Matthew 2

Matthew 2:1

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతులను ఈ అధ్యాయంలో వివరిస్తారు.

యూదా బెత్లేహేము

"యూదా దేశంలోని బెత్లేహేము పట్టణం” (యుడిబి).

జ్ఞానులు

"నక్షత్ర శాస్త్రాన్ని ఆధ్యయనం చేసినవారు" (యుడిబి).

హేరోదు

ఇక్కడ హేరోదు మహారాజు అని అర్థం.

యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? భవిష్యత్తులో రాజు కాబోతున్న వ్యక్తి పుట్టాడని వారికి తెలుసు. అతడు ఎక్కడ ఉన్నాడో కనుగొనడానికి వారు ప్రయత్నిస్తున్నారు. "యూదులకు రాజు కాబోతున్న వ్యక్తి పుట్టాడు. అతడు ఎక్కడ ఉన్నాడు?"

ఆయన నక్షత్రం

"ఆయనను గురించి తెలిపే నక్షత్రం" లేక "ఆయన పుట్టకకు సంబంధించిన నక్షత్రం." ఆ నక్షత్రానికి అతనే సొంతదారుడు అని వారు చెప్పడం లేదు.

పూజించు

ఈ పదాన్ని కింది అర్ధాలలో అనువదించవచ్చు.

1). ఆ బిడ్డను "దేవత్వము" కలిగినవాడిగా వారు భావించి ఆరాధించాలని అనుకొన్నారు.

2). మానవులందరికీ రాజుగా వారు ఆయనను గుర్తించి "గౌరవించాలని" అనుకున్నారు.

మీ భాషలో ఈ రెండు అర్ధాలను ఇచ్చే పదం ఉంటే దాన్ని ఇక్కడ ఉపయోగించడానికి ప్రయత్నించండి.

అతడు కలవరపడ్డాడు

తనకు బదులుగా మరొకరు యూదుల రాజు అవుతాడని "అతడు ఆందోళన చెందాడు."

యెరూషలేమంతా

హేరోదు రాజు ఏమి చేస్తాడో అని "యెరూషలేములో చాలామంది ప్రజలు (యు డి బి)" భయపడ్డారు.

Matthew 2:4

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.

● యూదాలోని బెత్లేహేము

""యూదా లోని బెత్లేహేము పట్టణం"

● ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి.

దీన్నే కర్తరీ ప్రయోగంలో "ప్రవక్త ఇలా రాశాడు" అని రాయొచ్చు.

● ప్రవక్త ద్వారా వ్రాయబడింది. దీన్నే "మీకా ప్రవక్త ద్వారా రాయబడింది" లేక "మీకా ప్రవక్త రాశాడు." అని రాయొచ్చు.

●యూదా దేశపు బెత్లేహీమా. నీవు యూదా ప్రదానులలో ఎంత మాత్రంను అల్పమైనదానవు కావు

"బెత్లేహేము పట్టణ ప్రజలారా మీ ఊరు చాలా గొప్పది” (యుడిబి). " ఓ బెత్లేహేమా, అతి ప్రాముఖ్యమైన పట్టణాలలో నీవు ఒక దానివి." (అవాంతర సంబోధన చూడండి). (న్యూనోక్తి చూడండి).

Matthew 2:7

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతులు వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది

● అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి

అంటే ఇతర మనుష్యులెవారికీ తెలియకుండా హేరోదు జ్ఞానులతో మాట్లాడాడు.

● ఆ శిశువు

దీనర్దం పసిపాప అయిన యేసు అని.

● పూజించు

1:2 లో వాడిన పదాలనే ఇక్కడ వాడండి.

Matthew 2:9

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది

● వారు రాజు మాట విని

"తరువాత" (యుడిబి). లేక "జ్ఞానులు రాజు మాట విన్న తరువాత."

● వారికి ముందుగా నడిచెను

"వారికి దారి చూపించింది."

● మీదుగా వచ్చి నిలుచు వరకు

"మీదుగా ఆగింది." లేక "పైన ఆగింది."

Matthew 2:11

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.

● వారు

అంటే జ్ఞానులు.

● పూజించు

1:2 లో వాడిన పదాలనే ఇక్కడ వాడండి.

Matthew 2:13

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.

● వారు తిరిగి వెళ్ళిరి

"జ్ఞానులు తిరిగి వెళ్లారు."

● లేచి, తీసుకొని. పారిపోయి.అక్కడే యుండుమని

దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏకవచనాన్నే ఉపయోగించాలి.( 'నీవు' రూపాలు చూడండి).

● హేరోదు మరణం వరకు

హేరోదు 2:19 లో మరణిస్తాడు. ఇది వారు ఐగుప్తులో నివసించిన కాలాన్ని తెలుపుతుంది. అంతేకానీ హేరోదు వెంటనే మరణించాడని కాదు.

● ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని

ఇది హోషయా 11:1 నుండి తీసుకున్న వాక్యం. మత్తయిలోని గ్రీకు వాక్యాలకు హోషయాలోని హీబ్రూ వాక్యాలకు మధ్య కొంత తేడా ఉంది. ఇక్కడ వేరే ప్రాంతం నుండి కాదు, "ఐగుప్తులో నుండి" అన్న విషయాన్ని నొక్కి చెబుతున్నారు.

Matthew 2:16

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.

● అప్పుడు హేరోదు

యోసేపు మరియ, యేసులు ఐగుప్తుకు వెళ్ళిన తరువాత హేరోదు ఏంచేశాడో ఇక్కడ చెబుతారు. హేరోదు 2:19 వరకు జీవించి ఉన్నాడు.

● తన్ను అపహసించిరని

"జ్ఞానులు తనను మోసం చేసి నవ్వులపాలు చేసారని" (యుడిబి).

● అతను మగ శిశువులందరిని వధించాడు

"మగ బిడ్డలను అందరిని వధించమని అతడు ఆజ్ఞాపించాడు" లేక "మగ బిడ్డలను అందరిని వధించమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు." (యుడిబి).

Matthew 2:17

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది. ఇక్కడ 18 వాక్యం యిర్మియా 31:15 నుండి తీసుకున్నది. అయితే గ్రీకులో ఉన్న మత్హయి వాక్యంలోని పదాలకు, హీబ్రూ లో ఉన్న యిర్మియా వాక్యంలోని పదాలకు మధ్య కొంత తేడా ఉంది.

Matthew 2:19

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.

● ఇదిగో

పెద్ద కథలో మరో కొత్త మలుపు తిరగడానికి ఇది గుర్తు. ఇంతకు ముందు సంఘటనలోని వ్యక్తులు కాకుండా ఇక్కడ వేరేవారి ప్రస్తావన వస్తుంది. మీ భాషలో దీన్ని బహుశా వేరే విధంగా చెప్పే అవకాశము ఉండొచ్చు.

● శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు

"పసి బాలుడిని చంపాలని చూసినవారు" (సభ్యోక్తి గురించి చూడండి.).

Matthew 2:22

యూదుల రాజుగా యేసు పుట్టినప్పుడు జరిగిన సంగతుల వివరణ ఈ అధ్యాయంలో కొనసాగుతున్నది.

● అయితే అతడు విని

"యోసేపు విని."

● అతని తండ్రి అయిన హేరోదు

ఇతను అర్కేలాయు తండ్రి.

● అతడు అక్కడకు వెళ్ళ వెరచి

ఇక్కడ "అతడు" అంటే యోసేపు.

● ఆయన నజరేయుడనబడునని

ఇక్కడ "ఆయన" అంటే యేసు.