Chapter 6

1 అలాత్కు క్రిస్తీను సందేసంతే గురిన్చి పారంబంతే మనాడు కేంజ్త అంశకీను విడిసి,ఎక్కవ పరినితి సాదిస్సాను దిశాతే సాగంద్కాడు.పాండమిల్లె పన్కీను సెంకె పశ్చాత్తాప పర్దటం,దేవుటే పొర్రో విశ్వాసాము, 2 బాప్తిసాకు,తల్కాయ్తే పొర్రో కైక్కు వాటటం,డొల్లత్తోరు జరుడ్డి తేదటాంపు,బెస్కేట్కి మందాన్ శిక్షాఇందన ముక్యమత్త అంశాన్ పెయిసి మల్ల పునాది వాటకుంట మున్నేట్కి సాగంద్కాడు. 3 దేవుడు ఆదేసిస్కు వాన్టీను కూడా తుంగ్కాడు. 4 ఓను జీవితాకూ ఒర్రొసారి వెన్నేల్తీను పొంద్తోరు,పరాలోకాతే వరమ్తిను అనుభవిస్తా వారు,పరిశుద్ద ఆత్మాతే భాగం పొంద్తోరు. 5 దేవుటే మెంచి మాటతీను,పెరెకే వాదాను కాలంతే సంబందిస్త శేక్తికీను రుసి ఊడ్తోరు,ఒరొవేల అర్రు విడిసి తప్పిఅత్కు ఓరీను జరుడ్డి పశ్చాతాప పర్దనాటే తుంగటం సాద్యమయ్యో . 6 బారిత్కు దేవుటే మర్రీను ఓరే మల్ల సిలవ వాటోరు ఓనీను అందోర్కి తెలియనాటే అపఆస్యం తుంగోమిన్నోరు. 7 ఇద్దు బేలాఇత్కు,ఏకసోయ్ దాన్ పొర్రో అర్దాను వానాతేత్తే నాంద్తనేలు,అద్దె నేలాతే పొర్రో శ్రేమిస్సోమందనోర్కి ప్రయోజనమత్త పంటతీను ఈసోరుదేవుటే దీవేనాకు పొందోమిందే . 8 అత్కు కొయ్యేకు,కోయ్యేనుపోదాకు ఆ నేల్దే మొద్తుకు వ్యర్దమత్తాదింజొ శేపా వాటితోరు. 9 ప్రియమత్త జతగాక్కినీరే,మమ్మ ఇల తిర్యోమత్కానుగుడా మీరుదీన్ కన్నా మెంచి స్థితితే మిన్నీరింజొ,రక్షణత్కి సంబందిస్త విసియకీను మెంచి స్థితితే మిన్నీరింజొ గట్టిగా నమ్మోమిన్నాము. 10 దేవుండు అన్యాయం తుంగోనోండయ్యో.పరిసుద్దుర్కీంకుమీరు సేవాకు తుంగ్తీరు.తుంగోరేమిన్నీరు.దేవుని పేర్దికి మీరు తోపిస్త ప్రేమతీను మీ సేవాకీను ఓండు మర్న్గీవోండు. 11 మీయా పతిఒర్రోమ్డు సంపూర్తినిస్చయం తోటే,పూర్తి నమ్మకం తోటే ఇచ్చోటే సేర్దతోటే సివ్రాతే వర్కు అమ్తీరింజొ బెచ్చోగానో ఆసిస్సోమిన్నాం. 12 మీరు బద్ధకం వార్గా మందవాలింజొ మమ్మ కోరుకుండ్జోరిల్లాం,విస్వాసంతోటే సహనంతోటే వాగ్దానకీను వారసత్వందిస్తే పొంద్తోరీను అనసరిస్సవాలింజొ కోరోమిన్నాం.(3 )తెరగుడ్డాతే లోపాల్తికి అత్త మన తోల్తే పూజారు మనాను కూడా తీసోయ్తోండు 13 దేవుండు అబ్రామీన్కువాగ్దానం తుంగ్తస్కే,ఒన్కన్నా గొప్పవాండు బేనోండు ఇల్లోండు కాబట్టే"నా జెత్త "ఇంజోరు ఒట్టు వాట్తోండు. 14 తప్పకుంట ఆశిర్వదిస్సితాను.నీ పిల్లాను దిట్టాం తుంగితాను"ఇత్తోండు. 15 ఈ దిస్తే అబ్రాహం సహనం తోటే ఎదురూడోమత్త పెరెకే దేవుండు ఓన్కివాగ్దానం తుంగ్త భూమితీను పొంద్తోండు. 16 సాదర్నంగత్కు ప్రజల్కు ఓర్కన్నా గోప్పవాను "జెత్త"ఇంజో ఒట్టు వాటితోరు.ఒర్కిమందాను పతి గొడవాత్కి పరిష్కారం తోపిస్సనద్దు ఒట్టే. 17 వాగ్దానాత్కి మర్కత్త వోరికి ఓని సంకల్పం మార్పిల్లవద్దింజొ పస్టంతుంగనాన్కి దేవుండు ఓను ఒట్టీనే హామీగా ఇత్తోండు. 18 దేవుండు అబద్దం తిర్యాలో ఈ రెండు మార్పు చెందాలో విసియకీను తోటే దీనిన్ తుంగ్తోండు.ఆశ్రేయం కొరీమిర్రాను మనాంకు మన మున్నే మత్త ఆశబావంతీను బలంతోటే పెయిదనాంకు గట్టీగ ఉసేర్తుంగి మనామ్కి కలగవాలింజొ తుంగ్తోండు. 19 ఈ ఆసబావం మన ఆత్మకీంకుచెక్కుచెదరకుంట,స్థిరమత్త మైనందిస్తే మంజి తెరగుడ్డాతే లోపల్తికి అంజోమిందే. 20 కలకాలం మెల్కీసెదేకీను క్రమంతే తోల్తే పూజారత్త యేసు మన తర్పీను మనకన్నా మున్నే దానాగ అత్తోండు.