Matthew 8

Matthew 8:1

యేసు అద్భుతమైన విధంగా చాలా మందిని బాగు చేయడం మొదలవుతుంది.

● ఆయన కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనను వెంబడించెను

దీన్నే మరో విధంగా "యేసు కొండ దిగి కిందకు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు ఆయనను వెంబడించారు. " ఆ ప్రజలలో ఆయనతోపాటు కొండ దిగినవారు, కొండపై ఆయనతో పాటు లేనివారు కూడా ఉండొచ్చు.

● ఇదిగో

ఇక్కడ "ఇదిగో" అనే పదం కొత్త మనిషి రావడాన్ని సూచిస్తుంది. మీ భాషలో దీన్ని రాయడానికి ఏమైనా ప్రత్యేక పద్ధతి ఉందేమో చూడండి.

● కుష్టురోగి

"కుష్టు రోగం ఉన్న మనిషి" లేక "ఒక చర్మ రోగంతో బాధపడుతున్న వ్యక్తి.” (యుడిబి).

● నీకిష్టమైతే

దీన్ని మరో విధంగా "మీరు కోరుకుంటే" లేక "మీరు అనుకుంటే" అని రాయొచ్చు. యేసుకు తనను బాగుచేయగల శక్తి వుందని ఆ కుష్టురోగికి తెలుసు, అయితే యేసు తనను తాకుతాడో లేదో అని అనుకుంటున్నాడు.

● నన్ను శుద్దునిగా చేయగలవనెను

దీన్ని ఇలా అనువదించ వచ్చు "మీరు నన్ను బాగు చేయగలరు" లేక "నన్ను బాగు చేయండి." అని రాయొచ్చు.(యుడిబి).

● తక్షణమే

"వెంటనే."

● వాని కుష్టురోగం శుద్ధియాయెను

యేసు "శుద్దుడవు కమ్మని" చెప్పగానే అతను బాగు పడ్డాడు. దీన్నే ఇలా "అతను బాగయ్యాడు" లేక "అతని కుష్టు రోగం పోయింది" లేక కుష్ఠురోగం బాగయింది." అని రాయొచ్చు.

Matthew 8:4

యేసు కుష్టురోగిని బాగు చేసిన సంఘటన వివరాలు కొనసాగుతున్నాయి.

● వాని

కుష్ఠురోగం ఉన్న మనిషి.

● ఎవరితోనూ ఏమియూ చెప్పకు

ఆ మనిషి తాను కానుకలు ఇచ్చే సమయంలో యాజకునితో మాట్లాడాలి, అయితే యేసు జరిగిన సంగతిని ఎవరితోనూ చెప్పవద్దని అంటున్నాడు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "ఎవరికీ ఏమీ చెప్పొద్దు" లేక "నేను నిన్ను బాగు చేసానని ఎవరికీ చెప్పొద్దు" అని రాయొచ్చు. (అతిశయ వాక్యాలు చూడండి.).

● నీ దేహాన్ని యాజకునికి కనపరచుకుని

యూదుల ఆచారం ప్రకారం ఒక మనిషి తన శరీరం (చర్మం). బాగైన విషయాన్ని యాజకునికి తెలిపిన తర్వాత అతడిని ఇతరులతో కలిసి జీవించడానికి అనుమతిస్తారు.

● వారికి సాక్ష్యార్దమై కనపరచుకుని మోషే నియమించిన కానుకలను సమర్పించుమని

మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషికి కుష్టు రోగం బాగైన తర్వాత అతడు తన కృతజ్ఞతార్పణలను యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు వాటిని తీసుకుంటే ఆ మనిషి బాగైనట్టు అందరికి తెలుస్తుంది.

● వారికి

దీనర్ధం 1). యాజకులు లేక 2). ప్రజలు లేక 3). యేసును విమర్శించేవారు. అవకాశముంటే ఈ ముగ్గురిని ఉద్దేశించే సర్వనామాన్ని రాయండి.(సందిగ్దత చూడండి).

Matthew 8:5

యేసు చాలామందిని బాగు చేసిన వివరాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఆయన .. ఆయన

యేసు

● పక్షవాతం

జబ్బుతో "కదలలేని పరిస్థితి."

● యేసు "నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని" అతనితో చెప్పగా

శతాధిపతితో యేసు "నేను నీ ఇంటికి వచ్చి నీ పనివాడిని బాగుచేస్తాను" అంటున్నాడు.

Matthew 8:8

యేసు చాలామందిని బాగు చేసిన సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి.

● నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు

"నీవు నా ఇంటిలోకి రావడానికి (అన్యాపదేశాలు చూడండి).

● నీవు మాట మాత్రం సెలవిమ్ము

"నీవు ఆజ్ఞాపించు."

● సైనికులు

"శిక్షణ పొందిన యోధులు."

● ఇశ్రాయేలులో నేవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని

దేవుని ప్రజలుగా ఎంచబడే ఇశ్రాయేలులోని యూదులకు అందరికంటే ఎక్కువ విశ్వాసం ఉంటుందని యేసు దగ్గర ఉన్న ప్రజలు అనుకుంటుండవచ్చు. యేసు వారి అభిప్రాయం తప్పని, శతాధిపతి విశ్వాసం గొప్పదని చెబుతున్నాడు.

Matthew 8:11

రోమా శతాధిపతి పనివాడిని యేసు బాగు చేసిన సంఘటన కొనసాగుతుంది.

● మీతో

తన వెంట వస్తున్నవారితో ఇలా అంటున్నాడు, (8:10). కాబట్టి ఇది బహువచనం.

● తూర్పు నుండియు పడమట నుండియు

ఇది రెండు వైరుధ్య విషయాలను కలిపి చెప్పే పద ప్రయోగం: తూర్పు అంటే అది పడమరకు దగ్గర కాదు. ఈ వ్యాక్యాన్ని "అన్ని ప్రాంతాలనుండి" లేక "అన్ని దూరదిక్కుల నుండి" అని రాయొచ్చు. (వైరుధ్యా పద ప్రక్రియ చూడండి).

● కూర్చుందురు గాని

అప్పటి సంప్రదాయం ప్రకారం తినే సమయంలో మనుషులు బల్ల చుట్టూ శరీరాలను వాల్చి కూర్చునేవారు. ఒక కుటుంబము, స్నేహితులు సన్నిహితంగా జీవించే సంప్రదాయాన్ని ఈ అన్యాపదేశంగా చెబుతోంది. (అన్యాపదేశం చూడండి).

● పరలోకరాజ్య సంబధులు. త్రోయబడుదురు

"దేవుడు పరలోక రాజ్య సంబధులను త్రోసివేస్తాడు.” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న పదప్రయోగాన్ని చూడండి).

● పరలోకరాజ్య సంబంధులు

సంబంధులు అంటే 'చెందినవారు" ఇక్కడ దేవుని రాజ్యానికి చెందినవారు. ఇది కొంత విడ్డూరంగా ఉంది, ఎందుకంటే "సంబంధులు" త్రోయబడుతారు, కొత్తవారు లోపలి చేర్చబడుతారు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "ఎవరైతే దేవునికి విధేయత చూపి లోబడుతారో" రాయొచ్చు(యుడిబి చూడండి). (జాతీయాలు చూడండి).

● వెలుపటి చీకటిలోనికి

దేవుని వ్యతిరేకించే వారికి ఎదురయ్యే నిరంతర స్థితిని ఇది తెలియజేస్తుంది. "దేవునికి దూరంగా ఉండే చీకటి ప్రదేశం” (అన్యాపదేశం చూడండి).

● నీకు అవును గాకని

"నేను నీ కొరకు చేస్తాను." (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న పదప్రయోగాన్ని చూడండి).

● దాసుడు స్వస్థతనొందెను

"యేసు దాసుడిని బాగు చేసాడు." (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న పదప్రయోగాన్ని చూడండి).

● ఆ గడియలోనే

తాను దాసుడిని బాగు చేస్తానని యేసు చెప్పిన ఈ క్షణంలోనే."

Matthew 8:14

యేసు చాలామందిని బాగు చేసే సంఘటనల వివరాలు కొనసాగుతాయి.

● యేసు రాగా

యేసుతో పాటు ఆయన శిష్యులు ("ఆయన ఆదేశించిన వారు,"8:18; యుడిబి చూడండి). కూడా ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం యేసు ఏం చెప్పాడు, ఏం చేసాడు అన్నదే కాబట్టి అవసరమైతేనే శిష్యులను గురించి చెప్పండి. ఎటువంటి అపార్ధాలు లేకుండా చూడండి.

● పేతురు అత్త

"పేతురు భార్య తల్లి."

● జ్వరమామెను విడిచెను

ఒకవేళ మీ భాషలో ఇక్కడ జ్వరమే తనంతట తానే ఆమెను వదిలి వెళ్ళిపోయింది అనే మానవీకరణగా అర్ధం వస్తే "ఆమె బాగు పడింది" లేక "యేసు ఆమెను బాగు చేసాడు" అని రాయొచ్చు. (మానవీకరణ చూడండి).

● లేచి

"మంచం మీద నుండి లేచి"

Matthew 8:16

యేసు చాలామందిని బాగు చేసే సంఘటనల వివరాలు కొనసాగుతాయి

● సాయంకాలం

యుడిబి మార్కు 1:30 ప్రకారం యేసు కపెర్నహూం లోకి సబ్బాతు రోజు వచ్చాడు. యూదుల ఆచారం ప్రకారం సబ్బాతు రోజు ఏ పని కానీ ప్రయాణం కానీ చేయరు, అందుకని వారు సాయంత్రం వరకు ఆగి ప్రజలను యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. వేరే అర్ధం వస్తుందనుకుంటే తప్ప మీరు సబ్బాతు గురించి రాయక్కర్లేదు.

● ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టి

ఇది అతిశయ వాక్యం. యేసు ఒకమాట కంటే ఎక్కువ మాట్లాడి ఉండవచ్చు. దీని ఇలా "యేసు ఒకసారి మాట్లాడగానే దయ్యాలు ఆ మనిషిని వదిలి వెళ్ళాయి.” (అతిశయ వాక్యాలు చూడండి).

● ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను

"ఇశ్రాయేలులోని యూదా ప్రజలకు చెప్పమని దేవుడు యెషయా ప్రవక్తకు తెలిపిన ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు.” (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).

● యెషయా ద్వారా చెప్పబడినది

"యెషయా ఏమి చెప్పాడో" (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలు చూడండి).

● ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగాలను భరించెనని

"ప్రజల రోగాలను వదలగొట్టి వారిని బాగు చేసాడు. “(ఏకమూలక పదాలు Doublet చూడండి).

Matthew 8:18

తనను అనుసరించేవారి నుండి తాను ఏమి కోరుకుంటున్నాడో యేసు వివరిస్తున్నాడు.

● నీ. ఆయన

8"19 లో ఇది యేసును ఉద్దేశించిన సంబోధనలు.

● ఆజ్ఞాపించెను

"వారు ఏం చెయ్యాలో ఆయన వారికి చెప్పాడు."

● అంతట

యేసు వారికి చెప్పిన తర్వాత దోనె ఎక్కక ముందు (యుడిబి చూడండి).

● నీవెక్కడికి

"ఏ స్థలానికైనా."

● నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు

ఈ వైరుధ్య ప్రయోగంలో చెప్పిన జంతువులు అడవి జంతువులని అర్ధం. (వైరుధ్య వాక్య ప్రయోగం చూడండి).

●నక్కలు

నక్కలనేవి కుక్కల్లాగే వుండి గూటిలోని పక్షుల్ని, చిన్న చిన్న జంతువుల్ని తింటాయి. ఒక వేళ మీ ప్రాంతంలో నక్కలు తెలియకపోతే కుక్కలు లేక ఇతర బొచ్చు ఉన్న జంతువుల్ని రాయొచ్చు. (తెలియనివాటిని అనువదించడం చూడండి).

● బొరియలు

నక్కలు నెలలో రంధ్రాలు చేసుకుని అక్కడ నివసిస్తాయి. నక్కలకు బదులు మీరు రాసే జంతువులు ఎక్కడ "నివసిస్తాయో" వాటిని రాయండి.

● తల వాల్చుకోనుటకైనను స్థలం లేదని

"తనకు నిద్ర పోవడానికి స్థలం లేదని" (జాతీయాలు చూడండి).

Matthew 8:21

యేసు తనను అనుసరించేవారి నుంచి ఏమీ కోరుకుంటాడో ఇంకా వివరిస్తున్నాడు.

● నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా

ఇది చాల మర్యాదగా అడిగిన కోరిక. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వారిని ఆ రోజే పాతిపెడుతారు. ఒకవేళ ఆ వ్యక్తి తండ్రి ఇంకా బ్రతికి ఉండొచ్చు. ఇక్కడ తన తండ్రి చివరి రోజుల్లో లేక సంవత్సరాలలో అతడి పోషించి వస్తానని చెప్పడానికి సభ్యోక్తిగా వాడిన వ్యక్యమై ఉండవచ్చు (యుడిబి చూడండి). ఒకవేక అతని తండ్రి అప్పటికే చనిపోయి ఉంటే కొన్ని గంటల సమయం మాత్రమే అడిగి ఉండేవాడు. అపార్ధలు రాకుండా ఉండాలంటే, అవసరమైతే అతని తండ్రి చనిపోయాడో లేదో కూడా వివరించండి. (సభ్యోక్తి చూడండి).

● మృతులు తమ మృతులను పాతి పెట్టుకోననిమ్మని చెప్పెను

ఇవి క్లుప్తంగా కఠినంగా వాక్యాన్ని పూర్తిచేయకుండా చెప్పిన మాటలు. కాబట్టి తక్కువ పదాలను వుపయోగించి తక్కువగా వివరించండి. ఆ వ్యక్తి "పాతిపెట్టడానికి" అడిగిన పదజాలాన్నే ఇక్కడ కూడా వాడండి.

● పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను

ఆ వ్యక్తి తన బాధ్యతను నెరవేర్చకుండా చేసే కఠినమైన మాటలు ఇవి. "చనిపోయిన వారిని వారే పాతిపెట్టుకోనివ్వు" లేక "చనిపోయినవారిని పాతిపెట్టుకోవడానికి అనుమతివ్వు" అన్నవాటి కంటే కటినమైన మాటలు. దీని మరోలా "చనిపోయినవారినే తమ తర్వాత చనిపోయేవారిని పాతిపెట్టుకోనిమ్ము" అన్న వాక్యంగా అనుకోవచ్చు.

● మృతులు. తమ మృతులను

"మృతులు" అంటే దేవుని రాజ్యానికి దూరంగా నిత్య జీవం లేకుండా ఉండేవారిని ఉద్దేశించిన రూపకం (యు డి బి చూడండి: రూపకాలంకారం). "తమ మృతులు" అంటే దేవుని రాజ్యానికి బయట ఉన్న వారి చనిపోయిన బంధువులు అని అర్ధం.

Matthew 8:23

యేసు తుఫానును ఆపిన సంఘటన వివరాలు మొదలవుతాయి.

● దోనె యెక్కి

"యేసు పడవలోకి ఎక్కాడు."

● ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి

8:22 లో ఉపయోగించినట్టు "శిష్యులు", "అనుచరులు" అన్న పదాలనే ఇక్కడ ఉపయోగించడానికి ప్రయత్నించండి.

● అంతట

పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు.

● సముద్రం మీద తుఫాను లేచినందున

"సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది."

● ఆ దోనె అలల చేత కప్పబడెను

"కాబట్టి అలలు దోనెను కప్పేసాయి. (కర్త లేక కర్మ ప్రధానంగా ఉన్న వ్యాక్యాలను చూడండి).

●మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి

ఆయనను వారు "రక్షించు"మనే మాటలతో లేప లేదు గాని, మొదట ఆయనను లేపి తర్వాత "రక్షించుమని" అడిగారు.

●నశించిపోవుచున్నాము

"మేము చనిపోబోతున్నాము."

Matthew 8:26

యేసు తుఫానును ఆపిన సంఘటన ఇక్కడ పూర్తవుతుంది.

● వారు

శిష్యులు

● లారా. వారితో

బహువచనం

● ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి

యేసు ఇక్కడ అలంకారిక ప్రశ్నిస్తూ శిష్యుల్ని మందలిస్తున్నాడు. దీనర్ధం "మీరు భయపడకూడదు” (యుడిబి చూడండి). లేక "మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు" అని. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● అల్ప విశ్వాసులారా

ఇది బహువచనం. 6:30 లో ఉన్న ఇవే పదాలను అనువదించినట్టే ఇక్కడ అనువదించండి.

● ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి

ఈ చాతుర్యవాక్యం శిష్యులు ఎంత ఆశ్చర్య పడ్డారో చెబుతుంది. దీన్నే ఇలా "గాలి, సముద్రం కూడా ఈయన మాట వింటున్నాయి! ఈయన ఎలాంటి మనిషో కదా" అని లేక "ఎలాంటి మనిషిని మనం ఇంతవరకు చూడలేదు! గాలి అలలు కూడా ఈయన మాట వింటున్నాయి" అని రాయొచ్చు. (అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● గాలి, సముద్రము ఈయన మాట వింటున్నాయి

మనుషులూ, జంతువులూ మాట వినడం, వినకపోవడం ఆశ్చ్యరం కాదు గానీ, గాలి, నీళ్ళు మాట వినడం చాలా ఆశ్చ్యరం., మనుషుల్లాగే ప్రకృతిలోనివి మాట విని చేసే శక్తి ఉందని ఈ మానవీకరణ వాక్యం వివరిస్తుంది. (మానవీకరణ చూడండి).

Matthew 8:28

యేసు దయ్యాలు పట్టిన ఇద్దరు మనుష్యులను బాగు చేసిన సంఘటన వివరాలు మొదలవుతాయి.

● అద్దరినున్న

"గలీల సముద్రము అవతలి వైపున ఉన్న"

● గదరేనీయుల దేశము

గదరా దేశము లో నివసిస్తున్నందున వారికి గదరేనీయులు అని పేరు వచ్చింది. (పేర్లను అనువదించడం చూడండి).

● వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేక పోయెను

ఆ ఇద్దరు మనుషులను పట్టిన దయ్యాలు చాలా భయంకరమైనవి కాబట్టి వారున్న ప్రాంతం ద్వారా ఎవరూ వెళ్ళలేక పోయేవారు.

● ఇదిగో

పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు.

● ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి?

మొదట అలంకారిక వేసిన ఈ ప్రశ్న చాలా వ్యతిరేక భావంతో నిండి వుంది. (యుడిబి, అలంకారిక ప్రశ్నలు, చూడండి).

● దేవుని కుమారుడా

యేసు ఎవరో చెబుతూ అందుకనే అతడిని రావాలని కోరుకోవడం లేదని చెప్పడానికి దయ్యాలు ఈ సంబోధన చేస్తున్నాయి.

● కాలం రాక మునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా?

రెండవసారి వేస్తున్న ఈ చాతుర్య ప్రశ్న కూడా వ్యతిరేక భావంతోనే ఉంది. దీనర్ధం "దేవుడు మమల్ని శిక్షించడానికి నియమించిన సమయానికంటే ముందు వచ్చి మమ్మల్ని శిక్షించి దేవుడిని వ్యతిరేకించ వద్దు” అని.(అలంకారిక ప్రశ్నలు, చూడండి).

Matthew 8:30

యేసు దయ్యాలు పట్టిన ఇద్దరు మనుష్యులను బాగు చేసిన సంఘటన వివరాలు కొనసాగుతాయి.

● అప్పుడు

ఇక్కడ కథ కొనసాగించడానికి ముందే పాఠకుడికి అవసరమైన సమాచారాన్ని రచయిత అందిస్తున్నాడు. యేసు అక్కడికి రావడానికి ముందే పందులు ఉన్నాయి. (సంఘటనల క్రమం చూడండి).

● నీవు మమ్మును వెళ్ళగొట్టిన యెడల

దీనర్ధం "నీవు మమ్మల్ని వెళ్ళగొడతావు కాబట్టి" అని కూడా కావొచ్చు.

● మమ్మును

ప్రత్యేకత (ప్రత్యేకత చూడండి).

● వాటిని

ఈ మనిషిలోని దయ్యాలు.

● అవి ఆ మనుష్యులను వదిలి పెట్టి ఈ పందుల లోనికి పోయెను

" ఆ దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పందులలోకి వెళ్ళాయి."

● ఇదిగో

ఇక్కడ "ఇదిగో" అంటే తర్వాత జరిగే ఆశ్చ్యర సంఘటనల వైపు మన దృష్టిని మళ్ళించడం.

● ప్రపాతము నుండి వడిగా

"ఏటవాలుగా ఉన్న ప్రాంతంనుండి త్వరగా కిందకు జారాయి."

● నీళ్ళలో పడి చచ్చెను

"మునిగిపోయాయి"

Matthew 8:33

యేసు దయ్యాలు పట్టిన ఇద్దరు మనుష్యులను బాగు చేసిన సంఘటన ఇక్కడ పూర్తవుతుంది.

● వాటిని మేపుచున్నవారు

"పందులను కాపలా కాస్తున్న వారు"

● జరిగిన కార్యములన్నియు, దయ్యాలు పట్టినవారి సంగతియు

దయ్యాల స్వాధీనంలో ఉన్న వ్యక్తులకు యేసు ఏంచేసాడో.

● ఇదిగో

పెద్ద కథలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పడానికి దీని ఉపయోగించారు. ఇంతకు ముందు సంఘటనల్లోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరే వ్యక్తులు కనిపించవచ్చు. మీ భాషలో దీనికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పే విధానం ఉండొచ్చు.

● ఆ పట్టణస్తులందరు

దీనర్ధం ఆ పట్టణంలోని ప్రజలందరూ అని కాదు. చాలా మంది లేక ఎక్కువ మంది అని.(అతిశయ వాక్యాలు చూడండి).

● ప్రాంతాలు

"ఆ పట్టణం దాని చుట్టూ పక్కల ప్రదేశాలు."