక్తి గల కార్యాలు" లేక "వింత కార్యాలు"

● అది నేటివరకు నిలిచి యుండును

ఇక్కడ "అది" అనే సర్వనామం సొదొమ నుద్దేశించినది.

● విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వతగినదై యుండునని

దీన్ని ఇలా అనువదించ వచ్చు తీర్పు దినమందు దేవుడు మీ పట్ల కంటే కూడా సొదొమ ప్రాంత ప్రజల పట్ల ఎక్కువ కనికరాన్ని చూపిస్తాడు" లేక "తీర్పు దినమందు దేవుడు సొదొమ ప్రజల కంటె ఎక్కువ కఠినంగా శిక్షిస్తాడు" (యుడిబి చూడండి). ఈ మాటలకు అర్ధం "నేను చేసిన అద్భుత కార్యాలను చూసి కూడా మీరు నన్ను నమ్మ లేదు పశ్చాతాప పడలేదు." (స్పష్ట విస్పష్ట వాక్యాలు చూడండి).

Matthew 11:25

యేసు తన చుట్టూ జనసమూహం ఉన్నప్పటికీ వారి మధ్యనే పరలోకపు తండ్రికి ప్రార్ధన చేస్తున్నాడు.

● యేసు చెప్పినదేమనగా

దీనర్ధం 1). యేసు 12"1 లో తన శిష్యులను పంపిన తర్వాత ఎవరో ఏదో చెప్పినదానికి యేసు జవాబిస్తున్నాడు, లేక 2). పశ్చాతప పడని నగరాలను ఉద్దేశించిన తన విమర్శలను యేసు ఇక్కడ ముగిస్తున్నాడు: "యేసు ఇంకా ఇలా అన్నాడు" అని రాయొచ్చు.

● తండ్రీ

దీనర్ధం ఈ లోక తండ్రి కాదు, దేవుడైన తండ్రి.

● ఆకాశమునకును భూమికిని ప్రభువా

దీన్ని పర్యాయ వాక్యంగా అనువదిస్తూ: ఆకాశంలోని భూమిలోని ప్రతి దానికి ప్రతి మనిషికీ ప్రభువా," లేక రెండు విరుద్ద అర్దాల పదాలను పొలిచి చెప్పే విధంగా "విశ్వానికి ప్రభువా" అని రాయొచ్చు (పర్యాయ పదాలు, వైరుధ్య వాక్యాలు చూడండి).

● నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని"

"ఈ సంగతులు" అనే పదానికి అసలు అర్ధం ఏంటో ఇక్కడ స్పష్టంగా లేదు. " ఒకవేళ మీ భాషలో ఈ పదానికి కచ్చితమైన అనువాదం రాయాల్సి వస్తే "తెలివైన వారు, చదువుకున్నవారు తెలుసుకునే అవకాశం లేకుండా నీవు సత్యాలను తెలివి తక్కువ వారికి వెల్లడించావు” అని రాయొచ్చు.

● మరుగు చేసావు

"దాచి.” ఇది వెల్లడి చేయడం అనే క్రియకు వ్యతిరేక పదం.

● జ్ఞానులు. వివేకులు

"జ్ఞానము తెలివి కలిగిన వారు.” దీని మరోలా: తమకు తామే తెలివైనవారిమి, జ్ఞానముగల వారికి అనుకునే ప్రజలు(యుడిబి, వ్యంగ్య పదాలు చూడండి).

● బయలు పరచినావని

ఇక్కడ "బయలుపరచినవి" అంటే ముందు వచనంలోని "ఈ సంగతులు."

● పసిబాలురకు

ఈ పదం అర్ధం "చిన్న వయసులోని వారు." "చదువుకోని వారు" లేక "తెలివితక్కువ వారు.” దీన్ని ఇలా అనువదించ వచ్చు "తెలివితక్కువ పిల్లలు" అని రాయొచ్చు.

● పసిబాలురకు

ఈ పదం, తెలివిలేని, చదువుకోని, తాము తెలివితక్కువ వారిమని చదువులేని వారిమని అనుకునే ప్రజల నుద్దేశించిన ఉపమానం. (ఉపమ చూడండి).

● ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను

"ఈ విధంగా చేయడం మంచిదని నీవు గుర్తించావు"

● సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింప బడి యున్నది

దీన్ని కర్త ప్రధాన వాక్యంగా: నా తండ్రి అన్నిపనులు నా చేతికిచ్చాడు" లేక " నా తండ్రి అన్ని పనులు నాకు అప్పగించాడు: అని రాయొచ్చు. (కర్త లేక కర్మ ప్రధాన వాక్యాలు చూడండి).

● తండ్రి గాక ఎవరూ కుమారుని ఎరుగరు

"కుమారుని గురించి తండ్రికి మాత్రమే తెలుసు."

● కుమారుని ఎరుగరు

"వ్యక్తిగత అనుభవం ద్వారా ఎరుగరు"

● కుమారుడు

యేసు తన గురించే ప్రధమ పురుషలో మాట్లాడుతున్నాడు (ఉత్తమ, మధ్యమ, ప్రధమ పురుష చూడండి).

● కుమారుడు గాకను. మరి ఎవరును తండ్రిని ఎరుగరు

"కుమారుడికి మాత్రమే తండ్రి గురించి తెలుసు

● తండ్రిని ఎరుగరు

" "వ్యక్తిగత అనుభవం ద్వారా ఎరుగరు"

● కుమారుడెవనికి ఆయనను బయలు పరచ నుద్దేశించునో

దీన్ని మరోలా ;"కుమారుడు తన తండ్రి గురించి తెలియజేస్తేనే ప్రజలకు తండ్రిని గురించి తెలుస్తుంది. కుమారుడెవనికి ఆయనను బయలు పరచ నుద్దేశించునో

ఆయనను అంటే దేవుడైన తండ్రి.

Matthew 11:28

యేసు జన సమూహంతో మాట్లాడటం ఇక్కడ ముగిస్తున్నాడు

● ప్రయాసపడి భారం మోసికొనుచున్న

ఈ రూపకం ద్వారా యూదుల ధర్మశాస్త్రం లోని "కాడి"ని ప్రస్తావిస్తున్నాడు. (రూపకాలంకారం చూడండి).

● నేను మీకు విశ్రాంతి కలుగ జేతును

"మీ భారాలనుండి, కష్టాల నుండి మీకు నేను విడుదల నిస్తాను. (స్పష్ట విస్పష్ట వాక్యాలు చూడండి).

● మీ మీద నా కాడి ఎత్తుకుని

ఇక్కడ "మీ" అనే సర్వనామం "కష్టపడుతున్న, బరువులు మోస్తున్న వారిని" ఉద్దేశించింది. ఈ రూపకానికి అర్ధం ;"నేను మీకు అప్పగించే పనిని చేయండి అని” (యుడిబి చూడండి). లేక "నాతో కలిసి పని చేయండి.” (రూపకం చూడండి).

● నా కాడి సుళువు

ఇక్కడ బరువుగా ఉండదు, తేలికగానే ఉంటుంది అని అర్థం.