Names

**కొరింతు, కొరింతియులు

వాస్తవాలు:

కొరింతు గ్రీసు దేశంలో/పు ఒక పట్టణం. ఏథెన్సుకు సుమారు 50 మైళ్ళు పశ్చిమాన ఉంది. కొరింతులో నివసించే వారు కొరింతీయులు లైఉన్నారు.

  • కొరింతు అదిమ క్రైస్తవ సంఘాలు ఉన్నా ఒక ప్రాంతం.
  • కొత్త నిబంధన పుస్తకాలైన, 1 కొరింతి 2 కొరింతి పౌలు కొరింతులో నివసిస్తున్న  క్రైస్తవులకు రాసిన పత్రికలు.
  • తన మొదటి/రెండవ మిషనెరీ/సువార్త దండయాత్ర ప్రయాణంలో, పౌలు కొరింతులో దాదాపు 18 నెలలు ఉన్నాడు.
  • పౌలు అక్కడ అకుల, ప్రిస్కిల్ల అనే విశ్వాసులను కలుసుకున్నాడు.
  • కొరింతుతో సంబంధం ఉన్న ఇతర తొలి సంఘ నాయకులు తిమోతి, తీతు, అపొల్లో, సీల.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అపొల్లోతిమోతితీతు)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1 కొరింతి 01:03
  • 2 కొరింతి 01:23-24
  • 2 తిమోతి 04:19-22
  • అపో. కా. 18:01

పదం సమాచారం:

  • Strong's: G28810, G28820

** ఆదాము

** వాస్తవాలు:

ఆదాము దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తి. అతడు, అతని భార్య హవ్వ దేవుని పోలికలో చెయ్యబడ్డారు.

  • దేవుడు ఆదామును దుమ్ము నుండి చేసి అతనిలోకి జీవం ఊదాడు.
  • ఆదాము పేరు "ఎర్ర మట్టి” లేక “నేల"అని అర్థం ఇచ్చే హీబ్రూ పదానికి దగ్గరగా ఉంది.
  • "ఆదాము"అనే పేరు "మానవ జాతి” లేక “మానవుడు"అనే పాత నిబంధన పదం అయింది.
  • మనుషులంతా ఆదాము, హవ్వల సంతానం.
  • ఆదాము, హవ్వలు దేవునికి లోబడలేదు. ఇది వారిని దేవునికి దూరం చేసి పాపం, మరణం లోకంలోకి వచ్చేలా చేసింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: death, descendant, Eve, image of God, life)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __1:9__అప్పుడు దేవుడు అన్నాడు, "మానవులను మన పోలికలో మనవలే ఉండునట్లు చేయుదము."
  • 1:10 ఈ మనిషి పేరు ఆదాము. దేవుడు ఒక తోట నాటి, అక్కడ ఆదాము నివసించి దాన్ని సాగు చేసేలా నియమించాడు.
  • __1:12__అప్పుడు దేవుడు చెప్పాడు, "మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు." కానీ జంతువులు ఏవీ ఆదాము తోడు కాలేదు.
  • __2:11__దేవుడు ఆదాము హవ్వలకు జంతువు చర్మాలు తొడిగాడు.
  • __2:12__కాబట్టి దేవుడు ఆదాము హవ్వలను ఆ అందమైన తోటనుండి వెళ్ళగొట్టాడు.
  • 49:8ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, అది వారి సంతానంపై కూడా ప్రభావం చూపింది.
  • __50:16__ఎందుకంటే ఆదాము హవ్వ దేవునికి లోబడలేదు. వారు ఈ లోకంలోకి పాపాన్ని తెచ్చారు. దేవుడు దాన్ని శపించి దాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H0120, G00760

#బయెల్జెబూలు

వాస్తవాలు:

బయెల్జెబూలు సాతాను లేక దెయ్యానికి మరొకపేరు. దీన్నే "బెయేల్జెబూబు"అని కూడా రాస్తారు.

  • దీని అర్థం "కీటకాల ప్రభువు" అంటే "దయ్యాల అధిపతి." అయితే ఈపదాన్ని దీని మూలార్థంతో కాక శబ్దార్థం ప్రకారం అనువదించడం మంచిది.

  • ఎవరిని ఉద్దేశించి  ఈపదం వాడారో స్పష్టంగా అర్ధమవ్వడానికి దీన్ని "బయెల్జెబూలు పిశాచి"అని కూడా తర్జుమా చెయ్యవచ్చు.

* ఎక్రోనులోనిఅబద్ధ దేవుడైన "బయలు-జెబూబు"తో ఈపేరుకు సంబంధం ఉంది.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమాచేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: దయ్యం, ఎక్రోను, సాతాను)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G09540

#బోయజు

వాస్తవాలు:

బోయజు న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో నివసించిన ఇశ్రాయేలీయుడు. మోయాబీయురాలైన రూతును పెండ్లిచేసుకొని ఇతడు రాజైన దావీదుకు, యేసుక్రీస్తుకు పూర్వీకుడు అయ్యాడు.

  • మోయాబులో భర్త, కుమారులు చనిపోయాక ఇశ్రాయేలుకు తిరిగి వచ్చిననయోమి అనే పేరు గల ఇశ్రాయేలు స్త్రీకి బంధువు.

  • బోయజువితంతువుగా ఉన్న నయోమికోడలైన రూతును పెళ్ళాడడం ద్వారా ఆమెకు ఒక భవిష్యత్తు, భర్త, పిల్లలను ఇచ్చి ఆమెను “విమోచించాడు.”

  • అతడు యేసు మనల్ని పాపం నుండి ఎలావిమోచించాడో దానికి సూచనగా ఉన్నాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: మోయాబు, విమోచించు, రూతు)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1162

#కైసరు

##వాస్తవాలు:

"కైసరు"అనే పేరు రోమా సామ్రాజ్య పాలకులకు ఉపయోగిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ పేరుతో ముగ్గురు రోమా అధిపతులను చూడవచ్చు.

  • మొదటి రోమా అధిపతి "కైసరు ఔగుస్తు," యేస జన్మించిన సమయంలో పరిపాలిస్తున్నాడు.

  • దాదాపు ముఫ్ఫై సంవత్సరాల తరువాత బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటిస్తున్న సమయంలో తిబెరి కైసరు రోమా సామ్రాజ్య పాలకుడుగా ఉన్నాడు.

  • కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇమ్మన ప్రజలకు యేసు చెప్పినప్పుడు కూడా తిబెరి కైసరు పరిపాలిస్తున్నాడు.

  • పౌలు కైసరుకే చెప్పుకుంటానని అన్నప్పుడు ఉన్న రోమ చక్రవర్తి నీరో,ఇతడు కైసరు అనే పేరుతో పిలవబడ్డాడు.

  • “కైసరు"అను బిరుదు/నామం ఉపయోగించినప్పుడు "చక్రవర్తి” లేక “రోమా అధిపతి అని తర్జుమా చెయ్యవచ్చు".

  • కైసరు ఔగుస్తు,లేక తిబెరి కైసరు, అని చెప్పబడిన సందర్భాల్లో "కైసరు" అనే పేరును జాతీయ భాషలో చెప్పబడవచ్చు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: రాజు, పౌలు, రోమ్)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G25410

#కయప

వాస్తవాలు:

కయప బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు జీవించిన కాలంలో ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు.

  • యేసు న్యాయ విచారణ, మరణ శిక్ష విధించడంలో కయప కీలక పాత్ర పోషించాడు.

  • పేతురు, యోహానులు ఒక అవిటి మనిషిని బాగు చేయడం వలన బంధించబడినప్పుడు జరిగిన న్యాయ విచారణలోఅన్న, కయపలు ప్రధాన యాజకులుగా ఉన్నారు.

  • మొత్తం జాతి అంతా నశించడం కంటే, వారందరికోసం ఒక్క మనిషి నశించడం మంచిది అనే మాటను కయప చెప్పాడు. యేసు తన ప్రజలను రక్షించడానికి మరణిస్తాడు అను ప్రవచన సారాంశంగాదేవుడే అతనితో ఆ మాట పలికించాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: అన్న, ప్రధాన యాజకుడు)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G25330

వాస్తవాలు:

యాకోబు జెబెదయి కుమారుడు. యేసు పన్నెండుమంది అపోస్తలుల్లో ఒకడు. అతని తమ్ముడు యోహాను. యితడు కూడా యేసు అపోస్తలుల్లో ఒకడు.

  • యాకోబు, అతని సోదరుడు యోహాను వారి తండ్రి జెబెదయితో కలిసి చేపలు పడుతున్నారు.
  • యాకోబు, యోహానులకు "ఉరుము కుమారులు," అని పేరు.బహుశా వారు కోపధారులు.
  • పేతురు, యాకోబు, యోహాను యేసు అత్యంత సన్నిహితమైన శిష్యులు. యేసు కొండపై ఏలియా, మోషేతో మాట్లాడడం, చనిపోయిన బాలికను తిరిగి బ్రతికించడం మొదలైన ఆశ్చర్యకరమైన సంఘటనలు వారు చూశారు.
  • వేరొక యాకోబు బైబిల్లో ఒక పత్రిక రాశాడు. కొన్ని భాషల్లో వారి పేర్లు వేరుగా ఉండవచ్చు వీరు వేరువేరు మనుషులు అని చెప్పడానికి ఇలా చేశారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: apostle, Elijah, James (brother of Jesus), James (son of Alphaeus), Moses)

బైబిల్ రిఫరెన్సులు:

వాస్తవాలు:

పదం సమాచారం:

  • Strong’s: G23850

వాస్తవాలు:

యాపెతు నోవహు ముగ్గురు కుమారులుల్లో ఒకడు.

  • ప్రపంచ వ్యాప్తమైన వరద భూమి అంతటినీ ముంచెత్తినప్పుడు యాపెతు తన ఇద్దరు సోదరులుతో, వారి భార్యలతో సహా ఓడలో నోవహుతో ఉన్నారు.
  • నోవహు కుమారుల జాబితా సాధారణంగా, "షేము, హాము, యాపెతు" అని ఉంటుంది. ఇది యాపెతు కనిష్ట సోదరుడు అని తెలుపుతున్నది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: మందసం, వరద, హాము, నోవహు, షేము)

బైబిల్ రిఫరెన్సులు:

వాస్తవాలు:

పదం సమాచారం:

  • Strong's: H3315

#కాదేషు, కాదేషు-బర్నేయ, మెరిబాకాదేషు#

##వాస్తవాలు:##

కాదేషు, కాదేషు-బర్నేయ, మెరిబా కాదేషు అనే పేర్లన్నీ ఇశ్రాయేలు చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన పట్టణాన్ని ూచిస్తున్నాయి, ఇది ఎదోము ప్రాంతానికి దగ్గరగా ఇశ్రాయేలు దక్షిణ భాగంలో ఉంది.

  • కాదేషు పట్టణం ఒక నీటి ఊటగా ఉండేది. సీను ఎడారి మధ్యలో నీరు, సారవంతమైన నేల ఉన్న స్థలం.
  • కనాను భూభాగాన్ని వేగు చూడడానికి మోషే కాదేషు బర్నేయ నుండి వేగులను పంపించాడు.
  • ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచారం చేస్తున్న సందర్భంలో ఇది ప్రసిద్ధమైన మజిలి.
  • కాదేషు బర్నేయలో మిర్యామును సమాధి చేసారు.
  • మెరిబా కాదేషు వద్ద ఇశ్రాయేలీయులకు నీరు పొందడానికి దేవుడు చెప్పిన విధంగా నీరున్న బండతో మాట్లాడడానికి బదులు ఆ బండను కొట్టడం ద్వారా మోషే దేవునికి అవిధేయుడయ్యాడు.
  • ”కాదేషు” అనే పేరు హెబ్రీ పదం నుండి తీసుకోబడింది, అంటే “పవిత్రం” లేక “ప్రతిష్టితం” అని అర్థం.

(అనువాదం సూచనలు: పేర్లను ఏ విధంగా అనువదించాలి)

(చూడండి: ఎడారి, ఎదోము, పవిత్రం)

##బైబిలు రిఫరెన్సులు:##

పదం సమాచారం:

  • Strong's: H4809, H6946, H6947

#కేదారు#

##వాస్తవాలు##

కేదారు ఇష్మాయేలు రెండవ కొడుకు. ఇది ఒక ప్రాముఖ్యమైన పట్టణం, అతని పేరును బట్టి ఈ పట్టణానికి పేరు ఇవ్వబడియుండవచ్చు.

  • కేదారు పట్టణము పాలస్తీనా దక్షిణపు భాగం వద్దగల అరేబియా ఉత్తర ప్రాంతంలో ఉంది. బైబిలు కాలంలో ఇది గొప్పతనానికి, అందానికి మారు పేరుగా ఉండేది.
  • కేదారు సంతానం ఒక పెద్ద ప్రజా గుంపుగా తయారయ్యారు. ఆ గుంపును “కేదారు” అని పిలుస్తారు.
  • ”కేదారు వారి నల్లని డేరాలు” అనే వాక్యం కేదారు ప్రజలు నివసించిన మేకలను మేపే నల్లని గుడారాలను సూచిస్తున్నాయి.
  • ఈ ప్రజలు గొర్రెలను, మేకలను పెంచుతారు. రవాణా కోసం వారు ఒంటెలను కూడా వినియోగించారు.
  • బైబిలులో “కేదారు మహిమ” అనే పదం ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని, దాని ప్రజల గొప్పతనాన్ని సూచిస్తుంది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అరేబియా, మేక, ఇష్మాయేలు, బలి)

##బైబిలు రిఫరెన్సులు:##

పదం సమాచారం:

  • Strong's: H6938

#కెదెషు#

##వాస్తవాలు##

కెదెషు ఒకనాటి కనానీయుల రాజనగరం. ఇశ్రాయేలీయులు కనాను భూభాగంలో ప్రవేశించినప్పుడు ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకొన్నారు.

  • ఇశ్రాయేలుకు ఉత్తర ప్రాంతంలో ఈ పట్టణం ఉంది. నఫ్తాలి గోత్రానికి ఇచ్చిన భాగంలో ఈ ప్రాంతం ఉంది.
  • లేవీయులైన యాజకులు నివసించేందుకు ఏర్పాటు చెయ్యబడిన పట్టణాలలో కెదెషు ఒక పట్టణం, ఎందుకంటే వారికి స్వంతంగా ఎటువంటి భూమి లేదు.
  • ”ఆశ్రయ పట్టణం”గా కూడా ఇది ప్రత్యేకించబడింది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: కానాను, హెబ్రోను, లేవీయులు, నఫ్తాలి, యాజకుడు, ఆశ్రయపట్టణం, షెకెము, ఇశ్రాయేలు పండ్రెండు గోత్రాలు)

##బైబిలు రిఫరెన్సులు:##

పదం సమాచారం:


#ఇశ్రాయేలు రాజ్యము#

##వాస్తవాలు##

సోలోమోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు రెండు రాజ్యాలుగా విడిపోయినప్పుడు ఇశ్రాయేలు ఉత్తర భాగాన్న ఉన్న ప్రాంతం ఇశ్రాయేలు రాజ్యంగా మారింది.

  • ఉత్తరాన్న ఉన్న ఇశ్రాయేలు రాజ్యానికి పది గోత్రాలు ఉన్నాయి, దక్షిణాన్న ఉన్న యూదా రాజ్యానికి రెండు గోత్రాలు ఉన్నాయి.
  • ఇశ్రాయేలు రాజ్యానికి రాజధాని సమరయ. యూదా రాజ్య రాజధాని యెరూషలెంకు 50 కిలోమీటర్లు దూరం ఉంది.
  • ఇశ్రాయేలు రాజ్యం రాజులు అందరూ దుష్టులు. ప్రజలు విగ్రహాలను, తప్పుడు దేవతలను పూజించునట్లు వారిని ప్రభావితం చేసారు.
  • ఇశ్రాయేలు రాజ్యంపై దాడి చెయ్యడానికి దేవుడు అస్సీరియా వారిని పంపించాడు. అస్సీరియా వారు ఇశ్రాయేలులో అనేకులను తమ దేశంలో ఉండేలా బందీలుగా తీసుకొని వెళ్ళారు.
  • ఇశ్రాయేలులో మిగిలిన వారిమధ్య ఉండడానికి అస్సీరియావారు అన్యులను తీసుకొని వచ్చారు. ఈ అన్యులు ఇశ్రాయేలు వారితో పెళ్ళిళ్ళు చేసుకొన్నారు, వారి సంతానమే సమరయ ప్రజలుగా మారారు.

(చూడండి: అస్సీరియ, [ఇశ్రాయేలు[, యూదా, రాజ్యము, సమరయ)

##బైబిలు రెఫరెన్సులు: ##

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 18:08 రెహబాముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు దేశం పది గోత్రాలు తమకు రాజుగా యరోబామును నియమించుకొన్నారు. వారు తమ రాజ్యాన్ని ఉత్తరాన్న ఉన్న భూభాగంలో ఏర్పరచుకొన్నారు, దానిని ఇశ్రాయేలు రాజ్యం అని పిలిచారు.
  • 18:10 యూదా రాజ్యమూ, ఇశ్రాయేలు రాజ్యమూ శత్రువులుగా మారాయి, తరచుగా ఒకరితో ఒకరు పోరాడుకొంటూనే ఉన్నాయి.
  • 18:11 క్రొత్త ఇశ్రాయేలు రాజ్యం లో రాజులందరూ దుష్టులే.
  • 20:21 ఇశ్రాయేలు రాజ్యం , యూదా రాజ్యం రెండూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాయి.
  • 20:02 శక్తివంతమైన, క్రూరమైన అస్సీరియనుల రాజ్యం ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసింది. అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యము లో అనేకమంది ప్రజలను చంపారు, విలువైన ప్రతీ దానిని తీసుకొని వెళ్ళారు, దేశంలో అధిక భాగాన్ని కాల్చివేశారు.
  • 20:04 అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యము ఉన్న ప్రదేశంలో నివసించడానికి అన్యులను తీసుకొని వచ్చారు. పాడైపోయిన పట్టణాలను అన్యులు తిరిగి కట్టారు, అక్కడ నిలిచిపోయిన ఇస్రాయేలీయులను వివాహాలు చేసుకొన్నారు. అన్యులను వివాహం చేసుకొన్న ఇశ్రాయేలీయుల సంతానాన్ని సమరయులు అని పిలుస్తారు.

పదం సమాచారం:

  • Strong's: H3478, H4410, H4467, H4468

#యూద, యూదా రాజ్యం #

వాస్తవాలు:

ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలన్నిటిలో యూదా గోత్రం పెద్దది. యూదా రాజ్యంలో యూదా గోత్రం, బెన్యామీను గోత్రాలు ఉన్నాయి.

  • సోలోమోను చనిపోయిన తరువాత దేశము రెండు రాజ్యాలుగా విడిపోయింది. ఇశ్రాయేలు, యూదా. యూదా రాజ్యము దక్షిణ రాజ్యము, ఉప్పు సముద్రానికి పశ్చిమంగా ఉంది.
  • యూదా రాజ్యానికి ముఖ్య పట్టణం యెరూషలెం.
  • యూదా రాజ్య రాజులు ఎనిమిది మంది యెహోవా దేవునికి లోబడ్డారు, ఆయనన్ను ఆరాధించడానికి ప్రజలను నడిపించారు. ఇతర యూదా రాజులు దుష్టులుగా ఉన్నారు, విగ్రహాలను పూజించడానికి ప్రజలను నడిపించారు.
  • అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యాన్ని (ఉత్తర రాజ్యం) వారిని ఓడించిన తరువాత 120 సంవత్సరాలకు బాబులోను దేశం యూదా రాజ్యాన్ని స్వాధీనపరచుకొంది. బాబులోను వారు పట్టణాన్ని, దేవాలయాన్ని నాశనం చేసారు, యూదాలోని అనేకమందిని బబులోనుకు బందీలుగా తీసుకొని వెళ్ళారు.

(చూడండి: యూదా, ఉప్పు సముద్రం)

బైబిలు రిఫరెన్సులు

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 18:07 కేవలం రెండు గోత్రాలు మాత్రమే అతనికి (రెహబాము) నమ్మకంగా ఉన్నాయి. ఈ రెండు గోత్రాలు యూదా రాజ్యం గా మారాయి.
  • 18:10 యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యమూ శత్రువులుగా మారాయి, తరచుగా ఒకరికి ఒకరు విరోధంగా పోరాడుకొంటున్నారు.
  • 18:13 యూదా రాజులు దావీదు సంతానము. వీరిలో కొందరు రాజులు మంచి వ్యక్తులు, వారు నీతిగా పరిపాలించారు, దేవుణ్ణి ఆరాధించారు. అయితే యూదా రాజులలో అనేకులు దుష్టులు, అవినీతిపరులు, వారు విగ్రహాలను ఆరాధించారు.
  • 20:01 యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం రెండూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాయి.
  • 20:05 ఇశ్రాయేలు రాజ్యంలోని ప్రజలు దేవుని విశ్వసించక, ఆయనకు లోబడని కారణంగా దేవుడి వారిని ఏ విధంగా శిక్షించాడో యూదా రాజ్యము లోని ప్రజలు చూసారు. అయినప్పటికీ వారు ఇంకా విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు, కనానీయుల దేవుళ్ళను పూజించారు.
  • 20:06 అస్సీరియనులు ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసిన 100 సంవత్సరాల తరువాత దేవుడు యూదా రాజ్యం మీదకు దండెత్తడానికి బాబులోను రాజు, నెబుకద్నెజరును పంపాడు.
  • 20:09 నెబుకద్నెజరునూ, అతని సైన్యమూ యూదా రాజ్యము లో దాదాపు ప్రజలనందరినీ బాబులోనుకు తీసుకొని వెళ్ళాడు, పొలాలలోని పంటలకోసం అతి పేదవారిని విడిచిపెట్టారు.

పదం సమాచారం:

  • Strong's: H4438, H3063

#లాబాను #

వాస్తవాలు

పాత నిబంధనలో లాబాను యాకోబుకు మేనత్త పెనిమిటి, మామ.

  • పద్దనరాములో లాబాను ఇంట యాకోబు నివసించాడు, లాబాను కుమార్తెలను వివాహం చేసుకోడానికి షరతుగా లాబాను గొర్రెలను, మేకలను చూసుకొన్నాడు.
  • రాహేలు తన భార్య కావాలనేది యాకోబు ప్రాధాన్యత.
  • లాబాను యాకోబును మోసగించి, రాహేలును తన భార్యగా ఇవ్వడానికి ముందు మొదట తన పెద్ద కుమార్తె లేయాను పెండ్లి చేసుకొనేలా చేసాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: యాకోబు, నాహోరు, లేయా, రాహేలు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3837

#లెబానోను #

వాస్తవాలు:

ఇశ్రాయేలు ఉత్తరాన మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న అందమైన పర్వత ప్రాంతంలో లెబానోను ఉంది. బైబిలు కాలంలో ఈ ప్రాంతం సరళ మ్రానులతో గుబురుగా ఉండేది, దేవదారు, సరళ వృక్షాలు, తమాల వృక్షాలు మొదలైనవి.

  • దేవుని మందిరం నిర్మాణంలో వినియోగించడానికి దేవదారు వృక్షాలను తీసుకు రావడానికి రాజైన సోలోమోను తన సేవకులను లెబానోనుకు పంపించారు.
  • పురాతన లెబానోను ప్రాంతం ఫినికియనులతో నిండి ఉండేది, వీరు ఓడలను నిర్మించడంలో నైపుణ్యం గలవారు. వ్యాపార రంగంలో రాణించారు.
  • తూరు, సీదోను పట్టణాలు లెబానోనులో ఉన్నాయి. విలువైన ఊదారంగు అద్దకం ఈ పట్టణాలలోనే ఆరంభం అయ్యింది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: దేవదారు, సరళవృక్షం, ఫినికియ)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3844

#తిమింగలం#

వాస్తవాలు:

“తిమింగలం” (బ్రహ్మాండమైన సముద్ర ప్రాణి) అనే పదం పాతనిబంధన ఆరంభ రచనలు - యోబు, కీర్తనలు, యెషయా గ్రంధాలలో అత్యంత పెద్దదీ, అంతరించిపోయిన జంతువును సూచిస్తుంది.

  • తిమింగలం ఒక పాములాంటి పెద్దదీ, శక్తివంతమైనదీ, భయానకమైనదీ, తన చుట్టూ ఉన్న నీటిని మరగచేసే ప్రాణి అని వివరించబడింది. దీని వివరణ రాక్షసబల్లి వివరణలానే ఉంటుంది.
  • ప్రవక్త అయిన యెషయ తిమింగాలాన్ని “వంకర సర్పం” అని సూచించాడు.
  • ఈ సముద్రప్రాణిని గురించి యోబు మొదటి సమాచారాన్ని తెలియపరచాడు, యోబు కాలంలో ఆ జంతువు జీవించియుండవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: యెషయా, యోబు, సర్పము)

బైబిలు రెఫరెన్సులు:##

పదం సమాచారం:

  • Strong's: H3882

#లేవి, లేవీయుడు, లేవీయులు, లేవిసంబంధి

నిర్వచనం:

యాకోబు లేక ఇశ్రాయేలు పన్నెండు కుమారులలో ఒకడు లేవి. “లేవీయుడు” అనే పదం లేవి తమ పితరుడిగా ఉన్న ఇశ్రాయేలు గోత్రంలో ఉన్న వ్యక్తిని సూచిస్తుంది.

  • లేవీయులు దేవాలయ సంబంధ విషయాలలో బాధ్యత తీసుకుంటారు, మతపరమైన విధులు నిర్వహిస్తారు, బలులు అర్పిస్తారు, ప్రార్థనలు చేస్తారు.
  • యూదా యాజకులు అందరూ లేవీయులే. లేవీ సంతానం, లేవి గోత్రంలో భాగం. (లేవీయులందరూ యాజకులు కాదు)
  • లేవీ యాజకులు ప్రత్యేకంగా ఉన్నవారు, దేవాలయంలో దేవుని సేవించడంలో ప్రత్యేకమైన పని కోసం సమర్పించుకొన్నవారు.
  • యేసు పితరులలో ఇద్దరు “లేవి” అనే పేరు కలిగియున్నారు, లూకా సువార్తలో యేసు వంశావళిలో వారిపేర్లు ఉన్నాయి.
  • యేసు శిష్యుడు మత్తయికి కూడా లేవి అనే పేరు ఉంది.

(చూడండి:twelve tribes of Israel, priest, sacrifice, temple, Jacob, Leah, Matthew)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H3878, H3879, H3881, G30170, G30180, G30190, G30200

యోహాను మార్కు

వాస్తవాలు:

యోహాను మార్కును "మార్కు," అని కూడా అంటారు/పిలుస్తారు. సువార్త ప్రయాణాల్లో పౌలుతో ప్రయాణించిన వారిలో ఒకడు. అతడు బహుశా మార్కు సువార్త గ్రంధకర్త అయున్నడవచ్చు.

·         యోహాను మార్కు తన పిన తల్లి కుమారుడైన బర్నబా, పౌలులతో వారి మొదటి మిషనెరీ ప్రయాణంలో వెళ్ళాడు.

·         పేతురు యెరూషలేములో చెరసాలలో ఉన్నప్పుడు విశ్వాసులు అతనికోసం యోహాను మార్కు తల్లి ఇంట్లో ప్రార్థన చేశారు.

·         మార్కు అపోస్తలుడు కాదు, కాని పౌలు, పేతురు అతనికి బోధించారు మరియు వారితో కలిసి పరిచర్యలో పాల్గొన్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బర్నబాపౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

·

పదం సమాచారం:

·         Strong's: G24910, G31380


మోయాబు**,** మోయాబీయుడు

వాస్తవాలు:

మోయాబు అన్నది ఉప్పు సముద్రానికి తూర్పు  వైపున నివసించిన ఒక ప్రజల గుంపుని సూచిస్తుంది. ఆదికాండములో ఈ గుంపును మోయాబు అనే వ్యక్తి సంతతిగా చేప్తుంది. అతను లోటు పెద్దకుమార్తె  యొక్క కుమారుడు.

●   రూతు పుస్తకంలో ఎలీమెలెకు మరియు అతని కుటుంబము బేత్లెహేములోని  కరువు కారణంగా మోయాబు దేశములో  నివసించుటకీ వెళ్లిరి

●   బెత్లెహేములో ఉన్నవారు రూతును “మోయాబీయురాలు” అని పిలిచారు, ఎందుకంటే ఆమె మోయాబు దేశంలో పుట్టింది మరియు ఆ ప్రజల వద్దనుండి  వచ్చింది.

(అనువాదం సలహాలు:పేర్లను అనువదించడం ఎలా )

(చూడండి: బెత్లెహేముయూదయలోతురూతుఉప్పు సముద్రం)

బైబిలు రెఫరెన్సులు**:**

●        ఆదికాండం 19:37.

●        ఆదికాండం 36:34-36

●        రూతు 01:1-2

●        రూతు 01:22

పదం సమాచారం**:**

●        Strong's: H4124, H4125


త్రోయ

వాస్తవాలు:

త్రోయ పట్టణం ఒక ఓడ రేవు పట్టణమై ఆసియా యొక్క ప్రాచీన రోమీయుల వాయవ్యంగా తీర ప్రాంతంలో నిలకొని ఉంది.

·         పౌలు వివిధ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ కనీసం మూడు సార్లు ఈ నగరానికి వచ్చాడు.

  • త్రోయలో ఒక సందర్భంలో పౌలు రాత్రివేళ ప్రసంగిస్తూ ఉంటే ఐతుకు అనే పేరుగల యువకుడు వింటూ నిద్రలో పడి చనిపోయాడు. ఎందుకంటే అతడు తెరిచి ఉన్న కిటికీలో కూర్చున్నాడు. ఐతుకు మేడపై నుండి పడి చనిపోయాడు. దేవుని శక్తి ద్వారా పౌలు ఆ యువకుడికి జీవం తిరిగి పోశాడు.
  • పౌలు రోమాలో ఉన్నప్పుడు అతడు త్రోయలో విడిచి వచ్చిన తన పుస్తకం చుట్టలు తన అంగీ తెమ్మని తిమోతికి చెప్పాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆసియాప్రకటించు/ప్రసంగి , పరగణాలేపడంరోమ్పుస్తకం చుట్టతిమోతి)

బైబిల్ రిఫరెన్సులు:

  • 2 కొరింతి 02:13
  • 2 తిమోతి 04:11-13
  • అపో. కా. 16:08
  • అపో. కా. 20:5

పదం సమాచారం:

  • Strong's: G51740

తుకికు

వాస్తవాలు:

తుకికు పౌలు యొక్క సువార్త జతపని వారిలో/పరిచారకులలో ఒకడు.

  • పౌలు ఆసియాలో చేసిన తన సువార్త ప్రయాణాలలో ఒకదానిలో తుకికు పౌలును అనుసరించాడు/వెంబడి వెళ్ళాడు.
  • పౌలు అతన్ని "ప్రియమైన ” వానిగా, “విశ్వసనీయుడు/నమ్మకస్తుడిగా" వర్ణించాడు.
  • పౌలు రాసిన ప్రత్రికలను తుకీకు ఎఫెసుకూ, కొలస్సయికీ తీసుకొనివెళ్ళాడు.

(అనువాదం సలహాలు: పేర్లను ఎలా అనువదించాలి)

(చూడండి: ఆసియాప్రియమైన , కొలస్సీఎఫెసువిశ్వసనీయ/నమ్మకమైన, మంచి వార్త/శుభవార్త , పరిచారకుడు)

బైబిలు రిఫరెన్సులు:

  • 2 తిమోతి 04:11-13
  • కొలస్సీ 04:09
  • తీతు 03:12

పదం సమాచారం:

  • Strong's: G51900

#నోపు #

నిర్వచనం:

నోపు పట్టణం ఐగుప్తు దేశంలో ఒక పురాతన ముఖ్య పట్టణం, ఇది నైలు నదీ తీరాన ఉంది.

  • నొపు పట్టణం ఐగుప్తు కింది భాగంలో ఉంది, నైలు నదీ తీరానికి దక్షిణాన ఉంది, అక్కడ భూమి చాలా ఫలవంతంగా ఉంటుంది, పంటలు విస్తారంగా పండుతాయి.
  • దాని ఫలవంతమైన భూమి, ఐగుప్తుకు ఉత్తరానికీ దక్షిణానికీ మధ్య ఉన్న ప్రాంతం నోపు పట్టణాన్ని ఒక ప్రధాన వ్యాపార, వాణిజ్య వగరంగా చేసిన్సి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదిచడం)

(చూడండి: ఐగుప్తు, నైలు నది)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4644, H5297

నెబుకద్నెజరు

వాస్తవాలు:

నెబుకద్నెజారు బాబులోను సామ్రాజానికి రాజు, శక్తివంతమైన అతని రాజ్యం అనేక ప్రజా గుంపులను, దేశాలను ఓడించించింది.

  • నెబుకద్నెజరు నాయకత్వంలో బాబులోను సైన్యం యూదా రాజ్యంపై దాడి చేసి దానిని జయించింది, యూదా రాజ్యంలోని అనేకమందిని బబులోనుకు బందీలుగా తీసుకొనివెళ్ళారు. అక్కడ బందీలు 70 సంవత్సరాల కాలం నివసించేలా బలవంతం చేసారు, దానిని “బబులోను చెర” అని పిలిచారు.
  • ప్రవాసితులలో ఒకడైన దానియేలు నెబుకద్నెజరు కలలలోని కొన్నింటికి భావాలు చెప్పాడు.
  • యూదులలో బందీలలో మరో ముగ్గురు, హనన్యా, మిషాయేలు, అజర్యాలను నెబుకద్నెజరు నిలువబెట్టిన అతి పెద్ద ప్రతిమను పూజించని కారణంగా రాజు వారిని మిక్కిలి వేడిమిగల అగ్నిగుండంలో పడవేసాడు.
  • రాజైన నెబుకద్నెజరు చాలా దురహంకారి, అబద్దపు దేవుళ్ళను పూజించాడు. అతడు యూదా రాజ్యాన్ని జయించినప్పుడు, యెరూషలెం దేవాలయంలో అనేకమైన బంగారు, వెండి వస్తువులను దొంగిలించాడు.
  • నెబుకద్నెజరు గర్వంతో ఉండి, అబద్దపుదేవుళ్ళను పూజించడం మానని కారణంగా దేవుడు అతనిని జంతువులా ఏడు సంవత్సరాలు అభాగ్యుడిగా జీవించేలా చేసాడు. ఏడు సంవత్సరాల తరువాత దేవుడు నెబుకద్నెజరుని పూర్వస్థితికి తీసుకొని వచ్చాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అహంకారి, అజర్యా, బబులోను, హనన్యా, మిషాయేలు)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 20:06 100 సంవత్సరాల తరువాత సిరియనులు ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసారు, యూదా రాజ్యంమీద దాడిచేయడానికి బబులోనీయుల రాజు నెబుకద్నెజరు ను దేవుడు పంపాడు.
  • 20:06 యూదా రాజు నెబుకద్నెజరు సేవకునిగా ఉండడానికి అంగీకరించాడు, ప్రతీ సంవత్సరం పన్ను కట్టడానికి ఒప్పుకున్నాడు.
  • 20:08 యూదా రాజు తిరుగుబాటును శిక్షించడానికీ నెబుకద్నెజరు సైనికులు రాజు కుమారులను అతని ముందే హత్య చేసారు, తరువాత అతనిని కళ్ళు పెరికివేసారు.
  • 20:09 నెబుకద్నెజరు అతని సైన్యం యూదా రాజ్యంలోని ప్రజలందరినీ బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళారు, పొలాలలో పంట పండించడానికి పేదవారిని విడిచిపెట్టారు.

పదం సమాచారం:

  • Strong's: H5019, H5020

#నోవహు

వాస్తవాలు:

నోవాహు 4,000 సంవత్సరాల క్రితం లోకంలోని దుష్టప్రజలందరినీ నాశనం చెయ్యడానికి సర్వలోక జలప్రళయాన్ని పంపిన కాలంలో జీవించాడు, భూమి నీటితో నిండిపోయినప్పుడు తానునూ, తన కుటుంబమూ కాపాడబడునట్లు దేవుడు అతిపెద్దడైన ఓడను తయారు చెయ్యమని దేవుడు నోవహుతో చెప్పాడు,

  • నోవాహు నీతిమంతుడు, అన్నింటిలోనూ దేవునికి విధేయత చూపినవాడు.
  • అతిపెద్దడైన ఓడను నిర్మించమని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టు నోవాహు ఖచ్చితంగా చేసాడు.
  • ఓడలోపల, నొవహూ, అతని కుటుంబమూ క్షేమంగా ఉన్నారు, తరువాత వారి పిల్లలూ, మనుమసంతానమూ ప్రజలతో భూమిని నింపారు.
  • ఆ కాలంనుండి పుట్టిన ప్రతీ ఒక్కరూ నోవాహు సంతానమే.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: సంతానం, మందసం)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:

  • 03:02 అయితే నోవాహు దేవుని దయపొందినవాడయ్యాడు.
  • 03:04 నోవాహు దేవునికి విధేయత చూపాడు. నోవహూ, తన ముగ్గురు కుమారులు దేవుడు వారికి చెప్పిన విధంగా ఓడను తయారు చేసారు.
  • 03:13 రెండు నెలలు తరువాత “నీవునూ, నీ కుటుంబమూ, జంతువులన్నియూ ఓడనుండి వెళ్ళవచ్చని” దేవుడు నోవాహు తో చెప్పాడు. కుమారులనూ, కుమారుల కుమారులని కని భూమిని నింపుడి” అని చెప్పాడు. కాబట్టి నవహు నూ అతని కుటుంబమూ ఓడ నుండి బయటికి వచ్చారు.

పదం సమాచారం:

  • Strong’s: H5146, G35750

#పౌలు, సౌలు

##వాస్తవాలు:

పౌలు ఆదిమ సంఘానికి ఒక నాయకుడు, అతడు అనేక ఇతర ప్రజా గుంపులకు సువార్తను తీసుకొని వెళ్ళడానికి యేసు చేత పంపించబడినవాడు.

*పౌలు తార్సు అనే రోమా నగరంలో జన్మించిన యూదుడు. మరియు, కాబట్టి అతడు ఒక రోమా దేశ పౌరుడుగా కూడా పిలువబడ్డాడు.

*పౌలు ఆరంభంలో యూదా సంబంధ పేరు, సౌలు అని పిలువబడ్డాడు.

*సౌలు యూదుల మత నాయకుడు అయ్యాడు. మరియు క్రైస్తవులుగా మారిన యూదులను బంధించాడు, ఎందుకంటే వారు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు దేవుణ్ణి అగౌరవపరుస్తున్నారని అతడు తలంచాడు.

*యేసు ప్రకాశమానమైన వెలుగు ద్వారా సౌలుకు తననుతాను బయలుపరచుకొన్నాడు, మరియు క్రైస్తవులను హింసించడం నిలిపివేయాలని చెప్పాడు.

*సౌలు యేసునందు విశ్వాసముంచాడు. తన తోటి యూదులకు యేసును గురించి బోధించడం ఆరంభించాడు.

*తరువాత, యేసును గురించి యూదేతరులైన ప్రజలకు  బోధించడానికి దేవుడు పంపించాడు. మరియు రోమా సామ్రాజ్యం యొక్క దేశాలలోనూ, వివిధ నగరాలలో సంఘాలను ఆరంభించాడు. ఈ సమయములో అతడు “పౌలు” అను రోమా పేరు చేత పిలువబడ్డాడు.

*పట్టణములలో ఉన్న సంఘాలలోని క్రైస్తవులను ప్రోత్సహించడానికీ, వారికి బోధించడానికీ పౌలు ఉత్తరాలు రాశాడు. వీటిలో అనేకం క్రొత్తనిబంధనలో ఉన్నాయి.

(అనువాదం సూచనలు: పేర్లను ఏవిధంగా అనువదించాలి)

(చూడండి: క్రైస్తవుడు, యూదు నాయకులు, రోమా)

##బైబిలు రిఫరెన్సులు:

*[అపొ.కా.08:03]

*[అపొ.కా 09:26]

*[అపొ.కా. 13:10]

*[గలతీ 01:01]

*[ఫిలేమోను 01:08]

###బైబిలు కథల నుండి ఉదాహరణలు:

**45:06 స్తెఫనును చంపిన ప్రజలతో సౌలు అనబడిన యౌవనస్తుడు ఏకీభవించాడు, మరియు వారు అతని మీదకి రాళ్లు విసిరినప్పుడ వారి వస్త్రాలకు కావలిగా ఉన్నాడు.

**46:01 సౌలు అను యవనస్థుడు స్తెఫనును చంపిన మనుష్యుల వస్త్రాలకు కావలి ఉన్నాడు, అతడు యేసునందు విశ్వాసం ఉంచలేదు. అందుచేత అతడు విశ్వాసులను హింసించాడు.

**46:02 సౌలు దమస్కు మార్గములో ప్రయాణము చేయుచున్నప్పుడు,ఆకాశమునుండి ప్రకాశమానమై వెలుగు వచ్చి తన చుట్టూ కమ్ముకొంది. మరియు అతడు క్రిందకి పడిపోయాడు,సమయములో “సౌలా! సౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు?” అని ఒకరు చెప్పడం సౌలు విన్నాడు.

**46:05 అందుచేత అననీయ సౌలు వద్దకు వెళ్ళాడు, అతని మీద తన చేతులను ఉంచాడు. “నీవు ఇక్కడకు ప్రయాణమై దారిలో వస్తున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన యేసు నన్ను నీ యొద్దకు పంపించాడు, తద్వారా నీవు నీ చూపును తిరిగి పొందుకొని మరియు పరిశుద్ధాత్మతో నింపబడగలవు”అని చెప్పాడు. వెనువెంటనే సౌలు మరల చూడడం ఆరంభించాడు. మరియు అననియ అతనికి బాప్తిస్మం ఇచ్చాడు.

**46:06 ఆ క్షణమునుండే, సౌలు “యేసే దేవుని కుమారుడని” చెప్పుచూ దమస్కులోని యూదులందరికి ప్రకటించడం ఆరంభించాడు.

**46:09 బర్నబా మరియు సౌలు సంఘమును బలపరచుటకునూ, మరియు యేసును గురించి ఈ నూతన విశ్వాసులకు మరి యెక్కువగా బోధించడానికీ అక్కడికి (అంతియొకయ) వెళ్ళారు.

**47:01 సౌలు రోమా సామ్రాజ్యమంతటి ద్వారా ప్రయాణించినప్పుడు అతడు “పౌలు” అనే రోమా పేరును ఉపయోగించడ ఆరంభించాడు.

**45:06 పౌలు మరియు ఇతర క్రైస్తవ నాయకులు అనేక పట్టణములకు ప్రయాణము చేసి, యేసును గూర్చిన సువార్తను ప్రజలకు బోధించి, ప్రకటించారు.

##పదం సమాచారం:

*Strong's: G3972, G4569


#ఉర్ #

వాస్తవాలు:

ఉర్ అనునది మిసపతోమియాలో భాగమైన పురాతన కల్దియ ప్రాంతము యొక్క ముఖ్య పట్టణమైయున్నది.ఇది యుఫ్రటీసు నది గుండా ఉన్నది. ఈ ఉర్ అనే ప్రాంతము ఆధునిక ప్రాంతమైన ఇరాక్ అనే దేశంలో కనబడుతుంది.

  • అబ్రాహాము ఉర్ అనే పట్టణానికి చెందినవాడు మరియు ఈ ఉర్ అనే ప్రాంతము నుండే కనాను భూమికి వెళ్ళుటకు దేవుడు అబ్రాహామును పిలిచాడు.
  • లోతు తండ్రియు , అబ్రహాము సహోదరుడునైన హారాను ఈ ఉర్ అనే ఊరిలో మృతిపొందెను. బహుశ హారాను మృతిపొందడమే లోతు ఉర్ అనే ఊరిని విడిచిపెట్టి అబ్రాహాముతో వెళ్ళుటకు కారణమై ఉండవచ్చు.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదాలను చూడండి: అబ్రాహాము , కనాను, కల్దియ, యూఫ్రటీసు నది, హారాను, లోతు, మిసపతోమియా)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H218

#ఉజ్జియా, అజర్యా#

##వాస్తవాలు:##

ఉజ్జియా తన పదహారవయేట రాజై ఏబది రెండు సంవత్సరములు ఏలేను, ఇది అసాధారణమైన సుదీర్ఘపాలన. ఉజ్జియాకు “అజర్యా” అను పేరు కలదు.

  • ఉజ్జియా నైపుణ్యముగల సైన్యము కలిగినవాడై ప్రసిద్ది చెందెను. ఉజ్జియా పట్టణమును రక్షించుటకై దుర్గములను కలిగి ఉండెను మరియు అంబులను పెద్ద రాళ్లను ప్రయోగించుటకై యంత్రములను ప్రత్యేకముగా చేయించిఉంచెను.
  • ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అందువలన అతడు అన్నిటిలో విజయము సాధించెను. అతడు పరిపాలనలో స్థిరపడినతరువాత, హృదయమునందు గర్వించెను ,అంతేగాక ప్రధాన యాజకుడు మాత్రమే అర్పించవలసిన ధూపమును ఈయన అర్పించి ద్రోహము చేసెను.
  • ఆ పాపము చేసినందున, ఉజ్జియా కుష్టరోగము కలిగినవాడై తన పరిపాలన అంతము వరకు రాజ్యములోని ఇతర ప్రజలకు ఎడముగా ఉండవలసివచ్చెను.

(తర్జుమా సలహాలు :పేరులను ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి: యూదా, రాజు, కుష్టువ్యాది, పరిపాలన, బురుజు)

బైబిలు వచనాలు:##

పదం సమాచారం:

  • Strong's: H5814, H5818, H5838, H5839

అకుల

వాస్తవాలు:

అకుల పొంతు పరగణాకు/ప్రాంతానికి చెందిన యూదుడైన క్రైస్తవుడు. ఇది నల్ల సముద్రం దక్షిణ తీర ప్రాంతంలో ఉంది.

  • ఇటలీలోని రోమాలో అకుల, ప్రిస్కిల్ల కొంత కాలం నివసించారు. అయితే తరువాత రోమా చక్రవర్తి, క్లాడియస్/క్లౌదియా, యూదులందరూ రోమాను విడిచి పొమ్మని/వెళ్ళమని ఆదేశించాడు.
  • ఆ తరువాత అకుల, ప్రిస్కిల్ల కొరింతుకు ప్రయాణించారు, అక్కడ వారు అపోస్తలుడైన పౌలును కలుసుకున్నారు.
  • వారు పౌలుతో కలిసి గుడారాలు/డేరాలు కుట్టే పని చేసి, అతనికి సువార్త పనిలో సహాయం చేశారు.
  • అకుల, ప్రిస్కిల్ల ఇరువురూ యేసును గురించి విశ్వాసులకు సత్యం బోధించారు; ఈ విశ్వాసుల్లో ఒకడు అపొల్లో అనే పేరు గల బోధకుడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) (rc://en/ta/man/translate/translate-names))

(చూడండిo: Apollos, Corinth, Rome)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1కొరింతి 16:19-20
  • 2తిమోతి 04:19-22
  • అపో. కా. 18:02
  • అపో. కా. 18:24

పదం సమాచారం:

  • Strong's: G02070

అజర్యా

వాస్తవాలు:

పాత నిబంధనలో అజర్యా పేరున్నఅనేక మంది మనుషులు ఉన్నారు.

  • వీరిలో ఒకడు అజర్యా తన బాబిలోనియా పేరు, అబెద్నెగోతో ప్రసిద్ధికెక్కాడు. అతడు ఇశ్రాయేలీయుల్లో యూదా గోత్రానికి చెంది నెబుకద్నేజర్ సైన్యం చేతిలో బందీగా బబులోనుకు వెళ్ళిన అనేక మందిలో ఒకడు. అజర్యా, తన తోటి ఇశ్రాయేలీయులు హనన్యా, మిషాయేలుతో కలిసి బాబిలోనియా రాజు ఆరాధనకు నిరాకరించారు. అందుకు శిక్షగా రాజు వారిని మండుతున్న కొలిమిలో పడవేశాడు. అయితే దేవుడు వారిని భద్ర పరిచాడు. వారికి ఏ హాని కలగలేదు.
  • యూదాను ఏలిన ఉజ్జియా రాజు మరొక పేరు "అజర్యా."
  • మరొక అజర్యా పాత నిబంధన ప్రధాన యాజకుడు.
  • యిర్మీయా ప్రవక్త కాలంలో అజర్యా అనే పేరున్న ఒక మనిషి ఇశ్రాయేలీయులను దేవుణ్ణి ధిక్కరించి వారి స్వదేశం విడిచి వెళ్ళిపొమ్మని పురిగొల్పాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: బబులోను, దానియేలు, హనన్యా, మిషాయేలు, యిర్మీయా, ఉజ్జియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5838

అతల్యా

వాస్తవాలు:

అతల్యా యూదా రాజు యెహోరాము భార్య. ఆమె ఇశ్రాయేలు రాజు ఒమ్రీ మనవరాలు.

  • అతల్యా కుమారుడు అహజ్యా యెహోరాము చనిపోయాక రాజయ్యాడు.
  • ఆమె కుమారుడు అహజ్యా చనిపోయాక, అతల్యా మిగిలిన రాజ కుటుంబాన్ని చంపడానికి పథకం రచించింది.
  • అయితే అతల్యా మనవడు యోవాషును అతని అత్త దాచిపెట్టి హతం కాకుండా రక్షించింది. అతల్యా దేశాన్ని ఆరు సంవత్సరాలు పరిపాలన చేసాక ఆమెను హతమార్చారు. యోవాషు రాజయ్యాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అహజ్యా, యెహోరాము, యోవాషు, ఒమ్రీ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6721

అంతియొకయ

వాస్తవాలు:

కొత్త నిబంధనలో అంతియొకయ అనేది రెండు పట్టణాలు పేరులు. ఒకటి సిరియా దేశములో మధ్యదరా సముద్రం తీరానికి దగ్గరలో ఉన్నది. మరొకటి రోమీయుల సంస్థానములోని/ప్రాంతమైన పిసిదియలో, కొలోస్సయి పట్టణం దగ్గర ఉన్నది.

  • సిరియాలోని అంతియొకయలోని స్థానిక సంఘం యేసు విశ్వాసులను "క్రైస్తవులు" అని పిలిచిన మొదటి ప్రాంతం/స్థలము. అక్కడి సంఘం కూడా అన్యజనులకు/యూదేతరులకు బోధించడానికి మిషనెరీలను పంపించుటలో చురుకుగా ఉన్నది.
  • యెరూషలేములోని సంఘ నాయకులు సిరియాలోని అంతియొకయ విశ్వాసులకు వారు క్రైస్తవులుగా ఉండుటకు యూదుల విధులు పాటించనక్కరలేదు అని ఒక ఉత్తరం పంపించారు.
  • పౌలు, బర్నబా, యోహాను మార్కు పిసిదియ అంతియొకయకు సువార్త ప్రకటనకై ప్రయాణించారు. కొందరు యూదులు ఇతర పట్టణాలనుండి వచ్చి జగడం రేపారు. వారు పౌలును చంపడానికి ప్రయత్నించారు. అయితే ఇతర అనేక ప్రజలు యూదులు, యూదేతరులుకూడా, బోధను విని, యేసును విశ్వసించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి:[బర్నబా] Barnabas, Colossae, John Mark, Paul, province, Rome, Syria)

బైబిల్ రిఫరెన్సులు:

  • 2 తిమోతి 03:10-13
  • అపో. కా. 06:05-06
  • అపో. కా. 11:19-21
  • అపో. కా. 11:26
  • గలతి 02:11-12

పదం సమాచారం:

  • Strong's: G04910

అదోనియా

నిర్వచనం:

అదోనియా రాజు దావీదు నాలుగవ కుమారుడు.

  • అదోనియా అతని సోదరులు అబ్షాలోము, అమ్నోను మరణం తరువాత ఇశ్రాయేలు రాజుగా కావాలని చూశాడు.
  • కానీ దేవుడు, దావీదు కుమారుడు సొలోమోను రాజు అవుతాడని మాట ఇచ్చాడు. అదోనియా పన్నాగం ఫలించలేదు. సొలోమోను రాజు అయ్యాడు.
  • అదోనియా రెండవ సారి రాజు కావాలని చూసినప్పుడు, సొలోమోను అతనికి మరణం విధించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: దావీదు, సొలోమోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G138

అన్న

వాస్తవాలు:

క్రీ. శ. 6 నుండి15 వరకు దాదాపు10 సంవత్సరాలపాటు అన్న యెరూషలేములో యూదా ప్రధాన యాజకుడుగా పదవిలో ఉన్నాడు. రోమా ప్రభుత్వం అతణ్ణి ప్రధాన యాజకత్వం నుండి తొలగించినప్పటికీ అతడు యూదుల మధ్య ప్రభావం గల నాయకుడుగా కొనసాగాడు.

*యేసుక్రీస్తు పరిచర్య కాలంలో ఉన్న ఈ అన్న అధికార ప్రధాన యాజకుడైన కయపకు మామగారు.

*ప్రధాన యాజకులు పదవిలో లేనప్పటికీవారికి ప్రజలపై అధికారం,పదవీ బాధ్యతలుకొన్నిఉంటాయి.కాబట్టే క్రీస్తునుబంధించే సమయంలో కయప,ఇతరులు యాజకత్వంలోఉన్నప్పటికీ అన్న కూడా ప్రధానయాజకుడుగా ప్రస్తావించబడ్డాడు.

*యూదా నాయకులు జరిగించు న్యాయ విమర్శలోప్రశ్నించడానికి యేసు క్రీస్తును మొదటిగా అన్న దగ్గరకు తీసుకు వచ్చారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా

చేయాలి)

  • (ఈ పదములను కూడా చూడండి: ప్రధాన యాజకుడు, యాజకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

  • అపొ. కా. 04:5-7

  • యోహాను 18:22-24

  • లూకా 03:1-2

పదం సమాచారం:

  • Strong's: G04520

అపొల్లో

వాస్తవాలు:

అపొల్లో ఒక యూదుడు, ఐగుప్తులోని అలెగ్జాండ్రియా పట్టణం వాడు. ప్రజలకు యేసును గురించి ఉపదేశించే ప్రత్యేక సామర్థ్యం ఇతనికి ఉంది.

  • అపొల్లో హీబ్రూ లేఖనాలలో బాగా విద్యావంతుడు. వరం ఉన్న ప్రసంగీకుడు.
  • ఎఫెసులో ఆకుల, ప్రిస్కిల్ల అనే ఇద్దరు క్రైస్తవులు అతనికి బోధించారు.
  • తానూ, అపొల్లో, ఇతర సువార్తీకులూ, ఉపదేశకులూ, ప్రజలు యేసునందు విశ్వాసముంచడంలో సహాయం చేసే ఒకే లక్ష్యం కోసం పని చేస్తున్నామని పౌలు నొక్కి చెప్పాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)

(చూడండి: అకుల, ఎఫెసు, ప్రిస్కిల్ల, దేవుని వాక్కు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G625

అబీమెలెకు

వాస్తవాలు:

అబీమెలెకు ఫిలిష్తియుల రాజు. అబ్రాహాము, ఇస్సాకు కనానులో జీవించిన కాలంలో ఇతడు గెరారును పరిపాలించాడు.

  • అబ్రాహాము అబీమెలెకు రాజుకు శారా తన భార్య అని చెప్పడానికి బదులుగా తన చెల్లి అని చెప్పి అబద్ధం ఆడాడు.
  • అబ్రాహాము, అబీమెలెకు బెయెర్షేబా దగ్గర ఉన్న బావుల విషయం ఒప్పందం చేసుకున్నారు.
  • చాలా సంవత్సరాల తరువాత ఇస్సాకు రిబ్కా గురించి తన భార్య అని చెప్పడానికి బదులుగా తన చెల్లి అని చెప్పి అబీమెలెకును అతని పరివారాన్ని మోసగించాడు.
  • అబీమెలెకు రాజు అబ్రాహామును, అటు తరువాత ఇస్సాకును వారు చెప్పిన అబద్ధాలకై గద్దించాడు.
  • అబీమెలెకు అనే పేరున్న మరొకడు గిద్యోను కొడుకు. యోతాము సోదరుడు. కొన్ని అనువాదాల్లో కొద్దిగా తేడాతో ఈ పేరు ఉంది. ఇది ఆ వ్యక్తి అబీమెలెకు రాజు కాకుండా వేరొకడు అని చెప్పడం కోసం.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: బెయెర్షేబా, గెరారు, గిద్యోను, యోతాము, ఫిలిష్తియుల)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H40

అబీయా

వాస్తవాలు:

అబీయా క్రీ. పూ. 915నుండి 913 వరకు పరిపాలించిన యూదా రాజు. ఇతడు రెహబాము కొడుకు. పాత నిబంధనలో అబీయా అనే పేరుతో ఇంకా కొందరు ఉన్నారు:

  • సమూయేలు కొడుకులు అబీయా, యోవేలు బెయేర్షేబాలో ఇశ్రాయేలు ప్రజల నాయకులు. అబీయా, అతని సోదరుడు నిజాయితీ లేనివారు, డబ్బుకు ఆశపడేవారు గనక తమపై పరిపాలన చెయ్యడానికి రాజును నియమించమని ప్రజలు సమూయేలును అడిగారు.
  • అబీయా దావీదురాజు కాలంలో దేవాలయ యాజకుడు కూడా.
  • అబీయా యరోబాము కొడుకుల్లో ఒకడు.
  • అబీయా బబులోను చెర నుండి జెరుబ్బాబెలుతో కలిసి తిరిగి వచ్చిన వ్యక్తి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H0029, G00070

అబ్నేరు

నిర్వచనం:

పాత నిబంధనలో అబ్నేరు సౌలు రాజు బంధువు.

  • అబ్నేరు సౌలు సైన్యాధ్యక్షుడు, యువకుడైన దావీదు మహా కాయుడు గొల్యాతును చంపినప్పుడు అతణ్ణి సౌలుకు పరిచయం చేశాడు.
  • సౌలురాజు మరణం తరవాత అబ్నేరు సౌలు కొడుకు ఇష్బోషెతును ఇశ్రాయేలు రాజుగా చేశాడు. అదే సమయంలో దావీదు యూదా ప్రదేశానికి రాజయ్యాడు.
  • ఆ తరువాత అబ్నేరును దావీదు సైన్యాధ్యక్షుడు యోవాబు కుటిలంగా హతం చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H74

అబ్యాతారు

నిర్వచనం:

అబ్యాతారు దావీదు రాజు కాలంలో ఇశ్రాయేలు జాతికి ప్రధాన యజకునిగా ఉన్నాడు.

  • సౌలు రాజు యాజకులను చంపించిన తరువాత అబ్యాతారు తప్పించుకుని అడవిలో ఉన్న దావీదును చేరుకున్నాడు.
  • అబ్యాతారు, సాదోకు అనే మరొక ప్రధాన యాజకుడు దావీదు పరిపాలన కాలంలో నమ్మకంగా సేవ జరిగించారు.
  • దావీదు మరణం తరువాత సొలోమోను కు బదులుగా రాజు కావడానికి అదోనియాకు అబ్యాతారు తోడ్పడ్డాడు.
  • ఈ కారణంతో సొలోమోను రాజు అబ్యాతారును యాజకత్వం నుండి తొలగించాడు.

(చూడండి: సాదోకు, [సౌలు , దావీదు, సొలోమోను, అదోనియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H54, G8

అబ్రాహాము, అబ్రాము

వాస్తవాలు:

అబ్రాము ఊర్ అనే పట్టణానికి చెందిన కల్దియ జాతి వాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలు జాతి పితగా ఎంపిక చేశాడు. దేవుడు అతని పేరును "అబ్రాహాము"గా మార్చాడు.

  • "అబ్రాము"అంటే "ఘనుడైన తండ్రి."
  • "అబ్రాహాము"అంటే "అనేక మందికి తండ్రి."
  • దేవుడు అబ్రాహాముకు ఎందరో సంతానం కలుగుతారని, వారు గొప్ప జాతిగా ఉంటారని ప్రమాణం చేశాడు.
  • అబ్రాహాము దేవునిపై నమ్మకం ఉంచి లోబడ్డాడు. దేవుడు అబ్రాహాము ను కల్దియ దేశం నుండి కనాను ప్రదేశానికి నడిపించాడు.
  • అబ్రాహాము, అతని భార్య శారా కనాను ప్రదేశంలో నివసిస్తూ ముసలితనంలో ఇస్సాకు అనే ఒక కొడుకును కన్నారు.

(అనువాదం సలహాలు: పేర్ల అనువాదం)

(చూడండి: Canaan, Chaldea, Sarah, Isaac)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణ:

  • 04:06 అబ్రాము కనాను వచ్చినప్పుడు, దేవుడు అన్నాడు, "చుట్టూ చూడు. నీవు చూస్తున్న నేల అంతటినీ నీకూ నీ సంతానానికి వారసత్వంగా ఇస్తాను."
  • 05:04 అప్పుడు దేవుడు అబ్రాము పేరును అబ్రాహాము గా మార్చాడు. అంటే "అనేక మందికి తండ్రి."
  • 05:05 దాదాపు ఒక సంవత్సరం తరువాత అబ్రాహాము నూరేళ్ళ ప్రాయం, శారా 90 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, శారా అబ్రాహాము కొడుక్కి జన్మనిచ్చింది.
  • 05:06 ఇస్సాకు యువ ప్రాయంలో దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఇలా చెప్పాడు. "నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుపోయి అతన్ని నాకు బలిగా అర్పించు."
  • 06:01 అబ్రాహాము బాగా ముసలివాడు అయిన తరువాత, ఇస్సాకు పెద్దవాడయ్యాడు. అబ్రాహాము తన సేవకుడిని తన బంధువులుండే ప్రాంతానికి పంపించి తన కొడుక్కి భార్యను తెమ్మన్నాడు.
  • 06:04 చాలా కాలం తరువాత అబ్రాహాము చనిపోయాడు, దేవుడు నిబంధనాపూర్వకంగా చేసిన వాగ్దానాలు ఇస్సాకుకు సంక్రమించాయి.
  • 21:02 దేవుడు అబ్రాహాము కు వాగ్దానం చేశాడు. అతని ద్వారా లోకజాతులన్నీ దీవెనలు పొందుతాయి.

పదం సమాచారం:

  • Strong's: H87, H85, G11

అబ్షాలోము

వాస్తవాలు:

అబ్షాలోము దావీదు రాజు మూడవ కుమారుడు. అతని సౌందర్యం, విపరీతమైన ఆగ్రహం అందరికీ బాగా తెలుసు.

  • అబ్షాలోము సోదరి తామారును వారి సవతి సోదరుడు అమ్నోను మానభంగం చేసినప్పుడు అతణ్ణి చంపాలని అబ్షాలోము పథకం పన్నాడు.
  • అమ్నోనును హతమార్చాక, అబ్షాలోము గెషూరు ప్రాంతానికి పారిపోయాడు. (అతని తల్లి మయకా పుట్టిల్లు అదే). అక్కడ అతడు మూడు సంవత్సరాలు ఉండి పోయాడు. అప్పుడు దావీదు రాజు అతణ్ణి యెరూషలేముకు తిరిగి రమ్మని పిలిపించాడు. కానీ తన సముఖానికి అబ్షాలోమును రెండు సంవత్సరాలు రానివ్వలేదు.
  • అబ్షాలోము కొంతమందిని దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ఉసిగొల్పాడు.
  • దావీదు సైన్యం అబ్షాలోముపై పోరాడి అతన్ని చంపారు. ఇది జరిగినప్పుడు దావీదు ఎంతో దుఃఖించాడు.

(అనువాదం సలహాలు: పేర్ల అనువాదం)

(చూడండి: గెషూరు, అమ్నోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H53

అమజ్యా

వాస్తవాలు:

అమజ్యా తన తండ్రి యోవాషు రాజు హత్యకు గురి అయిన తరువాత యూదా రాజ్యంపై రాజయ్యాడు.

  • అమజ్యా రాజు ఇరవైతొమ్మిది సంవత్సరాలు, అంటే క్రీ. పూ 796నుండి క్రీ. పూ. 767వరకు యూదాను పరిపాలించాడు.
  • అతడు మంచి రాజు, అయితే విగ్రహారాధక ఉన్నత స్థలాలను అతడు నాశనం చేయలేదు.
  • అమజ్యా ఎట్టకేలకు తన తండ్రి హత్యకు బాధ్యులైన వారందరికి మరణశిక్ష విధించాడు.
  • తిరుగుబాటు చేసిన ఎదోమీయులను అతడు ఓడించి వారిని యూదా రాజ్యం కిందకు తెచ్చాడు.
  • అతడు ఇశ్రాయేలు రాజు ఎహోయాషును సమరానికి పిలిచాడు, కానీ ఓడిపోయాడు. యెరూషలేము ప్రాకారంలో కొంత భాగం కూలిపోయాయి. ఆలయంలోని వెండి, బంగారం పాత్రలు శత్రువులు దోచుకున్నారు.
  • సంవత్సరాలు తరువాత అమజ్యా రాజు యెహోవా నుండి తొలగి పోయాడు. యెరూషలేములో కొందరు మనుషులు అతనిపై కుట్ర చేసి, అతణ్ణి చంపాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: యోవాషు, ఎదోము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H558

అమాలేకు, అమాలేకీయుడు, అమాలేకీయులు

వాస్తవాలు:

అమాలేకీయులు కనాను దక్షిణ ప్రాంతం అంతటా నివసించే సంచారజీవులు. వీరు నెగెబు ఎడారి నుండి అరేబియా దక్షిణ భాగం అంతటా విస్తరించి ఉన్నారు. వీరు ఏశావు మనవడు అమాలేకు సంతానం.

  • ఇశ్రాయేలీయులు మొదటిగా కనానులో నివసించడానికి వచ్చినప్పటినుండి అమాలేకీయులు వారికి బద్ధ శత్రువులు.
  • కొన్ని సార్లు ఈ పదం "అమాలేకు" ను అమాలేకీయులు అందరినీ ఉద్దేశించి అలంకారికంగా ఉపయోగిస్తారు. (చూడండి: ఉపలక్ష్య అలంకారం)
  • అమాలేకీయులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మోషే తన చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. అతడు అలసిపోయి చేతులు దించినప్పుడు ఓడిపోసాగారు. కాబట్టి అహరోను, హూరు మోషే చేతులు ఎత్తి పట్టడానికి సహాయపడగా ఇశ్రాయేలు సైన్యం చేతిలో అమాలేకీయులు ఓడిపోయారు.
  • సౌలు రాజు, దావీదు రాజు ఇద్దరూ అమాలేకీయులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు.
  • ఒక సారి అమాలేకీయులపై విజయం సాధించాక సౌలు ఆ కొల్ల సొమ్ములో కొంత ఉంచుకోవడం ద్వారానూ, దేవుడు అజ్ఞాపించినట్టు అమాలేకీయుల రాజును చంపకపోవడం ద్వారా దేవుని మాట మీరాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అరేబియా, దావీదు, ఏశావు, నెగెబు, సౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6002, H6003

అమోరీయుడు, అమోరీయులు

వాస్తవాలు:

అమోరీయులు చాలా శక్తివంతమైన ప్రజ. నోవహు మనవడు కనాను వీరి పూర్వీకుడు.

  • వారి పేరుకు "ఉన్నతమైన," అని అర్థం. ఎందుకంటే వీరు కొండసీమల్లో నివసించారు. లేదా ఈ మనుషులు చాలా పొడవైన వారు అని పేరు పొందారు.
  • అమోరీయులు యోర్దాను నది రెండు వైపులా నివసించారు. హాయి పట్టణం నివాసులు అమోరీయులే.
  • దేవుడు "అమోరీయుల పాపం"ను ప్రస్తావించాడు. అబద్ధ దేవుళ్ళకు వారు చేసే పూజలు, దానికి అనుబంధంగా ఉన్న పాపపూరితమైన ఆచారాలు ఇందులో ఉన్నాయి.
  • యెహోషువా ఇశ్రాయేలీయుల నాయకుడుగా ఉండి దేవుడు అజ్ఞాపించినట్టు అమోరీయులను నాశనం చేశాడు.

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 15:07 కొంతకాలం తరువాత, కనానులోని అన్యజాతుల రాజులు అమోరీయులు, ఈ మాట విన్నారు. గిబియోను వారు ఇశ్రాయేలీయులతో శాంతి ఒప్పందం చేసుకున్నారని విన్నారు. కాబట్టి వారి సేనలను ఒకే పెద్ద సైన్యంగా సమీకరించి గిబియోనుపై దాడి చేశారు.
  • 15:08 మరుసటి ఉదయం పెందలకడనే వారు అమోరీయుల సేనలపై మెరుపు దాడి చేశారు.
  • 15:09 దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు పక్షంగా పోరాడాడు. అయన అమోరీయులు కలవరపడేలా గొప్ప వడగళ్ళు కురిపించి అనేక మంది __అమోరీయులను__హతమార్చాడు.
  • 15:10 అంతేకాక దేవుడు ఆనాడు సూర్యుడు ఆకాశంలో ఒకే చోట నిలిచిపోయేలా చేసి ఇశ్రాయేలు వారు అమోరీయులను పూర్తిగా ఓడించేలా చేశాడు .

పదం సమాచారం:

  • Strong's: H567,

అమ్నోను

వాస్తవాలు:

అమ్నోను దావీదు రాజు పెద్ద కుమారుడు. అతని తల్లి దావీదు రాజు భార్య అహీనోయము.

  • అమ్నోను అబ్షాలోము సోదరి, తన సవతి సోదరి తామారును మానభంగం చేశాడు.
  • ఇందువల్ల, అమ్నోనుకు వ్యతిరేకంగా అబ్షాలోము కుట్ర చేసి హతమార్చాడు.

(చూడండి: దావీదు, అబ్షాలోము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H550

అమ్మోను, అమ్మోనీయుడు, అమ్మోనీయులు

వాస్తవాలు:

"అమ్మోను ప్రజలు” లేక “అమ్మోనీయులు" ఒక కనాను జాతి. వీరి మూలపురుషుడు బెన్నమ్మి, ఇతడు లోతుకు అతని చిన్న కూతురు మూలంగా పుట్టిన కుమారుడు.

  • ఈ పదం "అమ్మోనీయురాలు" ప్రత్యేకంగా అమ్మోనీయ స్త్రీ అనే అర్థం ఇస్తుంది. దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అమ్మోనీయ స్త్రీ."
  • అమ్మోనీయులు యోర్దాను నదికి తూర్పున నివసించారు. వీరు ఇశ్రాయేలీయులకు శత్రువులు.
  • ఒకప్పుడు, అమ్మోనీయులు బిలాము అనే ఒక ప్రవక్తను ఇశ్రాయేలును శపించడానికి డబ్బిచ్చి పిలిపించారు. అయితే దేవుడు అతన్నలా చేయనివ్వలేదు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: శాపం, యోర్దాను నది, లోతు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5983, H5984, H5985

అరాబా

వాస్తవాలు:

పాత నిబంధన పదం "అరాబా" చాలా పెద్ద ఎడారి, మైదాన ప్రాంతం. ఎర్ర సముద్రం ఉత్తర కొన నుండి యోర్దాను నది లోయ చుట్టూ దక్షిణ భాగంలో వ్యాపించి ఉంది.

  • ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి కనాను ప్రదేశానికి ఈ ఎడారి ప్రాంతం గుండా ప్రయాణించారు.
  • "అరాబా సముద్రం "అని కూడా దీన్ని తర్జుమా చెయ్య వచ్చు. అంటే "అరాబా ఎడారి ప్రాంతంలో ఉన్న సముద్రం." ఈ సముద్రాన్ని తరచుగా "ఉప్పు సముద్రం” లేక “మృత సముద్రం"అంటారు.
  • ఈ పదం "అరాబా"ను సాధారణంగా ఏ ఎడారి ప్రాంతాన్ని ఉద్దేశించి అయినా వాడవచ్చు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఎడారి, రెల్లు సముద్రం, యోర్దాను నది, కనాను, ఉప్పు సముద్రం, ఈజిప్టు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1026, H6160

అరారాతు

వాస్తవాలు:

బైబిల్లో, "అరారాతు"అనేది ఒక ప్రాంతానికి, రాజ్యానికి, ఒక పర్వత శ్రేణికి ఇచ్చిన పేరు.

  • "అరారాతు భూభాగం" బహుశా టర్కీ దేశం ఈశాన్య భాగంలో ఉంది.
  • అరారాతు ఒక కొండ పేరుగా అందరికీ బాగా తెలుసు. వరద తరువాత నోవహు ఓడ ఇక్కడ ఆగింది.
  • ఆధునిక కాలంలో, ఈ కొండను "అరారాతు కొండ" అని తరచుగా పిలుస్తారు. బైబిల్లో "అరారాతు పర్వతాల్లో" ఇది ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఓడ, నోవహు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H780

అరేబియా, అరేబియా వాసి,

వాస్తవాలు:

అరేబియా ప్రపంచంలోకెల్లా పెద్ద ద్వీపకల్పం, దీని వైశాల్యం 30,00,000 చదరపు కిలోమీటర్లు. ఇది ఇశ్రాయేలు దక్షిణ తూర్పున ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, పర్షియా సింధు శాఖ సరిహద్దులుగా ఉంది.

  • "అరేబియా వాసి" ఈ పదాన్ని అరేబియాలో నివసించే వారికి, లేక ఆ భూభాగంతో కలిసి ఉన్న ప్రాంతంలో నివసించే వారిని సూచించడానికి ఉపయోగిస్తారు.
  • అరేబియాలో నివసించిన ప్రాచీన ప్రజలు షేము మనవలు. ఇతర ప్రాచీన అరేబియా నివాసులు అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు, తన సంతానం, ఏశావు సంతానం.
  • ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు తిరుగులాడిన ఎడారి ప్రాంతం అరేబియాలో ఉంది.
  • విశ్వాసిగా మారిన తరువాత అపోస్తలుడు పౌలు కొన్ని సంవత్సరాలు అరేబియా ఎడారిలో గడిపాడు.
  • గలతియ క్రైస్తవులకు తన ఉత్తరంలో పౌలు ప్రస్తావించిన సీనాయి కొండ అరేబియాలో ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఏశావు, గలతియ, ఇష్మాయేలు, షేము, సీనాయి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6152, H6153, H6163, G688, G690

అర్తహషస్త

వాస్తవాలు:

అర్తహషస్త పర్షియా సామ్రాజ్యాన్ని క్రీ. పూ 464నుండి 424వరకు పరిపాలించాడు.

  • అర్తహషస్త పరిపాలనలో ఇశ్రాయేలీయులు యూదా ప్రాంతంనుండి బబులోనుకు ప్రవాసం వెళ్లారు. ఆ సమయంలో అది పారశికుల అధీనంలో ఉంది. .
  • అర్తహషస్త యాజకుడు ఎజ్రాను, ఇతర యూదు నాయకులను బబులోను విడిచి యెరూషలేముకు తిరిగి వెళ్లి ఇశ్రాయేలీయులు దేవుని చట్టం నేర్చుకోమని చెప్పాడు.
  • తరువాతి కాలంలో అర్తహషస్త తన గిన్నె అందించే నెహెమ్యాను యెరూషలేముకు తిరిగి వెళ్ళమని, పట్టణం చుట్టూ ఉన్న గోడలు తిరిగి కట్టడంలో యూదులకు నాయకత్వం వహించమని పంపాడు.
  • బబులోను పర్షియా పరిపాలన కింద ఉంది గనక అర్తహషస్తను "బబులోను రాజు" అని కూడా కొన్ని సార్లు పిలిచారు.
  • అర్తహషస్త, జెరిజిస్ (ఆహష్వేరోషు) ఒక్కరే కాదని గుర్తుంచుకోవాలి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆహష్వేరోషు, బబులోను, గిన్నె అందించే వాడు, ఎజ్రా, నెహెమ్యా, పర్షియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H783

అషేరా, అషేరా, అషేరా స్థంభాలు, అష్టారోతు, అష్టారోతులు

నిర్వచనం:

అషేరా అనేది కనాను ప్రజా సమూహాలు పాత నిబంధన కాలంలో పూజించిన దేవత పేరు. "అష్టారోతు"అనేది "అషేరా"కు మరొక పేరు. లేక ఒకే పేరున్న వేరు దేవతల పేర్లు అయి ఉండవచ్చు.

  • ఈ పదం "అషేరా స్థంభాలు"అంటే చెక్కిన కొయ్యతో చేసిన ప్రతిమలు. లేక దేవతలను సూచించేటందుకు చెక్కిన చెట్లు.
  • అషేరా స్థంభాలు తరచుగా అబద్ధ దేవుడు బయలు బలిపీఠాల దగ్గర నిలిపే వారు. బయలు దేవుడు అషేరా దేవి భర్త. కొన్ని ప్రజా సమూహాలు బయలును సూర్య దేవుడుగా పూజించే వారు. అషేరా లేక అష్టారోతును చంద్ర దేవతగా పూజించే వారు.
  • చెక్కిన అషేరా ప్రతిమలను ఇశ్రాయేలీయులు నాశనం చెయ్యాలని దేవుడు అజ్ఞాపించాడు.
  • గిద్యోను, ఆసా రాజు, యోషియా రాజు వంటి కొందరు ఇశ్రాయేలు నాయకులు దేవునికి లోబడి విగ్రహాలను నాశనం చేశారు.
  • అయితే సొలోమోను రాజు, మనష్షె రాజు, ఆహాబు రాజు వంటి ఇతర ఇశ్రాయేలు నాయకులు అలాటి అషేరా స్థంభాలను నాశనం చెయ్యక ఆరాధన ఈ విగ్రహాలను పూజించేలా ప్రోత్సహించారు.

(చూడండి: అబద్ధ దేవుడు, బయలు, గిద్యోను, ప్రతిమ, సొలోమోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H842, H6252, H6253

అషేరు

వాస్తవాలు:

అషేరు యాకోబు ఎనిమిదవ కుమారుడు. తన సంతానం ఇశ్రాయేలు పన్నెండు మంది గోత్రాలలో ఒకటి. దాని పేరు "అషేరు."

  • ఇతని సంతానమే “ఆషేరుగోత్రం” లేదా “ఆషేరు”.
  • హెబ్రీ భాషలో ఈపేరుకు అర్థం "దీవించబడిన”, “ఆనందం”.
  • ఇశ్రాయేలీయుల వాగ్దాన దేశం కనాను యొక్క వాయువ్య భాగంలో మధ్యధరా సముద్రంపై ఆషేరుగోత్రం స్థిరపడింది. భూభాగప్రాతిపదికగా చూచినప్పుడు “ఆషేరు” ప్రాంతం ఆషేరు గోత్రానికి ఇవ్వబడినదిగా కనిపిస్తుంది.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు, యాకోబు,జిల్పా)

పరిశుద్ధ గ్రంధ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

Strong's: H0836


అష్కెలోను

వాస్తవాలు:

బైబిల్ కాలాల్లో, అష్కెలోను పెద్ద ఫిలిష్తియ పట్టణం. ఇది మధ్యదరా సముద్రం తీరాన ఉంది. నేటికీ ఇది ఇశ్రాయేలులో ఉంది.

  • అష్కెలోను ఐదు ప్రాముఖ్య ఫిలిష్తియ పట్టణాలలో ఒకటి. మిగతావి అష్డోదు, ఎక్రోను, గాతు, గాజా.
  • ఇశ్రాయేలీయులు దాని కొండ సీమలను ఆక్రమించుకున్నప్పటికీ అష్కెలోను వారిని పూర్తిగా ఓడించ లేదు.
  • అష్కెలోను ఫిలిష్తీయుల వశంలో వందల సంవత్సరాలు ఉండిపోయింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అష్డోదు, కనాను, ఎక్రోను, గాతు, గాజా, ఫిలిష్తీయులు, మధ్యదరా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H831

అష్డోదు, అజోతు

వాస్తవాలు:

అష్డోదు ఐదు ఫిలిష్తీయుల ప్రాముఖ్య పట్టణాల్లో ఒకటి. ఇది నైరుతి కనాను ప్రాంతంలో మధ్యదరా సముద్రం దగ్గర గాజా యొప్పే పట్టణాల మధ్య ఉంది.

  • ఫిలిష్తియుల అబద్ధ దేవుడు దాగోను ఆలయం అష్డోదులో ఉంది.
  • అష్డోదు ప్రజలు నిబంధన మందసం దొంగిలించి, దాన్ని అష్డోదులోని గుడిలో ఉంచినప్పుడు దేవుడు ఫిలిష్తీయులను తీవ్రంగా శిక్షించాడు.
  • ఈ పట్టణం గ్రీకు పేరు అజోతు. సువార్తికుడు ఫిలిప్పు సువార్త ప్రకటించిన పట్టణాల్లో ఇదొకటి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఎక్రోను, గాతు, గాజా, యొప్పే, ఫిలిప్పు, ఫిలిష్తీయులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H795, G108

అస్సిరియా, ఆష్శూరు, ఆష్శూరీయులు, ఆష్శూరు సామ్రాజ్యం

వాస్తవాలు:

ఇశ్రాయేలీయులు కనాను ప్రదేశంలో నివసిస్తున్న కాలంలో అస్సిరియా ఒక శక్తివంతమైన జాతి. ఆష్శూరు రాజు కొన్ని జాతులపై పరిపాలన చేసిన ఫలితంగా ఆష్శూరు సామ్రాజ్యం ఏర్పడింది.

  • అస్సిరియా జాతి ప్రస్తుత ఇరాక్ ఉత్తర ప్రాంతంలో నివసించారు.
  • ఆష్శూరీయులు వారి చరిత్రలో ఆయా సమయాల్లో ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడారు.
  • క్రీ. పూ 722లో ఆష్శూరీయులు ఇశ్రాయేల్ రాజ్యం పూర్తిగా ఆక్రమించుకున్నారు. అనేకమంది ఇశ్రాయేలీయులను అస్సిరియాకు తరలించారు.
  • మిగిలిన ఇశ్రాయేలీయులు సమరయనుండి ఇశ్రాయేలు దేశానికి ఆష్శూరీయులు తెచ్చిన విదేశీయులను పెళ్లి చేసుకున్నారు. అలా సంకర వివాహాలు చేసుకున్న వారి సంతానాన్ని తరువాతి కాలంలో సమరయులు అని పిలిచాడు .

(చూడండి: సమరయ)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 20:02 కాబట్టి దేవుడు రెండు రాజ్యాలను వారి శత్రువులు వారిని నాశనం చెయ్యడానికి అనుమతినివ్వడం ద్వారా శిక్షించాడు. ఇశ్రాయేల్ రాజ్యం శక్తివంతమైన , క్రూరమైన జాతి ఆష్శూరు సామ్రాజ్యం చేతిలో నాశనం అయింది. ఆష్శూరీయులు ఇశ్రాయేల్ రాజ్యంలో అనేక మందిని చంపి విలువైన ప్రతిదాన్నీ తీసుకు పోయారు. దేశంలో ఎక్కువ భాగాన్ని తగలబెట్టారు.
  • 20:03 ఆష్శూరీయులు నాయకులందరినీ సమకూర్చారు. ఇంకా ధనికులను, నిపుణతలు గల వారినీ అస్సిరియాకు కొంచుబోయారు.
  • 20:04 తరువాత ఆష్శూరీయులు ఇశ్రాయేల్ రాజ్యం ఉన్న ఆ దేశంలో నివసించడానికి విదేశీయులను తోడుకు వచ్చారు.

పదం సమాచారం:

  • Strong's: H804, H1121

అహజ్యా

వాస్తవాలు:

అహజ్యా అనే పేరుతో ఇద్దరు రాజులు ఉన్నారు: ఒకడు ఇశ్రాయేల్ రాజ్యం పైనా మరొకడు యూదా రాజ్యం పైనా ఏలుబడి చేశాడు.

  • యూదా రాజు అహజ్యా యెహోరాము రాజు కుమారుడు. అతడు ఒక సంవత్సరం పరిపాలించాడు (841క్రీ. పూ.). యెహూ అతణ్ణి చంపాడు. అహజ్యా కుమారుడు యోవాషు ఆ తరువాత రాజుగా సింహాసనం ఎక్కాడు.
  • ఇశ్రాయేలీయుల రాజు అహజ్యా ఆహాబు రాజు కుమారుడు. అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు. (850-49క్రీ. పూ.). తన భవనంలో పడి, ఆ గాయాల వల్ల అతడు చనిపోగా అతని సోదరుడు యెహోరాము రాజు అయ్యాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: యెహూ, ఆహాబు, యరోబాము, యోవాషు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H274

అహరోను

వాస్తవాలు:

అహరోను మోషేకు అన్న. దేవుడు ఇశ్రాయేలు ప్రజకు మొదటి ప్రధాన యజకునిగా అహరోనును ఎన్నుకున్నాడు.

  • ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వాలని ఫరోతో మాట్లాడడానికి అహరోను మోషేకు సాయపడ్డాడు.
  • ఇశ్రాయేలు ప్రజ అడివి దారిన ప్రయాణిస్తూ ఉన్న సమయంలో, అహరోను ఆ ప్రజలు మొక్కడం కోసం ఒక ప్రతిమను చెయ్యడం ద్వారా పాపం చేశాడు.
  • దేవుడు అహరోనును, అతని సంతానాన్ని యాజకుడు ఇశ్రాయేలు ప్రజకోసం యాజకులు గా నియమించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: priest, Moses, Israel)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథలనుండి ఉదాహరణలు:

  • 09:15 ఫరో తల బిరుసుగా ఉంటాడని దేవుడు మోషే అహరోను లను హెచ్చరించాడు.
  • 10:05 ఫరో మోషే అహరోను లను పిలిపించి తెగులు ఆపగలిగితే ఇశ్రాయేలు ప్రజ ఈజిప్టు విడిచి పోవచ్చు అన్నాడు.
  • 13:09 దేవుడు మోషే అన్న అహరోను, అతని సంతతిని యాజకులుగా నియమించాడు.
  • 13:11 కాబట్టి వారు (ఇశ్రాయేలు ప్రజ) బంగారాన్ని అహరోను వద్దకు తెచ్చి తమకోసం ఒక విగ్రహం చెయ్యమన్నారు!
  • 14:07 వారు (ఇశ్రాయేలు ప్రజ) మోషే అహరోను లపై కోపగించుకుని, "ఈ భయంకరమైన చోటికి మమ్మల్ని ఎందుకు తెచ్చారు?"అన్నారు.

పదం సమాచారం:

  • Strong’s: H0175, G00020

అహీయా

అపో. కా:

అహీయా అనేది పాత నిబంధన లో చాలామంది మనుషుల పేరు. ఈ మనుషులు:

  • అహీయా ఒక యాజకుని పేరు. ఇతడు సౌలు సమకాలికుడు.
  • సొలోమోను రాజు పరిపాలనలో రాజు కార్యదర్శి పేరు అహీయా.
  • అహీయా షిలోహులో ఒక ప్రవక్త పేరు. ఇశ్రాయేలు జాతి రెండు ముక్కలౌతుందని ప్రవచించినవాడు ఇతడే.
  • ఇశ్రాయేలు రాజు బయషా తండ్రి పేరు అహీయా.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: బయషా, షిలోహు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H281

ఆంద్రెయ

వాస్తవాలు:

ఆంద్రెయ యేసు అత్యంత సన్నిహితమైన శిష్యులుగా ఎన్నుకున్న పన్నెండు మందిలో ఒకడు. (తరువాత ఇతనికి అపోస్తలుడు అని పేరు వచ్చింది).

  • ఆంద్రెయ సోదరుడు సీమోను పేతురు. వీరిద్దరూ జాలరులు.
  • పేతురు, ఆంద్రెయ ఇద్దరూ గలిలీ సరస్సు చేపలు పడుతున్నారు. అప్పుడు యేసు వారిని తన శిష్యులుగా పిలిచాడు.
  • పేతురు, ఆంద్రెయ యేసును కలుసుకోక ముందు వారు బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:apostle, disciple, the twelve)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G04060

ఆమోజు

వాస్తవాలు:

ఆమోజు యెషయా ప్రవక్త తండ్రి.

  • బైబిల్ లో ఇతని పేరు ప్రస్తావించినది యెషయాను "ఆమోజు కుమారుడుగా" చెప్పిన చోట మాత్రమే.
  • ఈ పేరు ప్రవక్త ఆమోసు పేరుకు భిన్నంగా ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆమోసు, యెషయా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H531

ఆమోసు

వాస్తవాలు:

ఆమోసు ఒక ఇశ్రాయేలు ప్రవక్త. యూదా రాజు ఉజ్జియా కాలంలో నివసించాడు.

  • ప్రవక్తగా పిలుపు అందుకోక ముందు ఆమోసు ఒక కాపరి. యూదా రాజ్యంలో అంజూరు తోటల్లో రైతు.
  • ఆమోసు ధనిక ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం మనుషుల పట్ల వారి అన్యాయ కార్యాలను బట్టి రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవచించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అంజూరు, యూదా, ఇశ్రాయేల్ రాజ్యం, కాపరి, ఉజ్జియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5986

ఆరాము, ఆరామీయుడు, అరమేయిక్

నిర్వచనం:

"ఆరాము" పేరుతో పాత నిబంధనలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇది ఒక ప్రాంతం పేరు. కనానుకు ఈశాన్యంలో ఆధునిక సిరియాలో ఇది ఉంది.

  • ఆరాములో నివసించే ప్రజలకు "ఆరామీయులు"అని పేరు వచ్చింది. వీరు "అరమేయిక్" భాష మాట్లాడుతారు. యేసు, ఇతర ఆ కాలంలో యూదులు అరమేయిక్ మాట్లాడే వారు.
  • షేము కుమారుల్లో ఒకడి పేరు ఆరాము. ఇదే పేరున్న మరొక మనిషి రిబ్కా పిన తల్లి కుమారుడు. ఒక వేళ ఆరాము ప్రాంతానికి ఈ పేరు ఈ ఇద్దరు మనుషుల్లో ఒకరి మూలంగా కలిగి ఉండవచ్చు.
  • ఆరాము తరువాత కాలంలో గ్రీకు పేరు "సిరియా"తో ప్రసిద్ధికెక్కింది.
  • "పద్దన్ ఆరాము"అంటే "ఆరాము మైదానం."ఈ మైదానం ఆరాముకు ఉత్తరాన ఉంది.
  • అబ్రాహాము బంధువులు కొందరు హారాను పట్టణంలో నివసించారు. ఇది "పద్దన్ ఆరాము"లో ఉంది.
  • పాత నిబంధనలో, కొన్ని సార్లు పదాలు "ఆరాము” “పద్దన్ ఆరాము"ఒకే ప్రాంతం.
  • ఈ పదం "ఆరాము నహరాయిము" అంటే "రెండు నదుల ఆరాము." ఈ ప్రాంతం మెసపొటేమియా ఉత్తరాన ఉంది. "పద్దన్ ఆరాము"కు తూర్పున ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: మెసపొటేమియా, పద్దన్ ఆరాము, రిబ్కా, షేము, సిరియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H758, H763, G689

ఆసా

వాస్తవాలు:

ఆసా యూదా రాజ్యంపై క్రీ. పూ. 913 నుండి క్రీ. పూ. 873 వరకు నలభై సంవత్సరాలు పరిపాలన సాగించాడు

  • ఆసా రాజు మంచి రాజు. అతడు అబద్ధ దేవుళ్ళ అనేక విగ్రహాలు ధ్వంసం చేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధన తిరిగి మొదలు పెట్టేలా చేశాడు.
  • యెహోవా ఇతర జాతులకు వ్యతిరేకంగా ఆసా రాజుకు యుద్ధాల్లో విజయం ఇచ్చాడు.
  • అయితే తరువాత తన పరిపాలనలో, ఆసా రాజు యెహోవాపై ఆధార పడడం మానినప్పుడు అతణ్ణి వ్యాధి పాలు చేసి ఎట్టకేలకు అతణ్ణి చంపాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H609

ఆసాఫు

వాస్తవాలు:

ఆసాఫు లేవీయుడు, యాజకుడు. వరం గల సంగీతకారుడు. అతడు దావీదు రాజు కీర్తనలకు సంగీతం సమకూర్చాడు. అతడు తన స్వంత కీర్తనలు కూడా రాశాడు.

  • ఆసాఫు దావీదు రాజుచే నియమించ బడిన ముగ్గురు సంగీత విద్వాంసుల్లో ఒకడు. ఆలయంలో ఆరాధన నిమిత్తం పాటలు కూర్చడం వీరి బాధ్యత. ఈ పాటల్లో కొన్ని ప్రవచనాలు కూడా.
  • ఆసాఫు తన కుమారులకు శిక్షణ నిచ్చాడు. వారు ఆ బాధ్యత కొనసాగించారు. ఆలయంలో సంగీత వాయిద్యాలు వాయిస్తూ ప్రవచిస్తూ ఉన్నారు.
  • ఈ సంగీత వాయిద్యాలు వేణువు, వీణ, బాకా, తాళాలు.
  • కీర్తనలు 50, 73-83 ఆసాఫు రాసినవని అంటారు. ఈ కీర్తనల్లో కొన్ని తన కుటుంబ సభ్యులు రాసి ఉండ వచ్చు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: సంతతి వాడు, వీణ, వేణువు, ప్రవక్త, కీర్తనలు, బాకా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H623

ఆసియా

వాస్తవాలు:

బైబిల్ కాలాల్లో, "ఆసియా" అనేది రోమా సామ్రాజ్యంలో ఒక పరగణా పేరు. ఇది ప్రస్తుత టర్కీ దేశం పశ్చిమ భాగంలో ఉంది.

  • పౌలు ఆసియా అనేక పట్టణాల్లో సువార్త వ్యాపింపజేస్తూ ప్రయాణించాడు. ఈ పట్టణాల్లో ఎఫెసు, కొలోస్సయి ఉన్నాయి.
  • ఆధునిక ఆసియా విషయంలో గందరగోళం తప్పించుకోవాలంటే దీన్ని “ఆసియా అనే పేరుగల ప్రాచీన రోమా పరగణా” అని తర్జుమా చేయడం అవసరం కావచ్చు.
  • ప్రకటన గ్రంథంలో పేర్కొన్న సంఘాలు అన్నీ ఆసియా అనే రోమా పరగణా లోనివే.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: [రోమ్]

Rome, Paul, Ephesus)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1కొరింతి 16:19-20
  • 1పేతురు 01:1-2
  • 2తిమోతి 01:15-18
  • అపో. కా. 06:8-9
  • అపో. కా. 16:6-8
  • అపో. కా. 27:1-2
  • ప్రకటన 01:4-6
  • రోమా 16:3-5

పదం సమాచారం:

  • Strong's: G773

ఆహష్వేరోషు

వాస్తవాలు:

ఆహష్వేరోషు ప్రాచీన పర్షియా రాజ్యం ఇరవై సంవత్సరాలు పరిపాలించిన రాజు.

  • ఇది యూదులు బాబిలోనియాలో ప్రవాసులుగా ఉన్నప్పుడు వారు పర్షియా సామ్రాజ్యం కింద ఉన్నప్పుడు జరిగింది.
  • ఈ రాజుకు మరొక పేరు జెరిజిస్ అయి ఉండవచ్చు.
  • తన రాణిని తాత్కాలిక కోపంలో పంపించి వేశాక అహష్వేరోషు రాజు ఒక యూదు స్త్రీని కొత్త భార్యగా రాణిగా నియమించి ఆమెకు ఎస్తేరు అని పేరు పెట్టాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: బబులోను, ఎస్తేరు, ఇతియోపియా, ప్రవాసం, పర్షియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H325

ఆహాజు#

నిర్వచనం:

ఆహాజు క్రీ. పూ 732 నుండి క్రీ. పూ 716 వరకూ యూదా రాజ్యాన్ని పరిపాలించిన దుష్ట రాజు. ఎంతో మంది ప్రజలు ఇశ్రాయేలు, యూదా ప్రదేశాల నుంచి బాబిలోనియా చెరకు వెళ్ళిపోవడానికి 140 సంవత్సరాల ముందు ఇతడు పరిపాలించాడు.

  • ఇతడు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆహాజు ఒక బలిపీఠం కట్టి ఆష్షురు జాతివారి అబద్ధ దేవుళ్ళ ఆరాధన జరిపాడు. ఆ విధంగా ప్రజలు నిజం దేవుడు యెహోవానుండి మరలి పోయేలా చేశాడు.
  • ఆహాజు రాజు యూదాపై పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 20 సంవత్సరాలు. అతడు 16సంవత్సరాలు పరిపాలించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H271

ఆహాబు

వాస్తవాలు:

ఆహాబు చాలా దుర్మార్గుడైన రాజు. ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యాన్ని క్రీ. పూ. 875 నుండి 854 వరకు పరిపాలించాడు.

  • ఆహాబు రాజు ఇశ్రాయేలు ప్రజలను అబద్ద దేవుళ్ళ అరాధనకై ప్రేరేపించాడు.
  • ప్రవక్త ఏలియా ఆహాబుకు ఎదురు నిలిచి మూడున్నర సంవత్సరాలు తీవ్రమైన కరువు రానున్నదని చెప్పాడు. ఆహాబు చేయించిన పాపాలకై మనుషులను శిక్షించడానికి ఇది వస్తుంది.
  • ఆహాబు, అతని భార్య యెజెబెలు అనేక చెడ్డ పనులు చేశారు. తమ అధికారాన్ని ఉపయోగించి నిర్దోష ప్రజలను చంపించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బయలు, ఏలియా, యెజెబెలు, ఇశ్రాయేల్ రాజ్యం, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 19:02 ఆహాబు ఇశ్రాయేల్ రాజ్యంపై ఏలుబడి చేస్తున్నప్పుడు ఏలియా అక్కడి ప్రవక్త. ఆహాబు దుష్టుడు. బయలు అనే పేరున్న అబద్ధ దేవుడి పూజలు ప్రోత్సహించాడు.
  • 19:03 ఆహాబు అతని సైన్యం ఏలియా కోసం వెదికారు. అతడు వారికి దొరకలేదు.
  • 19:05 మూడున్నర సంవత్సరాల తరువాత, ఇశ్రాయేల్ రాజ్యానికి తిరిగి వెళ్లి ఆహాబుతో మాట్లాడమని దేవుడు ఏలియాకు చెప్పాడు. ఎందుకంటే మరలా వాన కురియబోతున్నది.

పదం సమాచారం:

  • Strong's: H256

ఇతియోపియా, ఇతియోపీయుడు

వాస్తవాలు:

ఇతియోపియా దేశం ఆఫ్రికాలో ఈజిప్టుకు దక్షిణాన ఉన్న దేశం. పశ్చిమాన నైలు నది, తూర్పున ఎర్ర సముద్రం ఉన్నాయి. ఇతియోపియా మనిషిని "ఇతియోపీయుడు" అంటారు.

  • ప్రాచీన ఇతియోపియా ఈజిప్టుకు దక్షిణంగా ఉంది. ఇప్పుడు అనేక ఆధునిక ఆఫ్రికా దేశాలు, సూడాన్, ఆధునిక ఇతియోపియా, సోమాలియా, కెన్యా, ఉగాండా, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, చాడ్ ఇక్కడ ఉన్నాయి.
  • బైబిల్లో ఇతియోపియాను కొన్ని సార్లు "కూషు” లేక “నూబియా" అని పిలిచాడు
  • ఇతియోపియా ("కూషు"), ఈజిప్టు దేశాలను తరచుగా బైబిల్లో కలిపి ప్రస్తావించారు. ఎందుకంటే అవి ఒకదానికి ఒకటి అనుకుని ఉన్నాయి. వారి ప్రజలకు ఒకే పూర్వీకులు ఉండి ఉంటారు.
  • దేవుడు సువార్తికుడు ఫిలిప్పును ఎడారి దారిన పంపించగా అతడు ఒక ఇతియోపీయ నపుంసకునికి యేసును గురించిన సువార్త వినిపించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కూషు, ఈజిప్టు, నపుంసకుడు, ఫిలిప్పు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3568, H3569, H3571, G128

ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, ఇశ్రాయేలీయులు, యాకోబు

వాస్తవాలు:

యాకోబు ఇస్సాకు, రిబ్కాలకు పుట్టిన కవలల్లో ఒకడు.

  • యాకోబు పేరుకు అర్థం "అతడు మడమను పట్టుకున్నాడు" ఈ మాట అర్థం "అతడు మోసగించే వాడు." యాకోబు పుడుతున్నప్పుడు అతడు సోదరుడు ఏశావు మడిమె పట్టుకున్నాడు.
  • అనేక సంవత్సరాలు తరువాత, దేవుడు యాకోబు పేరును "ఇశ్రాయేలు," అని మార్చాడు. అంటే "అతడు దేవునితో పోరాడాడు."
  • యాకోబు యుక్తిపరుడు, కపటమైనవాడు. అతడు మొదట పుట్టినవాడి ఆశీర్వాదం, వారసత్వ హక్కులు నుండి తన అన్న ఏశావు దగ్గరనుండి లాగేసుకోవాలని చూశాడు.
  • ఏశావు కోపగించుకుని యాకోబును చంపడానికి చూశాడు. అందుకని యాకోబు తన స్వదేశం విడిచి పారిపోయాడు. అయితే సంవత్సరాలు తరువాత యాకోబును తన భార్యలతో, పిల్లలతో ఏశావు ఉంటున్న కనాను ప్రదేశం తిరిగి వెళ్ళమని దేవుడు చెప్పాడు. వారి కుటుంబాలు ఒకరితో ఒకరు సామరస్యంగా నివసించారు.
  • యాకోబుకు పన్నెండు మంది కుమారులు. వారి సంతానం పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలుగా అయ్యారు.
  • యాకోబు అనే పేరు గల వేరువేరు మనుషులు ఉన్నారు. వారిలో మత్తయి రాసిన యేసు వంశవృక్షంలో యోసేపు తండ్రి ఉన్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:Israel, twelve tribes of Israel, Leah, Rachel, Zilpah, Bilhah, deceive, Esau, Isaac, Rebekah, Laban)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 07:01 పిల్లలు ఎదుగుతూ ఉండగా రిబ్కా యాకోబును ప్రేమించింది. అయితే ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. యాకోబుకు ఇంటిపట్టున ఉండడం ఇష్టం, అయితే ఏశావుకు వేట అంటే ఇష్టం.
  • 07:07 యాకోబు అనేక సంవత్సరాలు, అక్కడ నివసించి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. అతనికి పన్నెండు మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. దేవుడు అతణ్ణి ధనికుడుగా చేశాడు.
  • 07:08 ఇరవై సంవత్సరాల తరువాత అక్కడ నుండి తన కుటుంబం, సేవకులు, తన మందలు అన్నిటినీ తీసుకుని కనానులో తన ఇంటికి తిరిగి వెళ్ళమని దేవుడు చెప్పాడు.
  • 07:10 దేవుడు అబ్రాహాముకు చేసిన నిబంధన వాగ్దానం ఇస్సాకుకు, ఇప్పుడు యాకోబు కు సంక్రమించింది.
  • 08:01 అనేక సంవత్సరాలు తరువాత, యాకోబు వృద్ధాప్యంలో అతడు ఇష్టమైన కుమారుడు, యోసేపును మందలను కాస్తున్న అతని సోదరుల దగ్గరకు పంపించాడు.

పదం సమాచారం:

  • Strong’s: H3290, G23840

ఇష్మాయేలు, ఇష్మాయేలీయుడు, ఇష్మాయేలీయులు

వాస్తవాలు:

ఇష్మాయేలు అబ్రాహాముకు ఐగుప్తియ బానిస హాగరుకు పుట్టిన కుమారుడు. అనేక ఇతర మనుషులు పాత నిబంధనలో ఇష్మాయేలు అనే పేరుగల వారు ఉన్నారు.

  • "ఇష్మాయేలు" అంటే "దేవుడు వింటాడు."
  • దేవుడు అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలును దీవిస్తానని వాగ్దానం చేశాడు. అయితే అతడు దేవుడు తన నిబంధన స్థిరపరుస్తానని వాగ్దానం చేసిన కుమారుడు కాడు.
  • దేవుడు హాగరును ఇష్మాయేలును వారు ఎడారిలోకి వెళ్ళగొట్టబడినప్పుడు కాపాడాడు.
  • ఇష్మాయేలు పారాను ఎడారిలో ఉన్నప్పుడు ఒక అతడు ఐగుప్తియ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు.
  • నెతన్యా కుమారుడు ఇష్మాయేలు సైన్యంలో అధికారి గవర్నర్ ను మట్టు బెట్ట డానికి బాబిలోనియా రాజు, నెబుకద్నేజర్ నియమించిన మనుషులకు నాయకుడు.
  • పాత నిబంధనలో నలుగురు ఇష్మాయేలు అనే పేరు గల ఇతర మనుషులు ఉన్నారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, బబులోను, నిబంధన, ఎడారి, ఈజిప్టు, హాగరు, ఇస్సాకు, నెబుకద్నేజర్, పారాను, శారా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 05:02 కాబట్టి అబ్రాము హాగరును పెళ్లి చేసుకున్నాడు. హాగరుకు మగపిల్లవాడు పుట్టాడు. అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.
  • 05:04 "నేను ఇష్మాయేలును గొప్ప జాతిగా చేస్తాను. అయితే నా నిబంధన మాత్రం ఇస్సాకుతో చేస్తాను."

పదం సమాచారం:

  • Strong's: H3458, H3459

ఇస్సాకు

వాస్తవాలు:

ఇస్సాకు అబ్రాహాము శారాల ఏకైక కుమారుడు. వారు వృద్దులైనప్పటికి దేవుడు వారికి కొడుకునిస్తానని వాగ్దానం చేశాడు.

  • "ఇస్సాకు" అంటే "అతడు నవ్వుతాడు." దేవుడు అబ్రాహాముకు శారా కొడుకును కంటుందని చెబితే , అబ్రాహాము నవ్వాడు. ఎందుకంటే వారు ఇద్దరూ ముసలివాళ్ళే. కొంత కాలం తరువాత, శారా ఆ వార్త విని ఆమె కూడా నవ్వింది.
  • అయితే దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు. అబ్రాహాము, శారాలకు వారి ముసలి తనంలో ఇస్సాకు పుట్టాడు.
  • దేవుడు అబ్రాహాముతో నిబంధన చేశాడు. తాను అబ్రాహాముతో చేసిన నిబంధన ఇస్సాకుకు, తరువాత తన సంతానానికి శాశ్వతకాలం ఉంటుంది.
  • ఇస్సాకు యువ ప్రాయంలో దేవుడు అబ్రాహాము విశ్వాసపరీక్ష చేస్తూ ఇస్సాకును బలి అర్పణ చేయమని చెప్పాడు.
  • ఇస్సాకు కుమారుడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు. వారి సంతానం తరువాత పన్నెండు గోత్రాలుగా ఇశ్రాయేలు జాతి అయ్యారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, సంతతి వాడు, నిత్యత్వం, నెరవేర్చు, యాకోబు, శారా, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 05:04 "నీ భార్య, శారా, కుమారుణ్ణి —కంటుంది. అతడు వాగ్దానపుత్రుడు. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టు."
  • 05:06 ఇస్సాకు యువకుడుగా ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించాడు, "నీ ఏకైక కుమారుడు ఇస్సాకు, బలి అర్పణగా నాకు అర్పించు."
  • 05:09 దేవుడు ఇస్సాకుకు బదులుగా బలి అర్పణ కోసం ఒక పొట్టేలును చూపించాడు_.
  • 06:01 అబ్రాహాము వృద్ధుడు అయినప్పుడు అతని కుమారుడు, ఇస్సాకు, పెద్ద వాడయ్యాక అబ్రాహాము తన సేవకుల్లో ఒకడిని తన దేశంలో తన బంధువుల దగ్గరకు తన కుమారుడు, ఇస్సాకు కు భార్యను తెమ్మని పంపించాడు.
  • 06:05 ఇస్సాకు ప్రార్థించగా రిబ్కా గర్భవతి కావడానికి దేవుడు అనుమతించాడు. ఆమె కవలలకు జన్మనిచ్చింది.
  • 07:10 తరువాత ఇస్సాకు చనిపోయాక, యాకోబు, ఏశావు అతన్ని పాతిపెట్టారు. అబ్రాహముకు దేవుడు చేసిన నిబంధన వాగ్దానం ప్రకారం అతని తరువాత అది ఇస్సాకుకు ఇప్పుడు యాకోబుకు సంక్రమించింది.

పదం సమాచారం:

  • Strong's: H3327, H3446, G2464

ఇస్సాఖారు

వాస్తవాలు:

ఇస్సాఖారు యాకోబు ఐదవ కుమారుడు. అతని తల్లి లేయా.

  • ఇస్సాఖారు గోత్రం పన్నెండు ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకటి.
  • ఇస్సాఖారు భూభాగం నఫ్తాలి, జెబూలూను, మనష్శే, గాదు ప్రాంతాల మధ్యలో ఉంది.
  • సరిగ్గా గలిలీ సరస్సుకు దక్షిణాన ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: గాదు, మనష్శే, నఫ్తాలి, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు, జెబూలూను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3485, G2466

ఈకోనియ

వాస్తవాలు:

ఈకోనియ ప్రస్తుత టర్కీ దేశంలో దక్షిణ కేంద్ర ప్రాంతంలో ఉన్న పట్టణం.

  • పౌలు మొదటి మిషనెరీ ప్రయాణంలో అతడు, బర్నబా ఈకోనియకు వెళ్లారు. యూదులు వారిని అంతియొకయ పట్టణంలోనుంచి వెళ్ళగొట్టినప్పుడు వారు ఇక్కడికి వచ్చారు.
  • తరువాత విశ్వసించని యూదులు, మరియు యూదేతరులు/అన్యజనులు ఈకోనియలో కూడా పౌలును తన జతపనివారిని రాళ్ళతో కొట్టాలని చూశారు. అయితే వారు తప్పించుకొని దగ్గరున్న లుస్త్ర పట్టణం చేరుకున్నారు.
  • ఆ తరువాత అంతియొకయ ఈకోనియ వారు లుస్త్రకు వచ్చి ప్రజలను రాళ్ళతో కొట్టునట్లు రేపారు/పురికొల్పారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: [బర్నబా] (../names/barnabas.md), Lystra, stone)

బైబిల్ రిఫరెన్సులు:

  • 2 తిమోతి 03:10-13
  • అపో. కా. 14:01
  • అపో. కా. 14:19-20
  • అపో. కా. 16:01-03

పదం సమాచారం:

  • Strong's: G24300

ఉద్యమకారుడైన (జెలొతె) సీమోను

వాస్తవాలు:

ఉద్యమకారుడైన సీమోను యేసు పన్నెండుమంది శిష్యులలో ఒకడైయుండెను.

  • సీమోను పేరును యేసు శిష్యుల పట్టికలలో మూడు సార్లు పేర్కొనబడియున్నది, అయితే కొంతమట్టుకు మాత్రమె ఆయనను గూర్చి సమాచారము కలదు.
  • యేసు పరలోకమునకు తిరిగి వెళ్లిన తరువాత యెరూషలేములో ప్రార్థన చేయుటకు కలిసికొనిన పదకొండుగురులో సీమోను ఒకడైయుండెను.
  • “జెలోతే” అనే పదము ద్వారా సీమోను “జెలోతియులలో” ఒకడైయున్నాడని పరోక్షముగా తెలియజేయుచున్నది, యూదుల మత సంఘము రోమా ప్రభుత్వమును బలముగా ఎదురించుచున్నప్పుడే, మోషే ధర్మశాస్త్రమును ఎత్తిపట్టుటలో రోషముగలవారైయుండిరి.
  • లేక “జెలోతే” అనగా “రోషముగల వ్యక్తి” అర్థము, తద్వారా సీమోను మతసంబంధమైన రోషము కలిగియున్నాడని సూచించుచున్నది.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:apostle, disciple, the twelve)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong’s: G22080, G25810, G46130

ఉప్పు సముద్రము, మృత సముద్రము

వాస్తవాలు:

ఉప్పు సముద్రము (దీనిని మృత సముద్రము అని కూడా పిలుతురు) పశ్చిమ దిక్కునున్న దక్షిణ ఇశ్రాయేలుకు మరియు తూర్పు దిక్కునున్న మోయాబుకు మధ్యన చూడగలము.

  • యోర్దాను నది దక్షిణ దిక్కునుండి ప్రవహించి ఉప్పు సముద్రములోనికి చేరును.
  • ఎందుకంటే ఇది సముద్రములన్నిటికంటే చిన్నది, దీనిని “ఉప్పు చెరువు” అని కూడా పిలువవచ్చు.
  • ఈ సముద్రపు నీళ్ళలో ఎటువంటి జీవరాశులు ఉండనంతగా అతి ఎక్కువ ఖనిజాలను (లేక “లవణాలు”) ఈ సముద్రము కలిగియున్నది. ఇందులో చెట్లు మరియు ప్రాణులు కరువైనందునే దీనికి “మృత సముద్రము” అని పేరు పెట్టిరి.
  • పాత నిబంధనలో ఈ సముద్రమును “అరాబ సముద్రము” అని మరియు “నెగేవ్ సముద్రము” అని కూడా పిలిచిరి, ఎందుకంటే ఈ సముద్రము అరాబ్ మరియు నెగేవ్ ప్రాంతాలకు అతి దగ్గరగా ఉండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(ఈ పదములను కూడా చూడండి: అమ్మోను, అరాబ, యోర్దాను నది, మోయాబు, నెగేవ్)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3220, H4417

ఊరియా

##వాస్తవాలు: ##

ఊరియా నీతిపరుడును మరియు దావీదు యొక్క ముఖ్యమైన సైనికులలో ఒకడు. అతనిని “ హిత్తీయుడైన ఊరియా” అని ఎక్కువగా పిలిచేవారు.

  • ఊరియా సౌందర్యవతియైన భార్యను కలిగిఉండెను, ఆమె పేరు బత్షేబ.
  • దావీదు ఊరియా యొక్క భార్యతో వ్యభిచరించెను, మరియు ఆమె గర్భవతి అయ్యి దావీదుకుమారునికి తల్లి అయ్యెను.
  • తన పాపము కప్పుకొనుటకై, యుద్దమునందు ఊరియా మరణమునొందుటకు దావీదు కారణము అయ్యెను. తరువాత దావీదు బత్షేబను వివాహము చేసుకొనెను.
  • ఆహాజు రాజు పరిపాలనకాలములో ఊరియా అను మరోపేరు గల మరియొక ప్రధాన యాజకుడు కూడా ఉండెవాడు.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి: ఆహాజు, బత్షేబ, దావీదు, హిత్తీ)

##బైబిలు వచనములు: ##

##బైబిలు కథల నుండి కొన్ని ఉదాహరణలు:##

  • 17:12 బత్షేబ యొక్క భర్త అయిన ఊరియా దావీదు సైనికులలో ఒకడు. దావీదు ఊరియాను తన భార్యతో కలిసి ఉండుటకై యుద్దమునుండి వెనుకకు రప్పించెను. కాని ఊరియా సైనికులను యుద్దములో వుండగా తిరిగివచ్చుటకు నిరాకరించెను. ఆందుకు దావీదు ఊరియాను యుద్దములో తన స్థానమునకు తిరిగిపంపెను. అక్కడ శత్రువు ధాటి బలంగా ఉన్నందువలన అతడు చంపబడెను.
  • 17:13 తరువాత ఊరియా చంపబడెను,దావీదు బత్షేబను వివాహము చేసుకొనెను.

పదం సమాచారం:

  • Strong's: H223, G3774

ఎక్రోను, ఎక్రోనీయులు

వాస్తవాలు:

ఎక్రోను ఫిలిష్తీయుల ముఖ్య పట్టణం. ఇది మధ్యదరా సముద్రం నుండి తొమ్మిది మైళ్ళ లోపలి ఉంది.

  • అబద్ధ దేవుడు బయల్ జెబూబు ఆలయం ఎక్రోనులో ఉంది.
  • ఫిలిష్తీయులు నిబంధన మందసం పట్టుకున్నప్పుడు వారు దాన్ని అష్డోదుకు, అటు తరువాత గాతుకు, ఎక్రోనుకు తీసుకు పోయారు. ఎందుకంటే దేవుడు ఆ ప్రజలకు వ్యాధి కలిగిస్తూ వచ్చాడు. మందసం ఎక్కడికి తీసుకుపోతే ఆ పట్టణం ప్రజలు మరణించారు. చివరకు ఫిలిష్తీయులు మందసాన్ని తిరిగి ఇశ్రాయేలుకు పంపేశారు.
  • అహజ్యా రాజు తన ఇంటి మేడ మీద నుండి పడి గాయ పడినప్పుడు ఆ గాయాల మూలంగా తాను చనిపోతానా అని ఎక్రోనులోని అబద్ధ దేవుడు బయల్ జెబూబు దగ్గర విచారణ చేసి అతడు పాపం చేశాడు. ఆ పాపం ఫలితంగా అతడు చనిపోతాడని యెహోవా చెప్పాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అహజ్యా, నిబంధన మందసం, అష్డోదు, బయెల్జబూలు, అబద్ధ దేవుడు, గాతు, ఫిలిష్తీయులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6138, H6139

ఎజ్రా

వాస్తవాలు:

ఎజ్రా ఇశ్రాయేలు యాజకుడు. యూదు చట్టంలో నిపుణుడు. ఇశ్రాయేలీయులు70 సంవత్సరాలు చెరలో ఉన్న తరువాత బబులోను నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పటి చరిత్ర ఇతడు రాశాడు.

  • ఎజ్రా ఇశ్రాయేలీయుల చరిత్రలో కొంత భాగం బైబిల్ పుస్తకం ఎజ్రాలో రాశాడు. అతడు నెహెమ్యా కూడా రాసి ఉండవచ్చు. ఎందుకంటే ఈ రెండు పుస్తకాలు మొదట్లో ఒకటే పుస్తకం.
  • ఎజ్రా యెరూషలేముకు తిరిగి వెళ్ళిన తరువాత అతడు ధర్మశాస్త్ర చట్టాలను మరలా స్థిరపరచాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు సబ్బాతు చట్టాలకు లోబడక ఇతర విగ్రహారాధక మతాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు.
  • బబులోనీయులు యెరూషలేమును పట్టుకుని నాశనం చేసిన ఆలయాన్ని తిరిగి కట్టించడానికి ఎజ్రా సహాయం చేశాడు.
  • పాత నిబంధనలో ఎజ్రా పేరు గల ఇద్దరు ఇతర మనుషులను ప్రస్తావించింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను, ప్రవాసం, యెరూషలేము, చట్టం, నెహెమ్యా, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H250, H5830, H5831, H5834

ఎదోము, ఎదోమీయుడు, ఎదోమీయులు, ఇదుమియా#

వాస్తవాలు:

ఎదోము అనేది ఏశావుకు మరొకపేరు. అతడు నివసించిన ప్రాంతానికి "ఎదోము" అనీ, అటు తరువాత, "ఇదుమియా" అనీ పేరు వచ్చింది. "ఎదోమీయులు" అతని సంతానం.

  • ఎదోము ప్రాంతం ఉనికి మారుతూ వచ్చింది. మొత్తం మీద ఇశ్రాయేలుకు దక్షిణాన, ఎట్టకేలకు దక్షిణ యూదాకు వ్యాపించింది.
  • కొత్త నిబంధన సమయాల్లో ఎదోము యూదా దక్షిణ పరిధి భాగంలో ఉంది. గ్రీకులు దీన్ని "ఇదుమియా" అని పిలిచారు.
  • "ఎదోము" అంటే "ఎరుపు," బహుశా ఇది పుట్టుకతోనే ఏశావు శరీరంపై ఉన్న ఎర్రని వెంట్రుకల మూలంగా వచ్చి ఉండవచ్చు. లేదా ఏశావు తన జన్మ హక్కు ను అమ్ముకుని తిన్న ఎర్రని చిక్కుడు కూర మూలంగా వచ్చి ఉండవచ్చు.
  • పాత నిబంధనలో ఎదోము దేశాన్ని తరచుగా ప్రస్తావించినది ఇశ్రాయేలుకు శత్రు దేశంగా.
  • ఓబద్యా మొత్తం పుస్తకం ఎదోము నాశనం గురించే. ఇతర పాత నిబంధన ప్రవక్తలు ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనాలు పలికారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ప్రత్యర్థి, జన్మ హక్కు, ఏశావు, ఓబద్యా, ప్రవక్త)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H123, H130, H8165, G2401

ఎన్ గెదీ#

నిర్వచనం:

ఎన్ గెదీ ఒక పట్టణం పేరు. ఇది యూదా అరణ్య ప్రాంతంలో యెరూషలేముకు ఆగ్నేయ దిశగా ఉంది.

  • ఎన్ గెదీ ఉప్పు సముద్రం పశ్చిమ తీరాన ఉంది.
  • ఈ పేరులో ఒక భాగానికి "ఊట," అని అర్థం. నీటి ఊట ఈ పట్టణం నుండి సముద్రం వరకు పారుతుంది.
  • ఎన్ గెదీలో అందమైన ద్రాక్ష తోటలు, ఇంకా సారవంతం అయిన నేల ఉన్నాయి. బహుశా నీరు ఊట ద్వారా ఎడతెగక ప్రవహిస్తూ ఉండడం చేత.
  • ఎన్ గెదీ లో దుర్గం ఉంది. దావీదును సౌలు తరుముతూ ఉంటే అతడు ఇక్కడికి పారిపోయాడు.

(చూడండి: దావీదు, ఎడారి, ఊట, యూదా, విశ్రాంతి, ఉప్పు సముద్రం, సౌలు , దుర్గం, ద్రాక్ష తోట)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5872

ఎఫెసు, ఎఫెసీయుడు

వాస్తవాలు:

ఎఫెసు ఒక ప్రాచీన గ్రీకు పట్టణం.ఇది ప్రస్తుత టర్కీ దేశంలో పశ్చిమ తీర ప్రాంతంలో ఉంది.

  • ఆది క్రైస్తవుల కాలంలో ఆసియా ఎఫెసు ముఖ్య పట్టణం. ఇది ఆ సమయంలో చిన్న రోమా పరగణా.
  • దీని ఉనికిని బట్టి ఈ పట్టణం వాణిజ్యం, నౌకాయానాలకు ప్రాముఖ్య కేంద్రం.
  • ప్రఖ్యాత అర్తెమి దేవత (డయానా) ఆలయం ఎఫెసులో ఉంది.
  • పౌలు ఎఫెసులో రెండు సంవత్సరాలు నివసించాడు, పని చేశాడు. ఆ తరువాత తిమోతిని కొత్త విశ్వాసులను చూసుకోమని నియమించాడు.
  • ఎఫెసి పత్రిక కొత్త నిబంధనలో ఎఫెసు విశ్వాసులకు పౌలు రాసిన ఒక ఉత్తరం.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: [ఆసియా] Asia, Paul, Timothy)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1 కొరింతి 15:31-32
  • 1 తిమోతి 01:3-4
  • 2 తిమోతి 04:11-13
  • అపో. కా. 19:1-2
  • ఎఫెసి 01:1-2

పదం సమాచారం:

  • Strong's: G2179, G2180, G2181

ఎఫ్రాతు, ఎఫ్రాతా

వాస్తవాలు

ఎఫ్రాతు మరియు ఎఫ్రాతా అను పేర్లు బహుశా యోసేపు కుమారులలో ఒకడు. మరియు ఇశ్రేయేలు 12 గోత్రాలలో ఒకదానికి మూలా పురుషుడు.

  • బేతేలు పట్టణానికి సమీపంలో రాహేలు చనిపోయిన ప్రదేశాని పేరు  “ఎఫ్రాతా”
  • పాత నిబంధనలో ఒక స్త్రీ పేరు “ఎఫ్రాతా” ఆమె కాలేబు భార్య.
  • బేత్లెహేము మరియు కిర్యత్యారీము అను రెండు పట్టణములు వేరు వేరు ప్రాంతాలలో ఉన్నప్పటికీ “ఎఫ్రాతా” అని కూడా పిలవబడతాయి. (బేతేలు దగ్గర)

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: [బెత్లెహేము] Bethlehem, Boaz, Caleb, David, Israel)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0672, H0673

ఎఫ్రాయీము, ఎఫ్రాయీమీయుడు

వాస్తవాలు:

ఎఫ్రాయీము యోసేపు చిన్న కుమారుడు. అతని వారసులు, ఎఫ్రాయిమీయులు, ఇశ్రాయేలు గోత్రాలలో ఒకటిగా ఏర్పడ్డారు.

  • ఎఫ్రాయీము అనే పేరు హీబ్రూ పదం లాగా ఉంది, దీని అర్థం “ఫలవంతంగా చేయడం”.
  • ఇశ్రాయేలు ఉత్తర భాగంలో ఉన్న పది గోత్రాలలో ఎఫ్రాయీము గోత్రం ఒకటి.
  • కొన్నిసార్లు ఎఫ్రాయీము అనే పేరు బైబిలులో ఇశ్రాయేలు యొక్క మొత్తం ఉత్తర రాజ్యాన్ని సూచించడానికి ఉపయోగించబడింది (ఇశ్రాయేలు యొక్క మొత్తం దక్షిణ రాజ్యాన్ని సూచించడానికి కొన్నిసార్లు యూదా అనే పేరు ఎలా ఉపయోగించబడుతుందో అదే విధంగా ఉంటుంది).

(అనువాద సూచనలు: [పేర్లను అనువదించడం ఎలా]

(ఇవి కూడా చూడండి: [యోసేపు], [మనష్షే], [ఇశ్రాయేలు యొక్క రాజ్యం], [ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలు])

బైబిలు రిఫరెన్సులు:

  • [1 దినవృత్తాంతములు 6:66-69]
  • [2 దినవృత్తాంతములు 13:4-5]
  • [యెహెజ్కేలు 37:16]
  • [ఆదికాండము 41:52]
  • [ఆదికాండము 48:1-2]
  • [యోహాను 11:54]

పదం సమాచారం:

  • Strong's: H0669, H0673, G21870

ఎలియాజరు

వాస్తవాలు:

ఎలియాజరు పేరు బైబిల్లో అనేక మంది మనుషులకు ఉంది.

  • ఎలియాజరు మోషే సోదరుడు అహరోనుకు మూడవ కుమారుడు. అహరోను చనిపోయాక, ఎలియాజరు ఇశ్రాయేలుకు ప్రధాన యాజకుడు అయ్యాడు.
  • ఎలియాజరు దావీదు యుద్ధ వీరులలో ఒకడి పేరు.
  • మరొక ఎలియాజరు యేసు పూర్వీకుల్లో ఒకడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అహరోను, ప్రధాన యాజకుడు, దావీదు, శూరుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H499, G1648

ఎలీషా

వాస్తవాలు:

ఎలీషా ఈరాజుల కాలంలో ఇశ్రాయేలు ప్రవక్త: ఆహాబు, అహజ్యా, యెహోరాము, యెహూ, యెహోయాహాజు, యెహోయాషు.

  • దేవుడు ఏలీయా ప్రవక్తతో ఎలీషాను ప్రవక్తగా అభిషేకించమని చెప్పాడు.

  • ఏలీయా అగ్ని రథంపై పరలోకం కొనిపోబడినప్పుడు ఎలీషా ఇశ్రాయేలుకు ప్రవక్త అయ్యాడు.

  • ఎలీషా అనేక అద్భుతాలు చేశాడు. సిరియా నుండి వచ్చిన వ్యక్తి కుష్టువ్యాధి నుండి స్వస్థత కలిగించాడు. షూనేము స్త్రీ కుమారుడిని తిరిగి బ్రతికించాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: ఏలీయా, నయమాను, ప్రవక్త)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H0477

ఎలీసబెతు

వాస్తవాలు:

ఎలీసబెతు బాప్తిస్మమిచ్చు యోహాను తల్లి. ఆమె భర్త పేరు జెకర్యా.

  • జెకర్యా ఎలీసబెతులకు పిల్లలు లేరు. అయితే వారి ముసలితనంలో ఎలీసబెతు అతనికి కుమారుణ్ణి కంటుందనిజెకర్యాకు దేవుడు వాగ్దానం చేశాడు.

  • దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు. త్వరలో ఎలీసబెతు గర్భధారణ జరిగి ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ పసివాడి పేరు యోహాను.

  • ఎలీసబెతు యేసు తల్లి మరియకు బంధువు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: యోహాను (బాప్తిస్మమిచ్చు), జెకర్యా)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

  • లూకా 01:5-7
  • లూకా 01:24-25
  • లూకా 01:39-41

పదం సమాచారం:

  • Strong's: G16650

ఎల్యాకీము

వాస్తవాలు:

ఎల్యాకీము పాత నిబంధనలో ఇద్దరు మనుషుల పేరు.

  • ఒకరు హిజ్కియా అంతఃపుర నిర్వాహకుడు.

  • మరొకరు ఐగుప్తు ఫరో నెకో ద్వారా యూదా రాజుగా ప్రకటించబడిన యోషియారాజు కుమారుడు.

  • నెకో ఎల్యాకీము పేరునుయెహోయాకీముగా మార్చాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలాతర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: హిజ్కియా, యెహోయాకీము, యోషియా, ఫరో)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H0471, G1662

ఎస్తేరు

వాస్తవాలు:

ఎస్తేరు ఒక యూదు స్త్రీ. ఆమె బాబిలోనియాలో యూదుల చెర కాలంలో పర్షియా రాజ్యానికి రాణి అయింది.

  • ఎస్తేరు గ్రంథం ఎస్తేరు పర్షియా రాజు ఆహష్వేరోషు భార్య ఎలా అయిందో, ఆమె తన ప్రజలను రక్షించుకోవడానికి దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడో చెబుతున్నది.
  • ఎస్తేరు అనాథ. ఆమెను ఆమె అన్న వరస అయిన మొర్దేకై పెంచాడు.
  • ఆమెను దత్తత తీసుకొన్న తండ్రికి ఆమె చూపిన విధేయత ఆమె దేవునికి విధేయత చూపడానికి సహాయం చేసింది.
  • ఎస్తేరు దేవునికి లోబడి తన ప్రజలైన యూదులను రక్షించడానికి తన ప్రాణాలు ఫణంగా పెట్టింది.
  • ఎస్తేరు కథ చరిత్రపై దేవుని సార్వభౌమ అదుపును, ముఖ్యంగా అయన తనకు లోబడే తన ప్రజలను కాపాడే పధ్ధతిని తెలుపుతున్నది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆహష్వేరోషు, బబులోను, మొర్దేకై, పర్షియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H635

ఏదేను, ఏదేను తోట#

వాస్తవాలు:

ప్రాచీన కాలంలో, ఏదేను ఒక ప్రాంతం. అక్కడ ఒక తోట ఉంది. అక్కడ దేవుడు మొదటి మనిషిని, స్త్రీని ఉంచాడు.

  • ఆదాము, హవ్వలు నివసించిన తోట ఏదేనులో ఒక భాగం.
  • ఏదేను కచ్చితంగా ఎక్కడ ఉన్నదో తెలియదు. అయితే టైగ్రిస్, యూఫ్రటిసు నదులు అక్కడ పారుతున్నాయి.
  • "ఏదేను" "గొప్ప ఆనందకరమైన" అని అర్థం ఇచ్చే హీబ్రూ పదం నుండి వచ్చింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆదాము, యూఫ్రటిసు నది, హవ్వ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5729, H5731

ఏలాము, ఏలామీయులు

వాస్తవాలు:

ఏలాము షేము కుమారుడు, నోవహు మనవడు

  • ఏలాము సంతానం "ఏలామీయులు," వారు "ఏలాము" ప్రదేశంలో నివసించారు.
  • ఏలాము ప్రాంతం టైగ్రిస్ నదికి ఆగ్నేయ దిశలో ఇప్పుడు పశ్చిమ ఇరాన్లో ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: నోవహు, షేము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5867, H5962, G1639

ఏలియా

వాస్తవాలు:

ఏలియా యెహోవా ప్రాముఖ్యప్రవక్తల్లో ఒకడు. ఏలియా ఆహాబు రాజుతో సహా అనేకమంది ఇశ్రాయేలు, యూదా రాజుల పరిపాలన కాలంలో ప్రవచించాడు.

  • దేవుడు అతని ద్వారా అనేక అద్భుతాలు జరిగించాడు. మృత బాలునికి జీవం పోశాడు.
  • ఏలియా అబద్ధ దేవుడు బయలును ఆరాధించినందుకు ఆహాబు రాజును గద్దించాడు.
  • అతడు యెహోవాయే నిజమైన దేవుడు అని రుజువు చేస్తానని బయలు ప్రవక్తలను సవాలు చేశాడు.
  • చివర్లో ఏలియాను దేవుడు అద్భుతమైన రీతిలో అతడు బ్రతికి ఉండగానే పరలోకం తీసుకుపోయాడు.
  • వందల సంవత్సరాలు తరువాత, ఏలియా, మోషేతో బాటు కొండపై యేసుకు కనిపించి, వారు యేసును గురించి, యెరూషలేములో ఆయనకు రానున్న హింసలు మరణం గురించి మాట్లాడారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: miracle, prophet, Yahweh)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 19:02 ఏలియా ఒక ప్రవక్త, ఆహాబు ఇశ్రాయేల్పై రాజుగా ఉన్న సమయంలో.
  • 19:02 ఏలియా ఆహాబు తో ఇలా చెప్పాడు. "నేను చెప్పే దాకా ఇశ్రాయేల్ రాజ్యంలో వాన కానీ మంచుగానీ కురియదు."
  • 19:03 దేవుడు చెప్పాడు,”ఏలియా అరణ్య ప్రాంతంలో వాగు దగ్గరికి పోయి ఆహాబునుండి దాక్కో. అతడు నిన్ను చంపడానికి చూస్తున్నాడు.” ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, పక్షులు అతనికి రొట్టె, మాంసం తెచ్చాయి.
  • 19:04 అయితే వారు ఏలియా గురించి జాగ్రత్త తీసుకున్నారు. దేవుడు వారి పిండి జాడి ఖాలీ కాకుండా, వారి సీసాలో నూనె అయిపోకుండా చేశాడు.
  • 19:05 తరువాత మూడున్నర సంవత్సరాలకు దేవుడు ఏలియాతో ఏలియా ఇశ్రాయేల్ రాజ్యం తిరిగి వెళ్ళమని ఆహాబుతో మాట్లాడమని చెప్పాడు. ఎందుకంటే ఆయన మరలా వాన పంపించ బోతున్నాడు.
  • 19:07 తరువాత ఏలియా బయలు ప్రవక్తలతో, "ఎద్దును వధించి బలి అర్పణ సిద్ధం చెయ్యండి.అయితే దానికి మంట పెట్టవద్దు."
  • 19:12 తరువాత ఏలియా"బయలు దేవుడి ప్రవక్తలను తప్పించుకోనియ్యకండి!"
  • 36:03 తరువాత మోషే, ప్రవక్త ఏలియా కనిపించారు. ఈ మనుషులు వందల సంవత్సరాలకు ముందు నివసించారు. వారు యేసుతో యెరూషలేములో అయనకు సంభవించనున్న మరణం గురించి మాట్లాడారు.

పదం సమాచారం:

  • Strong's: H452, G2243

ఏశావు

వాస్తవాలు:

ఏశావు ఇస్సాకు, రిబ్కాల కవల పిల్లల్లో ఒకడు. అతడు ఇస్సాకుకు పుట్టిన మొదటి బిడ్డ. అతని కవల సోదరుడు యాకోబు.

  • ఏశావు తన జన్మ హక్కును అతని సోదరుడు యాకోబుకు ఒక ఆహార పదార్థం కోసం అమ్మి వేశాడు.
  • ఏశావు పెద్ద కొడుకు కాబట్టి అతని తండ్రి ఇస్సాకు అతనికి ప్రత్యేక ఆశీర్వాదం ఇవ్వాలి. అయితే యాకోబు ఇస్సాకును మోసగించి ఆ ఆశీర్వాదం తానే పొందాడు. మొదట్లో ఏశావు కోపగించుకున్నాడు. అతడు యాకోబును చంపడానికి చూశాడు. అయితే తరువాత అతడు అతన్ని క్షమించాడు.
  • ఏశావుకు అనేక మంది పిల్లలు, మనవలు కలిగారు. ఈ సంతానం పెద్ద ప్రజా సమూహం అయి కనాను ప్రదేశంలో నివసించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఎదోము, ఇస్సాకు, యాకోబు, రిబ్కా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 06:07 రిబ్కా పిల్లలు పుట్టినప్పుడు మొదటి వాడు ఎరుపు బొచ్చుతో బయటికి వచ్చాడు. అతని పేరు ఏశావు.
  • 07:02 కాబట్టి ఏశావు యాకోబుకు తన పెద్దకొడుకు హక్కులు ఇచ్చేశాడు.
  • 07:04 ఇస్సాకు మేక వెంట్రుకల వాసన గల వస్త్రాలు, వాసన చూసి అతడు ఏశావు అనుకుని అతణ్ణి ఆశీర్వదించాడు.
  • 07:05 ఏశావు యాకోబును ద్వేషించాడు. ఎందుకంటే యాకోబు పెద్ద కొడుకు హక్కు అయిన తన ఆశీర్వాదం దొంగిలించాడు.
  • 07:10 అయితే ఏశావు యాకోబును క్షమించాడు. వారు ఒకరినొకరు చూసుకుని ఆనందించారు.

పదం సమాచారం:

  • Strong's: H6215, G2269

ఐగుప్తు, ఐగుప్తీయుడు

వాస్తవాలు:

ఐగుప్తు ఆఫ్రికా ఈశాన్య భాగంలో ఉన్న ఒక దేశం. కనాను భూభాగానికి నైరుతి దిక్కుగా ఉంది. ఐగుప్తీయుడు అంటే ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఒక వ్యక్తి.

  • ప్రాచీన కాలములలో, ఐగుప్తు ఒక శక్తివంతమైన సంపన్న దేశం.
  • ప్రాచీన ఐగుప్తు రెండు భాగాలుగా విభజించబడింది. దిగువ ఐగుప్తు (ఉత్తర భాగం. నైలు నది దిగువకు సముద్రంలోకి ప్రవహించే భాగం), ఎగువ ఐగుప్తు (దక్షిణ భాగం). పాత నిబంధన గ్రంథంలో, ఈ భాగాలను మూల భాషలో "ఐగుప్తు” మరియు “పత్రోస్" అని సూచించబడ్డాయి.
  • అనేక సమయాలలో కనానులో ఆహారం తక్కువగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయుల పితరులు వారి కుటుంబాలకు ఆహారం కోసం ఐగుప్తుకు ప్రయాణించారు.
  • అనేక వందల సంవత్సరాలకు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు.
  • యోసేపు, మరియు మరియ ఘనుడైన హేరోదునుండి తప్పించుకోడానికి బాలుడైన యేసుతో ఐగుప్తు వరకు వెళ్లారు.

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)

(వీటిని కూడా చూడండి: ఘనుడైన హేరోదు, యోసేపు (కొ.ని), నైలు నది, పితరులు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 8:4 బానిస వ్యాపారాలు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు. ఐగుప్తు పెద్ద, శక్తివంతమైన దేశం. నైలు నది అందులో ప్రవహిస్తున్నది.
  • 8:8 ఫరో యోసేపు విషయంలో చాలా సంతోషించాడు, అతనిని ఐగుప్తు అంతటిలో రెండవ అత్యధిక శక్తివంతమైనవాడుగా నియమించాడు!
  • 8:11 కాబట్టి యాకోబు తన పెద్ద కుమారులను ఆహారం కొనడానికి ఐగుప్తుకు పంపించాడు.
  • 8:14 యాకోబు ముసలి వాడైనప్పటికి, అతడు తన కుటుంబం అంతటితో ఐగుప్తు వెళ్ళాడు. వారు అక్కడ నివసించారు.
  • 9:1 తరువాత యోసేపు చనిపోయిన తరువాత, అతని బంధువులు అందరూ ఐగుప్తు లో నివసించారు.

పదం సమాచారం:

  • Strong's: H4713, H4714, G1240, G1250

ఒమ్రి

వాస్తవాలు

ఒమ్రి ఒక సైన్యాధికారి, ఇశ్రాయేలు రాజ్యానిని ఆరవ రాజు అయ్యాడు.

  • రాజైన ఒమ్రి తిర్జా పట్టణంలో 12 సంవత్సరాలు పరిపాలన చేసాడు.
  • తనకు ముందున్న ఇశ్రాయేలు రాజుల వలే ఒమ్రి చాలా దుష్టుడైన రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులను అధిక విగ్రహారాధనకు నడిపించాడు.
  • ఒమ్రి రాజైన ఆహాబుకు తండ్రి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆహాబు, ఇశ్రాయేలు, యరోబాము, తిర్జా)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6018

ఒలీవల పర్వతం

నిర్వచనం:

ఒలీవల పరవతం ఒక పెద్ద పర్వతం, యెరూషలెం పట్టణానికి తూర్పు వైపున ఉన్న ఒక పెద్ద కొండ. అది దాదాపు 787 మీటర్ల ఎత్తు ఉంది.

  • పాతనిబంధనలో, ఈ పర్వతాన్ని కొన్ని సార్లు “యెరూషలెంకు తూర్పున ఉన్న పర్వతం” అని పిలిచారు.
  • యేసు, ఆయన శిష్యులు ఒలీవల పర్వతానికి వెళ్లి అక్కడ ప్రార్థన చెయ్యడం, విశ్రాంతి తీసుకోవడం చేసారని కొత్తనిబంధనలో అనేకసార్లు నమోదు చెయ్యబడింది.
  • యేసును గెత్సెమనే తోటలో బందీ చేసారు, అది ఒలీవల కొండ మీద ఉంది.
  • ఈ పదాన్ని “ఒలీవల కొండ” లేక “ఒలీవల చెట్టు పర్వతం” అని అనువదించవచ్చు.

(చూడండి: పేర్లను అనువదించడం)

(చూడండి: Gethsemane, olive)

బైబిలు నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H2022, H2132, G37350, G16360

ఓబద్యా#

వాస్తవాలు

ఓబద్యా పాతనిబంధన ప్రవక్త. ఏశావు సంతానం అయిన ఎదోము ప్రజలకు విరోధంగా ప్రవచించాడు. పాత నిబంధన గ్రంథంలో ఓబద్యా పేరు గలవారు చాలా మంది ఉన్నారు.

  • పాత నిబంధన గ్రంథంలో ఓబద్యా అతి చిన్న పుస్తకం. దేవుని నుండి ఓబద్యా పొందిన దర్శనం గురించి మాట్లాడుతుంది.
  • ఓబద్యా ఎప్పుడు జీవించాడో, ఎప్పుడు ప్రవచించాడో స్పష్టంగా తెలియదు. యూదా రాజ్య పాలనలో యెహోరాము, అజరయ, యోవాషు, అతల్యాలు పారించిన కాలంలో ఇది జరిగియుండవచ్చు. దానియేలు, యెహెజ్కేలు, యిర్మియా మొదలైన ప్రవక్తలు కూడా ఓబద్యా కాలంలో ప్రవచించి యుండవచ్చు.
  • రాజైన సిద్కియా ఏలుబడిలోనూ, బాబులోను చెరకాలం చివరి భాగంలోనూ ఓబద్యా జీవించియుండవచ్చు.
  • ఓబద్యా పేరుతో ఉన్నవారు - సౌలు సంతానంలో ఒకడు, దావీదు మనుషులలో గాడువాడు, రాజైన ఆహాబు అంతఃపుర అధికారి, రాజైన యెహోషాపాతు రాజ్య అధికారి, రాజైన యోషియా కాలంలో దేవాలయ మరమ్మత్తులలో సాయపడినవాడు, నెహెమ్యా కాలంలో ద్వారపాలకుడు ఉన్న ఓబద్యా
  • వీరిలో ఒకరు ఓబద్యా గ్రంధాన్ని రాసి యుండవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆహాబు, బబులోను, ఎదోము, ఏశావు, యెహెజ్కేలు, దానియేలు, గాదు, యెహోషాపాతు, యోషియా, లేవీయుడు, సౌలు, సిద్కియా)

బైబిలు రిఫరెన్సులు

పదం సమాచారం:

  • Strong's: H5662

కనాను, కనానీయుడు, కనానీయులు

వాస్తవాలు:

కనాను హాము కుమారుడు. హాము నోవహు కుమారుల్లో ఒకడు. కనానీయులు కనాను సంతానం.

  • ఈ పదం "కనాను” లేక “కనాను ప్రదేశం"అంటే యోర్దాను నదికి మధ్యదరా సముద్రానికి మధ్య గల ప్రాంతం కూడా. దీని దక్షిణ సరిహద్దు ఈజిప్టు, ఉత్తర సరిహద్దు సిరియా.
  • ఈ దేశంలో కనానీయులు, అనేక ఇతర ప్రజలు నివసించారు.
  • దేవుడు కనాను ప్రదేశం అబ్రాహాముకు తన సంతానం అయిన ఇశ్రాయేలీయులకు ఇస్తానని వాగ్దానం చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: హాము, వాగ్దాన దేశం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 04:05 అతడు (అబ్రాము) తన భార్య శారాను తన సేవకులు అందరినీ తనకున్న ప్రతిదాన్నీ తీసుకుని దేవుడు తనకు చూపిన కనాను దేశానికి వచ్చాడు.
  • 04:06 అబ్రాము కనాను కు వచ్చినప్పుడు దేవుడు “నీ చుట్టూరా చూడు” అని చెప్పాడు. నీకు, నీ సంతానానికి నీవు చూస్తున్న దేశం వారసత్వముగా ఇస్తాను."
  • 04:09 "కనాను దేశం నీ సంతానం వారికి ఇస్తాను."
  • 05:03 "నీకు, నీ సంతానం వారికీ కనాను దేశం వారి ఆస్తిగా ఇచ్చి వారి దేవుడుగా శాశ్వతకాలం ఉంటాను."
  • 07:08 ఇరవై సంవత్సరాలు తరువాత కనానులోని తన ఇంటికి, తన కుటుంబం, తన సేవకులు, తన మందలతో తిరిగి వెళ్ళమని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H3667, H3669, G2581, G5478

కపెర్నహూము

వాస్తవాలు:

కపెర్నహూము చేపలు పట్టే వారు నివసించే గ్రామం. ఇది గలిలీ సరస్సు వాయవ్య తీరాన ఉంది.

  • యేసు గలిలయలో బోధించే సమయంలో  కపెర్నహూములో నివసించాడు.

  • అనేకమంది యేసుశిష్యులు కపెర్నహూము వాస్తవ్యులు.

  • యేసు ఇక్కడ చనిపోయిన అమ్మాయిని బ్రతికించడంతో సహా అనేక అద్భుతాలు చేశాడు.

  • యేసు బహిరంగంగా గద్దించిన మూడు పట్టణాల్లో కపెర్నహూము ఒకటి. ఎందుకంటే ఆ ప్రజలు తన సందేశాన్ని త్రోసిపుచ్చి ఆయనయందు నమ్మకం ఉంచలేదు. వారి అపనమ్మకం మూలంగా దేవుడు వారిని శిక్షిస్తాడని యేసు హెచ్చరించాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: గలిలయ, గలిలీ సరస్సు)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G25840

కయీను

వాస్తవాలు:

కయీను, తన తమ్ముడు హేబెలు ఆదాము, హవ్వలకు పుట్టినట్టుగా బైబిల్లో ప్రస్తావించిన మొదటి కుమారులు.

  • కయీను రైతు. ఆహార పంటలు పండించే వాడు. హేబెలు గొర్రె కాపరి.
  • కయీను అతని సోదరుడు హేబెలుపై అసూయ పెట్టుకుని హత్య చేశాడు. ఎందుకంటే దేవుడు హేబెలు బలి అర్పణఅంగీకరించాడు. అయితే కయీను బలి అర్పణ తోసిపుచ్చాడు.
  • అందుకు శిక్షగా, దేవుడు అతన్ని నుండి ఏదేను నుండి పంపించి వేశాడు. నేల అతని కోసం పంటలను ఇవ్వదని చెప్పాడు.
  • దేవుడు కయీను నుదుటిపై ఒక గుర్తు వేశాడు. అతడు తిరుగులాడిన చోట్ల ఇతరులు అతన్ని చంపకుండేలా దేవుడు ఈ పని చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: Adam, sacrifice)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H7014, G25350

కర్మేలు, కర్మేల్ కొండ

వాస్తవాలు:

"కర్మేల్ కొండ"అంటే మధ్యదరా సముద్రం తీరాన షారోను మైదానానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి. దాని అత్యున్నత శిఖరం 546మీటర్లు ఎత్తు.

  • అక్కడ "కర్మేలు"అనే ఊరు ఉంది. అది యూదాలో ఉప్పు సముద్రం దక్షిణాన ఉంది.
  • సంపన్న భూస్వామి నాబాలు, అతని భార్య అబీగయీలు కర్మేలు దగ్గర నివసించే వారు. అక్కడ దావీదు, తన మనుషులు నాబాలు గొర్రె కాపరులకు కాపుదలగా ఉండే వారు.
  • కర్మేల్ కొండపై ఏలియా బయలు ప్రవక్తలను యెహోవాయే నిజమైన దేవుడు అని సవాలు చేశాడు.
  • ఇది కేవలం ఒక చిన్న కొండ కాదని చెప్పడం కోసం "కర్మేల్ కొండ"ను ఇలా అనువదించ వచ్చు, "కర్మేలు పర్వత శ్రేణిలో ఉన్న కొండ” లేక “కర్మేలు పర్వత శ్రేణి."

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బయలు, ఏలియా, యూదా, ఉప్పు సముద్రం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3760, H3761, H3762

కల్దియ, కల్దియుడు, కల్దీయులు

వాస్తవాలు:

కల్దియ దక్షిణ మెసపొటేమియా, లేక బాబిలోనియా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో నివసించిన ప్రజలను కల్దీయులు అన్నారు.

  • అబ్రాహాము ఊరు పట్టణం వాస్తవ్యుడు. ఇది కల్దియలో ఉంది. దీన్ని "కల్దీయుల ఊరు అంటారు."
  • నెబుకద్నేజర్ రాజు బాబిలోనియాను ఏలిన అనేకమంది కల్దీయులు రాజుల్లో ఒకడు.
  • తరువాత అనేక సంవత్సరాల తరువాత 600క్రీ. పూ. ప్రాంతంలో ఈ పదానికి "బాబిలోనియా"అనే అర్థం వచ్చింది.
  • దానియేలు గ్రంథంలో "కల్దియులు" అనే పదం ప్రత్యేకించి నక్షత్ర సమూహాలపై పరిశోధనలు చేసే మనుషులను చెప్పడానికి వాడారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, బబులోను, షినారు, ఊరు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3679, H3778, H3779, G5466

కానా

నిర్వచనం:

కానా గలిలీ ప్రదేశములో ఒక గ్రామం లేదా పట్టణం, ఇది నజరేతుకు ఉత్తరాన తొమ్మిది మైళ్ల దూరంలో ఉంది.

  • పన్నెండు మందిలో ఒకరైన నతానియేలు స్వస్థలం కానా.
  • యేసు కానాలో వివాహ విందుకు హాజరయ్యాడు మరియు ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అక్కడ తన మొదటి సూచక క్రియ చేశాడు.
  • దాని తరువాత కొంతకాలానికి, యేసు తిరిగి కానాకు తిరిగి వచ్చాడు మరియు అక్కడ కపెర్నహూము నుండి వచ్చిన ఒక అధికారిని కలిశాడు, అతడు తన కుమారుడిని స్వస్థపరచమని అభ్యర్థించాడు.

(ఇవి కూడా చూడండి: [కపెర్నెహోము], [గలిలీ], [పన్నెండు])

బైబిలు రిఫరెన్సులు:

  • [యోహాను 2:1-2]
  • [యోహాను 4:46-47]

పదం సమాచారం:

  • Strong's: G25800

కాలేబు

వాస్తవాలు:

కనాను ప్రదేశం వేగు చూసి రమ్మని మోషే పంపిన పన్నెండు మంది ఇశ్రాయేలు గూఢచారుల్లో కాలేబు ఒకడు.

  • ప్రజలు దేవునిపై నమ్మకముంచితే కనానీయులను ఓడించ వచ్చని అతడు, యెహోషువా చెప్పారు.
  • యెహోషువా, కాలేబు మాత్రమే తమ తరంలో వాగ్దాన కనాను ప్రదేశంలోకి రాగలిగిన ఏకైక వ్యక్తులు.
  • కాలేబు హెబ్రోను ప్రాంతాన్ని తనకు, తన కుటుంబం వారికీ ఇమ్మని అడిగాడు. దేవుడు అక్కడ నివశించే ప్రజలను ఓడించడానికి తనకు సాయం చేస్తాడని అతనికి తెలుసు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: హెబ్రోను, యెహోషువా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 14:04 ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దుకు చేరినప్పుడు మోషే ఇశ్రాయేలు ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిగా పన్నెండు మందిని ఎంపిక చేసి, అతడు ఆ మనుషులకు ఆ దేశం ఎలా ఉన్నదో వేగు చూడమని సూచన చేశాడు.
  • 14:06 తక్షణమే కాలేబు, యెహోషువా, మరొక ఇద్దరు గూఢచారులు ఇలా చెప్పారు. "కనాను ప్రజలు పొడవైన బలమైన జనమే గానీ మనం తప్పనిసరిగా ఓడించగలం! దేవుడు మనకోసం పోరాటం చెయ్యగలడు!"
  • 14:08 "యెహోషువా, కాలేబు తప్ప, ప్రతి ఒక్కరూ ఇరవై సంవత్సరాలు ఆపై వయసు గల వారంతా చనిపోయారు. ఎవరూ వాగ్దాన దేశం ప్రవేశించరు." వారు దేశంలో శాంతిగా నివసిస్తారు.

పదం సమాచారం:

  • Strong's: H3612, H3614

కిద్రోను లోయ

వాస్తవాలు:

కిద్రోను లోయ అనేది యెరూషలేం నగరానికి వెలుపల, దాని తూర్పు గోడ మరియు ఒలీవల పర్వతం మధ్య ఉన్న లోతైన లోయ.

  • లోయ 1,000 మీటర్ల లోతు మరియు దాదాపు 32 కిలోమీటర్ల పొడవు ఉంది.
  • రాజైన దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు, అతను కిద్రోను లోయ గుండా ఒలీవల కొండకు వెళ్లాడు.
  • అబద్ధ దేవుళ్ల ఉన్నత స్థలాలను, బలిపీఠాలను పగులగొట్టి కాల్చివేయాలని రాజు యోషియా మరియు యూదా రాజు ఆసా ఆజ్ఞాపించారు; బూడిదను కిద్రోను లోయలో త్రోసివేసారు.
  • హిజ్కియా రాజు పరిపాలనలో, య్యజకులు ఆలయం నుండి తీసివేసిన అశుద్ధమైన ప్రతిదానిని కిద్రోను లోయలో త్రోసి వేసారు.
  • దుష్టరాలిన రాణి అతల్యా ఆమె చేసిన చెడ్డ పనుల కారణంగా ఈ లోయలో చంపబడింది.

(అనువాద సూచనలు: [పేర్లను అనువదించడం ఎలా]

(ఇవి కూడా చూడండి: [అబ్షాలోము], [ఆసా], [అతల్యా], [డేవిడ్], [తప్పుడు దేవుడు], [హిజ్కియా], [ఎత్తైన ప్రదేశాలు], [యోషియా], [యూదా], [ఒలీవల పర్వతం])

బైబిలు రిఫరెన్సులు:

  • [యోహాను 18:1]

పదం సమాచారం:

  • Strong's: H5674, H6939, G27480, G54930

కిలికియ

వాస్తవాలు:

కిలికియ ఒక చిన్న రోమా పరగణా. ఇది ప్రస్తుత ఆధునిక టర్కీ దేశం ఆగ్నేయభాగాన ఉంది. దీని సరిహద్దు ఏగియన్ సముద్రం.

  • అపోస్తలుడు పౌలు కిలికియలోని తార్సు పట్టణం పౌరుడు.
  • పౌలు అనేక సంవత్సరాలు కిలికియలో నివసించాడు. తరువాత దమస్కు రహదారిలో యేసుతో పరిచయం అయింది.
  • కొందరు కిలికియనుంచి వచ్చిన యూదులు స్తెఫను మాటలకు కోపించి అతణ్ణి చంపేలా ప్రజలను ప్రేరేపించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: పౌలు, స్తెఫను, తార్సు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2791

కురేనీ

వాస్తవాలు:

కురేనీ అనేది ఒక గ్రీకు పట్టణం. ఇది ఆఫ్రికా ఉత్తరాన మధ్యదరా సముద్రం తీర ప్రాంతంలో, క్రేతు ద్వీపానికి దక్షిణాన ఉంది.

  • క్రొత్త నిబంధన కాలంలో ఇక్కడ యూదులు, క్రైస్తవులు కలిసి నివసించారు.

  • కురేనీ బహుశా పరిశుద్ధ గ్రంథంలో ప్రఖ్యాతి చెందిన కారణం-అది యేసు సిలువను మోసిన సీమోను స్వదేశం.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: క్రేతు)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

  • అపొ. కా. 11:19-21

  • మత్తయి 27:32-34

పదం సమాచారం:

  • Strong's: G29560, G29570

కూషు

వాస్తవాలు:

కూషు నోవహు కుమారుడు హాముకు పెద్ద కొడుకు. అతడు నిమ్రోదుకు పూర్వీకుడు కూడా. అతని సోదరులు ఇద్దరికీ ఈజిప్టు, కనాను అని పేర్లు.

  • పాత నిబంధన కాలంలో, "కూషు" ఒక పెద్ద ప్రాంతం పేరు. ఇది ఇశ్రాయేలు దక్షిణ ప్రాంతంలో ఉంది. ఒక వేళ ఈ దేశం పేరు హాము కుమారుడు కూషు మూలంగా వచ్చి ఉండవచ్చు.
  • ప్రాచీన ప్రాంతం కూషు వివిధ సమయాల్లో నేటి దేశాలు సూడాన్, ఈజిప్టు, ఇతియోపియా, బహుశా అరేబియా దేశాల ప్రాంతం అయి ఉండవచ్చు.
  • కూషు అనే పేరు గల మరొక మనిషిని కీర్తనలు గ్రంథం ప్రస్తావించింది. అతడు బెన్యామీను గోత్రికుడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అరేబియా, కనాను, ఈజిప్టు, ఇతియోపియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3568, H3569, H3570

కెరేతీయులు#

వాస్తవాలు:

కెరేతీయులు ఒక జాతి ప్రజలు వీరు బహుశా ఫిలిష్తీయుల వంశం వారు. కొన్ని ప్రతులలో వీరి పేరు "కెరేతు"అని ఉంది.

  • "కెరేతీయులు పెలేతీయులు"ఒక ప్రత్యేక బృందం సైనికులు. వీరు దావీదు రాజు సైన్యంలో ముఖ్యంగా రాజు వ్యక్తిగత అంగ రక్షకులు.
  • యెహోయాదా కుమారుడు బెనాయా, దావీదు ముఖ్య కార్యనిర్వాహక మంత్రుల్లో ఒకడు. అతడు కెరేతీయులకు పెలేతీయులకు నాయకుడు.
  • అబ్షాలోము తిరుగుబాటు సమయంలో దావీదు యెరూషలేము విడిచి పారిపోతుంటే కెరేతీయులు దావీదుకు అండగా ఉన్నారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అబ్షాలోము, బెనాయా, దావీదు, ఫిలిష్తీయులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3774

కైసరయ, ఫిలిప్పుదైన కైసరయ

వాస్తవాలు:

కైసరయ మధ్యదరా సముద్రం తీరాన 39కిలోమీటర్ల దక్షిణ భాగాన కర్మేల్ కొండ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాముఖ్య పట్టణం. కైసరయ ఫిలిప్పి ఈశాన్య ఇశ్రాయేలులో హెర్మోను కొండ దగ్గర ఉన్న పట్టణం.

  • ఈ పట్టణాలకు రోమా సామ్రాజ్యం పాలించిన సీజరు చక్రవర్తుల పేరు పెట్టారు.
  • యేసు జన్మించిన సమయంలో రోమా సామ్రాజ్యం పరిధి తీర ప్రాంతంలో కైసరయ యూదా ప్రదేశానికి ముఖ్య పట్టణం అయింది.
  • అపోస్తలుడు పేతురు మొదటిగా కైసరయలోని యూదేతరులకు సువార్త ప్రకటించాడు.
  • పౌలు తన సువార్త ప్రయాణాల్లో కైసరయ నుండి తార్సుకు ప్రయాణమై వెళ్తూ ఈ పట్టణం గుండా ప్రయాణించాడు.
  • యేసు, ఆయన శిష్యులు సిరియాలోని కైసరయ ఫిలిప్పి గుండా ప్రయాణించారు. రెండు పట్టణాలకు హేరోదు ఫిలిప్పు పేరు పెట్టారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కైసరు, యూదేతరుడు, సముద్రం, కర్మేలు, హెర్మోను కొండ, రోమ్, తార్సు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G2542, G5376

కొర్నేలి

వాస్తవాలు:

కొర్నేలి యూదేతరుడు, లేక యూదు మనిషి కాదు. రోమా సైన్యంలో ఒక అధికారి.

  • అతడు అనుదినం దేవునికి ప్రార్థించేవాడు. పేదల పట్ల ఉదారంగా ఉండే వాడు.
  • కొర్నేలి, తన కుటుంబం అపోస్తలుడు పేతురు వివరించిన సువార్త విన్నారు, వారు యేసు విశ్వాసులు అయ్యారు.
  • కొర్నేలి ఇంటి వారు మొదటిగా విశ్వాసులుగా మారిన యూదేతరప్రజలు.
  • యూదేతరులతో సహా ప్రజలందరినీ రక్షించడానికి యేసు వచ్చాడని దీని మూలంగా అయన అనుచరులు నమ్మారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అపోస్తలుడు, విశ్వసించు, యూదేతరుడు, మంచి వార్త, గ్రీకు, శతాధిపతి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2883

కొలోస్సయి, కొలస్సి

వాస్తవాలు:

కొత్త నిబంధన కాలంలో , కొలోస్సయి నైరుతి టర్కీలో ఫ్రుగియ అనే రోమా పరగణాలో ఉన్న ఒక పట్టణం. కొలస్సియులు కొలోస్సయిలో నివసించే ప్రజలు.

  • మధ్యదరా సముద్రం నుండి 100 మైళ్ళు లోపల ఉన్న కొలోస్సయి ఎఫెసుకు, యూఫ్రటిసు నదికి మధ్య ముఖ్యం అయిన వర్తక మార్గం.
  • రోమ్ చెరసాలలో ఉన్నప్పుడు పౌలు "కొలస్సి" వారికి ఒక ఉత్తరం రాశాడు. కొలోస్సయి విశ్వాసుల మధ్య ఉన్న భిన్న బోధల గురించి అతడు రాశాడు.
  • అతడు ఉత్తరం రాసినప్పుడు పౌలు ఇంకా కొలోస్సయిలోని సంఘాన్ని చూడలేదు. తన జత పనివాడు ఎపఫ్రా అక్కడి విశ్వాసుల గురించి చెప్పగా విన్నాడు.
  • ఎపఫ్రా బహుశా కొలోస్సయి సంఘానికి చెందిన క్రైస్తవ సేవకుడు.
  • ఫిలేమోను కు రాసిన లేఖ పౌలు కొలోస్సయిలోని ఒక బానిసల యజమానికి రాసిన ఉత్తరం.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఎఫెసు, పౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2857, G2858

కోరహు, కోరహీయుడు

నిర్వచనం:

పాత నిబంధనలో ముగ్గురు పురుషులకు కోరహు అనే పేరు ఉంది.

  1. లేవి సంతానంలో కోరహు ఒకడు. మరియు కాబట్టి ప్రత్యక్య్ాగుడారంలో ఒక యాజకుడిగా అతడు పనిచేసాడు. మోషే, మరియు ఆహారోను విషయంలో అతడు అసూయ చెందాడు, మరియు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడానికి ఒక గుంపును నడిపించాడు.
  2. ఏశావు కుమారులలో ఒకని పేరు కోరహు అతని సమాజానికి అతడు నాయకుడు అయ్యాడు.
  3. కోరహు పేరుతో ఉన్న మూడవ వ్యక్తి యూదా సంతానంలో ఉన్నాడు.

(వీటిని కూడా చూడండి: ఆహారోను, అధికారం, కాలేబు, సంతానం, ఏశావు,, యూదా, యాజకుడుt)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

*Strong's: H7141


కోరేషు

వాస్తవాలు:

కోరేషు పారసీక రాజు. ఇతడు క్రీ. పూ 550 ప్రాంతంలో సైనిక విజయాల మూలంగా పర్షియా సామ్రాజ్యంస్థాపించాడు. చరిత్రలో ఇతన్ని మహా కోరేషు అన్నారు.

  • కోరేషు బబులోను పట్టణం ఆక్రమించుకున్నాడు. ఇది ఇశ్రాయేలీయుల ప్రవాసం తరువాత వారి విడుదలకు దరి తీసింది.
  • కోరేషు అతడు ఆక్రమించుకున్న జాతుల ప్రజల పట్ల అతని ఉదార స్వభావం మూలంగా ప్రసిద్ధికెక్కాడు. తన దయ మూలంగా యూదులు ప్రవాసం తరువాత యెరూషలేము ఆలయం తిరిగి కట్టడం సాగించారు.
  • కోరేషు దానియేలు, ఎజ్రా, నెహెమ్యాల జీవిత కాలంలో పరిపాలన చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: దానియేలు, దర్యావేషు, ఎజ్రా, నెహెమ్యా, పర్షియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3566

క్రేతు, క్రేతీయులు

వాస్తవాలు:

క్రేతు ఒక ద్వీపం. ఇది గ్రీసు దక్షిణ తీర ప్రాంతంలో ఉంది. "క్రేతీయుడు" అంటే ఈ ద్వీపంలో నివసించే వాడు.

  • అపొస్తలుడు పౌలు తన సువార్త ప్రయాణాలలో క్రేతు ద్వీపానికి ప్రయాణించాడు.
  • పౌలు తన జత పనివాడు తీతును క్రైస్తవులకు బోధించడానికీ, సంఘ పెద్దలను నియమించడంలో సహాయం చెయ్యడానికి క్రేతులో విడిచిపెట్టాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2912, G2914

గబ్రియేలు

వాస్తవాలు:

గబ్రియేలు దేవుని దేవదూతలలో ఒకని పేరు. పాత, కొత్త నిబంధనలు రెంటిలో ఇతని పేరు చాలా సార్లు ప్రస్తావించబడింది.

  • దేవుడు గబ్రియేలును ప్రవక్త దానియేలు చూసిన దర్శనం గురించి వివరించటానికి పంపాడు.

  • మరొక సారి దానియేలు ప్రార్థన చేస్తుంటే, దేవదూత గబ్రియేలు అతని దగ్గరకు ఎగిరి వచ్చి భవిష్యత్తులో జరగబోయే విషయాలు ప్రవచించాడు. దానియేలు అతన్ని ఒక మనిషిగా వర్ణించాడు.

  • కొత్త నిబంధనలో గబ్రియేలు జెకర్యా దగ్గరకు వచ్చి గొడ్రాలైన అతని భార్య ఎలీసబెతుకు కుమారుడుగా యోహాను పుడతాడని చెప్పాడు.

  • ఆరు నెలల తరువాత గబ్రియేలు మరియ దగ్గరికి వెళ్లి అద్భుత రీతిలో ఆమె గర్భం ధరిస్తుందనీ ఆమెకు పుట్టే శిశువు "దేవుని కుమారుడు" అనీ, ఆ కుమారుని పేరు "యేసు" అని చెప్పాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: దేవదూత, దానియేలు, ఎలీసబెతు, యోహాను (బాప్తిస్మమిచ్చు), మరియ, ప్రవక్త, దేవుని కుమారుడు, జెకర్యా)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

  • దానియేలు 08:15-17

  • దానియేలు 09:20-21

  • లూకా 01:18-20

  • లూకా 01:26-29

పదం సమాచారం:

  • Strong's: H1403, G10430

గలతియ, గలతీయులు

వాస్తవాలు:

కొత్త నిబంధన కాలంలో, గలతి రోమీయుల ఓ పెద్ద సంస్థానమై ఇప్పుడు/ప్రస్తుత టర్కీ దేశంలోని మధ్య భాగములో నెలకొని ఉన్నది.

  • గలతియలో ఒక భాగం ఉత్తరపు సరిహద్దుగా నల్ల సముద్రం అంచున ఉంది. దీనికి ఆసియా, బితూనియ, కప్పదొకియా, కిలికియా, పంఫులియా అను పరగణాలు/ప్రాంతాల సరిహద్దులుగా ఉంది.
  • అపోస్తలుడైన పౌలు గలతియ పరగణాలో/ప్రాంతంలో నివసించే క్రైస్తవులకు ఒక ఉత్తరం/పత్రిక రాశాడు. అది కొత్త నిబంధన గ్రంధంలో "గలతి పత్రిక" గా పిలువబదినది.
  • కృప ద్వారానే రక్షణ సువార్త, క్రియల ద్వార కాదు అని ఒక్కనించుటకు/నొక్కి చెప్పుటకు పౌలు గలతీయులకు ఈ పత్రిక రాశాడు అన్నది ఒక కారణం.
  • యూదులైన క్రైస్తవులు అన్యులైన క్రైస్తవులుకు, విశ్వాసులుగా ఉండాలంటే కొన్ని యూదుల కట్టడలను/ధర్మశాస్త్రమును పాటించాలని తప్పుగా బోధిస్తున్నారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: [ఆసియా] Asia, believe, Cilicia, good news, Paul, works)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1 కొరింతి 16:01-02
  • 1 పేతురు 01:01-02
  • 2 తిమోతి 04:09-10
  • అపో. కా. 16:06-08
  • గలతి 01:01

పదం సమాచారం:

  • Strong's: G10530, G10540

గలిలయ సముద్రము, కిన్నెరెతు సముద్రము, గెన్నెసరేతు చెరువు, తిబేరియా సముద్రము

వాస్తవాలు:

“గలిలయ సముద్రము” తూర్పు ఇశ్రాయేలులో ఒక చెరువు. పాత నిబంధనలో దీనిని “కిన్నెరెతు సముద్రము” అని పిలిచేవారు.

  • ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్ళు దక్షిణ దిక్కునుండి ప్రవహించి యోర్దాను నది ద్వారా ఉప్పు సముద్రములోనికి ప్రవహిస్తాయి.
  • క్రొత్త నిబంధన కాలములో కపెర్నహోము, బెత్సాయిదా, గెన్నెసరెతు, మరియు తిబేరియా అనే కొన్ని పట్టణాలు గలిలయ సముద్రము ప్రక్కనే ఉండేవి.
  • యేసు జీవితములోని అనేక సంఘటనలు గలిలయ సముద్రము చుట్టూ ప్రాంతములోనే సంభవించాయి.
  • గలిలయ సముద్రమును కూడా “తిబేరియా సముద్రము” అని మరియు “గెన్నెసరెతు చెరువు” అని కూడా సూచించబడియున్నది.
  • ఈ పదమును “గలిలయ ప్రాంతములోని చెరువు” అని లేక “గలిలయ చెరువు” అని లేక “తిబేరియా (గెన్నేసరేతు) దగ్గర ఉన్న చెరువు” అని కూడా తర్జుమా చేయుదురు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:Capernaum, Galilee, Jordan River, Salt Sea)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong’s: H3220, H3672, G10560, G10820, G22810, G30410, G50850

గలిలయ, గలిలయుడు, గలిలయులు

వాస్తవాలు:

గలిలయ ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతం. సమరయకు ఉత్తరాన ఉంది. "గలిలయుడు" అంటే గలిలయలో నివసించేవాడు.

  • గలిలయ, సమరయ, యూదా-ఇవి కొత్త నిబంధన సమయంలో  ఇశ్రాయేలు యొక్క మూడు ముఖ్య పరగణాలు.

  • గలిలయ తూర్పు సరిహద్దులో పెద్ద సరసైన "గలిలీ సరస్సు" ఉంది.

  • యేసు గలిలయ ఊరు నజరేతులో పెరిగి పెద్దవాడై అక్కడనివసించాడు.

  • యేసు ఎక్కువ అద్భుతాలు, బోధలు గలిలయప్రాంతం లోన చేశాడు.

(ఈ పదములను కూడా చూడండి: నజరేతు, సమరయ, గలిలీ సరస్సు)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

బైబిల్ నుండి రిఫరెన్సులు:

  • __21:10__ప్రవక్త యెషయా మెస్సీయ గలిలయలో నివసించి గుండె చెదిరిన ప్రజలకు ఆదరణనిస్తూ, బందీలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తాడని చెప్పాడు.

  • __26:1__తరువాత సాతాను శోధనలను జయించి యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్లి అక్కడ నివసించాడు.

  • 39:6 చివరకుఆ మనిషి "ఇప్పుడు నువ్వు యేసుతో ఉన్నావని నాకు తెలుసు, ఎందుకంటే నీవు కూడా గలిలయ వాడివే"అని చెప్పాడు.

  • __41:6__తరువాత దేవదూత ఆ స్త్రీలకు "మీరువెళ్లి, 'యేసు చావు నుండి తిరిగి లేచి మీకంటే ముందు గలిలయకు వెళ్తాడని శిష్యులకు చెప్పండి"అని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H1551, G10560, G10570

గాజా

వాస్తవాలు:

బైబిల్ కాలాల్లో, గాజా ఒక ధనిక ఫిలిష్తియ పట్టణం. ఇది మధ్యదరా సముద్ర తీరాన, అష్డోదుకు సుమారు 38 కిలో మీటర్ల దక్షిణాన ఉంది. ఇది ఫిలిష్తీయుల ఐదు ముఖ్య పట్టణాల్లో ఒకటి.

  • ఉనికిని బట్టి గాజా పట్టణం ఓడ రేవు. వాణిజ్య కార్యకలాపాలు జరిగే స్థలం. అనేక వివిధ ప్రజా సమూహాలు, జాతులు ఉండే పట్టణం.
  • ఈ నాడు గాజా పట్టణం చాలా ప్రాముఖ్యమైన ఓడ రేవు. గాజా భూభాగం అనేది మధ్యదరా సముద్రం తీరాన ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఈశాన్యం దిక్కున, ఈజిప్టుకు దక్షిణాన ఉంది.
  • ఫిలిష్తీయులు సంసోనును బంధించిన తరువాత అతన్ని గాజా పట్టణం తీసుకుపోయారు.
  • సువార్తికుడు ఫిలిప్పు గాజాకు పోయే ఎడారి దారిలో ఇతియోపీయ నపుంసకుడిని కలుసుకున్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అష్డోదు, ఫిలిప్పు, ఫిలిష్తీయులు, ఇతియోపియా, గాతు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5804, H5841, G1048

గాతు, గిత్తీయుడు, గిత్తీయులు

వాస్తవాలు:

గాతు ఫిలిష్తీయుల ఐదు పట్టణాల్లో ఒకటి. ఇది ఎక్రోనుకు ఉత్తరాన, అష్డోదు, అష్కెలోనులకు తూర్పున ఉంది.

  • ఫిలిష్తియ యోధులు గొల్యాతు గాతు పట్టణం వాడే.
  • సమూయేలు కాలంలో ఫిలిష్తీయులు నిబంధన మందసం ఇశ్రాయేలు నుండి తీసుకుని అష్డోదులో వారి దేవుడి గుడిలో ఉంచారు. తరువాత దాన్ని గాతుకు, ఆ తరువాత ఎక్రోనుకు తరలించారు. అయితే దేవుడు ఆ పట్టణాల ప్రజలను వ్యాధులతో శిక్షించాడు. కాబట్టి వారు దాన్ని ఇశ్రాయేలుకు మరలా పంపించారు.
  • దావీదు సౌలు రాజు సౌలు, నుండి పారిపోయి నప్పుడు అతడు తన ఇద్దరు భార్యలతో నమ్మకస్తులైన ఆరు వందల మంది అనుచరులతో గాతులో కొంతకాలం నివసించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అష్డోదు, అష్కెలోను, ఎక్రోను, గాజా, గొల్యాతు, ఫిలిష్తీయులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1661, H1663

గాదు

వాస్తవాలు:

గాదు యాకోబు కుమారుల్లో ఒకడు. యాకోబు మరొక పేరు ఇశ్రాయేల్.

  • గాదు కుటుంబం ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల్లో ఒకటి.
  • బైబిల్లో మరొక మనిషి గాదు ఒక ప్రవక్త. ఇతడు దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించడం ద్వారా పాపం చేసినప్పుడు అతన్ని గద్దించాడు.
  • రెండు పట్టణాలు బయలు గాదు, మిగ్దాల్ గాదు అనేవి మూల భాషలో రెండు మాటలు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: జనసంఖ్య, ప్రవక్త, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1410, H1425, G1045

గిద్యోను

వాస్తవాలు:

గిద్యోను ఇశ్రాయేలు జాతి మనిషి. దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి విమోచించడానికి లేపాడు.

  • గిద్యోను జీవించిన సమయంలో మిద్యానీయులు ఇశ్రాయేలీయులపై దాడులు చేసి వారి పంటలు నాశనం చేసే వారు.
  • గిద్యోను భయపడినప్పటికీ దేవుడు అతన్ని ఇశ్రాయేలీయుల పక్షంగా మిద్యానీయులతో పోరాడి వారిని ఓడించడానికి ఉపయోగించుకున్నాడు.
  • గిద్యోను దేవునికి లోబడి అబద్ధ దేవుళ్ళు అయిన బయలు, అషేరా బలిపీఠాలు పడగొట్టాడు.
  • అతడు ప్రజల శత్రువులను ఓడించడమే గాక ఏకైక నిజ దేవుడు యెహోవాకు లోబడి ఆయన్నే అరాధించమని వారిని ప్రోత్సాహించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బయలు, అషేరా, విమోచించు, మిద్యాను, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 16:05 యెహోవా దేవదూత గిద్యోను దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు, "శూరుడా యోధుడా, దేవుడు నీతో ఉన్నాడు. వెళ్లి మిద్యానీయుల నుండి ఇశ్రాయేలును రక్షించు."
  • 16:06 గిద్యోను తండ్రి ఒక విగ్రహానికి బలిపీఠం ప్రతిష్టించాడు. గిద్యోనుతో ఆ బలిపీఠం పడగొట్టు అని దేవుడు చెప్పాడు.
  • 16:08 లెక్క బెట్టలేనంత మంది(మిద్యానీయులు) ఉన్నారు. గిద్యోను ఇశ్రాయేలీయులను కలిసి పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చాడు.
  • 16:08 గిద్యోను ఇశ్రాయేలీయులను కలిసి పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చాడు. గిద్యోను దేవుణ్ణి రెండు సూచనలు అడిగాడు. దేవుడు నిజంగా ఇశ్రాయేలును రక్షించడానికి తనను వాడుకుంటాడో లేదో అని పరీక్ష.
  • 16:10 32,000 ఇశ్రాయేలు సైనికులు గిద్యోను దగ్గరికి వచ్చారు. అయితే వారు మరీ ఎక్కువ మంది అని దేవుడు చెప్పాడు.
  • 16:12 తరువాత గిద్యోను తన సైనికుల దగ్గరికి తిరిగి వచ్చి ఒక్కొక్కరికి ఒక కొమ్ము, మట్టి కుండ, కాగడా ఇచ్చాడు.
  • 16:15 ప్రజలు గిద్యోనును వారి రాజుగా చెయ్యాలనుకున్నారు.
  • 16:16 తరువాత గిద్యోను బంగారంతో ప్రధాన యాజకుడు ఉపయోగించే ప్రత్యేక వస్త్రం తయారు చేయించాడు. అయితే దాన్ని ఒక విగ్రహం లాగా ప్రజలు ఆరాధించ సాగారు.

పదం సమాచారం:

  • Strong's: H1439, H1441

గిబియా

వాస్తవాలు:

గిబియా యెరూషలేముకు ఉత్తరాన, బేతేలుకు దక్షిణంగా ఉన్న పట్టణం.

  • గిబియా బెన్యామీను గోత్రానికి చెందిన భూభాగంలో ఉంది.
  • ఇక్కడ బెన్యామీను గోత్రికులకు తక్కిన ఇశ్రాయేలు వారికీ యుద్ధం జరిగింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బెన్యామీను, బేతేలు, యెరూషలేము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1387, H1389, H1390, H1394

గిబియోను, గిబియోనీయుడు, గిబియోనీయులు

వాస్తవాలు:

గిబియోను యెరూషలేముకు వాయవ్యంగా 13 కిలో మీటర్ల దూరాన ఉన్న పట్టణం. గిబియోనులో నివసించే ప్రజలు గిబియోనీయులు.

  • ఇశ్రాయేలీయులు యెరికో, హాయి పట్టణాలు నాశనం చేశారని గిబియోనీయులు విన్నారు. వారు భయపడ్డారు.
  • కాబట్టి గిబియోనీయులు గిల్గాలులో ఇశ్రాయేలు నాయకుల దగ్గరకు వచ్చి దూర దేశం నుండి వచ్చిన వారుగా నటించారు.
  • ఇశ్రాయేలు నాయకులు మోసపోయి వారిని నాశనం చేయక, కాపాడుతామని గిబియోనీయులతో ఒప్పందం చేసుకున్నారు.

(చూడండి: గిల్గాలు, యెరికో, యెరూషలేము)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 15:06 అయితే ఒక కనానీయ ప్రజలు సమూహం గిబియోనీయులు అనే వాళ్ళు యెహోషువాతో అబద్ధం చెప్పారు. తాము కనానుకు చాలా దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పారు.
  • 15:07 కొంత కాలం తరువాత, కనాను, అమోరీయుల రాజులు ఇంకా ఇతర సమూహం గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో శాంతి ఒప్పందం చేసుకున్నారని విన్నారు. వారి సేనలు కూడగట్టుకుని ఒక పెద్ద సైన్యంతో గిబియోను పై దాడి చేశారు.
  • 15:08 యెహోషువా ఇశ్రాయేలు సైన్యం సమకూర్చాడు. వారు రాత్రి అంతా నడిచి గిబియోనీయుల దేశం చేరుకున్నారు.

పదం సమాచారం:

  • Strong's: H1391, H1393

గిర్గాషియులు

వాస్తవాలు:

గిర్గాషియులు కనాను ప్రదేశం గలిలీ సరస్సు వద్ద నివసించిన ప్రజల సమూహం.

  • వారు హాము కుమారుడు కనాను సంతానం. అంటే "కనానీయులు" అని పేరు పొందిన అనేక ప్రజల సమూహాలు.
  • ఇశ్రాయేలీయులు గిర్గాషియులు, ఇతర కనానీయ ప్రజల సమూహాలను ఓడించడానికి తాను వారికి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
  • కనానీయ ప్రజలందరిలాగానే గిర్గాషియులు ఆరాధించిన అబద్ధ దేవుళ్ళను పూజించారు. పూజల్లో భాగంగా దుర్నీతి సాధనాలు ఉపయోగించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కనాను, హాము, నోవహు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1622

గిలాదు, గిలాదీయుడు, గిలాదీయులు

నిర్వచనం:

గిలాదు యోర్దాను నదికి తూర్పున ఉన్న కొండ ప్రాంతం పేరు. ఇక్కడ ఇశ్రాయేలు గోత్రాలు గాదు, రూబేను, మనష్శే నివసించారు.

  • ఈ ప్రాంతం "గిలాదు కొండ సీమ” లేక “గిలాదు పర్వత ప్రదేశం."
  • "గిలాదు" అనేది చాలా మంది పాత నిబంధన మనుషులకు కూడా ఉంది. ఈ మనుషుల్లో ఒకడు మనష్శే మనవడు. మరొక గిలాదు యెఫ్తా తండ్రి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: గాదు, యెఫ్తా, మనష్శే, రూబేను, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1568, H1569

గిల్గాలు#

వాస్తవాలు:

గిల్గాలు యెరికోకు ఉత్తరాన ఉంది. యోర్దాను నది దాటి కనానులో ప్రవేశించాక మొదటిగా ఇశ్రాయేలీయులు శిబిరం వేసుకున్న స్థలం.

  • గిల్గాలు దగ్గర యెహోషువా యోర్దాను నది దాటిన తరువాత ఎండిన నదిలో నుండి పన్నెండు రాళ్లు తీసి నిలబెట్టాడు.
  • గిల్గాలు దగ్గర ఏలియా, ఎలీషాలు యోర్దాను నది దాటారు. అక్కడ ఏలియా పరలోకం ఆరోహణం అయ్యాడు.
  • పాత నిబంధనలో ఈ పేరుతొ అనేక ఇతర స్థలాలు ఉన్నాయి.
  • "గిల్గాలు" అంటే "రాళ్ల వలయం," ఒక వేళ ఇక్కడ వలయాకారం బలిపీఠం కట్టారేమో.
  • పాత నిబంధనలో, దీని పేరు ఎప్పుడూ " గిల్గాలు" అనే కనిపిస్తుంది. ఇది ఒక ఇదమిద్ధమైన ఊరు పేరు కాకపోవచ్చునని, ఒక విధమైన స్థలంయొక్క వర్ణన సంబంధమైనది అని కొందరు భావిస్తున్నారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఏలియా, , ఎలీషా, యెరికో, యోర్దాను నది)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1537

గెరారు

వాస్తవాలు:

గెరారు కనాను ప్రదేశంలో ఒక పట్టణం. ఇది హెబ్రోనుకు నైరుతీ దిశగా బేయెర్షెబా వాయవ్యంగా ఉంది.

  • అబీమెలెకు రాజు గెరారు అధిపతి. అబ్రాహాము, శారా అక్కడ నివసించారు.
  • ఇశ్రాయేలీయులు కనానులో నివసించిన కాలంలో ఫిలిష్తీయులు గెరారు ప్రాంతాన్ని పాలించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబీమెలెకు, బేయెర్షెబా, హెబ్రోను, ఫిలిష్తీయులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1642

గెషూరు, గెషూరీయులు

నిర్వచనం:

దావీదు రాజు కాలంలో, గెషూరు చిన్న రాజ్యం. ఇది గలిలీ సరస్సుకు తూర్పున ఇశ్రాయేలు, ఆరాము దేశాలకు మధ్యన ఉంటుంది.

  • దావీదు రాజు గెషూరు రాజు కుమార్తె మయకాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతని కుమారుడు అబ్షాలోమును కన్నది.
  • తన సవతి సోదరుడు అమ్నోనును హత్య చేసాక అబ్షాలోము యెరూషలేము నుండి ఈశాన్య దిశగా సుమారు 140 కిలో మీటర్ల దూరాన ఉన్న గెషూరుకు పారిపోయాడు. అతడు అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు.

(చూడండి: అబ్షాలోము, అమ్నోను, ఆరాము, గలిలీ సరస్సు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1650

గేత్సేమనే

వాస్తవాలు:

గేత్సేమనే యెరూషలేముకు తూర్పున ఒలీవ చెట్లున్న తోట. ఒలీవల కొండ దగ్గర కిద్రోను లోయలో ఉంది.

  • గేత్సేమనే తోట అనే ప్రదేశం యేసు, ఆయన అనుచరులు మనుషులకు దూరంగా ఒంటరిగా విశ్రాంతి కోసం వెళ్ళే స్థలం.
  • గేత్సేమనే తోట లోనే యేసు మహా వేదనతో ప్రార్థించాడు. ఆ సమయంలో యూదు నాయకులు ఆయన్ను బంధించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: యూదా ఇస్కరియోతు, కిద్రోను లోయ, ఒలీవల కొండ)

బైబిలు అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: G1068

గొమొర్రా

వాస్తవాలు:

గొమొర్రా నగరం సొదొమ వద్ద సారవంతమైన లోయలో ఉన్నది. అక్కడ అబ్రాహాము అన్న కుమారుడు లోతు నివసించడానికి ఆ స్థలమును ఎన్నుకొన్నాడు.

  • గొమొర్రా, సోదోమల కచ్చితమైన చోటు ఎక్కడ ఉన్నదో తెలియదు. అయితే ఇది నేరుగా ఉప్పు సముద్రానికి దక్షిణంగా సిద్దిము లోయ దగ్గర ఉండవచ్చు అని సూచనలు ఉన్నాయి.
  • సోదోమ గొమొర్రా ప్రాంతాలు ఉన్న ప్రదేశంలో అనేక మంది రాజులు యుద్ధాలు చేశారు.
  • లోతు కుటుంబం సోదోమ, ఇతర పట్టణాల సంఘర్షణలో చిక్కుకున్నప్పుడు అబ్రాహాము తన మనుషులతో వెళ్లి వారిని రక్షించాడు.
  • ఆ తరువాత కొంత కాలానికే సోదోమ, గొమొర్రాలను దేవుడు నాశనం చేశాడు. కారణం అక్కడి నివసించిన ప్రజల దుర్మార్గత.

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)

(వీటిని కూడా చూడండి: అబ్రాహాము, బబులోను, లోతు, ఉప్పు సముద్రం, సొదొమ)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6017

గొల్గోత

వాస్తవాలు:

యేసు సిలువ వేయబడిన ప్రదేశానికి "గొల్గోత" అని పేరు. దీని పేరు అరామిక్ పదం నుండి వచ్చింది, దీని అర్థం "కపాలము" లేదా "కపాలము యొక్క స్థలం".

  • గొల్గోత యెరూషలేం నగర గోడల వెలుపల, దానికి సమీపంలో ఉంది. ఇది బహుశా ఒలీవల పర్వతం యొక్క వాలుపై ఉంది.
  • బైబిలు యొక్క కొన్ని పాత ఆంగ్ల అనువాదాలలో, గొల్గోత "కల్వరి" అని అనువదించబడింది, ఇది "కపాలము" అనే లాటిన్ పదం నుండి వచ్చింది.
  • చాలా బైబిలు అనువాదాలు “గొల్గోత” అనే పదాన్ని పోలి యున్నట్టు కనిపించే లేదా ధ్వనించే పదాన్ని వినియోగించాయి. ఎందుకంటే దాని అర్థం ఇప్పటికే బైబిలు వచనములో వివరించబడింది.

(అనువాద సూచన: [పేర్లను అనువదించడం ఎలా]

(ఇవి కూడా చూడండి: [అరాము], [ఒలీవల పర్వతము])

బైబిలు రిఫరెన్సుల:

  • [యోహాను సువార్త 19:17]
  • [మార్కు సువార్త 15:22]
  • [మత్తయి సువార్త 27:33]

పదం సమాచారం:

  • Strong's: G11150

గొల్యాతు

వాస్తవాలు:

గొల్యాతు ఫిలిష్తీయుల సైన్యంలో ఆజానుబాహుడైన వీర సైనికుడు. దావీదు చేతిలో హతం అయ్యాడు.

  • గొల్యాతు రెండు మూడు మీటర్లు పొడవుగల వాడు. అతని ఆకారాన్ని బట్టి అతన్ని మహా కాయుడు అన్నారు.
  • గొల్యాతు దగ్గర దావీదు కంటే మంచివి పెద్దవి అయిన ఆయుధాలు ఉన్నప్పటికీ దేవుడు దావీదుకు బలం సామర్థ్యం ఇచ్చి గొల్యాతుని ఓడించేలా చేశాడు.
  • దావీదు విజయం సాధించి గొల్యాతును హతం చేసిన ఫలితంగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులపై విజయం సాధించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: దావీదు, ఫిలిష్తీయులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1555

గోషేను

నిర్వచనం:

గోషేను ఈజిప్టులో నైలు నదికి ఉత్తరాన ఉన్న సారవంతం ప్రాంతం.

  • యోసేపు ఈజిప్టులో అధిపతిగా ఉన్నప్పుడు తన తండ్రి, సోదరులు, వారి కుటుంబాలుకనానులో కరువు తప్పించుకోడానికి వచ్చి గోషేనులో నివసించారు.
  • వారు, వారి సంతానం గోషేనులో 400 సంవత్సరాలకు పైగా నివసించారు. అయితే తరువాత ఐగుప్తియ ఫరో వారిని బానిసత్వంలోకి నెట్టాడు.
  • చివరకు దేవుడు మోషే సహాయంతో ఇశ్రాయేలు ప్రజలు గోషేనునుండి బయలుదేరిపోయి బానిసత్వం నుండి విడుదల అయ్యారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఈజిప్టు, కరువు, మోషే, నైలు నది)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1657

గ్రీకు, గ్రీకుదేశస్థుడు, గ్రీకు నాగరికతాభిమాని

వాస్తవాలు:

"గ్రీకు" అనేది గ్రీసు దేశంలో మాట్లాడే భాష. ఇది గ్రీసులో నివసించే మనిషిని సూచిస్తుంది. రోమా సామ్రాజ్యం అంతటా గ్రీకు మాట్లాడతారు. "గ్రీసువాడు" అంటే "గ్రీకు-మాట్లాడడం" అని అర్థం.

  • యూదేతర ప్రజలు ఎక్కువ మంది రోమా సామ్రాజ్యంలో గ్రీకు భాష మాట్లాడతారు కాబట్టి కొత్త నిబంధనలో అన్యజనులు తరచుగా “గ్రీకు” అని సూచించబడతారు ప్రత్యేకించి యూదులకు భిన్నమైన వారు అని చెపుతున్నప్పుడు వారిని ఆవిధంగా పిలుస్తారు.
  • “యూదులైన గ్రీకు దేశస్తులు” లేదా "హేల్లెనీయులు” అనే పదం హీబ్రూ భాష లేదా బహుశా అరామిక్ భాష మాత్రమే మాట్లాడే "హేబ్రీయులైన యూదులకు" భిన్నంగా గ్రీకు మాట్లాడే యూదులను సూచిస్తారు. "హేల్లెనీయులు” అనే పదం గ్రీకు-మాట్లాడే వ్యక్తికి సంబంధించిన గ్రీకు పదం యొక్క ఉచ్చారణ నుండి వచ్చింది.
  • "గ్రీకు-మాట్లాడువారు” పదాన్ని అనువదించడంలో “గ్రీకు మాట్లాడడం” లేదా “సంస్కృతి పరంగా గ్రీకు” లేదా “గ్రీకు" అనే ఇతరవిధానాలలో అనువదించవచ్చు.
  • యూదేతరుల గురించి ప్రస్తావించేటప్పుడు "గ్రీకు" పదం “అన్యజనుడు” అని అనువదించబడవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)

(వీటిని కూడా చూడండి: ఆరాము, యూదేతరుడు,, గ్రీసు, హీబ్రూ, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H3125, G16720, G16730, G16740, G16750, G16760

గ్రీసు, గ్రీసు సంబంధిత

వాస్తవాలు:

కొత్త నిబంధన సమయాల్లో గ్రీసు రోమా సామ్రాజ్యం పరగణా.

  • ఆధునిక గ్రీసు, లాగానే ఇది మధ్యదరా సముద్రం, ఏగియన్ సముద్రం, అయోనియన్ సముద్రం చుట్టి ఉన్న భూభాగం.
  • అపోస్తలుడు పౌలు గ్రీసులో అనేక పట్టణాలు దర్శించాడు. కొరింతు, తెస్సలోనిక, ఫిలిప్పి బహుశా ఇతర నగరాల్లో సంఘాలను స్థాపించాడు.
  • గ్రీసు లో నివసించే వారిని "గ్రీకులు" అన్నారు. వారి భాష "గ్రీకు." యూదులతో సహా ఇతర రోమా పరగణాల ప్రజలు కూడా గ్రీసు భాష మాట్లాడారు.
  • కొన్ని సార్లు యూదేతరులను సూచించడానికి "గ్రీకు" అనే పేరు ఉపయోగిస్తారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కొరింతు, యూదేతరుడు, గ్రీకు, హీబ్రూ, ఫిలిప్పి, తెస్సలోనిక)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3120, G1671

జక్కయ్య

వాస్తవాలు:

జక్కయ్య యెరికో అనే ఊరిలో పన్నులు వసూలు చేసేవాడు యేసుప్రభువు ఆ ఊరికి వచ్చినప్పుడు

  • ఏసుక్రీస్తును నమ్మిన తరువాత జక్కయ్య శాశ్వతంగా మారిపోయాడు.
  • అతడు ప్రజలను మోసగించి పాపం చేసినందుకు పశ్చాతాపపడ్డాడు మరియు అతడు తన సగం ఆస్తులను పేదలకు ఇస్తానని వాగ్ధానము చేసాడు.
  • అంతేకాకుండా అతను ప్రజల పన్నులలో అన్యాయంగా తీసుకున్నదానికి బదులుగా 4 రెట్లు తిరిగిఇస్తానని కూడా వాగ్ధానము చేశాడు.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి:believe, promise, repent, sin, tax, tax collector)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2195

జెకర్యా (పా.ని)

వాస్తవాలు:

జెకర్యా ఒక ప్రవక్త ఈయన పర్షియా రాజైన 1 దర్యావేషు పరిపాలనకాలంలో ప్రవచించేవాడు. పాత నిబంధనలో జెకర్యా గ్రంధములో అయన చెప్పిన ప్రవచనాలు వున్నాయి, వాటిలో మందిరాన్ని తిరిగి కట్టడానికి వెళ్ళిన వారి గురించి వ్రాయబడింది. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు మరియు హగ్గయి జీవించిన కాలంలోనే ఈ జెకర్యా ప్రవక్త జీవించాడు. పాత నిబంధనకాలంలో చంపబడిన ప్రవక్తలలో చివరి ప్రవక్త అని యేసుక్రీస్తు చెప్పిన ప్రవక్తలలో ఒకడైయుండెను.

  • దావీదు రాజు కాలంలో జెకర్యా అనే పేరుగల ఇంకొక వ్యక్తి మందిరము యొక్క ద్వారపాలకుడిగా ఉండేవాడు.
  • యెహోషాపాతు రాజు కుమారులలో ఒకడైన జెకర్యా అనేపేరుగల వ్యక్తి యెహోషాపాతు తన సహోదరుడైన యెహోరాము చేతిలో చంపబడెను.
  • ఇశ్రాయేలు ప్రజలను వారి విగ్రహారాధన నిమిత్తం గద్దించినందుకు జెకర్యా అనే పేరు గల యాజకుడు రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు.
  • యెరోబాము కుమారుడు కూడా రాజైన జెకర్యా మరియు ఇతడు చంపబడకముందు కేవలం ఆరు నెలలు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించెను.

(తర్జుమా సలహాలు: పేరులు తర్జుమా చేయండి)

(దీనిని చూడండి: దర్యావేషు, ఎజ్రా, యెహోషాపాతు, యెరోబాము, నెహెమ్యా, జెరుబ్బాబెలు)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H2148

జెకర్యా(క్రొ.ని)

వాస్తవాలు:

క్రొత్త నిబంధనలో జెకర్యా యూదుల యాజకుడు, ఈయన బాప్తిస్మము ఇచ్చు యోహానుకు తండ్రి.

  • జెకర్యా దేవుని ప్రేమించెను మరియు ఆయనకు విధేయుడుగా ఉండెను.
  • చాలా సంవత్సరాల వరకు జెకర్యా మరియు అతని భార్య, ఎలిసబెతు, సంతానం కొరకు ఆసక్తితో ప్రార్థించారు, అయినా వారికి పిల్లలు లేకయుండెను. తరువాత వారు చాలా వృద్దాప్యంలో వున్నప్పుడు, దేవుడు వారి ప్రార్థనలను విని వాటికీ సమాధానంగా వారికీ ఒక కుమారుని ఇచ్చాడు. తన కుమారుడు ప్రవక్తగా మారి ప్రవచిస్తాడని, మరియు మెస్సియ యొక్క మార్గములను సిద్ధపరుస్తాడని ప్రవచించెను.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి:Christ, Elizabeth, prophet)

బైబిలు వచనాలు:

##పరిశుద్ద గ్రంథమునుండి కొన్ని ఉదాహరణలు:

  • 22:01 జెకర్యా అనే వృద్ధ యజకుని దగ్గరకు అకస్మాతుగా ఒక దూత దేవుని యొద్దనుండి ఒక వర్తమానము తీసుకొనివచ్చెను. జెకర్యా మరియు అతని భార్య ఎలిజబెత్ భక్తిగల ప్రజలు, అయితే ఆమెకు పిల్లలు లేకపోయిరి.
  • 22:02 ఆ దూత జెకర్యాతో ఈలాగు చెప్పెను, “నీ భార్య కుమారున్ని కనును. అతనికి యోహాను అనే పేరును పెట్టవలెను”
  • 22:03 తక్షణమే,జెకర్యా మాట్లాడలేకపోయెను.
  • 22:07 తరువాత దేవుడు జెకర్యా మరలా మాట్లాడునట్లు అనుమతించెను.

పదం సమాచారం:

  • Strong’s: G21970

జెఫన్యా

వాస్తవాలు:

జెఫన్యా కూషి యొక్క కుమారుడు మరియు ప్రవక్త ఈయన యెరూషలేములో నివసించేవాడు మరియు రాజైన యోషీయా పరిపాలనకాలంలో ప్రవచించేవాడు. ఇతడు కూడా యిర్మియా ప్రవక్తగా ఉన్న సమయంలో జీవించాడు.

  • యూదా ప్రజలు అబద్దపు దేవుళ్ళను ఆరాధిస్తున్నందుకు ఇతడు వారిని గద్దించెను. ఇతని ప్రవచనాలు పాత నిబంధనలో జెఫన్యా అనే పుస్తకంలో వ్రాయబడ్డాయి.
  • పాత నిబంధన గ్రంధములో చూచినట్లయితే అనేకమంది జెఫన్యా అనేపేరు కలిగివున్నారు , వారిలో అనేకమంది యాజకులు.

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(దీనిని చూడండి: యిర్మియా, యోషీయా, యాజకుడు)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H6846

జెబూలూను

వాస్తవాలు:

జెబూలూను, యాకోబు మరియు లేయాలకు పుట్టిన చివరి కుమారుడు మరియు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రముల పేరులలో ఇది కూడా ఒకటైయున్నది.

  • ఇశ్రాయేలు గోత్రములలో జెబూలూను వారికి ఉప్పు సముద్రము యొక్క పడమటి భూభాగం నేరుగా ఇవ్వబడింది.
  • కొన్నిసార్లు “జెబూలును” అనే పేరు ఇశ్రాయేలు గోత్రపువారు నివసించిన ప్రాంతం యొక్క పేరును సూచిస్తుంది.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి: యాకోబు, లేయా, ఉప్పు సముద్రం, ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రములు)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H2074, H2075, G2194

జెబెదయి

వాస్తవాలు:

జెబెదయి గలిలయకు చెందిన జాలరి ఇతడు తన కుమారులైన యాకోబు మరియు యోహాను అను వారి ద్వారా సుపరిచితుడు. వారిద్దరూ యేసుక్రీస్తు శిష్యులు. క్రొత్త నిబంధనలో వారు ఎక్కువగా “జెబెదయి కుమారులుగా ” గుర్తింపబడ్డారు.

  • జెబెదయి కుమారులు కూడా చేపలుపట్టు జాలరులు మరియు వారు తమ తండ్రితో కలిసి చేపలు పట్టేవారు.
  • యాకోబు మరియు యోహానులు తమ తండ్రియైన జెబెదయితో కలిసి చేస్తున్న చేపలు పట్టే పనిని వదిలిపెట్టారు మరియు యేసును వెంబడించుటకు వెళ్లారు.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి: శిష్యుడు, జాలరి, యాకోబు (జెబెదయి కుమారుడు), యోహాను)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong’s: G21990

జెరుబ్బాబెలు

##వాస్తవాలు:

పాత నిబంధనలో జెరుబ్బాబెలు అనేపేరు గల వారు ఇద్దరు వ్యక్తులు వున్నారు.

  • వారిలో ఒకడు యెహోయాకీము మరియు సిద్కియా యొక్క వారసుడైన జెరుబ్బాబెలు.
  • మరియొక జెరుబ్బాబెలు, షయల్తీయేలు యొక్క కుమారుడు, ఇతడు ఎజ్రా మరియు నెహెమ్యాల కాలంలో, కోరేషు రాజు పర్షియాను పాలిస్తున్న సమయంలో బబులోను నుండి ఇశ్రాయేలీయులను విడిపించినప్పుడు యూదా గోత్రపువారికి ముఖ్యుడుగా ఉండెను.
  • జెరుబ్బాబెలు మరియు ప్రధాన యజకుడైన యెహోషువా దేవుని మందిరమును మరియు బలిపీఠమును తిరిగి కట్టుచున్నవారికి సహాయం చేసినవారిలో ఒకరు.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి:Babylon, captive, Cyrus, Ezra, high priest, Jehoiakim, Joshua, Judah, Nehemiah, Persia, Zedekiah)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong’s: H2216, H2217, G22160

తర్శీషు

వాస్తవాలు:

బైబిల్ కాలాల్లో, తర్షీషు మధ్యధరా సముద్రంలో ఉన్న ఓడరేవు నగరం. నగరం యొక్క నిర్దిష్ట స్థానం తెలియదు. అలాగే, పాత నిబంధన తర్షీషు అనే ఇద్దరు వేర్వేరు వ్యక్తుల గురించి ప్రస్తావించింది.

  • తర్షీషు నగరం ఒక సుసంపన్నమైన ఓడరేవు నగరంగా ఉండేది, కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి లేదా వ్యాపారం చేయడానికి ఉత్పత్తులను రవాణా చేసే నౌకలు ఉన్నాయి. సొలొమోను రాజు తార్షీషులో ఓడల సముదాయాన్ని ఉంచాడని బైబిలు చెబుతోంది.
  • పాత నిబంధన ప్రవక్త అయిన యోనా నీనెవెకు బోధించమని దేవుని ఆజ్ఞను పాటించకుండా తర్షీషు నగరానికి వెళ్లే ఓడ ఎక్కాడు.
  • యాపెతు మనవళ్లలో ఒకరి పేరు తర్షీషు.
  • తర్షీషు అనేది అహష్వేరోషు రాజు యొక్క జ్ఞానులలో ఒకరి పేరు కూడా.

(అనువాదం సలహాలు: [పేర్లు అనువదించడం ఎలా]) How to Translate Names)

(చూడండి: Esther, Japheth, Jonah, Nineveh, Phoenicia, wise men)

బైబిల్ రిఫరెన్సులు:

  • [ఆది 10:2-5]
  • [యెషయా 02:14-16]
  • [యిర్మీయా 10:8-10]
  • [యోనా 01:1-3]
  • [కీర్తనలు 048:7-8]

పదం సమాచారం:

  • Strong's: H8659

తామారు

వాస్తవాలు:

తామారు పేరుతో పాత నిబంధనలో అనేకమంది స్త్రీలున్నారు. ఇది పాత నిబంధనలో అనేక పట్టణాలు, లేక ఇతర స్థలాల పేరు.

  • తామారు యూదా కోడలు. ఆమె యేసుక్రీస్తు పూర్వీకుడు పెరెసుకు జన్మ నిచ్చింది.
  • దావీదు రాజు కుమార్తెలలో ఒకామె పేరు తామారు; ఆమె అబ్షాలోము సోదరి. ఆమె మారుటి అన్న అమ్నోను ఆమెను మానభంగం చేసి వదిలేశాడు.
  • అబ్షాలోము తామారు అనే పేరుగల కుమార్తె ఉంది.
  • ఒక పట్టణం పేరు "హజేజోను తామారు." ఇది ఉప్పు సముద్రం పశ్చిమ తీరాన ఉన్న ఎన్గేది. "బయలు తామారు," అనే ఊరు కూడా ఉంది. "తామారు" అనే పేరు ప్రస్తావనలు ఉన్న వివిధ పట్టణాలు ఉన్నాయి.

(చూడండి: Absalom, ancestor, Amnon, David, ancestor, Judah, Salt Sea)

(అనువాదం సలహాలు: [పేర్లు అనువదించడం ఎలా]) How to Translate Names)

బైబిల్ రిఫరెన్సులు:

  • [1 దిన 02:3-4]
  • [2 సమూయేలు 13:1-2]
  • [2 సమూయేలు 14:25-27]
  • [ఆది 38:6-7]
  • [ఆది 38:24-26]
  • [మత్తయి 01:1-3]

పదం సమాచారం:

  • Strong's: H1193, H2688, H8412, H8559

తార్సు

వాస్తవాలు:

తార్సు కిలికియ అనే రోమా పరగణాలో ఉన్న ఒక ధనిక పట్టణం. ఇప్పుడు ఇది దక్షిణ, మధ్య టర్కీలో ఉంది.

  • తార్సు మధ్యదరా సముద్రంలో కలిసే పెద్ద నది తీరాన ఉంది. కాబట్టి ఇది ఒక ప్రాముఖ్య వాణిజ్య మార్గం.
  • ఒక కాలంలో ఇది కిలికియ ముఖ్య పట్టణం.
  • కొత్త నిబంధనలో ఇది అపోస్తలుడు పౌలు సొంత ఊరు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కిలికియ, పౌలు, పరగణా, సముద్రం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G5018, G5019

తిమోతి

వాస్తవాలు:

తిమోతి లుస్త్రకు చెందిన యువకుడు. అతడు తరువాత అనేక సువార్త పరిచర్య ప్రయాణాలలో పౌలుకు సహాయకుడుగా కొత్త విశ్వాసుల సమాజాలకు కాపరిగా ఉన్నాడు.

  • తిమోతి తండ్రి గ్రీకువాడు. అయితే తన అమ్మమ్మ, లోయి, తన తల్లి యునికే యూదులు, క్రీస్తు విశ్వాసులు.
  • పెద్దలు, పౌలు వారి చేతులుంచి ప్రార్థన చేసి అతణ్ణి పరిచర్యకు నియమించారు.
  • కొత్త నిబంధనలో రెండు పుస్తకాలు (I తిమోతి, 2 తిమోతి) పౌలు తిమోతి కి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. యువ నాయకుడు తిమోతికి స్థానిక సంఘాల్లో నడిపింపుకోసం ఇవి పౌలు రాశాడు.

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: నియమించు, విశ్వసించు, సంఘం, గ్రీకు, పరిచర్య చేసే వాడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G5095

తిర్సా

వాస్తవాలు:

తిర్సా ఒక ప్రాముఖ్య కనానీయ పట్టణం. దీన్ని ఇశ్రాయేలీయులు ఆక్రమించుకున్నారు. ఇది మనష్శే సంతతి వాడు గిలాదు కుమార్తె పేరు.

  • తిర్సా పట్టణం ప్రాంతం మనష్శే గోత్రం వారు ఆక్రమించుకున్నారు. ఈ పట్టణం షెకెముకు సుమారు 10 మైళ్ళు ఉత్తరాన ఉంది.
  • సంవత్సరాలు తరువాత, తిర్సా ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం తాత్కాలిక ముఖ్య పట్టణం అయింది. ఇది ఇశ్రాయేలు నలుగురు రాజుల పరిపాలనలో ఉంది.
  • తిర్సా మనష్శే మనవరాలీ పేరు కూడా. వారు తమకు దేశంలో భాగం ఇమ్మన్నారు. ఎందుకంటే వారి తండ్రి చనిపోయాక అతనికి కుమారులు లేరు. కొడుకులే ఆస్తి వారసత్వముగా పొందడం సాధారణంగా వాడుక .

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కనాను, వారసత్వముగా పొందు, ఇశ్రాయేల్ రాజ్యం, మనష్శే, షెకెము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8656

తీతు

వాస్తవాలు:

తీతు ఒక అన్యుడు. ఆదిమ సంఘాలలో నాయకునిగా ఉండడానికి ఇతడు పౌలు ద్వారా శిక్షణ పొందాడు.

  • పౌలు తీతుకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో పుస్తకాలలో ఒకటి.
  • ఈ ఉత్తరంలో/పత్రికలో క్రేతు ద్వీపములోని సంఘాలలో పెద్దలను నియమించమని పౌలు తీతును హెచ్చరించాడు.
  • క్రైస్తవులకు పౌలు రాసిన కొన్ని ఇతర ఉత్తరాలలో/పత్రికలలో తీతు తనను ప్రోత్సహించాడనీయు, తనకు ఆనందాన్ని తీసుకొనివచ్చాడనీ/కలిగించడాని పౌలు తీతును గురించి ప్రస్తావిస్తున్నాడు.

(అనువాదం సలహాలు : పేర్లను అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: [ appoint, believe, church, circumcise, Crete, elder, encourage, instruct, minister)

బైబిలు రిఫరెన్సులు:

  • 2 తిమోతి 04:10
  • గలతీ 02:01-02
  • గలతీ 02:03-05
  • తీతు 01:04

పదం సమాచారం:

  • Strong's: G51030

తూబాలు

వాస్తవాలు:

అనేక మంది మనుషులు పాత నిబంధనలో ఈ "తూబాలు" అనే పేరుతో ఉన్నారు.

  • తూబాలు అనే పేరు గల ఒకడు యాపెతు కుమారుడు.
  • "తూబాలు-కయీను" అనే వాడు కయీను సంతతి వాడు లెమెకు కుమారుడు.
  • తూబాలు అనే పేరు గల జాతిని యెషయా, యెహెజ్కేలు ప్రవక్తలు ప్రస్తావించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కయీను, సంతతి వాడు, యెహెజ్కేలు, యెషయా, యాపెతు, లెమెకు, ప్రజల సమూహం, ప్రవక్త)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8422, H8423

తూరు, తూరీయులు

వాస్తవాలు:

తూరు ఒక ప్రాచీన కనానీయ పట్టణం. ఇది మధ్యదరా సముద్రం తీరాన ఇప్పుడు ఆధునిక లెబానోనులో భాగంగా ఉంది. దాని ప్రజలను "తూరీయులు" అన్నారు.

  • పట్టణంలోకొంత భాగం సముద్రంలో ద్వీపంలో ఉంది. భూభాగం నుంచి ఒక కిలో మీటర్ దురాన ఉంది.
  • దేవదారుచెట్లు వంటి దీని విలువైన సహజ వనరుల మూలంగా, తూరు ధనిక వాణిజ్య పారిశ్రామిక కేంద్రం అయింది.
  • తూరు రాజు రాజు హిరాము దేవదారు చెట్ల కలపను, నిపుణత గల శ్రామికులను దావీదు రాజు అంతఃపురం కట్టడానికి సహాయంగా పంపించాడు.
  • చాలా సంవత్సరాల తరువాత, హిరాము సొలోమోను రాజుకు కూడా కలప, నిపుణత గల శ్రామికులను ఆలయ నిర్మాణంలో సహాయంగా పంపాడు. సొలోమోను అతనికి విస్తారమైన గోదుమ, ఒలీవనూనె చెల్లించాడు.
  • తూరు తరచుగా పక్కన ఉన్న ప్రాచీన పట్టణం సీదోనుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇవి ఫోనిషియాలో ప్రాముఖ్యమైన కనాను పట్టణాలు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:Canaan, cedar, Israel, the sea, Phoenicia, Sidon)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H6865, H6876, G51830, G51840

తెరహు

వాస్తవాలు:

తెరహు నోవహు కుమారుడు షేము సంతతి వాడు. అతడు అబ్రాము, నాహోరు, హారానుల తండ్రి.

  • తెరహు ఊరులో ఉన్న తన ఇంటినుండి బయలు దేరి తన కుమారుడు అబ్రాము, లోతు, అబ్రాము భార్య శారాలతో కనాను ప్రదేశం ప్రయాణం అయ్యాడు.
  • కనాను దారిలో తెరహు, తన కుటుంబం కొన్ని సంవత్సరాలు మెసపొటేమియాలో హారాను పట్టణంలో నివసించారు. తెరహు 205వ ఏట హారానులో చనిపోయాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: Abraham, Canaan, Haran, Lot, Mesopotamia, Nahor, Sarah, Shem, Ur)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H8646, G22910

తోమా

వాస్తవాలు:

తోమా యేసు తన శిష్యులుగా, తరువాత అపోస్తలులుగా ఎన్నుకొన్న పన్నెండు మందిలో ఒకడు. అతని మరొక పేరు "దిదుమ," అంటే "కవల."

  • యేసు చనిపోక ముందు తన శిష్యులతో తాను తండ్రి వద్దకు వెళుతున్నానని, వారు తనతో ఉండడానికి స్థలం సిద్ధం చెయ్యబోతున్నానని చెప్పాడు. తోమా యేసుతో అయన ఎక్కడికి పోతున్నాడో తమకు ఎలా తెలుస్తుందని, అక్కడికి దారి ఎలా అని అడిగాడు.
  • తరువాత యేసు చనిపోయి తిరిగి లేచాక అయన నిజంగా తిరిగి లేచాడని తాను నమ్మడం లేదని తోమా చెప్పాడు. తాను ఆయన గాయాలను తాకి చూస్తే తప్ప నమ్మనని చెప్పాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:apostle, disciple, God the Father, the twelve)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G23810

థెస్సలోనిక, థెస్సలోనీయుడు

వాస్తవాలు:

కొత్త నిబంధన కాలంలో, థెస్సలోనిక ప్రాచీన రోమాసామ్రాజ్యపు మాసిదోనియా ముఖ్య పట్టణం. ఈ పట్టణంలో నివసించే ప్రజలను "థెస్సలోనీయులు" అని పిలువబడేవారు .

  • థెస్సలోనిక పట్టణము ఒక ముఖ్యమైన వాడరేవు(పట్టణం) మరియు అది తూర్పు భాగపు రోమా సామ్రాజ్యమువైపు రోమా పట్టణమును కలుపు ముఖ్య రహదారి దగ్గర నెలకొని ఉన్నది.

  • పౌలు, సీల తిమోతిలతో కలిసి థెస్సలోనికను తన రెండవ మిషనెరీ/సువార్త దండయాత్ర ప్రయాణంలో దర్శించి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. తరువాత, పౌలు ఈ పట్టణమును తన మూడవ మిషనెరీ/ సువార్త దండయాత్ర ప్రయాణంలో కూడా దర్శించాడు.

  • పౌలు థెస్సలోనికయ లోని క్రైస్తవులకు రెండు లేఖలు/పత్రికలు రాశాడు. ఈ ఉత్తరాలు (1 థెస్సలోనిక, 2 థెస్సలోనిక) కొత్త నిబంధనలో ఉన్నాయి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: [మాసిదోనియా] Macedonia, Paul, Rome)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G23310, G23320

దమస్కు

వాస్తవాలు:

దమస్కు సిరియా దేశం రాజధాని పట్టణం. బైబిలు కలంలో ఉన్న నగరం ప్రదేశంలోనే నేటి నగరం కూడా ఉంది.

  • దమస్కు లోకంలో అత్యంత పురాతనమైన పట్టణం. అన్ని కాలాల్లోనూ దీనిలో జనాభా నివసించారు.
  • అబ్రాహాము కాలంలో, దమస్కు ఆరాము రాజ్యం రాజధాని (ఇది ఇప్పుడు సిరియాలో ఉంది).
  • పాత నిబంధన అంతటా దమస్కు నివాసులు, ఇశ్రాయేలు ప్రజల మధ్య లావాదేవీల ప్రస్తావనలు ఉన్నాయి.
  • దమస్కు నాశనం గురించి అనేక బైబిలు ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు పాత నిబంధన కాలంలో అస్సిరియా వారు దీన్ని నాశనం చేయడంతో నెరవేరాయి. లేదా ఇది భవిషత్తులో పట్టణం పూర్ణ నాశనం తో నెరవేరవచ్చు.
  • కొత్త నిబంధనలో, పరిసయ్యుడు సౌలు (తరువాత పౌలు అనే పేరు వచ్చింది) ఈ నగర క్రైస్తవులను బాధించడానికి వెళుతుండగా యేసు అతణ్ణి ఎదుర్కొని అతడు విశ్వాసిగా మారేలా చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆరాము, అస్సిరియా, విశ్వసించు, సిరియా)

బైబిలు అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H1833, H1834, G1154

దర్యావేషు

వాస్తవాలు:

దర్యావేషు అనేకమంది పారసీక రాజులకున్న పేరు. "దర్యావేషు" అనేది ఒక బిరుదు నామం అయి ఉండవచ్చు.

  • "మాదీయుడైన దర్యావేషు" ప్రవక్త దానియేలును తన దేవుణ్ణి ఆరాధించినందుకు అతణ్ణి సింహాల బోనులో వేయించేలా అతని ఉద్యోగులు మోసం చేశారు.
  • "దర్యావేషు పర్షియా" సహాయం facilitate reనిర్మాణం of ఆలయం యెరూషలేములోకాలంలో ఎజ్రా and నెహెమ్యా.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: పర్షియా, బబులోను, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1867, H1868

దానియేలు

వాస్తవాలు:

దానియేలు ఒక ఇశ్రాయేలు ప్రవక్త. అతణ్ణి యువకుడుగా బాబిలోనియా రాజు నెబుకద్నేజర్ రాజు సుమారు క్రీ. పూ 600లో బందీగా తీసుకుపోయాడు.

  • ఈ సమయంలో అనేకమంది ఇతర ఇశ్రాయేలీయులను యూదా నుండి 70 సంవత్సరాల బబులోను చెరకు తీసుకుపోయారు.
  • దానియేలుకు బెల్తెషాజర్ అనే బాబిలోనియా పేరు పెట్టారు.
  • దానియేలు గౌరవనీయుడు, న్యాయవంతుడు అయిన యువకుడు. దేవునికి లోబడేవాడు.
  • దానియేలు అనేక కలలు దర్శనాలు బాబిలోనియా రాజుల కోసం వివరించడానికి దేవుడు అతనికి సామర్థ్యం ఇచ్చాడు.
  • తన సామర్థ్యం తన గౌరవనీయ గుణ లక్షణాలు, మూలంగా దానియేలుకు బాబిలోనియా సామ్రాజ్యంలో ఉన్నత నాయకత్వ పదవి ఇచ్చారు.
  • అనేక సంవత్సరాలు తరువాత, దానియేలు శత్రువులు బాబిలోనియా రాజు దర్యావేషును మోసం చేసి రాజ్యంలో ఎవరూ రాజును తప్ప వేరెవరినీ పూజించరాదని ఒక చట్టం చేయించారు. దానియేలు తన దేవుణ్ణి ప్రార్థించడం కొనసాగించాడు. అతన్ని అరెస్ట్ చేసి సింహాల బోనులో పడేసారు. అయితే దేవుడు అతనికి ఏ హానీ కలగ కుండా కాపాడాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను, నెబుకద్నేజర్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1840, H1841, G1158

దాను

వాస్తవాలు:

దాను యాకోబు ఐదవ కుమారుడు. పన్నెండు ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకటి. కనాను ఉత్తరాన దాను గోత్రం వారు స్థిరపడిన ప్రాంతానికి దాను అని పేరు వచ్చింది.

  • కాలంలో అబ్రాము కాలంలో దాను అనే పేరు గల పట్టణం యెరూషలేముకు పశ్చిమాన ఉండేది.
  • ఇశ్రాయేలు జాతి వాగ్దాన దేశం ప్రవేశించిన కొన్ని సంవత్సరాలు తరువాత, దాను అనే పేరు గల పట్టణం పేరు యెరూషలేముకు 60 మైళ్ళు ఉత్తరాన ఉంది.
  • ఈ పదం"దానీయులు" దాను సంతానాన్ని సూచిస్తున్నది. అంటే ఆ తెగ సభ్యులు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కనాను, యెరూషలేము, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1835, H1839, H2051

దావీదు

వాస్తవాలు:

దావీదు ఇశ్రాయేలు రెండవ రాజు. అతడు దేవుణ్ణి ప్రేమించాడు, సేవించాడు. అతడు కీర్తనల ముఖ్య కవి.

  • దావీదు యవ్వన ప్రాయంలోనే తన కుటుంబానికి చెందిన గొర్రెలను మేపుతున్న సమయంలో దేవునిచే ఎన్నిక చేయబడి ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు.

  • దావీదు గొప్ప యోధుడుగా ఇశ్రాయేలుసైన్యాన్ని శత్రువులకు వ్యతిరేకంగా నడిపించాడు. ఫిలిష్తియ వాడైన గొల్యాతు సంహారం ప్రసిద్ధి చెందింది.

  • దావీదునుచంపడానికిసౌలు రాజు ప్రయత్నించాడు. అయితే దేవుడు అతణ్ణి కాపాడాడు. సౌలు మరణం తరువాత అతన్ని రాజుగా నియమించాడు.

  • దావీదు ఒక భయంకర పాపం చేశాడు. అయితే అతడు పశ్చాత్తాప పడినందువల్ల దేవుడు అతన్ని క్షమించాడు.

  • యేసు, మెస్సీయకు "దావీదు కుమారుడు" అని పేరు. ఎందుకంటే అతడు రాజైన దావీదు సంతతి వాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: గొల్యాతు, ఫిలిష్తీయులు, సౌలు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని ఉదాహరణలు:

  • 17:02 దేవుడు బేత్లెహేము ఊరి వాడైన దావీదు అనే పేరు గల ఒక ఇశ్రాయేలు యువకుడిని సౌలు తరువాత రాజుగా నియమించడానికి ఎన్నుకొన్నాడు. దావీదు గొర్రెల కాపరి, వినయపూర్వకమైన నీతిపరుడైన మనిషి, దేవునిపై నమ్మకముంచి ఆయనకు లోబడినవాడు.

  • 17:03 దావీదు గొప్ప సైనికుడు, నాయకుడు కూడా. దావీదు యువకుడుగా ఉన్నప్పుడే అతడు గొల్యాతు అనే పేరుగల మహాకాయునితో పోరాడాడు.

  • 17:04 దావీదు పట్ల మనుష్యులు చూపే ప్రేమకు సౌలు అసూయ చెందాడు. సౌలు అనేక సమయాలు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు సౌలునుండి తప్పించుకుని పారిపోయాడు.

  • 17:05 దేవుడు దావీదును దీవించి అతనికి విజయాలు ఇచ్చాడు. దావీదు అనేక యుద్ధాలు చేసి దేవుని సహాయంతో ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడించాడు.

  • 17:06 ఇశ్రాయేలీయుల దైవారాధన కోసం, బలి అర్పణల కోసం దావీదు ఒక ఆలయం కట్టించాలనుకున్నాడు.

  • 17:09 దావీదు అనేక సంవత్సరాలు న్యాయంగా నమ్మకత్వం కలిగి పరిపాలన చేశాడు. దేవుడు అతన్ని దీవించాడు. అయితే, తన జీవితం చివర్లో అతడు దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేశాడు.

  • 17:13 దావీదు చేసిన దానికి దేవుడు చాలా కోపగించుకున్నాడు. కాబట్టి ఆయన నాతాను ప్రవక్తను పంపి దావీదుకు అతడె దుష్టకరమైన పాపం చేశాడో చెప్పాడు. దావీదు తన పాపం విషయంలో పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. తన తక్కిన జీవితమంతా దావీదు దుర్లభ సమయాలలో సైతం దేవునికి లోబడిఆయన్ను వెంబడించాడు.

పదం సమాచారం:

  • Strong's: H1732, G11380

దావీదు పట్టణం

వాస్తవాలు:

"దావీదు పట్టణం" అనేది యెరూషలేము, బేత్లెహేములకు మరొకపేరు.

  • ఇశ్రాయేలును పరిపాలించే సమయంలో దావీదు యెరూషలేములో నివసించాడు.
  • బేత్లెహేము దావీదు పుట్టిన ఊరు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: దావీదు, బేత్లెహేము, యెరూషలేము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు

పదం సమాచారం:

  • Strong's: H1732, H5892,G11380, G41720

దావీదు వంశం

వాస్తవాలు:

"దావీదు వంశం" అంటే దావీదు కుటుంబం లేక అతని సంతానం.

  • "దావీదు సంతానం” లేక “దావీదు కుటుంబం” లేక “దావీదు రాజు తెగ" అని కూడా తర్జుమా చెయ్యవచ్చు.
  • యేసు దావీదు సంతతి గనుక అయన "దావీదు వంశం వాడు".
  • కొన్ని సార్లు "దావీదు వంశం” లేక “దావీదు ఇంటి వారు" అంటే సజీవులైన దావీదు కుటుంబాన్ని సూచిస్తుంది.
  • సాధారణంగా ఈ పదం తన సంతానం అంతటినీ అంటే చనిపోయిన వారిని సైతం సూచిస్తున్నది.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:David, descendant, house, Jesus, king)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

  • 2 దిన 10:17-19
  • 2 సమూయేలు 03:6-7
  • లూకా 01:69-71
  • కీర్తనలు 122:4-5
  • జెకర్యా12:7

పదం సమాచారం:

Strong's: H1004, H1732, G11380, G36240


దెలీలా

వాస్తవాలు:

దెలీలా ఒక ఫిలిష్తియ స్త్రీ. ఈమెను సంసోను ప్రేమించాడు. అయితే ఆమె తన భార్య కాదు.

  • దెలీలా సంసోనును కంటే డబ్బును ఎక్కువ ప్రేమించింది.
  • ఫిలిష్తీయులు లంచం ఇవ్వడం వల్ల దెలీలా వంచనతో సంసోను బలహీనంగా అయి పోవడం ఎలానో తెలుసుకుంది. తన బలం అంతా పోయాక ఫిలిష్తీయులు అతణ్ణి బంధించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: లంచం, ఫిలిష్తీయులు, సంసోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1807

దైవ జనుడు (దేవుని మనిషి)

వాస్తవాలు:

“దేవుని మనిషి/దైవజనుడు” అనే వ్యక్తీకరణ యెహోవా ప్రవక్తకు  గౌరవంగా సంబోధించడం/సూచిస్తున్నది. ఇది యెహోవా దూతను సూచించదానికి కూడా  ఉపయోగిస్తారు.

  • ప్రవక్తను గురించి మాట్లాడుతున్నప్పుడు, “దేవునికి చెందిన మనిషి” లేక “దేవుడు ఏర్పరచుకొన్న మనిషి” లేక “దేవుణ్ణి సేవిస్తున్న మనిషి” అని అనువాదం చెయ్యవచ్చు.
  • దేవదూతను గురించి మాట్లాడుతున్నప్పుడు, “దేవుని సందేశకుడు” లేక “నీ దూత” లేక “దేవుని నుండి వచ్చిన మనిషిని పోలిన పరలోకపు జీవి” అని అనువాదం చెయ్యవచ్చు.

(చూడండి: [దేవదూత] angel, honor, prophet)

బైబిలు రెఫరెన్సులు:

  • 1 దినవృత్తాంతములు 23:12-14
  • 1 రాజులు 12:22
  • 1 సమూయేలు 09:9-11

పదం సమాచారం:

  • Strong's: H0376, H0430, G04440, G23160

నజరేతు, నజరేయుడు

వాస్తవాలు:

ఇశ్రాయేలు ఉత్తరాన గలిలయ ప్రాంతంలో ఉన్న పట్టణం నజరేతు. యెరూషలెంకు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, కాలినడకన మూడు నుండి ఐదు రోజుల సమయం పడుతుంది.

  • యోసేపు, మరియలు నజరేతు వాస్తవ్యులు, ఇక్కడే యేసు పెరిగాడు. ఈ కారణంగానే యేసు నజరేయుడు అని పిలువబడ్డాడు.
  • నజరేతులోని అనేకమంది యూదులు యేసు బోధను గౌరవించలేదు, ఎందుకంటే యేసు వారిమధ్యలో పెరిగాడు, ఆయన ఒక సామాన్యమైనవాడు అని వారి అభిప్రాయం.
  • ఒకసారి యేసు నజరేతు దేవాలయంలో బోఅదిస్తున్నప్పుడు, అక్కడున్న యూదులు ఆయనను చంపాలని చూసారు, ఎందుకంటే యేసు తాను మెస్సీయానని చెప్పుకున్నాడు, తనను తృణీకరించినందుకు ఆయన వారిని గద్దించాడు.
  • యేసు నజరేతునుండి వచ్చాడని విని నతనియేలు చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి నజరేతు పట్టణం ప్రముఖమైనది కాదని అర్థం అవుతుంది.

(చూడండి: క్రీస్తు, గలలియ, యోసేపు, మరియ)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 23:04 యోసేపు, మరియలు తాము నివసిస్తున్న నజరేతు నుండి బెత్లెహెంకు చాలా ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది, ఎందుకంటే బెత్లెహెం వారి పితరుడైన దావీదు సొంత పట్టణం.
  • 26:02 యేసు నజరేతు పట్టణానికి వెళ్ళాడు, అక్కడ ఆయన తన బాల్యం గడిపాడు.
  • 26:07 నజరేతు ప్రజలు ఆరాధన స్థలం నుండి యేసును ఈడ్చుకొంటూ వెళ్ళారు, ఆయనను చంపాలని దేవాలయపు అంచులవరకు తీసుకొనివెళ్ళారు.

పదం సమాచారం:

  • Strong’s: G34780, G34790, G34800

నఫ్తాలి

వాస్తవాలు:

యాకోబు కుమారులలో నఫ్తాలి ఆరవవాడు. అతని సంతానం నఫ్తాలి గోత్రంగా ఏర్పడ్డారు, ఇశ్రాయేలీయుల పెన్నెండు గోత్రాలలో ఒకటి.

  • కొన్నిసార్లు నఫ్తాలి పేరు వారు నివసించిన ప్రాంతాన్ని సూచిస్తుంది. (చూడండి: ఉపలక్షణం)
  • నఫ్తాలి ప్రాంతం ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతంలో దాను, ఆషేరు గోత్రాలకు దగ్గర్లో ఉంది. దీని తూర్పు ప్రాంతం కిన్నెరెతు సముద్రానికి పశ్చిమ తీరంలో ఉంది.
  • ఈ గోత్రం పాతనిబంధనలోనూ, కొత్తనిబంధనలోనూ పేర్కొనబడింది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆషేరు, దాను, యాకోబు, గలిలయ సముద్రం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5321, G3508

నయమాను

వాస్తవాలు:

పాతనిబంధనలో ఆరాము రాజు సైన్యంలో నయమాను ప్రధాన సైన్యాధికారి.

  • నాయమానుకు భయంకరమైన చర్మ వ్యాధి ఉండేది. దానిని కుష్టువ్యాధి అంటారు, అది నయం కానిది.
  • నయమాను ఇంటిలో ఉన్న యూద బానిసబాలిక స్వస్థత కోసం ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళమని నయమానుతో చెప్పింది.
  • యొర్డాను నదిలో ఏడుసార్లు మునగమని ఎలీషా ప్రవక్త నాయమానుతో చెప్పాడు. నయమాను లోబడినప్పుడు, ఆ వ్యాధినుండి దేవుడు బాగుచేసాడు.
  • ఫలితంగా, నయమాను నిజదేవుడు, యెహోవా యందు విశ్వాసముంచాడు.
  • యాకోబు కుమారుడు బెన్యామీను సంతానంలో నయమాను అను పేరు గలవారు ఇద్దరు ఉన్నారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి:Aram, Jordan River, leprosy, prophet)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 19:14 భయంకరమైన చర్మ రోగం కలిగిన శత్రు సైన్యాధికారి నయమాను కు కలిగిన ఒక అద్భుతకార్యం.
  • 19:15 మొదట నయమాను చాలా కోపగించాడు, అది బుద్ధిహీనంగా ఉన్నదని దానిని చెయ్యలేదు. తరువాత తన మనసు మార్చుకొని యోర్దాను నదిలో ఏడుసార్లు మునిగాడు.
  • 26:06 ఇశ్రాయేలు శతృసైన్యాధికారి నయమాను చర్మ రోగాన్ని ఆయన (ఎలీషా) మాత్రమే బాగుచేసాడు.

పదం సమాచారం:

  • Strong’s: H5283, G34970

నహూము

వాస్తవాలు:

యూదా రాజ్యాన్ని దుష్టుడైన రాజు మనష్శే పాలిస్తున్న కాలంలో నహూము ప్రవక్తగా ఉన్నాడు.

  • నహూము ఎల్కోష్ పట్టణవాసి, ఇది యెరూషలెంకు 20 మైళ్ళ దూరంలో ఉంది.
  • పాతనిబంధన గ్రంధంలోని నహూములో అస్సీరియా పట్టణం నినెవే నాశనం గురించిన ప్రవచనాలు ఉన్నాయి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అస్సీరియ, మెస్సీయ, ప్రవక్త, నినెవే)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5151, G3486

నాతాను

వాస్తవాలు:

నాతాను దేవుని నమ్మదగిన ప్రవక్త, ఇశ్రాయేలు మీద రాజుగా దావీదు ఉన్నకాలంలో ఈ ప్రవక్త జీవించాడు.

  • ఊరియాకు వ్యతిరేకంగా దావీదు దుస్సాహంగా పాపం చేసినప్పుడు దావీదును ప్రతిఘటించడానికి దేవుడు నాతానును పంపాడు.
  • దావీదు రాజైనప్పటికీ నాతాను దావీడును గద్దించాడు.
  • నాతాను ప్రతిఘటించిన తరువాత దావీదు పశ్చాత్తాపపడ్డాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: David, faithful, prophet, Uriah)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 17:07 “నీవు యుద్ధాలు చేసినవాడవు కనుక నా కోసం దేవాలయాన్ని నీవు నిర్మించవు” అనే సందేశంతో దేవుడు నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు.
  • 17:13 దావీదు చేసినదాన్ని బట్టి దేవుడు కోపగించాడు, కాబట్టి తన పాపం ఎంత దుర్మార్గమైనదో దావీదుకు చెప్పడానికి దేవుడు నాతాను ప్రవక్తను పంపాడు.

పదం సమాచారం:

  • Strong’s: H5416, G34810

నాహోరు

వాస్తవాలు:

అబ్రహాముకున్న ఇద్దరు బంధువులకు నాహోరు అను పేరు ఉంది. అతని తాత, అతని సోదరుడు.

  • అబ్రహాము సోదరుడు నాహోరు ఇస్సాకు భార్య రిబ్కాకు తాత.
  • ”నాహోరు పట్టణం” అంటే “నాహోరు పేరు కలిగిన పట్టణం” లేక “నాహోరు జీవించిన పట్టణం” లేక “నాహోరు పట్టణం” కావచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: Abraham, Rebekah)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H5152, G34930

నినెవే, నినెవేనివాసులు

వాస్తవాలు:

సిరియా దేశానికి నినెవే ముఖ్యపట్టణం. ఒక “నినెవేనివాసి” నినెవేలో నివసించినవాడు.

  • నినెవే నివాసులు తమ దుష్టత్వాన్నుండి తిరుగునట్లు హెచ్చరించడానికి దేవుడు యోనా ప్రవక్తను వారి వద్దకు పంపాడు. ప్రజలు పశ్చాత్తాపపడ్డారు, దేవుడు వారిని నాశనం చెయ్యలేదు.
  • తరువాత సిరియా దేశీయులు దేవుణ్ణి సేవించడం నిలిపివేశారు. వారు ఇశ్రాయేలు రాజ్యాన్ని జయించారు, ఆ ప్రజలను నినెవే పట్టణానికి తీసుకొనివెళ్ళారు.

(అనువాదం సూచనలు: [పేర్లను అనువదించడం]) How to Translate Names)

(చూడండి:Assyria, Jonah, repent, turn)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5210, G3535, G3536

నెగెబు

వాస్తవాలు:

నెగెబు ఇశ్రాయేలు దక్షిణ ప్రాంతంలోని ఒక అరణ్య ప్రదేశం, ఇది ఉప్పు సముద్రానికి నైరుతి దిశలో ఉంది.

  • ఈ పదంకున్న ప్రారంభ అర్థం, “దక్షిణం,” కొన్ని ఆంగ్ల అనువాదాలు ఈ విధంగా తర్జుమా చేసాయి.
  • ఈ రోజున నెగెబు అరణ్యం ఉన్న ప్రదేశంలో “దక్షిణం” లేదు.
  • అబ్రహాం కాదేషు పట్టణంలో ఉన్నప్పుడు అతడు నెగెబులో లేక దక్షిణ ప్రాంతంలో నివసించాడు.
  • రిబ్కా తనను కలుసుకొని తనకు భార్యగా కావడానికి వస్తున్నప్పుడు ఇస్సాకు నెగెబులో ఉన్నాడు.
  • యూదా గోత్రాలు – యూదా, షిమియోను దక్షిణ ప్రాంతంలో నివాసం ఉన్నారు.
  • నెగెబు ప్రాంతంలో అతి పెద్ద పట్టణం బెయెర్షబా.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అబ్రహాము, బెయేర్షేబా, ఇశ్రాయేలు, యూదా, కాదేష్, ఉప్పు సముద్రం, షిమియోను)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5045, H6160

నెహెమ్యా

వాస్తవాలు:

నెహెమ్యా ఇశ్రాయేలీయుడు, బబులోనువారు యూదా, ఇశ్రాయేలు వారిని బందీలుగా పట్టుకొన్నప్పుడు నెహెమ్యాను బలవంతంగా తీసుకొనివెళ్ళారు.

  • పర్షియా రాజు, అర్తహషస్తకు పానదాయకుడిగా ఉన్నప్పుడు యెరూషలెం తిరిగి వెళ్ళడానికి నెహెమ్యా రాజును అనుమతి అడిగాడు.
  • బబులోనువారితో నాశనం కాబడిన యెరూషలెం గోడలను తిరిగి కట్టడంలో నెహెమ్యా ఇస్రాయేలీయులను నడిపించాడు.
  • రాజు అంతఃపురానికి రావడానికి ముందు పన్నెండు సంవత్సరాలు యెరూషలెంకు అధిపతిగా ఉన్నాడు.
  • యెరూషలెం గోడలు తిరిగి కట్టడం, ప్రజలను పరిపాలించడం గురించిన వృత్తాంతమంతా పాతనిబంధనలోని నెహెమ్యా గ్రంథం చెపుతుంది.
  • పాతనిబంధనలో నెహెమ్యా పేరుతో మరికొందరు ఉన్నారు. యే నెహెమ్యా గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోడానికి సాధారణంగా పేరుముందు తండ్రి పేరు ప్రస్తావించడం జరుగుతుంది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆర్తహషస్త, బబులోను, యెరుషలెం, కుమారుడు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5166

నైలు నది, ఐగుప్తు నది, నైలు

వాస్తవాలు:

నైలు చాలా పొడవు, వెడల్పు కలిగిన నది, ఆఫ్రికా ఈశాన్య దిశలో ఉంది. ఐగుప్తులో ఇది ప్రఖ్యాతి గాంచిన ప్రధానమైన నది.

  • నైలు నది ఐగుప్తుకు ఉత్తరాన ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
  • నైలు నదికి ఇరువైపులా సస్యశ్యామలమైన భూమిలో పంటలు పెరుగుతాయి.
  • ఐగుప్తులో అనేకులు నైలునదికి దగ్గరలో నివసిస్తారు, ఎందుకంటే ఆహారపంటలకు నైలునది అత్యంత ప్రాముఖ్యమైన ప్రధాననీటి వనరు.
  • ఇశ్రాయేలీయులు గోషెను ప్రాంతంలో నివసించారు, ఇది చాలా ఫలవంతమైన భూభాగం ఎందుకంటే ఇది నైలునదికి సమీపంలో ఉంది.
  • మోషే బాలునిగా ఉన్నప్పుడు, మోషే తల్లిదండ్రులు ఆ బాలును ఒక పెట్టెలో ఉంచి ఫరో మనుష్యులనుండి కాపాడడానికి నైలునది రెళ్ళు మధ్యలో దాచారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఐగుప్తు, గోషెను, మోషే)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:

  • 08:04 ఐగుప్తు చాల పొడవైన, శక్తివంతమైన దేశం, ఇది నైలునది వెంబడి ఆనుకొని ఉంది.
  • 09:04 ఇశ్రాయేలీయులు అనేకమంది బిడ్డలను కలిగియున్నారని ఫరో చూచాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల బాలురను నైలునదిలో పడద్రోయడం ద్వారా వారిని చంపివేయాలని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు.
  • 09:06 పిల్లవాని తల్లిదండ్రులు వానిని దాచలేక వాడు చనిపోక బ్రతుకునట్లు నైలునది రెళ్ళు మధ్య నీటిమీద తేలుచున్న బుట్టలో ఉంచారు.
  • 10:03 దేవుడు నైలునదిని రక్తముగా మార్చాడు, అయితే ఇంకనూ ఫరో ఇస్రాయేలీయులను వెళ్ళనియ్యలేదు.

పదం సమాచారం:

  • Strong's: H2975, H4714, H5104

పద్దనరాము

వాస్తవాలు:

పద్దనరాము అనునది ఒక ప్రాంతము పేరు, అబ్రాహాము మరియు తన కుటుంబం కానాను దేశమునకు వెళ్ళక మునుపు ఈ స్థలములోనే నివాసముండిరి. ఈ పదమునకు “ఆరాము బయలు” అని అర్థము కలదు.

  • అబ్రహాము కానాను ప్రదేశమునకు ప్రయాణము చేయుటకు మునుపు హారానును పద్దనరాములోనే వదిలిపెట్టెను, తన కుటుంబములోనే ఎక్కువ శాతము ప్రజలు హారానులోనే ఉండిరి.
  • అనేక సంవత్సరములైన తరువాత, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి చేయుటకు తన బంధువులలో అమ్మాయిని వెదుకుటకు తన దాసుని పద్దనరాముకు పంపెను మరియు అక్కడ ఆ దాసుడు బెతూయేలు మనమరాలైన రిబ్కాను కనుగొనెను.
  • ఇస్సాకు మరియు రిబ్కా కుమారుడైన యాకోబు కూడా పద్దనరాముకు ప్రయాణము చేసియుండెను మరియు హారానులోనున్న రిబ్కా అన్నయైన లాబాను కూతుర్లను వివాహాము చేసికొనెను.
  • ఆరాము, పద్దనరాము, మరియు అరాం-నహరాయిము అనునవి ఒకే ప్రాంతానికి చెందినవి, ఇవి ఇప్పుడు ఆధునిక దేశమైన సిరియాలోనున్నవి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేలాలి)

(ఈ పదాలను కూడా చూడండి: అబ్రహాము, అరాం, బెతూయేలు, కానాను, హారాను, యాకోబు, లాబాను, రిబ్కా, సిరియా)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H6307

పారసీక, పారసీకులు

నిర్వచనము:

పారసిక అనునది ఒక దేశము, ఇది క్రి.పూ.550 సంవత్సరములో మహా కోరేషు ద్వారా శక్తివంతమైన సామ్రాజ్యముగా స్థాపించబడెను. పారసీక దేశము ఇప్పటి దేశమైన ఇరాన్ ప్రాంతములోని అశ్శూరు మరియు బబులోనుల ఆగ్నేయ దిక్కులో ఉంది.

  • పారసీక జనులను “పారసీకులు” అని పిలిచెదరు.
  • రాజైన కోరేషు పాలనలో యూదులు బాబాలోను చెరనుండి విడిపించబడిరి మరియు వారి స్వస్థలమునకు వెళ్ళుటకు అనుమతించబడిరి. యెరూషలేములోని ఆలయము తిరుగి నిర్మంచబడెను, ఈ నిర్మాణమునకు పారసీక సామ్రాజ్యము ద్వారా అనేకమైన వనరులు పొందిరి.
  • ఎజ్రా మరియు నేహేమ్యాలు యెరూషలేము గోడలను తిరుగి నిర్మించుటకు యెరూషలేముకు వెళ్లినప్పుడు రాజైన ఆర్తహషస్త పారసీక సామ్రాజ్యమును ఏలెను.
  • ఎస్తేరు ఆహాష్వేరోషు రాజును వివాహము చేసుకొనిన తరువాత ఆమె పారసీక సామ్రాజ్యానికి రాణియాయెను.

(ఈ పదములను కూడా చుడండి: ఆహాష్వేరోషు, ఆర్తహషస్త, అశ్శూరు, బబులోను, కోరేషు, ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6539, H6540, H6542, H6543

పారాను

వాస్తవాలు:

పారాను అనునది కానాను దేశములో దక్షిణ భాగములోను మరియు తూర్పు ఐగుప్తులో ఉండే అరణ్యము లేక ఎడారి ప్రాంతమైయుండును. పారాను పర్వతము ఉన్నది, ఇది సీనాయి పర్వతమునకు మరొక పేరు అయ్యుండవచ్చును.

  • దాసియైన హాగరును మరియు తన కుమారుడు ఇష్మాయేలును బయటికి పంపించమని శారా అబ్రహామునకు ఆదేశమిచ్చిన తరువాత వారు వెళ్లి పారాను అరణ్యములో ఉండిరి.
  • మోషే ఇస్రాయేలియులను ఐగుప్తునుండి బయటకి నడిపించిన తరువాత వారు పారాను అరణ్యము ద్వారా వెళ్ళిరి.
  • కానాను దేశమును వేగు చూచుటకు మరియు సమాచారమును సేకరించుటకు మోషే పన్నెండు మందిని పారాను అరణ్యమునందున్న కాదేషు-బర్నేయనుండి పంపించియుండెను.
  • జిన్ అరణ్యము అనునది ఉత్తర పారాను మరియు సిన్ అరణ్యము దక్షిణ పారానుయైయుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేలాలి)

(ఈ పదాలను కూడా చూడండి: కానాను, ఎడారి, ఐగుప్తు, కాదేషు, సీనాయి)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H364, H6290

పిలాతు

వాస్తవాలు:

పిలాతు యూదా యొక్క రోమా ప్రాంతానికి పాలకుడైయుండెను, ఇతనే యేసుకు మరణ దండనను విధించాడు.

  • పిలాతు పాలకుడైనందున నేరస్తులకు మరణ దండనను విధించే అధికారము ఇతనికి ఇవ్వబడియుండెను.

  • పిలాతు యేసును సిలువకు వేయించాలని యూదా మత నాయకులందరు కోరిరి,ఇందు కొరకు వారు అబద్దమాడి యేసు ఒక నేరస్తుడని చెప్పిరి.

  • యేసు అపరాధి కాదని పిలాతు గ్రహించాడు, కాని అతను జనులకు భయపడ్డాడు మరియు వారి మెప్పును పొందాలనుకున్నాడు,అందుచేత అతను యేసును సిలువకు వేయమని తన సైనికులకు ఆదేశించాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: సిలువకు వేయు, పాలకుడు, అపరాధం, యూదా, రోమా)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • __39:9__మరుసటి రోజు ఉదయమున యూదా నాయకులందరు యేసును రోమా పాలకుడైన పిలాతు వద్దకు తీసుకొనివచ్చిరి. పిలాతు యేసును అపరాధిగా ఎంచి శిక్షిస్తాడని మరియుఆయనను చంపుటకు మరణ దండన విధిస్తాడని వారు నిరీక్షించిరి. అప్పుడు, “నీవు యూదుల రాజువా?” అని పిలాతు యేసును అడిగెను.

  • 39:10“సత్యమనగా ఏమిటి?” అని పిలాతు అడిగెను.

  • __39:11__యేసుతో మాట్లాడిన తరువాత, పిలాతు జనసమూహములవద్దకు వెళ్లి, “నేను ఈ మనుష్యునియందు ఎటువంటి అపరాధమును కనుగొనలేదు” అని చెప్పెను. అయితే యూదుల నాయకులు మరియు జనసమూహమంతయు, “అతణ్ణి సిలువవేయండి” అని గట్టిగా కేకలు వేసిరి!అప్పుడు “ఇతను అపరాధి కాడు” అని పిలాతు చెప్పెను. అయితే వారు మరి ఎక్కువగా గట్టిగా కేకలు వేసిరి. ఆ తరువాత “ఇతను అపరాధి కాదు” అని పిలాతు మూడవ మారు చెప్పెను!

  • __39:12__జనసమూహమంతయు హింసాత్మకముగా మారుతుందేమోనని పిలాతు భయపడి, యేసును సిలువ వేయమని తన సైనికులకు ఆజ్ఞాపించెను.

  • __40:2__అందరు చదువునట్లుగా “యూదులకు రాజు” అని యేసును సిలువ వేసిన తరువాత అతని తలమీద ఒక పలకను గురుతుగా పెట్టమని పిలాతు ఆదేశించెను.

  • 41:2“మరికొంతమంది సైనికులను తీసుకు వెళ్లి, సాధ్యమైనంతవరకు సమాధిని భద్రపరచండి” అని పిలాతు చెప్పెను.

పదం సమాచారం:

  • Strong’s: G40910, G41940

పెయోరు, పెయోరు శిఖరము, బయల్పెయోరు

నిర్వచనము:

“పెయోరు” మరియు “పెయోరు శిఖరము” అను పదములు మోయాబు ప్రాంతములోని ఉప్పు సముద్రపు ఈశాన్య భాగములోనున్న పర్వతమును సూచించును.

  • “బెత్ పెయోర్” అను పదము ఒక పట్టణపు పేరు, బహుశ ఇది ఆ పర్వతము మీదగాని లేక దాని దగ్గరలో ఉండియుండవచ్చును. ఇది దేవుడు మోషేకు వాగ్ధాన భూమి చూపించిన తరువాత మోషే చనిపోయిన స్థలమైయున్నది.
  • “బయల్పెయోరు” అను తప్పుడు దేవుణ్ణి మోయాబియులు ఆ పెయోరు పర్వతము మీదనే ఆరాధించుచుండిరి. ఇశ్రాయేలియులు కూడా ఈ విగ్రహమును ఆరాధించుటకు ఆరంభించియుండిరి, ఇందుకై దేవుడు వారిని శిక్షించియుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేలాలి)

(ఈ పదాలను కూడా చూడండి: బయలు, తప్పుడు దేవుడు, మోయాబు, ఉప్పు సముద్రము, ఆరాధన)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H1047, H1187, H6465

పెరిజ్జి

వాస్తవాలు:

పెరిజ్జీయులు కానాను దేశములో అనేక జనాంగములలో ఒక జనాంగమైయుండిరి. వీరి పూర్వికులు ఎవరైయుండిరి లేక కానాను దేశములో ఎక్కడ వీరు నివసించియుండిరి అని ఈ జాతిని గూర్చి కొంత సమాచారము మాత్రమె తెలియును.

  • పెరిజ్జీయులును గూర్చి పాత నిబంధన పుస్తకమైన న్యాయాధిపతులు గ్రంథములో ఎక్కువగా దాఖలు చేయబడియున్నది. ఈ గ్రంథములో పెరిజ్జీయులు ఇశ్రాయేలియులను వివాహమాడిరని మరియు వారిని తప్పుడు దేవుళ్ళను ఆరాధించునట్లు ప్రభావితము చేసిరని చెప్పబడియున్నది.
  • పెరెజ్ సంతానమును “పెరెజియులు” అని పిలిచెదరు, వీరు పెరిజ్జీయులు తెగకు విభిన్నమైన ప్రజలునైయున్నారు. ఒకవేళ స్పష్టత కొరకు ఈ పేర్లను విభిన్నముగా పలకవలసిన అవసరత ఉండవచ్చు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేలాలి)

(ఈ పదాలను కూడా చూడండి: కానాను, అబద్దపు దేవుడు)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H6522

పేతురు, సీమోను పేతురు, కేఫా

వాస్తవాలు:

పేతురు యేసు పన్నెండు అపొస్తలులలో ఒకడైయుండెను. ఈయన ఆదిమ సంఘమునకు ప్రాముఖ్యమైన నాయకుడైయుండెను.

  • యేసు పేతురును శిష్యునిగా పిలువక మునుపు, తన పేరు సీమోను అని పిలువబడియుండెను.
  • యేసు తనకు “కేఫా” అని పేరు పెట్టెను, ఈ పేరునకు ఆరామిక్ భాషలో “రాయి” లేక “బండ” అని అర్థములు కలవు. పేతురు అను పేరునాకు “రాయి” లేక “బండ” అని గ్రీకు భాషలో కూడా అర్థములు కలవు.
  • జనులను స్వస్థపరచుటకు మరియు యేసును గూర్చి సువార్తను ప్రకటించుటకు దేవుడు పేతురును ఉపయోగించుకొనెను.
  • తోటి విశ్వాసులకు బోధించుటకు మరియు వారిని ప్రోత్సహించుటకు పేతురు క్రొత్త నిబంధనలోని రెండు పుస్తకములను వ్రాసెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

( ఈ పదములను కూడా చుడండి: శిష్యుడు, అపొస్తలుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 28:09 “మేము సమస్తము వదిలి, నిన్ను వెంబడించుచున్నాము. మాకేమి లాభము కలుగును?” అని పేతురు యేసుతో అనెను.
  • 29:01 ఒకరోజు పేతురు యేసుతో, “బోధకుడా, నా సహోదరుడు నాకు విరోధముగా తప్పు చేసినయెడల నేను ఎన్నిమార్లు అతనిని క్షమించవలెను? ఏడు మారుల మట్టుకా?” అని అడిగెను.
  • 31:05 “బోధకుడా, నీవే అయితే, నేను నీళ్ళ మీద నడచునట్లు ఆజ్ఞాపించుము” అని పేతురు యేసును అడిగెను. యేసు పేతురుతో “రమ్మనెను!”
  • 36:01 ఒకరోజు యేసు తనతో తన శిష్యులలో పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని వెళ్ళెను.
  • 38:09 “అందరు మిమ్ములను విడిచిపెట్టినప్పటికి, నేను మిమ్ములను విడువను!” అని పేతురు సమాధానమిచ్చెను. ఆ తరువాత యేసు పేతురుతో “సాతాను మిమ్ములందరినీ అడుగుచున్నది, అయితే నేను మీ అందరి కొరకు ప్రార్థన చేశాను, పేతురు మీ విశ్వాసము పడిపోదు. అయినప్పటికీ, ఈ రాత్రి కోడి కూయక ముందే, నీవు నన్ను ఎరిగినప్పటికిని నీవు మూడు సార్లు నన్ను ఎరుగనని చెప్పుదువు” అని చెప్పెను.
  • 38:15 సైనికులు యేసును బంధించిన తరువాత, పేతురు తన కత్తిని తీసి, మహా యాజకుని దాసుని చెవిని నరికెను.
  • 43:11 “మీలో ప్రతియొక్కరు మారుమనస్సు పొందవలెను మరియు దేవుడు మీ పాపములను క్షమించునట్లు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొనవలెను” అని పేతురు జవాబినిచ్చెను.
  • 44:08 “మీముందు నిలిచియున్న ఈ మనుష్యుడు మెస్సయ్యాయైన యేసు శక్తి ద్వారా స్వస్థతపొందెను” అని పేతురు జవాబిచ్చెను.

పదం సమాచారం:

  • Strong’s: G27860, G40740, G46130

పొంతు

వాస్తవాలు:

రోమ సామ్రాజ్యం మరియు సంఘ ప్రారంభ కాలంలో పొంతు రోమ పరిధిలోనిది. ఇది నల్ల సముద్రం యొక్క దక్షిణ తీరం వెంబడి, ఇప్పుడు టర్కీ దేశం యొక్క ఉత్తర భాగంలో ఉంది.

  • అపోస్తలుల కార్యముల్లో నమోదు చేయబడినట్లుగా, పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ అపొస్తలుల వద్దకు మొదటిసారి వచ్చినప్పుడు పొంతు పరిధిలోని ప్రజలు యెరూషలేములో ఉన్నారు.
  • అకుల అనే విశ్వాసి పొంతుకు చెందినవాడు.
  • వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదరైన ఉన్న క్రైస్తవులకు పేతురు వ్రాస్తున్నప్పుడు, అతను పేర్కొన్న ప్రాంతాలలో పొంతు ఒకటి.

(అనువాద సూచనలు: [పేర్లను ఎలా అనువదించాలి]

(ఇవి కూడా చూడండి: [అకుల], [పెంతెకొస్తు])

బైబిలు సూచనలు:

  • [1 పేతురు 1:1-2]
  • [అపోస్తలుల కార్యములు 2:9]

పద సమాచారం:

  • స్ట్రాంగ్స్: జి41930, జి41950

పోతీఫరు

వాస్తవాలు:

పోతీఫరు ఐగుప్తు ఫరో కొరకు నియమించబడిన ప్రాముఖ్యమైన అధికారి, ఇతను యోసేపు కొంతమంది ఇష్మాయేలీయులకు అమ్మబడిన కాలములో ఉండేవాడు.

  • పోతీఫరు యోసేపును ఇష్మాయేలీయుల వద్దనుండి తీసుకొనివచ్చెను మరియు తన ఇంటి మీద తనను అధికారిగా నియమించెను.
  • యోసేపు తప్పుడు ఆరోపణ వేయబడినప్పుడు, పోతీఫరు తనను చెరలో ఉంచవలసివచ్చియుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: ఐగుప్తు, యోసేపు, ఫరో)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6318

ప్రిస్కిల్ల

వాస్తవాలు:

ప్రిస్కిల్లయు, తన భర్త అకుల అనువారు అపొస్తలుడైన పౌలు సువార్త దండయాత్రలో కలిసి పనిచేసిన యూదులైన క్రైస్తవులు.

  • ప్రిస్కిల్ల, అకుల రోమా నగరమును విడిచిపెట్టి వెళ్ళిరి, ఎందుకంటే అక్కడ నుండి క్రైస్తవులందరు వెళ్లిపోవాలని రోమా చక్రవర్తి బలవంతము చేసేను.
  • పౌలు కొరింతిలో అకుల ప్రిస్కిల్లలను కలిసెను. వారు వృత్తి రిత్య డేరాలను కట్టువారు మరియు పౌలును వారితో కలిసి ఈ పని చేసెను.
  • పౌలు కొరింతిని వదిలి సిరియాకు వెళ్లినప్పుడు, అకుల మరియు ప్రిస్కిల్లలు కూడా అతనితో వెళ్లిరి.
  • సిరియానుండి వారు ముగ్గురు ఎఫెసుకు వెళ్లిరి. పౌలు ఎఫెసును వదిలిపెట్టి వెళ్లినప్పుడు, ప్రిస్కిల్ల మరియు అకులలు అక్కడనే ఉండిపోయిరి, మరియు ఆ స్థలములోనే సువార్తను ప్రకటించుటను కొనసాగించిరి.
  • వారు ముఖ్యముగా యేసునందు విశ్వాసముంచిన గొప్ప వక్తా మరియు బోధకుడైన ఎఫెసులోని అపొల్లో అను వ్యక్తికి బోధించారు.

(అనువాదం  సలహాలు: పేర్లను ఎలా అనువాదం  చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: పేర్లను అనువదించడం ఎలా)

(చూడండిo: believe, Christian, Corinth, Ephesus, Paul, Rome, Syria)

బైబిలు రిఫరెన్సులు*

  • 1 కొరింతి.16:19-20
  • 2 తిమోతి.04:19-22
  • అపొ.కార్య.18:01
  • అపొ.కార్య.18:24

పదం సమాచారం:

Strong’s: G42520, G42510


ఫరో, ఐగుప్తు రాజు

వాస్తవాలు:

పురాతన కాలములో ఐగుప్తు దేశమును ఏలిన రాజులను ఫరోలు అని పిలుచుచుండిరి.

  • సుమారు 2,000 సంవత్సరములలో ఐగుప్తును ఏలిన ఫరోలు దరిదాపు అందరు కలిసి 300 మంది.
  • ఈ ఐగుప్తియుల రాజులు చాలా శక్తివంతమైనవారు మరియు శ్రిమంతులునైయుండిరి.
  • ఈ ఫరోలలో అనేకులను గూర్చి పరిశుద్ధ గ్రంథములో లిఖితము చేయబడియున్నది.
  • అనేకమార్లు ఈ పదమును లేక బిరుదును ఒక బిరుడుకంటే ఒక పేరుగానే ఉపయోగించబడింది. ఇటువంటి పరిస్థితులలో ఆంగ్ల భాషలో ఈ పదములో మొదటి అక్షరమును పెద్దదిగా చేసి దానిని వ్రాస్తారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: ఐగుప్తు, రాజు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 08:06 ఒక రోజు ఐగుప్తీయులు తమ రాజులుగా పిలుచుకొను ఫరో రెండు కలలను కనెను, అవి తనను చాలా ఎక్కువగా కలవరపరచెను.
  • 08:08 ఫరో యోసేఫును బట్టి ఎంతగానో మెప్పించబడెను, తద్వారా అతను ఐగుప్తు దేశమంతటిలో రెండవ శక్తివంతమైన వ్యక్తిగా నియమించెను.
  • 09:02 ఆ కాలమందు ఐగుప్తును ఏలుతున్న ఫరో ఇస్రాయేలియులను ఐగుప్తీయులకు బానిసలనుగా చేసెను.
  • 09:13 “నేను నిన్ను ఫరో వద్దకు పంపెదను, తద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని తమ బానిసత్వమునుండి నీవు బయటకు తీసుకొని వచ్చెదవు.”
  • 10:02 ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు ఫరోకంటేను మరియు ఐగుప్తులోని సమస్త దేవుళ్ళకంటెను ఆయనే శక్తిమంతుడని ఫరోకు కనుబరచుకొనెను.

పదం సమాచారం:

  • Strong's: H4428, H4714, H6547, G5328

ఫిలిప్పి, ఫిలిప్పియులు

వాస్తవాలు:

ఫిలిప్పి అనునది ఒక పెద్ద నగరం మరియు పురాతన గ్రీస్ ఉత్తర భాగములో మాసిదోనియాలోని రోమీయుల వలస ప్రదేశం. ఫిలిప్పీలోని మనుష్యులను ఫిలిప్పీయులు అని పిలుస్తారు.

  • పౌలు మరియు సీలలు అక్కడి మనుష్యులకు యేసును గురించి బోధించడానికి ఫిలిప్పికి ప్రయాణము చేసిరి.
  • వారు ఫిలిప్పిలో ఉన్నప్పుడే పౌలు మరియు సీలలు బంధించబడ్డారు అయితే దేవుడు అద్భుత రీతిగా వారిని విడిపించాడు.
  • క్రొత్త నిబంధనలో ఫిలిప్పియులకు వ్రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఫిలిప్పిలోనున్న సంఘములోని క్రైస్తవులకు వ్రాసిన ఒక పత్రిక.
  • హెర్మోను పర్వతము దగ్గర ఉన్నటువంటి ఉత్తర ఇశ్రాయేలులో ఉండే కైసరయ ఫిలిప్పి పట్టణము ఈ పట్టణముకు భిన్నమైనదని గమనించండి.

(ఈ పదములను కూడా చూడండి: కైసరయ, క్రైస్తవుడు, సంఘము, మాసిదోనియ, పౌలు, సీల)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు నుండి ఉదాహరణలు:

  • 47:1 ఒక రోజు పౌలు మరియు తన స్నేహితుడైన సీల యేసును గూర్చి సువార్తను ప్రకటించడానికి ఫిలిప్పి పట్టణమునకు వెళ్ళారు.
  • 47:13 ఆ మరుసటి రోజున నగరపు నాయకులు చెరలోనున్న పౌలును మరియు సీలను విడుదల చేసారు. మరియు ఫిలిప్పిని వదలి వెళ్ళమని అడిగారు.

ఫిలిప్పు, అపొస్తలుడు

వాస్తవాలు:

అపొస్తలుడైన ఫిలిప్పు యేసు యొక్క పన్నెండు మంది అపొస్తలులలో ఒక్కడైయుండెను. ఈ వ్యక్తి బేత్సయిదా పట్టణముకు సంబంధించినవాడు.

  • ఫిలిప్పు నతనయేలును యేసునొద్దకు తీసుకొని వచ్చెను.
  • 5,000 మంది ప్రజల సమూహమునకు ఆహారము ఎలా అందించాలని యేసు ఫిలిప్పును ప్రశ్నించెను.
  • చివరి పస్కా భోజనమును యేసు తన శిష్యులతో కలిసి చేసెను, ఆయన తన తండ్రియైన దేవునిని గూర్చి వారితో మాట్లాడెను. మాకు తండ్రిని చూపించుమని ఫిలిప్పు యేసును అడిగెను.
  • కొన్ని భాషలలో ఎటువంటి తికమకలు లేకుండా ఈ ఫిలిప్పు మరియు సువార్తికుడైన వేరొక ఫిలిప్పు వేరువేరని తెలియజెప్పుటకు వారి పేర్లను విభిన్నముగా ఉచ్చరించుటకు ప్రాధాన్యతనిస్తారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి:Philip)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G53760

ఫిలిప్పు, సువార్తికుడు

వాస్తవాలు:

యెరూషలేములోని ఆదిమ క్రైస్తవ సంఘములో విధవరాండ్రను, పేదలను మరియు అవసరతలోనున్న క్రైస్తవులను చూచుకొనుటకు నియమింపబడిన ఏడుగురు నాయకులలో ఫిలిప్పు ఒకడైయుండెను.

  • యూదా మరియు గలిలయ ప్రాంతాలలో అనేకమైన పట్టణాలలోని ప్రజలందరికి సువార్తను ప్రకటించుటకు మరియు విశేషముగా యెరూషలేమునుండి గాజాకి వెళ్ళే అరణ్యమార్గములో తను ఇథీయోపియుడైన వ్యక్తికి కూడా సువార్తను అందించుటకు దేవుడు ఉపయోగించుకొనెను.
  • అనేక సంవత్సరములైన తరువాత ఫిలిప్పు కైసరయలో నివసించుచుండెను, ఇక్కడే పౌలు మరియు తన తోటివారు యెరూషలేముకు తిరిగి వచ్చు ప్రయాణములో అతని ఇంటిలోనే బస చేసియుండిరి.
  • అనేకమంది బైబల్ పండితులు సువార్తీకుడైన ఫిలిప్పు మరియు ఇదే పేరుతొ ఉన్నటువంటి యేసు అపొస్తలుడు ఒకటే కాదని భావిస్తారు. కొన్ని భాషలలో వీరిద్దరిని వేరుగా చూపించుటకు మరియు స్పష్టత కొరకు ఈ ఇద్దరి పేర్లను విభిన్నమైన అక్షరాలను ఉపయోగించి ఉచ్చరించడానికి ప్రాధాన్యతనిస్తుంటారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: ఫిలిప్పు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G5376

ఫిలిష్టియ

నిర్వచనము:

ఫిలిష్టియ అనునది కానాను దేశములో ఒక పెద్ద ప్రాంతమైయున్నది, ఇది మధ్యధరా సముద్ర తీరమునాకు ఆనుకొని ఉంటుంది.

  • ఉత్తర దిక్కునందున్న యొప్ప నుండి దక్షిణ దిక్కునందున్న గాజావరకు ఉండే చాలా సారవంతమైన తీర మైదానము ప్రక్కనే ఈ ప్రాంతమున్నట్లుగా గమనించగలము. బహుశ దీని వైశాల్యం 64 కి.మీ. పొడవు మరియు 16 కి.మీ.వెడల్పు ఉంటుంది.
  • ఫిలిష్టియ పట్టణము ఇస్రాయేలియులకు ఎల్లప్పుడూ శత్రువులుగా ఉన్నటువంటి శక్తివంతమైన జనాంగమైన “ఫిలిష్టియుల” ద్వారా స్వాధీనము చేయబడియున్నది.

(ఈ పదములను కూడా చుడండి: ఫిలిష్టియులు, గాజ, యొప్ప)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H776 H6429 H06430

ఫిలిష్టియులు

వాస్తవాలు:

మధ్యదరా సముద్ర తీరము ప్రక్కనున్న ఫిలిష్టియ అనే ప్రాంతమును స్వాధీనపరచుకొనిన జనాంగమే ఈ ఫిలిష్టియులు. వారి పేరుకు “సముద్రపు ప్రజలు” అని అర్థము.

  • అక్కడ ఐదు ముఖ్య ఫిలిష్టియ పట్టణాలు ఉన్నాయి: ఆష్డోదు, ఆష్కెలోను, ఎక్రోను, గాతు, మరియు గాజా.
  • ఆష్డోదు పట్టణము ఫిలిష్టియ ఉత్తర భాగములో ఉంటుంది, మరియు గాజా పట్టణం దక్షిణ భాగములో ఉంటుంది.
  • ఫిలిష్టియులు బహుశ అనేక సంవత్సరాములు ఇస్రాయేలియులకు విరుద్ధముగా యుద్ధము జరిగించిన వారిగా పరిగణించబడ్డారు.
  • న్యాయాధిపతియైన సంసోను దేవునినుండి అనుగ్రహింపబడే అద్భుతమైన శక్తిని పొంది ఫిలిష్టియులకు విరుద్ధముగా పోరాడిన యోధుడు.
  • రాజైన దావీదు ఫిలిష్టియుల యుద్ధశూరుడైన గొల్యాతును తన చిన్న వయస్సులోనే ఓడించియుండెను, దానితోపాటు అనేకమార్లు ఫిలిష్టియులకు విరుద్ధముగా యుద్ధములు జరిపించియుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: ఆష్డోదు, ఆష్కెలోను, దావీదు, ఎక్రోను, గాతు, గాజా, గొల్యాతు, ఉప్పు సముద్రము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6429, H6430

ఫీనెహాసు

వాస్తవాలు:

ఫీనెహాసు అనే పేరు మీద పాత నిబంధనలో ఇద్దరు పురుషులు ఉన్నారు.

  • వారిలో ఒకరు ఆహారోను మునిమనమడైన ఫీనెహాసు యాజకుడు, ఇతను ఇశ్రాయేలులో అబద్ద దేవుళ్ళ ఆరాధనను బలముగా తిరస్కరించినవాడు.
  • ఇశ్రాయేలీయులు అబద్ద దేవుళ్ళను ఆరాధిస్తున్నందుకు మరియు మిద్యాను స్త్రీలను వివాహమాడినందుకు వారిని శిక్షించుటకు యెహోవా దేవుడు పంపించిన తెగులునుండి ఫీనెహాసు వారిని రక్షించెను.
  • అనేక సందర్భాలలో మిద్యానీయులను నాశనము చేయుటకు ఫీనెహాసు ఇశ్రాయేలుతోపాటు బయలుదేరియుండెను.
  • పాత నిబంధనలో చెప్పబడిన ఇంకొక ఫీనెహాసు ఎవరనగా ప్రవక్తయైన సమూయేలు కాలములో యాజకుడైన ఏలికి పుట్టిన కుమారులలో ఒకడైయుండెను.
  • ఫిలిష్టియులు ఇశ్రాయేలుపై దాడి చేసినప్పుడు ఫీనెహాసు మరియు తన సహోదరుడైన హోఫ్నీలను చంపిరి మరియు అక్కడ వారిదగ్గర ఉన్నటువంటి నిబంధన మందసమును దొంగలించిరి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: నిబంధన మందసము, యోర్దాను నది, మిద్యాను, ఫిలిష్టియులు, సమూయేలు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6372

ఫేనీకే

వాస్తవాలు:

పూర్వ కాలములో ఫేనీకే అనునది ఒక గొప్ప శ్రీమంత దేశమైయుండెను, ఇది ఉత్తర ఇశ్రాయేలులోని మధ్యదరా సముద్ర తీరాన కానానులో ఉంటుంది.

  • ఫేనీకే ఇప్పటి లెబానోను దేశమున్న పడమర ప్రాంతమును స్వాధీనము చేసికొనియుండెను.
  • క్రొత్త నిబంధనలో ఫేనీకే రాజధాని తూరు అయ్యుండెను. ఇంకొక ప్రాముఖ్యమైన ఫేనీకే పట్టణము సీదోను అయ్యుండెను.
  • ఫేనీకేయులు తమ దేశమందు పుష్కలంగా దొరకు దేవదారు వృక్షములను ఉపయోగింఛి చెక్క పనిని చేయుటలో వారు నిష్ణాతులు, వారు చాలా విలువైన ఊదా రంగును తయారు చేసేవారు, వారు సముద్రము ద్వారా వ్యాపారము మరియు ప్రయాణము చేసే సామర్థ్యము వారికి కలదు. వారు పెద్ద పెద్ద ఓడలను నిర్మించే నిపుణులైయుండిరి.
  • ప్రారంభపు అక్షరములలో ఒకదానిని ఫేనీకే ప్రజల ద్వారా సృష్టించబడియుండెను. వారి అక్షరము చాలా ఎక్కువగా ఉపయోగించబడియుండెను ఎందుకనగా వారు చేసే వ్యాపారము ద్వారా అనేక ప్రజలతో వారికి ఎక్కువ సంబంధములను కలిగియుండిరి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చుడండి: దేవదారు, ఊదా రంగు, సీదోను, తూరు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3667, G4949, G5403

బత్షెబ

వాస్తవాలు:

బత్షెబ ఊరియా భార్య, యితడు దావీదు రాజు సైన్యంలో ఒక సైనికుడు. ఊరియా మరణం తరువాత, ఆమె దావీదు భార్య అయింది. ఈమే సొలోమోను తల్లి.

  • దావీదు బత్షెబతో ఆమె ఊరియాకు భార్యగా ఉన్నప్పుడే వ్యభిచారం చేసాడు.
  • బత్షెబ దావీదు మూలంగా గర్భవతి అయినప్పుడు సమరంలో ఊరియా చనిపోయేలా దావీదు ఏర్పాటు చేశాడు.
  • దావీదు తరువాత బత్షెబను పెళ్లి చేసుకున్నా. ఆమె వారి బిడ్డకు జన్మ నిచ్చింది.
  • దేవుడు ఆ బిడ్డ పుట్టిన కొద్ది దినాలకే అతడు చని పోయేలా చేయడం ద్వారా దావీదు చేసిన పాపం నిమిత్తం అతణ్ణి శిక్షించాడు.
  • తరువాత, బత్షెబ మరొక కుమారుడు సొలోమోనుకు జన్మ నిచ్చింది. అతడు పెరిగి దావీదు తరువాత రాజయ్యాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదిండం ఎలా

(చూడండి: దావీదు, సొలోమోను. ఊరియా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 17:10 ఒక రోజు, దావీదు సైనికులంతా యుద్ధాలకు వెళ్ళిన సమయంలో అతడు సాయంత్రం నిద్ర లేచిన తరువాత ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడు. ఆమె పేరు బత్షెబ.
  • 17:11 కొద్ది కాలం తరువాత బత్షెబ దావీదుకు తాను గర్భవతినయ్యానని కబురు పంపింది.
  • 17:12 బత్షెబ భర్త ఊరియా, దావీదు మంచి సైనికుల్లో ఒకడు.
  • 17:13 ఊరియా హతం అయ్యాక దావీదు బత్షెబను పెళ్లి చేసుకున్నాడు.
  • 17:14 తరువాత, దావీదు, బత్షెబలకు మరొక కుమారుడు కలిగాడు. అతడు సొలోమోను.

పదం సమాచారం:

  • Strong's: H1339

బబులోను, బబులోనియా, బబులోనియులు

వాస్తవాలు

బబులోను నగరం, బబులోనియా పురాతన ప్రాంతానికి రాజధాని, ఇది కూడా బబులోనియుల సామ్రాజ్యంలోని భాగమే.

  • బబులోను యూఫ్రేట్స్ నది వెంట ఉండేది, అదే ప్రాంతంలో బబెలు గోపురం వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.
  • కొన్నిసార్లు “బబులోను” అనే పదం మొత్తం బబులోనియుల సామ్రాజ్యంలోని సూచిస్తుంది. ఉదాహరణకు, “బబులోను రాజు” నగరాన్ని మాత్రమే కాకుండా మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.
  • యూదా రాజ్యంపై దాడి చేసిన బబులోనియులు శక్తివంతమైన వ్యక్తుల సమూహం మరియు ప్రజలను 70 సంవత్సరాలు బబులోనుల ప్రవాసంలో ఉంచారు.
  • ఈ ప్రాంతం భాగాన్ని “కల్దీయ” అని పిలిచేవారు మరియు అక్కడ నివసించే ప్రజలు “కల్దీయులు”. ఫలితంగా, బబులోను సూచించడానికి " కల్దీయ" అనే పదం తరచుగా ఉపయోగించబడింది. (చూడండి: [ఉపలక్షణము]

(ఇవి కూడా చూడండి: [బబెలు], [కల్దీయ], [యూదా], [నెబుకద్నెజరు])

బైబిలు వాక్యా సూచనలు

*[1 దినవృత్తాంతములు 9:1] *[2 రాజులు 17:24-26] *[అపోస్తలుల కార్యములు 7:43] *[దానియేలు 1:2] *[యెహెజ్కేలు 12:13] *[మత్తయి 1:11] *[మత్తయి 1:17]

బైబిలు కధలు నుండి ఉదాహరణలు:

  • [20:6] అష్షూరీయులు ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసిన దాదాపు 100 సంవత్సరాల తర్వాత, యూదా రాజ్యంపై దాడి చేయడానికి దేవుడు బబులో రాజు నెబుకద్నెజరును పంపాడు. బబులోను ఒక శక్తివంతమైన సామ్రాజ్యం.
  • [20:7] కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, యూదా రాజు __ బబులోను__పై తిరుగుబాటు చేశాడు. కాబట్టి, __ బబులోనియులు__ తిరిగి వచ్చి యూదా రాజ్యంపై దాడి చేశారు. వారు యెరూషలేము పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆలయాన్ని ధ్వంసం చేసి, పట్టణంలో మరియు ఆలయంలోని సంపదలన్నింటినీ తీసుకువెళ్లారు.
  • [20:9] నెబుకద్నెజరు మరియు అతని సైన్యం యూదా రాజ్యంలోని ప్రజలందరినీ __ బబులోను__కి తీసుకువెళ్లారు, పొలాలను నాటడానికి వెనుక పేద ప్రజలను మాత్రమే వదిలివేసారు. *[20:11] పారసీకదేశపు రాజు కోరెషు పాలన దాదాపు డెబ్బై సంవత్సరాల తరువాత, బబులోని ఓడించాడు.

##పద సమాచారం:

  • Strong's: హెచ్3778, హెచ్ 3779, హెచ్8152, హెచ్0894, హెచ్0895, హెచ్0896, జి08970

బయలు

వాస్తవాలు:

"బయలు"అంటే "ప్రభువు” లేక “యజమాని"కనానీయులు ఆరాధించిన ముఖ్య అబద్ధ దేవుడి పేరు.

  • స్థానిక అబద్ధ దేవుళ్ళు కూడా ఉన్నారు. వారి పేర్లలో "బయలు"అనే మాట ఉంటుంది. ఉదాహరణకు "బయలు పెయోరు."cకొన్నిసార్లు ఈ దేవుళ్ళను కలిపి "బయలులు"అంటారు.
  • కొందరి పేర్లలో ఈ పదం "బయలు"కలిసి ఉంటుంది.
  • బయలు ఆరాధనలో పిల్లలను బలి ఇవ్వడం, వేశ్యలను ఉపయోగించడం వంటి దుష్టఆచారాలు మిళితమై ఉంటాయి.
  • వివిధ సమయాల్లో వారి చరిత్ర అంతటా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్న ఇతర విగ్రహారాధక జాతుల వలె బయలు ఆరాధనల్లో లోతుగా నిమగ్నం అయ్యారు.
  • రాజు ఆహాబు పరిపాలన దేవుని ప్రవక్త ఏలియా బయలు అనే దేవుడు లేడని యెహోవా ఒక్కడే నిజ దేవుడనీ రుజువు చెయ్యడానికి ఒక పరీక్ష పెట్టాడు. ఫలితంగా బయలు ప్రవక్తలు హతం అయ్యారు. ప్రజలు మరలా యెహోవా ఆరాధించసాగారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆహాబు, అషేరా, ఏలియా, అబద్ధ దేవుడు, వేశ్య, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 19:02 ఆహాబు బయలు అనే పేరు గల అబద్ధ దేవుణ్ణి ప్రజలు ఆరాధించాలని ప్రోత్సాహించిన దుర్మార్గుడు.
  • 19:06 మొత్తం ఇశ్రాయేల్ రాజ్యం ప్రజలంతా, 450మంది బయలు ప్రవక్తలు, కర్మేల్ కొండకు వచ్చారు. ఏలియా ప్రజలతో చెప్పాడు, "ఎంత కాలం మీరు మీ మనసు మార్చుకుంటూ ఉంటారు? యెహోవా దేవుడు అయితే ఆయన్ని సేవించండి. బయలు దేవుడు అయితే ఆయన్ని సేవించండి!"
  • 19:07 తరువాత ఏలియా బయలు ప్రవక్తలకు, ఇలా చెప్పాడు. "ఒక ఎద్దును వధించి బలి అర్పణ సిద్ధం చెయ్యండి. అయితే మంట పెట్టవద్దు.
  • 19:08 తరువాత బయలు ప్రవక్తలు బయలుకు ప్రార్థించారు, " ఓ బయలు, మా మాట విను!"
  • 19:12 ప్రజలు బయలు ప్రవక్తలను పట్టుకున్నారు. తరువాత ఏలియా వారిని అక్కడి నుండి తీసుకుపోయి చంపమని అజ్ఞాపించాడు.''

పదం సమాచారం:

  • Strong's: H1120, G896

బయషా

వాస్తవాలు:

బయషా ఇశ్రాయేలీయుల దుష్టరాజులలో ఒకడు. ఇశ్రాయేలీయులను విగ్రహాల ఆరాధన కోసం ప్రేరేపించాడు.

  • బయషా ఇశ్రాయేలువారి మూడవ రాజు. ఇతడు యూదా రాజు ఆసా కాలంలో ఇరవై-నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు.
  • అతడు సైన్యాధిపతి. తనకు ముందు రాజు నాదాబును చంపి రాజయ్యాడు.
  • బయషా పరిపాలనలో ఇశ్రాయేలు, యూదా రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా యూదా రాజు ఆసాతో.
  • బయషా చేసిన అనేక పాపాల మూలంగా దేవుడు ఎట్టకేలకు అతణ్ణి పదవి నుండి తొలగించి మరణం పొందేలా చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆసా, అబద్ధ దేవుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1201

బరబ్బా

వాస్తవాలు:

యేసునుబంధించినసమయంలోబరబ్బాయెరూషలేములోఖైదీగాఉన్నాడు.

  • హత్య, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తదితర నేరాలు చేసిన నేరస్థుడు బరబ్బా.

  • పొంతిపిలాతు బరబ్బాను గానీ యేసునుగానీ విడుదల చేస్తానన్నప్పుడు ప్రజలు బరబ్బాను ఎన్నుకున్నారు.

  • కాబట్టి పిలాతు బరబ్బాను విడుదలచేసి యేసును మరణానికి అప్పగించాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: పిలాతు, రోమ్)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G09120

బర్తొలొమయి

వాస్తవాలు:

బర్తొలొమయియేసుయొక్కపండ్రెండుమందిఅపొస్తలులలోఒకడు.

  • ఇతర అపొస్తలులతో కలిసి సువార్త ప్రకటించడానికి, యేసు పేరున అద్భుతాలు చేయడానికి బర్తొలొమయి పంపబడ్డాడు.

  • యేసు తిరిగి పరలోకానికి ఆరోహణమవ్వటంచూసిన వారిలో ఇతడు కూడా ఒకడు.

  • కొన్ని వారాల తరువాత యెరూషలేములో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు అతడు ఇతరఅపొస్తలులతో కలిసి ఉన్నాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: అపొస్తలుడు, మంచివార్త, పరిశుద్ధాత్మ, అద్భుతం, పెంతెకొస్తు, పన్నెండు మంది)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G09180

బర్నబా

వాస్తవాలు:

బర్నబా అపొస్తలులుల కాలంలో నివసించిన ఆది క్రైస్తవులలో ఒకడు.

  • బర్నబా ఇశ్రాయేలుల లేవీ గోత్రం నుండి వచ్చిన వాడు. కుప్ర సైప్రస్ దేశస్థుడు. సౌలు (పౌలు) క్రైస్తవుడుగా మారినప్పుడు, అతన్ని సాటి విశ్వాసిగా అంగీకరించమని బర్నబా ఇతర విశ్వాసులను కోరాడు.
  • బర్నబా, పౌలు యేసును గురించి వివిధ పట్టణాల్లో సువార్త ప్రకటించడానికి కలిసి ప్రయాణించారు.
  • అతని పేరు యోసేపు, అయితే అతనికి "బర్నబా," అని పేరు పెట్టారు. అంటే "ప్రోత్సాహ పుత్రుడు."

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)

(వీటిని కూడా చూడండి: క్రైస్తవుడు, కుప్ర, మంచి వార్త,, లేవీయుడు, పౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 46:8 తరువాత బర్నబా అనే పేరు గల విశ్వాసి సౌలును అపొస్తలుల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. మరియు సౌలు ఏ విధంగా ధైర్యంతో దమస్కులో సువార్త బోధించాడో వారికి చెప్పాడు.

  • 46:9 బర్నబా మరియు సౌలు ఈ నూతన విశ్వాసులకు యేసును గురించి బోధించడానికి, మరియు సంఘాన్ని బలపరచడానికి అక్కడికి వెళ్లారు.

  • 46:10 ఒక రోజు అంతియొకయలో క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మవారితో చెప్పాడు, "నా కోసం బర్నబా సౌలులను నేను వారిని పిలిచిన పని కోసం ప్రత్యేక పరచండి." కాబట్టి అంతియొకయలో సంఘం బర్నబా, సౌలు కోసం ప్రార్థించారు, వారి మీద చేతులు ఉంచారు.

పదం సమాచారం:

  • Strong's: G9210

బాబెలు

వాస్తవాలు:

బాబెలు మెసపొటేమియా ప్రాంతం ప్రధాన పట్టణం. షినారు దక్షిణ భాగాన ఉంది. షినారును తరువాత బాబిలోనియా అని పిలిచారు.

  • బాబెలు పట్టణం హాము ముని మనవడు, షినారు ప్రాంతాన్ని పరిపాలించిన నిమ్రోదు కట్టాడు.
  • షినారు ప్రజలు గర్వంతో పరలోకాన్ని అంటే ఎత్తైన గోపురం కట్టాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఇదే "బాబెలు గోపురం" అని పిలువబడింది.
  • ఎందుకంటే గోపురం కడుతున్న ప్రజలు దేవుడు అజ్ఞాపించినట్టు భూమి అంతటా విస్తరించడానికి నిరాకరించారు. దేవుడు అక్కడ వారి భాషలు తారుమారు చేసి ఒకరి మాట ఒక అర్థం చేసుకోలేక పోయేలా చేశాడు. వారు భూమి వివిధ ప్రాంతాలకు చెదిరిపోయేలా చేశాడు.
  • ఈ పదం "బాబెలు"యొక్క మూలార్థం "గందరగోళం," దేవుడు మనుషుల భాష తారుమారు చేశాడు గనక ఈ పేరు వచ్చింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను, హాము, మెసపొటేమియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H894

బారూకు

వాస్తవాలు:

బారూకు అనే పేరుతో పాత నిబంధనలో అనేకమంది మనుషులు ఉన్నారు.

  • ఒక బారూకు (జబ్బేలు కుమారుడు) యెరూషలేములో నెహెమ్యాతో కలిసి ప్రాకారాన్ని బాగు చేయడానికి పని చేశాడు.
  • అదే కాలంలో మరొక బారూకు (కొల్హోజే కుమారుడు) గోడలు బాగైన తరువాత యెరూషలేములో నివసించిన నాయకుల్లో ఒకడు.
  • వేరొక బారూకు (నేరీయా కుమారుడు) యిర్మీయా ప్రవక్త సహాయకుడు. ఇతడు యిర్మియాకు వచ్చిన సందేశాలను రాయడంలో, వాటిని ప్రజలకు చదివి వినిపించడంలో సహాయం చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: శిష్యుడు, యిర్మీయా, యెరూషలేము, నెహెమ్యా, ప్రవక్త)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1263

బాషాను

వాస్తవాలు:

బాషాను గలిలీ సరస్సు తూర్పున ఉన్న ప్రాంతం. ప్రస్తుతం ఇది సిరియా, గోలాను మెరక ప్రదేశాల ప్రాంతం.

  • ఒక పాత నిబంధన ఆశ్రయ పట్టణం పేరు "గోలాను" ఇది బాషాను ప్రాంతంలో ఉంది.
  • బాషాను చాలా సారవంతం ప్రాంతం. అక్కడి సిందూర వృక్షాలు, పశువుల మేత భూములు ఎంతో ప్రసిద్ధికెక్కాయి.
  • ఆది 14 లో బాషాను అనేక రాజులు, వారి జాతుల మధ్య ఒక యుద్ధం జరిగిన ప్రాంతం.
  • ఇశ్రాయేలీయుల ఈజిప్టునుండి తప్పించుకున్న తరువాత ఎడారి ప్రాంతంలో వారు తిరుగులాడిన సమయంలో వారు బాషానులో కొంత భాగం ఆక్రమించుకున్నారు.
  • అనేక సంవత్సరాలు తరువాత, సొలోమోను రాజు ఈ ప్రాంతం నుండి తనకోసం సరుకులు తెప్పించుకున్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఈజిప్టు, సిందూర వృక్షం, గలిలీ సరస్సు, సిరియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1316

బిలాము

వాస్తవాలు:

బిలాము ఒక అన్య ప్రవక్త. ఉత్తర మోయాబు ప్రాంతంలో యోర్దాను నది దగ్గర ఇశ్రాయేలు ప్రజలు కనాను భూభాగాన్ని చేరడానికి వచ్చి ఉన్నప్పుడు వారిని శపించడానికి బాలాకు రాజు అతడిని అద్దెకు తెప్పించాడు.

  • బిలాము పెతోరు నగరం నుండి వచ్చినవాడు. ఇది యూఫ్రటిసు నది చుట్టూ ఉన్న ప్రదేశంలో మోయాబు దేశానికి దాదాపు 400మైళ్ళు దూరాన ఉంది.
  • మిద్యాను రాజు, బాలాకు, ఇశ్రాయేలీయుల బలానికీ, మరియు వారి సంఖ్యకు, భయపడ్డారు, కాబట్టి వారిని శపించడానికి బిలామును అద్దెకు తీసుకు వచ్చాడు.
  • బిలాము ఇశ్రాయేలు వైపుకు ప్రయాణిస్తూ ఉండగా ఒక దేవదూత ఆతని దారికి అడ్డంగా నిలబడ్డాడు. దాని కారణంగా బిలాము గాడిద ఆగిపోయింది. బిలాముతో మాట్లాడే సామర్ధ్యాన్ని కూడా దేవుడు గాడిదకు ఇచ్చాడు.
  • ఇశ్రాయేలీయులను శపించడానికి దేవుడు అతనికి అనుమతి ఇవ్వలేదు. దానికి బదులుగా దీవించమని అజ్ఞాపించాడు.
  • తరువాత ఇశ్రాయేలీయులీయులు అబద్దపు దేవుడు బయలు-పెయోరును పూజించడానికి అతడు వారిని ప్రభావితం చేసినప్పుడు వారి మీదకు ఇంకా దుష్టత్వాన్ని తీసుకొని వచ్చాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించండి)

(చూడండి: దీవించు, కనాను, శాపం,, గాడిద, యూఫ్రటిసు నది,, యోర్దాను నది, మిద్యాను,, మోయాబు,, పెయోరు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1109, G09030

బెతూయేలు

వాస్తవాలు:

బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు కుమారుడు.

  • బెతూయేలు రిబ్కా, లాబానుల తండ్రి.
  • బెతూయేలు అనే పేరు గల ఊరు కూడా ఉంది. ఇది దక్షిణ యూదాలో, బేయెర్షెబా సమీపాన ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బేయెర్షెబా, లాబాను, నాహోరు, రిబ్కా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1328

బెనాయా

నిర్వచనం:

బెనాయా పాత నిబంధనలో అనేకమంది మనుషులకున్న పేరు.

  • యెహోయాదా కుమారుడు బెనాయా దావీదు యోధుల్లో ఒకడు. అతడు పరాక్రమం గల యోధుడు. దావీదు అంగ రక్షకుల్లో ఒకడు.
  • సొలోమోను పట్టాభిషేకం సమయంలో అతని శత్రువులను ఓడించడానికి బెనాయా సహాయం చేశాడు. అతడు ఎట్టకేలకు ఇశ్రాయేలు సైన్యం సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు.
  • పాత నిబంధనలో బెనాయా అనే పేరు గల వారు ముగ్గురు ఉన్నారు. లేవీయులు: ఒక యాజకుడు, ఒక సంగీతకారుడు, ఆసాఫు సంతతి వాడు.

(చూడండి: ఆసాఫు, యెహోయాదా, లేవీయుడు, సొలోమోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1141

బెన్యామీను, బెన్యామీను గోత్రికుడు

వాస్తవాలు:

బెన్యామీను యాకోబుకు పన్నెండవ కుమారుడు. అతడు రాహేలు రెండవ కుమారుడు. అతని సంతానము ఇశ్రాయేలు గోత్రములలో ఒక గోత్రముగా అయ్యారు.

  • అతని సంతానం నుండి వచ్చిన గోత్రం”బెంయామీను గోత్రం” లేదా “బెంయామీను” లేదా “బెన్యామీనీయులు” అని పిలువబడ్డారు.
  • హెబ్రీ భాషలో బెంయామీను పేరుకు “నా కుడిచేతి పుత్రుడు” అని అర్థం. ( బెంయామీను గోత్రం యెరూషలేము ఉత్తరాన మృత సముద్రానికి వాయువ్యంగా స్థిరపడ్డారు.
  • సౌలు రాజు ఇశ్రాయేలు బెన్యామీను గోత్రం నుండి వచ్చాడు.
  • అపొస్తలుడు పౌలు కూడా బెన్యామీను గోత్రికుడే.

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)

(వీటిని కూడా చూడండి: ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు,, యాకోబు, రాహేలుl)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1144, G9580

బెయెర్షేబా#

వాస్తవాలు:

పాత నిబంధన కాలంలో బెయెర్షేబా యెరూషలేము 45మైళ్ళు నైరుతీదిశలో నెగెబు ఎడారి ప్రాంతంలో ఉన్న పట్టణం.

  • ఎడారి బెయెర్షేబా చుట్టూ ఉన్న ఎడారి ప్రాంతం హాగరును, ఇష్మాయేలును అబ్రాహాము తన గుడారాల నుండి పంపివేసిన తరువాత వారు తిరుగులాడిన ప్రదేశం.
  • ఈ పట్టణం పేరుకు అర్థం "శపథం బావి." అబీమెలెకు రాజు మనుషులు అబ్రాహాము బావులను స్వాధీనం చేసుకున్నప్పుడు వారిని శిక్షించకూడదని అబ్రాహాము ఒట్టు పెట్టుకున్న దాన్ని బట్టి ఈ పేరు వచ్చింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబీమెలెకు, అబ్రాహాము, హాగరు, ఇష్మాయేలు, యెరూషలేము, శపథం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H884

బెరయ

వాస్తవాలు:

కొత్త నిబంధన కాలంలో, బెరయ ఒక ధనిక గ్రీకు పట్టణం. ఇది మాసిదోనియా ఆగ్నేయ దిశలో తెస్సలోనికకు దక్షిణంగా 80 కిలో మీటర్లు దూరాన ఉంది.

  • తెస్సలోనికలో కొందరు యూదులు కలహం రేపినప్పుడు పౌలు, సీల వారి సాటి క్రైస్తవుల సాయంతో బెరయ పట్టణానికి పారిపోయారు.
  • బెరయలో నివసించే ప్రజలు పౌలు ప్రకటించే దాన్ని విన్నప్పుడు అతడు చెబుతున్నది నిజమో కాదో చూడడానికి వారు లేఖనాలను పరిశోధించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: మాసిదోనియా, పౌలు, సీల, తెస్సలోనిక)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G960

బేతనియ

వాస్తవాలు:

బేతనియ ఊరు ఒలీవల కొండ తూర్పు సానువులో, యెరూషలేముకు తూర్పునసుమారు 2మైళ్ళ దూరంలోఉంది.

  • బేతనియ యెరూషలేమునుండియెరికోకు వెళ్ళు మార్గములో ఉన్నది.

  • యేసు తన సన్నిహితులైన లాజరు, మార్త, మరియ నివసించే బేతనియకు తరచూ వెళ్తుండేవాడు.

* ప్రముఖంగా బేతనియ యేసులాజరును బ్రతికించిన ఊరుగా ప్రసిద్ధికెక్కింది.

(తర్జుమా సలహాలు: పేర్లనుఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:యెరికో, యెరూషలేము, లాజరు, మార్త, మరియ(మార్త సోదరి), ఒలీవల కొండ)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G09630

బేతేలు

వాస్తవాలు:

బేతేలు పట్టణం కనాను ప్రదేశంలో యెరూషలేము ఉత్తరాన ఉంది. దీన్ని అంతకుముందు "లూజు" అనే వారు.

  • తరువాత మొదటి సారిగా దేవుని వాగ్దానం పొందాక అబ్రాము (అబ్రాహాము) బేతేలు దగ్గర దేవునికి బలిపీఠం కట్టాడు. ఈ పట్టణం అసలు పేరు ఆ సమయంలో బేతేలు కాదు. అయితే సాధారణంగా దాన్ని "బేతేలు,"అని అలవాటైన పేరుతొ పిలిచేవారు.
  • యాకోబు అతని సోదరుడు ఏశావు నుండి పారిపోతున్నప్పుడు నుండి, ఈ పట్టణం దగ్గర ఒక రాత్రి ఆరు బయట నేలపై నిద్ర పోయాడు. అతడు నిద్ర పోతుండగా అతనికి ఒక కల వచ్చింది. దేవదూతలు పరలోకానికి నిచ్చెనపై ఎక్కుతూ దిగుతూ ఉండడం చుసాడు.
  • యాకోబు ఆ పేరు పెట్టే దాకా ఆ పట్టణం పేరు "బేతేలు"గా మారలేదు. స్పష్టంగా చెప్పాలంటే కొన్ని అనువాదాలు దీన్ని "లూజు (తరువాత పిలిచాడు బేతేలు)"అనే అనువదించడం చూడవచ్చు. అబ్రాహాముకు సంబంధించిన వాక్య భాగాల్లో, ఇంకా యాకోబు మొదటి సారి అక్కడికి వచ్చిన సందర్భాల్లో (అతడు దాని పేరు మార్చక ముందు) ఇలా రాయ వచ్చు.
  • బేతేలును ప్రస్తావించినది తరచుగా పాత నిబంధనలో అనేక ప్రాముఖ్యం అయిన సంఘటనలు జరిగినప్పుడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, బలిపీఠం, యాకోబు, యెరూషలేము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1008

బేత్లెహేము, ఎఫ్రాతా

వాస్తవాలు:

బేత్లెహేము ఇశ్రాయేలులో యెరూషలేము నగరం వద్ద ఒక చిన్న పట్టణం. దీన్ని"ఎఫ్రాతా," అని కూడా అంటారు. ఇదేదీని అసలు పేరు.

  • బేత్లెహేమును "దావీదు పట్టణం,"అనేవారు.ఎందుకనగా రాజైన దావీదు అక్కడే  జన్మించాడు.

  • మెస్సీయ "బేత్లెహేము ఎఫ్రాతా"నుండి వస్తాడని మీకా ప్రవక్త ప్రవచించాడు.

  • ఆ ప్రవచనం నెరవేర్పుగా యేసు అనేక సంవత్సరాల తరువాత బేత్లెహేములో పుట్టాడు.

  • "బేత్లెహేము" అంటే  "రొట్టెల ఇల్లు” లేక “ఆహారపు ఇల్లు."

(ఈ పదములను కూడా చూడండి: కాలేబు, దావీదు, మీకా)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పరిశుద్ధ గ్రంథము నుండి ఉదాహరణలు:

  • __17:2__దావీదు ఒక గొర్రెలకాపరి. అతని స్వగ్రామం బేత్లెహేము.

  • __21:9__మెస్సీయ ఒక కన్యకుజన్మిస్తాడని యెషయా ప్రవచించాడు. అతడు బేత్లెహేములో పుడతాడని మీకా ప్రవక్త చెప్పాడు.

  • 23:4 యోసేపు, మరియ వారు నివసించే నజరేతు నుండి చాలా దూరం ప్రయాణించి బేత్లెహేము చేరుకున్నారు. ఎందుకంటే వారి పూర్వీకుడైన దావీదు సొంత ఊరు బేత్లెహేము.

  • 23:6" ప్రభువైన మెస్సీయా బేత్లెహేము లో జన్మించాడు!"

పదం సమాచారం:

  • Strong’s: H0376, H0672, H1035, G09650

బేత్షెమెషు#

వాస్తవాలు:

బేత్షెమెషు కనాను పట్టణం. ఇది యెరూషలేముకు దాదాపు 30 కిలో మీటర్లు పశ్చిమాన ఉంది.

  • యెహోషువా నాయకత్వంలో ఇశ్రాయేలీయులు బేత్షెమెషును పట్టుకున్నారు.
  • బేత్షెమెషు లేవీయులు, యాజకులు నివసించడానికి కేటాయించిన పట్టణం.
  • ఫిలిష్తీయులు నిబంధన మందసం పట్టుకుని యెరూషలేముకు తిరిగి పంపించినప్పుడు అది ఆగిన మొదటి ఊరు బేత్షెమెషు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: నిబంధన మందసం, కనాను, యెరూషలేము, యెహోషువా, లేవీయుడు, ఫిలిష్తీయులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1053

మత్తయి, లేవి

వాస్తవాలు:

యేసు తన శిష్యులుగా ఉండడానికి ఏర్పరచుకొన్న పన్నెండు మందిలో మత్తయి ఒకడు. మత్తయిని అల్ఫయి కుమారుడైన లేవి అని కూడా పిలుస్తారు.

  • లేవి (మత్తయి) యేసును కలుసుకోడానికి ముందు కపర్నేహోములో పన్నులు వసూలు చేసేవాడు.
  • మత్తయి తన పేరును కలిగియున్న మత్తయి సువార్తను రాసాడు.
  • బైబిలు గ్రంథంలో లేవి అనే పేరుతో అనేకమంది ఉన్నారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: apostle, Levite, tax collector)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G30170, G31560

మనష్షే

వాస్తవాలు:

పాతనిబంధనలో మనష్షే పేరు ఉన్నవారు ఐదుగురు ఉన్నారు.

  • యోసేపు మొదటి కుమారుని మనష్షే.
  • మనష్షే అతని తమ్ముడు ఎఫ్రాయీములను యోసేపు తండ్రి యాకోబు దత్తత తీసుకొన్నాడు, ఫలితంగా వారి సంతానానికి ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలమధ్య ఉండే ఆధిక్యత దొరికింది.
  • మనష్షే సంతానం ఇశ్రాయేలీయుల గోత్రాలలో ఒక గోత్రంగా తయారైంది.
  • మనష్షే గోత్రం తరచుగా “మనష్షే అర్థగోత్రం” అని పిలువబడుతుండేది, ఎందుకంటే మనష్షే గోత్రంలోని ఒక భాగం మాత్రమే కానానులోని యొర్ధానునదికి పశ్చిమాన స్థిరపడింది. మనష్షే గోత్రంలోని మరొక సగభాగం యొర్దానుకు తూర్పున స్థిరపడింది.
  • యూదా రాజులలో ఒక రాజు పేరు కూడా మనష్షే
  • మనష్షే రాజు చాలా దుష్టుడైన రాజు, అబద్ధపు దేవుళ్ళకు తన సొంత కుమారులనే బలిగా అర్పించాడు.
  • శత్రు సైన్యం చేతికి అప్పగించడం ద్వారా దేవుడు మనష్షేని శిక్షించాడు. మనష్షే దేవుని వైపుకు తిరిగాడు, విగ్రహారాధన జరిగే బలిపీఠాలను నాశనం చేసాడు.
  • ఎజ్రా కాలంలో మనష్షే పేరున్న ఇద్దరు వ్యక్తులు నివసించారు. ఈ ఇద్దరు వ్యక్తులు అబద్ధపు దేవుళ్ళను ఆరాధించేలా తమను ప్రభావితం చేసిన అన్యులైన తమ భార్యలను విదిచిపెత్తవలసి వచ్చింది.
  • మరొక మనష్షే అబద్ధపు దేవుళ్ళకు యాజకులుగా ఉన్న కొందరు దానీయులకు తాతగా ఉన్నాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: బలిపీఠం, దాను, ఎఫ్రాయీము, ఎజ్రా, అబద్దపు దేవుడు, యాకోబు, యూదా, అన్యుడు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4519, H4520, G3128

మరియ (మార్త సహోదరి)

వాస్తవాలు:

మరియ బెతనియలో నివాసం చేస్తుంది, ఈమె యేసును వెంబడించింది.

  • మరియకు మార్త అనే ఒక సహోదరి, లాజరు అనే ఒక సోదరుడు ఉన్నారు, వారు కూడా యేసును వెంబడించారు.
  • మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని, మార్తలా తనకు ఆహారాన్ని సిద్ధపరచడం గురించి ఆతృత పడకుండా ఆయన వద్ద వినడానికి యెంచుకొన్నాడని యేసు చెప్పాడు.
  • చనిపోయిన మరియ సోదరుడు లాజరును యేసు మరణం నుండి తిరిగి లేపాడు.
  • కొంతకాలమిన తరువాత, ఒకని గృహంలో యేసు భోజనం చేస్తున్నప్పుడు, మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరును ఆయన పాదాలమీద పోసింది.
  • ఈ పని చెయ్యడాన్ని బట్టి యేసు ఆమెను అభినందించాడు, సమాధికోసం తన దేహాన్ని ఆమె సిద్ధపరుస్తుందని ఆమె గురించి చెప్పాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి:Bethany, frankincense, Lazarus, Martha)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G31370

మలాకి

వాస్తవాలు:

యూదా రాజ్యంలో మలాకి ఒక దేవుని ప్రవక్త. క్రీస్తు ఈ లోకానికి రావడానికి 500 సంవత్సరాల ముందు నివసించాడు.

  • బబులోను చేర తరువాత ఇశ్రాయేలు దేవాలయం తిరిగి నిర్మించబడే కాలంలో మలాకి ప్రవచించాడు.
  • ఎజ్రా, నెహెమ్యాలు మలాకి జీవించినకాలంలో ఉన్నారు.
  • పాతనిబంధనలో మలాకి చివరి పుస్తకం.
  • పాతనిబంధన ప్రవక్తలలానే, మనుష్యులు తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవాను ఆరాధించునట్లు వెనుకకు తిరగాలని మలాకి హెచ్చరించాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: బబులోను, బందీ, ఎజ్రా, యూదా, నెహెమ్యా, ప్రవక్త, పశ్చాత్తాపం, తిరగడం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4401

మహా హేరోదు

వాస్తవాలు:

మహా హేరోదు యేసు పుట్టిన కాలంలో పాలకుడు. అతడు రోమా సామ్రాజ్యం ఆయా భాగాలను పరిపాలించిన హేరోదు అనే పేరు గల అనేక ఎదోమీయ అధిపతుల్లో మొదటివాడు.

  • అతని పూర్వీకులు యూదుమతంలోకి మారారుకావునఅతడు యూదుడుగా పెరిగాడు.
  • అతడునిజంగా రాజు కాకపోయినా కైసరు ఔగుస్తు అతనికి "రాజైన హేరోదు" అనే బిరుదు ఇచ్చాడు. యూదాలో యూదులపై 33 సంవత్సరాల అతని పరిపాలన కొనసాగింది.
  • మహా హేరోదు యెరూషలేములో పాడైన ఆలయ మరమ్మతులు మొదలు పెట్టి చాలా అందమైన భవనాల నిర్మాణానికి ఆదేశించాడు.
  • హేరోదుచాలా క్రూరమైన మనిషి. అనేక మందిని అతడు చంపించాడు. "యూదుల రాజు" బేత్లెహేములో పుట్టాడని విన్నప్పుడు అతడు ఆఊరిలో పసివారిని చంపించడానికి ఆజ్ఞ ఇచ్చాడు.
  • తన కుమారులు హేరోదు అంతిప,హేరోదు ఫిలిప్పు,తన మనవడుహేరోదు అగ్రిప్ప కూడా రోమా అధిపతులుగా పరిపాలించారు. తన ముని మనవడు హేరోదు రెండవ అగ్రిప్ప (ఇతన్ని "అగ్రిప్ప రాజు"గా పిలవబడ్డాడు) మొత్తం యూదా ప్రాంతం అంతటినీ పరిపాలించాడు.

(చూడండిపేర్లు అనువదించడం ఎలా)

(ఈపదములను కూడా చూడండి: హేరోదు, అంతిప, యూదా, రాజు, ఆలయం)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G22640

మాకా

వాస్తవాలు:

మాకా అబ్రహాము సహోదరుడు నాహోరు కుమారులలో ఒకడు. పాతనిబంధనలో ఇతరులకు కూడా ఈ పేరు ఉంది.

  • మాకా లేక బేత్-మాకా పట్టణం నఫ్తాలి గోత్రం స్వాధీనం చేసుకొన్న ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతంలో ఉంది.
  • ఇది చాలా ప్రాముఖ్యమైన పట్టణం, అనే సందర్భాలలో శతృవులు దీనిపై దాడి చేసారు.
  • మాకా అనే పదం అనేక స్త్రీల పేరు, దావీదు కుమారుడు అబ్షాలోము తల్లి పేరు కూడా మాకా.
  • రాజైన ఆసా అతని అమ్మమ్మను రాణి పదవినుండి తొలగించాడు, ఎందుకంటే ఆమె ఆషేరా పూజను జరిగిస్తుంది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆసా, ఆషేరా, నాహోరు, నఫ్తాలి, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4601

మాగ్డలెనే మరియ

వాస్తవాలు:

యేసు నందు విశ్వాశముంచి ఆయన పరిచర్యలో ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలలో మగ్దలేనే మరియ ఒకరు. ఆమెను పట్టి స్వాధీనం చేసుకొన్న ఏడు దయ్యాలనుండి యేసు ఆమెను బాగుచేసాడని ఆమె గురించి ప్రజలకు తెలుసు.

  • మగ్దలేనే మరియయు, మరికొందరు స్త్రీలు యేసుకూ, ఆయన శిష్యులకూ ఇవ్వడం ద్వారా వారికి సహకరించారు.
  • యేసు మరణించి తిరిగి లేచినప్పుడు ఆయనను మొదట చూచిన స్త్రీలలో ఈమె ప్రస్తావించబడింది.
  • మగ్దలేనే మరియ ఖాళీ శామాదికి వెలుపల నిలుచుండినప్పుడు, అక్కడ నిలిచియున్న యేసును ఆమె చూచింది, తాను సజీవుడిగా ఉన్నట్టు శిష్యులతో చెప్పాలని ఆమెకు చెప్పాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి:demon, demon-possessed)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G30940, G31370

మాదయి, మాదీయులు

వాస్తవాలు:

మాదయి అస్సీరియా, బబులోనుకి తూర్పున ఉన్న పురాతన సామ్రాజ్యం. ఇది ఎలాముకు, పర్షియాకు ఉత్తరాన ఉంది. మాదయి సామ్రాజ్యంలో నివసించిన ప్రజలు “మాదీయులు” అని పిలువబడ్డారు.

  • మాదయి సామ్రాజ్యం ప్రస్తుత టర్కీ, ఇరాన్, సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలోని భూబాగాలను కలుపుకొని ఉంది.
  • మాదీయులు పర్షియనులతో సన్నిహితంగా ఉండేవారు, బాబులోను రాజును జయించదానికి ఇద్దరు చక్రవర్తులు ఏకం అయ్యారు.
  • మాదీయుడైన దర్యావేషు బాబులోను మీదకు దండెత్తాడు, ఆ కాలంలో దానియేలు ప్రవక్త జీవిస్తున్నాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అస్సీరియా, బబులోను, కోరెషు, దానియేలు, దర్యావేషు, ఏలాము, పర్షియా)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4074, H4075, H4076, H4077, G3370

మార్త

వాస్తవాలు:

మార్త బెతనియ గ్రామం నుండి యేసుని అనుసరించిన స్త్రీ.

  • మార్తకు మరియ అనే ఒక సహోదరి ఉంది, లాజరు అనే సోదరుడు ఉన్నాడు, వారు కూడా యేసును అనుసరించారు.
  • ఒకసారి యేసు వారిని తమ ఇంట దర్శించదానికి వెళ్ళినప్పుడు, భోజనం తయారు చెయ్యడంలో మార్త ఆటంకపడింది, తన సోదరి మరియ యేసు బోధను వింటుంది.
  • లాజరు చనిపోయినప్పుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని తాను విశ్వసిస్తున్నట్టు మార్త చెప్పింది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: Lazarus, Mary (sister of Martha))

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G31360

మాసిదోనియా

వాస్తవాలు:

కొత్తనిబంధన కాలంలో, మాసిదోనియా రోమా సంస్థానంలో/దేశభాగములో పురాతన గ్రీసుకు ఉత్తరాన ఉన్నది/నెలకొని ఉన్నది.

  • బైబిలులో ప్రస్తావించిన కొన్ని ప్రాముఖ్యమైన మాసిదోనియా పట్టణాలు, - బెరయ, ఫిలిప్పి, థెస్సలోనిక.
  • దర్శనం ద్వారా మాసిదోనియాలో సువార్త ప్రకటించాలని దేవుడు పౌలుకు చెప్పాడు.
  • పౌలునూ, అతని జత పనివారును మాసిదోనియ వెళ్లి, అక్కడి ప్రజలకు యేసును గురించి బోధించి, నూతన విశ్వాసులు తమ విశ్వాసంలో ఎదుగునట్లు వారికి సహాయం చేసారు.
  • బైబిలులో ఫిలిప్పి, థెస్సలోనిక లాంటి మాసిదోనియ పట్టణాలలోని విశ్వాసులకు పౌలు పత్రికలు రాసాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి:  believe, Berea, faith, good news, Greece, Philippi, Thessalonica)

బైబిలు రెఫరెన్సులు:

  • 1 థెస్సలోనిక 01:06-07
  • 1 థెస్సలోనిక 04:09-12
  • 1 తిమోతి 01:03-04
  • అపొస్తలులకార్యములు 16:09-10
  • అపొస్తలులకార్యములు 20:01-03
  • ఫిలిప్పి 04:14-17

పదం సమాచారం:

  • Strong's: G31090, G31100

మిఖాయేలు

వాస్తవాలు:

మిఖాయేలు దేవుని పరిశుద్ధ, విధేయతగలిగిన దూతలలో ప్రధానుడు. దేవుని “ప్రధానదూత” అని మిఖాయేలును గురించి మాత్రమే ప్రత్యేకించి ప్రస్తావించబడింది.

  • ”ప్రధాన దూత” పదం అక్షరాల “ముఖ్యమైన దూత” లేదా “పాలించు దూత” అని అర్థం.
  • మిఖాయేలు దూత యుద్ధ యోధుడు, దేవుని శత్రువులకు విరోధంగా అతడు యుద్ధం చేస్తాడు మరియు దేవుని ప్రజలను కాపాడుతాడు.
  • పర్షియా సైన్యానికి విరోధంగా యుద్ధం చెయ్యడానికి ఇస్రాయేలీయులను అతడు నడిపించాడు. దానియేలు గ్రంథంలో ముందుగా చెప్పిన విధంగా దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అంతిమ యుద్ధంలో ఇశ్రాయేలు సైన్యాన్ని అతడు నడిపిస్తాడు.
  • బైబిలులో మిఖాయేలు పేరు కలిగిన వారు అనేకమంది ఉన్నారు. అనేకమంది “మిఖాయేలు కుమారుని”గా గుర్తించబడ్డారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(వీటిని కూడా చూడండి: దేవదూత, దానియేలు, సందేశకుడు, పర్షియా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4317, G34130

మిద్యాను, మిద్యానీయుడు, మిద్యానీయులు

వాస్తవాలు:

అబ్రహాము అతని భార్య కుమారుడు మిద్యాను. అరేబియా అరణ్యంలో ఉత్తరాన ఉన్న ప్రజాగుంపు పేరు కూడా మిద్యాను, ఇది కానాను భూబాగానికి దక్షిణాన ఉంది. ఆ ప్రజాగుంపులోని ప్రజలను “మిద్యానీయులు” అని పిలుస్తారు.

  • మోషే మొదట ఐగుప్తును విడిచినప్పుడు, మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ యిత్రో కుమార్తెలను కలుసుకొన్నాడు, వారికి సహాయం చేసాడు, వారి మందలకు నీరు అందించాడు. తరువాత మోషే యిత్రో కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకొన్నాడు.
  • యోసేపును బానిస వర్తర్తకులైన మిద్యాను గుంపు వారు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు.
  • అనేక సంవత్సరాల తరువాత మిద్యానీయులు కనాను దేశంలోని ఇశ్రాయేలీయులపై దాడి చేసి వారిని ఆక్రమించుకొన్నారు. వారిని ఓడించడానికి గిద్యోను ఇస్రాయేలీయులను నడిపించాడు.
  • ప్రస్తుతం అరేబియా గోత్రాలు ఈ గుంపు సంతానమే.

(చూడండి: అరేబియా, ఐగుప్తు, మంద, గిద్యోను, యిత్రో, మోషే)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 16:03 అయితే ప్రజలు దేవుణ్ణి మరచిపోయారు, తిరిగి విహ్రహాలను పూజించడం ఆరంభించారు. అందుచేత దేవుడు వారిని ఓడించడానికి వారికి సమీపంగా ఉన్న శత్రు గుంపు మిద్యానీయులను అనిమతించాడు.
  • 16:04 ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు, మిద్యానీయులకు కనబడకుండ వారు గుహలలో దాగుకొన్నారు,
  • 16:11 అతని స్నేహితుడు, “గిద్యోను సైన్యం మిద్యాను సైన్యాన్ని ఓడిస్తుందని ఈ కలభావమా?” అని అడిగాడు.
  • 16:14 దేవుడు మిద్యానీయులను గందరగోళ పరచాడు, అందుచేత వారు ఒకరినొకరి మీద దాడి చేసి ఒకరినొకరు చంపుకొన్నారు.

పదం సమాచారం:

  • Strong's: H4080, H4084, H4092

మిరియాము

వాస్తవాలు;

మిరియాము ఆహారోను, మోషెలకు అక్క.

  • ఆమె చిన్నతనంలో ఉండగా నైలు నది తీగల మధ్య ఒక బుట్టలో ఉన్న తన చిన్ని తమ్ముడైన మోషెను గమనించాలను తన తల్లి ఆదేశించింది. ఫరో కుమార్తె ఆ చిన్నిబాలుడిని కనుగొన్నప్పుడు, ఆ బిడ్డను చూచుకోడానికి ఒకరి సహాయం అవసరమని గుర్తించినప్పుడు మిరియాము తన తల్లిని తీసుకొని వచ్చింది.
  • ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులనుండి తప్పించుకొని ఎర్రసముద్రాన్ని దాటిన తరువాత కృతజ్ఞతతోనూ నాట్యంలోనూ వారిని నడిపించింది.
  • సంవత్సరాలు జరిగిన తరువాత ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు, మిరియాము, ఆహారోనులు మోషే కూషు దేశస్తురాలీని వివాహం చేసుకొన్న కారణంగా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు,
  • మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి తిరుగుబాటు చేసిన కారానంగా దేవుడు మిరియాముకు కుష్ట రోగాన్ని కలుగచేసాడు. అయితే తరువాత మోషే ఆమె కోసం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరచాడు,

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆహారోను, కూషు, విజ్ఞాపన, మోషే, నైలునది, ఫరో, తిరుగుబాటు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4813

మిషాయేలు

వాస్తవాలు:

పాతనిబంధనలో ముగ్గురు వ్యక్తులకు మిషాయేలు అనే పేరు ఉంది.

  • మిషాయేలు పేరు ఉన్న ఒక వ్యక్తి ఆహారోను సోదరుడు. ఆహారోను ఇద్దరు కుమారులు దేవుడు చెప్పినదానికి వ్యతిరేకంగా దూపాలను అరిపించిన కారణంగా దేవుడు వారిని చావుకు అప్పగించాడు, చనిపోయిన మృతదేహాలను ఇశ్రాయేలు శిబిరం వెలుపలికి తీసుకొనివెళ్ళే బాధ్యతను మిషాయేలుకూ అతని సోదరునికి అప్పగించారు.
  • మిషాయేలు పేరున్న మరొక వ్యక్తి ఎజ్రా తిరిగి కనుగొన్న ధర్మశాస్త్రాన్ని బహురంగంగా చదువుతున్నప్పుడు ఎజ్రా పక్కన నిలబడియున్నాడు.
  • ఇశ్రాయేలీయులు బబులోను చేరలో ఉన్నప్పుడు మిషాయేలు అను పేరున్న ఒక యవనస్తుడు కూడా బందీ అయ్యాడు, బబులోనులో నివసించేలా అతణ్ణి బలవంతం చేసారు. బబులోను వారు అతనికి “మెషెకు” అనే పేరు పెట్టారు. తాను తన సహచరులతో, అజర్యా (షడ్రకు), హనన్యా (అబెద్నెగో)లతో కలిసి రాజు నిలువబెట్టిన ప్రతిమకు నమస్కరించదానికి నిరాకరించారు, మండుతున్న అగ్నిగుండంలో వారిని వేశారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆహారోను, అజరయ, బబులోను, దానియేలు, హనన్యా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4332, H4333

మిస్పా

వాస్తవాలు:

పాతనిబంధనలో అనేక పట్టణాలకు మిస్పా అని పేరు ఉంది. మిస్పా అంటే “వెలుపలికి చూచేస్థలం” లేక “కావలివాని బురుజు” అని అర్థం.

  • సౌలు దావీడును వెంటాడేతప్పుడు, తన తల్లిదండ్రులను మోయాబు రాజు కాపుదలలో మిస్పాలో విడిచి వెళ్ళాడు,
  • యూదా, ఇశ్రాయేలు రాజ్యాల మధ్య తీరంలో మిస్పా అనే పట్టణం ఉంది. ఇది సైనిక ప్రధాన కేంద్రం.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: దావీదు, యూదా, ఇశ్రాయేలు రాజ్యం, మోయాబు, సౌలు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4708, H4709

మీకా

వాస్తవాలు:

యూదా రాజ్యంలో క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల కాలంలో యెషయ యూదాలో పరిచర్య చేస్తున్న కాలంలో మీకా ఉన్నాడు. మీకా అని పేరున్న మరొక వ్యక్తి న్యాయాధిపతులకాలంలో జీవించాడు.

  • పాతనిబంధన చివరి భాగంలో మీకా గ్రంథం ఉంది.
  • అస్సీరియనుల చేత సమరయ నాశనం కాబోతున్నదని మీకా ప్రవచించాడు.
  • దేవునికి అవిధేయత చూపిన కారణంగా మీకా యూదులను గద్దించాడు, వారిపై తమ శత్రువులు దాడి చెయ్యాలని కోరాడు.
  • అతని సందేశం దేవునిలో నిరీక్షణ సందేశంతో ముగుస్తుంది, ఆయనే తన ప్రజలను కాపాడడంలో నమ్మదగినవాడు.
  • న్యాయాధిపతుల గ్రంథంలో, మీకా అనే వ్యక్తి ఎఫ్రాయీములో నివసిస్తున్నాడని చెప్పబడి యుంది, అతడు వెండి నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసాడు. యవ్వనుడైన ఒక లేవీ యాజకుడు అతనితో ఉండడానికి వచ్చాడు, అతని విగ్రహాన్నీ, ఇతర వస్తువులనూ దొంగిలించాడు, దాను గోత్రీకులతోపాటు వాటిని తీసుకొనివెళ్ళాడు. క్రమంగా దానీయులు, యాజకులు లాయిషు పట్టణంలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు, అదే వెండి విగ్రహాన్ని ఏర్పరచుకొని విగ్రహారాధన చెయ్యడం ఆరంభించారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అస్సీరియా, దాను, ఎఫ్రాయీము, అబద్దపు దేవుడు, యూదా, న్యాయాధిపతి, లేవీయుడు, యాజకుడు, ప్రవక్త, సమరయ, వెండి)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4316, H4318

మెలెకు, మొలోకు

వాస్తవాలు:

కనానీయులు పూజించే ఒక అబద్దపు దేవుళ్ళ పేరు మెలెకు. ఈ పదాన్ని “మొలోకు” లేదా “మొలెకు” అని రాయవచ్చు.

  • మెలెకును పూజించే ప్రజలు తమ పిల్లలను అగ్నిద్వారా బలి ఇస్తారు.
  • కొందరు ఇశ్రాయేలీయులు నిజమైన దేవుడు యెహోవాను విడిచి మెలెకును పూజించారు. మెలెకును ఆరాధించేవారి దుష్టఆలోచనలను వారు అనుసరించారు, పిల్లలను బలి ఇవ్వడం అనే ఆచారాన్ని కూడా వారు అనుసరించారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: కనాను, దుష్టుడు, అబద్దపు దేవుడు, దేవుడు, అబద్దపు దేవత, అర్పణ, సత్యం, ఆరాధన, యెహోవా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4428, H4432, G3434

మెల్కీసెదెకు

వాస్తవాలు:

అబ్రహాము జీవించిన కాలంలో మెల్కీసెదెకు షాలేము పట్టణానికి రాజుగా ఉన్నాడు. (తరువాత దీనిని యెరూషలెం అని పిలిచారు).

  • మెల్కీసెదెకు అంటే “నీతికి రాజు” అని అర్థం, ఆయన బిరుదు “షాలేము రాజు” అంటే “సమాధాన రాజు” అని అర్థం.
  • ”సర్వోన్నతుడైన దేవుని యాజకుడు” అని కూడా పిలువబడ్డాడు.
  • అబ్రహాము తన అన్న కుమారుడు లోతును శక్తివంతమైన రాజులనుండి విడిపించిన తరువాత మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె, ద్రాక్షారసం పంచినపుడు బైబిలులో మొట్టమొదటిసారి కనిపిస్తాడు. అబ్రహాము తన విజయంనుండి వచ్చిన దోపుడు సొమ్ములో పదియవ భాగాన్ని మెల్కీసెదెకుకు ఇచ్చాడు.
  • కోత్తనిబందనలో తండ్రీ లేక తల్లి లేనివాడుగా మెల్కీసెదెకు వివరించబడ్డాడు. శాశ్వతకాలం పాలించే రాజుగా, యాజకుడిగా పిలువబడ్డాడు.
  • యేసు “మెల్కీసెదెకు యాజక క్రమం” చొప్పున యాజకుడిగా ఉన్నాడని కొత్తనిబంధన చెపుతుంది. ఇశ్రాయేలీయుల యాజకులవలే యేసు లేవీయులనుండి వచ్చినవాడు కాదు. ఆయన యాజకత్వం మెల్కీసెదెకుకు వలే నేరుగా దేవుని నుండి వచ్చింది.
  • బైబిలులో ఆయన వివరాలను ఆధారం చేసుకొని, మెల్కీసెదెకు మానవ యాజకుడు, దేవునిచేత ఏర్పరచబడినవాడు, సమాధానానికీ, నీతికీ నిత్యుడైన రాజు, మన గొప్ప ప్రధాన యాజకుడు యేసుకు ప్రాతినిధ్యం వహించడానికీ లేక ఆయనను చూపించదానికీ దేవుని చేత ఏర్పరచబడినవాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: అభ్రహాము, నిత్యత్వం, ప్రధాన యాజకుడు, యెరూషలెం, లేవీయుడు, యాజకుడు, నీతి)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4442, G3198

మెషెకు

వాస్తవాలు:

మెషెకు పాతనిబంధనలో ఇద్దరు వ్యక్తులకున్న పేర్లు.

  • ఒక మెషెకు యాపెతు కుమారుడు.
  • మరొక మెషెకు షేము మనుమడు.
  • మెషెకు ఒక భూబాగంకున్న పేరు, వీరిలో ఒకని పేరును బట్టి పిలువబడియుండవచ్చు.
  • మెషెకు ప్రాంత ప్రస్తుతం టర్కీ అని పిలువబడే ప్రాంతం కావచ్చును.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: యాపెతు, నోవహు, షేము)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4851, H4902

మెసపొటేమియా, ఆరాము.నహారాయీము

వాస్తవాలు:

మెసపొటేమియా టైగ్రీసు, యూఫ్రటీసు నదుల మధ్య ఉన్న ప్రాంతం. ఆధునిక ఇరాక్ దేశప్రాంతంలో ఇది ఉంది.

  • పాతనిబంధానంలో ఆ ప్రాంతాన్ని “అరాము నహరయీము” అని పిలిచారు.
  • ”మెసపొటోమియా” అంటే “నదుల మధ్య” అని అర్థం. “ఆరాము నహరయీము” అంటే “రెండు నదుల ఆరాము” అని అర్థం.
  • అబ్రహాము కానాను దేశానికి కదలడానికి ముందు మెసపొటేమియా పట్టణాలు ఊరు, హారానులలో కాపురమున్నాడు.
  • బబులోను మెసపొటేమియా ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన పట్టణం.
  • ”కల్దియ” అని పిలువబడే ప్రాంతం కూడా మెసపొటేమియాలో భాగమే.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆరాము, బబులోను. కల్దియ, యూఫ్రటీసు నది)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H763, G3318

మొర్దకై

వాస్తవాలు:

మొర్దకై పర్షియా దేశంలో నివసిస్తున్న ఒక యూడుడు. తన సోదరును కుమార్తె, ఎస్తేరుకు సంరక్షకుడిగా ఉన్నాడు, తరువాత ఆమె పర్షియారాజు, ఆహాష్వేరోషుకు భార్య అయ్యింది.

  • రాజు అంతఃపురం వద్ద పని చేస్తున్నప్పుడు ఆహాష్వేరోజు రాజుకు వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు చేస్తున్న కుట్రను విన్నాడు. దీని రాజుకు తెలియపరచాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడు.
  • కొద్దికాలం తరువాత, పర్షియా రాజ్యంలోని యూదులందరినీ చంపాలనే పన్నాగాన్ని కూడా మొర్దకై విన్నాడు. తన ప్రజలను రక్షించదానికి రాజును మనవి చెయ్యాలని ఎస్తేరుకు సూచన చేసాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆహాష్వేరోషు, బబులోను, ఎస్తేరు, పర్షియా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4782

మోషే

వాస్తవాలు:

మోషే 40 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగాను, నాయకుడుగాను ఉన్నాడు. నిర్గమకాండము వివరించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండు బయటకు వచ్చినప్పుడు అతడు వారికి నాయకుడు.

  • మోషే శిశువుగా ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు అతన్ని ఐగుప్తి యొక్క ఫారో నుండి దాచడానికి నైలు నది రెల్లులో ఒక బుట్టలో ఉంచారు. మోషే సహోదరి మిరియము అతనిని చూసుకున్నది/కాపలా కాసింది. ఫరో కుమార్తె అతనిని కనుగొని అతడిని తన కుమారుడిగా పెంచడానికి రాజభవనానికి తీసుకెళ్లడంతో మోషే  తపించుకున్నాడు.

  • ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి మరియు వారిని వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు.

  • ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు తప్పించుకున్న తరువాత మరియు వారు ఎడారిలో తిరుగుతుండగా, దేవుడు మోషేకు పది ఆజ్ఞలు రాయబడి ఉన్న రెండు రాతి పలకలను ఇచ్చాడు.

  • మోషే తన జీవితం చివరలో, వాగ్దాన భూమిని చూశాడు, కానీ అతను దేవునికి అవిధేయత చూపడం వలన అందులో నివసించలేకపోయాడు.

(అనువాద సూచనలు: పేర్లను ఎలా అనువదించాలి) How to Translate Names)

(ఇది కూడా చూడండి: Miriam, Promised Land, Ten Commandments)

బైబిల్ర నుండి రిఫరెన్సులు :

** బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __9:12__ఒకరోజు మోషే తన గొర్రెలను సంరక్షిస్తుండగా/కాయుచుండగా, అతను మండిపోతున్న పొదను చూశాడు.

  • __12:5__మోషే ఇశ్రాయేలీయులతో, “భయపడటం మానేయండి/భయపడకుడి! దేవుడు ఈరోజు మీ కొరకు పోరాడి మిమ్మును రక్షించును. ”

  • __12:7__సముద్రం మీద చేయి ఎత్తి నీళ్లను విభజించమని దేవుడు మోషేకు చెప్పాడు.

  • __12:12__ఐగుప్తీయులు చనిపోయారని ఇశ్రాయేలీయులు చూసినప్పుడు, వారు దేవుడిని నమ్మారు, మోషే దేవుని ప్రవక్త అని విశ్వసించారు.

  • __13:7__అప్పుడు దేవుడు ఈ పది ఆజ్ఞలను రెండు రాతి పలకలపై రాసి మోషేకు ఇచ్చాడు.

పదం సమాచారం:

  • Strong’s: H4872, H4873, G34750

యరోబాము

వాస్తవాలు:

యరోబాము నెబాతు కుమారుడు. క్రీ. పూ. 900-910 ప్రాంతాల్లో ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యానికి మొదటి రాజు. మరొక యరోబాము, యెహోయాషు రాజు కుమారుడు. ఇతడు120 సంవత్సరాలు తరువాత ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు.

  • యెహోవా నెబాతు కుమారుడు యరోబాముకు ప్రవచనం ఇచ్చాడు. సొలోమోను తరువాత రాజు అవుతాడు. ఇశ్రాయేలు పది గోత్రాలను పరిపాలిస్తాడు.
  • సొలోమోను చనిపోయాక, ఇశ్రాయేలు పది ఉత్తర గోత్రాలు సొలోమోను కుమారుడు రెహబాముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి యరోబామును వారి రాజుగా ప్రకటించుకున్నాయి. దానితో రెహబాము రాజు రెండు దక్షిణ గోత్రాలు, అంటే యూదా, బెన్యామీను గోత్రాలకు మాత్రమే రాజు అయ్యాడు.
  • యరోబాము దుష్ట రాజు అయి ప్రజలను యెహోవా ఆరాధన నుండి మళ్ళించి పూజించడానికి విగ్రహాలు నిలబెట్టాడు. ఇతర ఇశ్రాయేలు రాజులు యరోబాము ఉదాహరణ ప్రకారం అతనివలె దుష్టరాజులుగా అయ్యారు.
  • దాదాపు 120 సంవత్సరాల తరువాత, మరొక రాజు యరోబాము ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం పాలించసాగాడు. యరోబాము యెహోయాషు రాజు కుమారుడు. ఇతడు తనకు ముందున్న ఇశ్రాయేలు రాజుల వలె దుర్మార్గుడు.
  • ఇశ్రాయేలీయుల దుర్మార్గత ఎలా ఉన్నా దేవుడు వారిపై కరుణ చూపి యరోబాము తన రాజ్య సరిహద్దులు స్థిరపరచుకోడానికి సహాయం చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అబద్ధ దేవుడు, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా, సొలోమోను)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 18:08 ఇశ్రాయేలులోని మరొక పది గోత్రాలు రెహబాముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. యరోబాము అనే పేరు గల వాణ్ణి తమ రాజుగా నియమించుకున్నాయి.
  • 18:09 యరోబాము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రజలు పాపం చేయడానికి కారణం అయ్యాడు. అతడు యూదా రాజ్యం ఆలయంలో దేవునికి చేసే పూజకు బదులుగా ఆరాధనకై రెండు విగ్రహాలు తయారు చేయించాడు.

పదం సమాచారం:

  • Strong's: H3379

యాకోబు (అల్ఫయి కుమారుడు)

వాస్తవాలు:

యాకోబు, అల్ఫయి కుమారుడు, యేసు పన్నెండుమంది అపోస్తలుల్లో ఒకడు.

  • ఇతని పేరు మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో యేసు శిష్యుల జాబితాలో ఉంది.
  • అతడు అపో. కా. గ్రంథం కూడా ఇతని పేరు ప్రస్తావించింది. యేసు పరలోకం వెళ్ళిపోయిన తరువాత శిష్యులు యెరూషలేములో కలిసి ప్రార్థన చేస్తుంటే ఇతడు వారితో ఉన్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: apostle, disciple, James (brother of Jesus), James (son of Zebedee), the twelve)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G23850

యాకోబు (యేసు సోదరుడు)

వాస్తవాలు:

యాకోబు మరియ, యోసేపుల కుమారుడు. అతడు యేసు తమ్ముడు (తల్లి కొడుకు).

  • యేసు ఇతర తమ్ముళ్ళు యోసేపు, యూదా, సీమోను.
  • యేసు జీవించిన కాలంలో యాకోబు అతని సోదరులు యేసును మెస్సియాగా విశ్వసించలేదు.
  • తరువాత, యేసు మృతస్థితి నుండి తిరిగి లేచాక యాకోబు విశ్వసించాడు. అతడు యెరూషలేము సంఘం నాయకుడు అయ్యాడు.
  • కొత్త నిబంధన పుస్తకం యాకోబుపత్రికను హింస తప్పించుకోడానికి ఇతర దేశాలకు పారిపోయిన క్రైస్తవులకోసం అతడు రాశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అపోస్తలుడు, క్రీస్తు, సంఘం, యూదా కుమారుడు of యాకోబు, హింసించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2385

యాకోబు కుమారుడు యూదా

వాస్తవాలు:

యాకోబు కుమారుడు యూదా యేసు పన్నెండుమంది అపోస్తలుల్లో ఒకడు. ఇతడు యూదా ఇస్కరియోతు కాదు.

  • తరచుగా పరిశుద్ధ గ్రంధం లో, ఒకే పేరుగల మనుషులు ఉంటారు. అందుకని వారిని వారి తండ్రి పేర్లతో గుర్తిస్తారు. ఇక్కడ యూదాను "యాకోబు కుమారుడుగా" చెబుతున్నారు.
  • యూదా అనే పేరున్న మరొక మనిషి యేసు సోదరుడు. అతన్ని "యూదా" అన్నారు.
  • కొత్త నిబంధన పుస్తకం "యూదా" పత్రికను బహుశా యేసు సోదరుడు యూదా రాశాడు. ఎందుకంటే గ్రంథకర్త తనను "యాకోబు సోదరుడు"గా పరిచయం చేసుకున్నాడు. యాకోబు యేసుకు మరొక సోదరుడు.
  • యూదా పత్రికను యేసు శిష్యుడు యాకోబు కుమారుడు యూదా రాసి ఉండవచ్చు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి:James (son of Zebedee), Judas Iscariot, son, the twelve)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G24550

యిత్రో, రగూయేలు

వాస్తవాలు:

"యిత్రో” “రగూయేలు" అనే రెండు పేర్లు మోషే భార్య, సిప్పోరా తండ్రివే. పాత నిబంధనలో ఇద్దరు వేరే మనుషుల పేర్లు "రగూయేలు".

  • మోషే మిద్యాను దేశంలో కాపరిగా ఉన్నప్పుడు అతడు మిద్యాను వాడు రగూయేలు కూతురును పెళ్లి చేసుకున్నాడు.
  • తరువాత రగూయేలు అంటే "యిత్రో, మిద్యాను యాజకుడు." "రగూయేలు" అనేది తన తెగ పేరు అయి ఉండవచ్చు.
  • దేవుడు మోషేతో మండే పొదలోనుండి మాట్లాడినప్పుడు అతడు యిత్రో గొర్రెలు కాస్తున్నాడు.
  • కొంత కాలం తరువాత, దేవుడు ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను రక్షించిన తరువాత యిత్రో ఇశ్రాయేలీయుల దగ్గరకు అరణ్య ప్రాంతంలోకి వచ్చి మోషేకు ప్రజలకు తీర్పుల గురించి మంచి సలహా ఇచ్చాడు.
  • దేవుడు ఇశ్రాయేలీయులకోసం ఈజిప్టులో చేసిన అద్భుతాలు విని అతడు దేవునిపై నమ్మకముంచాడు.
  • ఏశావు కుమారుల్లో ఒకడి పేరు రగూయేలు.
  • రగూయేలు అనే పేరు గల మరొక మనిషి ప్రస్తావన ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వెళ్ళిన తరువాత రాసిన వంశవృక్షం లో ఉంది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బందీ, తెగ, ఎడారి, ఈజిప్టు, ఏశావు, అద్భుతం, మోషే, ఎడారి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3503, H7467

యిర్మీయా

వాస్తవాలు:

యిర్మీయా యూదా రాజ్యంలో దేవుని ప్రవక్త. పాత నిబంధన పుస్తకం యిర్మీయాలో అతడు రాసిన ప్రవచనాలు ఉన్నాయి.

  • ఎక్కువ మంది ప్రవక్తల్లాగా యిర్మీయా తరచుగా ఇశ్రాయేలు ప్రజలతో వాదించేవాడు. దేవుడు వారి పాపాల కోసం వారిని శిక్షించబోతున్నాడని చెప్పేవాడు.
  • బబులోనీయులు యెరూషలేమును అక్రమించుకోబోతున్నారని యిర్మీయా ప్రవచించడం యూదా ప్రజలు అతనిపై కోపగించుకునేలా చేసింది. కాబట్టి వారు అతన్ని లోతైన ఎండిన బావిలో చనిపోవడం కోసం పడవేశారు. అయితే యూదా రాజు బావి నుండి యిర్మీయా రక్షించమని తన సేవకులను ఆదేశించాడు.
  • యిర్మీయా తన ప్రజల తిరుగుబాటు, హింసల నిమిత్తం తన కన్నులు "కన్నీటి చుక్కలు రాలే ఊటగా" ఉండాలని తన లోతైన విచారం వెల్లడించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను, యూదా, ప్రవక్త, తిరుగుబాటు, బాధలు పడు, బావి)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 19:17 ఒకసారి, యిర్మీయా ప్రవక్తను ఎండిన బావిలో చనిపోవడం కోసం పడవేశారు. అతడు బావి అడుగున బురదలో కూరుకుపోయాడు. అయితే తరువాత రాజు కనికరపడి యిర్మీయా చనిపోకముందే బావిలోనుండి బయటకు తీయమని తన సేవకులను ఆదేశించాడు.
  • 21:05 ప్రవక్త యిర్మీయా ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. తాను కొత్త నిబంధన ఒకటి స్థాపిస్తానని అది దేవుడు సీనాయి వద్ద ఇశ్రాయేలుతో చేసిన నిబంధన వంటిది కాదని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H3414, G2408

యూదయ

వాస్తవాలు:

"యూదయ" అనేది ప్రాచీన ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రాంతం. కొన్ని సార్లు దీన్ని ఇదమిద్ధంగానూ ఇతర సమయాల్లో సాధారణంగానూ ఉపయోగిస్తారు.

  • కొన్ని సార్లు "యూదయ" అనే ప్రాంతాన్ని ఇదమిద్ధంగా ప్రాచీన ఇశ్రాయేలులో దక్షిణాన మృత సముద్రానికి పశ్చిమాన ఉన్న పరగణాను సూచించడానికి వాడతారు. కొన్ని అనువాదాలు ఈ పరగణాను "యూదా" అని రాస్తాయి.
  • ఇతర సమయాల్లో "యూదయ" అంటే ప్రాచీన ఇశ్రాయేలు పరగణాలు అన్నీ- గలిలయ, సమరయ, పెరయ, ఇదుమియా, యూదా(యూదయ).
  • అనువాదకులు ఈ తేడాను స్పష్టం చెయ్య దలచుకుంటే యూదయ అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యూదా దేశం" "యూదా పరగణా,” లేక “యూదా ప్రదేశం" ఎందుకంటే ప్రాచీన ఇశ్రాయేలులో ఇక్కడ యూదా గోత్రికులు నివసించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:Galilee, Edom, Judah, Judah, Samaria)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G24530

యూదా

వాస్తవాలు

యూదా యాకోబుకు  నాల్గవ కుమారుడు.  అతని తల్లి లేయా.

* అతని సంతానం "యూదా గోత్రం." అని పిలవబడుతుంది.

  • హెబ్రీ భాషల్లో యూదా అనగా “ స్తుతి” అని అర్ధం.

  • యెరూషలేముకు దక్షిణాన  వున్న కొండ ప్రాంతము కలిపి కానాను  యొక్క దక్షిణ  ప్రాంతములో యూదా గోత్రము స్థిరపడింది. యూదా అనే పదం యూదాగోత్రానికి ఇవ్వబడిన ప్రదేశాన్ని సూచిస్తుంది.

  • పాత నిబంధనలో యూదా అనే పేరు దక్షిణ  రాజ్యాన్ని అంతటిని సూచిస్తుంది. ఎఫ్రాయిము అనే పేరు సాధారణంగా ఉత్తర రాజ్యాన్ని అంతటిని సూచిస్తుంది.

  • దావీదు రాజు, సొలొమోను రాజు  మరియు దక్షిణ రాజ్యము యొక్క  ఇతర యూదా రాజులంతా యూదా సంతతి వారు  యేసు కూడా యూదా సంతతి వాడు.

  • "యూదుడు” “యూదయ" అనేవి "యూదా" అనే పేరు నుండే వచ్చాయి.

(అనువాదం సలహాలు : పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఇశ్రాయేలీ పండ్రెండు గోత్రాలు, యూదా (రాజ్యము), యూదుడు, యదాయ,యాకోబు, లేయా)

బైబిల్ రిఫరెన్సులు

పదం సమాచారం

●        Strong's: H3063


యూదా ఇస్కరియోతు

వాస్తవాలు:

యూదా ఇస్కరియోతు యేసు అపోస్తలుల్లో ఒకడు. అతడు ద్రోహం చేసి యేసును యూదు నాయకులకు పట్టి ఇచ్చిన వాడు.

  • "ఇస్కరియోతు" అంటే "కెరియోతు వాడు" అని అర్థం. అంటే బహుశా అతడు ఆ పట్టణంలో పెరిగి ఉంటాడు.
  • యూదా ఇస్కరియోతు అపోస్తలుల డబ్బు వ్యవహారాలు చూసే వాడు. అనుదినం తనకోసం దొంగిలించే వాడు.
  • యూదా ద్రోహబుద్ధితో మత నాయకులకు యేసు ఎక్కడ ఉంటాడో చెప్పి వారు ఆయన్ని బంధించేలా సహాయం చేశాడు.
  • తరువాత మత నాయకులు యేసును దోషిగా తీర్చి ఆయనకు మరణ శిక్ష వేసినప్పుడు యూదా తాను చేసిన ద్రోహానికి బాధ పడి, ఆ డబ్బును యూదు నాయకులకు తిరిగి ఇచ్చివేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • యూదా అనే పేరు గల మరొక అపోస్తలుడు ఉన్నాడు. యేసు సోదరుల్లో ఒకడు యూదా. యేసు సోదరుని పేరు "యూదా."

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అపోస్తలుడు, ద్రోహం, యూదు నాయకులు, యాకోబు కుమారుడు యూదా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 38:02 యేసు శిష్యుల్లో ఒకని పేరు యూదా. తరువాత యేసు శిష్యులు యెరూషలేముకు వచ్చాక యూదా యూదు నాయకుల దగ్గరకు వెళ్లి యేసు అప్పగించడానికి డబ్బు తీసుకున్నాడు.
  • 38:03 ప్రధాన యాజకుని నాయకత్వంలో యూదు నాయకులు,యూదా కు ముఫ్ఫై వెండి నాణాలు యేసును పట్టి ఇవ్వడం కోసం చెల్లించారు.
  • 38:14 యూదా యూదు నాయకులతో పెద్ద సైనికుల గుంపుతో వచ్చాడు. వారు కత్తులు, గదలు పట్టుకుని వచ్చారు. యూదా యేసును సమీపించి, "వందనాలు బోదకా" అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు.
  • 39:08 ఈ లోగా ద్రోహి యూదా యూదు నాయకులు యేసును దోషిగా తీర్చడం చూశాడు. అతడు దుఃఖంతో నిండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.

పదం సమాచారం:

  • Strong’s: G24550, G24690

యూఫ్రటిసు నది, నది

వాస్తవాలు:

ఏదేను తోట అనుకుని ప్రవహించే నాలుగు నదుల్లో యూఫ్రటిసు ఒకటి. బైబిల్లో దీన్ని తరచుగా ప్రస్తావించారు.

  • యూఫ్రటిసు అని పేరుగల ఆధునిక నది మధ్య ప్రాచ్యంలో ఉంది. ఇది ఆసియాలో అన్నిటికన్నా పొడవైన, అత్యంత ప్రాముఖ్యమైన నది.
  • టైగ్రిస్ నదితో కలిసి యూఫ్రటిసు సరిహద్దు ప్రాంతం మెసపొటేమియా అంటారు.
  • అబ్రాహాము నివసించిన ప్రాచీన పట్టణం ఊరు యూఫ్రటిసు నది తీరాన ఉంది.
  • దేవుడు అబ్రాహాముకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి ఈ నది ఒక సరిహద్దు (ఆది 15:18).
  • కొన్ని సార్లు యూఫ్రటిసును ముక్తసరిగా “నది” అని పిలిచారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5104, H6578, G2166

యెజెబెలు

వాస్తవాలు:

యెజెబెలు ఇశ్రాయేలు రాజు ఆహాబు దుష్ట భార్య.

  • యెజెబెలు ప్రేరణతో ఆహాబు ఇశ్రాయేలుజాతినంతటినీ విగ్రహ పూజకు మళ్ళించాడు.
  • ఆమె అనేక మంది దేవుని ప్రవక్తలను చంపింది కూడా.
  • యెజెబెలు నాబోతు అనే పేరు గల నిర్దోషిని చంపించి ఆహాబు అతని ద్రాక్ష తోట స్వాధీనపరచుకునేలా చేసింది.
  • యెజెబెలు ఆమె చేసిన దుర్మార్గకార్యాల వల్ల హతం అయింది. ఏలియా ఆమె చనిపోవడం గురించి ప్రవచించాడు. అతడు చెప్పినట్టుగానే అది జరిగింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆహాబు, ఏలియా, అబద్ధ దేవుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H348, G2403

యెజ్రేయేలు, యెజ్రేయేలీయుడు

నిర్వచనం:

యెజ్రేయేలు ప్రాముఖ్యమైన ఇశ్రాయేలు పట్టణం. ఇది ఇస్సాఖారు గోత్రం భూభాగంలో మృత సముద్రానికి నైరుతీ దిక్కున ఉంది.

  • పట్టణం of యెజ్రేయేలుపట్టణం మెగిద్దో మైదానానికి పశ్చిమాన "యెజ్రేయేలు లోయ" అనే చోట ఉంది.
  • అనేక మంది ఇశ్రాయేలు రాజులు వారి అంతఃపురాలు యెజ్రేయేలులో నిర్మించుకున్నారు.
  • నాబోతు ద్రాక్ష తోట యెజ్రేయేలులో ఆహాబు అంతఃపురం దగ్గర ఉంది. ప్రవక్త ఏలియా అక్కడ ఆహాబుకు వ్యతిరేకంగా ప్రవచించాడు.
  • ఆహాబు దుష్టభార్య యెజెబెలు యెజ్రేయేలులో హతం అయింది.
  • అనేక ఇతర ముఖ్యమైన సంఘటనలు, యుద్ధాలు ఈ పట్టణంలో సంభవించాయి.

(చూడండి: ఆహాబు, ఏలియా, ఇస్సాఖారు, యెజెబెలు, అంతఃపురం, ఉప్పు సముద్రం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3157, H3158, H3159

యెఫ్తా

వాస్తవాలు:

యెఫ్తా గిలాదు ప్రాంతానికి చెందిన యోధుడు.ఇశ్రాయేల్ న్యాయాధిపతి.

  • హెబ్రీ 11:32లో యెఫ్తాను తన ప్రజలను వారి శత్రువులనుండి విమోచించిన ఒక ప్రాముఖ్య నాయకుడుగా పొగడడం కనిపిస్తుంది.
  • అతడు ఇశ్రాయేలీయులను అమ్మోనీయుల నుండి విడిపించాడు. ఎఫ్రాయిమీయులను ఓడించేలా తన ప్రజలను నడిపించాడు.
  • అయితే యెఫ్తా మూర్ఖత్వంతో తొందరపాటుగా దేవుని పేర ఒట్టు పెట్టుకున్నాడు. అందువల్ల తన కూతురును బలి అర్పణచేయవలసి వచ్చింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అమ్మోను, విమోచించు, ఎఫ్రాయిము, న్యాయాధిపతి, ఒట్టు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3316

యెబూసు, యెబూసీయుడు, యెబూసీయులు

వాస్తవాలు:

యెబూసీయులు కనాను ప్రదేశంలో నివసించిన జాతి. వారు హాము కుమారుడు కనాను సంతతి.

  • యెబూసీయులు నివసించారు యెబూసు పట్టణంలో నివసించారు. దీన్ని దావీదు రాజు ఆక్రమించుకున్న తరువాత యెరూషలేముగా మార్చారు.
  • మెల్కీసెదెకు షాలేము రాజు, ఇతడు బహుశా యెబూసీయుడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కనాను, హాము, యెరూషలేము, మెల్కీసెదెకు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2982, H2983

యెరికో

వాస్తవాలు:

యెరికో కనాను ప్రదేశంలో ఉన్న ఒక శక్తివంతమైన పట్టణం. అది యోర్దాను నదికి పశ్చిమాన ఉప్పు సముద్రానికి ఉత్తరాన ఉంది.

  • కనానీయులంతా చేసినట్టే యెరికో వారు అబద్ద దేవుళ్ళను ఆరాధించే వారు.
  • యెరికో కనాను ప్రదేశంలో ఇశ్రాయేలీయులు ఆక్రమించుకోవలసిన మొదటి పట్టణంఅని దేవుడు చెప్పాడు.
  • యెహోషువా ఇశ్రాయేలీయులలను యెరికో మీదికి నడిపించినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేసి వారు ఆ పట్టణంపై గెలుపొందేలా చేశాడు.

(చూడండి:Canaan, Jordan River, Joshua, miracle, Salt Sea)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 15:01 యెహోషువా ఇద్దరు గూఢచారులను కనానీయ పట్టణం యెరికో కు పంపాడు.
  • 15:03 తరువాత ప్రజలు యోర్దాను నది దాటారు, దేవుడు యెహోషువాకు ఆ శక్తివంతమైన పట్టణం యెరికో పై దాడి చేయమని చెప్పాడు.
  • 15:05 తరువాత యెరికో చుట్టూ ఉన్న గోడలుకూలాయి. దేవుడు అజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు పట్టణంలో ప్రతిదాన్నీ నాశనం చేశారు.

పదం సమాచారం:

  • Strong’s: H3405, G24100

యెరూషలేము

వాస్తవాలు:

యెరూషలేము మొదట ప్రాచీన కనానీయ పట్టణం. తరువాత ఇశ్రాయేలులో అత్యంత ప్రాముఖ్యమైన పట్టణం అయింది. ఇది ఉప్పు సముద్రానికి 34 కిలో మీటర్ల పశ్చిమాన బెత్లెహేముకు ఉత్తరంగా ఉంది. ఇది ఈనాటికీ ఇశ్రాయేలు ముఖ్య పట్టణం.

  • "యెరూషలేము" మొదటి ప్రస్తావించినది యెహోషువా గ్రంథంలో. ఈ నగరానికి ఉన్న ఇతర పాత నిబంధన పేర్లు "షాలేము" " యెబూసు పట్టణం,” “సియోను." "యెరూషలేము” “షాలేము," అంటే మూల అర్థం "శాంతి."
  • యెరూషలేము మొదట యెబూసీయుల కోట. దీన్ని దావీదు ఓడించి "సియోను" అని పేరు పెట్టి తన ముఖ్య పట్టణంగా చేసుకున్నాడు.
  • యెరూషలేములో దావీదు కుమారుడు సొలోమోను మొదటి ఆలయం మోరియా కొండపై నిర్మించాడు. ఇది అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును దేవునికి అర్పించిన స్థలం. అక్కడ కట్టిన ఆలయాన్ని తరువాత బబులోనీయులు నాశనం చేశారు.
  • ఆలయం యెరూషలేములో ఉంది గనక ముఖ్య యూదు పండుగలు అక్కడ జరిగేవి.
  • ప్రజలు సాధారణంగా యెరూషలేముకు “ఎక్కి వెళ్ళేవారు.” ఎందుకంటే అది కొండల్లో ఉంది.

(చూడండి:Babylon, Christ, David, Jebusites, Jesus, Solomon, temple, Zion)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 17:05 దావీదు యెరూషలేము ఆక్రమించుకుని దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు.
  • 18:02 యెరూషలేములో, సొలోమోను ఆలయం నిర్మించాడు. తన తండ్రి దావీదు పథకం రచించి సరంజామా సమకూర్చాడు.
  • 20:07 వారు (బబులోనీయులు) యెరూషలేము పట్టుకుని నాశనం చేశారు. పట్టణంలో, ఆలయంలో ఉన్న విలువైన వస్తువులను తీసుకు పోయారు.
  • 20:12 70 సంవత్సరాలు ప్రవాసం తరువాత, చిన్న బృందం యూదులు యూదాలో యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్లారు.
  • 38:01 యేసు మొదటగా బహిరంగంగా ప్రకటించడం బోధించడం ఆరంభించిన మూడు సంవత్సరాల తరువాత యేసు తన శిష్యులకు తాను పస్కాను వారితో యెరూషలేము లో జరుపుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అక్కడ అయన హతం కాబోతున్నాడు.
  • 38:02 తరువాత యేసు శిష్యులు యెరూషలేముకి వచ్చారు. యూదా యూదు నాయకుల వద్దకు వెళ్లి డబ్బు ఇస్తే యేసు పట్టిస్తానని చెప్పాడు.
  • 42:08 "లేఖనాల్లో రాసి ఉంది. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడి వారి పాపాలకు క్షమాపణ పొందాలని నా శిష్యులు ప్రకటిస్తారు.” వారు యెరూషలేములో మొదలు పెట్టి తరువాత అన్ని చోట్లా ప్రజలు సమూహాలకు ప్రకటిస్తారు."
  • 42:11 చనిపోయి లేచాక నలభై రోజుల పాటు యేసు తన శిష్యులతో చెప్పాడు, "యెరూషలేములో మీమీదికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చేదాకా ఉండండి."

పదం సమాచారం:

  • Strong’s: H3389, H3390, G24140, G24150, G24190

యెషయా

వాస్తవాలు:

యెషయా దేవుని ప్రవక్త. అతడు యూదాను ఏలిన నలుగురు రాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో ప్రవచించాడు.

  • ఆష్శూరీయులు యెరూషలేము పట్టణంపై హిజ్కియా పరిపాలనప్పుడు దాడి చేసిన సమయంలో అతడు నివసించాడు.

  • పాత నిబంధన పుస్తకం యెషయా పరిశుద్ధ గ్రంథంలోని ముఖ్య గ్రంథాల్లో ఒకటి.

  • యెషయా రాసిన అనేక ప్రవచనాలు అతడు జీవించి ఉన్నప్పుడే నెరవేరాయి.

  • యెషయా ముఖ్యంగా మెస్సీయగురించి రాసినవచనాలు700 సంవత్సరాల తరువాత యేసు ఈ భూమిపై నివసించిన కాలంలో నెరవేరాయి.

  • యేసు, అయన శిష్యులు మెస్సీయ గురించి బోధించడానికి యెషయా ప్రవచనాలు ఉపయోగించుకున్నారు.

(తర్జుమా సలహాలు: పేర్లనుఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: ఆహాజు, అస్సిరియా, క్రీస్తు, హిజ్కియా, యోతాము, యూదా, ప్రవక్త, ఉజ్జియా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

బైబిల్ నుండి రిఫరెన్సులు:

  • __21:9__ప్రవక్త యెషయా మెస్సీయ కన్యకు జన్మిస్తాడనిప్రవచించాడు.

  • __21:10__మెస్సీయగలిలయలో నివసిస్తాడని, గుండెపగిలిన వారిని ఆదరిస్తాడని, బందీలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తాడనిప్రవక్త యెషయా చెప్పాడు.

  • __21:11__మెస్సీయనునిష్కారణంగా ద్వేషిస్తారని,తిరస్కరిస్తారని కూడా ప్రవక్త యెషయా ప్రవచించాడు.

  • __21:12__మనుష్యులుమెస్సీయను కొట్టి ఆయనపై ఉమ్మి వేసి హింసిస్తారని యెషయాప్రవచించాడు

  • __26:2__వారు అయన దానిలోనిది చదవాలని ఆయన(యేసు)కు ప్రవక్తయెషయా పుస్తకపు చుట్ట అందించారు.యేసు పుస్తకం చుట్ట తెరిచి కొంత భాగం ప్రజలకు చదివి వినిపించాడు.

  • __45:8__ఫిలిప్పు ఇతియోపీయుని రథాన్ని సమీపించి ప్రవక్తయెషయా రాసిన పుస్తకం లోనిది చదవడం విన్నాడు.

  • __45:10__ఫిలిప్పు ఆ ఇతియోపీయునికి యెషయా అక్కడ రాసినదియేసును గురించి అని వివరించాడు.

పదం సమాచారం:

  • Strong's: H3470, G22680

యెష్షయి

వాస్తవాలు:

యెష్షయి దావీదు రాజు తండ్రి, రూతు, బోయజుల మనవడు.

  • యెష్షయి యూదా గోత్రం వాడు.
  • అతడు "ఎఫ్రాతీయుడు," అంటే ఎఫ్రాతా (బెత్లెహేము) ఊరి వాడు.
  • ప్రవక్త యెషయా "చిగురు” లేక “కొమ్మ" "యెష్షయి వేరు నుండి" మొలకెత్తుతుందని, ఫలిస్తుందని ప్రవచించాడు. ఇది యెష్షయి సంతతి వాడు యేసును సూచిస్తున్నది.

(అనువాదం సూచనలు: [పేర్లు అనువదించడం ఎలా]) How to Translate Names)

(చూడండి: Bethlehem, Boaz, descendant, Jesus, king, prophet, Ruth, twelve tribes of Israel)

బైబిల్ రిఫరెన్సులు:

  • [1 దిన 02:9-12]
  • [1 రాజులు 12:16-17]
  • [లూకా 03:30-32]
  • [మత్తయి 01:4-6]

పదం సమాచారం:

  • Strong's: H3448, G2421

యెహూ

వాస్తవాలు:

యెహూ అనే పేరు పాత నిబంధనలో ఇద్దరికి ఉంది.

  • హనాని కుమారుడు యెహూ ప్రవక్త ఇశ్రాయేలు రాజు ఆహాబు, యూదా రాజు యెహోషాపాతు కాలంలో ప్రవచించాడు.
  • యెహోషాపాతు కుమారుడు (లేక సంతతి వాడు) యెహు ఇశ్రాయేలు సైన్యంలో అధికారి. ప్రవక్త ఎలీషా ఇతన్ని రాజుగా అభిషేకించాడు.
  • రాజు యెహూ ఇద్దరు దుష్టరాజులను ఇశ్రాయేలురాజు యెహోరామును యూదా రాజు అహజ్యాను సంహరించాడు.
  • యెహూ ఆహాబు రాజు, అతని దుష్టరాణి యెజెబెలు బంధువులను మట్టుబెట్టాడు.
  • రాజు యెహూ సమరయ బయలు ఆరాధన స్థలాలను నాశనం చేశాడు. బయలు ప్రవక్తలను చంపాడు.
  • యెహూ రాజు నిజ దేవుడు యెహోవాను సేవించాడు. అతడు ఇశ్రాయేలుపై ఇరవై-ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆహాబు, అహజ్యా, బయలు, ఎలీషా, యెహోషాపాతు , యెహూ, యెజెబెలు, యెహోరాము, యూదా, సమరయ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3058

యెహెజ్కేలు

వాస్తవాలు:

యెహెజ్కేలు దేవుని ప్రవక్త. యూదులు బబులోను ప్రవాసంలో ఉన్న కాలంలో ప్రవచించాడు.

  • యెహెజ్కేలు యాజకుడు. యూదా రాజ్యంలో నివసిస్తుండగా అతణ్ణి, అనేకమంది ఇతర యూదులను బాబిలోనియా సైన్యం చెర పట్టారు.
  • ఇరవై సంవత్సరాలకు పైగా అతడు అతని భార్య బబులోనులో నది దగ్గర నివసించారు. యూదులు వచ్చి అతడు మాట్లాడే దేవుని సందేశాలు వినే వారు.
  • యెహెజ్కేలు యెరూషలేము, ఆలయం నాశనం గురించి, పూర్వ క్షేమ స్థితి కలగడం గురించి ప్రవచించాడు.
  • అతడు మెస్సియా భవిషత్తు రాజ్యం గురించి కూడా ప్రవచించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను, క్రీస్తు, ప్రవాసం, ప్రవక్త)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3168

యెహోయాకీను

వాస్తవాలు:

యెహోయాకీను యూదా రాజ్యం పరిపాలించిన రాజు.

  • యెహోయాకీను 18 సంవత్సరాలు వయసులో రాజయ్యాడు. అతడు మూడు నెలలు మాత్రం పరిపాలన చేశాడు. తరువాత బాబిలోనియా సైన్యం అతణ్ణి పట్టుకుని బబులోనుకు తీసుకుపోయారు.
  • తన కొంచెం పరిపాలన కాలంలో యెహోయాకీను తన తాత మనష్షె రాజు తన తండ్రి రాజు యెహోయాకీము చేసిన దుష్టకార్యాలు చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను, యెహోయాకీము, యూదా, మనష్శే)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3078, H3112, H3204, H3659

యెహోయాకీము

వాస్తవాలు:

యెహోయాకీము యూదా రాజ్యాన్ని క్రీ. పూ. 608 ప్రాంతంలో పరిపాలించిన దుష్టరాజు. అతడు రాజు రాజు కుమారుడు. మొదట అతని పేరు ఎల్యాకీము.

  • ఐగుప్తియుడు ఫరో నెకో ఎల్యాకీము పేరు యెహోయాకీముగా మార్చి అతణ్ణి యూదాకు రాజుగా చేశాడు.
  • నెకో యెహోయాకీముచేత ఈజిప్టుకు బలవంతంగా కష్టమైన పన్నులు కట్టించాడు.
  • యూదాపై ఆ తరువాత నెబుకద్నేజర్ దండెత్తినప్పుడు యెహోయాకీమును బంధించి బబులోనుకు తీసుకుపోయారు.
  • యెహోయాకీము యూదాను యెహోవానుండి దూరం చేసిన దుష్టరాజు. యిర్మీయా ప్రవక్త అతనికి వ్యతిరేకంగా ప్రవచించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: బబులోను, ఎల్యాకీము, యిర్మీయా, యూదా, నెబుకద్నేజర్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3079

యెహోయాదా

వాస్తవాలు:

యెహోయాదా యాజకుడు. అహజ్యా కుమారుడు యోవాషును రాజుగా ప్రకటించే వయసు వచ్చే వరకు అతణ్ణి దాచి పెట్టడానికి సహాయం చేసాడు.

  • యెహోయాదా వందల కొద్దీ అంగ రక్షకులను ఏర్పాటు చేసి బాల యోవాషును ఆలయంలో ప్రజల ఎదుట రాజుగా ప్రకటించారు.
  • యెహోయాదా ప్రజలను అబద్ధ దేవుడు బయలు బలిపీఠాలను తీసివేసేలా చేశాడు.
  • తన జీవితం మిగిలిన భాగమంతా యెహోయాదా యాజకుడు యోవాషు రాజు దేవునికి లోబడి ప్రజలను జ్ఞానంతో పరిపాలన చేసేలా సహాయం చేశాడు.
  • ఈ పేరు గల మరొక మనిషి పేరు బెనాయా తండ్రి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అహజ్యా, బయలు, బెనాయా, యోవాషు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3077, H3111

యెహోరాము

వాస్తవాలు:

యెహోరాము ఇశ్రాయేలు రాజు ఆహాబు కుమారుడు. కొన్ని సార్లు యోరాము అని కూడా రాస్తారు.

  • యూదా రాజు యెహోరాము యూదాను పాలించిన కాలంలోనే యెహోరాము రాజు ఇశ్రాయేలు పై పరిపాలనచేశాడు.
  • యెహోరాము దుష్టరాజు. అతడు అబద్ధ దేవుళ్ళను పూజించి ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణం అయ్యాడు.
  • ఇశ్రాయేలు రాజు యెహోరాము పరిపాలన కాలంలో ప్రవక్తలు ఏలియా ఓబద్యా జీవించారు.
  • యెహోరాము అనే పేరుగల మరొక మనిషి దావీదు రాజుగా ఉన్నప్పుడు హమాతును పాలించిన తౌ కుమారుడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆహాబు, దావీదు, ఏలియా, హమాతు, యెహోరాము, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా, ఓబద్యా, ప్రవక్త)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3088, H3141, G2496

యెహోరాము, యెహోరాము

వాస్తవాలు:

"యెహోరాము" పేరుతో పాత నిబంధనలో ఇద్దరు రాజులు ఉన్నారు. ఇద్దరు "యెహోరాము" లు.

  • ఒక యెహోరాము యూదా రాజ్యంపై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు కుమారుడు యెహోషాపాతు రాజు. ఇతన్ని సాధారణంగా యెహోరాము అని పిలిచారు.
  • మరొక రాజు యెహోరాము ఇశ్రాయేల్ రాజ్యంపై పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు కుమారుడు ఆహాబు రాజు.
  • యెహోరాము రాజు యిర్మీయా, దానియేలు, ఓబద్యా, యెహెజ్కేలు ప్రవచిస్తున్న కాలంలో యూదాను పరిపాలించాడు.
  • యెహోరాము రాజు తన తండ్రి యెహోషాపాతు పరిపాలన చేసిన సమయం లో జంటగా కొంత కాలం పాలించాడు.
  • కొన్ని ఇంగ్లీషు అనువాదాలు నిలకడగా "యెహోరాము" అనే పేరును ఉపయోగించాయి. ఇశ్రాయేలు రాజు పేరు కూడా "యెహోరాము."
  • ఈ ఇద్దరి మధ్యా తేడా చెప్పడానికి మరొక మార్గం వారి తండ్రి పేర్లు చెప్పడం.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆహాబు, యెహోషాపాతు, యెహోరాము, యూదా, ఇశ్రాయేల్ రాజ్యం, ఓబద్యా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3088, H3141, G2496

యెహోషాపాతు

వాస్తవాలు:

యెహోషాపాతు అనేది పాత నిబంధనలో కనీసం ఇద్దరు మనుషుల పేరు.

  • బాగా తెలిసిన వాడు యెహోషాపాతు రాజు. యూదా రాజ్యంపై పరిపాలించిన నాలుగవ రాజు.
  • అతడు యూదా ఇశ్రాయేలు రాజ్యాల మధ్య శాంతి నెలకొల్పాడు. అబద్ద దేవుళ్ళ బలిపీఠాలు ధ్వంసం చేశాడు.
  • మరొక యెహోషాపాతు దావీదు, సొలోమోను ఆస్థానంలో లేఖికుడు. అంటే రాజు సూచనల మేరకురాజ్యంలో జరుగుతున్న ప్రాముఖ్య సంఘటనల చరిత్ర రాసి పెట్టడం.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బలిపీఠం, దావీదు, అబద్ధ దేవుడు, ఇశ్రాయేలు, యూదా, యాజకుడు, సొలోమోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3092, H3146, G2498

యెహోషువా

వాస్తవాలు:

బైబిల్లో అనేకమంది ఇశ్రాయేలు మనుషుల పేరు యెహోషువా. వీరిలో ప్రఖ్యాత వ్యక్తి నూను కుమారుడు యెహోషువా. ఇతడు మోషే సహాయకుడు. మోషే తరువాత దేవుని ప్రజల ప్రముఖ నాయకుడు అయ్యాడు.

  • యెహోషువా మోషే వాగ్దాన దేశంలోకి పంపిన పన్నెండు మంది గూఢచారుల్లో ఒకడు.
  • కాలేబుతో కలిసి యెహోషువా ఇశ్రాయేలు ప్రజలను దేవుని ఆజ్ఞకు లోబడి వాగ్దాన దేశంలో ప్రవేశించి కనానీయులను ఓడించమని ప్రోత్సహించాడు.
  • అనేక సంవత్సరాలు తరువాత, మోషే చనిపోయాక, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించడానికి నియమించిన నాయకుడు యెహోషువా.
  • కనానీయులపై మొదటి అత్యంత ప్రఖ్యాతిగాంచిన సమరంలో యెహోషువా ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి యెరికోను ఓడించాడు.
  • పాత నిబంధన పుస్తకం యెహోషువాలో యెహోషువా ఏవిధంగా ఇశ్రాయేలీయులను నడిపించి వాగ్దాన దేశం స్వాధీనం చేసుకుని ప్రతి గోత్రానికి భూభాగం కేటాయించిన విషయం రాసి ఉంది.
  • యోజాదాకు కుమారుడు యెహోషువా హగ్గయి, జెకర్యా గ్రంథాల్లో కనిపిస్తాడు; అతడు ప్రధాన యాజకుడు. యెరూషలేము గోడల నిర్మాణంలో సహాయం చేశాడు.
  • యెహోషువా అనే పేరు గల అనేక ఇతర వ్యక్తులను బైబిల్ వంశ వృక్షాలలో మనం చూడగలం.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కనాను, హగ్గయి, యెరికో, మోషే, వాగ్దాన దేశం, [జెకర్యా )

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 14:04 ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దులు చేరినప్పుడు మోషే పన్నెండుమంది మనుషులను ఒక గోత్రం నుండి ఒకరు చొప్పున ఎన్నుకున్నాడు. అతడు వారికి ఆ దేశం ఎలాటిదో వేగు చూడమని సూచనలు ఇచ్చాడు.
  • 14:06 తక్షణమే కాలేబు యెహోషువా, ఈ ఇద్దరు గూఢచారులు, "కనాను వారు నిజంగానే పొడవైన బలమైన ప్రజలు, అయితే మనం తప్పనిసరిగా వారిని ఓడించగలం!"
  • 14:08 యెహోషువా కాలేబు, తప్ప ప్రతి ఒక్కరూ ఇరవై సంవత్సరాలకు వయసు పై బడిన వారంతా చనిపోయి వాగ్దాన దేశంలోకి ప్రవేశించరు."
  • 14:14 మోషే ఇప్పుడు చాలా వృద్దుడయ్యాడు. కాబట్టి దేవుడు తన ప్రజలకు సహాయం చెయ్యడానికి యెహోషువా ను ఎన్నుకొన్నాడు.
  • 14:15 యెహోషువా మంచి నాయకుడు. ఎందుకంటే అతడు దేవునిపై నమ్మకముంచి ఆయనకు లోబడ్డాడు.
  • 15:03 తరువాత ప్రజలు యోర్దాను నది దాటి శక్తివంతమైన యెరికో పట్టణంపై దాడి చేయాలని దేవుడు యెహోషువా కు చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H3091, G2424

యేసు తల్లి, మరియ

వాస్తవాలు:

నజరేతు పట్టణంలో యవనస్తురాలైన మరియ నివసిస్తుంది, ఆమె యోసేపు అను పురుషునికి వివాహం కోసం ప్రధానం చెయ్యబడింది. దేవుని కుమారుడు, మెస్సీయ యేసుకు తల్లిగా దేవుడు మరియను యెంచుకొన్నాడు.

  • మరియ కన్యకగా ఉన్నప్పడు ఆశ్చర్యకరంగా గర్భం దాల్చేలా పరిశుద్ధాత్ముడు చేసాడు.
  • పుట్టబోవు శిశువు దేవుని కుమారుడు, ఆయన పేరు యేసు అని దూత మరియతో చెప్పాడు.
  • దేవుడు తన పట్ల కరుణ చూపిన దేవుణ్ణి ప్రేమించింది, ఆయనను స్తుతించింది.
  • యోసేపు మరియను వివాహం చేసుకొన్నాడు, శిశువు పుట్టేంతవరకూ ఆమె కన్యకగానే ఉంది.
  • గొర్రెలకాపరులూ, జ్ఞానులూ బాలుడైన యేసును గురించి చెప్పిన ఆశ్చర్యకరమైన సంగతులను గురించి మరియ లోతుగా ఆలోచించింది.
  • యోసేపు, మరియలు బాలుడైన యేసును దేవాలయంలో ప్రతిష్ట చెయ్యడానికి తీసుకొనివెళ్ళారు. తరువాత హేరోదు శిశువును చంపాలని చేసిన పన్నాగాన్ని తప్పించుకోడానికి వారు ఆయనను ఐగుప్తుకు తీసుకొనివెళ్ళారు. క్రమంగా వారు నజరేతుకు తిరిగి వచ్చారు.
  • యేసు పెద్దవాడైనప్పుడు, కానాను పెండ్లిలో యేసు నీళ్ళను ద్రాక్షారాసంగా మార్చినప్పుడు మరియ యేసుతో ఉంది.
  • యేసు సిలువమీద ప్రాణం విడుస్తున్నప్పుడు మరియ యేసుతో ఉందని సువార్తలు కూడా చెప్పాయి. తన తల్లిని సొంత తల్లిలా చూసుకోవాలని శిష్యుడైన యోహానుకు యేసు చెప్పాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: Cana, Egypt, Herod the Great, Jesus, Joseph (NT), Son of God, virgin)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:

  • 22:04 ఎలీసెబెతు ఆరునెలల గర్భంతో ఉన్నప్పుడు, అదే దూత ఎలీసెబెతు బంధువుకు కనిపించాడు, ఆమె మరియ. ఆమె కన్యక, యోసేపు అను పురుషుడిని వివాహం చేసుకోడానికి ప్రధానం అయ్యింది. “నీవు గర్భం ధరించి కుమారుడిని కని, ఆయనకు యేసు అను పేరు పెడతావు, ఆయన మెస్సీయ అవుతాడు,” అని దూత మరియతో చెప్పాడు.
  • 22:05”పరిశుద్దాత్మ నీ మీదకు వస్తాడు, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొంతుంది” అని దూత వివరించాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” మరియ విశ్వసించింది, దేవదూత చెప్పినదానిని అంగీకరించింది.
  • 22:06 దేవదూత మరియ తో మాట్లాడినవెంటనే మరియ ఎలీసెబెతు వద్దకు వెళ్లింది. ఎలీసెబెతు మరియ శుభవచనము వినగానే తన గర్భంలోని శిశువు ఆనందంతో ఆమెలో గంతులు వేశాడు.
  • 23:02”యోసేపూ నీ భార్యయైన మరియ ను చేర్చుకొనుటకు భయపడకు” అని దూత యోసేపుతో చెప్పాడు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.”
  • 23:04 యోసేపు, మరియ లు నజరేతులో తాము నివశిస్తున్న స్థలంనుండి బెత్లెహేము వరకూ పెద్ద ప్రయాణం చెయ్యాల్సివచ్చింది ఎందుకంటే వారి పితరుడు దావీదు ఊరు బెత్లెహేము.
  • 49:01 దేవదూత మరియ అనే కన్యకకు ఆమె దేవుని కుమారునికి జన్మనిస్తుందని చెప్పాడు. కనుక ఆమె ఇంకా కన్యకగా ఉండగానే, ఆమె ఒక కుమారుని కని, ఆయనకు యేసు అనే పేరు పెట్టింది.

పదం సమాచారం:

  • Strong’s: G31370

యొప్పే

వాస్తవాలు:

బైబిల్ కాలాల్లో, యొప్పే పట్టణం of ప్రాముఖ్యమైన వాణిజ్య ఓడరేవు. ఇది మధ్యదరా సముద్రం దగ్గర, షారోను మైదానం దక్షిణదిశగా ఉంది.

  • ప్రాచీన యొప్పే నేటి జాఫా పట్టణం దగ్గర ఉండేది. ఇప్పుడు అది టెల్ అవీవ్ పట్టణంలో భాగం.
  • పాత నిబంధనలో, యొప్పే పట్టణం దగ్గరే యోనా తర్శీషుకు పోవడానికి ఓడ ఎక్కాడు.
  • కొత్త నిబంధనలో, తబిత అనే పేరుగల క్రైస్తవ స్త్రీ చనిపోయాక యొప్పేలో పేతురు ఆమెను తిరిగి బ్రతికించాడు.

(అనువాదం సలహాలు: [పేర్లు అనువదించడం ఎలా]) How to Translate Names)

(చూడండి: the sea, Jerusalem, Sharon, Tarshish)

బైబిల్ రిఫరెన్సులు:

  • [అపో. కా. 09:36-37]
  • [అపో. కా. 10:7-8]
  • [అపో. కా. 11:4-6]
  • [అపో. కా. 11:11-14]
  • [యోనా 01:1-3]

పదం సమాచారం:

  • Strong's: H3305, G2445

యోతాము

నిర్వచనం:

పాత నిబంధనలో, యోతాము అనే పేరు గల ముగ్గురు ఉన్నారు.

  • ఒకడు గిద్యోను కనిష్ట కుమారుడు. తన సోదరులు అందరినీ హతం చేసిన తన అన్న అబీమెలెకును ఓడించడానికి యోతాము సహాయం చేశాడు.
  • యోతాము అనే పేరు గల మరొక మనిషి తన తండ్రి ఉజ్జియా (అజర్యా) మరణం తరువాత యూదాను పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.
  • తన తండ్రి లాగానే యోతాము దేవునికి లోబడిన మంచి రాజు.
  • అయితే, విగ్రహ పూజా స్థలాలను తీసివేయక పోవడం వలన అతడు యూదా ప్రజలు దేవుని వైపుకు తిరగకుండా చేశాడు.
  • యోతాము మత్తయిలో రాసిన యేసు క్రీస్తు వంశవృక్షం లో ఉన్నాడు.

(చూడండి: అబీమెలెకు, ఆహాజు, గిద్యోను, ఉజ్జియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3147

యోనా

నిర్వచనం:

యోనా పాత నిబంధనలో హీబ్రూ ప్రవక్త.

  • యోనా గ్రంథం దేవుడు యోనాను నీనెవే ప్రజలను హెచ్చరించదానికి పంపినప్పుడు జరిగిన విషయాలను వివరిస్తున్నది.
  • యోనా నీనెవే వెళ్ళడానికి నిరాకరించారు. దానికి బదులు ఓడ ఎక్కి తర్శీషుకు ప్రయాణం అయ్యాడు.
  • దేవుడు గొప్ప తుఫాను పంపి ఆ ఓడను తలకిందులు చేశాడు.
  • అతడు ఓడలోని మనుషులతో తాను దేవుని నుండి పారిపోతున్నట్టు చెప్పాడు. వారు తనను సముద్రంలో పడవేయాలని చెప్పాడు. వారు అలా చేసినప్పుడు తుఫాను ఆగింది.
  • యోనాను పెద్ద చేప మింగింది. అతడు చేప పొట్టలో మూడు పగళ్ళు రాత్రుళ్ళు ఉండిపోయాడు.
  • తరువాత, యోనా నీనెవేలో ప్రజలు వారి పాపాలనుండి మళ్ళుకోవాలని ప్రకటించాడు. మరియు మనుష్యులు ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం నిలిపి వేశారు.
  • నీనెవేను నాశనం చెయ్యని కారణంగా యోనా చాలా కోపగించుకొన్నాడు, మరియు దేవుడు యోనాకు కరుణ గురించి ఒక పాఠాన్ని చెప్పడానికి ఒక మొక్కను మరియు ఒక పురుగును వినియోగించాడు.

(అనువాదం సలహాలు: [పేర్లు అనువదించడం ఎలా]) How to Translate Names)

(చూడండి: [అవిధేయత] disobey, Nineveh, turn)

బైబిల్ రిఫరెన్సులు:

  • [యోనా 01:1-3]
  • [లూకా 11:29-30]
  • [మత్తయి 12:38-40]
  • [మత్తయి 16:3-4]

పదం సమాచారం:

  • Strong's: H3124, G2495

యోనాతాను

వాస్తవాలు:

యోనాతాను పేరు కనీసం పదిమంది పాత నిబంధనలో మనుషులకు ఉంది. ఈ పేరుకు అర్థం "యెహోవా ఇచ్చాడు."

  • దావీదు ప్రాణ స్నేహితుడు యోనాతాను, బైబిల్ లో ప్రఖ్యాత వ్యక్తి. యోనాతాను సౌలు రాజు పెద్ద కుమారుడు.
  • పాత నిబంధనలో ప్రస్తావించినది ఇతర యోనాతానులు మోషే సంతతి వాడు; దావీదు రాజు మేనల్లుడు; అనేకమంది యాజకులు, వారిలో అబ్యాతారు కుమారుడు ఉన్నాడు; ప్రవక్త యిర్మీయాను బంధించిన ఇల్లు యజమాని, పాత నిబంధన శాస్త్రి.

(చూడండి: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్యాతారు, దావీదు, మోషే, యిర్మీయా, యాజకుడు, [సౌలు , శాస్త్రి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3083, H3129

యోబు

వాస్తవాలు:

బైబిల్లో దేవుని దృష్టిలో నిర్దోషమైన న్యాయవంతుడైన మనిషిగా వర్ణించబడిన మనిషి యోబు. అతడు భయంకర హింసల్లోదేవునిపై తన విశ్వాసం నిలబెట్టుకున్న వాడుగా ప్రసిద్ధుడు.

  • యోబు ఊజు దేశంలో నివసించాడు. కనాను ప్రదేశం తూర్పున బహుశా ఎదోమీయుల ప్రాంతంలో ఉంది.
  • అతడు కాలంలో ఏశావు, యాకోబుల కాలంలో నివసించాడు అంటారు. ఎందుకంటే యోబు స్నేహితుల్లో ఒకడు "తేమానీయుడు." ఇది ఏశావు మనవడి నుండి వచ్చిన ప్రజలు సమూహం పేరు.
  • పాత నిబంధన పుస్తకం యోబు ఈ విధంగా యోబు, ఇతరులు బాధల విషయంలో ఎలా స్పందించారో తెలుపుతున్నది. ఈ గ్రంథం సార్వ భౌమ సృష్టికర్తగా విశ్వనాథునిగా దేవుని మనస్సు తెలియజేస్తున్నది.
  • అన్ని విపత్తుల తరువాత దేవుడు ఎట్టకేలకు యోబును స్వస్థపరిచాడు. అతనికి మరింతమంది పిల్లలను, సంపదను ఇచ్చాడు.
  • యోబు గ్రంథం అతడు చాలా వృద్ధాప్యంలో చనిపోయాడు అని చెబుతున్నది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: Abraham, Esau, flood, JacobNoah, people group)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H347, H3102, G2492

యోర్దాను నది, యోర్దాను

వాస్తవాలు:

యోర్దాను నది ఉత్తరం దక్షిణానికి కనాను తూర్పు సరిహద్దులో ప్రవహించింది.

  • ఈనాడు యోర్దాను నది ఇశ్రాయేలును పశ్చిమం నుండి తూర్పున జోర్డాన్ దేశాన్ని వేరు చేస్తున్నది.
  • యోర్దాను నది గలిలీ సరస్సు గుండా ప్రవహించి మృత సముద్రంలోకి పడుతుంది.
  • యెహోషువా ఇశ్రాయేలీయులను కనానులోకి నడిపించినప్పుడు వారు యోర్దాను నది దాటారు. సాధారణంగా ఇది దాటడానికి లోతుగా ఉంటుంది. అయితే దేవుడు అద్భుతమైనరీతిలో నదిని ఆపి వారు నదిలోగుండా నడిచి పోయేలా చేశాడు.
  • తరచుగా బైబిల్లో యోర్దాను నదిని "యోర్దాను" అన్నారు.

(చూడండి:Canaan, Salt Sea, Sea of Galilee)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 15:02 ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించారు.
  • 15:03 తరువాత ప్రజలు యోర్దాను నది దాటి శక్తివంతమైన యెరికోపై దాడి చేయాలని దేవుడు యెహోషువతో చెప్పాడు
  • 19:14 ఎలీషా అతనితో (నయమాను) ఏడు సార్లు యోర్దాను నది లో మునగాలని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong’s: H3383, G24460

యోవాబు

నిర్వచనం:

దావీదు మొత్తం పరిపాలన కాలంలో యోవాబు చాలా ప్రాముఖ్యమైన సేనా నాయకుడు.

  • దావీదు రాజు కాక ముందే యోవాబు అతనికి స్వామిభక్తి గల అనుచరుడు.
  • తరువాత, ఇశ్రాయేలుపై దావీదు పరిపాలన కాలంలో యోవాబు దావీదు రాజు సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు.
  • యోవాబు దావీదు రాజు అక్క కొడుకు. ఎందుకంటే తన తల్లి దావీదు సోదరి.
  • దావీదు కుమారుడు అబ్షాలోము ద్రోహం చేసి అతని రాజ్యం కాజేయాలని చూసినప్పుడు యోవాబు అబ్షాలోమును చంపి రాజును కాపాడాడు.
  • యోవాబు చాలా తీవ్రావేశం గల యోధుడు. ఇశ్రాయేలు శత్రువులు అనేక మందిని చంపాడు.

(చూడండి: అబ్షాలోము, దావీదు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3097

యోవాషు

వాస్తవాలు:

పాత నిబంధనలో యోవాషు అనే పేరు అనేక మందికి ఉంది.

  • ఒక యోవాషు ఇశ్రాయేలు విమోచకుడు గిద్యోను తండ్రి.
  • యోవాషు అనే పేరు గల మరొక మనిషి యాకోబు కనిష్ట కుమారుడు బెన్యామీను సంతతి వాడు.
  • ఒక ప్రఖ్యాత యోవాషు ఏడేళ్ళ ప్రాయంలో యూదాకు రాజయ్యాడు. అతడు హతుడైన యూదా రాజు అహజ్యా కుమారుడు.
  • యోవాషు బాలుడుగా ఉన్నపుడు అతని మేనత్త అతన్ని హత్యకు గురి కాకుండా రక్షించి అతనికి కిరీటం ధరించి రాజయ్యే వయసు వచ్చేదాకా దాచిపెట్టింది.
  • యోవాషు రాజు మంచి రాజు. మొదట్లో దేవునికి లోబడ్డాడు. అయితే అతడు ఉన్నత స్థలాలను తొలగించలేదు. అందువల్ల ఇశ్రాయేలీయులు మరలా విగ్రహాలను పుజించారు.
  • యెహోయాషు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న కాలంలో యోవాషు రాజు యూదాను పరిపాలించాడు. వారు ఇద్దరూ వేరువేరు వ్యక్తులు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అహజ్యా, బలిపీఠం, బెన్యామీను, అబద్ధ దేవుడు, గిద్యోను, ఉన్నత స్థలాలు, అబద్ధ దేవుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3101, H3135

యోవేలు

వాస్తవాలు:

యోవేలు ప్రవక్త బహుశా యూదా రాజు యోవాషు పరిపాలన కాలంలో ఉన్నాడు. అనేక మంది ఇతరులు పాత నిబంధనలో ఈ పేరు గలవారు ఉన్నారు.

  • యోవేలు గ్రంథం పాత నిబంధన చివర్లో ఉన్న పన్నెండు చిన్న ప్రవక్త పుస్తకాల్లో ఒకటి.
  • ఇతని గురించి లభ్యమైన ఒకే సమాచారం ఇతని తండ్రి పేరు పెతూయేలు.
  • పెంతెకోస్తు దినాన తన ప్రసంగంలో అపోస్తలుడు పేతురు యోవేలు గ్రంథాన్ని చెప్పాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: యోవాషు, యూదా, పెంతెకోస్తు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3100, G2493

యోషియా

వాస్తవాలు:

యోషియా భక్తిపరుడైన రాజు. ఇతడు యూదా రాజ్యం ముఫ్ఫై-ఒక సంవత్సరాలు పరిపాలించాడు. అతడు యూదా ప్రజలను పశ్చాత్తాపపడేలా యెహోవాను ఆరాధించేలా చేశాడు.

  • తన తండ్రి ఆమోను రాజు వధ తరువాత యోషియా ఎనిమిది సంవత్సరాల వయసులో యూదాకు రాజయ్యాడు.
  • తన పరిపాలన పద్దెనిమిదవ సంవత్సరంలో యోషియా ప్రధాన యాజకుడు హిల్కియాను యెహోవా ఆలయం కట్టించమని ఆదేశించాడు. అది జరుగుతుండగా ఒక ధర్మ శాస్త్ర ప్రతి దొరికింది.
  • దాన్ని యోషియాకు చదివి వినిపించగా తన ప్రజలు ఏ విధంగా దేవుణ్ణి ధిక్కరించారో విని అతడు దుఃఖపడ్డాడు. విగ్రహ ఆరాధన స్థలాలు నాశనం చేయాలనీ అబద్ధ దేవుళ్ళ పూజారులను చంపాలని అతడు ఆదేశించాడు.
  • ప్రజలు పస్కా పండగ మరలా పాటించాలని కూడా ఆదేశించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అబద్ధ దేవుడు, యూదా, చట్టం, పస్కా, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2977, G2502

యోసేపు (కొ ని)

వాస్తవాలు:

యోసేపు యేసు భూసంబంధమైన తండ్రి. ఆయన్ను తన కుమారుడుగా పెంచాడు. అతడు న్యాయవంతుడు. అతడు వడ్రంగి.

  • యోసేపు మరియ అనే యూదు బాలికను ప్రదానం చేసుకున్నాడు. వారు అలా ఉండగా దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె యేసు మెస్సియాకు తల్లి అయ్యేలా చేశాడు.
  • దేవదూత యోసేపుకు పరిశుద్ధాత్మ అద్భుతమైన రీతిలో మరియ గర్భవతి అయ్యేలా చేస్తాడని, మరియకు పుట్టబోయే పసి వాడు దేవుని కుమారుడు అని చెప్పాడు.
  • యేసు పుట్టిన తరువాత దేవదూత యోసేపును హెచ్చరించాడు. హేరోదు నుండి తప్పించుకునేందుకు అతడు బిడ్డను తీసుకుని మరియతో సహా ఈజిప్టుకు వెళ్లిపోవాలి.
  • యోసేపు తన కుటుంబం ఆ తరువాత గలిలయలోని నజరేతులో నివసించారు. అతడు వడ్రంగం పని ద్వారా జీవనోపాధి చేసుకున్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: క్రీస్తు, గలిలయ, యేసు, నజరేతు, దేవుని కుమారుడు, కన్య)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 22:04 ఆమె (మరియ) కన్య. యోసేపు అనే పేరుగల మనిషికి ప్రదానం చేయబడింది.
  • 23:01 మరియకు ప్రదానం అయిన యోసేపు న్యాయవంతుడైన మనిషి. మరియ గర్భవతి అని అతడు విన్నాడు, ఆ బిడ్డ తనది కాదని అతనికి తెలుసు. అతడు ఆమెను అవమానపరచడానికి ఇష్టం లేక గుప్తంగా ఆమెకు విడాకులు ఇచ్చేద్దామని చూశాడు.
  • 23:02 దేవదూత ఇలా చెప్పాడు, "యోసేపు, భయపడకు మరియను నీ భార్యగా చేసుకో. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ పరిశుద్ధాత్మవల్ల కలిగాడు. ఆమె కొడుకును కంటుంది. ఆయనకు యేసు (అంటే, 'యెహోవా రక్షించును') అని పేరు పెట్టు. ఎందుకంటే అయన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు."
  • 23:03 కాబట్టి యోసేపు మరియను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తన భార్యగా చేర్చుకున్నాడు. అయితే ఆమె ప్రసవించేవరకు ఆమెతో లైంగికంగా కలవలేదు.
  • 23:04 యోసేపు మరియ సుదీర్ఘమైన ప్రయాణం చేసి వారు ఉండే నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్లారు. ఎందుకంటే వారి పూర్వీకుడు దావీదు సొంత ఊరు బెత్లెహేము.
  • 26:04 యేసు చెప్పాడు, "ఇప్పుడు నేను చదివిన మాటలు మీ ఎదుట సంభవిస్తున్నాయి." దానికి ప్రజలంతా నిర్ఘాంతపోయారు. "ఇతడు యోసేపు కుమారుడే కదా?" అన్నారు.

పదం సమాచారం:

  • Strong’s: G25010

యోసేపు (పా.ని)

వాస్తవాలు:

యోసేపు యాకోబు పదకొండవ కుమారుడు. అతను రాహేలు మొదటి కుమారుడు. అతని ఇద్దరు కుమారులు ఎఫ్రాఈము మరియు మనష్షే వంశస్థులు ఇశ్రాయేలు గోత్రాలలో రెండు గోత్రాలు అయ్యారు.

  • యోసేపు అనే హీబ్రూ పేరు “జోడించడం, వృద్ధి కావడం” అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదానికీ, మరియు “సేకరించడం, తీసివేయడం”అనే హీబ్రూ పదం రెండింటినీ పోలి ఉంటుంది.
  • ఆదికాండం గ్రంథంలో ఎక్కువ భాగం యోసేపు వృత్తాంతానికి కథకు అంకితం చేయబడింది, అతడు తనకున్న అనేక శ్రమలలో దేవునికి ఎలా నమ్మకంగా ఉన్నాడు మరియు ఐగుప్తులో బానిసగా ఉండటానికి తనను అమ్మివేసిన తన సోదరులను ఎలా క్షమించాడో చెపుతుంది.
  • క్రమంగా దేవుడు యోసేపును ఐగుప్తులో రెండవ అత్యున్నత అధికార స్థానానికి హెచ్చించాడు మరియు తక్కువ ఆహారం ఉన్న సమయంలో ఐగుప్తు ప్రజలను మరియు చుట్టుపక్కల దేశాల ప్రజలను రక్షించడానికి దేవుడు అతనిని వినియోగించాడు. యోసేపు తన స్వంత కుటుంబాన్ని ఆకలితో అలమటించకుండా కాపాడాడు మరియు ఐగుప్తులో తనతో నివసించడానికి వారిని తీసుకువచ్చాడు.

(అనువాద సూచనలు: [పేర్లను అనువదించడం ఎలా]

(ఇవి కూడా చూడండి: [ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలు], [ఎఫ్రాఈము], [మనష్షే], [యాకోబు], [రాహేలు])

బైబిలు రిఫరెన్సులు:

  • [ఆదికాండము 30:22-24]
  • [ఆదికాండము 33:1-3]
  • [ఆదికాండము 37:1-2]
  • [ఆదికాండము 37:23-24]
  • [ఆదికాండము 41:55-57]
  • [యోహాను 4:4-5]

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • [8:2] __ యోసేపు యొక్క__ సోదరులు అతనిని అసహ్యించుకున్నారు ఎందుకంటే వారి తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమించాడు మరియు యోసేపు తమకు పాలకుడని కలలు కన్నాడు.
  • [8:4] బానిస వ్యాపారులు __ యోసేపు __ని ఐగుప్తుకు తీసుకు వెళ్ళారు.
  • [8:5] చెరసాలలో కూడా, __ యోసేపు __ దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుడు అతనిని ఆశీర్వదించాడు.
  • [8:7] దేవుడు __ యోసేపుకు కలలను వివరించే సామర్థ్యాన్ని ఇచ్చాడు, కాబట్టి ఫరో యోసేపును చెరసాలలో నుండి తన వద్దకు తీసుకువచ్చాడు.
  • [8:9] __ యోసేపు __ మంచి పంటలు పండే ఏడేళ్లలో ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని నిల్వ ఉంచుకోవాలని ప్రజలకు చెప్పాడు.
  • [9:2] ఐగుప్తీయులు ఇకపై __ యోసేపు __ నూ మరియు వారికి సహాయం చేయడానికి అతడు చేసినదంతా జ్ఞాపకం ఉంచుకోలేదు.

పదం సమాచారం:

  • Strong's: H3084, H3130, G25000, G25010

యోహాను (అపోస్తలుడు)

వాస్తవాలు:

యోహాను యేసు పన్నెండుమంది అపోస్తలుల్లో ఒకడు. యేసు అత్యంత సన్నిహితమైన స్నేహితుడు.

  • యోహాను, అతని సోదరుడు యాకోబు జెబెదయి అనే జాలరి కుమారులు.
  • అతడు యేసు జీవితం గురించి రాసిన సువార్తలో యోహాను తనను "యేసు ప్రేమించిన శిష్యుడు"గా అభివర్ణించుకున్నాడు. యోహాను ముఖ్యంగా యేసుకు సన్నిహిత స్నేహితుడు అని దీనివల్ల తెలుస్తున్నది.
  • అపోస్తలుడు యోహాను ఐదు కొత్త నిబంధన పుస్తకాలు రాశాడు: యోహాను సువార్త, యేసు క్రీస్తు ప్రకటన, విశ్వాసులకు రాసిన మూడు ఉత్తరాలు.
  • గమనించండి. అపోస్తలుడు యోహాను, బాప్తిసమిచ్చే యోహాను ఒకరు కాదు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:apostle, reveal, James (son of Zebedee), John (the Baptist), Zebedee)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 36:01 ఒక రోజు, యేసు తన ముగ్గురు శిష్యులు, పేతురు, యాకోబు, యోహాను లను తనతో తీసుకువెళ్ళాడు. (యోహాను అనే పేరుగల శిష్యుడు యేసుకు బాప్తిసం ఇచ్చిన వాడు కాదు.) వారు ఎత్తైన కొండ ఎక్కారు.
  • 44:01 ఒక రోజు, పేతురు, యోహాను ఆలయానికి వెళ్లారు. వారు ఆలయం గేటు దగ్గరకు వచ్చినప్పుడు ఒక అవిటి మనిషి భిక్షమెత్తుకోవడం చూశారు.
  • 44:06 ఆలయం నాయకులు పేతురు, యోహాను చెబుతున్న దానికి చాలా కోపగించుకున్నారు. వారిని బంధించి చెరసాలలో వేశారు.
  • 44:07 మరుసటిరోజు, యూదు నాయకులు పేతురు యోహానులను ప్రధాన యాజకుడు, ఇతర మత నాయకుల దగ్గరికి తెచ్చారు. వారు పేతురు, యోహానులను అడిగారు, "ఏ శక్తితో మీరు అవిటి మనిషిని స్వస్థపరిచారు?"
  • 44:09 నాయకులు పేతురు, యోహానులు ధైర్యంగా మాట్లాడడం చూసి బిత్తరపోయారు. ఎందుకంటే వారు ఈ మనుషులు పామరులు అని వారికి తెలుసు. అయితే తరువాత వారు ఈ మనుషులు యేసుతో ఉన్న వారు అని గుర్తించారు. తరువాత వారు పేతురు, యోహానులను బెదిరించి పంపించి వేశారు.

పదం సమాచారం:

  • Strong’s: G24910

యోహాను (బాప్తిసమిచ్చే)

వాస్తవాలు:

యోహాను జెకర్యా, ఎలీసబెతుల కుమారుడు. "యోహాను" సాధారణ నామం గనక ఇతన్ని "యోహాను బాప్తిసమిచ్చే" అని పిలిచారు. యోహాను అనే పేరుగల ఇతరులతో (అపోస్తలుడు యోహాను)తేడా గ్రహించడం కోసం ఇలా చేశారు.

  • ప్రజలు మెస్సియాను నమ్మి ఆయన్ని వెంబడించేలా దేవుడు సిద్ధం చేసిన ప్రవక్త యోహాను.
  • ప్రజలు వారి పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరిగి పాపం చేయడం మానుకుని మెస్సియాను ఎదుర్కొనేందుకు సిద్దపడేలా చేశాడు.
  • అనేక మంది ప్రజలు వారి పాపాల విషయం బాధపడి మళ్ళుకున్న దానికి సూచనగా యోహాను ఇచ్చిన నీటి బాప్తిసం పొందారు.
  • యోహానును "యోహాను బాప్తిసమిచ్చే" అన్నారు, ఎందుకంటే అతడు అనేక మందికి బాప్తిసం ఇచ్చాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:baptize, Zechariah (NT))

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 22:02 దేవదూత జెకర్యాతో చెప్పాడు, "నీ భార్య కుమారుడిని కంటుంది.” నీవు అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయి ప్రజలను మెస్సియా కోసం సిద్ధ పరుస్తాడు."
  • 22:07 తరువాత ఎలీసబెతు ఒక బిడ్డకు జన్మ నిచ్చింది. జెకర్యా, ఎలీసబెతు ఆ పసి వాడికి దేవదూత అజ్ఞాపించినట్టు యోహాను అని పేరు పెట్టాడు.
  • 24:01 జెకర్యా, ఎలీసబెతుల కుమారుడు యోహాను పెరిగి ప్రవక్త అయ్యాడు. అతడు అరణ్య ప్రాంతంలో నివసించాడు. తేనె, మిడతలు అతని ఆహారంఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలు వేసుకునే వాడు.
  • 24:02 అనేక మంది ప్రజలు అరణ్య ప్రాంతంలోకి వచ్చి యోహాను మాటలు వినే వారు. అతడు ప్రకటించాడు, "పశ్చాత్తాప పడండి. ఎందుకంటే దేవుని రాజ్యం దగ్గరగా ఉంది!"
  • 24:06 మరుసటి రోజు, యేసు__యోహాను__చేత బాప్తిసం పొందడానికి వచ్చాడు. యోహాను ఆయన్ని చూసి ఇలా చెప్పాడు, "చూడండి! లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల."

పదం సమాచారం:

  • Strong’s: G09100 G24910

రబ్బా

నిర్వచనము:

రబ్బా అనేది అమ్మోనీయుల ప్రజల అతీ ప్రాముఖ్యమైన పట్టణమైయుండెను.

  • అమ్మోనీయులకు విరుద్ధముగా జరిగించిన యుద్ధములో ఇశ్రాయేలీయులు అనేకమార్లు రబ్బాపై దాడి చేసిరి.
  • ఇశ్రాయేలీయుల రాజైన దావీదు తను జయించిన వాటిలో చివరిదిగా రబ్బాను స్వాధీనము చేసికొనెను.
  • నేటి ఆధునిక అమ్మాన్ జోర్డాన్ పట్టణము రబ్బా ఉండే పట్టణమైయుండెనుజ.

(ఈ పదములను కూడా చూడండి: అమ్మోను, దావీదు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7237

రమా

వాస్తవాలు:

రమా అనేది ఇశ్రాయేలీయుల పురాతనమైన పట్టణము, ఇది యెరూషలేమునుండి 8 కి.మీ. దూరములో ఉంటుంది. ఈ ప్రాంతమునందు బెన్యామీను గోత్రపువారు జీవించియుండిరి.

  • రమా అనేది రాహేలు బెన్యామీనుకు జన్మనిచ్చిన తరువాత చనిపోయిన ప్రాంతమైయుండెను.
  • ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగొనిపోయినప్పుడు, వారందరిని బబులోనుకు తీసుకొని వెళ్ళక మునుపు వారిని మొట్ట మొదటిగా రమాకు తీసుకొనివచ్చిరి.
  • రమా అనే ప్రాంతము సమూయేలు తల్లిదండ్రుల ఊరైయుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదాలను కూడా చూడండి: బెన్యామీను, ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7414, G4471

రామతు

వాస్తవాలు:

రామతు అనేది యోర్దానుకు దగ్గరలోని గిల్యాదు పర్వతముల మధ్యనున్న ప్రాముఖ్యమైన పట్టణమైయుండెను. దీనిని రామతు గిల్యాదు అని కూడా పిలుస్తారు.

  • రామతు ఇశ్రాయేలు గాదు గోత్రమునకు సంబంధించినదైయుండెను మరియు దీనికి ఆశ్రయ పట్టణమని గుర్తింపు ఉండెను.
  • ఇశ్రాయేలు రాజైన ఆహాబు మరియు యూదా రాజైన యెహోషాపాతు రామతునందు ఆరాము రాజుకు విరుద్ధముగా యద్ధమును ప్రారంభించిరి. ఆహాబు యుద్ధములో చంపబడెను.
  • కొంత కాలమైన తరువాత, రాజైన అహజ్య మరియు రాజైన యెహోరాములు రాజైన ఆరామునుండి రామతు పట్టణము వశము చేసుకోవాలని ప్రయత్నించిరి.
  • రామతు గిల్యాదునందే యెహు అనే వ్యక్తిని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను.

(తర్జుమా సలహాలు: పేర్లను అనువాదము చేయండి)

(ఈ పదాలను కూడా చూడండి: ఆహాబు, అహజ్య, ఆరాము, యెహోషాపాతు, గాదు, యెహు, యెహోరాము, యోర్దాను నది, యూదా, ఆశ్రయము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7216, H7418, H7433

రాహాబు

వాస్తవాలు:

రాహాబు అనే స్త్రీ ఇశ్రాయేలీయులు యెరికో పట్టణముపై దాడి చేయుటకు వచ్చినప్పుడు యెరికోలో నివసించియుండెను. ఈమె వ్యభిచారియైయుండెను.

  • ఇశ్రాయేలీయులు ఈ పట్టణముపై దాడి చేయక ముందు యెరికో మీద వేగు చూచుటకు వచ్చిన ఇద్దరి ఇశ్రాయేలీయులను రాహాబు దాచిపెట్టియుండెను. ఈమె ఆ గూఢాచారులు తప్పించుకొని ఇశ్రాయేలు శిబిరము వద్దకు వెళ్ళుటకు సహాయము చేసెను.
  • రాహాబు యెహోవాయందలి విశ్వాసియాయెను.
  • యెరికో నాశనము చేయబడినప్పుడు ఈమె మరియు తన కుటుంబపు సభ్యులు రక్షించబడిరి మరియు వారు ఇశ్రాయేలీయులతో నివసించుటకు వచ్చిరి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదాలను కూడా చూడండి:Israel, Jericho, prostitute)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణములు:

  • 15:01 గూఢాచారులను దాచిపెట్టి, వారు తప్పించుకొనుటకు సహాయము చేసిన రాహాబు అనే పేరుగల ఒక వ్యభిచారి ఆ పట్టణములో నివసించియుండెను. ఈమె దేవునియందు విశ్వాసము ఉంచినందున ఈమె ఈలాగు చేసెను. ఇశ్రాయేలీయులు యెరికోను నాశనము చేయునప్పుడు, వారు రాహాబును మరియు తన కుటుంబమును కాపాడుతామని వాగ్ధానము చేసియుండిరి.
  • 15:05 దేవుడు ఆజ్ఞాపించిన విధముగా ఇశ్రాయేలీయులు యెరికోలోని సమస్తమును నాశనము చేసిరి. రాహాబు మరియు తన కుటుంబమును చంపబడక వారు మాత్రమే ఆ పట్టణములో రక్షించబడిరి. వారు ఇశ్రాయేలీయులలో ఒకరిగా ఎంచబడిరి.

పదం సమాచారం:

  • Strong’s: H7343, G44600

రాహేలు

వాస్తవాలు:

రాహేలు యాకోబు భార్యలలో ఒకరైయుండెను. ఈమె మరియు తన అక్కయైన లేయాలు యాకోబు మామయైన లాబాను కుమార్తెలైయుండిరి.

  • రాహేలు యోసేపు మరియు బెన్యామీనులకు తల్లియైయుండెను, ఈ సంతానము ఇశ్రాయేలు పన్నెండు మంది గొత్రీకులలో ఉండిరి.
  • అనేక సంవత్సరములు రాహేలుకు పిల్లలు లేకపోయిరి. ఆ తరువాత దేవుడు ఆమెను పిల్లలను కనుటకు బలపరచెను మరియు యాకోబుకు ఆమె ద్వారా సంతానమాయెను.
  • అనేక సంవత్సరములైన తరువాత ఆమె బెన్యామీనుకు జన్మనిచ్చిన తరువాత చనిపోయెను, యాకోబు ఆమెను బెత్లెహేము వద్ద సమాధి చేసెను.

(అనువాదం సూచనలు: [పేర్లను ఏ విధంగా తర్జుమా చేయాలి]) How to Translate Names)

(ఈ పదాలను కూడా చూడండి: Bethlehem, Jacob, Laban, Leah, Joseph (OT), twelve tribes of Israel)

బైబిలు రిఫరెన్సులు:

  • [ఆది.29:4-6]
  • [ఆది.29:19-20]
  • [ఆది.29:28-30]
  • [ఆది.31:4-6]
  • [ఆది.33:1-3]
  • [మత్తయి.02:17-18]

పదం సమాచారం:

  • Strong's: H7354, G4478

రిబ్కా

వాస్తవాలు:

రిబ్కా అబ్రాహాము సోదరుడైన నాహోరు మనవరాలు.

  • దేవుడు రిబ్కాను అబ్రాహాము కుమారుడగు ఇస్సాకుకు భార్యగా ఉండుటకు ఎన్నుకొనను.
  • రిబ్కా నివసించిన స్థలమైన అరాం నహరాయిము ప్రాంతమును వదిలి, అబ్రాహాము దాసునితో ఇస్సాకు నివసించే ప్రాంతమైన నేగేవ్ ప్రాంతమునకు వెళ్ళెను.
  • ఎంతో కాలము వరకు రిబ్కాకు సంతానము లేకుండెను, కాని చివరికి దేవుడు ఆమెను ఇద్దరు మగ పిల్లలతో అనగా ఏసావు మరియు యాకోబులను ఇచ్చి ఆశీర్వదించెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఏ విధంగా తర్జుమా చేయవలెను)

(ఈ పదములను కూడా చూడండి: అబ్రాహాము, అరాం, ఇస్సాకు, యాకోబు, నాహోరు, నెగేబు)

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

పరిశుద్ధ గ్రంథము నుండి ఉదాహరణలు:

  • 06:02 అబ్రాహాము యొక్క బంధువులు నివసించిన ప్రాంతమునకు సుదూర ప్రయాణము చేసిన తరువాత, దేవుడు దాసుని రిబ్కా వద్దకు నడిపించెను. ఈమె అబ్రాహాము సోదరుని యొక్క మనవరాలైయుండెను.
  • 06:06 “నీలో రెండు రాజ్యుములున్నాయి” అని దేవుడు రిబ్కాకు చెప్పెను.
  • 07:01 పిల్లలు ఎదిగేకొలది, రిబ్కా యాకోబును ప్రేమించెను, అయితే ఇస్సాకు ఏసావును ప్రేమించెను.
  • 07:03 ఇస్సాకు తన ఆశీర్వాదమును ఏసావుకు ఇవ్వాలని ఆశించేను. అయితే అతను అశీర్వాదములు ఇవ్వక మునుపు, రిబ్కా మరియు యాకోబులిరువురు తనని మోసము చేసి, ఏసావని యాకోబు నటించియుండెను.
  • 07:06 అయితే రిబ్కా ఏసావు ప్రణాళికను వినెను. అందుచేత ఆమె యాకోబును ఎంతో దూరములోనున్న తన బంధువులయొద్దకు పంపించెను.

పదం సమాచారం:

  • Strong's: H7259

రిమ్మోను

వాస్తవాలు:

రిమ్మోను అనునది ఒక వ్యక్తి పేరు మరియు అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడియున్నది. ఈ పేరు ఒక అబద్ధపు దేవుని పేరుగా పేర్కొనబడియున్నది.

  • రిమ్మోను అను వ్యక్తి జెబూలోనులోని బెయేరోతు నగరమునుండి వచ్చిన ఒక బెన్యామీనీయుడైయుండెను. ఈ వ్యక్తి కుమారులు యోనాతాను పుట్టిన కుమారుడైన కుంటివాడైన ఇష్బోషెతును చంపిరి.
  • రిమ్మోను నగరము బెన్యామీను గోత్రము ద్వారా వశము చేసుకొనబడిన యూదా దక్షిణ భాగములో ఉన్నది.
  • “రిమ్మోను బండ” అనునది ఒక సురక్షితమైన స్థలమైయుండెను, బెన్యామీనీయులు యుద్ధములో చంపబడకుండునట్లు అక్కడికి వెళ్లి దాక్కొనేవారు.
  • రిమ్మోను పెరెజ్ అనునది యూదాయ అరణ్యములో తెలియబడని స్థలమైయుండెను.
  • సిరియా సేనాధిపతియైన నామాను తప్పుడు దేవుడైన రిమ్మోను దేవాలయమును గూర్చి మాట్లాడియుండెను, ఇక్కడ సిరియా రాజు ఆరాధించబడుచుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(ఈ పదములను కూడా చూడండి: బెన్యామీను, యూదాయ, నామాను, సిరియా, జెబూలూను)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7417

రూతు

వాస్తవాలు

రూతు మోయాబీయురాలైన స్త్రీ, ఆమె న్యాయాధిపతులు ఇశ్రాయేలను పాలిస్తున్న కాలంలో జీవించింది. మోయాబులో, ఇజ్రాయెల్‌లో కరువు కారణంగా అతని కుటుంబం అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె మహ్లోను అనే ఇశ్రాయేలీయుడిని వివాహం చేసుకుంది. మహ్లోను చనిపోయాడు, ఆ తర్వాత కొంతకాలానికి ఆమె తన అత్త నయోమితో కలిసి ఇజ్రాయేల్‌లోని బేత్లెహేము నగరానికి తిరిగి రావడానికి మోయాబును విడిచిపెట్టింది.

  • రూతు నయోమికి నమ్మకముగా ఉండెను మరియు ఆమెను పోషించుటకు ఎక్కువగా కష్టపడుచుండెను.
  • ఈమె కూడా ఇశ్రాయేలు ఒకే ఒక్క దేవుడైన దేవునిని సేవించుటకు తనను తాను సమర్పించుకొనెను.
  • రూతు ఇశ్రాయేలువాడైన బోయాజును వివాహము చేసికొనెను మరియు ఓబేదు అనే కుమారుని కనెను.ఓబేదు రాజైన దావీదుకు  తాతగారు మరియు రాజైన దావీదు యేసు యొక్క పూర్వీకుడు.

(అనువాదం స్సలహాలు:  (పేర్లు  అనువదించడం ఎలా) How to Translate Names)

(ఈ పదములను కూడా చూడండి: [బెత్లెహేము] Bethlehem, Boaz, David, judge)

బైబిల్ రెఫరెన్సులు:

  • మత్తయి.01:4-6
  • రూతు.01:3-5
  • రూతు.03:8-9
  • రూతు.04:5-6

పదం సమాచారం:

  • Strong's: H7327, G45030

రూబేను

వాస్తవాలు:

రూబేను యాకోబుకు మొట్ట మొదటిగా పుట్టిన కుమారుడైయుండెను. ఇతని తల్లి పేరు లేయా.

  • ఇతని సహోదరులు తమ చిన్న తమ్ముడైన యోసేపును చంపాలని చూచినప్పుడు, రూబేను తన తమ్ముళ్ళకు తనని బావిలో వేద్దామని చెప్పుట ద్వారా యోసేపు ప్రాణమును కాపాడియుండెను.
  • రూబేను కొంచెము సమయమైన తరువాత యోసేపును రక్షించుటకు వెనక్కి తిరిగి వచ్చెను, కాని మిగిలిన ఇతర సహోదరులు ఆ మార్గముగుండా వెళ్తున్న వ్యాపారులకు తమా తమ్మున్ని బానిసగా అమ్మివేసిరి.
  • రూబేను సంతానము ఇశ్రాయేలు పన్నెండు గోత్రములలో ఒక గోత్రముగా మార్చబడిరి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: యాకోబు, యోసేపు, లెయా, ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7205, H7206, G4502

రెల్లు సముద్రము, ఎర్ర సముద్రము

వాస్తవాలు:

"రెల్లు సముద్రము” ఐగుప్తు మరియు అరేబియా మధ్య ఉన్న నీటి భాగం పేరు. ఇప్పుడు ఇది "ఎర్ర సముద్రం" అని పిలువబడుతుంది.

  • ఎర్ర సముద్రం పొడవుగానూ మరియు ఇరుకుగానూ ఉంది. ఇది ఒక సరస్సు లేదా నది కంటే పెద్దది, అయితే సముద్రం కంటే చాలా చిన్నది.

  • ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి పారిపోతున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటవలసి వచ్చింది. దేవుడు ఒక సూచక క్రియ చేసాడు, చేసి, సముద్ర జలాలను విభజించేలా చేసాడు, తద్వారా మనుష్యులు ఆరిన నేల మీద నడవగలిగారు.

  • ఈ సముద్రానికి ఉత్తరంగా కనాను దేశం ఉంది.

  • ఇది "ఎర్ర సముద్రము” అని కూడా అనువదించబడవచ్చు.

(ఈ పదములను కూడా చూడండి: అరేబియా, కానాను, ఐగుప్తు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

బైబిలు నుండి ఉదాహరణలు:

  • 12:04 ఐగుప్తీయుల సైన్యము రావడం ఇశ్రాయేలీయులు చూచినప్పుడు, వారు ఫరో సైన్యము మరియు ఎర్ర సముద్రము మధ్యన చిక్కుకుపోయామని గుర్తించారు.
  • 12:05ఎర్ర సముద్రము వైపుకు కదలాలని మనుష్యులకు చెప్పమని దేవుడు మోషేకు చెప్పాడు.
  • 13:01 దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము ద్వారా నడిపించిన తరువాత, ఆయన వారిని సీనాయి అని పిలువబడిన పర్వతము వద్దకు అరణ్యము ద్వారా నడిపించెను.

పదం సమాచారం:

  • Strong's: H3220, H5488, G20630, G22810

రెహబాము

వాస్తవాలు:

రెహబాము రాజైన సొలొమోను కుమారులలో ఒకడైయుండెను, మరియు సొలొమోను మరణించిన తరువాత ఇతను ఇశ్రాయేలు దేశమునకు రాజాయెను.

  • రెహబాము పాలన ఆరంభములో తన ప్రజలతో చాలా తీవ్రమైన విధానములో నడుచుకొనియున్నాడు, ఇందుచేత తనకు విరుద్ధముగా ఇశ్రాయేలు పది గోత్రములవారు ఎదురు తిరిగి, వారు ఉత్తర దిక్కున “ఇశ్రాయేలు రాజ్యముగా” రూపించబడిరి.
  • రెహబాము దక్షిణ యూదా రాజ్యమునకు రాజుగా కొనసాగించబడియున్నాడు, ఈ రాజ్యములో కేవలము యూదా మరియు బెన్యామీను అను రెండు గోత్రములు మాత్రమె ఉన్నాయి.
  • రెహబాము దేవునికి లోబడని దుష్ట రాజైయుండెను మరియు తప్పుడు దేవుళ్ళను ఆరాధింఛియుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: ఇశ్రాయేలు రాజ్యము, యూదా, సొలొమోను)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 18:05 సొలొమోను మరణించిన తరువాత, తన కుమారుడు రెహబాము రాజాయెను. రెహబాము మూర్ఖుడైయుండెను.
  • 18:06 రెహబాము మూర్ఖముగా జవాబునిచ్చాడు మరియు “నా తండ్రి సొలొమోను మీరు ఎక్కువగా కష్టపడునట్లు చేశాడని మీరనుకొనుచున్నారు, అయితే ఆయన కష్టపెట్టినదానికంటే నేను మిమ్ములను ఎక్కువగా కష్టపెడుతా, అంతేగాకుండా ఆయన శిక్షించినదానికంటే ఎక్కువగా నేను మిమ్ములను శిక్షిస్తాను” అని వారితో చెప్పాడు.
  • 18:07 ఇశ్రాయేలు దేశపు పది గోత్రములవారు రెహబాముకు విరుద్ధముగా తిరుగబాటు చేసియున్నారు. కేవలము రెండు గోత్రములవారు మాత్రమె అతనికి నమ్మకముగా ఉండిరి.

పదం సమాచారం:

  • Strong's: H7346, G4497

రోమా, రోమీయుడు

వాస్తవాలు:

క్రొత్త నిబంధన కాలములో రోమా పట్టణము రోమా సామ్రాజ్యమునకు కేంద్రమైయుండెను. ఇదిప్పుడు ఆధునిక దేశమైన ఇటలీకి రాజధానియైయున్నది.

  • రోమా సామ్రాజ్యము ఇశ్రాయేలుతో చేర్చి మధ్యధరా సముద్రము చుట్టూ ఉన్నటువంటి ప్రాంతములన్నిటిని పరిపాలించింది.
  • “రోమా” అనే ఈ పదము రోమా నియంత్రణలోనున్న ప్రభుత్వపు ప్రాంతములకు సంబంధించినది దేనినైనా, అందులో రోమా పౌరులను మరియు రోమా అధికారులను కూడా సూచిస్తుంది.
  • అపొస్తలుడైన పౌలును ఒక ఖైదీగా రోమా నగరమునకు తీసుకొని వెళ్ళిరి, ఎందుకంటే ఆయన యేసును గూర్చిన శుభవార్తను ప్రకటించియుండెను.
  • క్రొత్త నిబంధన గ్రంథములోని “రోమా” పుస్తకమును రోమాలోని క్రైస్తవులకు పౌలు వ్రాసిన పత్రికయైయున్నది.

(ఈ పదములను కూడా చూడండి:  good news, the sea, Pilate, Paul)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

  • 2 తిమోతి.01:15-18
  • అపొ.కార్య.22:25-26
  • అపొ.కార్య.28:13-15
  • యోహాను.11:47-48

##పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 23:04 మరియ ప్రసవించే సమయము దగ్గరికి వచ్చినప్పుడు, రోమా ప్రభుత్వము ప్రతియొక్కరికి తమ పితరులు నివసించిన స్థలములకు వెళ్లి జనాభా లెక్కల్లో చేరమని సెలవిచ్చియుండెను.

  • 32:06 ఆ తరువాత యేసు ఆ దయ్యమును “నీ పేరు ఏమిటి?” అని అడిగెను, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేక గుంపులు ఉన్నాము” అని తిరిగి జవాబిచ్చెను. (రోమా సైన్యములో అనేక వేలాది సైనికుల గుంపును “సేన” అని పిలిచెదరు.)

  • 39:09 ఆ మరుసటి రోజు ఉదయమున, యూదుల నాయకులు యేసును చంపాలనే ఉద్దేశముతో రోమా పాలకుడైన పిలాతు దగ్గరకు తీసుకొనివచ్చిరి.

  • 39:12 రోమా సైనికులు యేసును కొరడాలతో కొట్టిరి, రాజరికపు నిలువంగిని తొడగించిరి మరియు ఆయన తలపైన ముళ్ళ కిరీటమును ధరియింపజేసిరి. “యూదుల రాజా, ఇటు చూడు” అని చెబుతూ ఆయన హేళన చేసిరి.

పదం సమాచారం:

  • Strong's: G4514, G4516

లాజరు

వాస్తవాలు:

లాజరు మరియు అతని సహోదరీలు మరియ, మార్త యేసుకు ప్రత్యేక స్నేహితులు. బేతనియలోని వారి ఇంటిలో యేసు తరచుగా వారితో ఉండేవాడు.

  • లాజరు చాలా రోజులపాటు సమాధిలో పాతిపెట్టబడిన తరువాత యేసు అతనిని మృతులలోనుండి లేపినందుకు లాజరు ప్రసిద్ధి చెందాడు.
  • యూదా నాయకులు యేసుపై కోపంగా ఉన్నారు మరియు ఆయన ఈ అద్భుతం చేశాడని అసూయ చెందారు, మరియు వారు యేసు మరియు లాజరు ఇద్దరినీ చంపడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు.
  • యేసు ఒక పేద బిచ్చగాడు మరియు ధనవంతుడి గురించి కూడా ఒక ఉపమానాన్ని చెప్పాడు, అందులో బిచ్చగాడు “లాజరు” అనే మరొక వ్యక్తి.

(అనువాద సూచనలు: [పేర్లను అనువదించడం ఎలా]

(ఇవి కూడా చూడండి: [బిచ్చమెత్తడం], [యూదు నాయకులు], [మార్త], [మరియ], [వృద్ధి చెయ్యడం])

బైబిలు రిఫరెన్సులు:

  • [యోహాను సువార్త 11:11]
  • [యోహాను సువార్త 12:1-3]
  • [లూకా సువార్త16:21]

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

*[37:1] ఒకరోజు, లాజరు చాలా అనారోగ్యంతో ఉన్నాడని యేసుకు సందేశం వచ్చింది. __ లాజరు __ మరియు అతని ఇద్దరు సహోదరీలు, మరియు మరియు మార్త, యేసుకు సన్నిహిత స్నేహితులు.

  • [37:2] యేసు, "మా స్నేహితుడు లాజరు నిద్రపోయాడు, నేను అతనిని లేపాలి" అని చెప్పాడు.
  • [37:3] యేసు శిష్యులు, “బోధకుడా, లాజరు నిద్రపోతున్న యెడల, అతడు బాగుపడతాడు” అని జవాబిచ్చారు. అప్పుడు యేసు వారితో “లాజరు చనిపోయాడు” అని స్పష్టంగా చెప్పాడు.
  • [37:4] యేసు లాజరు' స్వస్థలానికి వచ్చినప్పుడు, లాజరు అప్పటికే చనిపోయి నాలుగు రోజులైంది.
  • [37:6] యేసు వారిని, “మీరు __లాజరు__ని ఎక్కడ ఉంచారు?” అని అడిగాడు.
  • [37:9] అప్పుడు యేసు, “లాజరు, బయటికి రా!” అని అరిచాడు.
  • [37:10] కాబట్టి __ లాజరు __ బయటకు వచ్చాడు! అతను ఇంకా సమాధి దుస్తులతో చుట్టబడి ఉన్నాడు. *[37:11] అయితే యూదుల మత పెద్దలు అసూయపడ్డారు, కాబట్టి వారు యేసును మరియు __లాజరు__ని ఎలా చంపవచ్చో ప్రణాళిక చేయడానికి ఒకచోట చేరారు.

పదం సమాచారం:

  • Strong's: G29760

లుస్త్ర

వాస్తవాలు:

పురాతన ఆసియా మైనరులో లుస్త్ర పట్టణం ఉన్నది. పౌలు తాను చేసిన ఒక పరిచర్య యాత్రలో ఈ పట్టణాన్ని దర్శించాడు. లుకోనియ ప్రాంతంలో ఈ పట్టణం ఉంది, ఇది ప్రస్తుతం ఆధునిక టర్కీ దేశం.

  • ఈకొనియలో యూదులు బెదిరించినప్పుడు పౌలునూ, అతని సహచరులునూ దేర్బే, లుస్త్ర పట్టణాలకు వెళ్లి తప్పించుకొన్నారు.
  • లుస్త్ర పట్టణంలో పౌలు తిమోతిని కలుసుకొన్నాడు, తరువాత తిమోతి పౌలుకు తోటి సువార్తికుడును, సంఘ స్థాపకుడు అయ్యాడు.
  • లుస్త్రలో కుంటికాలు వానిని పౌలు స్వస్తపరచిన తరువాత, అక్కడి ప్రజలు పౌలునూ, బర్నబాను దేవతలుగా ఆరాధించడానికి ప్రయత్నించారు, అయితే అపోస్తలులు వారిని గద్దించి, తమ్మును ఆరాధించకుండా వారిని అడ్డగించారు.

(అనువాదం సలహాలు : పేర్లను అనువదించడం ఎలా) How to Translate Names)

(చూడండి: [సువార్తికుడు] evangelist, Iconium, Timothy)

బైబిలు రెఫరెన్సులు:

  • 2 తిమోతి 03:10-13
  • అపొస్తలులకార్యములు 14:06
  • అపొస్తలుల కార్యములు 14:08
  • అపొస్తలులకార్యములు 14:21-22

పదం సమాచారం:

  • Strong's: G30820

లూకా

వాస్తవాలు:

లూకా కొత్తనిబంధనలో రెండు పుస్తకాలను రాసాడు: లూకా సువార్త, అపొస్తలుల కార్యముల గ్రంథం.

  • కొలస్సీ పత్రికలో లూకా ఒక వైద్యుడని పౌలు ప్రస్తావించాడు/సూచిస్తున్నాడు. పౌలు తాను రాసిన మరొక రెండు పత్రికలలో లూకాను గురించి రాశాడు.
  • లూకా క్రీస్తు వద్దకు వచ్చిన/ఎరిగియున్న గ్రీసు దేశస్థుడు, అన్యుడు. తన సువార్తలో లూకా సమస్త ప్రజల పట్ల యేసు యొక్క ప్రేమను ఎత్తి చూపు అనేక సంఘటనలు పొందుపరచుచున్నాడు.
  • పౌలు చేసిన రెండు మిషనరీ/సువార్త దండయాత్ర  ప్రయాణాలలో పౌలుతో పాటు లూకా జతగా ఉన్నాడు, పౌలు పనిలో సహాయం చేసాడు.
  • కొన్ని ఆదిమ రచనలలో లూకా సిరియాలోని అంతియొకయ పట్టణంలో పుట్టాడని ఉంది/చెప్పబడుతున్నది.

(అనువాదం సలహాలు : పేర్లను అనువదించడం) How to Translate Names)

(చూడండి: Antioch, Paul, Syria)

బైబిలు రెఫరెన్సులు:

  • 2 తిమోతి 04:11-13
  • కొలస్సీ 04:12-14
  • ఫిలోమోను 01:24

పదం సమాచారం:

·         Strong’s : G30650


లెమెకు

వాస్తవాలు

ఆదికాండం గ్రంథంలో ఇద్దరి పేర్లు లెమెకు అని ప్రస్తావించబడింది.

  • మొదటిగా లెమెకు పేరు కయీను కుమారునికి పెట్టబడింది. తనకు హాని చేసిన వానిని హత్య చేస్తానని తన ఇద్దరు భార్యల వద్ద డంబముగా పలికాడు.
  • లెమెకు అని పేరు కలిగిన రెండవ వ్యక్తి సేతు కుమారుడు. అతడు నోవహుకు కూడా తండ్రి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువాదం చెయ్యడం)

చూడండి: Cain, Noah, Seth)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H3929, G29840

లేయా

వాస్తవాలు:

యాకోబు భార్యలలో లేయా ఒకరు. ఆమె రాహేలుకు అక్క మరియు యాకోబు ఆరుగురు కుమారులకు ఆమె తల్లి, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాఖారు, మరియు యెబూలూను. ఆమె యాకోబు కుమార్తె దానాకు కూడా తల్లి.

  • లేయా తండ్రి లాబాను రాహేలును వివాహం చేసుకునే ముందు యాకోబును ఏవిధంగా మోసగించి ఆమెను వివాహం చేసుకున్నాడనే విషయాన్ని ఆదికాండం గ్రంథం చెపుతుంది.
  • మరో భార్య రాహేలును ప్రేమించినంతగా యాకోబు లేయాను ప్రేమించలేదు, అయితే దేవుడు లేయాకు అనేకమంది పిల్లలను అనుగ్రహించడం ద్వారా లేయాను సమృద్ధిగా ఆశీర్వదించాడు.
  • ప్రభువైన యేసూ, దావీదు రాజు పితరులలో లేయా కుమారుడు యూదా ఉన్నాడు.

(అనువాదం సూచనలు: [పేర్లను అనువాదం చెయ్యడం]) How to Translate Names)

(చూడండి: Jacob, Reuben, Simeon, Levi, Judah, Issachar, Zebulun, Laban, Rachel, twelve tribes of Israel)

బైబిలు రెఫరెన్సులు:

  • [ఆదికాండం 29:15-18]
  • [ఆదికాండం 29:28-30]
  • [ఆదికాండం 31:4-6]
  • [రూతు 04:11-12]

పదం సమాచారం:

  • Strong's: H3812

లోతు

వాస్తవాలు:

లోతు అబ్రహాము తోడబుట్టినవాని కుమారుడు.

  • అతను అబ్రహాము సోదరుడు హారాను కుమారుడు.
  • లోతు అబ్రహాముతో కనాను భూభాగానికి ప్రయాణం అయ్యాడు, సొదొమ పట్టణంలో స్థిరపడ్డాడు.
  • లోతు మోయాబీయులకు, అమ్మోనీయులకు మూల పురుషుడు.
  • శత్రు రాజులు సొదొమ పట్టణం మీదకు దండెత్తి లోతును బంధించినప్పుడు, అబ్రహాము అనేక వందలమందితో వచ్చి లోతును కాపాడి అతని వస్తువులను తిరిగి స్వాధీనపరచుకొన్నాడు.
  • సొదొమ పట్టణంలోని ప్రజలు చాలా దుర్మార్గులు, అందుచేత దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసాడు. అయితే లోతునూ, అతని సంతానమూ తప్పించుకోనేలా వారు ఆ పట్టణాన్ని విడిచిపెట్టాలని దేవుడు వారితో మొదట చెప్పాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి:Abraham, Ammon, Haran, Moab, Sodom)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H3876, G30910

వష్తి

వాస్తవాలు:

పాతనిబంధన లోని ఎస్తేరు గ్రంధములోని పర్షియా రాజైన ఆహాష్వేరోషు యొక్క భార్య ఈ వష్తి రాణి.

  • రాజు చేయించిన విందులో అందరు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా వున్నప్పుడు వష్తి రాణి తన సౌందర్యమును ప్రదర్శించడానికి నిరాకరించినందున రాజైన ఆహాష్వేరోషు రాణిగా ఉండకుండా ఆమెను తొలగించెను.
  • దీని ఫలితంగా, వేరొక రాణి కొరకు వెదకగా చివరికి ఎస్తేరు రాజు యొక్కక్రొత్త భార్యగా ఎన్నుకోబడింది .

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(దీనిని చూడండి: ఆహాష్వేరోషు, ఎస్తేరు, పర్షియా)

బైబిలు వచనాలు :

పదం సమాచారం:

  • Strong's: H2060

శారా, శారయి

వాస్తవాలు:

  • శారా అబ్రాహాము భార్య.
  • ఆమె అసలు పేరు “శారయి,” అయితే దేవుడు దానిని “శారా”గా మార్చాడు.
  • శారా ఇస్సాకుకు జన్మనిచ్చింది, ఆ కుమారుడు దేవుడు తనకు మరియు అబ్రాహామును ఇస్తానని వాగ్దానం చేశాడు.

(అనువాద సూచనలు: [పేర్లను ఎలా అనువదించాలి]

(ఇవి కూడా చూడండి: [అబ్రాహాము], [ఇస్సాకు])

బైబిలు సూచనలు:

  • [ఆదికాండం 11:30]
  • [ఆదికాండం 11:31]
  • [ఆదికాండం 17:15]
  • [ఆదికాండం 25:9-11]

బైబిలు కధలు నుండి ఉదహారణలు:

  • [5:1] కాబట్టి అబ్రాము భార్య, __శారాయి, అతనితో, “దేవుడు నన్ను పిల్లలను కనడానికి అనుమతించలేదు మరియు ఇప్పుడు పిల్లలను కనడానికి నా వయస్సు చాల పెద్దది, ఇదిగో నా దాసి హాగరు. ఆమెను కూడా పెళ్లి చేసుకో, తద్వారా ఆమె నాకు బిడ్డను కంటుంది.
  • [5:4] "నీ భార్య, శారాయి, ఒక కొడుకును కలిగి ఉండిది -అతను వాగ్దానపు కుమారుడు."
  • [5:4] దేవుడు శారాయి పేరును కూడా శారాగా మార్చాడు, దీని అర్థం “యువరాణి”.
  • [5:5] దాదాపు ఒక సంవత్సరం తర్వాత, అబ్రహామునకు 100 సంవత్సరాలు మరియు శారాకి 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, శారా అబ్రాహాముకు కొడుకును కన్నది. దేవుడు చెప్పినట్లు వారు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు.

పద సమాచారం

  • స్ట్రాంగ్స్: హెచ్8283, హెచ్8297, జి45640

శారోను, శారోను బయలు

వాస్తవాలు:

శారోను అనునది దక్షిణ కర్మేలు పర్వతమునకు, మధ్యధరా సముద్రమునకు దగ్గరిగా ఉన్నటువంటి ఫలవంతమైన బయలు భూమి పేరైయున్నది. అందుకే దీనికి “శారోను పొలము (లేక బయలు)” అని పేరు కలదు.

  • పరిశుద్ధ గ్రంథములో పేర్కొనబడిన అనేక పట్టణములు శారోను బయలులోనే ఉన్నవి, అందులో యొప్పే, లుద్ద మరియు కైసరయ అనునవి కలవు.
  • “శారోను అని పిలువబడే బయలు” లేక “శారోను బయలు” అని కూడా ఈ పదమును తర్జుమా చేయుదురు.
  • శారోను బయలులో నివసించే ప్రజలను “శారోనీయులు” అని పిలిచెదరు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: కైసరయ, కర్మేలు, యొప్పె, సముద్రము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H8289, H8290

షినారు

వాస్తవాలు:

షినారు అనే పదమునకు “రెండు నదుల దేశము’ అని అర్థము మరియు ఇది దక్షిణ మెసపటేమియా ప్రాంతము లేక బయలు పేరైయున్నది.

  • కొంతకాలమైన తరువాత షినారు “కల్దియా” అని పిలువబడింది, ఆ తరువాత “బబులోను” అని పిలువబడింది.
  • షినారు బయలులోనున్న బాబేలు పట్టణమందు జీవించిన పురాతన ప్రజలు తమ్మును తాము గొప్ప చేసికొనుటకు ఎత్తైన గోపురమును కట్టిరి.
  • అనేక తరములు గడచిన తరువాత, ఈ ప్రాంతములోని ఊర్ అనే పట్టణమందు యూదుల పూర్వికుడైన అబ్రహాము జీవించియుండెను, ఆ సమయములో ఈ ప్రాంతమును “కల్దీయ” అని పిలువబడెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: అబ్రాహాము, బాబేలు, బబులోను, కల్దీయ, మెసపటేమియా, పితరులు, ఊర్)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H8152

షిమీ

నిర్వచనము:

షిమీ అనే పేరుతొ పాతనిబంధనలో అనేకమంది వ్యక్తులు ఉన్నారు.

  • గెరా కుమారుడైన షిమీ బెన్యామీనీయుడు, రాజైన దావీదు కుమారుడైన అబ్షాలోము ద్వారా చంపబడకుండ తప్పించుకొనుటకు యెరూషలేమునుండి దావీదు పారిపోవుచున్నప్పుడు అతను రాజైన దావీదును శపించియున్నాడు మరియు అతనిపై రాళ్ళను రువ్వాడు.
  • షిమీ పేరుతొ పాత నిబంధనలో అనేకమంది లేవి యాజకులు కూడా ఉన్నారు.

(ఈ పదములను కూడా చూడండి: అబ్షాలోము, బెన్యామీను, లేవి, యాజకుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H8096, H8097

షిమ్యోను

వాస్తవాలు:

పరిశుద్ధ గ్రంథములో షిమ్యోను అను పేరు మీద అనేకమంది వ్యక్తులున్నారు.

  • పాత నిబంధనలో యాకోబు (ఇశ్రాయేలు) రెండవ కుమారుడు పేరు షిమ్యోను. తన తల్లి పేరు లేయా. తన సంతానము ఇశ్రాయేలు పన్నెండు గోత్రీకులలో ఒకరిగా మారిరి.
  • షిమ్యోను గోత్రము వారు వాగ్ధాన దేశమైన కానానులో దక్షిణాది ప్రాంతమును వశము చేసికొనిరి. ఈ ప్రాంతము యూదాకు సంబంధించిన భూమి ద్వారా ఆవరించబడియుండును.
  • యోసేపు మరియలు శిశువుగానున్న యేసును దేవునికి ప్రతిష్టించాలని యెరూషలేములోని దేవాలయమునకు వచ్చినప్పుడు, షిమ్యోను అనే పేరుగల ఒక వృద్దుడు మెస్సయ్యాను చూసేందుకు దేవుడు నాకు అనుమతినిచ్చియున్నాడని దేవునిని మహిమపరిచాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: twelve tribes of Israel, Jacob, Leah)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong’s: H8095, H8099, G48260

షిలోహు

వాస్తవాలు:

షిలోహు అనేది యెహోషువా నాయకత్వములో ఇశ్రాయేలీయుల ద్వారా జయించబడిన గోడల కానాను పట్టణమైయుండెను.

  • షిలోహు పట్టణము పడమర యోర్దాను నది ప్రక్కన మరియు బేతెల్ పట్టణపు ఉత్తర భాగాన కనపించును.
  • యెహోషువా ఇశ్రాయేలును నడిపించే కాలములో షిలోహు పట్టణము ఇశ్రాయేలీయులందరు సమావేసమయ్యే స్థలమైయుండెను.
  • ఇశ్రాయేలు పన్నెండు మంది గోత్రీకులకు కానాను దేశమును ఎవరికి ఎంత భాగము పంచిపెట్టాలని యెహోషువా చెబుతున్నప్పుడు, ఆ మాటలను వినుటకు వారందరూ షిలోహునందు కలిసికొనియుండిరి.
  • యెరూషలేములో ఏ దేవాలయమును కట్టక ముందు, ఇశ్రాయేలీయులందరూ వచ్చి బలి అర్పించే పట్టణము షిలోహు అయ్యుండెను.
  • సమూయేలు బాలుడైయున్నప్పుడు, తన తల్లి హన్నా తనను తీసుకొని యెహోవాను సేవించుటకు యాజకుడైన ఏలి ద్వారా తర్ఫీదు పొందుటకు షిలోహుకు వచ్చి విడిచిపెట్టెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: బేతేలు, ప్రతిష్టించు, హన్నా, యెరూషలేము, యోర్దాను నది, యాజకుడు, బలి, సమూయేలు, దేవాలయము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7886, H7887

షెకెము

వాస్తవాలు:

షెకెము అనునది ఉత్తర యెరూషలేముకు సుమారు 40 మైళ్ళ దూరములో ఉండే కానానులోని ఒక పట్టణము. షెకెము అనేది పాత నిబంధనలో ఒక మనుష్యుని ఇవ్వబడిన పేరైయున్నది.

  • షెకెము పట్టణము అనునది యాకోబు తన అన్నయైన ఎశావుతో సమాధానపడిన తరువాత స్థిరపడిన ఊరైయున్నది.
  • యాకోబు షెకెములోని హివ్వియుడైన హమోరు కుమారులనుండి భూమిని కొనుగోలు చేసియున్నాడు. ఈ భూమి తన కుటుంబముకొరకు సమాధి తోటగా మార్చబడెను మరియు తన కుమారులు తనను ఈ స్థలములో సమాధి చేసిరి.
  • హమోరు కుమారుడు షెకెము యాకోబు కుమార్తెయైన దీనాను మానభంగము చేసెను, ఈ కారణాన యాకోబు కుమారులు షెకెము పట్టణములోని మనుష్యులను చంపియుండెను.

(తర్జుమా సలహాలు: హమోరు)

(ఈ పదములను కూడా చూడండి: కానాను, ఎసావు, హమోరు, హివ్వీయుడు, యాకోబు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7928, H7930

షేతు

వాస్తవాలు:

ఆదికాండము గ్రంథములో షేతు ఆదాము హవ్వలకు మూడవ కుమారుడైయుండెను.

  • కయీను చేతిలో చంపబడిన హవ్వ కుమారుడు హెబెలు స్థానములో ఆమెకు షేతును అనుగ్రహించియున్నాడని హవ్వ చెప్పెను.
  • నోవహు షేతు సంతానములలో ఒకడైయుండెను, ప్రళయము వచ్చినప్పటినుండి జీవించిన ప్రతియొక్కరు షేతు సంతానమైయుండెను.
  • షేతు మరియు తన కుటుంబము “ప్రభువు పేరట ప్రార్థన చేసిన వారలలో” మొదటివారైయుండిరి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:Abel, Cain, call, descendant, ancestor, flood, Noah)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong’s: H8352, G45890

షేబ

వాస్తవాలు:

పురాతన కాలములో షేబ అనేది దక్షిణ అరేబియాలో కనిపించే ప్రాంతమైయున్నది లేక పురాతన నాగరీకతయైయున్నది.

  • షేబ దేశము లేక ప్రాంతము బహుశః ఇప్పటి యెమెన్ మరియు ఇతియోపియా దేశాలు వద్ద ఉండి ఉండవచ్చు.
  • ఈ దేశపు నివాసులు బహుశః హాము సంతతియైయుండవచ్చును.
  • షేబ రాణి సొలొమోను జ్ఞానమును గూర్చి మరియు తనకున్న ఐశ్వర్యమును గూర్చి విని, రాజైన సొలొమోనును దర్శించుటకు వచ్చెను.
  • పాత నిబంధన వంశావళులలో “షేబ” అని పేరుగల అనేకమంది పురుషులు కలరు. షేబ అనే ప్రాంతము ఈ మనుష్యులలోనుండే వచ్చి ఉంటుందని ఒక అంచనా కలదు.
  • బెయేర్షేబా పట్టణము షేబాకు చాలా దగ్గరిగా ఉన్నట్లు పాత నిబంధనలో ఒకమారు చూడగలము.

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(ఈ పదములను కూడా చూడండి: అరేబియా, బెయేర్షేబా, ఇతియోపియా, సొలొమోను)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H5434, H7614

షేము

వాస్తవాలు:

షేము నోవహు ముగ్గురు కుమారులలో ఒకడైయుండెను, ఆదికాండ పుస్తకములో ప్రళయము వచ్చినప్పడు నావలోనికి వీరందరూ బయలుదేరియుండిరి.

  • షేము అబ్రాహాముకు మరియు అతని సంతానమునకు పూర్వీకుడైయుండెను.
  • షేము సంతానమును “షేమీయులు” అని పిలిచెదరు; వారు హెబ్రీ మరియు అరాబిక్ భాషలవలె “సెమిటిక్” భాషను మాట్లాడుదురు.
  • షేము సరిసుమారు 600 సంవత్సరాలు జీవించియున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: Abraham, Arabia, ark, flood, Noah)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong’s: H8035, G45900

సమరయ, సమరయకు చెందిన

వాస్తవాలు:

సమరయ అనునది ఒక పట్టణపు పెరైయున్నది మరియు దీని చుట్టూ ప్రాంతము ఇశ్రాయేలు ఉత్తరాదిలో ఉంటుంది. ఈ ప్రాంతము తూర్పున ఉన్నటువంటి యోర్దాను నదికి మరియు పడమరనున్న శారోను బయలుకు మధ్యన ఉంటుంది.

  • పాత నిబంధనలో సమరయ అనునది ఉత్తర ఇశ్రాయేలు రాజ్యమునకు రాజధానియైయుండెను. ఆ తరువాత దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమును కూడా సమరయ అని పిలిచిరి.
  • అశ్శూరియులు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యమును జయించినప్పుడు, వారు సమరయ పట్టణమును వశము చేసికొనిరి మరియు ఆ ప్రాంతమును వదిలిపొమ్మని ఉత్తరాదిన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఎక్కువ బలవంతము చేసిరి, మరియు వారిని అశ్శూరులోని అనేక పట్టణములకు దూరముగా తరలించిరి.
  • అశ్శూరీయులు కూడా అనేకమంది అన్యులను తీసుకొని వచ్చి సమరయ ప్రాంతములో ఉంచిరి, తద్వారా ఇశ్రాయేలీయులు ఆ ప్రాంతమును విడిచి వెళ్లాలని ఉద్దేశించిరి.
  • ఆ ప్రాంతములో మిగిలిపోయిన ఇశ్రాయేలీయులలో కొందరు అక్కడికి వచ్చిన అన్యులను వివాహ మాడిరి. ఇలా వివాహము చేసుకొనుట ద్వారా పుట్టిన సంతానమునే సమరయులు అని పిలిచిరి.
  • యూదులు సమరయులను అలక్ష్యము చేసిరి ఎందుకంటే వారు పాక్షికముగా యూదులైయుండిరి మరియు వారి పితరులు అన్య దేవతలను పూజించియుండిరి.
  • క్రొత్త నిబంధన కాలములో సమరయ ప్రాంతము ఉత్తరాదినున్న గలిలయ ప్రాంతపు సరిహద్దుల ద్వారా మరియు దక్షిణాదినున్న యూదా ప్రాంతము ద్వారా ఆవరించియుంటుంది.

(ఈ పదములను కూడా చూడండి: అషూరు, గలిలయ, యూదయ, శారోన్, ఇశ్రాయేలు రాజ్యము)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 20:04 ఇశ్రాయేలు రాజ్యమున్న భూమియందు నివాసముండుటకు అశ్శూరీయులు అన్యులను తీసుకొని వచ్చి వదిలి. అన్యులు పడద్రోయబడిన పట్టణములను తిరిగి నిర్మించిరి మరియు విడువబడిన ఇశ్రాయేలీయులను వివాహము చేసికొనిరి. అన్యులను వివాహము చేసికొనిన ఇశ్రాయేలీయుల సంతానమును సమరయులు అని పిలిచిరి.
  • 27:08 “రహదారిలో దిగువ మార్గమునకు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి సమరయుడు. (సమరయులు ఇతర దేశములనుండి వచ్చిన ప్రజలను వివాహాము చేసికొనిన ఇశ్రాయేలీయుల సంతానమైయుండిరి. సమరయులు మరియు యూదులు ఒకరినొకరు ద్వేషించుకొనిరి.)”
  • 27:09సమరయుడు తన గాడిదపైన ఆ మనుష్యుని ఎక్కించుకొని, మార్గము ప్రక్కనున్న పూటకూళ్ళవాని యొద్దకు తీసుకొని వెళ్ళెను.”
  • 45:07 అతను (ఫిలిప్పు)సమరయకు వెళ్ళెను, అక్కడ యేసును గూర్చి ప్రకటించెను మరియు అక్కడ ఆ సువార్త ద్వారా రక్షించబడిరి.

పదం సమాచారం:

  • Strong’s: H8111, H8115, H8118, G45400, G45410, G45420

సముద్రం, మహాసముద్రం, పశ్చిమ సముదరం, మధ్యధరా సముద్రం

వాస్తవాలు:

బైబిలులో “గొప్ప సముద్రం” లేక పశ్చిమ సముద్రం” అంటే ప్రస్తుతం పిలుస్తున్న “మధ్యధరా సముద్రం” అని అర్థం, బైబిలు కాలంలోని మనుష్యులకు తెలిసిన అత్యంత పెద్ద నీటి సముదాయం.

  • మధ్యధరా సముద్రానికి సరిహద్దులు: ఇశ్రాయేలు (తూర్పు), ఐరోపా (ఉత్తరం, పశ్చిమం), ఆఫికా (దక్షిణం).
  • పురాతన కాలంలో వ్యాపారానికీ, ప్రయానాలకూ ఈ సముద్రం అత్యంత ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇది అనేక దేశాలకు తీరంగా ఉంది. ఈ సముద్ర తీరంలో ఉన్న పట్టణాలు, ప్రజా గుంపులు అత్యంత సంపదతో ఉన్నాయి, ఎందుకంటే పడవల ద్వారా ఇతర దేశాల నుండి వస్తువులను వారు పొందడం చాలా సులభం.
  • గొప్ప సముద్రం ఇశ్రాయేలుకు పశ్చిమాన ఉన్న కారణంగా, కొన్నిసార్లు దీనిని పశ్చిమసముద్రం అని పిలుస్తారు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఇశ్రాయేలు, ప్రజాగుంపు, అభివృద్ది)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H314, H1419, H3220

సమూయేలు

వాస్తవాలు:

సమూయేలు ప్రవక్తయైయుండెను మరియు ఇశ్రాయేలు చివరి న్యాయాధిపతియైయుండెను. ఈయన ఇశ్రాయేలు మీద రాజులుగా సౌలును మరియు దావీదును అభిషేకించియుండెను.

  • సమూయేలు రామా పట్టణమందు ఎల్కాన హన్నాలకు పుట్టిన కుమారుడైయుండెను.
  • హన్నా గొడ్రాలైయుండెను, అందుచేత దేవుడు ఆమెకు కుమారున్ని ప్రసాదించాలని ఆమె ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ఆ ప్రార్థనకు జవాబే సమూయేలు.
  • దేవుడు తన ప్రార్థనకు ఆలకించి, మగ బిడ్డను ఇచ్చినట్లయితే, తన ప్రార్థన ఫలించినట్లయితే, ఆమె తన కుమారుని యెహోవాకు సమర్పిస్తానని మ్రొక్కుకొనియుండెను.
  • దేవునితో తాను చేసిన వాగ్ధానమును నెరవేర్చుకొనుటకు, దేవాలయములో యాజకుడిగా ఉన్నటువంటి ఏలికి సహాయము చేయుటకు మరియు అతనితోనే ఉండుటకు సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే తనని ఏలి దగ్గరకు పంపించెను.
  • దేవుడు సమూయేలును గొప్ప ప్రవక్తగా చేసెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: హన్నా, న్యాయాధిపతి, ప్రవక్త, యెహోవా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H8050, G4545

సంసోను

వాస్తవాలు:

సంసోను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులలో లేక విమోచకులలో ఒక్కడైయుండెను. ఇతను దాను గోత్రమునుండి వచ్చినవాడైయుండెను.

  • దేవుడు సంసోనుకు గొప్ప బలమును ఇచ్చియుండెను, ఇతను ఇశ్రాయేలీయుల శత్రువులైన ఫీలిశ్తీయులతో పోరాడియుండెను.
  • సంసోను తన వెంట్రుకలను కత్తరించుకొనకుండునట్లు మరియు ఎటువంటి ద్రాక్షారసమైనను లేక మధ్యపానమునైనను త్రాగాకుండునట్లు నాజీరు చేయబడియుండెను. ఈ నాజీరు చేయబడిన కాలమువరకు దేవుడు తనకు శక్తిని బలమును అనుగ్రహించెను.
  • ఇతను చివరికి తన నాజీరును పరిత్యజించెను మరియు తన వెంట్రుకలను కత్తరించుటకు అనుమతించెను, మరియు తనను బంధించుటకు ఫిలిశ్తీయులను బలపరిచెను.
  • సంసోను చెరయందు ఉన్నప్పుడు, దేవుడు మరల తన బలమును తిరిగి పొందుకొనునట్లు చేసెను మరియు తప్పుడు దేవుడైన దాగోను గుడిని, కొంతమంది ఫిలిశ్తీయులను నాశనము చేయుటకు అవకాశమిచ్చెను.

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(ఈ పదములను కూడా చూడండి: విమోచించు, ఫిలిశ్తీయులు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H8123, G4546

సాదోకు

వాస్తవాలు :##

సాదోకు అనేది దావీదు రాజు పరిపాలనకాలములోని ఇశ్రాయేలులో ప్రాముఖ్యమైన ప్రధానయాజకుని పేరు.

  • అబ్షాలోము దావీదు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, సాదోకు దావీదు పక్షముగా నిలిచెను మరియు నిబంధన మందసమును యెరూషలేముకు తీసుకొనివచ్చుటకు దావీదుకు సహాయము చేసెను.
  • కొన్ని సంవత్సరాల తరువాత, ఇతడు దావీదు కుమారుడైన సొలొమోనును రాజుగా అభిషేకించుటలో కూడా పాత్ర వహించాడు.
  • నెహెమ్యా కాలంలో సాదోకు అనే పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులు యేరూషలేము గోడలను తిరిగి నిర్మించడంలో సహాయపడ్డారు.
  • రాజైన యోతాము యొక్క తాతగారి పేరు కూడా సాదోకు.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి: నిబంధన మందసం, దావీదు, యోతాము, నెహెమ్యా, పరిపాలన, సొలొమోను)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H6659, G4524

సిద్కియా

వాస్తవాలు:

సిద్కియా, చివరి యూదా రాజైన యోషీయా కుమారుడు (597-587క్రీ.పూ.) పాత నిబంధనలో సిద్కియా అనే పేరు కలిగినవారు అనేకమంది వున్నారు.

  • యెహోయాకీనును బబులోనుకు చెరగా పట్టుకొని పోయిన తరువాత రాజైన నెబుకద్నేజరు యూదా రాజుగా సిద్కియాను నియమించెను. తరువాత సిద్కియా నెబుకద్నేజరుకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేసెను దాని ఫలితంగా నెబుకద్నేజరు అతనిని బంధిచెను మరియు యెరుషలేమును మొత్తం నాశనము చేసెను.
  • ఇశ్రాయేలు రాజైన ఆహాబు పరిపాలన కాలంలో కనానా కుమారుడైన సిద్కియా అనే అబద్ద ప్రవక్త ఉండేవాడు
  • నెహెమ్యా కాలంలో ప్రభువుతో ఒప్పందం చేసుకున్నవారిలో సిద్కియా అనేపేరు గల వ్యక్తి ఉండెవాడు.

(తర్జుమా సలహాలు: తర్జుమా పేరులు)

(దీనిని చూడండి: ఆహాబు, బబులోను, యెహెజ్కేలు, ఇశ్రాయేలు రాజ్యము, యెహోయాకీను, యిర్మియా, యోషియా, యూదా, నేబుకద్నేజరు, నెహేమ్యా)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H6667

సిరియా

వాస్తవాలు:

సిరియా అనేది ఇశ్రాయేలు ఉత్తర భాగమున ఉండే ఒక దేశమైయున్నది. క్రొత్త నిబంధన కాలములో ఇది రోమా సామ్రాజ్యపు పాలన క్రింద ఉండే ఒక ప్రాంతమైయుండెను.

  • పాత నిబంధన కాలములో, సిరియనులు ఇశ్రాయేలీయులకు బలమైన శత్రు సైన్యమైయుండిరి.
  • ప్రవక్తయైన ఎలీషా ద్వారా కుష్టు రోగమునుండి స్వస్థపరచబడిన నామాను కూడా సిరియా సైన్యాధిపతియైయుండెను.
  • సిరియాలోని నివాసులందరూ నోవహు కుమారుడైన షేమునుండి వచ్చిన ఆరాము సంతతియైయుండిరి.
  • సిరియా రాజధాని దమస్కు, ఈ పట్టణమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో అనేకచోట్ల పేర్కొనబడింది.
  • సౌలు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించాలని ఎన్నో ప్రణాళికలతో వెళ్ళాడు కాని యేసు అతనిని నిలిపివేశాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:Aram, commander, Damascus, descendant, Elisha, leprosy, Naaman, persecute, prophet)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong’s: H0758, H0804, G49470, G49480

సీదోను, సీదోనీయులు

వాస్తవాలు:

సీదోను కానాను పెద్ద కుమారుడైయుండెను. సీదోను అని పిలువబడే కానానీయుల పట్టణము కూడా ఉన్నది, బహుశః కానాను కుమారుడు పుట్టిన తరువాత పేరు పెట్టియుండవచ్చును.

  • సీదోను పట్టణము ప్రస్తుత లెబనోను దేశములోని భాగమైన ప్రాంతములోనున్న మధ్యదరా సముద్రము తీరమున ఉత్తర ఇశ్రాయేలునందు కనబడుతుంది.
  • “సీదోనీయులు” సీదోను మరియు దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతములలో జీవించిన ఫెనికయా ప్రజల గుంపువారైయుండిరి.
  • పరిశుద్ధ గ్రంథములో సీదోను తూరు పట్టణమునకు చాలా దగ్గరగా ఉంటుంది, ఈ రెండు పట్టణములు శ్రీమంత పట్టణములైయుండెను మరియు ఇక్కడి ప్రజలు తమ అనైతిక ప్రవర్తనకు పేరుగాంచియుండిరి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:Canaan, Noah, Phoenicia, the sea, Tyre)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong’s: H6721, H6722, G46050, G46060

సీనాయి, సీనాయి పర్వతము

వాస్తవాలు:

సీనాయి పర్వతము బహుశః ఇప్పుడు సీనాయి పెనిన్సులా అని పిలువబడే దక్షిణ భాగములో కనబడే ఒక కొండ. దీనికి “హోరేబు పర్వతము” అని కూడా పేరు.

*దేవుడు ఇశ్రాయేలీయులకు తన నిబంధనను బయలుపరచి, పది ఆజ్ఞలను వ్రాసిన రాతి పలకలను మోషేకు ఇచ్చాడు.

  • దీనిని "దేవుని పర్వతం" అని కూడా అంటారు.
  • ఇశ్రాయేలీయులు ఎడారిలో తిరుగుతున్నప్పుడు వారికి నీళ్లను అందించడానికి ఒక బండను కొట్టమని దేవుడు మోషేతో ఆ తర్వాత చెప్పిన ప్రదేశం కూడా ఇదే.
  • మోషే గొర్రెలు మేపుతున్నప్పుడు మండుతున్న పొదను చూసిన ప్రదేశం అది.
  • “హోరేబు” అనేది పర్వతం యొక్క అసలు పేరు మరియు “సీనాయి పర్వతం” అంటే “సీనాయి పర్వతం” అని అర్థం, హోరేబు పర్వతం సీనాయి ఎడారిలో ఉన్న వాస్తవాన్ని సూచిస్తుంది.

(ఈ పదములను కూడా చూడండి: ఎడారి, ఐగుప్తు, హోరేబు, వాగ్ధాన భూమి, పది ఆజ్ఞలు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:01 దేవుడు ఎర్ర సముద్రము ద్వారా ఇశ్రాయేలీయులను నడిపించిన తరువాత, ఆయన అరణ్యము ద్వారా సీనాయి అని పిలువబడే పర్వతము దగ్గరికి నడిపించెను.
  • 13:03 మూడు రోజులైన తరువాత, ప్రజలు తమ్మునుతాము ఆత్మీయకముగా సిద్ధపరచుకొనిన తరువాత, దేవుడు ఉరుములు, మెరుపులు మరియు ఆర్భాట శబ్దములతో సీనాయి కొండ మీదకి దిగివచ్చేను.
  • 13:11 అనేక రోజులపాటు మోషే సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడుచుండెను.
  • 15:13 ఆ తరువాత దేవుడు సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికకు విధేయత చూపలేదని యెహోషువా ప్రజలకు తెలియజేసెను.

పదం సమాచారం:

  • Strong's: H2022, H5514, G3735, G4614

సీల, సిల్వాను

వాస్తవాలు:

సీల యెరూషలేములోని విశ్వాసుల మధ్య నాయకుడిగా ఉన్నాడు.

  • యెరూషలేములోని సంఘ పెద్దలందరు అంతియొకయ పట్టణమునకు పత్రికను తీసుకొని వెళ్ళుటకు పౌలు మరియు బర్నబాలతో వెళ్ళుటకు సీలను నియమించారు.
  • యేసు క్రీస్తును గూర్చి ప్రజలకు బోధించుటకు ఇతర పట్టణములకు పౌలుతో సీల ప్రయాణము చేసాడు.
  • పౌలు సీలల ఫిలిప్పి పట్టణములోని చెరసాలలో వెయ్యబడ్డారు. వారు చెరసాలలో ఉన్నప్పుడే దేవునిని పాటలు పాడి స్తుతించారు. మరియు దేవుడు వారిని చెరనుండి విడిపించాడు. చెరసాల అధిపతి వారికి జరిగిన సాక్య్డము ద్వారా క్రైస్తవుడిగా మారాడు.

(అనువాదం సూచనలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: అంతియొకయ, బర్నబా, యెరూషలేము, పౌలు, ఫిలిప్పి, చెర, సాక్ష్యము)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు నుండి ఉదాహరణలు:

  • 47:1 ఒక రోజున పౌలు మరియు తన స్నేహితుడైన సీల ఇరువురు కలిసి యేసును గూర్చిన శుభవార్తను ప్రకటించుటకు ఫిలిప్పి పట్టణమునకు వెళ్ళారు. .
  • __47:2__ఆమె (లుదియ) తన ఇంట బస చేయుటకు పౌలును మరియు సీలను ఆహ్వానించింది, అందుచేత వారు ఆమె ఇంట ఆమెతో పాటు బసచేసారు.
  • 47:3 పౌలు మరియు సీలలు అనేకమార్లు ప్రార్థన చేసికొను స్థలములో ప్రజలను కలిసికొన్నారు.
  • 47:7 అందుచేత బానిసయైన అమ్మాయి యజమానులు పౌలును మరియు సీలను రోమా అధికారుల వద్దకు తీసుకొని వెళ్లి, వారిని జైలులోనికి వేయించారు.
  • 47:8 వారు పౌలు మరియు సీలను చెరసాలలోని అతీ భద్రమైన స్థలములో వేసి, వారి కాళ్లకు బొండలను బిగియించారు.
  • 47:11 చెరసాల అధికారి పౌలు సీల వద్దకు వణుకుతూ వచ్చి, “నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలెను?” అని అడిగాడు.
  • 47:13 ఆ మరుసటి రోజున పట్టణ నాయకులు పౌలు సీలలను చెరసాలనుండి విడుదల చేసారు. మరియు ఫిలిప్పి పట్టణమును విడిచి వెళ్లిపొమ్మని వేడుకొనిరి. పౌలు మరియు సీల లుదియాను మరియు ఇతర కొంతమంది స్నేహితులను దర్శించి, పట్టణమును విడిచి వెళ్లిపోయారు.

పదం సమాచారం:

  • Strong’s: G46090, G46100

సుక్కోతు

నిర్వచనము:

సుక్కోతు అనేది పాత నిబంధనలోని రెండు పట్టణములకు పెట్టిన పేరైయుండెను. “సుక్కోతు” (లేక “సుక్కోతు”) అనే పదమునకు “పాకలు” అని అర్థము.

  • సుక్కోతు అని పిలువబడే మొదటి పట్టణము యోర్దాను నదికి తూర్పు దిక్కున ఉండేది.
  • యాకోబు సుక్కోతులో తమ కొరకు పాకలు వేసుకొంటూ తన కుటుంబముతోనూ మరియు గొర్రెల మందలతోనూ జీవించియుండెను.
  • వందలాది సంవత్సరములు గడిచిపోయిన తరువాత, గిద్యోను మరియు తన సైన్యములోని మనుష్యులు మిద్యానీయులను తరుముకుంటూ వస్తున్నప్పుడు సుక్కోతులో ఆగిపోయిరి, కాని అక్కడి ప్రజలు వారికీ ఆహారమునిచ్చుటకు నిరాకరించిరి.
  • రెండవ పట్టణమైన సుక్కోతు ఐగుప్తుకు ఉత్తరాది సరిహద్దు భాగములో ఉంటుంది, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోని తమ బానిసత్వమునుండి విడుదలపొంది వస్తున్నప్పుడు ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తరువాత వారు సుక్కోతులోనే నిలిచిపోయిరి.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H5523, H5524

సృష్టించేవాడు

వాస్తవాలు:

సాధారణంగా “సృష్టించేవాడు” అంటే ఏదైనా వస్తువును సృష్టించువాడు లేక తయారుచేసేవాడు.

  • బైబిలుగ్రంథంలో “సృష్టించేవాడు” అనే పదం యెహోవా కోసం పేరుగానో లేక బిరుదుగానో వినియోగించబడుతుంది ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించాడు.
  • సాధారణంగా ఈ పదం “ఆయన” లేక “నా” లేక “నీ” అనే పదాలతో జతచెయ్యబడుతుంది.

అనువాదం సూచనలు:

  • ”సృష్టించేవాడు” అనే పదం “సృస్ష్టికర్త” లేక “సృష్టించు దేవుడు” లేక “సమస్తాన్ని చేసినవాడు” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ”ఆయన సృష్టికర్త” అనే పదాన్ని “అతనిని సృష్టించినవాడు” లేక “అతనిని సృష్టించిన దేవుడు” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ”నీ సృష్టికర్త,” “నా సృష్టికర్త” అనే పదాలు అదేవిధంగా అనువదించవచ్చు.

(చూడండి: పేర్లను అనువదించడం)

(చూడండి: సృష్టించడం, యెహోవా)

బైబిలు రెఫరెన్సులు:##

పదం సమాచారం:

  • Strong's: H2796, H3335, H6213, H6466, H6467, G1217

సెన్హేరీబు

వాస్తవాలు:

సెన్హేరీబు అష్షూరుకు శక్తివంతమైన రాజైయుండెను, ఇతనే నినెవె పట్టణము అతీ ప్రాముఖ్యమైన, శ్రీమంత పట్టణమగుటకు కారకుడయ్యుండెను.

  • రాజైన సెన్హేరీబు యూదా మరియు బబులోనుకు విరుద్ధముగా యుద్దములు చేసిన వ్యక్తిగా పేరు పొందియుండెను.
  • ఇతను చాలా అహంకారముగల వ్యక్తియైయుండెను మరియు ఇతను యెహోవాను ఎగతాళి చేసియుండెను.
  • రాజైన హిజ్కియ కాలములో సెన్హేరీబు యెరూషలేము మీద దాడి చేసియుండెను.
  • సెన్హేరీబు సైన్యము నాశనమగునట్లు యెహోవా కార్యము చేసెను.
  • పాత నిబంధన పుస్తకాలైన రాజులు మరియు దినవృత్తాంత గ్రంథాలలో సెన్హేరీబు పాలనలో జరిగిన సంఘటనలన్నియు ఒకే విధముగానే పేర్కొనబడియున్నాయి.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: అష్షూరు, బబులోను, హిజ్కియ, యూదా. ఎగతాళి, నినెవె)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:


సైప్రస్

వాస్తవాలు:

సైప్రస్ మధ్యదరా సముద్రంలో ఒక ద్వీపం. ఇది ఆధునిక టర్కీ దేశానికి 64 కిలో మీటర్ల దక్షిణ దిశగా ఉంది.

  • బర్నబా సైప్రస్ వాడు. కనుక తన పిన తల్లి కుమారుడు యోహాను మార్కు కూడా అక్కడి వాడే అని భావించ వచ్చు.
  • పౌలు, బర్నబా వారి మొదటి మిషనెరీ ప్రయాణం మొదట్లో సైప్రస్ ద్వీపంలో కలిసి ప్రకటించారు. యోహాను మార్కు ఆ యాత్రలో వారికి సహాయంగా వచ్చాడు.
  • తరువాత బర్నబా, మార్కు మరలా సైప్రస్ను దర్శించారు.
  • పాత నిబంధనలో, సైప్రస్ను ప్రస్తావించినది చితిసారకం మ్రాను చెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన సందర్భంలో.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బర్నబా, యోహాను మార్కు, సముద్రం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2953, G2954

సొదొమ

నిర్వచనము:

అబ్రాహాము తోడబుట్టిన వాని కొడుకు లోతు మరియు తన కుటుంబముతో జీవించిన దక్షిణ కానానులో ఒక పట్టణమైయుండెను.

  • సొదొమ చుట్టూ ఉన్నటువంటి భూమి అంతయు నీరావరి మరియు ఫలవంతమైన భూమియైయుండెను, అందుచేత లోతు కానానులో మొదటిగా స్థిరపడిన దేశమైన ప్రాంతములో జీవించుటకు ఆ భూమిని ఎన్నుకొనెను.
  • ఈ పట్టణము ఎక్కడ ఉందని ఖచ్చితముగా తెలియదు, ఎందుకంటే సొదొమ మరియు దాని దగ్గరలోని గొమొర్ర నగరములోని ప్రజలు చేసిన దుష్ట కార్యములను బట్టి దేవునిచేత సంపూర్ణగా నాశనము చేయబడియున్నాయి.
  • సొదొమ మరియు గొమొర్ర ప్రజలు స్వలింగ సంపర్కము జరిగించే భయంకర పాపమునకు నిలువెత్తు నిదర్శనమైయుండిరి.

(ఈ పదములను కూడా చూడండి: Canaan, Gomorrah)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong’s: H5467, G46700

సొలొమోను

వాస్తవాలు:

సొలొమోను రాజైన దావీదుకు పుట్టిన కుమారులలో ఒకడైయుండెను. తన తల్లి పేరు బత్సెబా.

  • సొలొమోను రాజైయుండినప్పుడు, నీకు ఏమి కావాలో కోరుకొనుము అని దేవుడు సొలొమోనుకు చెప్పెను. అందుచేత సొలొమోను ప్రజలను న్యాయముగాను మరియు మంచిగాను పాలించుటకు జ్ఞానమును ఇమ్మని అడిగెను. దేవుడు సొలొమోను మనవితో సంతోషించినందున, ఆయన తనకు జ్ఞానమును మరియు ఐశ్వర్యమును అనుగ్రహించెను.
  • సొలొమోను యెరూషలేములో కట్టిన అద్భుతమైన దేవాలయమునుబట్టి ప్రసిద్ధి చెందియుండెను.
  • సొలొమోను తన పాలనను ఆరంభించిన ప్రారంభ సంవత్సరాలలో చాలా జ్ఞానంగా పాలించినప్పటికి, ఆ తరువాత మూర్ఖముగా అన్య స్త్రీలను వివాహము చేసికొనెను మరియు అన్య దేవతలను ఆరాధించుట ప్రారంభించెను.
  • సొలొమోను అపనమ్మకమునుబట్టి, తన మరణము తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను యూదా మరియు ఇశ్రాయేలు అను రెండు రాజ్యములుగా విభజించెను. ఈ రాజ్యములు అనేకమార్లు ఒకదానితో ఒకటి యుద్ధములు చేసికొనెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి:Bathsheba, David, Israel, Judah, kingdom of Israel, temple)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 17:14 ఆ తరువాత, దావీదు మరియు బత్సేబాలకు ఇంకొక కుమారుడు పుట్టెను, ఆ కుమారునికి వారు సొలొమోను అని పేరు పెట్టెను.
  • 18:01 అనేక సంవత్సరములైన తరువాత, దావీదు మరణించెను, మరియు తన కుమారుడైన __ సొలొమోను __ పాలించుటకు ఆరంభించెను. దేవుడు సొలొమోనుతో మాట్లాడెను మరియు నీకేమి కావాలో కోరుకొమ్మని తనని అడిగెను. సొలొమోను జ్ఞానము ఇమ్మని అడిగినప్పుడు, దేవుడు సంతోషించి, లోకములోనే తనని అత్యంత జ్ఞానవంతునిగా చేసెను. సొలొమోను అనేక విషయములు నేర్చుకొనెను మరియు తను జ్ఞానముగల తీర్పరియైయుండెను. దేవుడు తనను అత్యంత శ్రీమంతునిగాను చేసియున్నాడు.
  • 18:02 యెరూషలేములో దేవాలయము నిర్మించాలని దావీదు ప్రణాళిక వేసిన ఆలోచనతో మరియు తెప్పించిన సామాగ్రితో సొలొమోను దేవాలయమును నిర్మించెను.
  • 18:03 అయితే సొలొమోను ఇతర దేశములనుండి వచ్చిన స్త్రీలను ప్రేమించెను. సొలొమోను వృద్ధుడైనప్పుడు తమ దేవతలను ఆరాధించెను.
  • 18:04 ఈ విషయమును బట్టి, దేవుడు సొలొమోను మీద చాలా కోపము చేసికొనెను, సొలొమోను అపనమ్మకమును బట్టి శిక్షగా, సొలొమోను మరణించిన తరువాత ఇశ్రాయేలు దేశమును రెండు భాగాలుగా విభజిస్తానని వాగ్ధానము చేసెను.

పదం సమాచారం:

  • Strong’s: H8010, G46720

సోయరు

వాస్తవాలు:

సోయరు అనేది చిన్న ఊరు, దేవుడు సొదొమ మరియు గొమొఱ్ఱా పట్టణాలను నాశనంచేసినపుడు లోతు ఈ సోయరు అనే ప్రాంతానికి పారిపోయెను.

  • ఇది గతంలో “బేలా” అని పిలువబడేది అయితే లోతు దేవుణ్ణి ఈ “చిన్న” నగరాన్ని రక్షించమని అడిగినప్పుడు “సోయరు” అని పేరు మార్చబడింది.
  • సోయరు అనేది యోర్దాను నదీతీరప్రాంతంలో కానీ లేదా మృతసముద్రం యొక్క దక్షిణభాగం చివరలో కనబడుతుంది.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి: లోతు, సొదొమ, గొమొఱ్ఱా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6820

సౌలు (పాతనిబంధన)

వాస్తవాలు:

సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉండుటకు దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలీయుడైయుండెను.

  • సౌలు ఎత్తుగా ఉండి అందగాడైయుండెను, మరియు శక్తివంతమైన సైనికుడైయుండెను. ఇశ్రాయేలీయులందరు తమకు రాజుగా ఇతనే ఉండాలని కోరుకొనిన వ్యక్తియైయుండెను.
  • ఇతను మొట్ట మొదటిగా దేవునిని సేవించినప్పటికీ, సౌలు కొంచెం కాలమైన తరువాత అహంకారముగలవాడై దేవునికి అవిధేయుడాయెను. దీనికి ఫలితముగా, సౌలు స్థానములో రాజుగా దేవుడు దావీదును నియమించి, యుద్ధములో సౌలు చంపబడుటకు అనుమతించబడెను.
  • క్రొత్త నిబంధనలో పౌలు అనబడిన సౌలు అనే ఒక యూదుడు ఉండేవాడు, ఈయన యేసు క్రీస్తు అపొస్తలడుగా మారెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: రాజు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 17:01 సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఇతను ప్రజలందరూ కోరుకొనే విధముగానే ఎత్తుగాను మరియు అందముగాను ఉండేవాడు. సౌలు ఆరంభములో ఇశ్రాయేలును ఏలిన కొన్ని సంవత్సరములవరకు మంచి రాజుగా పరిపాలించెను. అయితే ఆ తరువాత కొంత కాలానికి దుష్ట రాజుగా మారి, దేవునికి అవిధేయత చూపెను, అందుచేత దేవుడు సౌలు స్థానములో రాజుగా ఉండుటకు ఇంకొక వ్యక్తిని ఎన్నుకొనియున్నాడు.
  • 17:04 ప్రజలందరూ దావీదును ప్రేమించుచున్నందుకు సౌలు అసూయ పడెను. సౌలు అతనిని చంపుటకు అనేక రీతులుగా ప్రయత్నాలు చేసెను, అందుచేత దావీదు సౌలుకు చిక్కకుండా దాచిపెట్టుకొనెను.
  • 17:05 చిట్ట చివరికి, సౌలు యుద్ధమందు మరణించెను, మరియు దావీదు ఇశ్రాయేలు రాజుగా మారెను.

పదం సమాచారం:

  • Strong's: H7586, G4549

స్తెఫెను

వాస్తవాలు:

స్తెఫెను అనే పేరు విన్నప్పుడు మొట్ట మొదటి క్రైస్తవ హతసాక్షిగా జ్ఞాపకము వస్తుంది, అనగా యేసునందు విశ్వాసముంచినందుకు మొట్ట మొదటిగా చంపబడిన వ్యక్తి అని అర్థము. ఆయన జీవితము మరియు మరణమును గూర్చిన వాస్తవాలన్నియు అపొస్తలుల గ్రంథాలలో దాఖలు చేయబడియున్నాయి.

  • స్తెఫెను యెరూషలేములోని ఆదిమ సంఘము ద్వారా అవసరతలలోనున్న విధవరాండ్రకు మరియు ఇతర క్రైస్తవులకు ఆహారమును అందించే పరిచారకునిగా నియమించబడియుండెను.
  • కొంతమంది యూదులు మోషే ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా మరియు దేవునికి విరుద్ధముగా మాట్లాడుచున్నాడని స్తెఫెనుపైన తప్పుడు మాటలన్నియు ఆరోపించారు.
  • దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల చరిత్రతో ఆరంభించి, మెస్సయ్యాయైన యేసును గూర్చిన సత్య సువార్తను బహు ధైర్యముగా స్తెఫెను మాట్లాడియుండెను.
  • పట్టణమునకు ఆవలి యూదుల నాయకులు కోపముతో ఉండి, స్తెఫెనుపై రాళ్ళను రువ్వి చంపుటకు ఆమోదించిరి.
  • తన మరణ సమయములో తార్సువాడైన సౌలు సాక్షియైయుండెను, ఈ సౌలే తరువాత అపొస్తలుడైన పౌలుగా మార్చబడెను.
  • స్తెఫెను చనిపోవుటకు ముందు పలికిన చివరి మాటలు కూడా ఎంతో ప్రఖ్యాతి చెందియున్నవి, అవేమనగా, “దేవా, ఈ పాపమును వారి మీద ఉంచవద్దు” అని పలికి మరణించియుండెను, ఈ మాటల ద్వారా ఇతరులపట్ల తనకున్న ప్రేమ వెల్లడియగుచున్నది.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: నియమించు, పరిచారకుడు, యెరూషలేము, పౌలు, రాయి, సత్యము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G4736

హగ్గయి

వాస్తవాలు:

హగ్గయి యూదా ప్రవక్త. యూదులు బబులోను చెర నుండి తిరిగి తమ స్వదేశానికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చిన తరువాత ఇతడు ప్రవచించాడు.

  • హగ్గయి ప్రవచిస్తూ ఉన్నకాలంలో యూదాపై రాజు ఎవరూ లేరు.
  • ఇదే సమయంలో జెకర్యా ప్రవక్త కూడా ప్రవచిస్తూ ఉన్నాడు.
  • బబులోనీయులు నెబుకద్నేజర్ కింద ఆలయాన్ని నాశనం చేసాక యూదులు ఆలయాన్ని తిరిగి కట్టించాలని హగ్గయి, జెకర్యాలు హెచ్చరించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: బబులోను, యూదా, నెబుకద్నేజర్, ఉజ్జియా, జెకర్యా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2292

హనన్యా

వాస్తవాలు:

హనన్యా పాత నిబంధనలో అనేకమంది మనుషుల పేరు.

  • ఒక హనన్యా బబులోను ఇశ్రాయేలు బందీ. అతని పేరును "షడ్రకు" గా మార్చారు.
  • అతనికి తన శ్రేష్టమైన గుణ లక్షణాలు, సామర్థ్యాలు మూలంగా రాజ సంబంధమైన సేవకుడు పదవి వచ్చింది.
  • ఒకసారి హనన్యాను (షడ్రకు) మరో ఇద్దరు ఇశ్రాయేలు యువకులను అగ్ని కొలిమిలో పడవేశారు. ఎందుకంటే వారు బాబిలోనియా రాజును పూజించడానికి నిరాకరించారు. దేవుడు వారికేమీ హాని జరగకుండా కాపాడడం ద్వారా తన శక్తి కనపరిచాడు.
  • హనన్యా అనే పేరు గల మరొక మనిషి సొలోమోను సంతతి వాడు.
  • మరొక హనన్యాలు ఒక అబద్ధ ప్రవక్త. యిర్మీయా ప్రవక్త కాలంలో నివసించాడు.
  • హనన్యా పేరు గల మరొక మనిషి యాజకుడు. నెహెమ్యా కాలంలో ఉత్సవంలో పాల్గొన్నాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: అజర్యా, బబులోను, దానియేలు, అబద్ధ ప్రవక్త, యిర్మీయా, మిషాయేలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2608

హనోకు

వాస్తవాలు:

హనోకు పాత నిబంధనలో ఇద్దరు మనుష్యుల పేరు.

  • ఒకరు షేతు సంతతి వాడు. అతడు నోవహు పూర్వీకుడు.

  • హనోకు దేవునితో సన్నిహిత సంబంధం గలవాడు. అతడు 365 సంవత్సరాలు జీవించిన తరువాత దేవుడు అతడింకా బ్రతికి ఉండగానే పరలోకం తీసుకువెళ్ళాడు.

  • హనోకు అనే పేరు గల మరొకడు కయీను కుమారుడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: కయీను, షేతు)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2585, G18020

హన్నా

వాస్తవాలు:

హన్నా ప్రవక్త సమూయేలు తల్లి. ఆమె ఎల్కానా ఇద్దరు భార్యల్లో ఒకామె.

  • హన్నాకు పిల్లలు లేరు. అందువల్ల ఆమె చాలా వేదనలో ఉంది.
  • ఆలయం దగ్గర హన్నా ఆసక్తిగా దేవుణ్ణి తనకు సంతానం ఇమ్మని ప్రార్థించింది. ఆ బిడ్డను దేవునికి ప్రతిష్టించుతానని మొక్కుకుంది.
  • దేవుడు ఆమె విన్నపం దయచేశాడు. బాలుడు సమూయేలు పెద్దయ్యాక ఆమె అతన్ని ఆలయంలో సేవకై తీసుకువచ్చింది.
  • దేవుడు హన్నా కు మరింత మంది పిల్లలను ఇచ్చాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: గర్భ ధారణ, సమూయేలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2584

హబక్కూకు

వాస్తవాలు:

హబక్కూకు పాత నిబంధన ప్రవక్త. అతడు యూదాను యెహోయాకీము పరిపాలన చేస్తున్న కాలంలో నివసించాడు. ప్రవక్త యిర్మీయా కూడా ఇదే కాలంలో ఉన్నాడు.

  • ఈ ప్రవక్త హబక్కూకు గ్రంథం క్రీ. పూ 600 కాలంలో రాశాడు. బబులోనీయులు యెరూషలేమును ఆక్రమించుకుని అనేకమంది యూదా ప్రజలను ప్రవాసం తీసుకుపోయారు.
  • యెహోవా హబక్కూకు ప్రవక్తకు ఏవిధంగా "కల్దీయులు" (బబులోనీయులు) యూదాను ఏవిధంగా చెరపడతారో చెప్పాడు.
  • హబక్కూకు ప్రఖ్యాత పలుకులు: " న్యాయవంతుడు తన విశ్వాసం మూలంగా జీవిస్తాడు."

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బబులోను, యెహోయాకీము, యిర్మీయా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2265

హమాతు, హమాతీయులు, లెబో హమాతు

వాస్తవాలు:

హమాతు కనాను ప్రదేశం ఉత్తరాన, ఉత్తర సిరియాలో ఉన్న ప్రాముఖ్యమైన పట్టణం. హమాతీయులు నోవహు కుమారుడు కనాను సంతానం.

  • "లెబో హమాతు" అనే పేరు బహుశా హమాతు దగ్గర ఉన్న కనుమను సూచిస్తున్నది.
  • కొన్ని వాచకాల్లో "లెబో హమాతు"ను "హమాతు ముఖ ద్వారం" అని తర్జుమా చేశారు.
  • దావీదు రాజు హమాతు రాజు తవు యొక్క శత్రువులను ఓడించినందువల్ల ఆ రాజుతో దావీదుకు మంచి సంబంధాలు ఏర్పడినాయి.
  • హమాతు సొలోమోను కట్టించిన గిడ్డంగి పట్టణాల్లో ఒకటి. అక్కడ ధాన్యపు నిల్వలు ఉంచారు.
  • దేశం of హమాతు దేశంలో సిద్కియాను నెబుకద్నేజర్ రాజు హతమార్చాడు. యెహోయాహాజును ఐగుప్తియ ఫరో బంధించింది కూడా ఇక్కడే.
  • "హమాతియుడు" అనే దాన్ని “హమాతు మనిషి” అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: బబులోను, కనాను, నెబుకద్నేజర్, సిరియా, సిద్కియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2574, H2577

హవ్వ

వాస్తవాలు:

ఇది మొదటి స్త్రీ పేరు. ఆమె పేరుకు "జీవం” లేక “ప్రాణం గల" అని అర్థము.

  • దేవుడు ఆదాము నుండి పక్కటెముక తీసి హవ్వను చేశాడు.
  • హవ్వను ఆదాముకు "సహాకారిగా" చేశాడు. ఆమె ఆదాము వెంట ఉండి దేవుడు అతనికి ఇచ్చిన పనిలో సహకరించాలి.
  • హవ్వను సాతాను (సర్పము రూపంలో) విషమ పరీక్షకు/శోధనకు  గురిచేసి మొదటగా దేవుడు తినవద్దన్న పండు తినడం ద్వారా పాపం చేయించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు ఎలా అనువదించడం) How to Translate Names)

(చూడండి: [ఆదాము] Adam, life, Satan)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1 తిమోతి 02:13
  • 2 కొరింతి 11:03
  • ఆది 03:20
  • ఆది 04:01-02

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 01:13 తరువాత దేవుడు ఆదాము పక్కటెముకల్లో ఒకటి తీసి ఒక స్త్రీ గా చేసి, ఆమెను ఆదాము దగ్గరికి తెచ్చాడు.
  • 02:02 అయితే ఆ తోటలో మోసపూరితమైన సర్పము ఉన్నది. అది ఆ స్త్రీని ఇలా అడిగెను, "దేవుడు నిజంగా తోటలోని ఏ చెట్టు పండు తినవద్దు అన్నాడా?"
  • 02:11 అతని భార్య పేరు హవ్వ, అంటే "జీవం ఇచ్చేది" ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి అవుతుంది.
  • 21:01 సర్పము యొక్క తలను చితకగొట్టుటకు హవ్వ యొక్క సంతానముగా జన్మిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు.
  • 48:02 తోటలో హవ్వను మోసగించుటకు సాతాను సర్పము ద్వార మాట్లాడాడు.
  • 49:08 ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, అది వారి సంతతి నంతటిని చెరిపింది.
  • 50:16 ఆదాము హవ్వ దేవునికి లోబడక లోకములోకి పాపమును తెచ్చినందున, దేవుడు దానిని శపించి, నాశనము చేయుటకు నిర్ణయించెను.

పదం సమాచారం:

  • Strong's: H2332, G20960

హాగరు

వాస్తవాలు:

హాగరు ఐగుప్తియ స్త్రీ. ఆమె శారా సొంత బానిస.

  • శారాకు పిల్లలు కలగక పొతే ఆమె హాగరును సంతానం కోసం తన భర్త అబ్రాముకు ఇచ్చింది.
  • హాగరు గర్భ ధారణ జరిగి ఆమె అబ్రాము కుమారుడు ఇష్మాయేలుకు జన్మ నిచ్చింది.
  • హాగరు ఎడారిలో అల్లాడుతుండగా దేవుడు ఆమెను ఆదుకుని ఆమె సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, సంతతి వాడు, ఇష్మాయేలు, శారా, సేవకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 05:01 కాబట్టి అబ్రాము భార్య శారాఅతనితో చెప్పింది, "ఎందుకంటే దేవుడు నాకు పిల్లలను ఇవ్వలేదు. ఇప్పుడు నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను. ఇదుగో నా సేవిక,హాగరు. ఆమెను వివాహమాడి నాకోసం ఒక కొడుకును కను."
  • 05:02 హాగరు కు కొడుకు పుట్టాడు. అబ్రాము అతని పేరు ఇష్మాయేలు అని పెట్టాడు.

పదం సమాచారం:

  • Strong's: H1904

హాము

వాస్తవాలు:

హాము నోవహు ముగ్గురు కుమారులలో రెండవ వాడు.

  • ప్రపంచ వ్యాప్తమైన వరద భూమిని ముంచెత్తినప్పుడు హాము, అతని సోదరులు వారి భార్యలతో సహా ఓడలో నోవహుతో ఉన్నారు.
  • వరద తరువాత హాము తన తండ్రి, నోవహుకు అప్రతిష్ట తెచ్చిన సందర్భం ఉంది. ఫలితంగా, నోవహు హాము కుమారుడు కనానును, తన సంతానం అంతటినీ శపించాడు. ఎట్టకేలకు వీరు కనానీయ జాతి అయ్యారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: మందసం, కనాను, అప్రతిష్ట, నోవహు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2526

హామోరు

వాస్తవాలు:

హామోరు కనానీయుడు. షెకెము నివాసి. యాకోబు తన కుటుంబంతో సుక్కోతు దగ్గర నివసించాడు. ఇతడు హివ్వీయుడు.

  • యాకోబు తన కుటుంబం సమాధి నేల హామోరు కుమారుల దగ్గర కొన్నాడు.
  • వారు అక్కడ ఉండగా హామోరు కుమారుడు షెకెము యాకోబు కుమార్తె దీనాను మానభంగం చేశాడు.
  • దీనా సోదరులు హామోరు కుటుంబంపై పగబట్టి షెకెము మనుషులందరినీ చంపారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: కనాను, హివ్వీయుడు, యాకోబు, షెకెము, సుక్కోతు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2544

హాయి

వాస్తవాలు:

పాత నిబంధన కాలంలో హాయి అనేది ఒక కనాను ఊరు. ఇది బేతేలుకు దక్షిణాన యెరికోకు 8 కి.మీ. వాయవ్యంగా ఉంది.

  • యెరికోను ఓడించాక, యెహోషువా ఇశ్రాయేలీయుల హాయిపై దాడికి పంపించాడు. అయితే వారు తేలికగా ఓడిపోయారు. ఎందుకంటే దేవుడు వారిపై కోపగించాడు.
  • ఆకాను అనే ఒక ఇశ్రాయేలు వాడు యెరికో దోపుడు సొమ్మును ఉంచుకున్నాడు. అతని కుటుంబం అంతా చనిపోవాలని దేవుడు అజ్ఞాపించాడు. దేవుడు ఇశ్రాయేలీయులు హాయి వారిని ఓడించేలా చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బేతేలు, యెరికో)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5857

హారాను

వాస్తవాలు:

హారాను అబ్రాము తమ్ముడు. లోతు తండ్రి.

  • హారాను అనేది ఒక ఊరు పేరు కూడా. అబ్రాము, తన కుటుంబం ఊరు నుండి కనాను ప్రదేశం చేరుకునే ప్రయాణంలో కొంత కాలం ఇక్కడ నివసించారు.
  • హారాను అనే పేరుగల వేరే వ్యక్తులు. కాలేబు కుమారుడు.
  • మరొక హారాను లేవీ సంతతి వాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, కాలేబు, కనాను, లేవీయుడు, లోతు, తెరహు, ఊరు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2039

హిజ్కియా

నిర్వచనం:

హిజ్కియా యూదా రాజ్యం 13వ రాజు. అతడు దేవునిపై నమ్మకముంచి ఆయనకు లోబడ్డాడు.

  • తన తండ్రి దుష్టరాజు ఆహాజు వలె కాక హిజ్కియా రాజు మంచి రాజు. అతడు యూదాలో విగ్రహ ఆరాధన స్థలాలను నాశనం చేశాడు.
  • ఒక సారి హిజ్కియా చాలా జబ్బు పడి చనిపోయే పరిస్తితి వచ్చినప్పుడు శ్రద్ధగా అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రాణం నిలిపాడు. దేవుడు అతనికి స్వస్థతనిచ్చి మరొక 15 సంవత్సరాలు జీవించేలా చేశాడు.
  • ఇది జరుగుతుంది అనే దానికి సూచనగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. సూర్యుడు ఆకాశంలో వెనక్కి నడిచేలా చేశాడు.
  • తన ప్రజలపై అస్సిరియా రాజు సన్హేరిబు దాడి చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు జవాబిచ్చాడు.

(చూడండి: ఆహాజు, అస్సిరియా, అబద్ధ దేవుడు, యూదా, సన్హేరిబు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2396, H3169, G1478

హిత్తీయుడు, హిత్తీయులు

నిర్వచనం:

హిత్తీయులు హాము సంతానం. అతని కుమారుడు కనాను సంతానం. వారు ఇప్పుడు టర్కీకి ఉత్తర దిక్కున ఉన్న పెద్ద పాలస్తీనా సామ్రాజ్యంలో నివసించారు.

  • అబ్రాహాము హిత్తీయుడైన ఎఫ్రోను నుండి కొంత భూభాగం కొని తన భార్య శారాను ఆ గుహలో పాతిపెట్టాడు. ఎట్టకేలకు అబ్రాహాము సంతానంలో అనేకమందిని ఈ గుహలో పాతిపెట్టారు.
  • ఏశావు తల్లిదండ్రులు అతడు ఇద్దరు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకు బాధపడ్డారు.
  • దావీదు శూరుడు ఒకడు ఊరియా అనే హిత్తీయుడు.
  • సొలోమోను పెళ్లి చేసుకున్నకొందరు విదేశీ స్త్రీలు హిత్తీయులు. ఈ విదేశీ స్త్రీలు సొలోమోను హృదయం దేవుని నుండి వారు ఆరాధించిన అబద్ధ దేవుళ్ళ వైపు తిప్పి వేశారు.
  • హిత్తీయులు తరచుగా ఇశ్రాయేలీయులకు ముప్పుగా ఉన్నారు, శారీరికంగా ఆత్మ సంబంధంగా కూడా.

(చూడండి: సంతతి వాడు, ఏశావు, విదేశీయుడు, హాము, శూరుడు, సొలోమోను, ఊరియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2850

హిల్కియా

వాస్తవాలు:

హిల్కియా యోషియా రాజు పరిపాలనలో ప్రధాన యాజకుడు.

  • ఆలయం మరమ్మత్తు సమయంలో ప్రధాన యాజకుడు హిల్కియా ధర్మశాస్త్రం పుస్తకాన్ని యోషియా రాజు చెంతకు తెమ్మని ఆదేశించాడు.
  • తరువాత ఆపుస్తకం రాజుకు చదివి వినిపించారు. యోషియా అది విని దుఃఖపడి యూదా ప్రజలు మరలా యెహోవా ఆరాధనకు మళ్ళి, అయన చట్టాలకు లోబడాలని చెప్పాడు.
  • హిల్కియాఅనే పేరు గల మరొక మనిషి ఎల్యాకీము కుమారుడు. హిజ్కియా కాలంలో అంతఃపురంలోపని చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఎల్యాకీము, హిజ్కియా, ప్రధాన యాజకుడు, యోషియా, యూదా, చట్టం, ఆరాధన, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2518

హివ్వీయుడు, హివ్వీయులు

వాస్తవాలు:

హివ్వీయులు కనాను ప్రదేశలో ఉన్న ఏడు ముఖ్య జాతుల్లో ఒకటి.

  • ఈ సమూహాలన్నీ హివ్వీయులతో సహా నోవహు మనవడు కనాను సంతానం.
  • హివ్వీయుడు షెకెము యాకోబు కుమార్తె దీనాను మానభంగం చేశాడు. ఆమె సోదరులు పగ సాధింపుగా అనేకమంది హివ్వీయులను చంపారు.
  • యెహోషువా ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి కనాను ప్రదేశం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులను మోసగించి తమతో ఒప్పందం చేసుకునేలా హివ్వీయులు కపటంగా ప్రవర్తించారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: కనాను, హామోరు, నోవహు, షెకెము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2340

హెబ్రోను

వాస్తవాలు:

హెబ్రోను ఉన్నతమైన కొండలపై యెరూషలేముకు 20 మైళ్ళు దక్షిణాన ఉన్న ఊరు.

  • క్రీ. పూ 2000 అబ్రాము కాలంలో ఈ పట్టణం నిర్మాణం జరిగింది. పాత నిబంధన చారిత్రిక కథనాల్లో అనేక సార్లు ఈ పట్టణం ప్రస్తావన ఉంది.
  • హెబ్రోను పట్టణానికి దావీదు రాజు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. అతని కొడుకులు చాలా మంది అబ్షాలోముతో సహా ఇక్కడే పుట్టారు.
  • క్రీ శ 70 లో ఈ పట్టణాన్నిరోమీయులు నాశనం చేశారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్షాలోము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2275, H2276, H5683

హెర్మోను పర్వతం

వాస్తవాలు:

హెర్మోను పర్వతం ఇశ్రాయేలు దేశంలోని దక్షిణ పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన పర్వతం.

  • గలిలయ సముద్రానికి ఉత్తరాన, ఇశ్రాయేలు సిరియా మధ్య ఉత్తర తీరాన్న ఇది ఉంది.
  • ప్రజా గుంపులు ఈ పర్వతానికి “సిరియోను పర్వతం” లేక “సీనారు పర్వతం” అని పేరు పెట్టారు.
  • హెర్మోను పర్వతానికి మూడు ప్రధాన పర్వత శిఖరాలు ఉన్నాయి. అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం 2,800 మీటర్ల ఎత్తు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఇశ్రాయేలు, గలిలయ సముద్రం, సిరియా)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2022, H2768, H2769, H8149

హేబెలు

వాస్తవాలు:

హేబెలు ఆదాము హవ్వల రెండవ కొడుకు. అతడు కయీను తమ్ముడు.

  • హేబెలు గొర్రెల కాపరి.
  • హేబెలు దేవునికి అర్పణగా కొన్ని జంతువులను అర్పించాడు.
  • దేవుడు హేబెలు, అతని అర్పణల విషయంలో సంతోషించాడు.
  • ఆదాము హవ్వల పెద్ద కొడుకు కయీను హేబెలును చంపాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి:Cain, sacrifice, shepherd)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: H1893, G00060

హేరోదియ

వాస్తవాలు:

హేరోదియ హేరోదు అంతిప భార్య. యూదాలో బాప్తిసమిచ్చే కాలంలో ఈమె ఉంది.

  • హేరోదియ అసలు హేరోదు అంతిప సోదరుడు ఫిలిప్పు భార్య. అయితే తరువాత హేరోదు అంతిప ఆమెను చట్టవిరుద్ధంగా పెళ్లి చేసుకున్నాడు.
  • బాప్తిసమిచ్చే యోహాను హేరోదు, హేరోదియను వారిచట్టవిరుద్ధమైన వివాహం నిమిత్తం గద్దించాడు. అందువల్ల హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు. హేరోదియ ఎట్టకేలకు అతని శిరచ్చేదనం కోరింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: Herod Antipas, John (the Baptist))

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong’s: G22660

హేరోదు, హేరోదు అంతిప

వాస్తవాలు:

యేసు జీవిత కాలంలో ఎక్కువ భాగం హేరోదు అంతిప రోమా సామ్రాజ్యంలోని గలిలయ పరగణాకు అధిపతి.

  • నిజంగా రాజు కాకపోయినప్పటికీ కొన్ని సార్లు అంతిప కూడా తన తండ్రి మహా హేరోదు లాగానే”హేరోదు రాజు”గా పిలువబడ్డాడు.

  • హేరోదు అంతిప పరిపాలన రోమా సామ్రాజ్యంలో నాలుగు పరగణాలపై సాగింది. అందుకే అతన్ని "చతుర్దాధిపతి అయిన హేరోదు" అంటారు.

  • ఈ "హేరోదు" బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికించాడు.

  • ఈ హేరోదు అంతిపయే యేసు సిలువ శిక్షకు ముందు ఆయన్ను ప్రశ్నించాడు.

  • కొత్త నిబంధనలో ఇతర హేరోదులు అంతిప కుమారుడు (అగ్రిప్ప), మనవడు (అగ్రిప్ప-2). ఇతడు అపొస్తలుల కాలంలో పరిపాలన చేశాడు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: సిలువ వేయు, మహా హేరోదు, యోహాను ( బాప్తిస్మమిచ్చు), రాజు, రోమ్)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

  • లూకా 03:1-2
  • లూకా 03:18-20
  • లూకా 09:7-9
  • లూకా 13:31-33
  • లూకా 23:8-10
  • మార్కు 06:18-20
  • మత్తయి 14:1-2

పదం సమాచారం:

  • Strong's: G22640, G22650, G22670

హోరేబు

నిర్వచనం:

హోరేబుకు మరొకపేరు సీనాయి కొండ. అక్కడ దేవుడు మోషేకు రాతి పలకలపై రాసి పది ఆజ్ఞలు ఇచ్చాడు.

  • హోరేబు కొండను దేవుని కొండ అన్నారు.
  • హోరేబు మోషే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు తగలబడి పోతున్న పొదను చూసిన స్థలం.
  • హోరేబు కొండ దేవుడు తన నిబంధన ఇశ్రాయేలీయులతో చేసిన చోటు. అక్కడ ఆయన తన ఆజ్ఞలు రాసిన రాతి పలకలు ఇచ్చాడు.
  • దేవుడు తరువాత మోషేకు రాతిని కొట్టి నీరు రప్పించమని చెప్పిన ప్రదేశం కూడా ఇదే. ఇశ్రాయేలీయులు ఎడారి ప్రయాణంలో ఉన్నప్పుడు ఇది జరిగింది.
  • ఈ కొండ సరిగ్గా ఎక్కడ ఉందో తెలియదు. అయితే ఇది ప్రస్తుత సీనాయి ప్రాంతం దక్షిణ భాగాన ఉంది.
  • "హోరేబు" పేరుగల కొండ, "సీనాయి కొండ" ఒకటే అయి ఉండవచ్చు. "సీనాయి కొండ," వాస్తవంగా సీనాయి ఎడారిలో ఉన్న హోరేబు కొండ అయి ఉండవచ్చు.

(చూడండి: నిబంధన, ఇశ్రాయేలు, మోషే, సీనాయి, పది ఆజ్ఞలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2722

హోషేయ

వాస్తవాలు:

హోషేయ ఇశ్రాయేలులో క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాలక్రితం నివసించి, ప్రవచించిన ప్రవక్త.

  • తన పరిచర్య అనేక సంవత్సరాలు అతడు యరోబాము, జెకర్యా, యోతాము, ఆహాజు, హోషేయ, ఉజ్జియా, హిజ్కియా మొదలైన అనేక మంది రాజుల పరిపాలనకాలంలో ప్రవచించాడు.
  • దేవుడు హోషేయతో గోమెరు అనే పేరుగల వేశ్యను వివాహం చేసుకోమని చెప్పాడు ఆమె అతని పట్ల అపనమ్మకంగా లేకపోయినప్పటికీ ఆమెను ప్రేమించమని చెప్పాడు.
  • ఇది తన అపనమ్మకస్తులైన ఇశ్రాయేలు వారి పట్ల దేవుని ప్రేమకు సాదృశ్యం.
  • హోషేయ ఇశ్రాయేలు ప్రజల పాపాలు, విగ్రహారాధన, దేవుని నుండి తొలగిపోవడానికి హెచ్చరికగా వ్యతిరేకంగా ప్రవచించాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆహాజు, హిజ్కియా, హోషేయ, యరోబాము, యోతాము, ఉజ్జియా, జెకర్యా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1954, G5617

హోషేయ

వాస్తవాలు:

హోషేయ అనేది పాత నిబంధనలో ఇశ్రాయేలు రాజులకు అనేకమంది ఇతర మనుషులకు ఉంది.

  • అలా కుమారుడు హోషేయ ఇశ్రాయేలుపై తొమ్మిది సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఇతడు యూదా రాజులు ఆహాజు, హిజ్కియాల కాలంలో పరిపాలించాడు.
  • నూను కుమారుడు యెహోషువా మొదటి హోషేయ. మోషే హోషేయను మరి కొంత మందిని కనాను దేశం లోకి గూఢచారులుగా పంపక ముందు అతని పేరును యెహోషువాగా మార్చాడు.
  • తరువాత మోషే చనిపోయాక, యెహోషువా ఇశ్రాయేలు ప్రజలను కనాను ప్రదేశం స్వాధీనం చేసుకోవడంలో నాయకత్వం వహించాడు.
  • ఇదే పేరు గల మరొక హోషేయ అజజ్యా కుమారుడు. ఎఫ్రాయిమీయుల నాయకుడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)

(చూడండి: ఆహాజు, కనాను, ఎఫ్రాయిము, హిజ్కియా, యెహోషువా, మోషే)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1954