Matthew 9

Matthew 9:1

పక్షవాతం వచ్చిన వ్యక్తిని యేసు బాగు చేసిన సంఘటన వివరాలు ఇక్కడ మొదలవుతాయి.

● ఆయన దోనె ఎక్కి

బహుశా యేసు శిష్యులు కూడా ఆయనతో వెళ్లి ఉండవచ్చు. (యుడిబి చూడండి).

● దోనె

బహుశా 8:23 లోని దోనె కావొచ్చు. గందరగోళం లేకుండా ఉండాలంటే దీన్ని వివరించండి.

● తన పట్టణములో ప్రవేశింపగా

"ఆయన నివసిస్తున్న పట్టణములో” (యుడిబి చూడండి).

● ఇదిగో

పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు.

● వారి

పక్షవాతం ఉన్న వ్యక్తిని యేసు వద్దకు తీసుకువచ్చిన వారు, పక్షవాయువు రోగి కూడా కలిపి అవొచ్చు.

● కుమారుడా

ఇతను యేసు కొడుకు కాదు గాని, అతనితో అభిమానంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇది గందరగోళంగా అనిపిస్తే దీన్ని "నీ స్నేహితుడా" లేక "యువకా" అని లేక అసలు రాయకుండా ఉన్నా మంచిది.

● నీ పాపములు క్షమింప బడియున్నవని

"దేవుడు నీ పాపాలు క్షమించాడు" లేక "నేను నీ పాపాలు క్షమించాను."

Matthew 9:3

పక్షవాతం వచ్చిన వ్యక్తిని యేసు బాగు చేసిన సంఘటన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.

● ఇదిగో

పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు

● తమలో తాము

దీనర్ధం "వారు తమ మనసులో" కావొచ్చు లేక "ఒకరితో ఒకరు" నోటితో మాట్లాడుకోవడం కావొచ్చు.

● దేవదూషణ

కేవలం దేవుడు మాత్రమే చేయగలడు అని శాస్త్రులు అనుకుంటున్న వాటిని యేసు చేస్తానంటున్నాడు.

● వారి తలంపులు గ్రహించి

వారు ఏమీ ఆలోచిస్తున్నారో యేసు తన అతీంద్రియ శక్తి (దైవిక జ్ఞానం). ద్వారా గాని లేక వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూడడం ద్వారా గాని గ్రహించి ఉండొచ్చు.

● మీరెందుకు మీ హృదయంలలో దురాలోచనలు చేయుచున్నారు?

శాస్త్రులను తిట్టడానికి యేసు ఈ ప్రశ్న వేస్తున్నాడు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● మీరు. మీ

బహువచనాలు

● దురాలోచన

ఇది కేవలం పొరబాటు,కాదుగాని నైతిక పాపం లేక చెడ్డబుద్ధి.

● ఏది సులభము?

ఆ రోగి తాను చేసిన పాపాల వలనే పక్షవాతానికి గురయ్యాడని శాస్త్రులు నమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తు చేయడానికి యేసు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఒకవేళ అతని పాపాలు క్షమింపబడితే అతను లేచి నడుస్తాడని,కాబట్టి తాను ఆ పక్షవాయువు రోగిని బాగు చేస్తే తనకు పాపాలను క్షమించే అధికారం ఉందని శాస్త్రులు గుర్తించాలని యేసు ఈ ప్రశ్న వేస్తున్నాడు.(అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా?

"నీ పాపాలు క్షమింపబడి యున్నాయని చెప్పడం తేలికా? లేక "నీవు లేచి నడువు అని చెప్పడం తేలికా?"

● నీ పాపములు క్షమింప బడి యున్నవి

దీనర్ధం 1)."నేను నీ పాపాలను క్షమిస్తున్నాను” (యు డి బి). లేక 2). "దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు." ఇక్క నీ అనేది ఏకవచనం (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).

● మీరు తెలిసికోనవలెను

"నేను చేసి నిరూపిస్తాను." ఇక్కడ "మీరు" బహు వచనం.

● నీవు .నీ

ఏకవచనం

● నీ యింటికి పొమ్మని

యేసు అతడిని ఎక్కడికీ వెళ్ళవద్దని చెప్పడం లేదు, ఇంటికి వెళ్ళే అవకాశం ఇస్తున్నాడు.

Matthew 9:7

పక్షవాతం వచ్చిన వ్యక్తిని యేసు బాగు చేసిన సంఘటన ఇక్కడ ముగుస్తుంది. యేసు తర్వాత పన్నులు వసూలు చేసే వ్యక్తిని తన శిష్యులలో ఒకనిగా ఉండమని పిలుస్తాడు.

● మహిమ

5:16 లో వాడిన పదాలే వాడండి.

● ఇట్టి అధికారం

పాపలు క్షమించే అధికారం

● మత్తయి. అతని

అతడు

చర్చి సంప్రదాయం ప్రకారం ఈ సువార్తను మత్తయి రాశాడు. అయితే ఇక్కడ అతడు అతని అనే సర్వనామాలను "నన్ను' "నాతో " అని రాయడానికి ఏ ఆధారమూ లేదు.

● అతనితో చెప్పగా

"యేసు మత్తయితో చెప్పగా"

● యేసు అక్కడి నుండి వెళ్ళుచు

(9:8). లో "ఇదిగో" తో మొదలైన సంఘటనను ప్రస్తావించడానికి దీనిని రాసారు మీ భాషలో దీన్ని రాయడానికి ఏవైనా ప్రత్యేక పద్దతులు ఉంటే ఇక్కడ ఉపయోగించండి.

● వెళ్ళుచు

ఇక్కడ యేసు కపెర్నహూము లోపలికి వెళ్తున్నాడో బయటకి వెళుతున్నాడో తెలియదు కాబట్టి వెళ్ళడానికి రాసే పదాన్నే ఇక్కడ రాయండి.

● అతడు లేచి ఆయనను వెంబడించెను

"మత్తయి లేచి యేసును ఒక శిష్యుడిగా వెంబడించాడు." గానీ ఆయన వెళ్ళే చోటుకి వెళ్ళాడని కాదు(యుడిబి చూడండి).

Matthew 9:10

పన్ను వసూలు చేసే మత్తయి ఇంటిలో ఈ సంఘటనలు జరుగుతాయి.

● ఇంటిలో

బహుశా ఇది మత్తయి ఇల్లు కావొచ్చు. (యుడిబి చూడండి)., లేకపోతే యేసు ఇల్లు కూడా కావొచ్చు. ("యేసు ఆయన శిష్యులతో కూర్చుండిరి"). గందరగోళం లేకుండా ఉండాలంటే స్పష్టంగా రాయండి.

● ఇదిగో

ఇదిగో అనే పదం కథనంలో కొత్త వ్యక్తులు రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏదైనా పద్ధతి ఉందేమో చూడండి. ఇంగ్లీషులో అయి'తే "అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ..”

● పరిసయ్యులు అది చూసి

"యేసు పన్నులు వసూలు చేసేవారితోనూ, పాపం చేసేవారితోనూ కలిసి భోజనం చేస్తున్నాడని పరిసయ్యులు చూసి."

Matthew 9:12

పన్ను వసూలు చేసే మత్తయి ఇంటిలో ఈ సంఘటనలు జరుగుతాయి.

● ఆయన ఆ మాట విని

"ఆ మాట " అంటే యేసు పన్నులు వసూలు చేసేవారితోనూ, పాపం చేసేవారితోనూ కలిసి భోజనం చేస్తున్నాడని పరిసయ్యులు అడిగిన మాట.

● వైద్యుడు

డాక్టరు (యుడిబి చూడండి).

● రోగులకేగాని

"రోగంతో ఉన్న వ్యక్తికే డాక్టరు అవసరం"

వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని

"దీని అర్ధం ఏంటో మీరు తెలుసుకోవాలి"

● మీరు వెళ్లి

"మీరు " అనీ సర్వనామం పరిసయ్యులను తెలియజేస్తుంది.

Matthew 9:14

యేసు శిష్యులు ఉపవాసం ఉండటం లేదన్న విషయాన్ని బాప్తిసమిచ్చు యోహాను శిష్యులు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు.

● పెండ్లి ఇంటివారు దుఃఖ పడగలరా?

పెండ్లి కొడుకు తమతో ఉన్నపుడు అతనితో కూడా ఉన్నవారు ఎవరూ ఉపవాసం ఉంటారని అనుకోరు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● పెండ్లి ఇంటివారు

ఇది యేసు శిష్యుల్ని గురించి చెప్పిన రూపకం. (రూపకాలంకారం చూడండి).

● పెండ్లికుమారుడు వారి యొద్డనుండి కొనిపోబడు

"ఎవరో పెండ్లికుమారుడిని తీసుకుని వెళుతారు." చంపబడతాడు అనడానికి ఇది ఒక రూపకం. (రూపకాలంకారం, కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).

● దుఃఖపడరు

"విచారము. బాధ." (యుడిబి చూడండి}

Matthew 9:16

యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు సమాధానం ఇంకా కొనసాగుతోంది.

● ఎవడునూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వెయ్యడు

పాత సంప్రదాయాలను ఆచరించే వారు అంత తొందరగా కొత్త వాటిని ఒప్పుకోలేరు. (రూపకం చూడండి).

● బట్ట

"దుస్తులు"

● మాసిక

చినుగును కప్పడానికి వాడే "కొత్త గుడ్డ ముక్క."

Matthew 9:17

యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు సమాధానం ఇంకా కొనసాగుతోంది.

● పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు.

పరిసయ్యులు, మేము ఉపవాసం ఉంటాము, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యేసు ఈ రూపకాన్ని లేక ఉపమానాన్ని చెబుతున్నాడు.(రూపకాలంకారం చూడండి).

● పోయరు

"ఎవరూ దాంట్లోకి పోయరు” (యుడిబి). లేక "మనుషులు ఎప్పుడూ పోయరు"

● కొత్త ద్రాక్షారసం

"ద్రాక్షా పండ్ల రసం." మద్యంగా చేయబడని ద్రాక్ష పండ్ల రసం అని అర్ధం. ఒకవేళ మీ ప్రాంతంలో ద్రాక్ష పండ్లు లేకపోతే పండ్లు అని తెలిపే పదం వాడండి.

● పాత తిత్తులలో

దీనర్ధం చాలా సార్లు వాడిన ద్రాక్ష తిత్తులు.

● ద్రాక్ష తిత్తులు

ఇవి జంతు చర్మంతో చేసిన తిత్తులు. వీటిని "చర్మపు సంచులు" అని లేక "ద్రాక్షసంచులు"అని రాయొచ్చు. (యుడిబి).

● తిత్తులు పిగిలి

కొత్త ద్రాక్ష రసం మగ్గి రసం పొంగినప్పుడు సంచులు సాగలేక రసాన్ని పట్టలేక చిల్లులు పడతాయి.

● పాడగును

"నాశనమవుతాయి." (యుడిబి).

● కొత్త తిత్తులు

"కొత్త ద్రాక్షారస సంచులు" లేక "కొత్త చర్మపు సంచులు.” దీనర్ధం ఇవి ఇంతకు ముందు వాడనివి అని.

Matthew 9:18

యూదా అధికారి కూతురిని యేసు అద్భుతమైన విధంగా బాగుచేసిన వివరాలు ఇక్కడ మొదలవుతాయి.

● ఈ మాటలు

ఉపవాసం గురించి యోహాను శిష్యులకు యేసు ఇచ్చిన సమాధానం.

● ఇదిగో

ఇదిగో అనే పదం కథనంలో కొత్త వ్యక్తులు రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏదైనా పద్ధతి ఉందేమో చూడండి

● ఆయనకు మ్రొక్కి

యూదుల సాంప్రదాయంలో ఒక వ్యక్టిని గౌరవించడాన్ని ఇది సూచిస్తుంది.

● నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రదుకుననెను

తన కూతురిని తిరిగి బ్రతికించే శక్తి యేసుకు ఉందని ఆ యూదా అధికారి నమ్ముతున్నాడని ఇది తెలియజేస్తుంది.

● ఆయన శిష్యులు

"యేసు శిష్యులు"

Matthew 9:20

యూదా అధికారి కూతురిని బాగు చేయడానికి వెళ్ళే దారిలో మరొక ఆమెను యేసు బాగు చేసిన సంఘటన ఇది.

● ఇదిగో

ఇదిగో అనే పదం కథనంలో కొత్త వ్యక్తులు రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏదైనా పద్ధతి ఉందేమో చూడండి

● రక్త స్రావ రోగం

"బాగా రక్తం కారి పోవడం." ఆమెకు సాధారణంగా రక్త స్రావం జరిగే సమయం కాకుండా, గర్భం నుంచి రక్తం కారుతూ ఉండొచ్చు. కొన్ని సాంప్రదాయాల్లో దీని కొంత మర్యాదగా వివరించే అవకాశం ఉంటుంది. (సభ్యోక్తి చూడండి).

● ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని

ఆమె ఇక్కడ వస్త్రం తనను బాగు చేస్తుందని నమ్మటం లేదు యేసు తనను బాగు చేస్తాడని నమ్ముతోంది. (మానవీకరణ చూడండి).

● పై వస్త్రం

'పై బట్ట"

● కానీ

"అయితే" ఆమె అనుకున్నది ఇక్కడ జరగలేదు.

● కుమారీ

ఆమె యేసు కూతురు కాదు, ఆయన ఆమెతో మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇది గందరగోళంగా అనిపిస్తే "అమ్మాయీ", అని రాయొచ్చు లేక రాయకుండా ఉండొచ్చు.

Matthew 9:23

యూదా అధికారి కూతురిని యేసు అద్భుతమైన విధంగా బాగుచేసిన వివరాలు ఇక్కడ కొనసాగుతాయి.

● ఆ అధికారి ఇంటికి

ఇది యూదా నాయకుడి ఇల్లు.

● పిల్లనగ్రోవి

ఇది చెక్కతో బోలుగా వుండే పొడవైన సంగీత వాయిద్యం. దీని ఒకవైపు నుండి లేక పై నున్న రంధ్రంలో ఊదడం ద్వారా మోగిస్తారు.

● పిల్లనగ్రోవులు వాయించు వారిని

"పిల్లన గ్రోవులు ఊదే మనుషులు"

● పంపివేసి

ఇక్కడ యేసు చాలామంది మనుషులతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ భాషలో బహువచనంలో వాడే పదాన్ని ఇక్కడ రాయండి.

● చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని

ఇక్కడ యేసు ఆమెను తాను తిరిగి బ్రతికిస్తాడు కాబట్టి ఆమె మరణానికి నిద్ర అనే పదాన్ని వాడుతున్నాడు. (సభ్యోక్తి చూడండి).

Matthew 9:25

యూదా అధికారి కూతురిని యేసు అద్భుతమైన విధంగా బాగు చేసిన సంఘటన ఇక్కడ ముగుస్తుంది.

● జనసమూహమును పంపివేసి

"యేసు అక్కడ గుమికూడిన వారినందరినీ బయటికి పంపివేసిన తర్వాత" లేక "ఆ కుటుంబ సభ్యులు గుంపును బయటికి పంపివేసిన తర్వాత."

● లేచెను

ఆమె మంచంపై నుండి లేచింది. ఇది 8:15 లో లాగే .జరిగిన సంఘటన.

● ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించెను

ఈ మానవీకరణకు అర్ధం ప్రజలు ఒకరితో ఒకరు చెప్పుకోవడం ద్వారా ఈ సమాచారం వ్యాపించింది. "ఆ ప్రాంతంలోని ప్రజలందరూ దానిని గూర్చి విన్నారు” (యు డి బి). లేక "ఆ అమ్మాయి బ్రతికి లేవడం చూసిన వారు ఆ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలందరికి చెప్పడం మొదలు పెట్టారు.” (మానవీకరణ చూడండి).

Matthew 9:27

ఇద్దరు గుడ్డివారిని యేసు బాగు చేసిన సంఘటన వివరాలు ఇక్కడ మొదలవుతాయి.

● యేసు అక్కడినుండి వెళ్ళుచుండగా

యేసు ఆ ప్రాంతం విడిచి వెళుతున్నాడు.

● వెళ్ళుచుండగా

ఇక్కడ యేసు ఆ ప్రాంతం లోకి వెళుతున్నాడో బయటికి వెళుతున్నాడో తెలియదు కాబట్టి మామూలుగా "వెళ్ళడానికి ఉపయోగించే పదాన్ని వాడండి.

● దావీదు కుమారుడా

యేసు దావీదుకు నేరుగా పుట్టిన కుమారుడు కాదు కాబట్టి దీన్ని "దావీదు వంశానికి చెందిన వాడా" అని రాయొచ్చు(యుడిబి). అయితే "దావీదు కుమారుడు" అన్నది ఆయనను పిలిచే పిలుపు.(21:9 చూడండి). కాబట్టి ఆ వ్యక్తులు బహుశా ఎలా పిలుస్తూ ఉండొచ్చు.

● యేసు ఇంట ప్రవేశించిన తరువాత

ఇది యేసు ఇల్లు కావొచ్చు(యుడిబి). లేక 9:10 లోని ఇల్లు కావొచ్చు.

● అవును ప్రభువా

"అవునా ప్రభువా, నువ్వు బాగు చేయగలవని నమ్ముచున్నాము."

Matthew 9:29

ఇద్దరు గుడ్డివారిని యేసు బాగు చేయడం ఇక్కడ పూర్తవుతుంది.

● వారి కన్నులు ముట్టి

ఇద్దరి కళ్ళను ఒకసారి తాకాడో, లేక ఒకని కళ్లపై కుడిచేతిని మరొకని కళ్లపై ఎడమచేతిని ఉంచాడో తెలియదు. అయితే ఎడమచేతిని అపరిశుభ్రమైన పనులకు ఉపయోగిస్తారు కాబట్టి, ఆయన తన కుడిచేతినే ఉపయోగించి ఉండొచ్చు. అల్లాగే ఆయన మాట్లాడుతూ వారి కళ్ళను తాకాడో లేక మొదట తాకి తర్వాత మాట్లాడాడో కూడా తెలియదు.

● వారి కన్నులు తెరువబడెను

"దేవుడు వారి కళ్ళను బాగు చేశాడు" లేక "ఆ గుడ్డివారిద్దరూ చూడగలిగారు” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు. జాతీయాలు చూడండి).

● అయినను

"డానికి బదులు." ఆ మనుషులు యేసు చెప్పినట్టు చేయలేదు.

● కీర్తి ప్రచురము చేసిరి

"తమకు ఏమి జరిగిందో దీన్ని చాలామందికి చెప్పారు."

Matthew 9:32

తన స్వంత పట్టణంలో యేసు చాలామందిని బాగు చేసిన సంఘటనల వివరాలు కొనసాగుతాయి.

● ఇదిగో

ఇదిగో అనే పదం కథనంలో కొత్త వ్యక్తులు రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏదైనా పద్ధతి ఉందేమో చూడండి.

● మూగ

మాట్లాడలేక పోవడం.

● మూగవాడు మాటలాడగా

"మూగగా వుండిన వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టాడు" లేక "మాట్లాడలేక పోయిన వ్యక్తి మాట్లాడటం ప్రారంభించాడు" లేక "ఆ వ్యక్తికి మాటలు వచ్చాయి."

● జనసమూహములు ఆశ్చర్యపడి

"ప్రజలందరూ ఆశ్చర్యపోయారు"

● ఈలాగు ఎన్నడును కనపడలేదని

దీనర్ధం "ఎలాంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు" లేక ఎవరూ ఇలాంటి పనులు చేయలేదు" అని.

● దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడని

"ఆయన దయ్యాలను తరిమి వేస్తున్నాడు." ఇక్కడ ఆయన అనే సర్వనామం యేసును సూచిస్తుంది.

Matthew 9:35

గలీల ప్రాంతంలో యేసు బోధించే, బాగుచేసే, సువార్త చెప్పే పరిచర్య గురించి వివరాలు ఇక్కడ ఉంటాయి.

● సమస్త పట్టణములయందును

"చాలా పట్టణాల్లో.” (అతిశయ వాక్యాలు చూడండి).

● పట్టణములు గ్రామాలు

"పెద్ద గ్రామాలు. చిన్న గ్రామాలు" లేక "పెద్ద పట్టణాలు . చిన్న పట్టణాలు"

● ప్రతివిధమైన రోగాన్నీ . ప్రతివిధమైన వ్యాధినీ

అన్ని రోగాలను, అన్నివ్యాధులను. రోగం, జబ్బు అనేవి చాల దగ్గర అర్ధాన్నిచ్చే పదాలు. వీలైతే వీటిని రెండు వేర్వేరు పదాలుగా అనువదించాలి. వ్యాధి మనిషిని రోగానికి గురిచేసి బాధపెడుతుంది. వ్యాధి ఉన్నందువల్ల కలిగే శారీరక బలహీనత, బాధను రోగం అంటారు.

● వారు కాపరిలేని గొర్రెల వలె

"ఆ ప్రజలకు నాయకుడు లేడు."

Matthew 9:37

గత సంఘటనలలోని ప్రజల అవసరాలకు శిష్యులు ఏ విధంగా స్పందించాలో చెప్పడానికి పంట కోతను గురించిన వాక్య ప్రయోగాన్ని(భాషా రూపాన్ని). యేసు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు.

● కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు

ఇది ఒక రూపకాలంకారము. ఇక్కడ దేవుని నమ్ముకుని ఆయన రాజ్యంలో చేరే ఎక్కువమంది ప్రజలను ఒక పొలంలో పెరిగే పైరుతో, ఇతరులకు దేవుడి గురించి చెప్పేవారిని పొలంలో పనిచేసే వారితో పోలుస్తున్నాడు. ఈ రూపకాలంకారం అర్ధం ఏంటంటే దేవుడిని గూర్చి తెలుసుకోవాల్సిన చాలామంది ప్రజలకు చెప్పడానికి కొద్ది మందే జనం ఉన్నారని. (రూపకాలంకారం చూడండి).

● పంట

"బాగా పండి కోతకు వచ్చిన పంట."

● పనివారు

"పనిచేసేవారు."

● కొత్త యజమానుని వేడుకొనుడని

"దేవుడిని అడగండి. ఈ పంటకు యజమాని దేవుడే."