Matthew 3

Matthew 3:1

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.

● అయితే అతడు విని

"యోసేపు విని."

● అతని తండ్రి అయిన హేరోదు

ఇతను అర్కేలాయు తండ్రి.

● అతడు అక్కడకు వెళ్ళ వెరచి

ఇక్కడ "అతడు" అంటే యోసేపు.

● ఆయన నజరేయుడనబడునని

ఇక్కడ "ఆయన" అంటే యేసు.

Matthew 3:4

బాప్తిస్మమిచ్చు యోహాను బోధ కొనసాగుతున్నది

● అతనిచేత బాప్తిస్మం పొందుచుండిరి

"యోహాను వారికి బాప్తిస్మమిచ్చెను." (కర్త లేక కర్మ ప్రధాన వాక్య ప్రయోగాలు చూడండి.).

● వారు

యెరూషలేము, యూదా దేశంలోని వారు, యోర్దాను తీర ప్రాంతంలోని ప్రజలు.

Matthew 3:7

బాప్తిస్మమిచ్చే యోహాను బోధ కొనసాగుతున్నది.

● సర్ప సంతానమా

దీనికి బదులు "దుష్టులైన విష సర్పాల్లారా" లేక "మీరు విష సర్పాల వంటి దుష్టులైన వారు" అని రాయొచ్చు. (రూపకాలంకారం చూడండి).

● రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?

ఇక్కడ యోహాను అలంకారిక ప్రశ్నవేసి ఆ ప్రజలను గద్దిస్తున్నాడు. ఎందుకంటే వారు పాపం చేయడం మానుకోవడానికి ఇస్ష్టంగా లేరు కాని దేవుని శిక్షను తప్పించుకోవడానికి బాప్తిస్మము ఇమ్మని అతడిని అడుగుతున్నారు. (అలంకారిక ప్రశ్నలు చూడండి).

● రాబోవు ఉగ్రతను

"రాబోయే శిక్షను” లేక "దేవుడు కోపించి తీసుకునే చర్యనుంచి" లేక "దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు కాబట్టి," అని రాయొచ్చు. ఉగ్రత అనే పదాన్ని ఇక్కడ దేవుని శిక్షను గురించి వాడుతున్నారు. ఎందుకంటే ఆయన ఉగ్రత శిక్షకు దారితీస్తుంది. (విశేషణ ప్రయోగం అన్యాపదేశం చూడండి).

● అబ్రాహాము మాకు తండ్రి

"అబ్రాహాము మాకు పూర్వీకుడు" లేక "మేము అబ్రాహాము వారసులము"

● దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని

"దేవుడు ఈ రాళ్లనుంచి కూడా మనుష్యులను పుట్టించి వారిని అబ్రాహామునకు వారసులుగా చేయగలడు"

Matthew 3:10

బాప్తిస్మమిచ్చు యోహాను బోధ కొనసాగుతున్నది

● ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇది "మీరు మీ పాపపు ప్రవర్తన మానుకోక పోతే ఒక వ్యక్తి చెట్టును నరకడానికి ఎలాగైతే వేరుపై గొడ్డలి పెట్టి సిద్ధంగా ఉన్నాడో అలాగే మిమ్మల్ని శిక్షించడానికి దేవుడు సిద్దంగా ఉన్నడు" అని చెప్పే ఒక ఉపమాన వాక్యం.(రూపకాలంకారం చూడండి).

● నేను మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను

పశ్చాత్తాపము చెందినవారికి యోహాను బాప్తిస్మ మిస్తున్నాడు.

● ఆయితే నా వెనుక వచ్చుచున్నవాడు

యోహాను వెనుక వస్తున్న వ్యక్తి యేసు.

● ఆయన పరిశుద్దాత్మలోను, అగ్నిలోను మీకు బాప్తిస్మమిచ్చును

ఇది "దేవుడు మీలో తన పరిశుద్దాత్మను నింపి మిమ్మల్ని అగ్ని ద్వారా పరీక్షించి పవిత్ర పరచి దేవుని రాజ్యంలోకి చేరుస్తాడు" అని చెప్పే ఒక ఉపమాన వాక్యం. (రూపకాలంకారం చూడండి).

● ఆయన మీకు బాప్తిస్మము ఇస్తాడు

యేసు మీకు బాప్తిస్మము ఇస్తాడు.

● ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి

ఒక వ్యక్తి ఎలాగైతే గోదుమ గింజలను, పొట్టును వేరు చేస్తాడో అలాగే క్రీస్తు నీతిమంతులను, అనీతిమంతులను వేరు చేస్తాడని పోల్చి చెప్పే ఉపమానవాక్యం. ఈ ఉపమానాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి "క్రీస్తు తన చేతిలో చేటను పట్టుకున్నవ్యక్తి లాగా ఉన్నాడు.” (రూపకాలంకారం చూడండి).

●ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది

"క్రీస్తు చేట పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు"

● చేట

గోదుమల్ని గాల్లో పైకి ఎగురవేసి గోదుమ గింజలను, పొట్టును వేరుచేయడానికి ఉపయోగించే పనిముట్టు. పనికిరాని పొట్టు గాలికి చెదరిపోయి బరువైన గింజలు కిందకు పడతాయి.

● ఆయన కళ్ళము

మనుషులు గోదుమలను పొట్టును వేరుచేసే స్థలం ఇది. "అతని స్థలము" అంటే "అతను గింజలను, పొట్టును వేరుచేసే స్థలం."

● ఆయన గోదుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయును

ఇది దేవుడు ఏవిధంగా నీతిమంతులను, దుష్టులను వేరు చేస్తాడో పోల్చి చెప్పే ఉపమానవాక్యం. రైతు కొట్లలో చేరే గోదుమల్లాగా నీతిమంతులు పరలోకానికి చేరుతారు, పొట్టులాంటి దుష్టులను దేవుడు ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. (ఉపమాలంకారం Simile చూడండి).

Matthew 3:13

బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తిస్మము ఇచ్చిన వివరాలు ఇక్కడ మొదలవుతాయి.

● నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా

ఇక్కడ "నేను" అంటే బాప్తిస్మమిచ్చు యోహాను "నీ" అంటే యెసు.

● నీవు నా యొద్దకు వచ్చుచున్నావా?

ఇది అలంకారిక ప్రశ్న. దీన్నే మరొక విధంగా "నీవు పాపం చేయలేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి బాప్తిస్మము పొందాల్సిన అవసరం లెదు" అని కుడా తర్జుమా చేయవచ్చు.

● నేను" అంటే బాప్తిస్మమిచ్చు యోహాను "నీవు " అంటే యెసు అని గుర్తించాలి. (అలంకారిక ప్రశ్నలు అలంకారిక ప్రశ్న చూడండి).

Matthew 3:16

యేసు యోహాను చేత ఎలా బాప్తిస్మము పొందాడో ఆ వివరాలు ఇక్కడ ఉంటాయి.

● యేసు బాప్తిస్మము పొందిన వెంటనే

దీన్నే “యేసు యోహాను చేత బాప్తిస్మము పొందిన వెంటనే" అని అనువదించవచ్చు.

● ఇదిగో ఆకాశము తెరవబడెను

"ఆకాశము తెరవబడుట ఆయన చూచెను" లేక "పరలోకము తెరువబడుట ఆయన చూచెను." (కర్త లేక కర్మ ప్రధాన వాక్యాలను చూడండి.).

● పావురం వలె దిగివచ్చుట

దీన్ని 1). ఆత్మ పావురంలా ఉందని సులభ వాక్యంగాను (యుడిబి చూడండి). 2). పావురంలా దేవుని ఆత్మ యేసు పైకి చాలా మృదువుగా దిగివచ్చినట్లు పొల్చిచెప్పవచ్చు. (ఉపమాలంకారం చూడండి).

● ఇదిగో

పెద్ద కథలో మరొక సంఘటన ఆరంభాన్ని ఇది సూచిస్తున్నది. ఇప్పటిదాకా చెప్పిన దానిలోని వారు కాక వేరే వ్యక్తులు ఇందులో ఉండవచ్చు. దీన్ని సూచించడానికి మీ భాషలో వాడవలసిన పదం వాడండి.