1
నాల్గోవ హింసఖా౦డ సౌలు ఆధ్వర్యంలో ఆరోజు నుండి యెరూషలేములోని సంగములో తీవ్రమైన హింస మొదలయింది .
2
అపోస్తులులు తప్ప మిగిలిన వారంతా సమరయా ,ప్రాంతాల్లోకి పారిపోయారు.మిగిలిన వారు అంతా భక్తి పరులైన ,స్తెఫానును సమాధి చేసి దుఃఖించారు .
3
అయితే సౌలు ప్రతి ఇంటిలోకి వ్ ఇల్లి స్త్రీపురుషులు ,ఈడ్చుకుపోయి చెరసాలలో వేస్తూ సంఘాన్ని అడుచేస్తున్నాడు .
[ మొట్ట మొదట- సువార్త ప్రచారకులు]
4
అయిన చెదరిపోయిన వారు దేవుని వాక్యము ప్రకటించుచున్నారు .
[ఫిలిప్పు పరిచర్య ]
5
ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్లి దేవుని సువార్తను ప్రకటించుచున్నారు .
6
నసమూహములు ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసి అతడు చెప్పిన మాటలు మీద దృష్టి పెట్టారు .
7
చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్దకేకలు వేసి వారిని వదిలి వెళ్లిపోయాయి. చాలా మంది పక్షపాతం వచ్చినవారు ,గ్రుడ్డివారు ,కుంటివాళ్ళు అందరూ బాగుపడ్డారు .
8
అందుకు ఆ పట్టణంలో అందరూ ఆనందించారు .
[ మంత్రాగాడు సీమోను వ్యవహారం]
9
సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్ర విద్య చేస్తూ ,తానొక గొప్పవాడనని చెప్పుకొంటూ ,సమరయా ప్రజలను ఆశ్చర్యపరిచేవాడు .
10
అల్పులు మొదలుకొని అధికుల వరకు అందరూ,'దేవుని మహాశక్తి అంటే ఇతడే 'అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా విన్నారు .
11
అతడు చాలా కాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వరథాని మాట విన్నారు .
12
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు నామం గురించి సువర్థప్రకటిస్తూ ఉంటే ,స్త్రీ పురహుషులు నమ్మి బాప్తిస్మము పొందారు .
13
అప్పుడు సీమోను కూడా నమ్మకంతో బాప్తిస్మమము పొంది ఫిలిప్పుతో ఉంటూ,థాని ద్వారా సూచకక్రియలు గొప్ప అద్భుతాలు జరగడం చూసి ఆశ్చర్యపడి పోయారు .
14
సమరయా వారు వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తులుల పేతురు యోహానులను వారి దగ్గరకి పంపారు .
15
వారు వచ్చి సమరయా విస్వసులు పరిశుద్ధతమను పొందేలా వారి కోసం ప్రార్ధన చేశారు .
16
అంతకు ముందు వారిలో ఎవరిమీద పరిశుద్ధాత్మ వచ్చి ఉండలేదు గాని .వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొంది ఉన్నారు .
17
అప్పుడు పేతురు ,యోహాను వారి సీచేతులుంచగానే వారందరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు
18
అపోస్తులులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం సీమోను చూసి .
19
వారికి ధనమును ఇవ్వజూపి ;నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పారిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారము నాకివ్వండి'ని అడిగాడు .
20
అందుకు పేతురు "నీవు ధనము ఇచ్చి దేవుని వరాన్ని పొందాలనికున్నావు కాబట్టి నీ వెండి నీతో
21
నశించును గాక .
నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు .
22
నీ దుర్మార్గనికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో ఒకవేళ నీ చెడు కోరిక విషయములో ప్రభువు నిన్ను క్షమించవచ్చు .
23
నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాలలో ఉన్నావు .నీవు నిలువెల్లా విషమే అని అన్నాడు .
24
అప్పుడు "సీమోను "మీరు చెప్పిన వాటిలో అటువంటిది, ఏదియు న మీదికి రాకుండా మీరు నాకోసం ప్రభువును 'ప్రార్ధించమని 'చెప్పెను .
25
అటుతరువాత వారు సాక్ష్యమిచ్చుచు ,దేవుని వాక్యం భోదిస్తూ యెరుషలేము తిరిగి వెళ్లిపొచుండగ .సమరయా ప్రజల గ్రామాలలో సంచరిస్తూ సువార్తను ప్రకటించసాగారు .
[ ఇథియోపియా కోశాధికారి ,తో ఫిలిప్పు ]
26
ప్రభువు ధూత దేవునితో ,దక్షిణానికి వెళ్లి యెరూషలేము నుండి గాజా వెళ్లే మార్గములో ఏళ్ళు ,అని చెప్పగానే అతడు లేచి వెళ్లెను .
27
అపుడు ఇథియోపియా రాణి కాంన్దకా దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటిని నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చాడు .
28
అతడు తిరిగి వెళ్తూ ,తన రథము మీద కూర్చొని యేషయ్య ,గ్రంథ ప్రవక్త రాసిన పుస్తకాన్ని చదువుచున్నాడు .
29
ఆత్మ ఫిలిప్పుతో 'నీవు రధం దగ్గరకు వెళ్లి దానిని కలుసుకో అని చెప్పాడు .
30
ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్లి అతడు ప్రవక్తయిన యేషయ్య గ్రంథం చదువుతుంటే విని "మీరు చదివేది మీకు అర్థమవుతుందా ?"అని అడిగాడు.
31
అతడు "నాకెవ్వరు చెప్పకపోతే నాకేలాఅర్ధమవుతుంది అని అని చెప్పి "రథము ఎక్కి నా ప్రక్కన కూర్చోమని అతనిని బ్రతిమలాడుకొనెను .
32
ఇతియోపీయుడు చదివే లేఖన భాగం ఏదంటే -ఆయనను గొర్రెలా వద్దకు తెచ్చారు .బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే , ఆయన నోరు తెరవలేదు.
33
ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు .ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు ? ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు.
34
అప్పుడు ఆ నపుంసకుడు ,"ప్రవక్త చెప్పేది ఎవరి గురించి ?తన ఊరించా లేక వేరొక వ్యక్తి గురించా ?దయచేసి తెలుపుము "అని ఫిలిప్పును అడిగాడు .
35
ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలు పెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.
36
వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళ కోసం ఒక చోటికి వచ్చారు .నపుంసకుడు 'ఇక్కడ నీళ్లు ఉన్నాయి !బాప్తిస్మము ఇవ్వడానికి నాకు ఏమి ఆటంకం ఏమిటి 'అని అడిగి రథాన్ని అపమని ఆజ్ఞాపించాడు.
37
ఫిలిప్పు,నపుంసకుడు ఇద్దరు నీటిలోకి గారు .
38
అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు.
39
వారు నీళ్లలోనుంది బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయెను . నపుంసకుడు సంతోషంతో తన దారినా వెళ్ళిపోయాడు . అతడు ఫిలిప్పును ఇంకెప్పుడు చూడలేదు .
40
అయితే ఫిలిప్పు అజోతు అనే ఊరిలో కనిపించాడు.
వాడు ఆప్రాంతం గుండా వెళ్తూ కైసరయ్య వరకు అన్ని ఊళ్లలో దేవుని సువార్తను ప్రకటించారు .