Key Terms

అక్రమం, దుర్మార్గాలు

నిర్వచనం:

"అక్రమం" అంటే "పాపం," అనే అర్థం ఇచ్చే పదం. అయితే ఇదమిద్ధంగా ఇది తెలిసి చేసిన గొప్ప దుర్మార్గకార్యాలకు వర్తిస్తుంది.

  • "అక్రమం" అక్షరాలా దీని అర్థం అతిక్రమించడం (చట్టాన్ని). ఇది గొప్ప అన్యాయాన్ని సూచిస్తున్నది.
  • అక్రమం అనే దాన్ని కావాలని ఇతరులకు వ్యతిరేకంగా హానికరమైన క్రియలు చెయ్యడం.
  • ఇతర నిర్వచనాలు “చెడ్డ హృదయం” “భ్రష్టత్వం," ఈ రెండు మాటలు భయంకర పాపం పరిస్థితులను వర్ణిస్తున్నాయి.

అనువాదం సలహాలు:

  • "అక్రమం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దుర్మార్గత” లేక “దుష్ట క్రియలు” లేక “హానికరమైన పనులు."
  • తరచుగా, "అక్రమం" అంటే "పాపం” అని కూడా అర్థం వస్తుంది “అపరాధం." కాబట్టి వీటిని రకరకాలుగా తర్జుమా చెయ్యడం ప్రాముఖ్యం.

(చూడండి: పాపం, అపరాధం, హద్దు మీరు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H205, H1942, H5753, H5758, H5766, H5771, H5932, H5999, H7562, G92, G93, G458, G3892, G4189

అంత్య దినం, అంత్య దినాలు, తరువాతి దినాలు

నిర్వచనం:

“అంత్య దినాలు” లేక “తరువాతి దినాలు” అనే పదం సాధారణంగా ప్రస్తుత యుగానికి సంబంధించి అంతం గురించిన కాలాన్ని సూచిస్తున్నాయి.

  • కాల వ్యవధికి తెలియని పరిధి ఉంటుంది.
  • ”అంత్య దినాలు” దేవుని నుండి తొలగిపోయిన వారిమీదికి తీర్పు సమయం.

అనువాదం సూచనలు:

  • ”అంత్య దినాలు” అనే పదాన్ని “చివరి దినాలు” లేక “అంత్య కాలాలు” అని అనువదించవచ్చు.
  • కొన్ని సందర్భాలలో దీనిని “లోకాంతం” లేక “ఈ లోకం అంతం అయ్యేటప్పుడు” అని అనువదించవచ్చు.

(చూడండి: ప్రభువు దినం, న్యాయాధిపతి, తిరగడం, లోకం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H319, H3117, G2078, G2250

అద్భుతం, అద్భుతాలు, ఆశ్చర్యం, ఆశ్చర్యాలు, సూచన, సూచనలు

నిర్వచనం:

“అద్భుతం” అంటే దేవుడు దానిని కలుగజేయకపోతే సాధ్యం కాని అద్భుత కార్యం.

  • యేసు చేసిన అద్భుతాలలో నీటిని నిమ్మళ పరచడం, గుడ్డివానిని బాగు చెయ్యడం ఉన్నాయి.
  • అద్బుతాలను “ఆశ్చర్యకార్యాలు “ అని కొన్నిసార్లు అంటారు, ఎందుకంటే ప్రజలు ఆశ్చర్యపోయేలా, నిర్ఘాంతపోయేలా చేసే కార్యాలు.
  • ”ఆశ్చర్యం” అనే పదం ఆకాశాన్ని భూమిని కలుగజేసినప్పుడు సాధారణంగా దేవుని శక్తిని అద్భుతంగా కనిపిస్తుంది అని తెలియజేస్తుంది.
  • అద్భుతాలను “సూచకక్రియలు” అని కూడా పిలువవచ్చు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిగలవాడు అని అవి సూచకలుగా లేక రుజువులుగా వినియోగించబడతాయి, సర్వ భూమి మీద ఆయనకే సంపూర్ణ అధికారం ఉంది.
  • కొన్ని అద్భుతాలు, ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంనుండి కాపాడినప్పుడు, సింహాల బోనులో దానియేలును భద్రపరచినప్పుడు జరిగిన దేవుని విమోచనా క్రియలు,
  • కొన్ని అద్భుతాలు, నోవాహు కాలంలో ప్రపంచ వ్యాపిత జలప్రళయం రప్పించడం, మోషే కాలంలో ఐగుప్తు ప్రజల మీద భయంకరమైన తెగుళ్ళు రప్పించడం లాంటివి ఆయన తీర్పు కార్యాలు.
  • దేవుని అద్భుతాలలో అనేకం రోగులను స్వస్థపరచే కార్యాలు, చనిపోయినవారిని సజీవులుగా చెయ్యడం.
  • యేసులో దేవుని శక్తి కనిపించింది, ప్రజలను బాగుచెయ్యడం, తుఫానులను నిమ్మళపరచడం, నీటిమీద నడవడం, చనిపోయినవారిని లేపడం వంటి అద్భుతాలలో దేవుని శక్తి కనిపిస్తుంది. ఇవన్నీ అద్భుతాలు.
  • ప్రవక్తలూ, అపొస్తలులు కూడా స్వస్థతలూ, దేవుని శక్తి ద్వారా మాత్రమే సాధ్యమయ్యే కార్యాలు చేసేలా దేవుడు వారిని బలపరచాడు,

అనువాదం సూచనలు:

  • ”అద్భుతాలు” లేక “ఆశ్చర్యకార్యాలు” అనే పదాలను “దేవుడు చేసే అసాధ్యకార్యాలు” లేక “దేవుని శక్తివంతమైన క్రియలు” లేక “దేవుని అద్భుత క్రియలు” అని అనువదించవచ్చు.
  • ”సూచనలు, అద్బుతాలు” అని తరచుగా ఉపయోగించే పదాన్ని “రుజువులు, అద్భుతాలు” లేక “దేవుని శక్తిని రుజువుచేసే అద్భుత కార్యాలు” లేక “దేవుడు గొప్పవాడు అని చూపే ఆయన ఆశ్చర్యకరమైన అద్భుతాలు” అని అనువదించవచ్చు.
  • అద్భుతమైన సూచకక్రియ అనే పదం దేనికైనా రుజువు లేక సాక్ష్యం అనేదానికి భిన్నంగా ఉంటుందని గమనించాలి. ఇవి రెండు ఒకదానికొకటి సంబంధపడి యున్నాయి.

(చూడండి: శక్తి, ప్రవక్త, అపొస్తలుడు, సూచన)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 16:08 ఇస్రాయేలీయులను రక్షించడానికి తనను వాడుకొంటున్నాడు అని గిద్యోను తెలుసుకోడానికి గిద్యోను దేవుణ్ణి రెండు సూచనలను అడిగాడు.
  • 37:10 దేవుడు ఎలిషా ద్వారా అనేక అద్భుతాలు చేసాడు.
  • __37:10__ఈ అద్భుతం ద్వారా యూడులనేకులు యేసు నందు విశ్వాసముంచారు.
  • 43:06”ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చూచినవిధంగా, ఇంతకు ముందు తెలుసుకొన్నవిధంగా యేసు అను ఈ మనుష్యుడు దేవుని శక్తి ద్వారా అనేక సూచకక్రియలను, ఆశ్చర్య కార్యాలను చేసాడు.
  • 49:02 తాను దేవుడనని రుజువు పరచునట్లు యేసు అనేక ఆశ్చర్యక్రియలను చేసాడు. ఆయన నీటిమీద నడిచాడు, తుఫానులను నిమ్మలపరచాడు, రోగులను బాగు చేసాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయినవారిని లేవనెత్తాడు, ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను 5,000 మందికి పైగా సరిపోయే ఆహారంగా మార్చాడు.

పదం సమాచారం:

  • Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H5953, H6381, H6382, H6383, H6395, H6725, H7560, H7583, H8047, H8074, H8539, H8540,, G880, G1213, G1229, G1411, G1569, G1718, G1770, G1839, G2285, G2296, G2297, G3167, G3902, G4591, G4592, G5059

అధికారం, అధికారులు

నిర్వచనం:

"అధికారం" అనే పదం సాధారణంగా ప్రభావం యొక్క స్థానం, బాధ్యత లేదా మరొక వ్యక్తి మీద పరిపాలనను సూచిస్తుంది.

  • రాజులు, పరిపాలన చేసే ఇతర అధికారులు, తాము పరిపాలిస్తున్న వారిమీద అధికారం కలిగియుంటారు.
  • "అధికారులు" అనే పదం ఇతరులమీద అధికారం కలిగియున్న మనుషులనూ, ప్రభుత్వాలనూ, లేక సంస్థలనూ సూచిస్తుంది.
  • "అధికారులు" అనే పదం దేవుని అధికారానికి లోబడని ప్రజలమీద శక్తిని కలిగియున్న ఆత్మ జీవులను కూడా సూచిస్తుంది.
  • యజమానులకు వారి సేవకుల మీదా లేదా బానిసలమీదా అధికారం ఉంటుంది. తల్లిదండ్రులకు వారి పిల్లలమీద అధికారం ఉంటుంది.
  • ప్రభుత్వాలకు వారి పౌరులకోసం చట్టాలు చేసే అధికారం, లేక హక్కు ఉంటుంది.

అనువాదం సూచనలు:

  • "అధికారం" అనే పదాన్ని "అధికారం" లేదా “హక్కు” లేదా “అర్హతలు" అని కూడా అనువదించవచ్చు.
  • కొన్నిసార్లు "అధికారం" అనే పదం "శక్తి" అనే అర్థంతో ఉపయోగించడం జరుగుతుంది.
  • "అధికారులు" అనే పదం ప్రజలను పరిపాలించే వారినీ లేదా సంస్థలనూ సూచించడానికి ఉపయోగించినప్పుడు ఈ పదాన్ని "నాయకులు" లేదా "పాలకులు" లేదా "శక్తులు" గా కూడా అనువదించబడవచ్చు.
  • "తన సొంత అధికారం చేత" అనే పదబందం "నడిపించడానికి తన సొంత హక్కుతో" లేదా “తన స్వంత అర్హతల ఆధారంగా" అని కూడా అనువదించబడవచ్చు.
  • "అధికారం కింద" అనే వ్యక్తీకరణ "లోబడడానికి బాధ్యత” లేదా “ఇతరుల ఆజ్ఞలకు లోబడి యుండడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: రాజు, పాలకుడు, శక్తి,

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247

అధికారి, ప్రభువు, యజమాని, పెద్దమనిషి

నిర్వచనం:

బైబిలులో “అధికారి” పదం సాధారణంగా ప్రజలమీద హక్కుదారత్వం లేదా అధికారం ఉన్నవారిని సూచిస్తుంది. అయితే బైబిలులో ఈ పదం వివిధరకాలైన ప్రజలను, దేవుణ్ణి కూడా సంభోదించడానికి ఉపయోగించబడింది.

  • యేసును సంబోదిస్తున్నప్పుడు గానీ లేదా సేవకులను కలిగిన వ్యక్తిని సూచించేటప్గుపుడు గానీ ఈ పదం “యజమాని” అని అనువదించబడవచ్చు.
  • కొన్ని ఆంగ్ల అనువాదాలలో పై స్థాయిలో ఉన్న వారిని మర్యాదగా సంబోధించే సందర్భంలో “అయ్యా (పెద్ద మనిషి)" అని అనువదించబడింది.

"ప్రభువు" పదం పెద్ద అక్షరాలతో గుర్తించబడినప్పుడు ఇది దేవుణ్ణి సూచిస్తుంది. (అయితే గమనించండి, ఒకరిని సంబోదిస్తున్నట్టి రూపంలో ఉపయోగించబడినట్లయితే లేదా వాక్యం ఆరంభంలో ఈ పదం ఉన్నట్లయితే ఇది పెద్ద అక్షరాలలో ఉండవచ్చు, "అయ్యా" లేదా "యజమాని" అనే అర్థం ఉంటుంది.)

  • పాతనిబంధనలో, “సర్వశక్తిగల ప్రభువైన దేవుడు” లేదా “ప్రభువైన యెహోవా” లేదా “యెహోవా మా ప్రభువు” అనే వాక్యాలలో కూడా ఈ పదం ఉపయోగించబడింది.

  • కొత్తనిబంధనలో, “ప్రభువైన యేసు”, “ప్రభువైన యేసు క్రీస్తు” అనే పదాలను అపొస్తలులు ఉపయోగించారు. యేసు దేవుడని ఇది సూచిస్తుంది.

  • కొత్త నిబంధనలో “ప్రభువు” పదం దేవుణ్ణి నేరుగా సంబోధించడంలో ఉపయోగించబడింది. ప్రత్యేకించి పాతనిబంధన వచనాలను ప్రస్తావించే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగించారు. ఉదాహరణకు, “యెహోవా నామములో వచ్చువాడు ధన్యుడు” అనే వాక్యభాగం, కొత్తనిబందన వాక్యభాగంలో “ప్రభువు నామంలో వచ్చువాడు ధన్యుడు.”

  • ”ప్రభువు” బిరుదు హెబ్రీ, గ్రీకు పదాలలోని అసలు అర్థాన్ని అనువదించడంలో ఉపయోగించబడింది. ఇది దేవుని పేరు (యెహోవా) అనువాదంగా అనేక అనువాదాలలో జరిగినట్లు ఎప్పుడూ ఉపయోగించబడలేదు.

  • కొన్ని అనువాదాలు “ప్రభువు” పదాన్ని “యజమాని” లేదా “పరిపాలకుడు” లేదా హక్కుదారత్వాన్నీ లేదా అత్యున్నత అధికారాన్నీ తెలియపరచే ఇతర పదంగా అనువదించారు.

  • సరియైన సందర్భంలో, అనేక అనువాదాలు ఈ పదంలోని మొదటి అక్షరాన్ని ఈ పదం దేవుణ్ణి సూచిస్తుందని పాఠకుడికి స్పష్టం అయ్యేలా పెద్ద అక్షరంతో రాశారు.

  • కొత్తనిబంధనలో పాతనిబంధన వచనాన్ని ప్రస్తావించినప్పుడు, అది దేవుని గురించి చెపుతున్నదాని తెలియచేయడానికి “ప్రభువైన దేవుడు” అనే పదం వినియోగించబడవచ్చు.

అనువాదం సూచనలు:

  • దాసులను కలిగిన వ్యక్తిని సూచించడానికి ఆ పదానికి సమానమైన “యజమాని” అనే పదంతో అనువదించబడవచ్చు. ఒక సేవకుడు తాను పనిచేస్తున్న వ్యక్తిని పిలవడానికి కూడా ఆ సేవకుడు వినియోగించగలిగిన పదం.
  • ఈ పదం యేసును సూచిస్తున్నప్పుడు, ఆ ప్రసంగీకుడు యేసును ఒక మత బోధకునిగా చూస్తున్నట్టు ఆ వాక్యభాగం చూపిస్తున్నట్లయితే మత నాయకుడిని గౌరవంగా పిలిచేలా “బోధకుడా” అని అనువదించవచ్చు.
  • ఒక వ్యక్తి యేసును ఎరుగకుండా పిలుస్తున్నట్లయితే, “ప్రభువు” పదం మర్యాదపూర్వకమైన సంబోధనగా “అయ్యా” అని అనువదించబడవచ్చు. ఒక వ్యక్తిని మర్యాదపూర్వకంగా పిలువవలసిన ఇతర సందర్భాలలో కూడా ఈ అనువాదాన్ని వినియోగించవచ్చు.
  • తండ్రి అయిన దేవుణ్ణి లేదా యేసును సూచించే సందర్భంలో ఈ పదం ఒక బిరుదులా పరిగణించవచ్చు. “ప్రభువు” (పెద్ద అక్షరాలు) అని ఇంగ్లీషులో రాయ బడవచ్చు.

(చూడండి: దేవుడు, యేసు, పాలకుడు, యెహోవా)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 25:05 అయితే యేసు లేఖనాలనుండి వచనాలను ఎత్తి చూపుతూ సాతానుకు జవాబిచ్చాడు. “దేవుని వాక్యంలో, ‘నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని’ ఆజ్ఞాపించాడని చెప్పాడు.
  • 25:07 “సాతానా నా వెనుకకు పొమ్ము” అని ప్రభువు జవాబిచ్చాడు. దేవుని వాక్యంలో తన ప్రజలకు, “నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయనను మాత్రమే సేవించవలెను” అని ఆజ్ఞాపించాడు.
  • 26:03 ఇది ప్రభువు దయా సంవత్సరం.
  • 27:02 దేవుని ధర్మశాస్త్రం “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించవలెను” అని చెపుతున్నదని ధర్మశాస్త్ర బోధకుడు జవాబిచ్చాడు.
  • 31:05ప్రభువా, ఇది నీవే అయితే, నీటి మీద నడుస్తూ నీ దగ్గరకు వచ్చేలా నాకు ఆజ్ఞ ఇవ్వు” అని పేతురు యేసుతో చెప్పాడు.
  • 43:09 దేవుడు యేసును ప్రభువుగానూ, క్రీస్తుగానూ చేసెనని ఖచ్చితంగా తెలిసికొనుడి.
  • 47:03 ఈ దయ్యము వలన ఆమె ప్రజల భవిష్యత్తును గురించి సోదె చెపుతూ, తన యజమానులకు బహు లాభాన్ని చేకూరుస్తుంది.
  • 47:11ప్రభువు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవునూ, నీ ఇంటివారునూ రక్షించబడుదురు” అని పౌలు జవాబిచ్చాడు.

పదం సమాచారం:

  • Strong's: H113, H136, H1167, H1376, H4756, H7980, H8323, G203, G634, G962, G1203, G2962

అనుగ్రహం, అనుగ్రహాలు, అనుకూలమైన, పక్షపాతం

నిర్వచనం:

"అనుగ్రహం" అంటే ఒక మనిషి పట్ల వాత్సల్యం చూపడం. ఎవరిపైనైనా అనుగ్రహం చూపడం అంటే ఆ వ్యక్తి పట్ల సానుకూలంగా ఉంటూ ఇతరులకన్నా అతనికి ఎక్కువ మేలు చేస్తూ ఉండడం.

  • "పక్షపాతం" అంటే కొందరి పట్ల అంగీకారభావం అనుగ్రహంగా ఉంటూ మరి కొందరి పట్ల అలా కాకుండా ఉండడం. ఇది ఒక వ్యక్తిని అతడు మనకు నచ్చాడు గనక మరొక వ్యక్తికన్నా ఎక్కువ ప్రేమ చూపడం. సాధారణంగా, పక్షపాతం అన్యాయంగా ఎంచబడుతుంది.
  • యేసు "దేవుని, మనుషుల అనుగ్రహం" లో ఎదిగాడు. అంటే వారు అయన తన గుణ లక్షణాలు, ప్రవర్తన ఆమోదించారు.
  • ఎవరిదైనా "అనుగ్రహం పొందడం" అంటే ఆ మనిషి నుండి ప్రత్యేక సానుకూల భావం సంపాదించడం.
  • రాజు ఎవరి మీదనైనా అనుగ్రహం చూపడం అంటే అతడు వ్యక్తి విన్నపాలను ఆమోదించి ఇస్తున్నాడని భావం.
  • "అనుగ్రహం" అంటే కొన్ని చర్యలు, పనులు చేసి మరొకవ్యక్తికి మేలు కలిగించడం.

అనువాదం సలహాలు:

  • అనువదించడంలో ఇతర పద్ధతులు. "అనుగ్రహం" అంటే "ఆశీర్వాదం” లేక “మేలు."
  • "యెహోవా అనుకూల సంవత్సరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. యెహోవాగొప్ప ఆశీర్వాదం పంపించే "సంవత్సరం (లేక సమయం)."
  • "పక్షపాతం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పక్షపాత బుద్ధి” లేక “దురభిమానం” లేక “అన్యాయంగా ప్రవర్తించు." "ప్రియమైన వాడు," అంటే "ఇష్టుడు, ప్రేమను చూరగొన్న వాడు."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H995, H1156, H1293, H1779, H1921, H2580, H2603, H2896, H5278, H5375, H5414, H5922, H6213, H6437, H6440, H7521, H7522, H7965, G1184, G3685, G4380, G4382, G5485, G5486

అపరాధ భావం, దోషం

నిర్వచనం:

"అపరాధ భావం" అంటే వాస్తవంగా పాపం చేసినప్పుడు కలిగే మనో వేదన.

  • "దోష భావం" నైతికంగా ఏదైనా తప్పు, అంటే దేవునికి లోబడని పని చేస్తే కలిగే భావం.
  • "అపరాధ భావం" అనే దానికి వ్యతిరేకం "నిర్దోషత్వం."

అనువాదం సలహాలు:

  • కొన్ని భాషల్లో దీన్ని అనువదించడం “పాప భారం” లేక “పాపాల లెక్క."
  • “దోషం” అంటే "తప్పు చేసిన ఒప్పుదల” లేక “నైతికంగా తప్పు చేసిన స్థితి” లేక “పాపం చేత కట్టుబడిపోవడం."

(చూడండి: నిర్దోష, అక్రమం, శిక్షించు, పాపం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 39:02 వారు అనేక సాక్షులను తెచ్చారు. వారు ఆయన్ను గురించి అబద్ధాలు చెప్పారు. అయితే, వారి మాటలు ఒకరితో ఒకరికి పొసగకపోవడం చేత యూదు నాయకులు అయన దోషి అని రుజువు చెయ్యలేక పోయారు.
  • 39:11 యేసుతో మాట్లాడడం ముగించాక పిలాతు బయటికి పోయి ప్రజలతో చెప్పాడు, "ఇతనిలో ఏ దోషం నాకు కనబడలేదు." అయితే యూదు నాయకులు, గుంపు అరిచారు, "అతన్ని సిలువ వెయ్యి!" పిలాతు ఇలా జవాబిచ్చాడు, "అతడు ఏ అపరాధం చేశాడు?" అయితే వారు మరీ పెద్దగా కేకలు వేశారు. తరువాత పిలాతు మూడవ సారి చెప్పాడు. "అతడు నిర్దోషి!"
  • 40:04 యేసు ఇద్దరు దోపిడీ దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. వారిలో ఒకడు యేసును హేళన చేశాడు. అయితే మరొకడు ఇలా చెప్పాడు, "నీవు దేవునికి భయపడవా? మనం దోషులం, అయితే ఈ మనిషి నిర్దోష.
  • 49:10 ఎందుకంటే నీ పాపం, నీ అపరాధం కోసం నీవు చనిపోవడం న్యాయమే.

పదం సమాచారం:

  • Strong's: H816, H817, H818, H5352, H5355, G338, G1777, G3784, G5267

అపరాధం, అపరాధాలు, అతిక్రమం

నిర్వచనం:

"అపరాధం" అంటే ఆజ్ఞ, పరిపాలన , లేక నైతిక నియమం ఉల్లంఘించడం,. "అపరాధం" జరిగించు "అతిక్రమం."

  • అలంకారికంగా, "అపరాధం" అనే దాన్ని "గీత దాటు," అంటే మితి మీరడం. తన, ఇతరుల క్షేమం కోసం పెట్టిన నియమం మీరడం.
  • పదాలు "అతిక్రమం," "పాపం," "అక్రమం ,” “అతిక్రమం" అన్నింటి అర్థం వ్యతిరేకంగా దేవుని సంకల్పం ధిక్కరించ, ఆయన ఆజ్ఞలు మీరడం.

అనువాదం సలహాలు:

  • "అతిక్రమణ" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "పాపం” లేక “ధిక్కరించు” లేక “తిరగబడు."
  • ఒక వచనం లేక వాక్య భాగం పాపం” లేక “అపరాధం” లేక “అతిక్రమం," అనే అర్థమిచ్చే రెండుపదాలుఉపయోగిస్తే వీలైతే, ఈ పదాలు అనువదించడంలో వేరువేరు పదాలు వాడండి. బైబిల్లో సందర్భంలో రెండు లేక ఎక్కువ ఒకే విధమైన అర్థాలు గల పదాలు ఉంటే సాధారణంగా అందులోని ఉద్దేశం ఆ విషయం నొక్కి చెప్పడానికి, లేక దాని ప్రాధాన్యత తెలపడానికే.

(చూడండి: సమాంతరత)

(చూడండి: పాపం, అతిక్రమం, అక్రమం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H898, H4603, H4604, H6586, H6588, G458, G459, G3845, G3847, G3848, G3928

అపరాధం, అపరాధాలు, అతిక్రమించు

నిర్వచనం:

"అపరాధం” చేయడం అంటే చట్టం మీరడం లేక వేరొకరి హక్కులు ఉల్లంఘించడం. "అతిక్రమం" అంటే "ఆజ్ఞ మీరడం."

  • అతిక్రమం అంటే నైతిక, లేదా సాంఘిక చట్టం, లేక మరొక వ్యక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించడం.
  • ఈ పదానికి "పాపం,” “అపరాధం," అనే పదాలతో ముఖ్యంగా దేవుణ్ణి ధిక్కరించడంతో సంబంధం ఉంది.
  • అన్ని పాపాలు దేవునికి వ్యతిరేకంగా అతిక్రమాలే.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, " వ్యతిరేకంగా అతిక్రమం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వ్యతిరేకంగాపాపం” లేక “పరిపాలనను ధిక్కరించడం."
  • కొన్నిభాషల్లో "హద్దు మీరడం" వంటి పదాలు "అతిక్రమం" అనే దాన్ని అనువదించడంలో ఉపయోగిస్తారు.
  • ఈ పదాన్ని బైబిల్ వచనంలో ఉన్న అర్థంతో పోల్చి అపరాధం” “పాపం" అనే ఒకే విధమైన అర్థం వచ్చే వాటిని వాడవచ్చు.

(చూడండి: ధిక్కరించు, అక్రమం, పాపం, అపరాధం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H816, H817, H819, H2398, H4603, H4604, H6586, H6588, G264, G3900

అపొస్తలుడు, అపొస్తలులు, అపొస్తలత్వం

నిర్వచనం:

“అపొస్తలులు” దేవుని గురించీ, అయన రాజ్యం గురించీ బోధించడానికి యేసు చేత పంపించబడిన మనుషులు. "అపొస్తలత్వం" పదం అపొస్తలులుగా ఎంపిక చెయ్యబడినవారి హోదానూ, అధికారాన్నీ సూచిస్తుంది.

  • ఈ పదం "అపొస్తలుడు"అంటే "ఎవరినైనా ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం పంపించబడడం" అని అర్థం. అపొస్తలుడు తనను పంపిన వ్యక్తికున్న అదే అధికారాన్ని కలిగి ఉన్నాడు.
  • యేసు పన్నెండుమంది అత్యంత సన్నిహితమైన శిష్యులు మొదటి అపొస్తలులు అయ్యారు. ఇతర మనుషులు, పౌలు, యాకోబు, తదితరులు కూడా అపొస్తలులు అయ్యారు.
  • దేవుని శక్తి చేత, అపొస్తలులు ధైర్యంగా సువార్త ప్రకటించడం, మరియు ప్రజల నుండి దయ్యాలను బయటకు వెళ్ళగొట్టడం చేయగలిగారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదం "అపొస్తలుడు" "బయటకు పంపించబడినవాడు" లేదా "పంపబడినవాడు" లేదా "బయటకు వెళ్ళడానికి పిలువబడిన వాడు మరియు దేవుని సందేశాన్ని ప్రజలకు బోధించేవ్యక్తి" అనే అర్ధాన్ని ఇచ్చే పదం లేక పదబంధంతో కూడా అనువదించవచ్చు.
  • "అపొస్తలుడు” మరియు “శిష్యుడు" పదాలను వివిధ రీతులలో అనువదించడం ప్రాముఖ్యం.
  • ఈ పదం స్థానిక లేక జాతీయ భాషలోని బైబిలు అనువాదంలో ఏవిధంగా అనువదించబడిందో కూడా పరిగణించండి.

(చూడండి తెలియని వాటిని అనువదించడం ఎలా)

(చూడండి: అధికారం, శిష్యుడు, యాకోబు (జెబెదయి కుమారుడు), పౌలు, పన్నెండు మంది)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 26:10 అప్పుడు యేసు పన్నెండు మందిని పిలిచి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. అపొస్తలులు యేసుతో ప్రయాణించారు, అయన నుండి నేర్చుకున్నారు.
  • 30:01 యేసు తన అపొస్తలులను అనేక వివిధ గ్రామాల్లో ప్రజలకు ప్రకటించడానికీ మరియు బోధించడానికీ పంపాడు.
  • 38:02 యూదా యేసు అపొస్తలులలో ఒకడు. అతడు తన అపొస్తలుల డబ్బు సంచికి బాధ్యత వహించాడు, అయితే అతడు డబ్బును ప్రేమించాడు. మరియు తరచుగా సంచి నుండి దొంగిలించే వాడు.
  • 43:13 శిష్యులు తమను అపొస్తలుల బోధ, సహవాసం, కలిసి తినడం, ప్రార్థనకు అప్పగించుకున్నారు.
  • 46:08 తరువాత బర్నబా అనే పేరు గల విశ్వాసి సౌలును అపొస్తలుల చెంతకు తీసుకుపోయి దమస్కులో సౌలు ఏ విధంగా సువార్తను ధైర్యంగా ప్రకటించాడో వారికి చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: G651, G652, G2491, G5376, G5570

అభిషేకించు, అభిషేకించి, అభిషేకం

నిర్వచనం:

"అభిషేకించు"అంటే ఒక వ్యక్తిపై లేక వస్తువుపై నూనె పోయడం లేక రుద్దడం. కొన్ని సార్లు నూనెతో సుగంధ ద్రవ్యాలు కలిపి దానికి తియ్యని, పరిమళ వాసన వచ్చేలా చేస్తారు. ఈ పదం పరిశుద్ధాత్మ ఎవరినైనా ఎన్నుకుని శక్తినివ్వడాన్ని సూచించడానికి అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు.

  • పాత నిబంధనలో, యాజకులు, రాజులు, ప్రవక్తలు నూనెతో అభిషిక్తులు అవుతారు. దేవునికి ప్రత్యేక సేవ కోసం నియమించడానికి ఇలా చేస్తారు.
  • బలిపీఠాలు, ప్రత్యక్ష గుడారం వంటి వస్తువులను కూడా నూనెతో అభిషేకించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించి మహిమ పరచడానికి వాటిని ఉపయోగిస్తారు.
  • కొత్త నిబంధనలో రోగులను వారి స్వస్థతకోసం నూనెతో అభిషేకిస్తారు.
  • కొత్త నిబంధనలో రెండు సార్లు పరిమళ నూనెతో ఒక స్త్రీ, ఆరాధన క్రియగా యేసును అభిషేకించడం చూస్తాము. ఒక సారి ఆమె తన భవిషత్తు భూస్థాపన కోసం ఇది చేసిందని యేసు వ్యాఖ్యానించాడు.
  • యేసు చనిపోయాక, అయన స్నేహితులు అయన శరీరాన్ని సమాధి కోసం నూనెలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
  • "మెస్సియా" (హీబ్రూ), "క్రీస్తు" (గ్రీకు) అనే బిరుదు నామాల అర్థం "అభిషిక్తుడు."
  • యేసు అనే మెస్సియా ప్రవక్తగా, ప్రధాన యాజకుడుగా, రాజుగా ఎన్నుకోబడి అభిషేకం పొందాడు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "అభిషేకించు"అనే ఈ పదం ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నూనె పోసి” లేక “నూనె రాసి” లేక “పరిమళ నూనె ప్రోక్షించి ప్రతిష్టించి."
  • "అభిషేకించి"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నూనెతో ప్రతిష్టించి.” లేక “నియమించ బడిన” లేక “ప్రతిష్టించి."
  • కొన్ని సందర్భాల్లోఈ పదం"అభిషేకించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నియమించు."
  • "అభిషేకించిన యాజకుడు,"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నూనెతో ప్రతిష్టించిన యాజకుడు” లేక “నూనె పోసి ప్రత్యేకించిన యాజకుడు."

(చూడండి: క్రీస్తు, సమర్పించు, ప్రధాన యాజకుడు, యూదుల రాజు, యాజకుడు, ప్రవక్త)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H47, H430, H1101, H1878, H3323, H4397, H4398, H4473, H4886, H4888, H4899, H5480, H8136, G32, G218, G743, G1472, G2025, G3462, G5545, G5548

అయ్యో

నిర్వచనము:

“అయ్యో” అనే పదము గొప్ప బాధతో కూడిన భావమును సూచించును. ఎవరైనా ఏదైనా అతీ తీవ్రమైన అపాయమును అనుభవిస్తారని చెప్పే హెచ్చరికను కూడా ఈ పదము తెలియజేయుచున్నది.

  • ప్రజలు తమ పాపములనుబట్టి పొందుకునే శిక్షగా వారు అనుభవించే శ్రమలను ప్రజలకు హెచ్చరికగా “అయ్యో” అనే పదమును జతపరిచి వ్యక్తపరుస్తారు.
  • పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలాలలో భయానకమైన తీర్పును నొక్కి చెప్పుటకు “అయ్యో” అనే పదము పునరావృతం అయ్యుంటుంది.
  • “అయ్యో నేను” లేక “అయ్యో నాకు” అనే మాటలను ఒక వ్యక్తి చెబుతున్నాడంటే అతి తీవ్రమైన శ్రమను గుర్చిన బాధను వ్యక్తపరచుకోవడం అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, “అయ్యో” అనే పదము కూడా “గొప్ప బాధ” లేక “దుఃఖము” లేక “విపత్తు” లేక “ఉపద్రవం” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “(ఏదైనా పట్టణము పేరు చెప్పి) అయ్యో” అని చెప్పిన మాటను తర్జుమా చేయు అనేక విధానములలో “(ఆ పట్టణము) కొరకు జరగబోయేది ఎంత భయానకము” లేక “(పట్టణములో) ప్రజలు భయంకరముగా శిక్షించబడుదురు) లేక “చాలా భయంకరముగా ఆ ప్రజలు శ్రమిస్తారు” అనే మాటలను కూడా చేర్చుదురు.
  • “అయ్యో నేను!” లేక “అయ్యో నాకు!” అనే ఈ మాటను “నేను ఎంత దౌర్భాగ్యుడను!” లేక “నేను దౌర్భాగ్యుడను!” లేక “నాకు కలిగింది ఎంత భయానకము!” అని కూడా తర్జుమా చేయకూడదు.
  • “అయ్యో నీకు” అనే మాటను “నీవు భయంకరముగా శ్రమపడుతావు” లేక “నీవు భయంకరమైన శ్రమలను అనుభవిస్తావు” అని తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H188, H190, H337, H480, H1929, H1945, H1958, G3759

ఆజ్ఞాపించు, ఆజ్ఞ

నిర్వచనం:

"ఆజ్ఞాపించు" పదం అంటే ఎవరినైనా ఏదైనా చెయ్యమని చెప్పడం. "ఆజ్ఞ” ఒక వ్యక్తిని చెయ్యమని చెప్పిన విషయాన్ని సూచిస్తుంది.

  • "ఆజ్ఞ" పదం కొన్నిసార్లు దేవుని నిర్దిష్ట ఆజ్ఞలను సూచిస్తున్నాయి, అవి "పది ఆజ్ఞలు" మాదిరిగా క్రమబద్ధమైనవిగానూ, శాశ్వతమైనవిగానూ ఉన్నాయి.
  • ఒక ఆజ్ఞ నిశ్చయార్ధకంగా ఉండవచ్చు ("నీ తల్లి దండ్రులను సన్మానించుము) లేదా వ్యతిరేకార్ధకంగా ఉండవచ్చు ("దొంగిలించ వద్దు").
  • "ఆధిపత్యం తీసుకోండి" అంటే దేని విషయంలోనైనా లేదా ఎవరివిషయంలోనైనా "అధికారం తీసుకోవడం" లేదా "బాధ్యత తీసుకోవడం" అని అర్థం.

అనువాదం సూచనలు:

  • "చట్టం" వంటి పదానికి భిన్నంగా ఈ పదాన్ని అనువదించడం మంచిది. దీనిని "శాశనం," "కట్టడ" పదాల నిర్వచనాలతో పోల్చడం మంచిది.
  • కొందరు అనువాదకులు "ఆజ్ఞాపించు” మరియు "ఆజ్ఞ" పదాలను తమ భాషలో ఒకే పదంతో అనువదించడానికి యెంచుకొంటారు.
  • దేవుడు చేసిన క్రమబద్దమైన, శాశ్వతమైన ఆజ్ఞలను సూచించే “ఆజ్ఞ” పదం కోసం ఒక ప్రత్యేక పదాన్ని ఉపయోగించడానికి ఇతరులు యెంచుతారు.

(చూడండి: శాశనం, కట్టడ, చట్టం, పది ఆజ్ఞలు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H559, H560, H565, H1696, H1697, H1881, H2706, H2708, H2710, H2941, H2942, H2951, H3027, H3982, H3983, H4406, H4662, H4687, H4929, H4931, H4941, H5057, H5713, H5749, H6213, H6310, H6346, H6490, H6673, H6680, H7101, H7218, H7227, H7262, H7761, H7970, H8269, G1263, G1291, G1296, G1297, G1299, G1690, G1778, G1781, G1785, G2003, G2004, G2008, G2036, G2753, G3056, G3726, G3852, G3853, G4367, G4483, G4487, G5506

ఆత్మ, ఆత్మలు, ఆత్మీయత

నిర్వచనము:

“ఆత్మ” అనే ఈ పదము ప్రజలలో లేక ఒక వ్యక్తిలో కనిపించని అభౌతికమైన భాగమును సూచిస్తుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు, తన ఆత్మ అతని శరీరమును విడిచి వెళ్లును. “ఆత్మ” అనే పదము వైఖరిని లేక భావోద్వేగ స్థితిని కూడా సూచిస్తుంది.

  • “ఆత్మ” అనే పదము భౌతిక శరీరము లేనిదిగా ఉండేదానిని, విశేషముగా దుష్ట ఆత్మను సూచిస్తుంది.
  • ఒక వ్యక్తిలోని ఆత్మ దేవునిని తెలుసుకొని, ఆయనయందు విశ్వసించే ఒక భాగమైయున్నది.
  • సాధారణముగా “ఆత్మీయత” అనే పదము అభౌతికమైన ప్రపంచములో ఉండేదానిని వివరిస్తుంది.
  • పరిశుద్ధ గ్రంథములో విశేషముగా దేవునికి సంబంధించిన ప్రతిదానిని మరియు పరిశుద్ధాత్మను సూచిస్తుంది.
  • ఉదాహరణకు, “ఆత్మీయకమైన ఆహారము” దేవుని ఉపదేశములను సూచిస్తుంది, ఇవి ఒక వ్యక్తి ఆత్మకు మంచి పోషణను అనుగ్రహిస్తాయి, మరియు “అత్మియకమైన జ్ఞానము” పరిశుద్ధాత్మ శక్తినుండి వచ్చిన నీతిని మరియు జ్ఞానమును సూచిస్తుంది.
  • దేవుడు ఆత్మయైయున్నాడు మరియు ఆయన ఇతర ఆత్మలను సృష్టించియున్నాడు, వీరికి భౌతిక శరీరములు ఉండవు.
  • దూతలు ఆత్మలైయున్నారు, ఇందులో దేవునికి విరుద్ధముగా తిరస్కరించి, దుష్ట ఆత్మలుగా మారినవారున్నారు.
  • “ఆత్మ” అనే ఈ పదము “గుణలక్షణములను కూడా సూచించుదురు”, ఉదాహరణకు, “జ్ఞానాత్మ” లేక “ఏలియా ఆత్మలో” ఇలా ఒకరి లేక ఏదైనా గుణలక్షణములను చేర్చి ఉపయోగించురు.
  • ఒక వైఖరికి లేక భావోద్వేలుగా “ఆత్మకు” ఉదాహరణలు చెప్పుటలో “పిరికితనముగల ఆత్మ” మరియు “అసూయ ఆత్మ” అని కూడా చేర్చి చెప్పుదురు.

తర్జుమా సలహాలు;

  • సందర్భాన్ని ఆధారము చేసికొని, “ఆత్మ” అనే పదమును తర్జుమా చేయు విధానములో “అభౌతికమైన ఆకారము” లేక “లోపలి భాగము” లేక “అంతరంగము” అని కూడా ఉపయోగించుదురు.
  • కొన్ని సందర్భాలలో, “ఆత్మ” అనే పదమును “దుష్టాత్మ” లేక “దుష్ట ఆత్మ సంబంధమైన” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “నా అంతరంగములో నా ఆత్మ దుఃఖించుచున్నది” అని వాక్యములో ఉన్నట్లుగా కొన్నిమార్లు “ఆత్మ” అనే పదమును ఒక వ్యక్తిలోని భావాలను వ్యక్తపరచుటకు ఉపయోగించబడును. దీనిని “నా ఆత్మలో నేను దుఃఖించాను” లేక “నేను చాలా ఎక్కువ దుఃఖానికి లోనైయున్నాను” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ఒక గుణలక్షణమునకు లేక వ్యక్తి ధోరణికి సంబంధించిన ఆత్మ” అనే ఈ మాటను “ఆ వ్యక్తి గుణలక్షణము” లేక “ఆ వ్యక్తి ప్రభావము” లేక “ఆ వ్యక్తి ధోరణి” లేక “ఆ వ్యక్తి ద్వారా ఏర్పడిన ఆలోచన” అని కూడా తర్జుమా చేయుదురు.
  • సందర్భానుసారముగా “ఆత్మీయత” అనే పదమును “అభౌతికమైన” లేక “పరిశుద్ధాత్మనుండి” లేక “దేవుని విషయాలు” లేక “అభౌతికమైన ప్రపంచములోని భాగము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ఆత్మీయమైన పాలు” అనే ఈ అలంకారికమైన మాటను “దేవుని గూర్చిన ప్రాథమికమైన ఉపదేశాలు” లేక ‘ఆత్మను పోషించే (పాలు పోషించునట్లు” దేవుని ఉపదేశములు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ఆత్మీయమైన పరిపక్వత” అనే ఈ మాట “పరిశుద్ధాత్మకు విధేయత చూపించు దైవికమైన ప్రవర్తన” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “ఆత్మీయమైన వరము” అనే మాటను “పరిశుద్ధాత్మ ఇచ్చే విశేషమైన సామర్థ్యము” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: దూత, దెయ్యం, పరిశుద్ధాత్ముడు, ఆత్మ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:03 మూడు దినములైన తరువాత, ప్రజలు తమ్మునుతాము ఆత్మియకముగా సిద్ధపరచుకొనినతరువాత, దేవుడు సీనాయి పర్వతమునుండి ఉరుములతోనూ, మెరుపులతోనూ, మరియు గొప్ప బూర ధ్వనులతోను దిగివచ్చెను.
  • 40:07 “సమాప్తమైనది! తండ్రి, నా ఆత్మ నీ చేతులకు అప్పగించుచున్నాను” అని యేసు గట్టిగా అరిచెను. ఆ తరువాత ఆయన తన తలను వంచి, తన ఆత్మను అప్పగించెను.
  • 45:05 స్తెఫెను చనిపొతూ “యేసు నా ఆత్మను చేర్చుకొనుము” అని ఏడ్చెను.
  • 48:07 ఆయన ద్వారా సమస్త ప్రజలు ఆశీర్వదించబడిరి, ఎందుకంటే యేసునందు విశ్వసించిన ప్రతియొక్కరు పాపమునుండి రక్షించబడియున్నారు, మరియు వారందరూ అబ్రాహాము ఆత్మీయ సంతానముగా మార్చబడిరి.

పదం సమాచారం:

  • Strong's: H178, H1172, H5397, H7307, H7308, G4151, G4152, G4153, G5326, G5427

ఆధిపత్యం

నిర్వచనం:

"ఆధిపత్యం" అనే పదం ప్రజలు, జంతువులు, లేక దేశం పై శక్తి, అదుపు, లేక అధికారాలను సూచిస్తున్నది.

  • భూమి అంతటిపై ప్రవక్తగా, యాజకుడుగా రాజుగా యేసు క్రీస్తుకు ఆధిపత్యం ఉంది.
  • సిలువపై యేసు క్రీస్తు మరణం మూలంగా సాతాను ఆధిపత్యం శాశ్వతకాలం రద్దు అయింది.
  • సృష్టి సమయంలో దేవుడు చెప్పాడు. మనిషికి భూమిపై ఉన్న చేపలు, పక్షులు, జీవులన్నిటిపై ఆధిపత్యం ఉంటుంది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని అనువదించే ఇతర పద్ధతులు. "అధికారం” లేక “శక్తి” లేక “అదుపు."
  • "ఒక దానిపై ఆధిపత్యం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"పరిపాలన చెయ్యడం” లేక “నిర్వహించడం."

(చూడండి: అధికారం, శక్తి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1166, H4474, H4475, H4896, H4910, H4915, H7287, H7300, H7980, H7985, G2634, G2904, G2961, G2963

ఆమేన్, నిజంగా

నిర్వచనం:

"ఆమేన్"అనే ఈ పదం ఒక వ్యక్తి చెప్పిన దానిని నొక్కి చెప్పడానికి, లేక దాని వైపు ధ్యాస మళ్ళించడానికి ఉపయోగించేది. దీన్ని తరచుగా ప్రార్థన చివర్లో పలుకుతారు. కొన్ని సార్లు దీన్ని"నిజంగా" అని అనువదించవచ్చు.

  • ప్రార్థన చివర్లో "ఆమేన్" చెబితే ఆ ప్రార్థనతో ఏకీభావం లేక ఆ ప్రార్థన నెరవేరాలన్న అభిలాష వ్యక్తం అవుతుంది.
  • తన ఉపదేశంలో యేసు "ఆమేన్" అనే మాటను తాను చెప్పిన ఒక సత్యాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగించాడు.

అయన తరచుగా ఈ మాట తరువాత "మీతో నేను అంటున్నాను"అనే మాటలు పలకడం ద్వారా ఇంతకు ముందు బోధకు అదనంగా దానికి సంబంధించి చేర్చదలచిన బోధ చెబుతాడు.

  • యేసు "ఆమేన్"ను ఈ విధంగా ఉపయోగించిన చోట కొన్ని అంగ్ల అనువాదాల్లో (యు ఎల్ బి) "నిశ్చయంగా” లేక “నిజంగా” అని దీన్ని అనువదించడం జరిగింది.
  • మరొక పదం అర్థం "నిజంగా" అని కొన్ని సార్లు అనువదించడం చూడవచ్చు. "తప్పక” లేక “తప్పనిసరిగా"అని ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగించేవారు.

అనువాదం సలహాలు:

  • లక్ష్య భాషలో ఏదైనా ఒక ప్రత్యేక పదం లేక పదబంధం నొక్కి చెప్పడానికి ఉపయోగించేది ఉందేమో చూడండి.
  • ఒక ప్రార్థన చివర్లో లేక ఒకదాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తే, "ఆమేన్" అని తర్జుమా చెయ్యవచ్చు. "అలా అగుగాక” లేక “ఆ విధంగా జరుగు గాక” లేక “అది నిజం."
  • యేసు, "నిజంగా చెబుతున్నాను," అన్నప్పుడు ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అవును నేను యథార్థంగా చెబుతున్నాను.” లేక “అది నిజం, నేను కూడా చెబుతున్నాను."
  • "నిజంగా, నిజంగా నీకు చెబుతున్నాను"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దీన్ని యథార్థంగా చెబుతున్నాను.” లేక “మనస్పూర్తిగా చెబుతున్నాను” లేక “నేను మీకు చెబుతున్నది నిజం."

(చూడండి: నెరవేర్చు, నిజం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H543, G281

ఆరాధన

నిర్వచనము:

“ఆరాధన” అనే పదానికి ఒకరిని లేక విశేషముగా దేవునిని ఘనపరచడం, స్తుతించడం, మరియు ఆయనకు లోబడియుండడం అని అర్థము.

  • ఈ పదానికి అనేకమార్లు ఒక వ్యక్తి తననుతాను తగ్గించుకొని ఇంకొక వ్యక్తిని ఘనపర్చుట కొరకు “సాగిలపడడం” లేక “ఒకరు తననుతాను లోబడియుండడం” అనే అర్థము కూడా ఉంటుంది.
  • మనము దేవునిని గౌరవించి, సేవించి, స్తుతించి మరియు ఆయనకు లోబడియున్నప్పుడు మనము ఆయనను ఆరాధించుచున్నాము.
  • ఇశ్రాయేలీయులు దేవునిని ఆరాధించినప్పుడు, ఆ ఆరాధనలో వారు దహనబలిపీఠం మీద ప్రాణులను బలి ఇచ్చేవారు.
  • కొంతమంది ప్రజలు తప్పుడు దేవుళ్ళను ఆరాధించేవారు.

తర్జుమా సలహాలు:

  • “ఆరాధన” అనే ఈ పదమును “క్రిందకి వంగడం” లేక “ఘనపరచి, సేవించడం” లేక “గౌరవించి విధేయత చూపడం” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • కొన్ని సందర్భాలలో “తగ్గించుకొని స్తుతించుట” లేక “ఘనత మరియు స్తుతులను చెల్లించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి: బలి, స్తుతి, ఘనత)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:04 ఆ తరువాత దేవుడు వారికి నిబంధన ఇచ్చెను, మరియు “నేను ఐగుప్తునుండి మిమ్మును రక్షించిన మీ దేవుడైన యెహోవాను. ఇతర దేవుళ్ళను ఆరాధించకూడదు” అని చెప్పెను.
  • 14:02 కనానీయులు దేవునికి లోబడలేదు లేక ఆయనను ఆరాధించలేదు. వారు తప్పుడు దేవుళ్ళను ఆరాధించిరి మరియు అనేక చెడ్డ కార్యములను చేసిరి.
  • 17:06 ఇశ్రాయేలీయులందరూ దేవునిని ఆరాధించుటకు మరియు ఆయనకు బలులు అర్పించుటకు ఒక మందిరమును కట్టాలని దావీదు కాంక్షించెను.
  • 18:12 రాజులందరూ మరియు ఇశ్రాయేలులోని ఎక్కువ శాతపు ప్రజలు విగ్రహములను ఆరాధించిరి.
  • 25:07 “సాతానా నానుండి వెళ్ళిపో! దేవుని వాక్యములో ఆయన తన ప్రజలకు, ‘మీ దేవుడైన యెహోవాను మాత్రమె ఆరాధించాలి మరియు ఆయనను మాత్రమె సేవించాలి అని ఆదేశించియున్నాడు” అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను.
  • 26:02 సబ్బాతు రోజున, ఆయన (యేసు)ఆరాధన స్థలమునకు వెళ్ళెను.
  • 47:01 అక్కడ వ్యాపారియైన లూదియా అనే ఒక స్త్రీని వారు కలిసికొనిరి. ఆమె దేవునిని ప్రేమించి, ఆయనను ఆరాధించే స్త్రీ అయ్యుండెను.
  • 49:18 ఇతర క్రైస్తవులతో దేవునిని ఆరాధించాలని, ఆయన వాక్యమును ధ్యానించాలని, ఆయనకు ప్రార్థన చేయాలని మరియు మీకు ఆయన చేసిన కార్యములను ఇతరులకు చెప్పాలని దేవుడు మీకు చెప్పుచున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H5457, H5647, H6087, H7812, G1391, G1479, G2151, G2318, G2323, G2356, G3000, G3511, G4352, G4353, G4573, G4574, G4576

ఆలయం

వాస్తవాలు:

ఆలయం ఒక భవనం చుట్టూరా ప్రహరీ ఉండి, బయటి వసారాలు ఉన్న నిర్మాణం. అక్కడ ఇశ్రాయేలీయులు ప్రార్థించడానికి, దేవునికి బలి అర్పణలు చెల్లించడానికి వస్తారు. అది యెరూషలేము పట్టణంలో మోరియా కొండపై ఉంది.

  • తరచుగా "ఆలయం" అనే పదం మొత్తం ఆలయం కట్టడాలను, బయటి మండువా లోగిళ్ళను, మధ్యనున్న ముఖ్యభవనాన్ని సూచిస్తుంది. కొన్ని సార్లు ఆలయం అంటే ముఖ్య భవనం.
  • ఆలయం భవనం లో రెండు గదులు ఉన్నాయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం.
  • దేవుడు ఆలయాన్ని తన నివాస స్థలం అన్నాడు.
  • సొలోమోను రాజు తన పరిపాలన కాలంలో ఆలయం నిర్మించాడు. అది యెరూషలేములో దేవుని శాశ్వత ఆరాధన స్థలం.
  • కొత్త నిబంధనలో, " పరిశుద్ధాత్మకు ఆలయం" అనే మాటను సమూహంగా యేసు విశ్వాసులకు ఉపయోగిస్తారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ వారిలో జీవిస్తూ ఉంటాడు.

అనువాదం సలహాలు:

  • సాధారణంగా ప్రజలు "ఆలయంలో," ఉన్నారు అని రాస్తే ఆలయ భవనం బయటి ఆవరణలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆలయం బయటి ఆవరణ.” లేక “ఆలయం నిర్మాణ సముదాయం" అని స్పష్టం చెయ్యవచ్చు.
  • ఇదమిద్ధంగా భవనం అనేది కొన్నిఅనువాదాల్లో "ఆలయం" లేక "ఆలయం భవనం" అని రాస్తారు.
  • దీన్ని అనువదించే విధానం "దేవుని పరిశుద్ధ నిలయం” లేక “పరిశుద్ధ ఆరాధన స్థలం."
  • తరచుగా బైబిల్లో, ఆలయం అంటే "యెహోవా నివాసం” లేక “దేవుని ఇల్లు."

(చూడండి: బలి అర్పణ, సొలోమోను, బబులోను, పరిశుద్ధాత్మ, ప్రత్యక్ష గుడారం, బయటి న్యాయ స్థానం, సియోను, ఇల్లు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 17:06 ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించడం కోసం బలి అర్పణలు ఇవ్వడం కోసం దావీదు ఒక ఆలయం కట్టాలని సంకల్పించాడు.
  • 18:02 యెరూషలేములో, సొలోమోను ఆలయం నిర్మించాడు. దానికోసం అతని తండ్రి దావీదు ముందుగానే పథకం వేసి కావలసిన సరంజామా సమకూర్చాడు. ప్రత్యక్ష గుడారం లో ప్రజలు దేవుణ్ణి ఆరాధించి బలి అర్పణలు చేసిన విధంగానే ఇప్పుడు ఆలయం లో చేస్తున్నారు. దేవుడు ఆలయంలో వెలసి తన ప్రజల మధ్య నివసించాడు.
  • 20:07 వారు (బబులోనీయులు) యెరూషలేము పట్టణాన్ని పట్టుకుని, నాశనం చేశారు. ఆలయంలో నుండి, విలువైన వస్తువులను తీసుకు పోయారు.
  • 20:13 ప్రజలు యెరూషలేముకు వచ్చినప్పుడు వారు ఆలయం తిరిగి కట్టించి ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించారు.
  • 25:04 తరువాత సాతాను యేసును ఆలయం అత్యున్నతమైన గోపురానికి తీసుకుపోయి ఆయనతో ఇలా చెప్పాడు, "నీవు దేవుని కుమారుడి వైతే ఇక్కడ నుంచి దూకు. ఎందుకంటే 'నీ కాలికి రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారు.' అని రాసి ఉంది కదా."
  • 40:07 యేసు చనిపోయాక పెద్ద భూకంపం వచ్చింది. ఆలయంలో ప్రజలను దేవుని సన్నిధినుండి వేరు పరచే తెర పైనుండి కిందకి రెండుగా చినిగి పోయింది.

పదం సమాచారం:

  • Strong's: H1004, H1964, H1965, H7541, G1493, G2411, G3485

ఆశీర్వదించు, ఆశీర్వదించబడిన, ఆశీర్వాదం

నిర్వచనం:

ఎవరినైనా లేక దేనినైనా "ఆశీర్వదించడం" అంటే ఆశీర్వదించబడుతున్న వ్యక్తికి మంచివీ, మరియు ప్రయోజనకరమైన విషయాలు కలిగేలా చెయ్యడం అని అర్థం.

  • ఎవరినైనా ఆశీర్వదించడం అంటే ఆ వ్యక్తికి సానుకూలమైనవి, ప్రయోజనకరమైనవి జరగాలనే కోరికను వ్యక్తపరచడం.
  • బైబిలు కాలాలలో, ఒక తండ్రి తరచుగా తన పిల్లలమీద ఆశీర్వాదం ఉచ్చరిస్తాడు.
  • ప్రజలు దేవుణ్ణి "ఆశీర్వదిస్తున్నారు" లేదా దేవుడు ఆశీర్వదించబడాలనే కోరికను వ్యక్తపరుస్తున్నారు అంటే వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అని అర్థం.
  • పదం "ఆశీర్వదించు" పదం కొన్నిసార్లు ఆహారాన్ని తీసుకోడానికి ముందు దానిని పవిత్రపరచడం కోసం లేదా ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికీ, దేవుణ్ణి స్తుతించడానికీ ఉపయోగించబడుతుంది.

అనువాదం సూచనలు:

  • "ఆశీర్వదించడానికి" అనే పదం "సమృద్ధిగా సమకూర్చడం కోసం" లేదా "చాలా దయతోనూ, అనుకూలంగానూ ఉండడం" అని అనువదించబడవచ్చు.
  • "దేవుడు గొప్ప ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు" వాక్యాన్ని "దేవుడు అనేక మంచి సంగతులు అనుగ్రహించాడు" లేదా "దేవుడు సమృద్ధిగా సమకూర్చాడు" లేదా “దేవుడు అనేక మంచి విషయాలు జరిగేలా చేశాడు" అని అనువదించవచ్చు.
  • "అతడు ఆశీర్వదించబడినవాడు" అనే వాక్యం "అతడు ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అతడు గొప్పగా ప్రయోజనాన్ని పొందుతాడు" లేదా "అతడు “అతడు మంచి వాటిని అనుభవిస్తాడు” లేదా “దేవుడు అతడు వర్ధిల్లేలా చేస్తాడు" అని అనువదించవచ్చు.
  • "ఆ వ్యక్తి ఆశీర్వదించబడినవాడు" వాక్యాన్ని "అటువంటి వ్యక్తికి ఇది ఎంత శ్రేష్ఠమైనది" అని అనువదించవచ్చు.
  • "ప్రభువు స్తుతింపబడును" లాంటి వ్యక్తీకరణలు "దేవుడు స్తుతి నొందును గాక" లేదా "దేవునికి స్తోత్రం" లేదా "నేను ప్రభువును స్తుతిస్తున్నాను" అని అనువదించబడవచ్చు.
  • ఆహారాన్ని ఆశీర్వదించడం సందర్భంలో ఇది "ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం" లేదా "వారికి ఆహారం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించారు" లేదా "దాని కోసం దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఆహారాన్ని పవిత్ర పరచారు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: స్తుతి)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 01:07 అది మంచిదని దేవుడు చూశాడు. మరియు వారిని ఆశీర్వదించాడు.
  • 01:15 దేవుడు ఆదాము, హవ్వలను తన స్వంత స్వరూపంలో చేసాడు. అయన వారిని ఆశీర్వదించాడు"మరియు వారితో, "మీరు అనేకమంది పిల్లలనూ మనుమ సంతానాన్ని కలిగి యుండండి మరియు భూమిని నింపండి" అని చెప్పాడు.
  • 01:16 కాబట్టి దేవుడు తాను చేస్తున్న పని అంతటి నుండి విశ్రమించాడు. ఆయన ఏడవ రోజును ఆశీర్వదించాడు మరియు దానిని పవిత్రపరచాడు ఎందుకంటే ఆ రోజున ఆయన తన పని నుండి విశ్రమించాడు.
  • 04:04 "నీ పేరును గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను మరియు నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ నీ వలన ఆశీర్వాదం పొందుతాయి."
  • 04:07 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించాడు. మరియు "పరలోకానికీ, భూమికీ అధికారి అయిన సర్వోన్నతుడైన దేవుడు అబ్రామును ఆశీర్వదించును గాక" అని చెప్పాడు.
  • 07:03 ఇస్సాకు ఏశావుకు తన ఆశీర్వాదం ఇవ్వాలని కోరాడు.
  • 08:05 చెరసాలలో సైతం, యోసేపు దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు.

పదం సమాచారం:

  • Strong's: H833, H835, H1288, H1289, H1293, G1757, G2127, G2128, G2129, G3106, G3107, G3108, G6050

ఆసక్తి, ఆసక్తికరమైన

నిర్వచనం:

“ఆసక్తి” మరియు “ఆసక్తితో” అనే పదాలు ఒక వ్యక్తికిగాని లేక ఒక ఆలోచనకుగాని చాలా బలమైన అంకితభావము కలిగియుండుటను సూచించును.

  • ఆసక్తి పదంలో మంచికి కారణమయ్యే బలమైన ఆశ మరియు క్రియలు ఉంటాయి. ఒక వ్యక్తి నమ్మకంగా దేవునికి విధేయత చూపుతూ, దానిని ఇతరులు కూడా చేయాలని బోధించే వ్యక్తిని వివరించడానికి ఉపయోగించబడియున్నది.
  • ఆసక్తి కలిగియుండడంలో ఏదైనా ఒక విషయమును చేయుటకు తీవ్రమైన కృషిని ఉంచడం, ఆ ప్రయాసలో నిరంతరం కొనసాగుచూ కొనసాగడం ఉంటుంది.
  • “ప్రభువు ఆసక్తి” లేక “యెహోవా ఆసక్తి” పదాలు తన ప్రజలను ఆశీర్వదించడంలో దేవుని దేవుని బలమైన నిరంతర క్రియలనూ, న్యాయం జరిగేలా చూడడాన్ని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • “ఆసక్తి కలిగియుండుట” అనే ఈ మాటను “బలమైన శ్రద్ధాసక్తిగల” లేక “తీవ్రమైన కృషి చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఆసక్తి” అనే పదము “శక్తితో కూడిన భక్తి” లేక “ఆసక్తితో కూడిన నిర్ధారణ” లేక “నీతిగల అత్యుత్సాహము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “నీ ఇంటికొరకైన ఆసక్తి” అనే పదబంధం “నీ దేవాలయాన్ని బలంగా ఘనపరచడం" లేదా “నీ గృహాన్ని చూచుకోవడంలో తీవ్రమైన కోరికను కలిగియుండుట” అని అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7065, H7068, G2205, G2206, G2207, G6041

ఇశ్రాయేలు, ఇశ్రాయేలీయులు

వాస్తవాలు:

"ఇశ్రాయేలు" అనేది దేవుడు యాకోబుకు పెట్టిన పేరు. అంటే "అతడు దేవునితో పోరాడాడు."

  • యాకోబు సంతానాన్ని "ఇశ్రాయేలు ప్రజలు” లేక “ఇశ్రాయేలు జాతి” లేక “ఇశ్రాయేలీయులు" అన్నారు.
  • దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తన నిబంధన చేశాడు. వారు ఆయన ఎన్నికైన ప్రజ.
  • ఇశ్రాయేలు జాతిలో పన్నెండు గోత్రాలున్నాయి.
  • తరువాత సొలోమోను రాజు చనిపోయాక, ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా చీలిపోయింది: దక్షిణ రాజ్యం "యూదా," ఉత్తర రాజ్యం "ఇశ్రాయేలు."
  • సందర్భాన్ని బట్టి "ఇశ్రాయేలు" ను ఇలా అనువదించ వచ్చు. " ఇశ్రాయేలు ప్రజ ” లేక “ఇశ్రాయేలు జాతి".

(చూడండి: యాకోబు, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా, జాతి, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 08:15 పన్నెండు మంది కుమారులు పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలు అయ్యారు.
  • 09:03 ఈజిప్టు వారు ఇశ్రాయేలీయులచే బలవంతంగా అనేక భవనాలు, మొత్తంగా పట్టణాలు కట్టించారు.
  • 09:05 ఒక ఇశ్రాయేలు స్త్రీ జన్మ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
  • 10:01 వారు చెప్పాడు, "ఇశ్రాయేలు దేవుడు ఇలా చెబుతున్నాడు, 'నా ప్రజలను వెళ్ళనివ్వండి!'"
  • 14:12 అయితే ఇశ్రాయేలు ప్రజలు పోగై దేవునికి, మోషేకు వ్యతిరేకంగా సణిగారు.
  • 15:09 దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు పక్షంగా పోరాడాడు. ఆయన పెద్ద వడగళ్ళు కురిపించి అమోరీయులను హతం చేశాడు. అమోరీయులు చిందరవందర అయిపోయారు.
  • 15:12 యుద్ధం తరువాత దేవుడు ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ వాగ్దాన దేశంలో భూభాగం ఇచ్చాడు. తరువాత దేవుడు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నెమ్మదినిచ్చాడు..
  • 16:16 కాబట్టి దేవుడు విగ్రహారాధన నిమిత్తం ఇశ్రాయేలును శిక్షించాడు.
  • 43:06 "మనుషులు of ఇశ్రాయేలు మనుషులారా, మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా దేవుని శక్తి చేత యేసు అనేక సూచనలు అద్భుతాలు చేశాడు.

పదం సమాచారం:

  • Strong's: H3478, H3479, H3481, H3482, G935, G2474, G2475

ఈర్ష్య, రోషం

నిర్వచనం:

“ఈర్ష్య” “రోషం” అంటే బలంగా తనకు సంబంధించిన వారితో పవిత్రమైన బంధాన్ని కోరుకోవడం. బలమైన రీతిలో ఎవరి ఆస్తిని, మరి దేనిని గానీ ఆశించడం.

  • ఈ పదాల తరచుగా కోపం, ఉక్రోషం మొదలైన వాటికి ఉపయోగిస్తారు. తన భార్య/భర్త వారి వివాహబంధంలో ద్రోహం చేసినప్పుడు ఆ వ్యక్తికి కలిగే ఉద్రేకం.
  • బైబిల్లో ఉపయోగించినప్పుడు ఈ పదాలు తరచుగా తన ప్రజలు పాపం మరక అంటకుండా వారు శుద్ధులుగా ఉండాలనే దేవుని బలమైన ఆకాంక్ష తెలియజేస్తున్నాయి.
  • దేవునికి తన నామం విషయంలో "రోషం" ఉంది. దానిని ప్రతిష్టపూర్వకంగా మన్ననతో పలకాలి.
  • ఎవరైనా జయం పొంది, తనకన్నా ప్రఖ్యాతిగాంచితే కలిగే ఈర్ష్య దీని మరొక అర్థం. ఇది "అసూయ” కు దగ్గరగా ఉంటుంది.

అనువాదం సలహాలు:

  • "రోషం" అనువదించడం. "తనకే కట్టుబడి ఉండాలనే బలమైన కోరిక” లేక “నాకే స్వంతం అనే ఆకాంక్ష."
  • "అసూయ పడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "బలమైన ఈర్ష్యాసూయలు” లేక “నా స్వంతం అనే ఆలోచన."
  • దేవుణ్ణి గురించి చెప్పేటప్పుడు ఈ పదం అనువాదం నెగెటివ్ అర్థం రాకుండా చూడండి.
  • ఇతరులు గెలిస్తే మనుషులకు కోపం రావడం మొదలైన తప్పు భావాలు వ్యక్తపరిచే సందర్భంలో “ఈర్ష్య” “అసూయ" ఉపయోగిస్తారు. అయితే ఈ పదాలను దేవునికి వాడకూడదు.

(చూడండి: అసూయ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7065, H7067, H7068, H7072, G2205, G3863

ఉగ్రత, ఆగ్రహము

నిర్వచనము:

ఉగ్రత అనేది కొన్నిమార్లు దీర్ఘకాలము ఉండే అతి తీవ్రమైన కోపము అని అర్థము.

  • ఇది విశేషముగా పాప విషయమై దేవుని నీతియుతమైన తీర్పును మరియు దేవునికి తిరుగబడిన ప్రతియొక్కరికి ఇచ్చే శిక్షను కూడా సూచిస్తుంది.
  • పరిశుద్ధ గ్రంథములో “ఉగ్రత” అనేది సహజముగా దేవునికి విరుద్ధముగా పాపము చేసినవారిపైన ఆయన చూపించే కోపమును సూచిస్తుంది.
  • “దేవుని ఉగ్రత” అనేది కూడా ఆయన తీర్పును మరియు పాపము కొరకైన శిక్షను సూచిస్తుంది.
  • దేవుని ఉగ్రత అనేది పాపముల విషయమై పశ్చాత్తాప పడకుండా ఉండేవారికొరకు నీతియుతమైన దండనయైయున్నది.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములలో “తీవ్రమైన కోపము” లేక “నీతియుతమైన తీర్పు” లేక “కోపము” అనే పదాలను కూడా ఉపయోగించుదురు.
  • దేవుని ఉగ్రతను గూర్చి మాట్లాడునప్పుడు, ఈ పదమును తర్జుమా చేయుటకు ఉపయోగించిన పదము లేక వాక్యములు పట్టలేని కోపమును సూచించకుండ జాగ్రత్తపడండి. దేవుని ఉగ్రత న్యాయమైనది మరియు పవిత్రమైనది.

(ఈ పదాలను కూడా చూడండి: తీర్పు చేయుట, పాపము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H639, H2197, H2528, H2534, H2740, H3707, H3708, H5678, H7107, H7109, H7110, H7265, H7267, G2372, G3709, G3949, G3950

ఉపమానము, ఉపమానములు

నిర్వచనము:

“ఉపమానము” అనే పదము సహజముగా నైతిక సత్యాన్ని బోధించుటకు లేక వివరించుటకు ఉపయోగించే నీతి పాఠమును లేక చిన్న కథను సూచిస్తుంది.

  • యేసు తన శిష్యులకు బోధించుటకు ఉపమానములను ఉపయోగించెను. ఆయన జనసమూహములకు ఉపమానములు ఉపయోగంచి చెప్పినప్పటికిని, ఆయన ఉపమానమునంతటిని వివరించలేదు.
  • యేసునందు విశ్వసించని పరిసయ్యులలాంటి జనులకు సత్యమును గ్రహించకుండ మరుగు చేయుటకు, తన శిష్యులకు మాత్రమె సత్యాన్ని బయలుపరచుటకు ఉపమానమును ఉపయోగించియుండవచ్చును.
  • దావీదు చేసిన పాపము ఎంత ఘోరమైనదో తెలియజేయుటకు ప్రవక్తయైన నాతాను దావీదు ఒక ఉపమానమును తెలియజెప్పెను.
  • మంచి సమరయుని కథ అనునుది ఒక కథగా ఉపమానమునకు ఒక ఉదాహరణ. యేసు పోల్చి చెప్పిన ద్రాక్షారస పాత క్రొత్త తిత్తులు కూడా తన శిష్యులు యేసు బోధను అర్థము చేసుకోవడానికి సహాయము చేసే నీతి పాఠములాంటి ఉపమానమునకు ఒక ఉదాహరణయైయున్నది.

(ఈ పదాలను కూడా చూడండి: సమరయ)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H1819, H4912, G3850, G3942

ఏఫోదు

నిర్వచనం:

ఏఫోదు ఇశ్రాయేలు యాజకులు శరీరం ముందు భాగాన ధరించే వస్త్రాల్లో ఒకటి. దీనికి రెండు భాగాలు. ఎదుటి భాగం, వెనక భాగం. రెండు కలిసి భుజాల దగ్గర గుడ్డతో ముడి వేస్తారు.

  • ఒక రకం ఏఫోదును సాదా సన్న నార బట్టతో నేస్తారు. దీన్నిమామూలు యాజకులు ధరిస్తారు.
  • ప్రధాన యాజకుడు ప్రత్యేకంగా ధరించే ఏఫోదు అల్లిక పనితో బంగారం, నీలం, ఊదా రంగు, ఎరుపు నూలుతో చేస్తారు.
  • ప్రధాన యాజకుని ఛాతీకవచం ఏఫోదు మీద ధరిస్తారు. ఛాతీకవచం వెనక ఊరీము, తుమ్మీము, అనే రాళ్లు ఉంటాయి. వీటిని దేవుడు కొన్ని విషయాల్లో తన చిత్తం వెల్లడి చేసేలా అడగడానికి ఉపయోగిస్తారు
  • న్యాయాధిపతి గిద్యోను బుద్ధిహీనంగా బంగారంతో ఏఫోదు తయారు చేయించాడు. అది కాస్తా ఇశ్రాయేలీయులు ఆరాధించిన విగ్రహం అయి కూర్చుంది.

(చూడండి: యాజకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H641, H642, H646

ఒప్పుకొను, ఒప్పుకొన్న, ఒప్పుకొనుట, ఒప్పుకోలు

నిర్వచనం:

ఒప్పుకొను అంటే దేన్నైనా నిజం అని అంగికరించడం. "ఒప్పుకోలు"అంటే దేన్నైనా నిజం అని బయటికి ప్రకటించడం.

  • ఈ పదం "ఒప్పుకొను" అనేది దేవుని గురించిన సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడం. మనం చేసిన పాపాన్ని అంగీకరించడం.
  • మనుషులు తమ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటే వారి పాపాలు దేవుడు, క్షమిస్తాడు అని బైబిల్ చెబుతున్నది.
  • విశ్వాసులు వారి పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకుంటే అది ఆత్మ సంబంధమైన స్వస్థత తెస్తుందని అపోస్తలుడు యాకోబు తన ఉత్తరంలో రాశాడు.
  • ఒక దినాన ప్రతి ఒక్కరూ యేసే ప్రభువు అని ఒప్పుకుంటారని, లేక ప్రకటిస్తారని అపోస్తలుడు పౌలు ఫిలిప్పి సంఘానికి రాశాడు.
  • పౌలు ఇది కూడా చెప్పాడు. యేసే ప్రభువు అని ఒప్పుకుని దేవుడు ఆయనను మృతుల లోనుంచి లేపాడని విశ్వసిస్తే వారు రక్షణ పొందుతారు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఇలా కూడా అనువదించవచ్చు. "రానిచ్చు” లేక “సాక్ష్యం ఇచ్చు” లేక “ప్రకటించు” లేక “గుర్తించు” లేక “నిర్ధారించు."
  • దీన్ని రకరకాలుగా అనువదించ వచ్చు. "ఒప్పుకోలు" "ప్రకటన” లేక “సాక్షము” లేక “మనం విశ్వసించిన దాన్ని చెప్పడం” లేక “పాపం అంగీకరించు."

(చూడండి: విశ్వాసం, సాక్షము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3034, H8426, G1843, G3670, G3671

కట్టివేయు, బంధకం, బంధించు

నిర్వచనం:

ఈ పదం "కట్టివేయు" అంటే దేన్నైనా తాళ్ళతో భద్రంగా బంధించడం. కలిసికట్టుగా ఉన్న దేన్నైనా "బంధం" అంటారు. ఈ పదం "బంధించు" అనేది భూత కాల పదం.

  • "బంధించు" అంటే దేన్నైనా మరొక దానితో కలిపి కట్టడం, చుట్టడం.
  • అలంకారికంగా చెప్పాలంటే ఒక వ్యక్తిని ఒక ఒట్టుతో బంధించవచ్చు. అంటే అతడు తాను చేసిన వాగ్దానం దాన్ని తప్పక నెరవేర్చాలి.
  • ఈ పదం "బంధకాలు" అనేది ఒక దానికి కట్టివేయడం, లేక ఎవరినైనా ఒక దానికి కట్టుబడేలా చేయడం అనే వాటిని సూచిస్తున్నది. ఇది సాధారణంగా ఒక మనిషిని కదలకుండా కట్టిపడేసే గొలుసులు, బంధకాలు, లేక తాళ్ళను సూచిస్తున్నది.
  • బైబిల్ కాలాల్లో, తాళ్ళు, గొలుసులు వంటి బంధకాలను ఉపయోగించి ఖైదీని చెరసాలలో గోడకు, నేలకు లేక బండరాతికి బిగిస్తారు.
  • ఈ పదం "కట్టు" అనే దాన్నిగాయపడిన వాడికి స్వస్థత కలిగేలా అతని గాయానికి కట్టు కట్టే సందర్భంలో కూడా వాడతారు.
  • మృతదేహాన్ని భూస్థాపన కోసం గుడ్డతో చుడతారు.
  • ఈ పదం "బంధకం" అనే దాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. పాపం, బానిసత్వం మొదలైన వాటి అదుపులో ఉండడం గురించి ఇది వాడతారు.
  • బంధం అంటే వ్యక్తుల మధ్య మానసికంగా, ఆత్మ సంబంధంగా శారీరికంగా సన్నిహిత సంబంధం, లేక ఇతరత్రా పరస్పర సహాయం చేసుకునే సంబంధం. వివాహ బంధానికి కూడా వర్తిస్తుంది.
  • ఉదాహరణకు, భర్త, భార్య ఒకరికొకరు "బంధంలో" ఉన్నారు. ఇది దేవుడు కలిపిన బంధం, ఇది తెగిపోకూడదు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని "కట్టివేయు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "కట్టు” లేక “బిగించి కట్టు” లేక “చుట్టు."
  • అలంకారికంగా, దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "కదలకుండా బంధించు” లేక “ఆపు” లేక “దేని నుండి అయినా దూరంగా ఉంచు."
  • ఈ పదం ప్రత్యేక వాడకం. "కట్టివేయు" మత్తయి 16, 18 లో "నిషేధించు” లేక “అనుమతి నిరాకరించు."
  • ఈ పదం "బంధకాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గొలుసులు” లేక “తాళ్ళు” లేక “శృంఖలాలు."
  • అలంకారికంగా ఈ పదం "బంధకం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ముడి” లేక “లంకె” లేక “దగ్గర సంబంధం."
  • పద బంధం "శాంతి బంధం" అంటే "కలిసి మెలిసి ప్రజలను దగ్గర సంబంధంలోకి తేవడం” లేక “శాంతి సమాధానాలు తీసుకు వచ్చే బంధం ఏర్పరచడం."
  • "కట్టివేయు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "చుట్టు” లేక “కట్టు కట్టడం."
  • ఒట్టుతో తనను "కట్టివేయు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఒక ఒట్టును నెరవేర్చు” లేక “ఒట్టు నెరవేరేలా జరిగించు."
  • సందర్భాన్ని బట్టి, ఈ పదం "బంధించు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "కట్టు” లేక “కట్టి వేయు” లేక “గొలుసులతో బంధించు” లేక “తప్పని సరిగా చేయు (నెరవేర్చు)” లేక “తప్పక చేయవలసిన."

(చూడండి: నెరవేర్చు, శాంతి, చెరసాల, సేవకుడు, ఒట్టు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H247, H481, H519, H615, H631, H632, H640, H1366, H1367, H1379, H2280, H2706, H3256, H3533, H3729, H4147, H4148, H4205, H4562, H5650, H5656, H5659, H6029, H6123, H6616, H6696, H6872, H6887, H7194, H7405, H7573, H7576, H8198, H8244, H8379, G254, G331, G332, G1195, G1196, G1198, G1199, G1210, G1397, G1398, G1401, G1402, G2611, G2615, G3734, G3784, G3814, G4019, G4029, G4385, G4886, G4887, G5265

కపటి, కపటులు, కపట వేష ధారణ

నిర్వచనం:

"కపటి" అంటే న్యాయవంతుడుగా కనిపిస్తూ రహస్యంగా దుష్ట మార్గాలకు అంగీకరించేవాడు. "కపట వేష ధారణ" అంటే మనుషులను మోసగిస్తూ తాను న్యాయవంతుడు అని వారు అనుకునేలా నటించడం.

  • కపటులు మంచి పనులు చేస్తూ ప్రజలు తమను మంచి వారు అనుకునేలా చెయ్యడం.
  • తరచుగా కపటి ఇతరులను తాము చేసే అదే పాపపూరితమైన పనులు చేసినందుకు విమర్శిస్తూ ఉంటాడు.
  • యేసు పరిసయ్యులను కపటులు అని పిలిచాడు. ఎందుకంటే వారు భక్తుల్లాగా కొన్ని రకాల వస్త్రాలు ధరించి కొన్ని రకాల ఆహారం తింటూ ఉంటారు గానీ మనుషుల పట్ల న్యాయంగా ప్రవర్తించరు.
  • కపటి ఇతరుల్లో తప్పులు చూపిస్తాడు. అయితే తన స్వంత తప్పులు సరి దిద్దుకోడు.

అనువాదం సలహాలు:

  • కొన్ని భాషల్లో ఈ మాట "పయోముఖ విషకుంభం" వలే కపటులు తమ కపట క్రియలు చేస్తూ ఉంటారని తర్జుమా చెయ్యవచ్చు.
  • అనువదించడంలో ఇతర పద్ధతులు. "మోస గాడు” లేక “నటన” లేక “అహంకారి, మోసకరమైన వ్యక్తి."
  • "కపట వేష ధారణ" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "కపటం” లేక “నకిలీ క్రియలు” లేక “నటించడం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H120, H2611, H2612, G505, G5272, G5273

కరుణ, కరుణ గల

నిర్వచనం:

ఈ పదం "కరుణ" అనేది మనుషుల పట్ల సానుభూతిని సూచిస్తున్నది, ముఖ్యంగా బాధల్లో ఉన్న వారి పట్ల. "కరుణ గల" వ్యక్తి ఇతరుల విషయం జాలి పడి సహాయం చేస్తాడు.

  • ఈ పదం "కరుణ" సాధారణంగా అవసరంలో ఉన్న మనుషుల గురించి శ్రద్ధ వహించి సాయపడడాన్ని తెలియ జేస్తుంది.
  • బైబిల్ లో దేవుడు కరుణ గలవాడని, అయన ప్రేమ కరుణ పూర్ణుడు అని చెబుతున్నది.
  • పౌలు కొలస్సి సంఘానికి రాసిన లేఖలో, వారు "కరుణను వస్త్రంగా ధరించుకోవాలని" చెప్పాడు. వారు అవసరంలో ఉన్న మనుషులకు చురుకుగా సహాయం చేస్తూ ఉండాలని చెప్పాడు.

అనువాదం సలహాలు:

  • అక్షరార్థం "కరుణ" అంటే "కడుపులో కరుణ" కలిగి ఉండడం. ఈ మాటకు అంటే "కనికరం” లేక “దయ" అని కూడా అర్థం. ఇతర భాషల్లో ఈ అర్థం ఇచ్చే వారి స్వంత అనే మాటలు ఉండవచ్చు.
  • "కరుణ" అనే మాట అనువదించడంలో, "లోతైన సానుభూతి” లేక “సహాయం చేసే కరుణ" అనే అర్థాలు రావాలి.
  • ఈ పదాన్ని "కరుణ గల" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "శ్రద్ధ గలిగి సహాయకరంగా ఉండడం” లేక “లోతైన ప్రేమ, జాలి" కనుపరచడం

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2550, H7349, H7355, H7356, G1653, G3356, G3627, G4697, G4834, G4835

కరుణ, కరుణగల

నిర్వచనం:

“కరుణ,” “కరుణగల” పదాలు అవసరతలో ఉన్న ఇతరులకు సహాయం చెయ్యడం, ప్రత్యేకించి వారు తక్కువస్థితిలో గానీ లేదా అణచివేయబడిన స్థితిలో గానీ ఉన్నప్పుడు సహాయం చెయ్యడాన్ని సూచిస్తున్నాయి.

  • ”కరుణ” అనే పదంలో మనుష్యులు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని శిక్షించకుండా ఉండడం అనే అర్థం కూడా ఉంది.
  • రాజులాంటి శక్తివంతమైన వ్యక్తి మనుష్యులకు హాని చెయ్యడానికి బదులు వారిని దయతో చూచినప్పుడు అతడు “కరుణగల” వ్యక్తి అని వర్ణించబడతాడు.
  • కరుణకలిగి యుండడం అంటే మనకు విరోధంగా ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం అనికూడా అర్థం ఉంది.
  • గొప్ప అవసరతలో ఉన్న ప్రజలకు మనం సహాయం చేసినప్పుడు మనం కరుణ చూపిస్తాము.
  • దేవుడు మన విషయంలో కరుణ కలిగి యున్నాడు, మనం ఇతరుల పట్ల కరుణ కలిగి యుండాలని ఆయన కోరుతున్నాడు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “కరుణ” అనే పదం “దయ” లేదా “కనికరం” లేదా “జాలి” అని అనువదించబడవచ్చు.
  • ”కరుణగల” అనే పదం “జాలి చూపించడం” లేదా “దయగా ఉండడం” లేదా “క్షమించడం” అని అనువదించబడవచ్చు.
  • ”కరుణ చూపించడం” లేక “కరుణ కలిగి యుండడం” అనే పదాలు “దయను చూపించు” లేదా “వారిపట్ల కనికరం కలిగి యుండు” అని అనువదించబడవచ్చు.

(చూడండి: కరుణ, క్షమించడం)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 19:16 వారు (ప్రవక్తలు) అందరూ విగ్రహాలను పూజించడం నిలిపివేయాలని ప్రజలకు చెప్పారు, ఇతరులకు న్యాయాన్నీ కరుణనూ చూపించడం ఆరంభించాలని చెప్పారు.
  • 19:17 అతడు (యిర్మియా) బావి అడుగుభాగంలోని మట్టిలోనికి కూరుకుపోయినప్పుడు రాజు అతని పట్ల కరుణ చూపించి యిర్మియా చనిపోకముందే అతనిని బావిలోనుండి బయటికి తీయాలని సేవకులకు ఆజ్ఞాపించాడు.
  • 20:12 పర్షియా రాజు బలమైనవాడు, అయితే తాను జయించిన ప్రజలపట్ల కరుణ చూపించాడు.
  • 27:11 అప్పుడు ప్రభువు ధర్మశాస్త్ర బోధకుడిని “నీవు ఏమి తలస్తున్నావు?” అని అడిగాడు. దోచుకోబడి, కొట్టబడిన ఈ వ్యక్తికి వారిలో ఎవరు పొరుగువాడు? “అతని పట్ల కరుణ చూపినవాడే” అని జవాబిచ్చాడు.
  • 32:11 అయితే యేసు అతనితో, “వద్దు, నీవు నీ ఇంటికి వెళ్లి నీ స్నేహితులతోనూ, నీ కుటుంబంతోనూ దేవుడు నీ పట్ల చేసిన సమస్తాన్ని చెప్పు, ఆయన నీమీద ఏవిధమైన కరుణ చూపించాడో చెప్పు” అని చెప్పాడు.
  • 34:09”అయితే సుంకరి మతనాయకునికి దూరంగా నిలిచి, పరలోకం వైపు తలెత్తడానికికూడా ధైర్యం లేక, రొమ్ముమీద కొట్టుకొనుచు, “దేవా దయచేసి నా పట్ల కరుణ చూపు, ఎందుకంటే నేను పాపిని” అని ప్రార్థించాడు.

పదం సమాచారం:

  • Strong's: H2551, H2603, H2604, H2616, H2617, H2623, H3722, H3727, H4627, H4819, H5503, H5504, H5505, H5506, H6014, H7349, H7355, H7356, H7359, G1653, G1655, G1656, G2433, G2436, G3628, G3629, G3741, G4698

కానుక, కానుకలు

నిర్వచనం:

"కానుక" అంటే ఎవరికైనా అర్పించేది. కానుక ప్రతిఫలం ఆశించి ఇచ్చేది కాదు.

  • డబ్బు, ఆహారం, బట్టలు, లేక ఇతర వస్తువులు పేద వారికి ఇచ్చినా వాటిని "కానుకలు" అనవచ్చు.
  • బైబిల్లో, దేవునికి ఇచ్చే అర్పణ, లేక బలి అర్పణ కానుక.
  • రక్షణ అనేది యేసులో విశ్వాసం మూలంగా దేవుడు ఇచ్చే కానుక.
  • కొత్త నిబంధనలో, "వరాలు" అనే మాటను దేవుడు ఇతరులకు పరిచర్య నిమిత్తం అందరు క్రైస్తవులకు ఇచ్చే ప్రత్యేక ఆత్మ సంబంధమైన సామర్థ్యాలు అనే అర్థంలో కూడా వాడతారు.

అనువాదం సలహాలు:

  • సామాన్య పదం "కానుక" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "ఇచ్చినది ఏదైనా."
  • దేవుడు ఎవరికైనా కానుక, లేక ప్రత్యేక సామర్థ్యం ఇస్తే, అలాటి "ఆత్మ వరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆత్మ సంబంధమైన సామర్థ్యం” లేక “పరిశుద్ధాత్మ నుండి ప్రత్యేక సామర్థ్యం” లేక “దేవుడు ఇచ్చే ప్రత్యేక ఆత్మ సంబంధమైన నైపుణ్యం."

(చూడండి: ఆత్మ, పరిశుద్ధాత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G334, G1390, G1394, G1431, G1434, G1435, G3311, G5486

కీర్తన, కీర్తనలు

నిర్వచనము:

“కీర్తన” అనే ఈ పదము పరిశుద్ధ పాటను సూచిస్తుంది, అనేకమార్లు పద్య రూపములో పాడుకోవదానికి వ్రాయబడియుంటుంది.

  • పాత నిబంధనలో కీర్తనల గ్రంథము రాజైన దావీదు మరియు ఇతర ఇశ్రాయేలీయులైన సొలొమోను, ఆసాపు అను మొదలగువారు వ్రాసిన పాటల సమాహారమైయున్నది.
  • ఇశ్రాయేలు దేశము తమ దేవుని ఆరాధించుటలో కీర్తలన్నిటిని ఉపయోగించుకొనెను.
  • కీర్తనలననియు ఆనందమును, విశ్వాసమును మరియు భయభక్తిని, బాధను మరియు దుఃఖమును వ్యక్తపరచుటకు ఉపయోగించబడుచుండెను.
  • దేవునిని ఆరాధించు విధానముగా దేవునికి కీర్తనలను పాడాలని క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఆదేశించబడిరి.

(ఈ పదములను కూడా చూడండి: దావీదు, విశ్వాసము, ఆనందము, మోషే, పరిశుద్ధుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2158, H2167, H2172, H4210, G5567, G5568

కుమారుడు

నిర్వచనం:

స్త్రీ పురుషులకు పుట్టిన మగ సంతానమును అతని జీవితకాలమంతా వారి “కుమారుడు” అని పిలువబడతాడు. ఇతడు ఆ పురుషుని కుమారుడనీ, ఆ స్త్రీ కుమారుడని కూడా పిలువబడతాడు. “దత్తపుత్రుడు” అనగా కుమారుని స్థానములో ఉండుటకు చట్టబద్ధంగా ఉంచబడిన మగబిడ్డ.

  • బైబిలులో "యొక్క కుమారుడు" పదం ఒకని ముందు తరం నుండి ఆ వ్యక్తి తండ్రి, తల్లి లేదా పితరులను గురించించడానికి ఉపయోగిస్తారు. ఈ పదం వంశావళులలోనూ, ఇతర చోట్లా ఉపయోగించబడుతుంది.
  • తండ్రి పేరును ఇవ్వడానికి "యొక్క కుమారుడు" పదం ఉపయోగించడం ఒకే పేరు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, 1 రాజులు గ్రంథం 4 అధ్యాయంలో "సాదోకు కుమారుడైన అజర్యా," నాతాను కుమారుడైన అజర్యా," 2 రాజులు గ్రంథం 15 అధ్యాయంలో అమజ్యా కుమారుడైన అజర్యా" లలో ముగ్గురు భిన్నమైన వ్యక్తులు ఉన్నారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదం ఉపయోగించబడిన అనేక సంభవాలలో భాషలో కుమారుడిని సూచించడం కోసం ఉపయోగించబడిన అక్షరార్థమైన పదం చేత అనువదించడం ఉత్తమం.
  • "దేవుని కుమారుడు" పదం అనువదించేటప్పుడు, "కుమారుడు" కోసం లక్ష్యభాషలోని సాధారణ పదం ఉపయోగించబడింది.
  • కొన్నిసార్లు "కుమారులు" పదం మగపిల్లలూ, ఆడపిల్లలూ సూచించబడేలా "పిల్లలు" పదం చేత అనువదించబడవచ్చు. ఉదాహరణకు, "దేవుని కుమారులు" పదం "దేవుని పిల్లలు" అని అనువదించబడవచ్చు, దీనిలో ఆడపిల్లలూ, స్త్రీలూ కలిసి ఉన్నారు.

(చూడండి: అజర్యా, సంతానము, పితరుడు, ప్రథమ సంతానము, దేవుని కుమారుడు, దేవుని కుమారులు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 04:08 దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, అతనికి ఒక కుమారుని మరల వాగ్దానం చేశాడు, ఆకాశాములో నక్షత్రములవలె లెక్కలేనంతమంది సంతానమును అనుగ్రహిస్తానని వాగ్ధానము చేశాడు.
  • 04:09 “నీ స్వంత శరీరమునుండి కుమారుని నీకు ఇచ్చెదనని” దేవుడు చెప్పాడు.
  • 05:05 ఒక సంవత్సరమైన తరువాత, అబ్రాహాముకు 100 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, శారాకు 90 సంవత్సరములు ఉన్నప్పుడు, శారా అబ్రాహాముకు కుమారుని కన్నది.
  • 05:08 వారు బలి అర్పించు స్థలముకు వచ్చినప్పుడు, అబ్రాహాముకు తన కుమారుడైన ఇస్సాకును కట్టి, బలిపీఠము మీద ఉంచాడు. అతడు తన కుమారుని బలి ఇవ్వబోయే సమయములో, “ఆగుము! బాలుని ఏమి చేయవద్దు! నువ్వు నాకు భయపడుదువని, నీ ఒక్కగానొక్క కుమారుని నాకిచ్చుటకు వెనుక తీయవని నేనిప్పుడు తెలుసుకొనియున్నాను” అని దేవుడు చెప్పాడు.
  • 09:07 ఆమె బిడ్డను చూసినప్పుడు, ఆమె తన స్వంత కుమారునిగా స్వీకరించెను.
  • 11:06 దేవుడు ఐగుప్తుల ప్రథమ సంతానమైన కుమారులు అందరినీ చంపాడు.
  • 18:01 అనేక సంవత్సరములైన తరువాత, దావీదు మరణించాడు, తన కుమారుడు సొలొమోను పరిపాలించుటకు ఆరంభించాడు.
  • 26:04 “ఇతను యోసేపు కుమారుడు కాడా?” అని వారు చెప్పుకొనిరి.

పదం సమాచారం:

  • Strong's: H1060, H1121, H1123, H1248, H3173, H3206, H3211, H4497, H5209, H5220, G3816, G5043, G5207

కృప, కృపగల

నిర్వచనం:

"కృప" పదం సంపాదించని ఒకరికి ఇవ్వబడిన సహాయాన్నీ లేదా ఆశీర్వాదాన్నీ సూచిస్తుంది. "కృపగల" పదం ఇతరులకు కృపను చూపించు వ్యక్తిని వివరిస్తుంది.

  • పాపపూరితమైన మానవులకు దేవుని కృప ఒక వరముగా ఉచితంగా ఇవ్వబడింది.
  • కృప పదంలోని భావం చెడు కార్యాలు మరియు గాయపరచే కార్యాలు చేసిన వారితో దయతోనూ క్షమాపణతోనూ ఉండడం అని సూచిస్తుంది.
  • "కృప కనుగొను" అనే వ్యక్తీకరణ దేవుని నుండి సహాయాన్నీ, కరుణనూ పొందడం అనే అర్థాన్నిచ్చే వ్యక్తీకరణ. తరచుగా ఇందులో దేవుడు ఒకరి విషయంలో సంతోషించడం మరియు అతనికి సహాయం చెయ్యడం అనే అర్థం ఉంది.

అనువాదం సూచనలు:

  • "కృప" పదం "దైవికమైన దయ" లేదా "దేవుని దయ" లేదా "పాపుల కోసం దేవుని దయ మరియు క్షమాపణ" లేదా "కరుణపూరిత దయ" అనే పదాలతో ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "కృపగల" పదం "సంపూర్ణ కృప" లేదా "దయ" లేదా "కరుణ గల" లేదా కరుణతో కూడిన దయ" అని అనువదించబడవచ్చు.
  • "అతడు దేవుని దృష్టిలో కృపను పొందాడు" వ్యక్తీకరణ "అతడు దేవుని నుండి కరుణను పొందాడు" లేదా "దేవుడు అతనికి కరుణతో సహాయం చేశాడు" లేదా "దేవుడు తన దయను అతనికి చూపించాడు" లేదా "దేవుడు అతని విషయంలో సంతోషించాడు, అతనికి సహాయం చేసాడు" అని అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2580, H2587, H2589, H2603, H8467, G2143, G5485, G5543

క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ

నిర్వచనం:

"క్రమశిక్షణ" పదం నైతిక ప్రవర్తన కోసం మార్గదర్శకాల సముదాయానికి లోబడియుండడానికి మనుషులకు శిక్షణ ఇవ్వడాన్ని సూచిస్తుంది.

  • తల్లిదండ్రులు వారి పిల్లలకు నైతికమైన నడిపింపు, నిర్దేశం అందివ్వడం ద్వారానూ, లోబడాలని బోధించడం ద్వారానూ వారిని క్రమశిక్షణలో ఉంచుతారు.
  • అదే విధంగా, దేవుడు తన పిల్లలు తమ జీవితంలో సంతోషం, ప్రేమ, సహనం వంటి ఆరోగ్యకరమైన ఆత్మీయ ఫలం పండించేలా వారికి సహాయం చేస్తాడు.
  • క్రమశిక్షణలో దేవుణ్ణి సంతోషపరచడానికి ఏవిధంగా జీవించాలి అనే దాని గురించిన ఉపదేశమూ, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రవర్తనకు వచ్చే శిక్షా ఉంటుంది.
  • స్వీయ-క్రమశిక్షణ అంటే ఒక మనిషి తన సొంత జీవితంలో నైతిక, ఆత్మీయ సూత్రాలను అన్వయించుకొనే ప్రక్రియ.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "క్రమశిక్షణ" అనే పదం "శిక్షణ, ఉపదేశం ఇవ్వడం” లేక “నైతిక మార్గ నిర్దేశకత్వం” లేక “చెడువిషయంలో శిక్షించడం" పదాలతో అనువదించబడవచ్చు.
  • "క్రమశిక్షణ" నామవాచకం "నైతిక శిక్షణ” లేదా “శిక్ష” లేదా “నైతిక దిద్దుబాటు” లేదా “నైతిక నడిపింపు, ఉపదేశం" అని అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4148, G1468

క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధులు

నిర్వచనం:

ఈ పదం "క్రీస్తు విరోధి" యేసు క్రీస్తుకు, అయన పనికి వ్యతిరేకంగా ఉండే ఒక వ్యక్తిని లేక బోధను సూచిస్తుంది. లోకంలో అనేకమంది క్రీస్తు విరోధులు ఉన్నారు.

  • యేసు మెస్సియా కాదని చెబుతూ, యేసు ఒకే సమయంలో దేవుడు, మానవుడు కూడా అనే సత్యాన్ని నిరాకరిస్తూ మనుషులను మోసం చేస్తూ ఉండే వ్యక్తి క్రీస్తు విరోధి అని అపోస్తలుడు యోహాను రాశాడు.
  • క్రీస్తు విరోధి ఆత్మ లోకంలో నెలకొని అయన పనిని వ్యతిరేకిస్తున్నదని బైబిల్ బోధిస్తున్నది.
  • కొత్త నిబంధనలో ప్రకటన పుస్తకం "క్రీస్తు విరోధి"అని పేరుగల మనిషి అంత్య కాలంలో వెల్లడి అవుతాడని వర్ణిస్తున్నది. ఈ మనిషి దేవుని ప్రజలను నాశనం చేయబూనుకుంటాడనీ, అయితే అతడు యేసు చేతిలో ఓడిపోతాడని చెబుతున్నది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్నిఅనువదించే ఇతర పద్ధతులు. ఒక పదం లేక పదబంధం ద్వారా "క్రీస్తు వ్యతిరేకి” లేక “క్రీస్తు శత్రువు” లేక “క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండేవాడు"అని రాయవచ్చు.
  • దీన్ని "క్రీస్తు విరోధి ఆత్మ"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండే ఆత్మ” లేక “(ఎవరికైనా) క్రీస్తును గురించి అసత్యాలు బోధించే” లేక “క్రీస్తును గురించి అబద్ధాలు నమ్మే ధోరణి” లేక “క్రీస్తును గురించి అబద్ధాలు బోధిస్తున్న ఆత్మ."
  • అంతేగాక ఈ పదాన్ని స్థానిక, జాతీయ భాష బైబిల్ అనువాదంలో అనువదించడం ఎలా అనేది చూడండి.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: క్రీస్తు, వెల్లడించు, హింసలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G500

క్రీస్తు, మెస్సీయా

వాస్తవాలు:

"మెస్సీయా” మరియు “క్రీస్తు" అంటే "అభిషేకించిబడిన వాడు" అని అర్థం. ఇది దేవుని కుమారుడు యేసును సూచిస్తున్నాయి.

  • కొత్త నిబంధనలో "మెస్సీయా”, “క్రీస్తు" అనే రెండు పదాలూ దేవుని కుమారుణ్ణి సూచించడానికి ఉపయోగించబడ్డాయి. తన ప్రజలమీద రాజుగా పరిపాలన చేయడానికి తండ్రి అయిన దేవుడు ఆయనను నియమించాడు మరియు వారిని పాపాల నుండీ, మరణం నుండీ రక్షించడానికి నియమించాడు.
  • పాత నిబంధనలో, ఆయన భూమిమీదకు రావడానికి ముందు వందల సంవత్సరాల క్రితం మెస్సీయా గురించి ప్రవక్తలు ప్రవచనాలు రాశారు.
  • రానున్న మెస్సీయాను సూచించడానికి పాత నిబంధనలో తరచుగా "అభిషేకించబడిన (వాడు)" అనే అర్థం ఇచ్చే ఒక పదం ఉపయోగించబడింది.
  • యేసు ఈ ప్రవచనాలలో అనేకమైన వాటిని నెరవేర్చాడు. తాను మెస్సీయా అని రుజువు చేసే అనేక అద్భుత కార్యాలు చేశాడు. అయన తిరిగి వచ్చినప్పుడు మిగిలిన ఈ ప్రవచనాలు నెరవేరుతాయి.
  • "క్రీస్తు" అనే పదం "క్రీస్తు” మరియు “క్రీస్తు యేసు” లో ఉన్నట్టుగా తరచూ బిరుదుగా ఉపయోగించబడింది.
  • "క్రీస్తు" పదం "యేసు క్రీస్తు" లో ఉన్నట్టుగా తన పేరులో భాగంగా ఉపయోగించబడింది.

అనువాదం సూచనలు:

  • ఈ పదం దాని అర్థాన్ని ఉపయోగించి అనువదించబడవచ్చు, "అభిషేకించబడిన వాడు” లేదా “దేవుని అభిషేకించబడిన రక్షకుడు."
  • అనేక భాషలు "క్రీస్తు" లేదా "మెస్సీయా" వలే కనిపించే లేదా ధ్వనించే ప్రతిలిఖిత పదాన్ని ఉపయోగించాయి. (చూడండి: తెలియనివాటిని ఏవిధంగా అనువదించాలి)
  • ప్రతిలిఖిత పదం తరువాత "క్రీస్తు, అభిషేకించబడినవాడు" లో ఉన్నట్టుగా పద నిర్వచనం ఉండవచ్చు.
  • బైబిలు అంతటిలోనూ ఈ పదం స్థిరంగా అనువదించబడేలా చూడండి, తద్వారా ఒకే పదం సూచించబడిందని స్పష్టం అవుతుంది.
  • "మెస్సీయా” మరియు “క్రీస్తు" అనే పదాల అనువాదాలు రెండు పదాలు ఒకే వచనంలో కనిపించే సందర్భాలలో సరిగా ఉండేలా చూసుకోండి. (యోహాను 1:41 లో ఉన్నవిధంగా).

(చూడండి: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: దేవుని కుమారుడు, దావీదు, యేసు, అభిషేకించు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 17:07 లోకంలో తన ప్రజలను పాపం నుండి రక్షించడానికి దేవుడు ఎన్నుకున్న వాడు మెస్సీయా .
  • 17:08 ఇశ్రాయేలీయులు మెస్సీయా రావడానికి చాలా కాలం అంటే దాదాపు 1,000 సంవత్సరాలు ఎదురు చూడడం జరిగింది.
  • 21:01 ఆరంభం నుండి దేవుడు మెస్సీయా ను పంపడానికి ప్రణాళిక కలిగియున్నాడు.
  • 21:04 మెస్సీయా దావీదు స్వంత సంతానం అవుతాడని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు
  • 21:05 మెస్సీయా నూతన నిబంధనను ఆరంభిస్తాడు.
  • 21:06 మెస్సీయా ఒక ప్రవక్త, యాజకుడు, రాజు అవుతాడని దేవుని ప్రవక్తలు కూడా చెప్పారు.
  • 21:09 మెస్సీయా ఒక కన్యకు పుడతాడు అని ప్రవక్త యెషయా ప్రవచించాడు.
  • 43:07 అయితే "నీవు నీ పరిశుద్ధుని సమాధిలో కుళ్లుపట్టనియ్యవు" అని చెప్పిన ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు ఆయనను సజీవునిగా లేపాడు."
  • 43:09 "అయితే దేవుడు యేసును ప్రభువుగానూ మరియు మెస్సీయా గానూ నియమించాడని నిశ్చయముగా తెలుసుకోండి!"
  • 43:11 పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీలో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడి యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి తద్వారా దేవుడు దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు."
  • 46:06 సౌలు యూదులతో వాదించాడు, యేసే మెస్సీయా అని రుజువు పరిచాడు.

పదం సమాచారం:

  • Strong's: H4899, G3323, G5547

క్రీస్తులో, యేసులో, ప్రభువునందు, ఆయనలో

నిర్వచనం:

"క్రీస్తులో" తదితర పదాలు క్రీస్తుపై విశ్వాసం ఉంచి ఆయనతో సంబంధం గల స్థితిని సూచిస్తాయి.

  • ఇతర పదాలు "క్రీస్తులో యేసు, యేసులో క్రీస్తు, ప్రభువునందు యేసు, ప్రభువునందు యేసు క్రీస్తు."
  • "క్రీస్తులో" అంటే "నీవు క్రీస్తుకు చెందిన” లేక “నీకు క్రీస్తుతో ఉన్న సంబంధం” లేక “క్రీస్తులో నీ విశ్వాసం పై ఆధారపడి."
  • ఈ పదాలన్నిటి అర్థం ఒకటే యేసులో నమ్మకం ఉంచి అయన శిష్యుడుగా మారడం.
  • సూచన: కొన్ని సార్లు "లో " అనేది క్రియకు చెంది ఉంటుంది. ఉదాహరణకు, "క్రీస్తులో భాగం" అంటే to "పలు పొందడం" క్రీస్తును ఎరగడం మూలంగా కలిగే మేళ్ళు. క్రీస్తులో అతిశయం అంటే యేసు ఎవరో, అయన ఏమి చేశాడో దాన్ని బట్టి సంతోషించి దేవునికి స్తుతి చెల్లించడం. "క్రీస్తు లో విశ్వసించు" అంటే అయనను రక్షకునిగా ఎరిగి నమ్మకముంచడం.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, రకరకాలుగా అనువదించవచ్చు. "క్రీస్తులో” “ప్రభువునందు" (సంబంధిత పద బంధాలు):
  • "క్రీస్తుకు చెందిన వారు."
  • "ఎందుకంటే నీవు క్రీస్తులో విశ్వసించు."
  • "ఎందుకంటే క్రీస్తు మనలను రక్షించాడు."
  • "ప్రభువు సేవలో"
  • "ప్రభువుపై ఆధార పడి."
  • "ప్రభువు చేసిన దాన్ని బట్టి."
  • క్రీస్తును "విశ్వసించిన వారు"లేక "విశ్వాసం పెట్టుకున్న వారు" యేసు బోధించైనా దాన్ని నమ్మి సిలువపై తన బలి అర్పణ ద్వారా వారి పాపాలు పరిహరించాడు. కొన్ని భాషల్లో "విశ్వసించు” లేక “పంచుకొను” లేక “నమ్మకముంచు" అనే వాటికి వేరు వేరు మాటలు ఉంటాయి.

(చూడండి: క్రీస్తు, ప్రభువు, యేసు, విశ్వసించు, విశ్వాసం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1519, G2962, G5547

క్రైస్తవుడు

నిర్వచనం:

యేసు పరలోకం వెళ్ళిపోయాక కొంత కాలం తరువాత, ప్రజలు "క్రైస్తవుడు" అనే పేరు కనిపెట్టారు. అంటే, "క్రీస్తును అనుసరించే వాడు."

  • అంతియొకయలో యేసు అనుచరులను మొదటిగా "క్రైస్తవులు"అని పిలిచారు.
  • క్రైస్తవుడు అంటే యేసు దేవుని కుమారుడు అని విశ్వసించే మనిషి. యేసు తన పాపాలనుండి తనను రక్షించేవాడు అని నమ్మకముంచే వాడు.
  • మన ఆధునిక సమయాల్లో, తరచుగా "క్రైస్తవుడు"అనే పదాన్ని క్రైస్తవ మతం అవలంబించిన వారికి ఉపయోగిస్తారు, అలాటివారు నిజంగా యేసును అనుసరించక పోయినా సరే. "క్రైస్తవుడు"అనే దానికి బైబిల్లో అర్థం ఇది కాదు.
  • ఎందుకంటే ఈ పదం "క్రైస్తవుడు"అనేది బైబిల్లో ఎప్పుడైనా నిజంగా యేసును విశ్వసించిన వారికి చెందుతుంది. క్రైస్తవుడు అంటే "విశ్వాసి"అని కూడా పిలుస్తారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "క్రీస్తు-అనుచరుడు” లేక “క్రీస్తును వెంబడించే వాడు"లేక "క్రీస్తు-మనిషి."
  • ఈ పదాన్ని అనువదించేటప్పుడు ఆ అనువాదంలో వివిధ రకాల పదాలు ఉపయోగిస్తారు- శిష్యుడు లేక అపోస్తలుడు.
  • ఈ పదాన్ని అనువదించడంలో యేసును విశ్వసించిన ప్రతి ఒక్కరూ అనే భావం వచ్చేలా జాగ్రత్త పడాలి. కేవలం కొన్ని సమూహాలు మాత్రమే కాదు.
  • ఈ పదాన్ని బైబిల్ అనువాదంలో స్థానిక, జాతీయ భాషలో ఎలా అనువదించ వచ్చు చూడండి.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: అంతియొకయ, క్రీస్తు, సంఘం, శిష్యుడు, విశ్వసించు, యేసు, దేవుని కుమారుడు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 46:09 అంతియొకయలో విశ్వాసులను మొదటగా "క్రైస్తవులు” అని పిలిచారు.
  • 47:14 పౌలు, ఇతర క్రైస్తవ నాయకులు అనేక పట్టణాల్లో యేసును గురించి సువార్త ప్రకటిస్తూ ప్రజలకు బోధిస్తూ ప్రయాణించారు.
  • 49:15 నీవు యేసును విశ్వసిస్తే అయన మీకోసం చేసినది గ్రహిస్తే నీవు క్రైస్తవుడు!
  • 49:16 నీవు క్రైస్తవుడు అయితే, యేసు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు నీ పాపాలు క్షమించాడు.
  • 49:17 నీవొక క్రైస్తవుడు అయినప్పటికీ, పాపం చేసే శోధన నీకు ఉంటుంది.
  • 50:03 పరలోకానికి తిరిగి వెళ్ళక ముందు సువార్త వినని మనుషులకు వినిపించాలని యేసు క్రైస్తవులు చెప్పాడు.
  • 50:11 యేసు తిరిగి వచ్చినప్పుడు చనిపోయిన ప్రతి క్రైస్తవుడు తిరిగి బ్రతికి ఆకాశంలో ఆయన్ను కలుస్తారు.

పదం సమాచారం:

  • Strong's: G5546

క్షమించు, క్షమించబడిన, క్షమాపణ, క్షమాభిక్ష, క్షమాపణ పొందిన

నిర్వచనం:

ఎవరినైనా క్షమించడం అంటే ఎవరైనా తనకు గాయం కలిగించినా వారికి వ్యతిరేకంగా ఎలాటి కక్ష పెట్టుకోకుండా ఉండడం. "క్షమాపణ" అంటే ఎవరినైనా మన్నించే క్రియ.

  • ఎవరినైనా క్షమించడం అంటే ఆ మనిషిని అతడు చేసిన తప్పు నిమిత్తం శిక్షించక పోవడం.
  • ఈ పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. "రద్దు చేయడం," "బాకీ క్షమించడం."
  • మనుషులు వారి పాపాలు ఒప్పుకుంటే దేవుడు సిలువపై యేసు త్యాగ పూర్వక మరణం ద్వారా క్షమిస్తాడు.
  • తాను వారిని క్షమించిన విధంగానే తన శిష్యులు ఇతరులను క్షమించాలని యేసు బోధించారు. "క్షమాభిక్ష" అంటే క్షమించడం. ఎవరినైనా అతని పాపంకోసం శిక్షించక పోవడం. "క్షమాభిక్ష" పెట్టడం అంటే "క్షమించు" అనే అర్థమే గానీ అదనంగా అతని అపరాధం విషయంలో శిక్షించకూడదని నిర్ణయం చేయడం అనే ప్రత్యేకర్థం ఉంది.
  • న్యాయ స్థానం న్యాయాధిపతి ఒక వ్యక్తి నేరం చేసాడని రుజువైనా క్షమాభిక్ష పెట్టవచ్చు.
  • మనుషులు పాపం చేసినా యేసు క్రీస్తు మనలను క్షమించి నరకం నుండి తప్పించాడు. ఇది తన త్యాగ పూర్వక సిలువ మరణం మూలంగాసాధ్యం అయింది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "క్షమించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "క్షమాభిక్ష” లేక “శిక్ష రద్దు” లేక “విడుదల” లేక “ఆ వ్యక్తికి అతని నేరాన్ని వ్యతిరేకంగా నిలపక పోవడం" (ఎవరినైనా).
  • "క్షమాపణ" అనే దాన్ని ఒక పదంతో అనువదించ వచ్చు లేక ఒక పదబంధంతో. "మనసులు కక్ష పెట్టుకోక పోవడం” లేక “(ఎవరినైనా) దోషి కాదని ప్రకటించడం” లేక “క్షమాభిక్ష పెట్టే క్రియ."
  • మీ భాషలో ఒక పదం క్షమించడం అని అర్థం ఇచ్చే పదం ఉంటే "క్షమాభిక్ష" అని అర్థం వచ్చేలా ప్రయోగించ వచ్చు. (చూడండి: అపరాధ భావం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 07:10 అయితే ఏశావు అప్పటికే యాకోబును క్షమించాడు. వారు ఒకరినొకరు మరలా చూసుకుని ఆనందించారు.
  • 13:15 తరువాత మోషే కొండ ఎక్కి మరలా దేవుడు ప్రజలను క్షమించాలని ప్రార్థించాడు. దేవుడు మోషే ప్రార్థన విన్నాడు, వారిని క్షమించాడు.
  • 17:13 దావీదు తన పాపం విషయం పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు అతన్ని క్షమించాడు.
  • 21:05 కొత్త నిబంధనలో, దేవుడు తన చట్టం మనుషుల హృదయాలపై రాశాడు. ప్రజలు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగుదురు, వారు అయన ప్రజలు, దేవుడు వారి పాపాలు క్షమిస్తాడు.
  • 29:01 ఒక రోజు పేతురు యేసును ఇలా అడిగాడు. "స్వామీ నేను నా సోదరుడు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ సోదరుణ్ణి ఎన్ని సార్లు క్షమించాలి?
  • 29:08 నీవు నన్ను అర్థించావు గనక నేను నీ రుణం క్షమించాను.
  • 38:05 తరువాత యేసు పాత్ర తీసుకుని చెప్పాడు, "ఇది తాగండి. ఇది నా రక్తం మూలంగా ఉన్న కొత్త నిబంధన. దీన్ని పాపాల క్షమాపణ కోసం ధార పోశాను.

పదం సమాచారం:

  • H5546, H5547, H3722, H5375, H5545, H5547, H7521, G859, G863, G5483

ఖరీదు, ఖరీదు చెల్లించబడెను

నిర్వచనము:

“ఖరీదు” అనే ఈ పదము ఒక డబ్బు మొత్తమును లేక అడగబడినంత మొత్తమును లేక చెరలోనున్న వ్యక్తి విడుదల పొందుట కొరకు చెల్లించవలసిన రుసుమును సూచిస్తుంది.

  • క్రియా పదముగా, “ఖరీదు” అనే పదమునకు వెల చెల్లించుట లేక బంధించబడిన, చెరగొనిపోయినవారిని, బానిసలైనవారిని రక్షించు క్రమములో త్యాగపూరితమైన పనిని చేయుట అని అర్థము. “వెనక్కి వచ్చునట్లు కొనుగోలు చేయు” అనే ఈ మాటకు అర్థము “విమోచించు” అనే పదమునకు అనే అర్థము కూడా ఒక్కటే.
  • పాపపు బానిసత్వములోనున్న ప్రజలను విడిపించుటకు క్రయధనముగా లేక ఖరీదుగా యేసు తన్నతాను మరణమునకు అప్పగించుకొనెను. వారి పాపముల కొరకు ఖరీదును చెల్లించుట ద్వారా తన ప్రజలను వెనక్కి కొనుక్కొను దేవుని ఈ కార్యమును పరిశుద్ధ గ్రంథములో “విమోచన” అని పిలువబడింది.

తర్జుమా సలహాలు:

  • “ఖరీదు” అనే ఈ పదమును “విమోచించుటకు చెల్లించుట” లేక “విడుదల చేయుటకు వెలను చెల్లించుట” లేక “వెనక్కి తిరిగి కొనుగోలు చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఖరీదును (క్రయధనమును) చెల్లించుట” అనే ఈ మాటను “(స్వాతంత్ర్యమును అనుగ్రహించుటకు) వెలను చెల్లించుట” లేక “(ప్రజలను విడుదల చేయుటకు) దండమును చెల్లించుట) లేక “అవసరమైన వెలను చెల్లించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఖరీదు లేక క్రయధనము” అనే ఈ నామపదమును “వెనక్కి తిరిగి కొనుగోలు చేయుట” లేక “క్రయధనమును చెల్లించుట” లేక “(భూమినిగాని లేక ప్రజలను గాని వెనక్కి తిరిగి కొనుక్కొనుటకు) వెలను చెల్లించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఖరీదు (లేక క్రయధనము) మరియు “విమోచన” అనే ఈ పదములకు ఆంగ్ల భాషలో ఒకే అర్థము కలదు గాని కొన్నిమార్లు వేరొక భాషలలో కొంచెము విభిన్నమైన పదాలను ఉపయొగిస్తూ ఉంటారు. ఈ ఉద్దేశము కొరకు కొన్ని ఇతర భాషలలో ఒకే ఒక్క పదమును మాత్రమే ఉపయోగిస్తుంటారు.
  • ఈ పదమును “ప్రాయశ్చిత్తం” అనే పదమునుకు విభిన్నముగా తర్జుమా చేయునట్లు చూసుకోండి.

(ఈ పదములను కూడా చూడండి: ప్రాయశ్చిత్తం, విమోచించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1350, H3724, H6299, H6306, G487, G3083

గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల

నిర్వచనం:

“గొర్రెపిల్ల” పదం ఒక చిన్న గొర్రెను సూచిస్తుంది. గొర్రెలు నాలుగు కాళ్ళు ఉన్న జంతువులు, దట్టమైన నూలు జుట్టు కలిగియుంటాయి, దేవునికి బలుల కోసం వినియోగిస్తారు. యేసు “దేవుని గొర్రెపిల్ల” అని పిలువబడ్డాడు, ఎందుకంటే ప్రజల పాపాల కోసం వెల చెల్లించడానికి ఆయన బలి అయ్యాడు.

  • ఈ జంతువులు సులభంగా తప్పిపోతాయి, వీటికి భద్రత అవసరం. దేవుడు మానవులను గొర్రెలతో పోల్చాడు.
  • బౌతికంగా పరిపూర్ణమైన గొర్రెలను, గొర్రెపిల్లలను బలి ఇవాలని దేవుడు మనుష్యులకు హెచ్చరించాడు.
  • యేసు “దేవుని గొర్రెపిల్ల” అని పిలువబడ్డాడు, ఎందుకంటే ప్రజల పాపాల కోసం వెల చెల్లించడానికి ఆయన బలి అయ్యాడు. ఆయన సంపూర్ణమైనా, కళంకం లేని బలి, ఎందుకంటే ఆయన సంపూర్తిగా పాపం లేనివాడు.

అనువాదం సూచనలు:

  • భాషా ప్రాంతంలో గొర్రెలు పరిచయంగా ఉన్నట్లయితే, వాటిలో చిన్నదానిని “గొర్రెపిల్ల”, “దేవుని గొర్రె పిల్ల” అని అనువదించవచ్చు.
  • ”దేవుని గొర్రెపిల్ల” అనే పదాన్ని “దేవుని (బలి)గొర్రెపిల్ల” లేక “దేవునికి అర్పితమైన గొర్రెపిల్ల” లేక “దేవుని నుండి (బలి) గొర్రెపిల్ల” అని అనువదించవచ్చు.
  • ఒకవేళ గొర్రెలు అనే పదం తెలియకపోతే, ఈ పదాన్ని “చిన్న గొర్రెపిల్ల” అని అనువదించవచ్చు, గొర్రెలు ఏవిధంగా ఉంటాయని వివరణ పేజీ అడుగుభాగాన్న పొందుపరచవచ్చు, ఈ వివరణ ఆ ప్రాంతంలో రక్షణ లేకుండా, తరచూ సంచరిస్తూ, భయంతో, మందలుగా నివసించే జంతువులతో గొర్రెలను, గొర్రెపిల్లలను సరిపోల్చుతూ ఉంటుంది,
  • సమీపంలో స్థానికంగా లేక జాతీయ బాషలో ఉన్న బైబిలు అనువాదంలో ఈ పదం అర్థం గురించి కూడా ఆలోచన చెయ్యాలి.

(చూడండి: తెలియని వాటిని అనువాదం చెయ్యడం)

(చూడండి: గొర్రెలు, కాపరి)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 05:07 అబ్రాహాము, ఇస్సాకు దహనబలి స్థలానికి వచ్చినప్పుడు, ఇస్సాకు అబ్రహాముతో, “తండ్రీ, నిప్పును, కట్టేలును ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది? అని అడిగాడు.
  • 11:02 ఆయన యందు విశ్వసించిన వారిలో ప్రధమ సంతానాన్ని రక్షించే మార్గాన్ని దేవుడు ఏర్పాటుచేసాడు. ప్రతీ కుటుంబమూ ఒక పరిపూర్ణ గొర్రెపిల్ల ను లేక మేకను ఎంపిక చేసుకొని దానిని చంపాలి. * 24:06 మరుసటి రోజు, యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యేసు వచ్చాడు. యోహాను ఆయనను చూచినప్పుడు, ఇలా అన్నాడు, “చూడండి! లోక పాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల ఇక్కడ ఉన్నాడు.
  • 45:08 ఆయన చదివాడు, “వారు ఆయనను గొర్రెపిల్ల లాగా వధకు తీసుకుపోయారు, గొర్రె ఊరుకోన్నట్టే ఆయన నోరు తెరువలేదు.
  • 48:08 అబ్రహాము తన కుమారుణ్ణి దహనబలిగా అర్పించమని చెప్పినప్పుడు, దేవుడు అభ్రహాము కుమారుడు ఇస్సాకుకు బదులు ఒక గొర్రె పిల్లను ఏర్పరచాడు, మనమందరం మన పాపముల నిమిత్తము చనిపోవలసిన వారం! అయితే మన స్థానంలో చనిపోవడానికి దేవుని గొర్రెపిల్ల, యేసును దేవుడు ఏర్పరచాడు.
  • 48:09 దేవుడు ఐగుప్తు మీదకు చివరి తెగులును పంపినప్పుడు, ఇశ్రాయేలులోని ప్రతీ కుటుంబం ఒక పరిపూర్ణమైన గొర్రెపిల్ల ను చంపి దాని రక్తాన్ని ద్వారబంధాల మీదా, దానికిరువైపులా చల్లాలని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H7716, G721, G2316

ఘనత

నిర్వచనం:

“ఘనత” అనే పదం గొప్పతనాన్ని, మహిమను సూచిస్తుంది, తరచుగా ఒక రాజు లక్షణాలను గురించి మాట్లాడుతుంది.

  • బైబిలులో, “ఘనత” అనే పదం తరచుగా సర్వలోకం మీద సర్వాదికారియైన దేవుని గొప్పతనాన్ని చూపిస్తుంది. ఒక రాజును సంబోధించదానికి “మీ ఘనత” అని పలుకుతారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదాన్ని “రాజు గొప్పతనం” లేక “రాజరికపు మహిమ” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ”మీ ఘనత” అనే పదం “మీ హెచ్చింపు” లేక “మీ శ్రేష్ఠత” లేక స్థానిక భాషలలో ఒక పాలకుడిని సంబోధించే సహజ విధానాన్ని వినియోగించవచ్చు.

(చూడండి: రాజు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1347, H1348, H1420, H1923, H1926, H1935, H7238, G3168, G3172

చతుర్దాధిపతి

నిర్వచనం:

"చతుర్దాధిపతి" రోమాసామ్రాజ్యం ఒక భాగాన్ని పరిపాలించే అధికారిని పిలిచే పేరు. ప్రతి చతుర్దాధిపతి రోమా చక్రవర్తి అధికారం కింద ఉంటాడు.

  • "చతుర్దాధిపతి" అనే బిరుదు నామం అర్థం "నాలుగు పరగణాలకు అధిపతి."
  • డయోక్లిషియన్ చక్రవర్తి కాలంలో మొదలై రోమాసామ్రాజ్యంలో నాలుగు ముఖ్య పరగణాలు ఉండేవి. ప్రతిదీ ఒక చతుర్దాధిపతి పరిపాలన చేసేవాడు.
  • యేసు పుట్టుక సమయంలో ఏలిన మహా హేరోదు రాజ్యం అతని మరణం తరువాత నాలుగు విభాగాలయింది. అతని కుమారులు "చతుర్దాధిపతులుగా” లేక “నాలుగవ భాగం అధిపతులు” గా పాలించారు.
  • ప్రతి జిల్లా లో కొన్ని చిన్నభాగాలను"పరగణాలు," అని పిలిచారు. అలాటివే గలిలయ, సమరయ.
  • "హేరోదు చతుర్దాధిపతి" అనే దాన్ని కొత్త నిబంధనలో అనేక సార్లు ప్రస్తావించారు. అతణ్ణి "హేరోదు అంతిప" అని కూడా అంటారు.
  • దీన్ని "చతుర్దాధిపతి" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ప్రాంతం గవర్నర్” లేక “సామంత అధిపతి” లేక “అధిపతి” లేక “గవర్నర్" అనవచ్చు.

(చూడండి: గవర్నర్, హేరోదు అంతిప, పరగణా, రోమ్, అధిపతి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G5075, G5076

జన్మ హక్కు

నిర్వచనం:

ఈ పదం "జన్మ హక్కు"అనేది బైబిల్లో ఒక కుటుంబంలో మొదట పుట్టిన కుమారునికి సంక్రమించే ప్రతిష్ట, కుటుంబం పేరు, సంపదలను సూచిస్తుంది.

  • మొదట పుట్టిన కుమారుని జన్మ హక్కు ప్రకారం తండ్రి వారసత్వ ఆస్తిలో రెండు పాళ్ళు వస్తుంది.
  • రాజు పెద్దకొడుక్కి సాధారణంగా తన తండ్రి చనిపోయాక పరిపాలన చేసే జన్మ హక్కు ఉంటుంది.
  • ఏశావు తన జన్మ హక్కును తన తమ్ముడు యాకోబుకు అమ్మి వేశాడు. మొదట పుట్టిన ఏశావు వారసత్వంగా పొందే ఆశీర్వాదం యాకోబు పొందాడు.
  • జన్మ హక్కులో వంశ చరిత్ర మొదట పుట్టిన కుమారుని కుటుంబం ద్వారా కొనసాగే ప్రతిష్ట ఇమిడి ఉంది.

అనువాదం సలహాలు:

  • "జన్మ హక్కు"అనే దాన్ని అనువదించడం. "ఆస్తి విషయంలో మొదట పుట్టిన కుమారునికి ఉన్న హక్కు” లేక “కుటుంబం ప్రతిష్ట” లేక “మొదట పుట్టినవాడి ఆధిక్యత వారసత్వ సంపద."

(చూడండి: మొదట పుట్టిన, వారసత్వముగా పొందు, సంతతి వాడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1062, G4415

జీవం, జీవించు, జీవముతో ఉన్న, సజీవ

నిర్వచనం:

"జీవం" పదం భౌతికంగా చనిపోయి ఉండడానికి వ్యతిరేకంగా భౌతికంగా సజీవంగా ఉండడాన్ని సూచిస్తుంది.

1 శారీరక (భౌతిక) జీవం

  • ఒక "జీవం" పదం "ఒక జీవితం కాపాడబడింది" లో ఉన్నట్టుగా ఒక వ్యక్తిగత జీవితాన్ని కూడా సూచిస్తుంది.
  • కొన్నిసార్లు “జీవం” పదం “అతని జీవితం ఆనందభరితంగా ఉంది” లో ఉన్నట్టుగా జీవిస్తున్న అనుభవాన్ని సూచిస్తుంది.
  • “అతని జీవిత అంతం” అనే వాక్యంలో ఉన్నట్టుగా ఇది ఒక వ్యక్తి జీవిత కాలపరిమితిని కూడా సూచిస్తుంది.
  • ”జీవించడం” పదం “మా అమ్మ ఇంకా జీవించే ఉంది” లో ఉన్నట్టుగా శారీరికంగా సజీవంగా ఉండడాన్ని సూచిస్తుంది. “వారు పట్టణంలో నివసిస్తున్నారు”లో ఉన్నట్టుగా ఒక చోట నివసిస్తున్నారు అని సూచిస్తుంది.
  • బైబిలులో “జీవం” అనే అంశం “మరణం” అంశాన్ని తరుచుగా విభేదిస్తుంది.

2 శాశ్వత జీవం

  • ఒక వ్యక్తి యేసు నందు విశ్వాసముంచినప్పుడు శాశ్వత జీవాన్ని కలిగియుంటాడు, దేవుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ జీవించడం ద్వారా పరివర్తన చెందిన జీవితాన్ని ఇస్తాడు.
  • శాశ్వత జీవానికి వ్యతిరేక పదం శాశ్వత మరణం, అంటే దేవుని నుండి వేరైపోవడం, శాశ్వత శిక్షను అనుభవించడం.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “జీవం” పదం “ఉనికి” లేదా “వ్యక్తి” లేదా “ప్రాణం" లేదా జీవి" లేదా "అనుభవం" అని అనువదించబడవచ్చు.
  • ”జీవించడం” పదం “నివసించడం” లేదా లేక “ఉండడం” లేక “ఉనికిలో ఉండడం” అని అనువదించబడవచ్చు.
  • “జీవిత అంతం” అనే వాక్యం "అతడు జీవించడం నిలిపివేసినపుడు” అని అనువదించబడవచ్చు.
  • ”వారి జీవితాలు ఉండనిచ్చారు" అనే వాక్యం “వారు జీవించడానికి అనుమతించారు” లేదా "వారిని చంపలేదు" అని అనువదించబడవచ్చు.
  • ”వారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు” అనే వాక్యం “వారు తమని తాము ప్రమాదంలో ఉంచుకొన్నారు” లేదా “తమను చంపివెయ్యగల ఒక కార్యాన్ని చేసారు” అని అనువదించబడవచ్చు.
  • శాశ్వత జీవం గురించి బైబిలు చెపుతున్నప్పుడు, “జీవం” పదం “శాశ్వత జీవం” లేదా "దేవుడు మన ఆత్మలలో మనలను సజీవంగా చేస్తున్నాడు" లేదా "దేవుని ఆత్మ చేత నూతన జీవితం" లేదా "మన అంతరంగంలో సజీవం చెయ్యబడడం" అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, “జీవాన్ని ఇవ్వడం” అనే వాక్యం “జీవించేలా చెయ్యడం" లేదా "శాశ్వత జీవం ఇవ్వడం" లేదా "శాశ్వతంగా జీవించేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: మరణం, శాశ్వతమైన)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 01:10 కనుక దేవుడు నేల మట్టిని తీసుకొని మానవుణ్ణి చేసాడు, అతనిలో జీవాన్ని ఊదాడు.
  • 03:01 చాలా కాలం తరువాత లోకంలో అనేకమంది ప్రజలు జీవిస్తూ వచ్చారు.
  • 08:01 యోసేపు సోదరులు తమ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, యోసేపు ఇంకా సజీవం గా ఉన్నాడని తమ తండ్రితో చెప్పారు. అతడు మిక్కిలి సంతోషించాడు.
  • 17:0 9 అయితే అతని (దావీదు)జీవితం అంతంలో దేవుని యెదుట భయంకర పాపం చేసాడు.
  • 27:01 ఒక రోజు యూదా ధర్మశాస్త్ర ప్రవీణుడు ఆయనను శోధించాలని యేసునొద్దకు వచ్చాడు., “బోధకుడూ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.
  • 35:05”పునరుద్దానమునూ, జీవమునూ నేనే” అని యేసు జవాబిచ్చాడు.
  • 44:05 “యేసును చంపమని రోమా అధిపతికి మీరే చెప్పారు. జీవాధి పతిని మీరే చంపారు, అయితే దేవుడు ఆయనను మృతులలోనుండి లేపాడు.

పదం సమాచారం:

  • Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590

జ్ఞాని, జ్ఞానము

నిర్వచనము:

“జ్ఞాని” అనే పదము క్రియలలో చేయుటకు సరియైన విషయమును మరియు నైతిక విషయమును అర్థము చేసికొని, దానిని చేసి చూపించే ఒక వ్యక్తిని వివరించుచున్నది. “జ్ఞానము” అనగా సరియైన దానిని మరియు నైతికమైన విషయాలను అర్థము చేసికొని, వాటిని అభ్యాసము చేయుట అని అర్థమైయున్నది.

  • జ్ఞానిగా ఉండుటలో మంచి నిర్ణయాలను చేయు సామర్థ్యము ఇమిడియున్నది, విశేషముగా దేవునికి ఇష్టమైన పనులను చేయుటను ఎన్నుకొనుట అందులో ఉండును.
  • పరిశుద్ధ గ్రంథములో “లోకపరమైన జ్ఞానము” అనే ఈ మాట ఈ లోకములో ప్రజలు ఆలోచించే దానిని సూచిస్తూ చెప్పే అలంకారిక విధానమైయున్నది, అయితే ఇది మూర్ఖత్వమైయున్నది.
  • ప్రజలు దేవుని మాటలను వినుట ద్వారా మరియు ఆయన చిత్తమునకు లోబడుట ద్వారా జ్ఞానులుగా మారుతారు.
  • జ్ఞానియైన ఒక వ్యక్తి తన జీవితములో ఆనందము, దయ, ప్రేమ మరియు సహనము అనే పరిశుద్ధాత్ముని ఫలాలను చూపిస్తాడు.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, “జ్ఞాని” అనే పదమును తర్జుమా చేయు విధానములో “దేవునికి విధేయత చూపుట” అని లేక “సరియైన ప్రవర్తనగల మరియు విధేయతగల” లేక “దేవునికి భయపడుట” అని కూడా ఉపయోగించుదురు.
  • “జ్ఞానము” అనే పదమును “జ్ఞానముగలిగి జీవించుట” లేక “సరైన విధముగా మరియు విధేయతతో జీవించుట” లేక “మంచి తీర్పు” అని అర్థములతో ఉన్న వాక్యముల ద్వారా తర్జుమా చేయవచ్చును.
  • “జ్ఞాని” మరియు “జ్ఞానము” అనే పదములను నీతి లేక విధేయత అనే పదాలవలె అవి వేరు వేరు పదాలని తెలియునట్లు తర్జుమా చేయట ఉత్తమము.

(ఈ పదాలను కూడా చూడండి: విధేయత చూపు, ఫలము)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 02:05 ఆమె కూడా జ్ఞాని అవ్వాలని కోరుకున్నది, అందుచేత ఆమె ఫలము తీసుకొని, దానిని తినింది.
  • 18:01 సొలొమోను జ్ఞానము కొరకు అడిగినప్పుడు, దేవుడు చాలా ఇష్టపడ్డాడు మరియు తనను లోకములోనే జ్ఞానవంతుడిగా చేశాడు.
  • 23:09 కొంతకాలమైన తరువాత, తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములోని తారను చూశారు.
  • 45:01 అతను (స్తెఫెను) మంచి పేరు కలిగియుండెను మరియు పరిశుద్ధాత్మతోనూ మరియు జ్ఞానముతోనూ నింపబడియుండెను.

పదం సమాచారం:

  • Strong's: H998, H1350, H2445, H2449, H2450, H2451, H2452, H2454, H2942, H3820, H3823, H6195, H6493, H6912, H7535, H7919, H7922, H8454, G4678, G4679, G4680, G4920, G5428, G5429, G5430

డంబం, డంబాలు, డంబాలు పలుకు

నిర్వచనం:

ఈ పదం "డంబాలు"అంటే దేన్నైనా, ఎవరినైనా ఉద్దేశించి గర్వం మాటలు పలకడం. దీని అర్థం తరచుగా తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం.

  • "డంబాలు పలుకు"వాడు తన గురించి గర్వంగా మాట్లాడతాడు.
  • ఇశ్రాయేలీయులు వారి విగ్రహాల గురించి "డంబాలు చెప్పుకుంటున్నందుకు" దేవుడు వారిని గద్దించాడు. వారు నిజ దేవుని స్థానంలో అహంకారంగా అబద్ధ దేవుళ్ళను ఆరాధించారు.
  • ప్రజలు వారి సంపద, వారి బలం, వారి సారవంతమైన భూములు, వారి చట్టాలు గురించి డంబాలు పలకడం గురించి బైబిల్ చెబుతున్నది. అంటే వారు ఈ విషయాల గురించి గర్వంగా మాట్లాడుతూ వాటన్నిటినీ ఇచ్చింది దేవుడేనని గుర్తించడం లేదు.
  • దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు. ఇలాటి "అతిశయాలు," గర్వం మాటలు అయన తమకు తెలుసు అనే దాన్ని బట్టి వారు పలకాలి.
  • అపోస్తలుడు పౌలు కూడా ప్రభువులో అతిశయించాలని చెబుతున్నాడు. అంటే దేవుడు వారికి చేసిన దానంతటిని బట్టి వారు సంతోషంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి.

అనువాదం సలహాలు:

  • "డంబాలు"అనే దాన్ని అనువదించే ఇతర పద్ధతులు. "డప్పాలు” లేక “గర్వపు మాటలు” లేక “గర్వంగా ఉండడం."
  • ఈ పదం "డంబాలు పలుకు"అనే మాటను ఒక పదం లేక పదబంధం తో అనువదించడం ఎలా అంటే "గర్విష్టి మాటలతో నిండిపోయి” లేక “అహంభావం” లేక “తన గురించి గర్వంగా మాట్లాడడం."
  • దేవుణ్ణి గురించి ఎరిగినందువల్ల అతిశయించే సందర్భంలో దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గర్వపడు” లేక “ఆనందించు” లేక “దాన్ని బట్టి ఎంతో ఆనందించి” లేక “దాని విషయం దేవునికి కృతఙ్ఞతలు చెప్పి."
  • కొన్ని భాషల్లో నకారాత్మకమైన గర్వానికి, మంచి గర్వానికి వేరు వేరు మాటలు ఉంటాయి. ఉదాహరణకు ఒకటి అహంకారి. రెండవది అనుకూల పదం. తన కుటుంబం, పని, దేశం గురించి గర్వంగా భావించడం.

అనువాదం సలహాలు:

(చూడండి: గర్వం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1984, H3235, H6286, G212, G213, G2620, G2744, G2745, G2746, G3166

తండ్రియైన దేవుడు, పరలోకపు తండ్రి, తండ్రి

వాస్తవాలు:

"తండ్రి యైన దేవుడు,” “పరలోకపు తండ్రి" పదాలు ఏకైక నిజ దేవుడు యెహోవాను సూచిస్తున్నాయి. "తండ్రి" అనే మరొక పదం యేసు ఆయనను సూచిస్తున్నప్పుడు ఇదే అర్థంతో తరచుగా ఉపయోగించబడింది.

  • దేవుడు తండ్రి యైన దేవుడుగా, కుమారుడు అయిన దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఉనికి కలిగి ఉన్నాడు. ప్రతిఒక్కరూ సంపూర్ణంగా దేవుడై ఉన్నారు. అయినా వారు ఒకే ఒక్క దేవుడుగా ఉన్నారు. ఇది ఒక మర్మం, కేవలం మానవులు దీనిని సంపూర్ణంగా అర్థం చేసులోలేరు.
  • తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుణ్ణి (యేసు) ఈ లోకంలోనికి పంపాడు. ఆయన పరిశుద్ధాత్మను తన ప్రజల వద్దకు పంపుతున్నాడు.
  • కుమారుడైన దేవుని యందు విశ్వాసముంచు వారెవరైనా వారు తండ్రియైన దేవుని బిడ్డ అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో నివసిస్తాడు. మానవ మాత్రులు అర్థం చేసుకోలేని మరొక మర్మం ఇది.

అనువాదం సూచనలు:

  • "తండ్రి యైన దేవుడు" పదబంధం అనువదించడంలో మానవ తండ్రిని సూచించడానికి భాషలో సహజంగా ఉపయోగించే "తండ్రి" పదంతోనే అనువదించడం ఉత్తమం.
  • "పరలోక తండ్రి" పదం "పరలోకంలో నివసిస్తున్న తండ్రి” లేదా “పరలోకంలో నివసించే తండ్రి యైన దేవుడు” లేదా “పరలోకం నుండి మన తండ్రి దేవుడు" అని అనువదించబడవచ్చు.
  • సాధారణంగా "తండ్రి" పదం దేవుణ్ణి సూచిస్తూ ఉన్నప్పుడు అక్షరాలు పెద్దవిగా ఉంటాయి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)

(చూడండి: పూర్వీకుడు, దేవుడు, పరలోకం, పరిశుద్ధాత్మ, యేసు, దేవుని కుమారుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 24:09 ఒకే ఒక దేవుడున్నాడు. అయితే ఆయన యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు తండ్రి యైన దేవుడు మాట్లాడుతుండగా యోహాను విన్నాడు. కుమారుడైన యేసునూ, పరిశుద్ధాత్మను చూచాడు.
  • 29:09 మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుడిని హృదయపూర్వకంగా క్షమించకపోతే “నా పరలోక తండ్రి మీకు కూడా అలానే చేస్తాడు."
  • 37:09 తరువాత యేసు ఆకాశం వైపు చూసి ఇలా చెప్పాడు, "తండ్రీ, నీవు నామాట వింటున్నందుకు వందనాలు."
  • 40:07 తరువాత యేసు గట్టిగా కేక వేసి, "సమాప్తం అయింది! తండ్రీ, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను."
  • 42:10 "కాబట్టి వెళ్లి సమస్త ప్రజలకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చి శిష్యులుగా చెయ్యండి. నేను అజ్ఞాపించిన వాటన్నిటిని వారు గైకొనేలా బోధించండి."
  • 43:08 "యేసు ఇప్పుడు తండ్రి యైన దేవుని కుడి వైపున హెచ్ఘచించబడ్డాడు.
  • 50:10 "తరువాత నీతిమంతులు వారి తండ్రి దేవుని రాజ్యంలో ప్రకాశిస్తూ ఉంటారు."

పదం సమాచారం:

  • Strong's: H1, H2, G3962

తిరిగి జన్మించడం, దేవుని మూలంగా జన్మించడం, నూతన జన్మ

నిర్వచనం:

"తిరిగి జన్మించడం" పదం ఆత్మీయంగా చనిపోయినవానిగా ఉన్న ఒక వ్యక్తిని ఆత్మీయంగా సజీవునిగా ఉండేలా దేవుడు చెయ్యడం గురించి వివరించడానికి యేసు చేత వినియోగించబడింది. "దేవుని మూలంగా జన్మించడం" మరియు "ఆత్మ మూలంగా జన్మించడం" పదాలు కూడా నూతన ఆత్మీయ జీవాన్ని పొందిన వ్యక్తిని సూచిస్తున్నాయి.

  • మానవులు అందరూ ఆత్మీయంగా చనిపోయినవారిగా జన్మించారు. యేసు క్రీస్తును వారి రక్షకుడుగా అంగీకరించినప్పుడు వారు ఒక "నూతన జన్మ" పొందారు.
  • ఆత్మ సంబంధమైన నూతన జన్మ పొందిన క్షణంలో, దేవుని పరిశుద్ధాత్మ నూతన విశ్వాసిలో జీవించడం ఆరంభం అవుతుంది మరియు అతని జీవితంలో మంచి ఆత్మీయ ఫలించడానికి అతనిని శక్తితో నింపుతాడు.
  • ఒక వ్యక్తి తిరిగి జన్మించేలా చెయ్యడమూ, దేవుని బిడ్డ అయ్యేలా చెయ్యడం దేవుని కార్యం. .

అనువాదం సూచనలు:

  • "తిరిగి జన్మించడం" పదాన్ని ఇతర విధానాలలో అనువదించడానికి "నూతనంగా జన్మించడం" లేదా "ఆత్మీయంగా జన్మించడం" పదాలు ఉండవచ్చు.
  • ఈ పదాన్నిఅక్షరాలా అనువదించడం, పుట్టడం పదం కోసం ఉపయోగించే బాషలోని సాధారణ పదాన్ని ఉపయోగించడం ఉత్తమం.
  • "నూతన జన్మ" పదం "ఆత్మ సంబంధమైన జన్మ" పదముగా అనువదించబడవచ్చు.
  • "దేవుని మూలంగా జన్మించడం" పదబంధం "నూతన శిశువు వలే నూతన జీవం పొందేలా దేవుడు చెయ్యడం" లేదా "దేవుడు నూతన జన్మ అనుగ్రహించాడు" అని అనువదించబడవచ్చు.
  • అదే విధంగా, "ఆత్మ మూలంగా జన్మించడం" పదబందం "పరిశుద్ధాత్మ నూతన జన్మ అనుగ్రహించాడు" లేదా "దేవుని బిడ్డగా మారడానికి పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు" లేదా "నూతన శిశువు వలే నూతన జీవం పొందేలా పరిశుద్ధాత్మ చేసాడు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: పరిశుద్ధాత్మ, రక్షించు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G313, G509, G1080, G3824

తీర్పు దినం

నిర్వచనం:

"తీర్పు దినం" అనేపదం భవిషత్తులో దేవుడు న్యాయాధిపతిగా ప్రతి వ్యక్తికి తీర్పు తీర్చే సమయాన్ని సూచిస్తున్నది.

  • దేవుడు తన కుమారుడు, యేసు క్రీస్తును, ప్రజలందరికీ న్యాయాధిపతిగా నియమించాడు.
  • తీర్పు దినాన క్రీస్తు ప్రజలందరికీ న్యాయాధిపతిగా తన న్యాయ గుణ లక్షణాలు కనపరుస్తాడు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని ఇలా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తీర్పు సమయం" ఎందుకంటే అది ఒకటి కంటే ఎక్కువ రోజులు ఉండవచ్చు.
  • ఈ పదాన్ని అనువదించడంలో ఇతర పద్ధతులు. "అంత్య కాలం దేవుడు న్యాయాధిపతిగా ప్రజలందరికీ తీర్పు తీర్చే సమయం."
  • కొన్ని అనువాదాలు పెద్ద అచ్చు అక్షరాలతో ఈ పదాన్ని చూపుతాయి. ఇది ఒక ప్రత్యేక దినం లేక సమయం అని చెప్పడానికి. "తీర్పు దినం” లేక “తీర్పు సమయం."

(చూడండి: న్యాయాధిపతి, యేసు, పరలోకం , నరకం )

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2962, H3117, H4941, G2250, G2920, G2962

దక్షిణ హస్తము

నిర్వచనము:

“దక్షిణ హస్తము” అనే అలంకారిక మాట పాలకుని కుడి హస్తపు బలమును లేక అతని ఘనత యొక్క స్థలమును లేదా ఇతర ప్రాముఖ్యమైన విషయమును సూచించును.

  • దక్షిణ హస్తము అనునది కూడా శక్తికి, అధికారమునకు లేక బలమునాకు గురుతుగాను ఉపయోగించబడినది.
  • యేసు తండ్రియైన దేవుని “కుడి పార్శ్వమున” కూర్చొనియున్నాడని, (సంఘమునకు) విశ్వాసులకు శిరస్సుగాను మరియు సమస్త సృష్టి పాలకునిగానిగాను పరిశుద్ధ గ్రంథము వివరించుచున్నది.
  • ఒక వ్యక్తి కుడి చేయిని ఇంకొకరి తలపై పెట్టి ఆశీర్వాదమునిచ్చుటకు ప్రత్యేకమైన ఘనతగా చూపించుటకు ఉపయోగించడమైనది (పితరుడైన యాకోబు యోసేపు కుమారుడైన ఎఫ్రాయిమును ఆశీర్వదించెను).
  • ఒక వ్యక్తి “కుడి చేతి ద్వారా సేవ చేయుట” అనే మాటకు ఒకరు చేసే సేవ ఆ వ్యక్తికి విశేషముగా సహాయకరమైనది మరియు ప్రాముఖ్యమైనది అర్థము.

తర్జుమా సలహాలు:

  • కొన్నిమార్లు “దక్షిణ హస్తము” అనే మాటకు అక్షరార్థము ఏమనగా ఒక వ్యక్తి కుడి చేయిని సూచిస్తుంది, ఉదాహరణకు - రోమా సైనికులు యేసుని హేళన చేయుటకు యేసు కుడి చేతికి కర్రను చేతికిచ్చిరి. ఈ చేయిని సూచించుటకు భాషలో ఉపయోగించే పదమును ఉపయోగించి తర్జుమా చేయడము మంచిది.
  • అలంకారిక ఉపయోగాలకు సంబంధించి, ఒకవేళ ఆ మాటలో “కుడిచేయి” అనే పదమును వినియోగించి, తర్జుమా చేయు భాషలో అదే అర్థము లేకపోయినట్లయితే, అదే అర్థముతో ఉన్నటువంటి ఇతర విభిన్నమైన మాట ఆ భాషలో ఉందేమోనని గమనించండి.
  • “కుడి చేతి వద్ద” అనే ఈ మాటను “కుడి ప్రక్కన” లేక “ఘనతగల స్థలము ప్రక్కన” లేక “బలముగల స్థానములో” లేక “సహాయము చేయుటకు సిద్ధముగానున్న” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఆయన దక్షిణ హస్తముతో” అనే ఈ మాటను తర్జుమా చేయు అనేకమైన విధానములో “అధికారముతో” లేక “శక్తిని ఉపయోగించి” లేక “అద్భుతమైన ఆయన బలముతో” అనే మాటలు చేర్చబడుతాయి.
  • “ఆయన దక్షిణ హస్తము మరియు ఆయన బలమైన హస్తము” అనే ఈ అలంకారిక మాటను దేవుని శక్తిని మరియు గొప్ప బలమును నొక్కి చెప్పుటకు రెండు విధాలుగా ఉఅపయోగించబడును. ఈ మాటను తర్జుమా చేయు ఒక విధానములో “ఆయన అద్భుతమైన బలము మరియు గొప్ప శక్తి” అని కూడా వ్రాయుదురు. (చూడండి: సమాంతరములు)
  • “వారి కుడి హస్తము అబద్ధము” అనే ఈ మాటను “వారిని గూర్చి గొప్ప ఆలోచన కలిగియున్నప్పటికి, వారు అబద్ధములు చెప్పుట ద్వారా చెడిపోయిరి” లేక “వారికున్న గౌరవము మోసము చేస్తున్నందున చెడిపోయెను” లేక “తమ్మునుతాము బలవంతులనుగా చేసికొనుటకు వారు అబద్ధములాడుదురు” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: ఆరోపించు, చెడు, గౌరవించు, శక్తిగల, శిక్షించు, తిరస్కరించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3225, H3231, H3233, G1188

దత్తత, దత్తత తీసుకొను, దత్తత తీసుకొన్న

నిర్వచనం:

"దత్తత తీసుకొను,""దత్తత"అంటే శారీరిక తల్లిదండ్రులు కాని వారికి చట్టబద్ధంగా పిల్లలు కావడం.

  • బైబిల్ "దత్తత," "దత్తత తీసుకొను" అనే మాటలను అలంకారికంగా దేవుడు కొందరిని తన కుటుంబంలో సభ్యులుగా చేసి వారిని తన ఆత్మ సంబంధమైన కుమారులు, కుమార్తెలుగా చేసే ప్రక్రియకు వాడతారు.
  • దత్తత తీసుకొన్న పిల్లలుగా, దేవుడు విశ్వాసులను యేసు క్రీస్తు సహ వారసులుగా చేసి, వారికి దేవుని కుమారులకు, కుమార్తెలకు ఉండే అధిక్యతలు కలిగిస్తాడు.

అనువాదం సలహాలు:

  • అనువాద భాషలో ఒక ప్రత్యేక తండ్రి పిల్లల అనుబంధాన్ని తెలిపే పదంతో ఈ పదాన్ని అనువదించ వచ్చు.

అది అలంకారికంగా, లేక ఆత్మ సంబంధమైన అర్థంతో వాడిన మాట అని అర్థం అయ్యేలా జాగ్రత్త పడు.

  • "దత్త కుమారులుగా" అనే మాటను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుడు తన పిల్లలుగా దత్తత తీసుకొన్న వారుగా” లేక “దేవుని (ఆత్మ సంబంధమైన ) పిల్లలుగా."
  • "దత్తత అయిన కుమారులుగా ఉండడానికి ఎదురు చూచు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుని పిల్లలుగా కావడానికి కనిపెట్టు” లేక “దేవుడు తన పిల్లలుగా స్వీకరించడం కోసం వేచి ఉండు."
  • "వారిని దత్తత తీసుకొను"అనే మాటను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తన స్వంత పిల్లలుగా వారిని చేసుకునేలా” లేక “వారిని తన (ఆత్మ సంబంధమైన ) పిల్లలుగా చేసుకునేలా."

(చూడండి: వారసుడు, వారసత్వముగా పొందు, ఆత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G5206

దయ్యం పట్టిన

నిర్వచనం:

దయ్యం పట్టిన వాడిలో దయ్యం లేక దురాత్మ ఉండి అతని ఆలోచనలను చర్యలను అదుపు చేస్తుంది.

  • తరచుగా దయ్యం పట్టిన వ్యక్తి తనకు ఇతరులకు గాయాలు చేస్తాడు. ఎందుకంటే దయ్యం అతన్ని అలా చేయిస్తుంది.
  • యేసు దయ్యం పట్టిన ప్రజలు స్వస్థత ఇచ్చాడు. దయ్యాలు వారిలోనుండి బయటకు రావాలని అజ్ఞాపించాడు. దీన్ని "దయ్యాలను వెళ్ళగొట్టడం" అంటారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని అనువదించడంలో ఇతర పద్ధతులు "దయ్యం ఒకణ్ణి లొంగ దీసుకోవడం” లేక “దురాత్మఅదుపు కిందికి వెళ్ళడం” లేక “తనలో దురాత్మ నివసించడం."

(చూడండి: దయ్యం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 26:09 అనేక మంది దయ్యాలు పట్టిన వారిని యేసు దగ్గరికి తెచ్చారు.
  • 32:02 వారు సరస్సు అవతలికి వెళ్ళినప్పుడు దయ్యం పట్టిన మనిషి యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
  • 32:06 దయ్యం ఉన్న మనిషి "యేసూ సర్వోన్నత దేవకుమారా నాతో నీకేం పని?” అని అరిచాడు. దయచేసి నన్ను హింసించకు!"
  • 32:09 ప్రజలు నుండి ఊరునుండి వచ్చి దయ్యలున్న మనిషిని చూశారు.
  • 47:03 ప్రతిరోజూ వారు (పౌలు, సీల) నడిచి వెళ్తుండగా ఒక దయ్యం పట్టిన బానిస బాలిక వారి వెనకే వెళ్ళేది.

పదం సమాచారం:

  • Strong's: G1139

దయ్యం, దురాత్మ, మలిన ఆత్మ

నిర్వచనం:

ఈ పదాలు అన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న దయ్యాలను సూచించేవి.

  • దేవుడు తనను సేవించడానికి దేవదూతలను చేశాడు. సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు కొందరు దేవదూతలు కూడా తిరుగుబాటులో పాల్గొని పరలోకం నుండి గెంటివేయబడ్డారు. దయ్యాలు, దురాత్మలు ఈ "పతనమైన దేవదూతలు" అంటారు.
  • కొన్ని సార్లు ఈ దయ్యాలను "మలిన ఆత్మలు" అన్నారు. "మలిన" అంటే "అపరిశుద్ధ” లేక “దుష్ట” లేక “అపవిత్ర."
  • ఎందుకంటే దయ్యాలు దుర్మార్గాలు చేస్తూ సాతానును సేవిస్తారు. కొన్ని సార్లు వారు మనుషుల్లో దూరి వారిని అదుపు చేస్తారు.
  • దయ్యాలు మనుషుల కంటే శక్తివంతమైన జీవులు. అయితే దేవుని కంటే శక్తివంతులు కారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "దయ్యం" "దురాత్మ"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
  • ఈ పదం "అపవిత్రాత్మ"ను "అపరిశుద్ధ ఆత్మ” లేక “చెడిన ఆత్మ” లేక “దురాత్మ అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
  • ఈ పదం లేక పదబంధాలను సాతానును సూచించే వివిధ పాదాలను అనువదించడంలో ఉపయోగిస్తారు అనేది గుర్తుంచుకోండి.
  • ఈ పదం "దయ్యం" అనే దాన్ని అనువదించ వచ్చు స్థానిక, జాతీయ భాష పదాలతో తర్జుమా చెయ్యవచ్చు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: దయ్యం పట్టిన, సాతాను, అబద్ధ దేవుడు, అబద్ధ దేవుడు, దేవదూత, దుష్టత్వం, శుద్ధ)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 26:09 అనేక మంది ప్రజలు దయ్యాలు పట్టిన వారిని యేసు దగ్గరకు తెచ్చారు. యేసు వారిని అజ్ఞాపించినప్పుడు దయ్యాలు మనుషుల నుండి బయటకు వచ్చాయి. అవి తరచుగా "నీవు దేవుని కుమారుడవు!" అని అరిచాయి.
  • 32:08 దయ్యాలు ఆ మనిషిలోనుండి బయటికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి.
  • 47:05 చివరకు ఒక రోజు బానిస బాలిక కేకలు వేస్తుంటే, పౌలు ఆమె వైపు తిరిగి ఆమెలోని__దయ్యాన్ని__బయటికి రమ్మని చెప్పాడు." వెంటనే దయ్యం ఆమెను విడిచి పోయింది.
  • 49:02 ఆయన (యేసు) నీటిపై నడిచాడు. తుఫానును శాంతపరిచాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను 5,000 మందిని ఆహారంగా ఇచ్చాడు.

పదం సమాచారం:

  • Strong's: H2932, H7307, H7451, H7700, G169, G1139, G1140, G1141, G1142, G4190, G4151, G4152, G4189

దివ్య

నిర్వచనం:

"దివ్య" అనే పదం దేవునికి చెందిన దేనికైనా వర్తిస్తుంది.

  • ఈ పదాన్ని ఉపయోగించే పద్ధతులు "దివ్య అధికారం," "దివ్య తీర్పు," "దివ్య స్వభావం," "దివ్య శక్తి,” “దివ్య మహిమ."
  • బైబిల్లో ఒక వాక్య భాగంలో, అబద్ద దేవుడుడికి చెందిన దాన్ని వర్ణించడానికి "దివ్య" is ఉపయోగించారు.

అనువాదం సలహాలు:

  • "దివ్య" అనే మాటను అనువదించడంలో "దేవుని” లేక “దేవుని నుండి” లేక “దేవునికి సంబంధించిన” లేక “దేవుని గుణ లక్షణాలు" అనే అర్థాలు వస్తాయి.
  • ఉదాహరణకు, "దివ్య అధికారం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"దేవుని అధికారం” లేక “దేవుని నుండి కలిగిన అధికారం."
  • పద బంధం "దివ్య మహిమ" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుని మహిమ” లేక “దేవునికి గల మహిమ” లేక “దేవుని నుండి వచ్చే మహిమ."
  • కొన్ని అనువాదాలు అబద్ధ దేవుళ్ళ కోసం కూడా వివిధ పదాలు వాడవచ్చు.

(చూడండి: అధికారం, అబద్ధ దేవుడు, మహిమ, దేవుడు, న్యాయాధిపతి, శక్తి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2304, G2999

దుష్టత్వం, దుర్మార్గుడు, భ్రష్టమైన

నిర్వచనం:

బైబిలులో "దుష్టత్వం” పదం నైతిక దుష్టత్వాన్ని లేక భావోద్రేక భ్రష్టత్వాన్ని గురించిన భావాన్ని సూచిస్తుంది. పదం ఉపయోగించబడిన నిర్దిష్ట సమయంలో ఉద్దేశించబడిన అర్థాన్ని ఆ సందర్భం సాధారణంగా తెలియపరుస్తుంది.

  • "దుష్టత్వం" అనేది వ్యక్తి గుణ లక్షణాల గురించి తెలియపరుస్తుంది, అయితే, "దుర్మార్గం" అనేది ఒక వ్యక్తి ప్రవర్తన గురించి వివరిస్తుంది. అయితే, రెండు పదాలకు ఒకే విధమైన అర్థం ఉంది.
  • "దుర్మార్గత" పదం మనుషులు చెడు కార్యాలు చేస్తున్నప్పుడు ఉన్న స్థితిని సూచిస్తుంది.
  • దుష్టత్వం ఫలితాలు ఇతరులను హత్య చేయడం, దొంగతనం, దుర్భాషలు, కౄరంగా ఉండడం, కఠినత్వం చూపడంలో స్పష్టంగా కనిపిస్తాయి.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "దుష్టత్వం” “దుర్మార్గత" పదాలు "చెడు" లేదా "పాపపూరితమైన” లేదా "అనైతిక" అని అనువదించబడవచ్చు.
  • "మంచిది కానిది" లేదా "నీతి కానిది" అని కూడా ఇతర విధాలుగా అనువదించవచ్చు.
  • ఈ పదాలు, పద బంధాలు లక్ష్య భాషలో సహజమైన, సందర్భ సహితమైన రీతిలో ఉపయోగించబడేలా జాగ్రత్త పడండి.

(చూడండి: అవిధేయత, పాపం, మంచి, నీతిమంతుడు, దయ్యం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 02:04 "మీరు దానిని తినిన వెంటనే మీరు దేవుని వలే అవుతారని దేవునికి తెలుసు మరియు ఆయనకు వలే మంచి, చెడు లను తెలుసుకొంటారు.
  • 03:01 చాలాకాలం తరువాత అనేక మంది ప్రజలు లోకంలో నివసిస్తున్నారు. వారు చాలా దుర్మార్గంగా మరియు హింసాత్మకంగా తయారయ్యారు.
  • 03:02 అయితే నోవహు దేవుని దయను పొందాడు. అతడు దుష్టుల మధ్య నివసిస్తున్న నీతిమంతుడు.
  • 04:02 దేవుడు వారు అందరూ కలిసి దుష్టత్వం చేయడానికి కలిసిపనిచేసినట్లయితే, వారు అనేక పాపపూరితమైన కార్యాలు చేస్తారని దేవుడు చూచాడు.
  • 08:12 "నన్ను ఒక బానిసగా అమ్మివేసినప్పుడు మీరు దుష్టత్వం చేయడానికి ప్రయత్నించారు. అయితే దేవుడు దుష్టత్వాన్ని మేలు కోసం ఉపయోగించాడు!"
  • 14:02 వారు (కనానీయులు) ఆరాధించిన అబద్ధ దేవుళ్ళను పూజించారు, అనేక దుష్ట కార్యాలు చేశారు.
  • 17:01 అయితే అప్పుడు అతడు (సౌలు) ఒక దుర్మార్గుడైన వ్యక్తిగా మారాడు. దేవునికి విధేయత చూపలేదు. కాబట్టి దేవుడు వేరొక మనిషిని అతని స్థానంలో రాజుగా ఎన్నుకున్నాడు.
  • 18:11 నూతన ఇశ్రాయేలు రాజ్యంలో రాజులు అందరూ దుష్టులే .
  • 29:08 రాజు కోపగించుకుని ఆ దుష్ట సేవకుడిని అతడు తన ఋణం అంతా తీర్చే వరకు చెరసాలలో వేయించాడు.
  • 45:02 "అతడు (స్తెఫను) మోషే గురించీ, దేవుని గురించీ చెడు మాటలు పలకడం మేము విన్నాము" అని చెప్పారు."
  • 50:17 అయన (యేసు) ప్రతి కన్నీటి బిందువును తుడిచి వేయును, ఇకమీద హింసలు, విచారం, ఆక్రోశం, దుష్టత్వం, బాధ నొప్పి, లేక మరణం ఉండవు.

పదం సమాచారం:

  • Strong's: H205, H605, H1100, H1681, H1942, H2154, H2162, H2617, H3415, H4209, H4849, H5753, H5766, H5767, H5999, H6001, H6090, H7451, H7455, H7489, H7561, H7562, H7563, H7564, G92, G113, G459, G932, G987, G988, G1426, G2549, G2551, G2554, G2555, G2556, G2557, G2559, G2560, G2635, G2636, G4151, G4189, G4190, G4191, G5337

దేవదూత, దేవదూతలు, ప్రధాన దూత

నిర్వచనం:

దేవదూత దేవుడు సృష్టించిన ఒక శక్తివంతమైన ఆత్మ. దేవదూతలు దేవుణ్ణి సేవిస్తూ ఆయన చెప్పినది చేసే వారు. "ప్రధాన దూత" అనే ఈ పదం దేవదూత ఇతర దేవదూతల నాయకునికి వర్తిస్తుంది.

  • ఈ పదానికి అక్షరార్థం "దేవదూత""వార్తాహరుడు."
  • "ప్రధాన దూత" అంటే అక్షరాలా "ప్రధాన వార్తాహరుడు." "ప్రధాన దూత" అని బైబిల్లో చెప్పిన దేవదూత ఒక్క మిఖాయేలు మాత్రమే.
  • బైబిల్లో, దేవదూతలు దేవుని నుండి మనుషులకు సందేశాలు తెచ్చే వారు. ఈ సందేశాలలో దేవుడు తన ప్రజలకు ఇస్తున్న సూచనలు ఉన్నాయి.
  • దేవదూతలు మనుషులకు రాబోయే కాలంలో జరగనున్న సంఘటనలు తెలియ జేస్తారు. లేక ఇప్పటికే జరిగిపోయిన సంఘటనలు చెబుతారు.
  • దేవదూతలకు దేవుని ప్రతినిధులుగా అయన అధికారం ఉంది. కొన్ని సార్లు బైబిల్లో దేవుడే మాట్లాడుతున్నట్టు వీరు మాట్లాడుతారు.
  • దేవదూతలు దేవుణ్ణి సేవించే ఇతర మార్గాలు, మనుషులకు భద్రత, బలం ఇవ్వడం ద్వారా.
  • ఒక ప్రత్యేక పద బంధం, "యెహోవా దూత," అనే దానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నాయి: 1) "యెహోవాకు ప్రతినిధిగా ఉన్న దేవదూత” లేక “యెహోవాను సేవించే వార్తాహరుడు." 2) అది సాక్షాత్తూ యెహోవాకే వర్తిస్తుంది. అయన దేవదూతగా కనిపించి వ్యక్తులతో మాట్లాడాడు. ఈ రెంటిలో ఈ అర్థం దేవదూతలు "నేను"అంటూ తానే యెహోవానన్నట్టు మాట్లాడడం ఎందుకో వివరిస్తుంది.

అనువాదం సలహాలు:

  • "దేవదూత"అనే మాటను అనువదించడంలో "దేవుని నుండి వార్తాహరుడు” లేక “దేవుని పరలోక సేవకుడు” లేక “దేవుని ఆత్మ వార్తాహరుడు"అనే అర్థాలు వస్తాయి.
  • "ప్రధాన దూత" అనే ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రధాన దేవదూత” లేక “దేవదూతలను శాసించే వాడు” లేక “దేవదూతల నాయకుడు."
  • ఈ పదాలను అనువదించడం జాతీయ భాష లో లేక మరొక స్థానిక భాషలో ఎలా అనేది ఆలోచించండి.
  • "యెహోవా దూత" అనే పద బంధాన్ని అనువదించడం "దేవదూత,” “యెహోవా” అనే మాటలను చెప్పడానికి ఉపయోగించే మాటలతో చెయ్యాలి." ఇలా చెయ్యడం ద్వారా ఆ పద బంధం వివిధ వివరణలు సరిపోతాయి. ఇంకా ఇక్కడ వాడదగిన అనువాదాలు, "యెహోవా నుండి వచ్చిన దేవదూత” లేక “యెహోవా పంపిన దేవదూత” లేక “దేవదూతలాగా కనిపించిన యెహోవా."

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: ప్రధాని, శిరస్సు, వార్తాహరుడు, మిఖాయేలు, అధిపతి, సేవకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 02:12 దేవుడు గొప్ప శక్తివంతమైన దేవదూతలను తోట ప్రవేశ ద్వారం వద్ద ఉంచాడు. ఎవరైనా ప్రవేశించి జీవ వృక్షం పండు తినకూడదని ఇలా చేశాడు.
  • 22:03 దేవదూత జెకర్యాకు జవాబిస్తూ, "నన్ను ఈ మంచి వార్త వినిపించడానికి దేవుడు పంపాడు."
  • 23:06 హటాత్తుగా మెరిసిపోతున్న ఒక దేవదూత వారికి (కాపరులకు), ప్రత్యక్షం అయ్యాడు. వారు భయంతో బిగుసుకు పోయారు. దేవదూత వారికి ఇలా చెప్పాడు, "భయపడకండి, ఎందుకంటే మీకోసం మంచి వార్త తెచ్చాను."
  • 23:07 హటాత్తుగా, ఆకాశం దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన పాటలతో నిండిపోయింది.
  • 25:08 అప్పుడు దేవదూతలు వచ్చి యేసుకు సేదదీర్చారు.
  • 38:12 యేసు తన చెమట రక్తబిందువులుగా పడుతుండగా గొప్ప యాతన అనుభవించాడు. దేవుడు ఒక దేవదూతను ఆయన్ను బలపరచడం కోసం పంపించాడు.
  • 38:15 "నన్ను కాపాడడానికి తండ్రిని గొప్ప దేవదూతల సైన్యం కోసం అడగలేనా."

పదం సమాచారం:

  • Strong's: H47, H430, H4397, H4398, H8136, G32, G743, G2465

దేవుడు

నిర్వచనం:

బైబిలులో "దేవుడు" అనే పదం శూన్యంలో నుండి విశ్వాన్ని సృష్టించిన శాశ్వత జీవిని సూచిస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనిగా దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు. దేవుని వ్యక్తిగత నామం "యెహోవా."

  • దేవుడు ఎల్లప్పుడూ ఉనికి కలిగియున్నాడు. ఏదీ ఉనికిలో లేక ముందు అయన ఉన్నాడు. అయన శాశ్వత కాలం ఉనికి కలిగిఉంటాడు.
  • ఆయన ఏకైక నిజ దేవుడు. విశ్వంలో సమస్తము మీద ఆయన అధికారాన్ని కలిగియున్నాడు.
  • దేవుడు సంపూర్ణంగా నీతిమంతుడు, అనంత జ్ఞానం గలవాడు, పరిశుద్ధుడు, పాపరహితుడు. న్యాయవంతుడు, కరుణగలవాడు, ప్రేమగలవాడు.
  • అయన నిబంధనను జరిగించు వాడు, తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేర్చువాడు.
  • దేవుణ్ణి ఆరాధించడం కోసమే మనుషులను అయన సృష్టించాడు, వారు ఆయనను మాత్రమే ఆరాధించాలి.
  • దేవుడు తన పేరును "యెహోవా" అని బయలుపరచుకొన్నాడు. అంటే "ఆయన ఉన్నవాడు" లేదా "నేను ఉన్నవాడను" లేదా "ఎల్లప్పుడూ ఉనికి కలిగియున్నవాడు" అని అర్థం.
  • బైబిలు అబద్ధపు "దేవుళ్ళను" గురించి కూడా బోధిస్తుంది. అవి కేవలం జీవం లేని విగ్రహాలు. మనుషులు వాటిని తప్పుగా పూజిస్తారు.

అనువాదం సూచనలు:

  • "దేవుడు" అనే పదం "దైవం" లేదా “సృష్టికర్త” లేదా “సర్వోన్నతుడైనవాడు" లేదా "సర్వోన్నతుడైన సృష్టికర్త" లేదా "అనంతుడైన సార్వభౌమ ప్రభువు" లేదా "శాశ్వతుడైన సర్వోన్నతుడైనవాడు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • అనువదించడంలో ఇతర పద్ధతులు. "సర్వతీతుడైన సృష్టికర్త” లేక “అనంతుడైన సార్వభౌమ ప్రభువు” లేక “నిత్యమైన సర్వాధికారి."
  • దేవుడు అనే పదాన్ని స్థానిక, జాతీయ భాషలో ఏవిధంగా సూచిస్తారో గమనించండి. అనువదించబడుతున్న భాషలో "దేవుడు" అనే పదం కోసం ఇంతకు ముందే ఒక పదం ఉండవచ్చు. అలా ఉంటే ఈ పదం పైన వర్ణించిన నిజ దేవుని గుణ లక్షణాలకు సరి పోయేలా నిశ్చయం చేసుకోవడం ప్రాముఖ్యం.
  • అనేక భాషలు ఏకైక నిజ దేవుని కోసం ఉపయోగించే పదం అబద్దపు దేవుని కోసం ఉండే పదంతో భిన్నంగా ఉండేలా పదం మొదటి అక్షరం పెద్ద అచ్చులో ఉంటుంది. నిజ దేవునికి అబద్ద దేవుళ్ళకు వేరువేరు పదాలు వాడడం ద్వారా ఇలాటి తేడా చూపించగల మరొక విధానం. గమనిక: బైబిలు వాక్యంలో యెహోవా దేవుణ్ణి ఆరాదించని వ్యక్తి యెహోవాను గురించి మాట్లాడుతున్నప్పుడు చిన్న అక్షరాలలో 'దేవుడు' పదం ఉపయోగించినప్పుడు యెహోవాను సూచిస్తూ పెద్ద అక్షరం లేకుండా పదాన్ని అనువదించినట్లయితే అది అంగీకారమే (యోహాను 1:16, 3:9 చూడండి).
  • "నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు" వాక్యం "దేవుడనైన నేను ఈ ప్రజల మీద పరిపాలన చేస్తాను, వారు నన్ను ఆరాధిస్తారు." అని అనువదించబడవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)

(చూడండి: సృష్టించు, అబద్ధపు దేవుడు, తండ్రియైన దేవుడు, పరిశుద్ధాత్మ, అబద్ధపు దేవుడు, దేవుని కుమారుడు, యెహోవా)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 01:01 దేవుడు విశ్వం, అందులోని సమస్తాన్నీఆరు రోజులలో సృష్టించాడు.
  • 01:15 దేవుడు పురుషుడినీ, స్త్రీనీ తన స్వంత స్వరూపంలో చేశాడు.
  • 05:03 "నేను సర్వ శక్తిమంతుడైన దేవుణ్ణి. నేను నీతో నిబంధన చేస్తాను."
  • 09:14 దేవుడు చెప్పాడు, "నేను ఉన్నవాడను అనువాడను” 'ఉన్నవాడు అనువాడు నన్ను నీ దగ్గరకు పంపాడు.' అని వారితో చెప్పు. 'నేను యెహోవాను, నీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. శాశ్వతకాలం ఇది నా నామం."
  • 10:02 ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు ఫరో కంటే, ఐగుప్తులోని దేవుళ్ళ కంటే తాను శక్తివంతమైన వాడనని ఫరోకు కనుపరిచాడు.
  • 16:01 ఇశ్రాయేలీయులు నిజ దేవుడు యెహోవాకు బదులుగా కనానీయుల దేవుళ్ళను పూజించసాగారు.
  • 22:07 నీవు నా కుమారుడవు, నిన్ను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త అని పిలువబడుడువు. నీవు మెస్సియా రాక కొరకు ప్రజలను సిద్ధం చేస్తావు!"
  • 24:09 ఒకే దేవుడు ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుండగా యోహాను విన్నాడు. కుమారుడైన యేసును అయన బాప్తిసం సమయంలో పరిశుద్ధాత్మ రావడం చూశాడు.
  • 25:07 "నీ ప్రభువైన దేవుని మాత్రమే పూజించాలి, ఆయనను మాత్రమే సేవించాలి."
  • 28:01 "మంచివాడు ఒక్కడే, అయనే దేవుడు."
  • 49:09 అయితే దేవుడు లోకంలోని ప్రతి ఒక్కరినీ ప్రేమించాడు, అయన తన అద్వితీయ కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచు వాడు తన పాపాలకోసం శిక్షపొందకుండా దేవునితో శాశ్వతకాలం ఉంటారు.
  • 50:16 అయితే కొన్ని రోజులకు దేవుడు పరిపూర్ణమైన నూతన ఆకాశాన్నీ నూతన భూమినీ సృష్టిస్తాడు.

పదం సమాచారం:

  • Strong's: H136, H305, H410, H426, H430, H433, H2486, H2623, H3068, H3069, H3863, H4136, H6697, G112, G516, G932, G935, G1096, G1140, G2098, G2124, G2128, G2150, G2152, G2153, G2299, G2304, G2305, G2312, G2313, G2314, G2315, G2316, G2317, G2318, G2319, G2320, G3361, G3785, G4151, G5207, G5377, G5463, G5537, G5538

దేవుడు, అబద్ధ దేవుడు, దేవుళ్ళు, దేవత, విగ్రహం, విగ్రహాలు, విగ్రహారాధికుడు, విగ్రహారాధికులు, విగ్రహారాధక, విగ్రహారాధన

నిర్వచనం:

నిజ దేవునికి బదులుగా అబద్ధ దేవుడు దేన్నైనా ప్రజలు పూజించడం. "దేవత" అంటే అబద్ద స్త్రీ వేలుపు.

  • ఈ అబద్ధ దేవుళ్ళు లేక దేవతలు నిజంగా ఉనికిలో లేరు. యెహోవా ఒక్కడే దేవుడు.
  • ప్రజలు కొన్ని సార్లు పూజ చేయడం కోసం వారి అబద్ద దేవుళ్ళకు సంకేతాలుగా విగ్రహాలను తయారు చేసుకుంటారు.
  • బైబిల్లో, దేవుని ప్రజలు తరచుగా దేవునికి లోబడకుండా తొలగి పోయి నుండి అబద్ద దేవుళ్ళను పూజించారు.
  • దయ్యాలు తరచుగా ప్రజలు అబద్ధ దేవుళ్ళను విగ్రహాలను నమ్మేలా మోసగిస్తూ వాటిని పూజించినందువల్ల వారికి శక్తి లభిస్తుందని నమ్మిస్తారు.
  • బైబిల్ కాలాల్లో ప్రజలు పూజించిన అనేక అబద్ధ దేవుళ్ళలో బయలు, దాగోను, మొలెకు ఉన్నారు.
  • అషేరా, అర్తెమి (డయానా) ప్రాచీన ప్రజలు ఆరాధించిన ఇద్దరు స్త్రీ దేవతలు. విగ్రహం అనేది ప్రజలు పూజించడం కోసం తయారు చేసుకున్న బొమ్మ. "విగ్రహారాధక" అంటే నిజ దేవుడు కాని ఏ ఇతర ప్రతిమను ప్రతిష్ట చేసుకోవడాన్ని సూచించేటందుకు అంటారు.
  • ప్రజలు వారు అబద్ధ దేవుళ్ళను పూజించడానికి విగ్రహాలు పెట్టుకుంటారు.
  • ఈ అబద్ధ దేవుళ్ళు నిజంగా లేరు. యెహోవా తప్ప వేరే దేవుడు లేడు.
  • కొన్ని సార్లు దయ్యాలు విగ్రహాల ద్వారా పని చేస్తారు, ఏమీ లేకపోయినా వాటికీ శక్తి ఉన్నదని భ్రమింపజేయడానికి.
  • విగ్రహాలను తరచుగా బంగారం, వెండి, కంచు, లేక ఖరీదైన కలప మొదలైన విలువైన ముడి సరుకుతో చేస్తారు.
  • "విగ్రహారాధక రాజ్యం" అంటే "విగ్రహారాధన చేసే ప్రజలు" లేక "భూసంబంధమైన వస్తువులను పూజించే మనుషులు ఉన్న రాజ్యాలు."
  • "విగ్రహారాధక ప్రతిమ" అనేది "చెక్కిన ప్రతిమ" లేక "విగ్రహం" అనే దానికి మరొకపదం.

అనువాదం సలహాలు:

  • మీ భాషలో లేక సమీప భాషల్లో ఇప్పటికే "దేవుడు” లేక “అబద్ధ దేవుడు" అనే దానికి సరైన పదం ఉండ వచ్చు.
  • "విగ్రహం" అనే మాటను అబద్ద దేవుళ్ళను సూచించడానికి ఉపయోగిస్తారు.
  • ఇంగ్లీషులో చిన్న అక్షరం "g" ని అబద్ద దేవుళ్ళకోసం ఉపయోగిస్తారు, పెద్ద అక్షరం "G" ని ఏకైక నిజ దేవుని కోసం ఉపయోగిస్తారు.

మరి కొన్ని ఇతర భాషల్లో కూడా అలా ఉంది.

  • మరొక పధ్ధతి పూర్తిగా వేరే పదం అబద్ద దేవుళ్ళ కోసం వినియోగించడం.
  • కొన్ని భాషల్లో మగ, లేక అడ అబద్ధ దేవుడి గురించి చెప్పడానికి పూర్తిగా వేరే పదం వాడతారు.

(చూడండి: దేవుడు, అషేరా, బయలు, మొలెకు, దయ్యం, ప్రతిమ, రాజ్యం, ఆరాధన)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 10:02 ఈ తెగగుళ్ళ, ద్వారా దేవుడు ఫరోకు తాను ఈజిప్టు దేవుళ్ళు అందరికన్నా ఫరో కన్నా శక్తివంతమైన వాడినని చూపించాడు.
  • 13:04 తరువాత దేవుడు వారితో ఒక నిబంధన చేసి ఇలా చెప్పాడు. "నేను యెహోవా, నీ దేవుణ్ణి, నిన్ను ఐగుప్టు బానిసత్వం నుండి విడిపించే వాణ్ణి. ఇతర దేవుళ్ళను పూజించ వద్దు."
  • 14:02 వారు (కనానీయులు) అనేక మంది అబద్ధ దేవుళ్ళను అనేక దుష్ట వస్తువులను పూజించారు.
  • 16:01 ఇశ్రాయేలీయులు నిజ దేవుడు యెహోవాకు బదులుగా కనానీయ దేవుళ్ళను పూజించ సాగారు.
  • 18:13 అయితే ఎక్కువ మంది యూదా రాజులు దుష్టత్వం, చెడు తనం మూలంగా విగ్రహాలను ఆరాధించారు.

కొందరు రాజులు అయితే వారి పిల్లలను సైతం అబద్ధ దేవుళ్ళకు బలి ఇచ్చారు.

పదం సమాచారం:

  • Strong's: H205, H367, H410, H426, H430, H457, H1322, H1544, H1892, H2553, H3649, H4656, H4906, H5236, H5566, H6089, H6090, H6091, H6456, H6459, H6673, H6736, H6754, H7723, H8163, H8251, H8267, H8441, H8655, G1493, G1494, G1495, G1496, G1497, G2299, G2712

దేవుని ఇల్లు, యెహోవా ఇల్లు

నిర్వచనం:

బైబిల్లో, "దేవుని ఇల్లు" "యెహోవా ఇల్లు అంటే దేవుణ్ణి ఆరాధించే చోటు.

  • ఈ పదాన్ని మరింత ఇదమిద్ధంగా ప్రత్యక్ష గుడారం, లేక ఆలయం కోసం ఉపయోగిస్తారు.
  • కొన్ని సార్లు "దేవుని ఇల్లు" అనే మాటను దేవుని ప్రజలకోసం వాడతారు.

అనువాదం సలహాలు:

  • ఆరాధన స్థలం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుణ్ణి ఆరాధించే చోటు.”
  • ఆలయం లేక ప్రత్యక్ష గుడారం గురించి వాడుతున్నప్పుడు ఇలా తర్జుమా చెయ్యవచ్చు. దేవుణ్ణి ఆరాధించే "ఆలయం (లేక ప్రత్యక్ష గుడారం). (లేక దేవుడు ఉన్న చోటు” లేక “దేవుడు తన ప్రజలను కలుసుకునే చోటు.")
  • "ఇల్లు” ఈ మాటను అనువాదం చెయ్యడంలో దేవుని నివాసం, అంటే ఆయన ఆత్మ అక్కడ తన ప్రజలను కలుసుకుంటాడు. వారు అక్కడ ఆయన్ను ఆరాధిస్తారు.

(చూడండి: ప్రజలు దేవుని, ప్రత్యక్ష గుడారం, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H426, H430, H1004, H1005, H3068, G2316, G3624

దేవుని కుమారుడు, కుమారుడు

వాస్తవాలు:

“దేవుని కుమారుడు” అనే ఈ మాట మనుజావతారుడై ఈ లోకములోనికి వచ్చిన వాక్యమైన యేసును సూచిస్తుంది, ఈయనను అనేకమార్లు “కుమారుడు” అని చెప్పబడినది.

  • దేవుని కుమారుడు తండ్రియైన దేవునివలెనే ఒకటే స్వభావమును కలిగియున్నాడు మరియు సంపూర్ణ దేవుడైయున్నాడు.
  • తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరైయున్నారు.
  • మనుష్య కుమారులవలె దేవుని కుమారుడు ఎల్లప్పుడూ అస్తిత్వములో ఉన్నాడు.
  • ప్రారంభములో సర్వలోకమును సృష్టించునప్పుడు తండ్రియైన దేవుడు మరియు పరిశుద్ధాత్మలతోపాటు దేవుని కుమారుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే యేసు దేవుని కుమారుడైయున్నాడు, ఆయన తన తండ్రి ప్రేమించి విధేయత చూపును, మరియు తండ్రి తనను ప్రేమించును.

తర్జుమా సలహాలు:

  • “దేవుని కుమారుడు” అనే మాట కొరకు, మనుష్య కుమారుని సూచించుటకు సాధారణముగా తర్జుమా చేయు భాషలో ఉపయోగించే పదముతో “కుమారుడు” అనే పదమును తర్జుమా చేయడం ఉత్తమము.
  • “తండ్రి” అని తర్జుమా చేయుటకు ఉపయోగించిన పదముతో “కుమారుడు” అని తర్జుమా చేయుటకు ఉపయోగించిన పదము సరిపోతుందో లేదోనని చూసుకొనుడి. ఈ పదములు అనువాద భాషలో తండ్రి కుమారుల నిజమైన సంబంధమును వ్యక్తపరచుటకు ఉపయోగించే సర్వసాధారణమైన పదాలైయుండవలెను.
  • ఆంగ్ల భాషలో "Son" (సన్) అనే పదమునకు కుమారుడు అని అర్థము, అయితే ఆ పదమునకు మొదటి అక్షరము పెద్దదిగా చేసి ఉపయోగించినప్పుడు ఆ పదము దేవునిని గూర్చి సంబోదిస్తుందని దాని అర్థము.
  • “దేవుని కుమారుడు” అనే మాటకు “కుమారుడు” అనే మాట ఉపయోగిస్తారు, విశేషముగా “తండ్రి” అని ఉపయోగించిన సందర్భములో దీనిని ఉపయోగిస్తారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: క్రీస్తు, పితరుడు, దేవుడు, తండ్రియైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసు, కుమారుడు, దేవుని కుమారులు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథములోనుండి ఉదాహరణలు:

  • 22:05 “పరిశుద్ధాత్ముడు నీయొద్దకు వచ్చును, మరియు దేవుని శక్తి నిన్ను ఆవరించును. తద్వారా పుట్టబోయే శిశువు పరిశుద్దుడు, “దేవుని కుమారుడైయుండును” అని అని దూత వివరించి చెప్పెను.
  • 24:09 “నీవు బాప్తిస్త్మము ఇచ్చు మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చును. ఆ వ్యక్తే దేవుని కుమారుడైయుండును “ అని దేవుడు యోహానుతో చెప్పియున్నాడు.
  • 31:08 శిష్యులు ఆశ్చర్యచకితులైరి. వారు యేసును ఆరాధించిరి, “నిజముగా, నీవు దేవుని కుమారుడవే “ అని ఆయనతో చెప్పిరి.
  • 37:05 “అవును, బోధకుడా! నీవు మెస్సయ్యావని, దేవుని కుమారుడవని నేను నమ్ముచున్నాను” అని మార్తా జవాబునిచ్చెను.
  • 42:10 అందుచేత మీరు సమస్త ప్రజల దగ్గరికి వెళ్లి వారిని శిష్యులనుగా చేయుడి, వారికి తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మమిచ్చుచు, నేను ఆజ్ఞాపించినవాటినన్నిటికి విధేయత చూపవలెనని వారికి బోధించుడి.
  • 46:06 అప్పటికప్పుడే, సౌలు దమస్కులోని యూదులకు “యేసే దేవుని కుమారుడు “ అని సువార్తను ప్రకటించుటకు ప్రారంభించెను!
  • 49:09 అయితే దేవుడు లోకములోని ప్రతియొక్కరిని ఎంతో ప్రేమించెను, ఆయన తన ఒక్కగానొక్క కుమారున్ని ఇచ్చెను, తద్వారా యేసునందు విశ్వసించువారు తమ పాపముల కొరకు శిక్షించబడకుండా, దేవునితో శాశ్వతకాలము జీవించెదరు.

పదం సమాచారం:

  • Strong's: H426, H430, H1121, H1247, G2316, G5207

దేవుని కుమారులు

నిర్వచనము:

“దేవుని కుమారులు” అనే ఈ మాట అనేక అర్థములుగల అలంకారిక మాటయైయున్నది.

  • క్రొత్త నిబంధనలో “దేవుని కుమారులు” అనే ఈ మాటను యేసునందున్న విశ్వాసులందరినీ సూచించుచున్నది మరియు అనేకమార్లు “దేవుని పిల్లలు” అనే తర్జుమా చేయబడింది, ఎందుకంటే ఈ మాట స్త్రీ పురుషులనిద్దరిని సూచిస్తుంది.
  • మనుష్యులైన తండ్రి మరియు కొడుకుల మధ్యనున్న అన్ని విధాలైన సంబంధమువలె దేవునితో కలిగియుండె సంబంధమును గూర్చి ఈ మాట తెలియజేయుచున్నది.
  • ఆదికాండము 6వ అధ్యాయములో కనిపించే “దేవుని కుమారులు” అనే మాటను కొంతమంది ప్రజలు పడిపోయిన దూతలు - దుష్టాత్మలు లేక దెయ్యములు అని వ్యాఖ్యానము చేయుచున్నారు. ఇంకొంతమంది వీరు షేతు సంతానమని లేక శక్తివంతమైన రాజకీయ పాలకులైయుండవచ్చని సూచిస్తున్నారు.
  • క్రొత్త నిబంధనలో “దేవుని కుమారులు” అనే ఈ మాటను యేసునందున్న విశ్వాసులందరినీ సూచించుచున్నది మరియు అనేకమార్లు “దేవుని పిల్లలు” అనే తర్జుమా చేయబడింది, ఎందుకంటే ఈ మాట స్త్రీ పురుషులనిద్దరిని సూచిస్తుంది.
  • మనుష్యులైన తండ్రి మరియు కొడుకుల మధ్యనున్న అన్ని విధాలైన సంబంధమువలె దేవునితో కలిగియుండె సంబంధమును గూర్చి ఈ మాట తెలియజేయుచున్నది.
  • “దేవుని కుమారుడు” అనే ఈ మాట విభిన్నమైన పదము: ఇది దేవుని ఒకే ఒక్క కుమారుడైన యేసును మాత్రమె సూచిస్తుంది.

తర్జుమా సలహాలు:

  • “దేవుని కుమారులు” అని యేసునందున్న విశ్వాసులకు సూచించినప్పుడు, దీనిని “దేవుని పిల్లలు” అని కూడా తర్జుమా చేయవచ్చు.
  • ఆదికాండము 6:2లోనున్న “దేవుని కుమారులు” అనే ఈ మాటను 4 విధానములలో తర్జుమా చేయవచ్చు, అవి ఏమనగా, “దూతలు”, “ఆత్మలు”, “ప్రాకృతాతీమైన జీవులు”, లేక “దెయ్యములు”.
  • “కుమారుడు” అనే మాటను గూర్చిన వివరణను చూడండి.

(ఈ పదములను కూడా చూడండి: దూత, దెయ్యము, కుమారుడు, దేవుని కుమారుడు, పాలకుడు, ఆత్మ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H430, H1121, G2316, G5043, G5207

దేవుని చిత్తము

నిర్వచనము:

“దేవుని చిత్తము” అనునది దేవుని ఇష్టాలను మరియు ప్రణాళికలను సూచించును.

  • దేవుని చిత్తము ప్రత్యేకముగా ప్రజలతో దేవుని సంభాషణలను మరియు ఆయనకు ప్రజలు ఎలా స్పందించాలోనన్న విషయాలకు సంబంధించియుండును.
  • ఇది ఆయన సృష్టియంతటికొరకు కలిగియున్న ఆయన ప్రణాళికలను లేక ఇష్టాలను కూడా సూచిస్తుంది.
  • “చిత్తము” అనే పదమునకు “ఆశ” లేక “ఖచ్చితమైన ఇష్టము” అని కూడా అర్థము కలదు.

తర్జుమా సలహాలు:

  • “దేవుని చిత్తము” అనే మాటను “దేవుడు ఆశించునది” లేక “దేవుడు ప్రణాళిక కలిగియున్నది” లేక “దేవుని ఉద్దేశము” లేక “దేవునిని మెప్పించే విషయాలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6310, H6634, H7522, G1012, G1013, G2307, G2308, G2309, G2596

దేవుని పోలిక, స్వరూపం

నిర్వచనం:

"స్వరూపం" అంటే వేరే రూపంలో దాని గుణ లక్షణాలు, సారాంశం ప్రతిబింబిస్తూ ఉండే వస్తువు. "దేవుని పోలిక" అనే సందర్భాన్ని బట్టి రకరకాలుగా ఉపయోగిస్తారు.

  • సృష్టి ఆరంభంలో దేవుడు మానవులను తన స్వరూపంలో అంటే "తన పోలికలో" చేశాడు. అంటే మనుషుల్లో దేవుని పోలికను ప్రతిబింబిస్తూ ఉండే కొన్ని గుణ లక్షణాలు, భావోద్వేగాలు అనుభవించే సామర్థ్యం, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం, నిత్యం జీవించే ఆత్మ మొదలైనవి.
  • బైబిల్ బోధిస్తున్నట్టుగా యేసు, దేవుని కుమారుడుగా " దేవుని పోలికలో" అంటే దేవుడే అయి ఉన్నాడు. మానవుల వలె కాక, యేసు సృష్టించబడిన వాడు కాదు. నిత్యత్వం నుండి దేవుడు కుమారుడు అన్ని దివ్య గుణ లక్షణాలు గలవాడు. ఎందుకంటే ఆయనలో తండ్రి అయిన దేవుని స్వరూపం ఉంది.

అనువాదం సలహాలు:

  • యేసును గురించి చెప్పేటప్పుడు "దేవుని పోలిక" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఉన్నది ఉన్నట్టుగా పోలిక దేవుని” లేక “దేవుని సారాంశం” లేక “దేవుని వంటి."
  • మానవుల గురించి అయితే, "దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "దేవుడు వారిని తనలా ఉండాలని సృష్టించాడు” లేక “దేవుడు వారిని తన స్వంత గుణ లక్షణాలతో సృష్టించాడు."

(చూడండి: స్వరూపం, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4541, H1544, H2553, H6456, H6459, H6754, H6816, H8403, G504, G179

దేవుని ప్రజలు, నా ప్రజలు

నిర్వచనము:

“దేవుని ప్రజలు” అనే మాట దేవునితో ప్రత్యెకమైన సహవాసము చేయుటకు లోకములోనుండి ఆయన పిలుచుకొనిన ప్రజలను సూచిస్తుంది.

  • “నా జనులు” అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఎన్నుకొనిన ప్రజలను గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు మరియు ఆయనతో సంబంధమును కలిగియున్నవారిని గూర్చి మాట్లాడుచున్నాడు.
  • దేవుని ప్రజలు ఆయన ద్వారా ఎన్నుకొనబడినవారు మరియు ఆయనను మెప్పించే విధానములో జీవించుటకు లోకములోనుండి ప్రత్యేకించబడినవారు. ఆయన వారిని తన పిల్లలనియూ పిలుస్తాడు.
  • పాతనిబంధనలో “దేవుని ప్రజలు” అనే మాట దేవుని ద్వారా ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు జనాంగమును సూచిస్తుంది మరియు ఆయనకు లోబడుటకు, ఆయనను సేవించుటకు లోక దేశములలోనుండి ప్రత్యేకించబడిన జనములను సూచిస్తుంది.
  • క్రొత్త నిబంధనలో “దేవుని ప్రజలు” అనే మాట విశేషముగా యేసునందు విశ్వాసముంచినవారిని మరియు సంఘము అని పిలువబడినవారిని సూచిస్తుంది. ఇందులో యూదులు మరియు అన్యులు కూడా ఉంటారు.

తర్జుమా సలహాలు:

  • “దేవుని ప్రజలు” అనే మాటను “దేవుని ప్రజలు” లేక “దేవునిని ఆరాధించే ప్రజలు” లేక “ దేవునిని సేవించే ప్రజలు” లేక “దేవునికి సంబంధించిన ప్రజలు” అని తర్జుమా చేయవచ్చును.
  • “నా ప్రజలు” అని దేవుడు చెప్పినప్పుడు, దీనిని తర్జుమా చేయు వేరొక విధానములో “నేను ఎన్నుకొనిన ప్రజలు” లేక “నన్ను ఆరాధించు ప్రజలు” లేక “నాకు సంబంధించిన ప్రజలు” అనే మాటలు కూడా వాడబడుతాయి.
  • అదేవిధముగా, “మీ జనులు” అనే మాటను “మీకు సంబంధించిన ప్రజలు” లేక “మీకు సంబంధించియుండుటకు మీరు ఎన్నుకొనిన జనులు” అని తర్జుమా చేయవచ్చును.
  • “ఆయన ప్రజలు” అను మాటను కూడా “ఆయనకు సంబంధించిన ప్రజలు” లేక “ఆయనకు సంబంధించియుండుటకు దేవుడు ఎన్నుకొనిన ప్రజలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి: ఇశ్రాయేలు, జనాంగము)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H430, H5971, G2316, G2992

దేవుని రాజ్యము, పరలోక రాజ్యము

నిర్వచనం:

“దేవుని రాజ్యము”, “పరలోక రాజ్యము” అనే పదాలు రెండూ తన ప్రజల మీదా, సమస్త సృష్టిమీద దేవుని ప్రభుత్వాన్నీ, అధికారాన్నీ సూచిస్తున్నాయి.

  • యూదులు తరచుగా దేవుణ్ణి ప్రస్తావించడానికి ఆ పదాన్ని నేరుగా పలకడం తప్పించడానికి “పరలోకం” అనే పదాన్ని వినియోగించేవారు, (చూడండి:అన్యాపదేశం)
  • మత్తయి రాసిన క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని రాజ్యాన్ని “పరలోక రాజ్యం” అని మత్తయి ప్రస్తావించాడు, ఎందుకంటే మత్తయి బహుశా ప్రాధమికంగా యూదులకు తన గ్రంథాన్ని రాశాడు.
  • దేవుని రాజ్యం అనే పదం దేవుడు తన ప్రజలను ఆత్మీయంగా పరిపాలిస్తున్నాడనీ, భౌతిక ప్రపంచంమీద ప్రభుత్వం చేస్తున్నాడనీ సూచిస్తుంది.
  • మెస్సీయ నీతితో ప్రభుత్వం చేయడానికి దేవుడు ఆయనను పంపుతాడని పాత నిబంధన ప్రవక్తలు చెప్పారు. దేవుని కుమారుడు, యేసు దేవుని రాజ్యాన్ని శాశ్వితం పరిపాలించు మెస్సీయ.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “దేవుని రాజ్యం” అనే పదాన్ని “దేవుని పాలన (రాజు వలే)” లేక “దేవుడు రాజువలే పాలిస్తున్నప్పుడు” లేక “సమస్తము మీద దేవుని పాలన” అని అనువదించవచ్చు.
  • ”పరలోక రాజ్యము” అనే పదాన్ని “పరలోకం నుండి రాజులా దేవుని పాలన” లేక “పరలోకంలో ఉన్న దేవుడు ఏలుబడి చేస్తున్నాడు” లేక “పరలోకపు ఏలుబడి” లేక “సమస్తము మీద పరలోకము పాలన చేస్తుంది” అని అనువదించవచ్చు. దీనిని సరళంగానూ, స్పష్టంగానూ అనువదించడం సాధ్యపడక పోయినట్లయితే “దేవుని రాజ్యం” అనే పదాన్ని అనువదించవచ్చు.
  • కొందరు అనువాదకులు దేవుణ్ణి చూపించడానికి “పరలోకం” అనే పదాన్ని ఇంగ్లీషులో పెద్ద అక్షరం వాడడం చూడవచ్చు, ఇతరులు పాఠం వ్యాఖ్యానంలో “పరలోక రాజ్యం (అంటే, ‘దేవుని రాజ్యం’)” అని చేర్చవచ్చు.
  • ఈ భావంలో “పరలోకం” అర్థాన్ని వివరించడానికి అచ్చు అయిన బైబిలు గ్రంథంలోని పేజీ అడుగుభాగాన్న రాసిన వివరాన్ని కూడా వినియోగించవచ్చు.

(చూడండి: దేవుడు, పరలోకము, రాజు, రాజ్యము, యూదులకు రాజు, ఏలుబడి)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:

  • 24:02 ”మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యము సమీపించియున్నది!” అని చెపుతూ అతడు (బాప్తిస్మమిచ్చి యోహాను) వారికి బోధించాడు.
  • 28:02 అంతట యేసు తన శిష్యులతో, “ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము!” అని చెప్పాడు. అవును, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూదిబెజ్జములో ప్రవేశించుట సులభం.
  • 29:02 యేసు ఇలా చెప్పాడు, “దేవుని రాజ్యము తన దాసుల వద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది.”
  • 34:01 యేసు దేవుని రాజ్యము గురించి అనేక వృత్తాంతములను చెప్పాడు. ఉదాహరణకు, “దేవుని రాజ్యము ఒకడు తన పొలములో నాటిన ఆవ గింజను పోలియున్నది” అని ఆయన చెప్పాడు.
  • 34:03 యేసు మరొక వృత్తాంతమును చెప్పాడు, “దేవుని రాజ్యము ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.”
  • 34:04 “దేవుని రాజ్యము ఒకడు తన పొలములు దాచియుంచిన ధనమును పోలియున్నది. మరొకడు ధనమును కనుగొని, దానిని మరల దాచిపెట్టాడు.”
  • 34:05దేవుని రాజ్యము మంచి ముత్యములను కనుగొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.”
  • 42:09 తాను సజీవుడు అని అనేక విధములుగా తన శిశ్యులకు రుజువు పరచాడు, దేవుని రాజ్యము గురించి వారికి నేర్పించాడు.
  • 49:05 లోకములో ఉన్న దేనికంటెను దేవుని రాజ్యము అత్యంత విలువైనది అని చెప్పాడు.
  • [50:02] భూమి మీద యేసు జీవిస్తున్నప్పుడు, “అంతము వచ్చు వరకు ప్రపంచంలో ప్రతీ స్థలములో నా శిష్యులు దేవుని రాజ్యము గురించి బోధిస్తారు.” అని యేసు చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: G932, G2316, G3772

దేవుని వాక్యము, యెహోవా వాక్యము, ప్రభువు వాక్యము, సత్య వాక్యము, లేఖనము,

లేఖనములు

నిర్వచనం:

బైబిలులో “దేవుని వాక్యము” పదం దేవుడు తన ప్రజలతో మాట్లాడిన ప్రతీ మాటను సూచిస్తుంది. ఇందులో చెప్పబడిన సందేశాలూ, వ్రాయబడిన సందేశాలూ కూడా ఉంటాయి. యేసు “దేవుని వాక్యం” అని పిలువబడ్డాడు.

  • “లేఖనములు” అనే మాటకు “రచనలు” అని అర్థం. ఈ పదం క్రొత్త నిబంధనలో మాత్రమే ఉపయోగించబడింది, ఈ పదం పాత నిబంధనలోనున్న హెబ్రీ లేఖనములను సూచిస్తుంది. ఈ రచనలన్నీ దేవుడు తన ప్రజలకు చెప్పి వ్రాయించిన దేవుని సందేశాలు. తద్వారా భవిష్యత్తులో అనేక సంవత్సరాలు ప్రజలు ఇప్పటికీ చదువుతున్నారు.
  • దీనికి సంబంధించిన పదాలు “యెహోవా వాక్కు” మరియు “ప్రభువు వాక్కు” అనే పదాలు దేవుడు ఒక ప్రవక్తకుగాని లేక పరిశుద్ధ గ్రంథములోని ఒక వ్యక్తికి ఇచ్చిన ప్రత్యేకమైన సందేశంగా ఉంది.
  • కొన్నిమార్లు ఈ పదం "వాక్యం" లేదా “నా వాక్యం" లేదా “నీ వాక్కు” (దేవుని వాక్యమును గూర్చి మాట్లాడునప్పుడు) అని చాలా సాధారణముగా కనబడుతుంది.
  • క్రొత్త నిబంధనలో యేసు “వాక్యం” మరియు “దేవుని వాక్యం” అని పిలువబడ్డాడు. ఈ బిరుదులకు యేసు దేవుని గురించి తెలియజేసియున్నాడు అని అర్థం. ఎందుకంటే ఈయనే దేవుడైయున్నాడు.

“సత్య వాక్యం” పదం “దేవుని వాక్యం” అని చూపించే మరొక విధానం, అది ఆయన సందేశం లేక బోధనయై ఉంది. ఇది కేవలము ఒక వాక్కును మాత్రమే సూచించడం లేదు.

  • దేవుని సత్య వాక్యంలో దేవుడు తననుగూర్చి, తన సృష్టినిగూర్చి, మరియు యేసు ద్వారా అనుగ్రహించిన రక్షణ ప్రణాళికలను గూర్చి ప్రజలకు బోధించిన ప్రతీది ఉంటుంది.
  • ఈ పదం దేవుడు మనకు చెప్పిన ప్రతి మాట సత్యము, నమ్మదగినది, మరియు నిజమైనదనే వాస్తవాన్ని నొక్కి చెబుతుంది.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి ఈ పదం "యెహోవా సందేశము” లేదా “దేవుని సందేశము” లేదా “దేవునినుండి వచ్చిన బోధనలు” అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

  • కొన్నిభాషలలో ఈ పదం “దేవుని వాక్కులు” లేదా “యెహోవా వాక్కులు” అని బహువచనంలో సహజంగా ఉంటుంది.

  • “యెహోవా వాక్కు వచ్చింది” అనే వాక్యం ఒక దానిని గురించి తన ప్రవక్తలకూ లేదా తన ప్రజలకూ పరిచయం చెయ్యడానికీ తరచుగా ఉపయోగించబడింది. ఈ పదం “యెహోవా ఈ సందేశమును పలికాడు" లేదా “యెహోవా ఈ వాక్కులను సెలవిచ్చెను” అని అనువదించబడవచ్చు.

  • “లేఖనము” లేక “లేఖనములు” పదం “రచనలు” లేదా “దేవునినుండి వచ్చిన వ్రాతపూర్వకమైన సందేశము” అని అనువదించబడవచ్చు. "వాక్కు" పదం అనువాదానికి భిన్నంగా ఈ పదం అనువదించబడాలి.

  • “వాక్యం" పదం దేవుని వాక్యాన్ని మాత్రమే సూచించడానికి ఉపయోగించబడినప్పుడు "సందేశం" లేదా "దేవుని వాక్యం" లేదా "బోధనలు" అను అనువదించబడవచ్చు. పైన సూచించబడిన విధంగా ప్రత్యామ్నాయ అనువాదం చెయ్యడానికి పరిగణించవచ్చు.

  • బైబిలు యేసును "వాక్యం" అని సూచినప్పుడు ఈ పదం "సందేశం" లేదా "సత్యం" అని అనువదించబడవచ్చు.

  • “సత్య వాక్యం” పదం "దేవుని సత్య సందేశం” లేదా “సత్యం అయిన దేవుని వాక్యం” అని అనువదించబడవచ్చు.

  • ఈ పదం అనువాదంలో సత్యంగా ఉండడం అనే అర్థం జత చెయ్యడం ముఖ్యం.

(చూడండి: ప్రవక్త, సత్యము, వాక్యము, యెహోవా)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 25:07 దేవుని వాక్యము లో ఆయన తన ప్రజలతో “మీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమె సేవించాలి" అని ఆజ్ఞాపించాడు.
  • 33:06 “విత్తనము దేవుని వాక్యము నై యున్నది“ అని యేసు వివరించెను.
  • 42:03 మెస్సయ్యాను గూర్చి దేవుని వాక్యము ఏమి తెలియజేయుచున్నదో యేసు వారికి వివరించాడు.
  • 42:07దేవుని వాక్యములో నన్ను గూర్చి వ్రాసిన ప్రతీది నెరవేర్చబడవలసి ఉన్నాడని నేను మీతో చెప్పుచున్నాను” అని యేసు చెప్పాడు. ఆ తరువాత వారు దేవుని వాక్యమును అర్థము చేసికొనుటకు వారి మనసులను తెరచాడు.
  • 45:10 ఫిలిప్పు కూడా యేసు సువార్తను తనకు చెప్పుటకు ఇతర లేఖనములను ఉపయోగించాడు.
  • 48:12 అయితే యేసు ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్తయైయున్నాడు. ఆయన దేవుని వాక్యమై యున్నాడు.
  • 49:18 ఇతర క్రైస్తవులతో చేరి ఆయనను ఆరాధించాలని, ఆయన వాక్యమును అధ్యయనము చేయాలని, ప్రార్థించాలని మరియు ఆయన నీ కొరకు చేసిన ఆనేక కార్యములను గూర్చి ఇతరులకు చెప్పాలని దేవుడు వారికి చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H561, H565, H1697, H3068, G3056, G4487

దైవ దూషణ, దూషించు, దైవ దూషణ చేసిన, దైవ దూషణకరమైన, దైవ దూషణలు

నిర్వచనం:

బైబిల్లో ఈ పదం "దైవ దూషణ" ను దేవుని పట్ల తీవ్రమైన అమర్యాదపూర్వకంగా మాట్లాడడాన్ని సూచించడానికి వాడతారు. " దూషించు" అంటే ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడి ఆ వ్యక్తి గురించి ఇతరులకు చెడు అభిప్రాయం కలిగేలా చెయ్యడం.

  • తరచుగా, దూషణ చేయడం అంటే దుర్భాషలాడడం, లేక ఒక వ్యక్తి గురించి అసత్యాలు పలికి అవమానించడం, లేక అతని ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించడం.
  • మనిషి తాను దేవుడినని చెప్పుకోవడం, లేక నిజ దేవుడు కాక వేరే దేవుళ్ళు ఉన్నారని చెప్పడం దైవ దూషణ కిందికే వస్తుంది.
  • కొన్ని అంగ్ల అనువాదాలు ఈ పదాన్ని మనుషుల విషయంలో వాడినప్పుడు "దుర్భాషలు" అని తర్జుమా చేసాయి.

అనువాదం సలహాలు:

  • "దైవ దూషణ చేయి" అనే పదాన్ని "దేవునికి వ్యతిరేకంగా చెడ్డ మాటలు పలుకు” లేక “దేవునికి అప్రతిష్ట కలిగించు” లేక “దుర్భాషలాడు" అని తర్జుమా చేయ వచ్చు.
  • దీన్నిఅనువదించే మార్గాలు. "దైవ దూషణ" అనే పదంలో "ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం” లేక “దుర్భాషలాడడం” లేక “చెడు వార్తలు ప్రచారం చెయ్యడం."

(చూడండి: అప్రతిష్ట , దుర్భాషలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1288, H1442, H2778, H5006, H5007, H5344, G987, G988, G989

దైవభక్తిగల, దైవభక్తి, దైవభక్తిలేని, దేవుడులేని, దైవభక్తిలేని, దేవుడులేని స్థితి

నిర్వచనం:

"దైవభక్తిగల" పదం దేవునికి ఘనత కలిగేలా ప్రవర్తిస్తూ, దేవుడెలా ఉంటాడో చూపే వ్యక్తిని వివరించడానికి ఉపయోగించబడుతుంది. "దైవభక్తి" అనేది దేవుని చిత్తం ప్రకారం చేయడం ద్వారా ఆయన్ని ఘనపరిచే గుణలక్షణం.

  • దైవభక్తి స్వభావం కలిగిన వ్యక్తి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం లాంటి ఆత్మ ఫలాన్ని కలిగియుంటాడు.
  • దైవభక్తిగుణం ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగియున్నాడనీ, ఆయనకు లోబడుతున్నాడనీ చూపిస్తుంది.

"దైవభక్తిలేని," "దేవుడు లేని" పదాలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రజలను వివరిస్తున్నాయి. దుష్టమార్గంలో జీవిస్తూ, దేవుని గురించిన ఆలోచనలేకుండా ఉండడం "దైవభక్తిలేని" లేదా "దేవుడులేని స్థితి" అని పిలువబడుతుంది.

  • ఈ మాటలకున్న అర్థాలన్నీ ఒకేలా ఉన్నాయి. అయితే "దేవుడులేని" "దైవభక్తిలేని స్థితి" పదాలు దేవుణ్ణి కనీసం గుర్తించకుండా లేదా వారిని పాలించడంలో ఆయన హక్కును గుర్తించని ప్రజల లేదా దేశాలు ఉన్న తీవ్రమైన స్థితిని వివరిస్తున్నాయి.
  • తననూ, తన మార్గాలనూ తిరస్కరించే భక్తి హీన ప్రజలందరిమీద దేవుడు తీర్పునూ, ఆగ్రహాన్నీ ప్రకటిస్తున్నాడు.

అనువాదం సూచనలు:

  • "దైవభక్తిగల" పదం "దైవభక్తిగల ప్రజలు" లేదా "దేవునికి లోబడే ప్రజలు" అని అనువదించబడవచ్చు. (చూడండి: nominaladj)

  • "దైవ భక్తిగల" విశేషణం "దేవునికి విధేయుడు” లేదా "నీతిమంతుడు" లేదా "దేవునికి ఇష్టమైన" అని అనువదించబడవచ్చు.

  • "భక్తిగల విధానంలో" పదబంధం "దేవునికి లోబడే విధానం” లేదా “దేవుణ్ణి సంతోషపరచే క్రియలతోనూ, మాటలతోనూ" అని అనువదించబడవచ్చు.

  • "దైవభక్తి" పదం "దేవుణ్ణి సంతోషపరచే విధానంలో జీవించడం" లేదా "దేవునికి లోబడం" లేదా "నీతి మార్గంలో జీవించడం" అని అనువదించబడవచ్చు.

  • సందర్భాన్ని బట్టి, "దైవభక్తిలేని" పదం "దేవునికి ఇష్టం లేని విధంగా” లేదా “అనైతికంగా” లేదా “దేవునికి లోబడకుండా ఉండడం" అని అనువదించబడవచ్చు.

  • "దేవుడు లేని," "దేవుడు లేని స్థితి" పదాలు "దేవుడు లేకుండా" లేదా "దేవుడి గురించిన ఆలోచన లేకుండా" లేదా దేవుణ్ణి గుర్తించని మార్గంలో జీవించడం" అనే అక్షరార్థాన్ని కలిగియున్నాయి.

  • "దైవభక్తిలేని" లేదా "దేవుడు లేని స్థితి" పదాలు "దుర్మార్గత” లేదా "దుష్టత్వం” లేదా " “దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు" అని ఇతరవిధాలుగా అనువదించవచ్చు.

(చూడండి దుష్టత్వం, ఘనత, లోబడు, నీతిమంతుడు, నీతి)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H430, H1100, H2623, H5760, H7563, G516, G763, G764, G765, G2124, G2150, G2152, G2153, G2316, G2317

దోషిగా తీర్చు, దోషిగా తీర్పు పొందిన, దోషిగా తీర్చిన, దోషిగా తీర్పు

నిర్వచనం:

"దోషిగా తీర్చు” “దోషిగా తీర్పు" అనే పదాలు ఎవరినైనా ఏదైనా తప్పు చేసినట్టు నిర్ధారించడం.

  • తరచుగా "దోషిగా తీర్చు" అనే ఈ పదం ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు శిక్షను సూచిస్తుంది.
  • కొన్ని సార్లు "దోషిగా తీర్చు" అంటే తప్పు నేరం మోపు, ఎవరినైనా కఠినంగా దండించడం.
  • ఈ పదం "దోషిగా తీర్చు" నేరారోపణ చెయ్యడం, ఎవరినైనా దోషిగా నిర్ధారించడం అనే అర్థం ఇస్తుంది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కఠినంగా దండించడం” లేక “తప్పుగా నేరం మోపడం."
  • "అతణ్ణి దోషిగా తీర్చు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "ఒకడు అపరాధి అని చెప్పడం” లేక “వాణ్ణి వాడి పాపం కోసం శిక్షించాలి"
  • ఈ పదం "దోషిగా తీర్చు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "అన్యాయపు తీర్పు” లేక “అపరాధిగా ఎంచు” లేక “అపరాధ శిక్ష."

(చూడండి: న్యాయాధిపతి, శిక్షించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6064, H7034, H7561, H8199, G176, G843, G2607, G2613, G2631, G2632, G2633, G2917, G2919, G2920, G5272, G6048

ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం

నిర్వచనం

ఈ పదాలన్నీ ఇశ్రాయేలీయులు లోబడడానికి దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలూ, హెచ్చరికలను సూచిస్తున్నాయి. “ధర్మం,” “దేవుని ధర్మం” అనే పదాలు సాధారణంగా మానవులు లోబడాలని దేవుడు కోరుకొన్న ప్రతీదానిని సూచించడానికి కూడా వినియోగించవచ్చు.

  • సందర్భాన్ని బట్టి “ధర్మం” ఈ క్రిందివాటిని సూచిస్తుంది:
  • ఇశ్రాయేలీయుల కోసం దేవుడు పది ఆజ్ఞలను రాతి పలకల మీద రాసాడు.
  • దేవుడు ధర్మశాస్త్రమంతటిని మోషేకు ఇచ్చాడు.
  • పాత నిబంధనలోని మొదటి ఐదు గ్రంథాలు.
  • పాత నిబంధన అంతా (కొత్త నిబంధనలో “లేఖనాలు” అని పిలిచారు).
  • దేవుని హెచ్చరికలూ, ఆయన చిత్తము.
  • ”ధర్మశాస్త్రము, ప్రవక్తలు” అనే పదం కొత్తనిబంధనలో హెబ్రీ లేఖనాలను సూచించడానికి (లేక “పాతనిబంధన) వినియోగించబడింది.

అనువాడం సూచనలు:

  • ఈ పదాలను బహువచనంలో “ధర్మములు” అని అనువదించవచ్చు, ఎందుకంటే అవి అనేక హెచ్చరికలను సూచిస్తున్నాయి.
  • ”మోషే ధర్మశాస్త్రము” అనే పదాన్ని “ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం” అని అనువదించవచ్చు.
  • సందర్భాన్ని బట్టి “మోషే ధర్మశాస్త్రం” అనే పదాన్ని “దేవుడు మోషెకు చెప్పిన ధర్మం” లేక “ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి దేవుడు మోషేకు చెప్పిన ధర్మాలు” అని అనువదించవచ్చు.
  • ”ధర్మశాస్త్రం” లేక ”దేవుని ధర్మం” లేక “దేవుని ధర్మాలు” అనే పదాలను అనువదించడంలో “దేవుని నుండి ఆజ్ఞలు” లేక “దేవుని హెచ్చారికలన్నీ” అనే పదాలు కలిసి ఉండవచ్చు. “యెహోవా ధర్మశాస్త్రం” అనె పదాన్ని “యెహోవా ధర్మములు” లేక “లోబడాలని యెహోవా చెప్పిన ధర్మాలు” లేక “యెహోవానుండి ధర్మాలు” లేక “యెహోవా ఆజ్ఞాపించిన సంగతులు” అని అనువదించవచ్చు.

(చూడండి: హెచ్చరించడం, మోషే, పదిఆజ్ఞలు, న్యాయబద్ధం, యెహోవా)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:

  • 13:07 దేవుడు అనేక ఇతర ధర్మాలను, నియమాలను కూడా అనుసరించడానికి కూడా ఇచ్చాడు. ఈ ధర్మాలకు ప్రజలు లోబడినట్లయితే, వారిని ఆశీర్వదిస్తానని, వారిని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేసాడు. వాటికి వారు అవిధేయత చూపినట్లయితే దేవుడు వారిని శిక్షిస్తాడు.
  • 13:09 ఎవరైనా దేవుని ధర్మాన్ని అతిక్రమించినప్పుడు దేవునికి ఒక బలిగా అందరూ కలుసుకొనే ప్రత్యక్ష గుడారము ఎదుటికి ఒక జంతువును తీసుకొని రావచ్చు.
  • 15:12 సీనాయి పర్వతం వడ దేవుడు ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధనకు లోబడాలనే షరతును యెహోషువా ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ధర్మాలకు నమ్మకంగా నిలిచి వాటికి లోబదతామని ప్రజలు వాగ్దానం చేసారు.
  • 16: 01 యెహోషువా చనిపోయిన తరువాత, ఇస్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపించారు. మిగిలిన కనానీయులను బయటికి తరిమివేయలేదు లేక దేవుని ఆజ్ఞలకు లోబడలేదు.
  • 21:05 నూతన నిబంధనలో, దేవుడు తన ధర్మాన్ని ప్రజల హృదయాలలో రాస్తాడు, మనుష్యులు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొంటారు, వారు ఆయన ప్రజలై ఉంటారు, దేవుడు వారి పాపాల్ని క్షమిస్తాడు.
  • 27:01 ప్రభువైన యేసు ఇలా జవాబిచ్చాడు, “దేవుని ధర్మశాస్త్రం లో ఏమి రాసి ఉంది?
  • 28:01 యేసు అతనితో, “నన్ను ‘మంచివాడవని’ ఎందుకు పిలుస్తున్నావు? అని అడిగాడు. దేవుడు తప్ప మంచి వాడొక్కడూ లేదు. అయితే నీకు నిత్యజీవం కావాలంటే దేవుని ధర్మశాస్త్రాని కి లోబడాలి.”

పదం సమాచారం:

  • Strong's: H430, H1881, H1882, H2706, H2710, H3068, H4687, H4872, H4941, H8451, G2316, G3551, G3565

నపుంసకుడు, నపుంసకులు

నిర్వచనం:

సాధారణంగా "నపుంసకుడు" అనే పదం వృషణాలు చితకగొట్టిన మనిషిని సూచిస్తున్నది. తరువాత ఈ పదం అన్ని రకాల ప్రభుత్వ అధికారులకు వాడడం మొదలయింది, వారికి ఎలాటి వైకల్యం లేకపోయినా.

  • యేసు చెప్పాడు, కొందరు నపుంసకులు గా పుడతారు. ఎందుకంటే వారి లైంగిక అవయవాలు మామూలుగా ఉండవు. లేక లైంగికంగా మామూలుగా పని చెయ్యవు. కొందరు బ్రహ్మచారులుగా ఉండిపోవడానికి నిర్ణయించుకుని నపుంసకుల వలే అవుతారు.
  • ప్రాచీన కాలంలో, నపుంసకులు తరచుగా రాజు సేవకులుగా, ముఖ్యంగా రాణివాసంలో ఉద్యోగులుగా ఉండేవారు.
  • కొందరు నపుంసకులు ప్రాముఖ్యమైన ప్రభుత్వ అధికారులుగా ఉండేవారు. అపోస్తలుడు ఫిలిప్పు ఎడారిలో కలుసుకున్న ఇతియోపీయ నపుంసకుడు ఇలాటివాడు.

(చూడండి: ఫిలిప్పు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5631, G2134, G2135

నమ్మకముంచు, నమ్మకముంచడం, నమ్మదగిన, విశ్వసనీయత

నిర్వచనం:

ఏదైనా ఒక దాని మీదా లేదా ఒకరి మీదా "నమ్మకం" ఉంచడం అంటే ఆ వ్యక్తి గానీ, ఆ వస్తువుగానీ వాస్తవం అనీ, అధారపడ దగినదనీ విశ్వసించడం. ఆ నమ్మకం కూడా "విశ్వాసం" అని పిలువబడవచ్చు. "నమ్మదగిన వ్యక్తి" చేసేదీ, చెప్పేదీ సరియైనదనీ, వాస్తవం అనీ మీరు నమ్మవచ్చు. కాబట్టి ఒకరికి విశ్వనీయ లక్షణం కలిగియుండాలి.

  • నమ్మకం అనేది విశ్వాసానికి సమీపంగా ఉంటుంది. మనం ఒకరిని నమ్మినప్పుడు వారు వాగ్దానం చేసినదానిని వారు చేస్తారని మనకు విశ్వాసం ఉంది.
  • ఒకరిమీద నమ్మకం కలిగియుండడం అంటే కూడా ఆ వ్యక్తి మీద ఆదారపడడం అని అర్థం.
  • "యేసులో నమ్మకముంచడం" అంటే ఆయన దేవుడు అని విశ్వసించడం, నీ పాపాలకు వెల చెల్లించడం కోసం ఆయన సిలువ మీద చనిపోయాడని విశ్వసించడం, మనలను రక్షించడం కోసం ఆయన మీద ఆధారపడడం అని అర్థం.
  • "నమ్మదగిన మాట" అంటే చెప్పబడినది సత్యం అనీ ఆదారపడదగినది అనీ సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • "నమ్మకముంచు" పదంలో "విశ్వసించుడం” లేదా “విశ్వాసం కలిగి యుండడం” లేదా “ధైర్యం కలిగియుండడం" లేదా “ఆధారపడి యుండడం" పదాలు జతచేయబడవచ్చు.
  • "నీ నమ్మకాన్ని ఆయన మీద ఉంచు" వాక్యానికి "నమ్మకం ఉంచు" అనే అర్థమే ఉంది.
  • "నమ్మదగినది" పదం "అధారపడ దగిన” లేదా లేక “ఆనుకొనదగిన" లేదా "ఎల్లప్పుడూ నమ్మకముంచవచ్చు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: విశ్వసించు, ధైర్యం, విశ్వాసం, విశ్వసనీయ, సత్యం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 12:12 ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు చనిపోవడం చూసినప్పుడు వారు దేవుని మీద నమ్మకం ఉంచారు, మోషే దేవుని ప్రవక్త అని విశ్వసించారు.
  • 14:15 యెహోషువా మంచి నాయకుడు. ఎందుకంటే అతడు దేవునిమీద నమ్మకం ఉంచాడు, ఆయనకు లోబడ్డాడు.
  • 17:02 దావీదు వినయపూర్వకమైన వాడు, నీతిమంతుడు, దేవుణ్ణి నమ్మాడు, ఆయనకు విధేయత చూపించాడు.
  • 34:06 తమ మంచి క్రియల యందు నమ్మకం ఉంచి ఇతరులను తృణీకరించిన ప్రజల గురించి యేసు ఒక ఉపమానం చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H539, H982, H1556, H2620, H2622, H3176, H4009, H4268, H7365, G1679, G3872, G3982, G4006, G4100, G4276

నరకం, అగ్ని సరస్సు

నిర్వచనం:

నరకం అంటే అంతం లేని యాతన, హింసలు ఉండే అంతిమ స్థలం. దేవుడు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి యేసు బలి అర్పణమూలంగా తను చూపిన మార్గాన్ని తిరస్కరించిన ప్రతి ఒక్కరినీ పడవేసే స్థలం. దీన్ని "అగ్ని సరస్సు" అని కూడా అన్నారు.

  • నరకం అంటే అగ్ని మంటలు తీవ్రమైన హింసలు ఉండే చోటు.
  • సాతాను, అతణ్ణి అనుసరించిన దురాత్మలు నరకంలో నిత్యమైన శిక్ష పాలవుతారు.
  • వారి పాపాల కోసం యేసు బలి అర్పణపై విశ్వసించని వారు, అంటే రక్షణ కోసం ఆయనలో నమ్మకముంచని వారు శాశ్వతకాలం నరకంలో శిక్ష అనుభవిస్తారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాలను బహుశా వివిధ పదాలతో అనువదించ వచ్చు. ఎందుకంటే ఇవి వివిధ సందర్భాల్లో కనిపిస్తున్నాయి.
  • కొన్ని భాషల్లో "సరస్సు" "అగ్ని సరస్సు" అనే మాట వాడలేము. ఎందుకంటే అందులో నీరు ఉంటుంది.
  • "నరకం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "హింసలుండే స్థలం” లేక “చీకటి, బాధలు ఉండే అంతిమ స్థలం."
  • "అగ్ని సరస్సు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అగ్ని సముద్రం” లేక “భీకరమైన హింసాగ్ని” లేక “అగ్ని పొలం."

(చూడండి: పరలోకం , మరణం, పాతాళం, అగాథం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 50:14 ఆయన (దేవుడు) వారిని నరకంలో పడవేస్తాడు. వారు యాతన వల్ల శాశ్వతకాలం ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. మంటలు ఎన్నటికీ చల్లారవు. వారిని పురుగులు తినడం ఎప్పటికీ ఆగదు.
  • 50:15 అయన సాతానును నరకంలో పడవేస్తాడు దేవునికి లోబడక సాతానును అనుసరించాలని నిర్ణయించుకున్న వారితో కలిసి అతడు అక్కడ శాశ్వతకాలం శిక్ష అనుభవిస్తాడు.

పదం సమాచారం:

  • Strong's: H7585, G86, G439, G440, G1067, G3041, G4442, G4443, G4447, G4448, G5020, G5394, G5457

నశించు, నశించెను, నశించుట, నశించిపోయే

నిర్వచనము:

“నశించు” అను పదమునకు మరణించుట లేక పాడైపోవుట, సహజముగా విపత్తులు లేక హింసాత్మక సంఘటనల ప్రతిఫలమును సూచించును. పరిశుద్ధ గ్రంథములో దీనికి విశేషముగా నరకములో నిత్యము శిక్షనొందుటయను అర్థమును కలిగియుండును.

  • “నశించిపోవు” జనులందరూ నరకానికి పాత్రులైయున్నారు, ఎందుకంటే వారు తమ రక్షణ కొరకు యేసునందు విశ్వాసముంచుటను తిరస్కరించియున్నారు.
  • యోహాను.3:16వ వచనము “నశించుట” అనగా పరలోకములో నిత్యమూ నివసించకుండుట అనే అర్థమును తెలియజేయుచున్నది.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుగుణముగా, ఈ పదమును అనువాదము చేయు ఇతర విధానములలో “నిత్య మరణమును పొందుట” లేక “నరకములో శిక్షించబడుట” లేక “నాశనమగుట” అనే మాటలను ఉపయోగించుదురు.
  • “నశించు” అనే తర్జుమా కేవలము “ఉనికిలో ఉన్నట్లుగా” మాత్రమెగాకుండా, నరకములో నిత్యమూ ఉండుటను గూర్చి అర్థము ఇచ్చులాగున చూసుకొనుడి.

(ఈ పదములను ఒకసారి చూడండి: మరణము, నిత్యమూ)

పరిశుద్ధ గ్రంథములోని అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6, H7, H8, H1478, H1820, H5486, H5595, H6544, H8045, G599, G622, G684, G853, G1311, G2704, G4881, G5356

నాజీరు చెయ్యబడినవాడు, నాజీరు చెయ్యబడినవారు, నాజీరు వ్రతం

వాస్తవాలు:

“నాజీరు చెయ్యబడినవాడు” అనే పదం “నాజీరు వ్రతం” తీసుకొన్నవ్యక్తిని సూచిస్తుంది. ఎక్కువగా పురుషులు ఈ వ్రతాన్ని తీసుకొంటారు, అయితే స్త్రీలు కూడా తీసుకొంటారు.

  • నాజీరు వ్రతం తీసుకొన్నవ్యక్తి ఆ వ్రతం తీసుకొన్న కాలమంతటిలో ఆ వ్రతాన్ని నెరవేర్చడం కోసం ద్రాక్షలనుండి చేసిన ఎటువంటి ఆహారాన్నైనా, పానీయాన్నైనా తీసుకోనని అంగీకరిస్తున్నాడు, ఈ కాలంలో తన జుత్తు కత్తిరించుకోడు, మృత దేహాన్ని ముట్టుకోడు.
  • వ్రతకాలం ముగిసిన తరువాత, వ్రతం నెరవేరినతరువాత నాజీరు చెయ్యబదినవాడు యాజకుని వద్దకు వెళ్లి అర్పణ చెల్లిస్తాడు. దీనిలో తన జుత్తును కత్తిరించుకోవడం, వాటిని దహించివెయ్యడం కూడా ఉన్నాయి. ఇతర నియంత్రణలన్నీ తొలగించవచ్చు.
  • పాతనిబంధనలో ప్రముఖుడైన సంసోను ఈ నాజీరు వ్రతంలో ఉన్నాడు.
  • బాప్తిస్మమిచ్చు యోహాను జన్మను గురించి ప్రకటించిన దూత పుట్టబోవు తన బిడ్డ గాఢమైన ద్రావకాన్ని తాగకూడదని జెకర్యాకు చెప్పాడు, దాని అర్థం యోహాను నాజీరు వ్రతంలో ఉన్నాడు.
  • అపొస్తలులకార్యములలోని వాక్యభాగం ప్రకారం అపొస్తలుడైన పౌలు కూడా ఒక సమయంలో ఈ వ్రతాన్ని తీసుకొనియుండవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: (బాప్తిస్మమిచ్చు) యోహాను, అర్పణ, సంసోను, ఒప్పందం, జెకర్యా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5139

నిత్యత్వం, శాశ్వతమైన, నిత్యమైన, శాశ్వతంగా

నిర్వచనం:

"శాశ్వతమైన” మరియు “శాశ్వత" అనే పదాలకు ఒకే విధమైన అర్థాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఉనికి కలిగియుండేదానినీ లేదా శాశ్వతకాలం నిలిచి ఉండేదానినీ సూచిస్తుంది.

  • "నిత్యత్వం" అంటే ఆరంభం లేదా అంతం లేని స్థితిని సూచిస్తున్నది. అంతం కాని జీవితాన్ని కూడా ఇది సూచిస్తుంది.

  • భూమిమీద ఈ ప్రస్తుత జీవితం తరువాత, మానవులు నిత్యత్వం పరలోకంలో దేవునితో గానీ లేదా దేవుడు లేకుండా నరకంలో గానీ గడుపుతారు.

  • "నిత్య జీవం” మరియు “శాశ్వత జీవం" అనే పదాలు కొత్త నిబంధనలో దేవునితో శాశ్వతకాలం పరలోకంలో శాశ్వతంగా జీవించడానికి ఉపయోగిస్తారు.

  • "శాశ్వతం" పదం అంతం కాని సమయాన్ని సూచిస్తుంది.

  • "శాశ్వత కాలం" పదానికి కాలం ఎప్పటికీ అంతం కాదు అనే భావన ఉంది, నిత్యత్వం లేక నిత్య జీవం ఆ విధంగా ఉంటుందని వ్యక్త పరుస్తుంది. ఎప్పుడూ సంభవించే దానిని లేదా ఉనికి కలిగియుండే దానిని నొక్కి చెపుతుంది. అంతం కాని సమయాన్ని సూచిస్తుంది.

  • దావీదు సింహాసనం "శాశ్వత కాలం" నిలుస్తుందని దేవుడు చెప్పాడు, దావీదు సంతానం, యేసు రాజుగా శాశ్వత కాలం పరిపాలన చేస్తాడనే వాస్తవాన్ని ఇది సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • "నిత్యత్వం" లేదా "శాశ్వతం" పదాలు "అంతం లేని" లేదా "ఎప్పటికీ ఆగిపోని" లేదా "ఎప్పుడూ కొనసాగుతున్న" అని మరొక విధాలుగా అనువదించబడవచ్చు.

  • "నిత్య జీవం,” “శాశ్వత జీవం" అనే పదాలు "అంతం కాని జీవితం" లేదా "ఆగిపోకుండా కొనసాగే జీవితం" లేదా "శాశ్వత కాలం జీవించడానికి మన శరీరాలను లేవనెత్తడం" అని కూడా అనువదించబడవచ్చు.

  • సందర్భాన్ని బట్టి, "నిత్యత్వం" పదం "కాలానికి వెలుపల ఉనికి కలిగి ఉండడం" లేదా "అంతం లేని జీవితం" లేదా పరలోకంలో జీవితం"అని వివిధ పద్ధతులలో అనువదించబడవచ్చు.

  • స్థానిక లేదా జాతీయ భాషలో బైబిలు అనువాదంలో ఈ పదం ఏవిధంగా అనువదించబడిండో పరిశీలించండి. (చూడండి: తెలియని వాటిని అనువదించడం ఎలా)

  • "శాశ్వతకాలం" పదం "ఎల్లప్పుడూ" లేదా "ఎప్పటికీ ఆగిపోని" అని కూడా అనువదించబడవచ్చు.

  • "శాశ్వతం నిలుస్తుంది" పదబంధం "ఎల్లప్పుడూ ఉంటుంది" లేదా "ఎప్పటికీ ఆగిపోదు" లేదా "ఎల్లప్పుడూ కొనసాగుతుంది" అని అనువదించబడవచ్చు.

  • "శాశ్వతకాలం" అని నొక్కి చెప్పే పదం "ఎప్పుడూ, ఎల్లప్పుడూ" లేదా "ఎప్పటికీ ఆగిపోకుండా" "ఎప్పటికీ, ఎన్నడూ ఆగిపోని" అని అనువదించబడవచ్చు.

  • దావీదు సింహాసనం శాశ్వతకాలం ఉంటుంది అనే వాక్యం "దావీదు సంతానం శాశ్వత కాలం పాలిస్తారు" లేదా "దావీదు సంతానం ఎల్లపుడూ పాలన చేస్తుంటారు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: దావీదు, పరిపాలన, జీవం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 27:01 ఒక రోజు, యూదుల ధర్మశాస్త్రంలో పండితుడు యేసును పరీక్షిస్తూ, అన్నాడు, బోధకుడా నిత్యజీవం వారసత్వంగా పొందడానికి నేనేమి చెయ్యాలి అని ఆయనను అడిగాడు.

  • 28:01 ఒక రోజు ఒక ధనవంతుడైన యవనస్థుడు యేసు దగ్గరికు వచ్చి, "మంచి బోధకుడా నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. యేసు, "మంచిదానిని గురించి నీవు నన్ను అడుగుతున్నదేమిటి? మంచి వాడు ఒక్కడే, ఆయనే దేవుడు. అయితే నీకు నిత్య జీవం కావాలంటే, దేవుని ఆజ్ఞలకు లోబడు."

  • 28:10 యేసు ఇలా జవాబిచ్చాడు, "నా నిమిత్తము తమ గృహాలనూ, అన్నదమ్ములనూ, అక్కచెల్లెళ్ళనూ, తండ్రినీ, తల్లినీ లేదా ఆస్థినీ విడిచిపెట్టిన ప్రతిఒక్కరూ వంద రెట్లు అధికంగా పొందుతారు మరియు నిత్య జీవం కూడా పొందుతారు."

పదం సమాచారం:

  • Strong's: H3117, H4481, H5331, H5703, H5705, H5769, H5865, H5957, H6924, G126, G165, G166, G1336

నిబంధన నమ్మకత్వం, నిబంధన కట్టుబడి ఉండే గుణం, వాత్సల్యం, అమోఘ ప్రేమ

నిర్వచనం:

ఈ పదాన్ని దేవుడు తన ప్రజలకు చేసిన అధికారిక ఒప్పందం, వాగ్దానం నెరవేర్పులను సూచించడానికి ఉపయోగిస్తారు.

  • ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన అధికారిక ఒప్పందాలను "నిబంధనలు" అంటారు.
  • యెహోవా యొక్క "నిబంధన నమ్మకత్వం” లేక “నిబంధనకు కట్టుబడి ఉండే గుణం" అయన తన ప్రజలకు చేసే వాగ్దానం నిలుపుకుంటాడని తెలియజేస్తున్నది.
  • తన నిబంధన వాగ్దానం నిలుపుకునే దేవుని నమ్మకత్వం తన ప్రజల పట్ల తన కృపను వెల్లడి చేస్తున్నది.
  • ఈ పదం "కట్టుబడి ఉండే గుణం" అనే మరొక పదం అధారపడ దగిన గుణాన్ని సూచిస్తున్నది. వాగ్దానం చేసిన దాన్ని వేరొకరికి లాభం కలిగేలా నెరవేర్చే గుణం.

అనువాదం సలహాలు:

  • ఏ విధంగా ఈ పదాలు "నిబంధన” “నమ్మకత్వం" అనువదించబడినాయో దాన్ని బట్టి అనువదించ వచ్చు.
  • ఈ పదాన్నిఅనువదించడంలో ఇతర పద్ధతులు, "నమ్మకమైన ప్రేమ” లేక “కట్టుబడి ఉండే ప్రేమ” లేక “ప్రేమపూర్వకమైన అధారపడదగిన గుణం."

(చూడండి: నిబంధన, నమ్మకమైన వాడు, కృప, ఇశ్రాయేలు, ప్రజలు దేవుని, వాగ్దానం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2617

నిబంధన మందసం, యెహోవా మందసం

నిర్వచనం:

ఈ పదాలు ప్రత్యేకమైన కొయ్యతో చేసి బంగారం రేకుతో కప్పిన పెట్టెను సూచించేవి. ఇందులో పది ఆజ్ఞలు రెండు రాతి పలకలు ఉన్నాయి. అందులో అహరోను కర్ర,, మన్నా ఉంచిన గిన్నె ఉన్నాయి.

  • ఈ పదం "మందసం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పెట్టె” లేక “మంజూష” లేక “కంటైనర్."
  • అందులో ఉన్న వస్తువులు ఇశ్రాయేలీయులకు తమతో దేవుని నిబంధనను గుర్తు చేస్తాయి.
  • నిబంధన మందసం "అతి పరిశుద్ధ స్థలం"లో ఉంది.
  • ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి నిబంధన మందసం ఉంది. అక్కడ అయన ఇశ్రాయేలీయుల కోసం మోషేతో మాట్లాడాడు.
  • నిబంధన మందసం ఆలయం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సమయంలో ప్రధాన యాజకుడు మాత్రమే మందసాన్ని ఏడాదికి ఒక్కసారి ప్రాయశ్చిత్త దినాన సమీపించ వచ్చు.
  • అనేక అంగ్ల అనువాదాలు "నిబంధన ఆదేశాలు"అనే దాన్ని అక్షరాలా "సాక్షము"అని తర్జుమా చేసాయి. ఎందుకంటే పది ఆజ్ఞలు అనేవి తన ప్రజలతో దేవుని నిబంధన సాక్షము. దీన్ని "నిబంధన చట్టం"అని కూడా తర్జుమా చెయ్యవచ్చు.

(చూడండి: మందసం, నిబంధన, ప్రాయశ్చిత్తం, పరిశుద్ధ స్థలం, సాక్షము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H727, H1285, H3068

నిబంధన, నిబంధనలు, కొత్త నిబంధన

నిర్వచనం:

నిబంధన అంటే రెండు పక్షాలు కట్టుబడి ఉండవలసిన అధికారిక, సమ్మతి, ఏకీభావంతెలిపే ఒప్పందం. దీన్ని ఒకటి లేక రెండు పక్షాలు తప్పక నెరవేర్చాలి.

  • ఏకీభావం అనేది వ్యక్తులు, ప్రజాసమూహాలు, లేక దేవునికి ప్రజలకు మధ్య జరుగుతుంది.
  • ప్రజలు ఒకరితో ఒకరు నిబంధన చేస్తే వారు దేన్నైనా చేస్తానని ఒప్పుకుంటే అది తప్పకుండా చెయ్యాలి.
  • మానవులు చేసే నిబంధనలకు ఉదాహరణలు వివాహం నిబంధనలు, వ్యాపార ఒప్పందాలు, దేశాల మధ్య ఒడంబడికలు.
  • బైబిల్ అంతటా, దేవుడు వివిధ నిబంధనలు తన ప్రజలతో చేశాడు.
  • కొన్ని నిబంధనల్లో, దేవుడు ఏషరతులు లేకుండా తన ధర్మం నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. ఉదాహరణకు, దేవుడు మానవ జాతితో లోకాన్ని వరద ద్వారా మరి ఎన్నడూ భూమిని నాశనం చెయ్యనని తన నిబంధన స్థిరపరచినప్పుడు ఆ వాగ్దానంలో మనుషులు నెరవేర్చవలసిన ఎలాటి షరతులు లేవు.
  • ఇతర నిబంధనల్లోనైతే, ప్రజలు ఆ నిబంధనలో తమ వంతు నెరవేర్చడం ద్వారా విధేయత చూపితేనే తన వంతు నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. "కొత్త నిబంధన" అనేది దేవుడు తన కుమారుడు యేసు సూచిస్తున్నది తన ప్రజలకోసం బలి అర్పణ ద్వారా జరిగేది.
  • దేవుని "కొత్త నిబంధన" బైబిల్ లో "కొత్త నిబంధన" భాగంలో వివరించ బడింది.
  • కొత్త నిబంధన దేవుడు ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలంలో చేసిన "పాత” లేక “మొదటి" నిబంధన కు వేరుగా ఉంది.
  • కొత్త నిబంధన పాతదాని కన్నా శ్రేష్టమైనది. ఎందుకంటే అది యేసు బలి అర్పణపై ఆధారపడింది. ఆ అర్పణ మనుషుల పాపాలకు శాశ్వతకాలం ప్రాయశ్చిత్తం జరిగిస్తుంది. పాత నిబంధన కింద చేసిన బలి అర్పణలు అలా చెయ్యలేవు.
  • దేవుడు కొత్త నిబంధనను యేసు విశ్వాసుల హృదయాలపై రాశాడు. వారు దేవునికి లోబడి పరిశుద్ధ జీవితాలు గడిపేలా ప్రోత్సహిస్తుంది.
  • కొత్త నిబంధన అంత్య కాలంలో దేవుడు భూమిపై తన పరిపాలన స్థాపించేటప్పుడు పూర్తిగా నెరవేర్చబడుతుంది.

ప్రతిదాన్నీ మరలా మంచిదిగా అంటే దేడు మొదటిగా లోకాన్ని సృష్టించినప్పటివలె దేవుడు చేస్తాడు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని అనువదించే పద్ధతులు "కట్టుబడేలా చేసే ఏకీభావం” లేక “అధికారిక ఒప్పందం” లేక “ప్రమాణం” లేక “కాంట్రాక్టు."
  • కొన్ని భాషల్లో నిబంధన అని అర్థం ఇచ్చే వివిధ మాటలు ఉండవచ్చు. అది ఒకటి, లేక రెండు పక్షాలు చేసుకున్న వాగ్దానం వారు తప్పక నిలబెట్టుకునే దానిపై ఆధారపడి ఉపయోగించాలి. నిబంధన ఏక పక్షమైతే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వాగ్దానం” లేక “ప్రమాణం."
  • ఈ పదం అనువాదం ప్రజలు ప్రతిపాదించిన నిబంధనలాగా ధ్వనించ కూడదు. నిబంధనలు అన్నీ దేవునికి ప్రజలకు మధ్య జరిగేవే. నిబంధన ఆరంభకుడు దేవుడే.
  • "కొత్త నిబంధన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కొత్త అధికారిక ఒడంబడిక” లేక “కొత్త ఒప్పందం” లేక “కొత్త కాంట్రాక్టు."
  • ఈ పదం "కొత్త" అనే మాటల అర్థం "తాజా” లేక “కొత్త రకం” లేక “వేరొక."

(చూడండి: నిబంధన, వాగ్దానం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 04:09 తరువాత దేవుడు అబ్రాముతో నిబంధన చేశాడు. నిబంధన రెండు పక్షాల మధ్య అనేది ఒక ఏకీభావం.
  • 05:04 "నేను ఇష్మాయేలును కూడా గొప్ప జాతిగా చేస్తాను. అయితే నా నిబంధన ఇస్సాకుతో స్థిరపరుస్తాను."
  • 06:04 చాలా కాలం తరువాత అబ్రాహాము చనిపోయాక దేవుడు చేఅతనితో చేసిన వాగ్దాన నిబంధన ఇస్సాకుకు సంక్రమించింది.
  • 07:10 నిబంధన వాగ్దానం దేవుడు అబ్రాహముతో చేశాడు. ఆ తరువాత ఇస్సాకుతో. ఇప్పుడు యాకోబుతో చేశాడు."
  • 13:02 మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, "నీవు నా స్వరానికి లోబడితే నా నిబంధన ప్రకారం నడుచుకుంటే మీరు ఒక ఒక రాజ్యంగా యాజకులుగా పరిశుద్ధ జాతిగా అవుతారు."
  • 13:04 తరువాత దేవుడు వారికి ఒక నిబంధన చెప్పాడు, "నేను యెహోవాను, నీ దేవుణ్ణి, నిన్ను ఈజిప్టు బానిసత్వం నుండి రక్షించిన వాణ్ణి. ఇతర దేవుళ్ళను పూజించకూడదు."
  • 15:13 తరువాత యెహోషువా దేవుడు ఇశ్రాయేలీయులతో సీనాయి దగ్గర చేసిన నిబంధనకు వారు నిబంధనకు లోబడవలసిన సంగతిని ప్రజలకు జ్ఞాపకం చేశాడు.
  • 21:05 ప్రవక్త యిర్మీయా ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. తాను ఒక కొత్త నిబంధన చేయబోతున్నాడు. అయితే ఆ నిబంధన దేవుడు సీనాయి దగ్గర ఇశ్రాయేలుతో చేసిన నిబంధన వంటిది కాదు. కొత్త నిబంధనలో దేవుడు తన చట్టం మనుషుల హృదయాలపై రాశాడు. ప్రజలు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. వారు తన ప్రజలు, దేవుడు వారి పాపాలు క్షమిస్తాడు. మెస్సియా ఈ కొత్త నిబంధన మొదలు పెడతాడు.
  • 21:14 మెస్సియా మరణం, పునరుత్థానం ద్వారా దేవుడు పాపులను రక్షించే తన పథకం అమలు పరచి కొత్త నిబంధన ఆరంభిస్తాడు.
  • 38:05 తరువాత యేసు ఒక పాత్ర తీసుకుని “తాగండి” అని చెప్పాడు, ఇది నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన పాప క్షమాపణ కోసం ఒలకబోయబడింది. మీరు దీన్ని తాగే ప్రతి సమయంలో ఇది గుర్తు చేసుకోండి.
  • 48:11 అయితే దేవుడు ఒక కొత్త నిబంధన చేశాడు. ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. కొత్త నిబంధన మూలంగా ఏ జాతి వారైనా యేసులో దేవుని ప్రజలు అవుతారు.

పదం సమాచారం:

  • Strong's: H1285, H2319, H3772, G802, G1242, G4934

నియమించు, నియమించిన, నియమించ బడిన

నిర్వచనం:

"నియమించు” “నియమించ బడిన"అనే పదాలు ఎవరినైనా ఎన్నుకుని ఇదమిద్ధమైన కార్యాచరణ లేక పాత్ర నెరవేర్చడం అనే దాన్ని సూచిస్తున్నాయి.

  • "నియమించ బడిన" అంటే "ఎంపిక అయిన" అనే అర్థం కూడా ఇస్తుంది. "నిత్య జీవానికి నియమించ బడిన"అని రాసిన చోట్ల దేన్నైనా పొందిన అనే అర్థం వస్తుంది. మనుషులు "నిత్య జీవానికి నియమించ బడిన" అంటే వారిని శాశ్వత జీవం పొందడం కోసం ఎన్నుకోవడం జరిగింది అని అర్థం.
  • పద బంధం "నిత్య జీవానికి నియమించ బడిన" అంటే ఏదైనా జరగడానికి దేవుని "నిర్ణయ కాలం” లేక “నియమించిన సమయం"అని అర్థం.
  • ఈ పదం "నియమించు" అంటే ఎవరినైనా ఏదైనా చెయ్యమని "ఆజ్ఞ” లేక “కేటాయింపు".

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, అనువదించడం చెయ్యండి. "నియమించు"అనే దానిలో "ఎన్నుకున్న” లేక “కేటాయించు” లేక “పథకం ప్రకారం ఎన్నుకున్న” లేక “ఎంపిక చేసి ప్రకటించు"అనే అర్థాలు వస్తాయి.
  • ఈ పదం "నియమించ బడిన"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కేటాయించు” లేక “పథకం వేయు” లేక “ఇదమిద్ధంగా ఎన్నుకొను."
  • "నియమించ బడిన"అనే దాన్ని "ఎంపిక కావడం"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H561, H977, H2163, H2296, H2706, H2708, H2710, H3198, H3245, H3259, H3677, H3983, H4150, H4151, H4152, H4487, H4662, H5324, H5344, H5414, H5567, H5975, H6310, H6485, H6565, H6635, H6680, H6923, H6942, H6966, H7760, H7896, G322, G606, G1299, G1303, G1935, G2525, G2749, G4287, G4384, G4929, G5021, G5087

నిరీక్షణ, నిరీక్షించిన

నిర్వచనం:

నిరీక్షణ అంటే ఏదైనా జరగాలని బలంగా కోరుకోవడం. నిరీక్షణ అంటే భవిషత్తు సంఘటనను గురించి నిశ్చితం లేదా అనిశ్చితం.

  • బైబిలులో "నిరీక్షణ" పదానికి "నా నమ్మకం ప్రభువులో ఉంది", అనే వాక్యంలో ఉన్నట్టుగా "నమ్మకం" అని కూడా అర్థం ఉంది. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానం చేసిన దానిని పొందుకొంటామనే ఖచ్చిత నిరీక్షణ.
  • కొన్నిసార్లు ULT మూల భాషలోని ఈ పదాన్ని "ధైర్యం" అని అనువదిస్తుంది. ప్రజలు యేసును తమ రక్షకునిగా విశ్వసించి దేవుడు వాగ్దానం చేసిన దానిని పొందుతామనే నిశ్చయత (లేదా ధైర్యం లేదా నిరీక్షణ) కలిగియున్న పరిస్థితులలో క్రొత్త నిబంధనలో ఎక్కువసార్లు జరుగుతుంది.
  • "నిరీక్షణ లేక పోవడం" అంటే ఏదైనా మంచి జరుగుతుంది అని ఎదురుచూపు లేకపోవడం అని అర్థం. అంటే ఇది జరుగదు అని చాలా నిశ్చయంగా ఉండడం.

అనువాదం సూచనలు:

  • కొన్ని సందర్భాల్లో, "నిరీక్షణ" పదం "ఆశించడం” లేదా “కోరుకోవడం” లేదా “ఎదురు చూడడం" అని అనువదించబడవచ్చు.
  • "నిరీక్షణకు తావు లేకపోవడం" అనే వాక్యం "నమ్మకముంచడానికి ఆస్కారం లేని” లేదా “మంచి జరుగుతుంది అనేదానికి తావు లేకపోవడం" అని అనువదించబడవచ్చు.
  • "నిరీక్షణ లేక పోవడం" పదబంధం "ఏ మంచిని గురించీ ఎదురుచూపు లేకపోవడం” లేదా “భద్రత లేకపోవడం” లేదా “మంచి ఏదీ సంభవించదని భావించడం" అని అనువదించబడవచ్చు.
  • నీ నిరీక్షణ నిలుపు" పదబంధం "నా ధైర్నియాన్బ్బని నిలుపు" లేదా "నమ్ముతూ ఉండు" అని కూడా అనువదించబడవచ్చు.
  • "నీ మాట మీద నాకు నిరీక్షణ దొరికింది" పదబంధం "నీ వాక్యం సత్యం అని నాకు ధైర్యం ఉంది" లేదా "నీ యందు నమ్మకం ఉంచేలా నా వాక్యం నాకు సహాయం చేస్తుంది" లేదా "నీ వాక్యానికి నేను విధేయత చూపినప్పుడు నేను నిశ్చయంగా ఆశీర్వాదం పొందుతాను" అని అనువదించబడవచ్చు.
  • దేవునిలో "నిరీక్షణ ఉంచు" లాంటి వాక్యాలు "దేవునిలో నమ్మకముంచు” లేదా "తాను వాగ్కదానం చేసినదానిని దేవుడు జరిగిస్తాడని నిశ్చయంగా ఉండు" లేదా "దేవుడు నమ్మదగినవాడని నిశ్చయంగా ఉండు" ని అనువదించబడవచ్చు.

(చూడండి: ఆశీర్వదించడం, ధైర్యం, మంచి, లోబడు, నమ్మకముంచడం, దేవుని వాక్కు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H982, H983, H986, H2620, H2976, H3175, H3176, H3689, H4009, H4268, H4723, H7663, H7664, H8431, H8615, G91, G560, G1679, G1680, G2070

నిర్దోష

నిర్వచనం:

"నిర్దోష" నేరం చేసిన, ఇతరత్రా తప్పు చేసిన అపరాధ భావం లేని స్థితి. ఇది సాధారణంగా చెడుకార్యాలు చెయ్యని మనుషులకు వర్తిస్తుంది.

  • ఒక వ్యక్తి ఏదైనా చేసినట్టు నేరం మోపబడితే అతడు ఆ తప్పు చెయ్యలేదని తేలితే అతడు నిర్దోషి.
  • కొన్ని సార్లు "నిర్దోష" అనే పదాన్ని ఏ తప్పు చేయని వారికి తమకు జరుగుతున్నది అన్యాయం అయినప్పుడు వాడతారు. ఉదాహరణకు శత్రు సైన్యం "నిర్దోష ప్రజలపై" దాడి చేసినప్పుడు.

అనువాదం సలహాలు:

  • ఎక్కువ సందర్భాల్లో "నిర్దోష" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "అపరాధ భావం లేని” లేక “బాధ్యుడు కాని” లేక “ఆరోపణకు తగని."
  • సాధారణంగా నిర్దోష ప్రజలకు అన్వయించినప్పుడు ఈ పదాన్నిఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తప్పులేని వాడు” లేక “ఎలాటి దుష్టత్వంలో భాగం లేని."
  • "నిర్దోష రక్తం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మరణ శిక్షకు తగిన నేరమేదీ చెయ్యని."
  • "నిర్దోష రక్తం ఒలికించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నిర్దోషులను చంపు” లేక “ఏ తప్పు చేయని వారిని చంపడం."
  • సందర్భంలో ఎవరినైనా చంపినప్పుడు, "నిర్దోష రక్తం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మరణపాత్రుడు కాని."
  • యేసును గురించిన సువార్తను వినని కారణంగా "అపరాధం విషయంలో నిర్దోషి" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆత్మ సంబంధమైన మృతస్థితిలో ఉన్నదానికి బాధ్యులు కారు” లేక “వారు సందేశం అంగీకరించనందుకు బాధ్యులు కారు."
  • యూదా "నేను నిర్దోష రక్తం విషయంలో ద్రోహం చేశాను," అన్నప్పుడు అతడు "ఏ తప్పు చెయ్యని మనిషికి ద్రోహం చేశాను” అంటున్నాడు. లేక “దోషం లేని మనిషి మరణం పొందేలా చేశాను."
  • యేసును గురించి పిలాతు "నేను నిర్దోషి రక్తం విషయంలో నిర్దోషని" అన్న దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఏ తప్పు చేయని ఈ మనిషి మరణంలో నాకు ఏ బాధ్యతా లేదు."

(చూడండి: అపరాధ భావం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 08:06 తరువాత రెండు సంవత్సరాల వరకు, అతడు నిర్దోషి అయినప్పటికీ యోసేపు ఇంకా చెరసాలలో ఉన్నాడు.
  • 40:04 వారిలో ఒకడు యేసును హేళన చేశాడు. అయితే మరొకడు "నీకు దేవుని భయం లేదా?” అన్నాడు. దోషులం, అయితే ఈ మనిషి నిర్దోషి."
  • 40:08 యేసుకు కాపలా ఉన్న సైనికుడు అక్కడ సంభవిస్తున్నదంతా చూసి "తప్పనిసరిగా, ఈ మనిషి నిర్దోషి. అతడు దేవుని కుమారుడు" అన్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H2136, H2600, H2643, H5352, H5355, H5356, G121

నిర్దోషమైన

నిర్వచనం:

"నిర్దోషమైన" పదం అక్షరాలా "నిందలేకుండా" అని అర్థం. హృదయ పూర్వకంగా దేవునికి లోబడి ఉండే వ్యక్తిని సూచించడానికి ఈ పదం ఉపయోగించబడింది. అయితే ఆ వ్యక్తి పాపం లేనివాడు కాదు అని అర్థం కాదు.

  • అబ్రాహాము మరియు నోవహులు దేవుని ఎదుట నిర్దోషమైన వారుగా ఎంచడం జరిగింది.
  • ఒక వ్యక్తి "నిర్దోషమైన"వాడుగా ఉన్నాడు అని ప్రసిద్ధి కలిగియున్నప్పుడు అతడు దేవుణ్ణి ఘనపరచే విధానంలో ప్రవర్తిస్తాడు.
  • ఒక వచనం ప్రకారం, నిర్దోషమైన వాడుగా ఉన్న ఒక వ్యక్తి "దేవునికి భయపడే వాడు మరియు దుష్టత్వం నుండి తొలగిపోయే వాడు."

అనువాదం సూచనలు:

  • "అతని స్వభావంలో దోషం లేనివాడు" లేదా "దేవునికి సంపూర్ణంగా విధేయుడు" లేదా "దుష్టత్వం నుండు దూరంగా ఉండువాడు" అని కూడా అనువదించవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5352, H5355, G273, G274, G298, G338, G410, G423

నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత

నిర్వచనం:

“నీతి" పదం దేవుని సంపూర్ణ మంచితనం, న్యాయం, విశ్వాస్యత, ప్రేమలను సూచిస్తుంది. ఈ గుణలక్షణాలు కలిగియుండడం దేవుడు నీతిమంతుడు” అని తెలియజేస్తాయి. దేవుడు నీతిమంతుడు కనుక ఆయన పాపాన్ని శిక్షించాలి.

  • ఈ పదాలన్నీ తరచుగా దేవునికి విధేయత చూపిస్తున్న వ్యక్తినీ, నైతికంగా మంచిగా ఉన్న వ్యక్తినీ వివరించడానికి ఉపయోగించబడుతున్నాయి. అయితే మనుష్యులందరూ పాపం చేశారు, దేవుడు తప్పించి ఏ ఒక్కరూ సంపూర్ణంగా నీతిమంతులు కాదు.
  • బైబిలులో “నీతిమంతుడు” అని పిలువబడినవారిలో నోవహు, యోబు, అబ్రాహాము, జెకర్యా, ఎలీసెబెతులు.
  • ప్రజలు తాము రక్షించబడడానికి యేసు నందు విశ్వాసం ఉంచినప్నుపుడు దేవుడు వారిని తమ పాపాలనుండి శుద్ధి చేస్తాడు, యేసు నీతిని బట్టి వారిని నీతిమంతులుగా ప్రకటిస్తాడు.

“అవినీతి" అంటే పాపయుతంగా ఉండడం, నైతికంగా భ్రష్టమైనదిగా ఉండడం. దుర్మార్గం (అన్యాయం) పాపాన్ని లేదా పాపయుత స్థితిలో ఉండడం అని సూచిస్తుంది.

  • ఈ పదాలు దేవుని బోధనలకూ, ఆయన ఆజ్ఞలకూ అవిధేయత చూపించే విధానములో జీవించుటను ప్రత్యేకించి సూచిస్తుంది.
  • అనీతిమంతులైన ప్రజలు వారి ఆలోచనలలోనూ, క్రియలలోనూ అవినీతికరంగా ఉంటారు.
  • కొన్నిమార్లు “అనీతిమంతులు” పదం ప్రత్యేకించి యేసునందు విశ్వాసం ఉంచని ప్రజలను సూచిస్తుంది.

“న్యాయబద్ధమైనవాడు," "న్యాయబద్ధత" పదాలు దేవుని ధర్మాలను అనుసరించే విధానంలో జీవించడానిని సూచిస్తుంది.

  • ఈ పదాల అర్థంలో నిటారుగా నిలవడం, నేరుగా ముందుకు చూడడం అనే అభిప్రాయం ఉంది.
  • “న్యాయబద్ధంగా" ఉన్న వ్యక్తి దేవుని ధర్మాలకు విదేయత చూపుతాడు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా కార్యాలు చేయడు.
  • “నిజాయితీ,” “నీతి” వంటి పదాలు ఒకే అర్థాన్ని కలిగి యున్నాయి. కొన్నిసార్లు ఈ రెండు పదములు ఒకే అర్థమును కలిగియుంటాయి మరియు కొన్నిమార్లు సమాంతర నిర్మాణాలలో “నిజాయితీ, నీతి” వంటి పదాలు ఉపయోగించబడతాయి. (చూడండి: సమాంతరత

అనువాదం సూచనలు:

  • ఈ మాట దేవునిని వివరించినప్పుడు, “నీతి” అనే పదం “పరిపూర్ణముగా మంచిది మరియు న్యాయమైనది” లేక “ఎల్లప్పుడూ సరిగ్గా నడుచుకొనునది” అని అనువదించబడవచ్చు.

  • దేవుని “నీతి" అనే పదం “పరిపూర్ణమైన విశ్వాస్యత, న్యాయం" లేదా "ఎల్లప్పుడూ సరియైన కార్యాలు చెయ్యడం" అని అనువదించబడవచ్చు.

  • దేవునికి విధేయులైన ప్రజలను గూర్చి వివరించినప్పుడు, “నీతి” పదం “నైతికముగా మంచితనము” లేదా “న్యాయమైన” లేక “దేవుణ్ణి సంతోషపరచే జీవితాన్ని జీవించడం" అని కూడా అనువదించబడవచ్చు.

  • “నీతిమంతులు” అనే పదం “నీతిగల ప్రజలు” లేదా “దేవునికి భయపడే ప్రజలు” అని కూడా అనువదించబడవచ్చు.

  • సందర్భాన్ని బట్టి “నీతి" అనే పదం “మంచితనము” లేదా “దేవుని ముందు పరిపూర్ణముగా ఉండుట” లేదా “దేవునికి విధేయత చూపుట ద్వారా సరియైన విధానములో ఉండుట” లేదా “పరిపూర్మంణంగా మంచిని చెయ్చియడం" అని అర్తథం ఇచ్నచేలా అనువదించబడవచ్చు.

  • "అనీతి" పదం "నీతి కానిది" అని సామాన్యంగా అనువదించబడవచ్చు.

  • సందర్భాన్ని బట్టి ఈ పదం "దుష్టత్వము” లేదా “అనైతికత” లేదా “దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసిన ప్రజలు” లేదా “పాపాత్ములు” అని ఇతరవిధాలుగా అనువదించబడవచ్చు.

  • “అనీతిమంతులు" పదం “నీతిలేని ప్రజలు” అని అనుమతించబడవచ్చు.

  • “అనీతి" పదం "పాపం" లేదా “చెడు ఆలోచనలూ, క్రియలు” లేదా “దుష్టత్వము” అని అనువదించబడవచ్చు.

  • సాధ్యమైతే, “నీతిమంతులు, నీతి” అనే పదాలతో వీటికున్న సంబంధమును చూపించే విధానములో దీనిని అనువదించడం ఉత్తమం.

  • “న్యాయబద్ధమైన" పదం అనువాదంలో “సరిగా నడుకొనడం" లేదా సరిగా నడుచుకొను వ్యక్తి" లేదా "దేవుని ధర్మాలను అనుసరించడం" లేదా “దేవునికి విధేయత చూపడం” లేదా “సరియైన విధానములో ప్రవర్తించడం" అనే పదాలు జతచెయ్యబడవచ్చు.

  • “న్యాయబద్ధత" పదం “నైతికమైన పవిత్రత” లేదా “మంచి నైతిక ప్రవర్తన" లేదా “న్యాయమైన" అని అనువదించబడవచ్చు.

  • “న్యాయబద్ధమైన" పదం "న్యాయబద్ధంగా ఉన్న ప్రజలు" లేదా "న్యాయబద్ధమైన వారు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: దుష్టత్వం, విశ్వాస్యత, మంచి, పరిశుద్ధత, నిజాయితీ, న్యాయం, ధర్మశాస్త్రము, లోబడు, పవిత్రత, నీతి, పాపము, ధర్మవిరుద్ధమైన)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 03:02 అయితే నోవహు దేవుని దయను పొందెను. అతను నీతిమంతుడు, దుష్ట ప్రజల మధ్యన జీవించుచుండెను.
  • 04:08 దేవుని వాగ్ధానమునందు అబ్రాహాము విశ్వసించినందున అతడు నీతిమంతుడు అని దేవుడు వెల్లడి చేశాడు.
  • 17:02 దావీదు వినయమనస్కుడు, నీతిమంతుడు, దేవుణ్ణి విశ్వసించిన వాడు, దేవునికి లోబడినవాడు.
  • 23:01 మరియతో ప్రధానము చేయబడిన యోసేపు నీతిమంతుడైన మనిషి.
  • 50:10 ఆ తరువాత, నీతిమంతులు వారి తండ్రియైన దేవుని రాజ్యములో సూర్యునివలె ప్రకాశించెదరు.

పదం సమాచారం:

  • Strong's: H205, H1368, H2555, H3072, H3474, H3476, H3477, H3483, H4334, H4339, H4749, H5228, H5229, H5324, H5765, H5766, H5767, H5977, H6662, H6663, H6664, H6665, H6666, H6968, H8535, H8537, H8549, H8552, G93, G94, G458, G1341, G1342, G1343, G1344, G1345, G1346, G2118, G3716, G3717

నెరవేర్చు, నెరవేర్చబడిన

నిర్వచనం:

"నెరవేర్చు" అంటే పూర్ణమైన రీతిలో అనుకున్నది దేన్నైనా సాధించడం.

  • ప్రవచనం నెరవేరినప్పుడు ప్రవచనం లో చెప్పిన ప్రకారం జరిగేలా దేవుడు చేస్తాడు.
  • ఒక వ్యక్తి వాగ్దానం లేక ఒట్టు, నెరవేర్చడం అంటే అతడు వాగ్దానం చేసిన దాని ప్రకారం చేశాడు.
  • బాధ్యత నెరవేర్చడం అంటే కేటాయించబడిన పనిని చేయడం.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "నెరవేర్చు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సాధించు” లేక “నెరవేర్పు” లేక “జరిగేలా చెయ్యడం” లేక “లోబడు” లేక “సాధించు."
  • "నెరవేరింది" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నిజమయింది” లేక “సంభవించింది” లేక “జరిగింది."
  • "నెరవేర్చు," అనే దాన్ని అనువదించడం. "నీ పరిచర్య నెరవేర్చు.” " "పరిపూర్ణముగా” లేక “జరిగించు” లేక “అభ్యసించు” లేక “దేవుడు దేనికి నిన్ను పిలిచాడో ఆ విధంగా ఇతరులకు సేవ."

(చూడండి: ప్రవక్త, క్రీస్తు, పరిచర్య చేసే వాడు, పిలుపు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 24:04 యోహాను ప్రవక్త పలికిన దాన్ని నెరవేర్చాడు, "చూడండి నా వార్తాహరుడిని నీ దారి సిద్ధం చెయ్యడానికి నీకు ముందుగా పంపుతున్నాను.”
  • 40:03 సైనికులు యేసు బట్టల కోసం చీట్లు వేశారు. అలా చెయ్యడంలో వారు దేవుని ప్రవచనం నెరవేర్చారు. "వారు నా వస్త్రాలు పంచుకున్నారు."
  • 42:07 యేసు చెప్పాడు, "నేను మీకు చెప్పాను. రాసి ఉన్న ప్రతిదీ తప్పక నెరవేరుతుంది."
  • 43:05 ప్రవక్త యోవేలు ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనం, “అంత్య దినాల్లో, నేను నా ఆత్మను కుమ్మరిస్తాను” అనేది నెరవేరుతుంది._'"
  • 43:07, 'నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్ళిపోనియ్యవు” అనే ప్రవచనం నెరవేరుతుంది.
  • 44:05 "మీరు చేస్తున్నది మీకు అర్థం కాకపోయినప్పటికీ దేవుడు మీ క్రియలు ఉపయోగించి మెస్సియా బాధలు పడి చనిపోతాడనే ప్రవచనాలు నెరవేరుస్తాడు.

పదం సమాచారం:

  • Strong's: H1214, H5487, G1096, G4138

న్యాయమైన, న్యాయం, అన్యాయమైన, అన్యాయం, నిర్దోషిగా చేయు, నీతిమంతునిగా తీర్చబడడం

నిర్వచనం:

"న్యాయమైన,” “న్యాయం” పదాలు దేవుని చట్టం ప్రకారం ప్రజలను నిష్పక్షపాతంగా చూడడం అని సూచిస్తుంది. ఇతరుల పట్ల సరియైన ప్రవర్తనలో దేవుని ప్రమాణాన్ని ప్రతిబింబించే మానవ చట్టాలు కూడా న్యాయమైనవే.

  • "న్యాయంగా" ఉండడం ఇతరుల పట్ల న్యాయంగానూ, సరియైన విధానంలో ఉండే చర్య. ఇది దేవుని దృష్టిలో నైతికంగా సరియైన దానిని చెయ్యడానికి నిజాయితీనీ, యథార్థతనూ సూచిస్తుంది.
  • "న్యాయంగా" ప్రవర్తించడం అంటే దేవుని చట్టం ప్రకారం సరియైన, మంచి, సక్రమమైన విధానంలో ప్రజలను చూడడం అని అర్థం.
  • "న్యాయం" పొందడం అంటే చట్టం ప్రకారం న్యాయంగా చూడడం, దీనిలో చట్టం చేత కాపాడబడడం గానీ లేదా చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్షించబడడం కానీ ఉంటుంది.
  • కొన్ని సార్లు "న్యాయమైన" పదం "నీతి" లేదా "దేవుని చట్టాలను అనుసరించడం" లాంటి విస్తృత అర్థాన్ని కలిగి యుంది.

"అన్యాయమైన," "అన్యాయంగా" పదాలు ప్రజలను పక్షపాతంగానూ, తరచుగా హానికరమైన విధానంలో చూడడం అని సూచిస్తుంది.

  • "అన్యాయం" అంటే ఒక వ్యక్తి పట్ల అతడు అర్హుడు కాని దానిని జరిగించడం. ప్రజలను పక్షపాతంతో చూడడం అని అర్థం.
  • అన్యాయం అంటే కొందరిని చెడుగా చూడడం, ఇతరులను చక్కగా చూడడం అని కూడా అర్థం.
  • అన్యాయమైన విధానంలో ప్రవర్తిస్తున్న వాడు "పక్షపాతం"లో లేదా "దురభిమానం"లో ఉన్నవాడు ఎందుకంటే అతడు ప్రజలను సమానంగా చూడడం లేదు.

"నిర్దోషిగా చేయడం" లేదా "నీతిమంతుడిగా తీర్చడం" పదం అపరాధ భావంతో ఉన్న వ్యక్తి నీతిమంతుడుగా ఉండేలా చెయ్యడం. దేవుడు మాత్రమే మనుష్యులను నిర్దోషులుగా చెయ్యగలడు.

  • దేవుడు మనుషులను నిర్దోషులుగా చేసినప్పుడు ఆయన వారి పాపాలను క్షమిస్తాడు, వారు పాపం చెయ్యలేదన్నట్టుగా చేస్తాడు. పశ్చాత్తాపపడి, తమ పాపాల నుండి రక్షించడానికి యేసు నందు విశ్వాసం ఉంచిన పాపులను ఆయన నిర్దోషులుగా చేస్తాడు.
  • "నీతిమంతునిగా తీర్చబడడం" పదం దేవుడు ఒక వ్యక్తి పాపాలను క్షమించి ఆయన దృష్టిలో అతడు నీతిమంతుడుగ ఉన్నాడు అని ప్రకటించడంలో దేవుడు చేసేదానిని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "న్యాయమైన" పదం అనువాదంలో "నైతికంగా సరియైన" లేదా "న్యాయబద్దమైన" పదాలు జతచెయ్యబడవచ్చు.

  • "న్యాయం" పదం "న్యాయబద్ధంగా వ్యవహరించడం" లేదా "అర్హమైన పరిణామాలు" అని అనువదించబడవచ్చు.

  • "న్యాయంగా ప్రవర్తించడం" పదం "న్యాయబద్ధంగా చూడడం" లేదా "సరియైన విధానంలో ప్రవర్తించడం" అని అనువదించబడవచ్చు.

  • కొన్ని సందర్భాల్లో, "న్యాయం" పదం "నీతివంతమైన" లేదా "న్యాయబద్ధమైన" అని అనువదించబడవచ్చు.

  • సందర్భాన్ని బట్టి, "అన్యాయం" పదం "న్యాయబద్ధంకాని" లేదా "పక్షపాతం" లేదా "అనీతివంతమైన" అని అనువదించబడవచ్చు.

  • "అన్యాయమైన" పదం "అన్యాయమైన వారు" లేదా "అన్యాయమైన ప్రజలు" లేదా "ఇతరులను అన్యాయంగా చూచే ప్రజలు" లేదా "అనీతిమంతులైన ప్రజలు" లేదా "దేవుని అవిధేయత చూపించేవారు" అని అనువదించబడవచ్చు.

  • "అన్యాయంగా" పదం "అన్యాయమైన విధానంలో" లేదా "తప్పుగా" లేదా న్యాయబద్ధం కాని" అని అనువదించబడవచ్చు.

  • "అన్యాయం" పదం అనువాదంలో "తప్పుగా చూడడం" లేదా "అన్యాయంగా చూడడం" లేదా "పక్షపాతంతో చూడడం" పదాలు జతచెయ్యబడవచ్చు.

(చూడండి: భావనామాలు)

  • "నిర్దోషిగా చెయ్యడం" పదం "(ఒకరిని) నిర్దోషిగా ప్రకటించడం" లేదా "(ఒకరిని) నీతిమంతుడిగా ఉండేలా చెయ్యడం" అని ఇతరవిధాలుగా అనువదించబడవచ్చు.
  • "నీతిమంతులుగా తీర్చబడడం" పదం "నీతిమంతుడిగా ప్రకటించబడడం" లేదా "నీతిమంతుడిగా మారడం" లేదా "ప్రజలు నీతిమంతులుగా ఉండేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
  • "నీతిమంతులుగా తీర్చబడడం ఫలితంగా" పదబంధం "దేవుడు అనేక మందిని నీతిమతులుగా తీర్చునట్లు" లేదా "దేవుడు మనుషులను నీతిమంతులుగా చెయ్యడం ఫలితంగా" అని అనువదించబడవచ్చు.
  • "మనం నీతిమతులుగా తీర్చబడడం కోసం" పదబంధం "దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడడం కోసం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: క్షమించు, అపరాధ భావం, న్యాయాధిపతి, నీతిమంతుడు, నీతిమంతుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 17:09 దావీదు న్యాయం తోనూ, నమ్మకత్వంతోనూ అనేక సంవత్సరాలు పరిపాలన చేశాడు, దేవుడు అతనిని ఆశీర్వదించాడు.
  • 18:13 కొందరు రాజులు (యూదా) మంచి వారు, వారు న్యాయంగా పరిపాలించారు, దేవుణ్ణి ఆరాధించారు.
  • 19:16 వారు ( ప్రవక్తలు) విగ్రహాలను పుజించకుండా ఇతరుల పట్ల న్యాయం కరుణ చూపుతూ ఉండాలని ప్రజలకు చెప్పారు.
  • 50:17 యేసు తన రాజ్యాన్ని సమాధానంతోనూ, న్యాయం తోనూ తన ప్రజలను శాశ్వతకాలం పాలిస్తాడు.

పదం సమాచారం:

  • Strong's: H205, H2555, H3477, H5765, H5766, H5767, H6662, H6663, H6664, H6666, H8003, H8264, H8636, G91, G93, G94, G1342, G1344, G1345, G1346, G1347, G1738

న్యాయాధిపతి, న్యాయాధికారి, తీర్పు, తీర్పులు

నిర్వచనం:

“న్యాయాధిపతి” “తీర్పు" అంటే దేన్నైనా అది నైతికంగా మంచి లేక చెడు నిర్ణయం చెయ్యడం.

  • "తీర్పు దేవుని" అంటే దేవుడు దేన్నైనా, లేక ఎవరినైనా పాపపూరితమైనదిగా దోషిగా ప్రకటించడం.
  • దేవుని తీర్పు సాధారణంగా ప్రజలను వారి పాపం నిమిత్తం శిక్షించడం.
  • "న్యాయం తీర్చడం" అనేదానికి ఈ అర్థం కూడా ఉంది. "దోషిగా తీర్చు." దేవుడు తన ప్రజలు ఇతరులపై తీర్పు తీర్చకూడదని చెప్పాడు.
  • మరొక అర్థం "మధ్య వర్తిగా ఉండు” లేక “ఇద్దరి మధ్య న్యాయం తీర్చు," అంటే ఒక తగవులో ఎవరి వైపు న్యాయం ఉన్నదో నిర్ణయించు.
  • కొన్ని సందర్భాల్లో దేవుని "తీర్పులు" అంటే అయన ఏ విధంగా న్యాయం చేశాడు అనేది. తన కట్టడలు, చట్టాలు, లేక నిబంధనలు అంటే ఒకటే అర్థం.
  • "తీర్పు" అంటే జ్ఞానంతో నిర్ణయం-చెయ్యగల సామర్థ్యం. ఒక వ్యక్తి "తీర్పులో" లోపం గలవాడు అంటే జ్ఞానం గల నిర్ణయాలు చెయ్యలేని వాడు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "న్యాయాధిపతి" అనేదాన్ని అనువదించడం "నిర్ణయించడం” లేక “దోషిగా తీర్చు” లేక “శిక్షించు” లేక “కట్టడ."
  • "తీర్పు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శిక్ష” లేక “నిర్ణయం” లేక “తీర్పు” లేక “కట్టడ” లేక “దోషిగా తీర్చు."
  • కొన్ని సందర్భాల్లో, "తీర్పులో" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తీర్పు దినాన” లేక “దేవుడు న్యాయాధికారిగా ఉన్న సమయంలో."

(చూడండి: కట్టడ, న్యాయాధిపతి, తీర్పు దినం, న్యాయం, చట్టం, చట్టం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 19:16 ప్రజలను ప్రవక్తలు హెచ్చరించారు, వారు దుష్టక్రియలు మానకపోతే, దేవునికి లోబడకపొతే తరువాత దేవుడు న్యాయాధిపతి గా వారిని దోషులుగా తీర్చి వారిని శిక్షిస్తాడు.
  • 21:08 రాజు ఒక రాజ్యంపై పరిపాలన చేసేటప్పుడు అతడు వారిపై న్యాయాధికారి. మెస్సియా పరిపూర్ణమైన రాజుగా తన పూర్వీకుడు దావీదు సింహాసనం సింహాసనంపై కూర్చుంటాడు. అయన లోకం అంతటిపై శాశ్వతకాలం న్యాయాధిపతిగా యథార్థంగా సరైన నిర్ణయాలు చేస్తాడు.
  • 39:04 ప్రధాన యాజకుడు తన బట్టలు కోపంగా చింపుకుని ఇతర మత నాయకులతో బిగ్గరగా అన్నాడు. "ఇక మనకి ఇతర సాక్షులు ఎందుకు? తాను దేవుని కుమారుడినని చెప్పడం మీరే విన్నారు గదా. మీ తీర్పు ఏమిటి?"
  • 50:14 అయితే దేవుడుయేసులో నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికీ న్యాయాధిపతిగా న్యాయం చేస్తాడు. అయన వారిని నరకంలో వేస్తాడు. వారు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ శాశ్వతకాలం యాతన పడతారు.

పదం సమాచారం:

  • Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H4941, H6414, H6415, H6416, H6417, H6419, H6485, H8196, H8199, H8201, G144, G350, G968, G1106, G1252, G1341, G1345, G1348, G1349, G2917, G2919, G2920, G2922, G2923, G4232

పని, పనులు (కార్యములు), క్రియలు,

నిర్వచనం:

"పని" పదం సహజంగా ఏదైనా ఒకదానిని పూర్తి చెయ్యడానికి ప్రయత్నం చేసే చర్యను సూచిస్తుంది, లేదా ఆ చర్యయొక్క ఫలితాన్ని సూచిస్తుంది. "పనులు" పదం పనులన్నిటినీ ఒక మొత్తంగా సూచిస్తుంది (అంటే చెయ్యబడిన పనులు లేదా చెయ్యవలసిన పనులు)

  • బైబిలులో ఈ పదాలు సాధారణంగా దేవునికీ, మానవులకూ సంబంధించినవిగా ఉపయోగించబడ్డాయి.

“దేవునికి సంబంధించి ఉపయోగించినప్పపుడు, బైబిలులో "పని” పదం తరచుగా ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని చర్యనూ లేదా తన ప్రజలను కాపాడిన కార్యాన్ని (వారి శత్రువులనుండి గానీ, పాపం నుండి గానీ, లేదా రెంటినుండి గానీ) సూచిస్తుంది.

  • దేవుని “కార్యములు” ఆయన చేస్తున్న పనులన్నిటినీ లేదా చేసిన పనులన్నిటినీ, అంటే లోక సృష్టి, పాపులను రక్షించడం, సమస్త సృష్టి అవసరాలు తీర్చడం, సమస్త సృష్టిని కాపాడడం, సూచిస్తున్నాయి.
  • ఒక వ్యక్తి చేసే పనులూ లేదా కార్యాలూ మంచివైయుండవచ్చు లేక చెడ్డవైయుండవచ్చు.

అనువాదం సూచనలు:

  • “పనులు” పదం “క్రియలు” లేదా "చర్యలు" లేదా "జరిగిన కార్యాలు" అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు.
  • దేవుని "పనులు" లేదా “కార్యములు” లేదా "ఆయన చేతి కృత్యములు” పదాలు "అద్భుతాలు" లేదా "శక్తిగల కార్యాలు" లేదా "దేవుడు చేస్తున్న కార్యాలు" అని అనువదించబడవచ్చు.
  • “దేవుని కార్యం" వ్యక్తీకరణ "దేవుడు చేస్తున్న కార్యాలు" లేదా "దేవుడు చేస్తున్న అద్భుతాలు" లేదా "దేవుడు పూర్తి చేసిన సమస్తము" అని అనువదించబడవచ్చు.
  • “పని” అనే పదం "ప్రతీ మంచి పని" లేదా "ప్రతీ మంచి కార్యం" లో ఉన్నట్టుగా “పనులు” పదానికి ఇది ఏకవచనం.
  • “పని” దేవుని కోసం లేదా ఇతరుల కోసం చేసినప్పుడు "సేవ" లేదా "పరిచర్య" అని అనువదించబడవచ్చు.

(చూడండి: ఫలం, పరిశుద్ధాత్మ, అద్భుతం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4566, H4567, H4611, H4659, H5949, G2041

పన్నెండు మంది, పన్నెండు

నిర్వచనం:

"పన్నెండు మంది" యేసు ఎన్నుకొన్న అయన తన అత్యంత సన్నిహితమైన శిష్యులు, లేక అపోస్తలులను సూచిస్తున్నది. తరువాత యూదా ఆత్మహత్య చేసుకున్నాక వారిని పదకొండు మంది అని పిలిచారు.

  • యేసుకు అనేక మంది ఇతర శిష్యులు ఉన్నారు. అయితే ఈ బిరుదు నామం "పన్నెండు మంది" అనేది యేసుకు అత్యంత సన్నిహితమైన వారికి గుర్తింపుగా అలా ఉండిపోయింది.
  • ఈ పన్నెండుమంది శిష్యుల పేర్ల జాబితాలు మత్తయి 10, మార్కు 3, లూకా 6లో ఉన్నాయి.
  • కొంత కాలం తరువాత యేసు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత "పన్నెండవ వాడుగా" ఎన్నుకొన్న శిష్యుడు పేరుమత్తియ. యితడు యూదా స్థానంలో వచ్చాడు. తరువాతవారు మరలా వారిని "పన్నెండు మంది" అని పిలిచారు.

అనువాదం సలహాలు:

  • చాలా భాషల్లో మరింత స్పష్టమైన, సహజమైన పదం "పన్నెండు మంది అపోస్తలులు” లేక “యేసు పన్నెండుమంది అత్యంత సన్నిహితమైన శిష్యులను" సూచించేది ఉండవచ్చు.
  • " పన్నెండు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "యేసు పన్నెండు మిగిలిన శిష్యులు."
  • కొన్నిఅనువాదాల్లో ఇంగ్లీషులో పెద్ద అక్షరం వాడి ఈ బిరుదు నామం "పన్నెండు మంది” “ పన్నెండు"ను సూచిస్తారు.

(చూడండి: అపోస్తలుడు, శిష్యుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1427, G1733

పరలోకం, ఆకాశం, అకాశాలు, పరలోకం

నిర్వచనం:

దీన్ని ఇలా అనువదించ వచ్చు. "పరలోకం" అంటే దేవుడు ఉండే చోటును సాధారణంగా సూచిస్తున్నది. ఇదే పదం సందర్భాన్ని బట్టి ఈ అర్థం కూడా ఇస్తుంది, "ఆకాశం."

  • "ఆకాశాలు" అంటే భూమిపై ఉన్న ప్రతిదీ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇందులో ఆకాశ రాసులు సుదూర లోకాలు, నేరుగా భూమినుండి చూడలేనివి.
  • "ఆకాశం" అంటే భూమిపై పరుచుకుని ఉన్న నీలవిశాలం. అక్కడ మేఘాలు, మనం పీల్చే గాలి ఉన్నాయి. తరచుగా సూర్యుడు, చంద్రుడు కూడా "ఆకాశంలో ఉన్నట్టు" చెప్పవచ్చు.
  • కొన్ని సందర్భాల్లో బైబిల్లో, "పరలోకం" అంటే ఆకాశం, లేక దేవుడుండే చోటు.
  • "పరలోకం " అనే దాన్ని అలంకారికంగా వాడినప్పుడు దేవుడు అనే అర్థంతో వాడతారు. ఉదాహరణకు, మత్తయి " పరలోక రాజ్యం” అని రాసినప్పుడు అతడు దేవుని రాజ్యం అనే అర్థంతో రాశాడు.

అనువాదం సలహాలు:

  • "పరలోకం" అలంకారికంగా ఉపయోగించినప్పుడు దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు, "దేవుడు."
  • "పరలోక రాజ్యం" అని మత్తయి సువార్తలో రాసినప్పుడు "పరలోకం" అని రాయడం మంచిది. ఎందుకంటే అది మత్తయి సువార్తకు ప్రత్యేకం.
  • “అకాశాలు” లేక “ఆకాశ రాసులు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు” లేక “విశ్వంలోని నక్షత్రాలు అన్నీ."
  • పద బంధం, “ఆకాశ నక్షత్రాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆకాశం లోని నక్షత్రాలు” లేక “పాలపుంతలోని నక్షత్రాలు” లేక “విశ్వంలోని నక్షత్రాలు."

(చూడండి: రాజ్యం దేవుని)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 04:02 వారు కట్టే భవనం పరలోకం అంటుతున్న ఎత్తైన గోపురం తో ఉంది.
  • 14:11 అతడు (దేవుడు)పరలోకపు ఆహారం వారికి ఇచ్చాడు. దాని పేరు "మన్నా."
  • 23:07 హటాత్తుగా, అకాశాలు దేవదూతల స్తుతులతో నిండిపోయాయి. "పరలోకంలో దేవునికి మహిమ, అయన అనుగ్రహం చూరగొన్న వారికి భూమి మీద శాంతి!"
  • 29:09 తరువాత యేసు చెప్పాడు, " మీరు మీ సోదరుణ్ణి నీ హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోక తండ్రి మీలో ప్రతి ఒక్కరికీ చేసేది ఇదే."
  • 37:09 తరువాత యేసు ఆకాశం కేసి చూసి ఇలా చెప్పాడు, "తండ్రీ నీవు నా మాట వినినందుకు వందనాలు."
  • 42:11 తరువాత యేసు పరలోకం లోకి వెళ్ళిపోయాడు. ఒక మేఘం ఆయన్ను వారికి కనబడకుండా తీసుకుపోయింది.

పదం సమాచారం:

  • Strong's: H1534, H6160, H6183, H7834, H8064, H8065, G932, G2032, G3321, G3770, G3771, G3772

పరిచర్య చెయ్యడానికి, పరిచర్య

నిర్వచనం:

బైబిలులో “పరిచర్య” అంటే దేవుని గురించి ఇతరులకు బోధించడం, వారి ఆత్మీయ అవసరాలు తీర్చడం ద్వారా వారికి సేవచేయ్యడం అని అర్థం,

  • పాతనిబంధనలో, యాజకులు దేవాలయమలో దేవునికి బలులు అర్పించడం ద్వారా దేవునికి “పరిచర్య” చేసేవారు.
  • వారి “పరిచర్య”లో దేవాలయం గురించిన బాధ్యతాలూ, ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థనలు చెయ్యడం కూడా ఉండేవి.
  • ప్రజలకు “పరిచర్య చెయ్యడం” బాధ్యతలో దేవుని గురించి వారికి బోధించడం ద్వారా ఆత్మీయంగా వారికి సేవ చెయ్యడం ఉంది.
  • పరిచర్య చెయ్యడంలో భౌతిక విషయాలలోకూడా సేవ చెయ్యడం ఉంది, వ్యాధిగ్రస్తులను చూసుకోవడం, పేదవారికి ఆహారాన్ని సమకూర్చడం లాంటివి దీనిలో ఉన్నాయి.

అనువాదం సూచనలు:

  • ప్రజలకు పరిచర్య చెయ్యడం సందర్భంలో, “పరిచర్యచెయ్యడం” అనే పదాన్ని “సేవ” లేక “శ్రద్ధతీసుకోవడం” లేక “అవసరాలు తీర్చడం” అని అనువదించవచ్చు.
  • దేవాలయంలో పరిచర్య చెయ్యడం సందర్భంలో, “పరిచర్య” అనే పదాన్ని “దేవాలయంలో దేవునికి సేవ చెయ్యడం” లేక “ప్రజల కోసం దేవునికి అర్పణలు చెల్లించడం” అని అనువదించవచ్చు.
  • దేవునికి పరిచర్య చెయ్యడం సందర్భంలో, ఈ పదాన్ని “సేవ” లేక “దేవుని కోసం పనిచెయ్యడం” అని అనువదించవచ్చు.
  • ”పరిచర్య చెయ్యడానికి” అనే పదం “శ్రద్ధతీసుకోవడం” లేక “సమకూర్చడానికి” లేక “సహాయం చెయ్యడం” అని అనువదించవచ్చు.

(చూడండి: సేవ, అర్పణ)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6399, H8120, H8334, H8335, G1247, G1248, G1249, G2023, G2038, G2418, G3008, G3009, G3010, G3011, G3930, G5256, G5257, G5524

పరిచారకుడు, పరిచారకులు

నిర్వచనం:

పరిచారకుడు అంటే స్థానిక సంఘంలో సాటి విశ్వాసుల దైనందిన అవసరతలు అంటే ఆహారం, డబ్బు తదితర విషయాల్లో సాయం అందించే వాడు.

  • ఈ పదం "పరిచారకుడు" అనే దాన్ని "సేవకుడు” లేక “పరిచర్య చేసే వాడు" అనే అర్థం ఇచ్చే గ్రీకు పదం నుంచి తర్జుమా చేశారు.
  • ఆది క్రైస్తవుల కాలం నుండి పరిచారకుడు అనే వ్యక్తికి సంఘశరీరం పరిచర్యలో భాగం ఉంది.
  • ఉదాహరణకు, కొత్త నిబంధనలో, పరిచారకులు విశ్వాసులకు అవసరమైన డబ్బు, ఆహారం వితంతువులకు న్యాయంగా పంచిపెట్టేవారు.
  • "పరిచారకుడు" అనే పదాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సంఘం పరిచర్య చేసే వాడు” లేక “సంఘం పనివాడు” లేక “సంఘం సేవకుడు," కొన్ని ఇతర పదాలు స్థానిక క్రైస్తవ సమాజంలో ఒక పథకం ప్రకారం నియమించ బడి ఇదమిద్ధమైన కార్యాచరణల కోసం ఉన్న వ్యక్తిని సూచిస్తున్నది.

(చూడండి: పరిచర్య చేసే వాడు, సేవకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1249

పరిశుద్ధ స్థలం

నిర్వచనం:

బైబిల్లో, " పరిశుద్ధ స్థలం” “అతి పరిశుద్ధ స్థలం" అనేవి ప్రత్యక్ష గుడారం, లేక ఆలయభవనంలోని రెండు భాగాలు.

  • "పరిశుద్ధ స్థలం" మొదటి గది, అందులో ధూప బలిపీఠం, ప్రత్యేక "సన్నిధి రొట్టెల" బల్ల ఉంటాయి.
  • "అతి పరిశుద్ధ స్థలం" రెండవ, లోపలి గది, ఇందులో నిబంధన మందసం ఉంది.
  • మందమైన బరువైన తెర బయటి గది నుండి లోపలి గదిని వేరు చేస్తున్నది.
  • ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే వెళ్ళగలుగుతాడు.
  • కొన్ని సార్లు "పరిశుద్ధ స్థలం" అంటే రెండు గదులు, ఆలయం, లేక ప్రత్యక్ష గుడారం బయటి ఆవరణ మెదలైనవి కూడా వస్తాయి. సాధారణంగా దేవునికి ప్రత్యేకించిన ఏ స్థలమైనా ఇలా పిలవ వచ్చు.

అనువాదం సలహాలు:

  • "పరిశుద్ధ స్థలం" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "దేవునికి ప్రత్యేకించిన గది” లేక “దేవునితో కలుసుకునే ప్రత్యేక గది” లేక “దేవునికి కేటాయించిన స్థలం."
  • "అతి పరిశుద్ధ స్థలం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవునికి మాత్రమే ప్రత్యేకించిన గది” లేక “దేవునితో సమావేశం అయ్యే అత్యంత ప్రత్యేకమైన గది."
  • సందర్భాన్ని బట్టి, ఈమాట అనువదించే పద్ధతులు "ప్రతిష్టించిన స్థలం” లేక “దేవుడు ప్రత్యేకించుకున్న స్థలం” లేక “ఆలయంలో పరిశుద్ధప్రదేశం” లేక “దేవుని పరిశుద్ధ ఆలయంలో బయటి ఆవరణ."

(చూడండి: ధూప బలిపీఠం, నిబంధన మందసం, రొట్టె, సమర్పించు, బయటి న్యాయ స్థానం, తెర, పరిశుద్ధ, ప్రత్యేకించు, ప్రత్యక్ష గుడారం, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1964, H4720, H4725, H5116, H6918, H6944, G39, G40, G3485, G5117

పరిశుద్ధమైన, పరిశుద్ధత, అపరిశుద్ధమైన, పవిత్రమైన

నిర్వచనం:

"పరిశుద్ధమైన,” “పరిశుద్ధత " పదాలు పూర్తిగా ప్రత్యేకించబడిన, పాపయుక్తమైన, లోపపూరితమైన సమస్తం నుండి వేరుగా ఉన్న దేవుని స్వభావాన్ని సూచిస్తున్నాయి. .

  • దేవుడు ఒక్కడే సంపూర్ణంగా పరిశుద్ధుడు. అయన మనుషులను, వస్తువులను పరిశుద్ధ పరుస్తాడు.
  • పరిశుద్ధుడైన ఒక వ్యక్తి దేవునికి చెందిన వాడు. దేవుణ్ణి సేవించడానికీ, ఆయనను మహిమ పరిచే ఉద్దేశంతో ప్రత్యేకించబడిన వాడు.
  • దేవుడు పరిశుద్ధమైనది అని ప్రకటించిన వస్తువు తన మహిమ, తన వాడకం కోసం ప్రత్యేకించబడినది. బలిపీఠం లాంటివి ఆయనకు బలి అర్పణలు సమర్పించబడడం కోసం ఉపయోగించబడతాయి.
  • అయన అనుమతిస్తే తప్పించి మనుషులు ఆయనను సమీపించలేరు. ఎందుకంటే అయన పరిశుద్ధుడు వారు కేవలం పాపపూరితమైన, అపరిపూర్ణమైన మానవులు.
  • పాత నిబంధనలో, దేవుడు యాజకులను తనకు ప్రత్యేక సేవ చేయడం కోసం పరిశుద్ధపరిచాడు. వారు ఆచారరీతిగా పాపం నుండి శుద్దులై దేవుణ్ణి సమిపించగలుగుతారు.
  • దేవుడు తనకు చెందిన కొన్ని స్థలాలనూ, వస్తువులనూ పరిశుద్ధమైనవిగా ప్రత్యేకించాడు. లేదా తన ఆలయం లాంటి వాటి మూలంగా తనను వెల్లడి చేసుకుంటాడు.

అక్షరాలా, "అపరిశుద్ధమైన" అంటే "పరిశుద్ధము కానివి" అని అర్థం. దేవుణ్ణి ఘనపరచని వస్తువునూ లేదా వ్యక్తినీ వివరిస్తుంది.

  • దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడం ద్వారా దేవుని అగౌరవపరుస్తూ ఉన్న వ్యక్తిని వివరించడానికి ఈ పదం ఉపయోగించబడుతుంది.
  • "అపరిశుద్ధమైన" అని పిలువబడినదానిని సాధారణంగా ఉంది, చెడిపోయి ఉంది లేదా అపవిత్రంగా ఉంది అని వివరించబడవచ్చు. ఇది దేవునికి చెందినది కాదు.

"పవిత్రమైన" పదం దేవుణ్ణి ఆరాధించడానిని లేదా అబద్దపు దేవుళ్ళ అన్యమత ఆరాధనకు సంబంధించినదిగా ఉంది.

  • పాత నిబంధనలో, "పవిత్రమైన" పదం అబద్ద దేవుళ్ళ ఆరాధనలో ఉపయోగించే రాతి స్తంభాలు, ఇతర వస్తువులను వివరించడానికి ఉపయోగించబడుతుంది. ఈ పదం "మత సంబంధమైన" అని కూడా అనువదించబడవచ్చు.
  • "పవిత్రమైన పాటలు,” “పవిత్ర సంగీతం" అంటే దేవుని మహిమకోసం పాడేవీ లేదా వాయించబడేవి అని సూచించబడుతున్నాయి. "యెహోవాను ఆరాధించడం కోసం సంగీతం" లేదా "దేవుణ్ణి స్తుతించే పాటలు" అని అనువదించబడవచ్చు.
  • "పవిత్ర విధులు" పదం ప్రజలు దేవుణ్ణి ఆరాధించడంలో నడిపించడానికి యాజకుడు జరిగించే "మతపర విధులు” లేదా “ఆచార పరమైన" కార్తంయాలను సూచిస్తుంది. ఇది అబద్ధ దేవుళ్ళ విగ్రహ పూజల్లో ఆ యాజకులు చేసే ఆచారపరమైన కార్యాలనూ సూచిస్తున్నాయి.

అనువాదం సూచనలు:

  • "పరిశుద్ధమైన" పదం "దేవునికోసం ప్రత్యేకించిన” లేదా “దేవునికి చెందిన” లేదా “పూర్తిగా పవిత్రమైన" లేదా "పరిపూర్ణ పాప రహిత” లేదా "పాపం నుండి వేరుచెయ్యబడిన" అని ఇతరవిధాలుగా అనువదించబడవచ్చు.

  • "పరిశుద్ధపరచు" పదం తరచుగా ఇంగ్లీషులో "పరిశుద్ధ పరచు" అని అనివదించబడుతుంది. "దేవుని కోసం (ఒకరిని) ప్రత్యేక పరచు" అని కూడా అనువదించబడవచ్చు.

  • "అపరిశుద్ధమైన" పదం "పరిశుద్ధం కాని" లేదా "దేవునికి చెందని” లేదా “దేవుణ్ణి ఘనపరచని" అని ఇతర విధానాలలో అనువదించబడవచ్చు.

  • కొన్ని సందర్భాల్లో, "అపరిశుద్ధమైన" పదం "అపవిత్రం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: పరిశుద్ధాత్మ, సమర్పించు, పరిశుద్ధపరచు, ప్రత్యేకించు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 01:16 అయన (దేవుడు) ఏడవ రోజును దీవించి పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే ఆరోజు అయన తన పనిని మాని విశ్రమించాడు.
  • 09:12 "నీవు పరిశుద్ధమైన నేలపై నిలుచున్నావు."
  • 13:01 "మీరు నా నిబంధనకు లోబడి దానిని పాటించినట్లయితే మీరు నా స్వకీయ సంపాద్యం అవుతారు, ఒక యాజకలైన రాజ్యంగానూ, పరిశుద్ధ జనముగానూ ఉంటారు."
  • 13:05 విశ్రాంతి దినమును పరిశుద్ధ మైనదిగా ఆచరించడానికి జాగ్రత్త పడండి."
  • 22:05 "ఆ శిశువు పరిశుద్ధమైన దేవుని కుమారుడు."
  • 50:02 మనం యేసు రాక కోసం ఎదురు చూస్తుండగా పరిశుద్ధంగా ఆయనకు ఘనత కలిగించే విధంగా జీవించాలని అయన కోరుతున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H430, H2455, H2623, H4676, H4720, H6918, H6922, H6942, H6944, H6948, G37, G38, G39, G40, G41, G42, G462, G1859, G2150, G2412, G2413, G2839, G3741, G3742

పరిశుద్ధాత్మ నింపుదల

నిర్వచనం:

"పరిశుద్ధాత్మ నింపుదల" అనేది అలంకారికంగా అనే మాట. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ మూలంగా శక్తి పొంది దేవుని సంకల్పం ప్రకారం చెయ్యడానికి వాడతారు.

  • "తో నిండిపోవడం" అనే మాట "అదుపులో ఉండడం అనే అర్థంలో వాడతారు."
  • "పరిశుద్ధాత్మ నింపుదల" ఉన్నవారు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం పూర్తిగా ఆయనపై సహాయం కోసం ఆధారపడి దేవుడు కోరినది చేస్తారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పరిశుద్ధాత్మ మూలంగా శక్తి పొందడం” లేక “పరిశుద్ధాత్మ అదుపులో ఉండడం." అయితే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఏదైనా చెయ్యమని.
  • "అతడు పరిశుద్ధాత్మ నింపుదల గల వాడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సంపూర్ణంగా ఆత్మ శక్తి ద్వారా నడవడం” లేక “అతడు పూర్తిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు” లేక “పరిశుద్ధాత్మ అతణ్ణి పూర్తిగా నడిపించాడు."
  • ఈ పదానికి సమానార్థకం "ఆత్మ మూలంగా జీవించడం," అయితే "పరిశుద్ధాత్మ నింపుదల" అనేది ఆత్మ పూర్ణత అనే అర్థం ఉంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మకు తనపై అదుపు ఇచ్చి తన జీవితానికి ప్రేరణ పొందడం. కాబట్టి ఈ రెండు మాటలను వివిధ రకాలుగా అనువదించ వచ్చు.

(చూడండి: పరిశుద్ధాత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G40, G4130, G4137, G4151

పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ప్రభువు ఆత్మ, ఆత్మ

వాస్తవాలు:

ఈ పదాలన్నీ దేవుడైన పరిశుద్ధాత్మను సూచిస్తున్నాయి. ఒకే నిజ దేవుడు తండ్రి, కుమారుడు,, పరిశుద్ధాత్మడుగా నిత్యమూ ఉనికి కలిగియున్నాడు.

  • పరిశుద్ధాత్మ "ఆత్మ”గానూ, “యెహోవా ఆత్మ” గానూ “సత్య ఆత్మ” గానూ కూడా సూచించబడుతున్నాడు.
  • ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే. అయన తన స్వభావం అంతటిలోనూ, ఆయన చేస్తున్నదానంతటి లోనూ పరిపూర్ణంగా పరిశుద్ధుడు, అనంతమైన పవిత్రుడు, నైతికంగా పరిపూర్ణుడు.
  • తండ్రి, కుమారుడుతో పాటు పరిశుద్ధాత్మడు విశ్వాన్ని సృష్టించడంలో చురుకుగా పాల్గొన్నాడు.
  • దేవుని కుమారుడు యేసు పరలోకానికి తిరిగి వెళ్ళిన తరువాత దేవుడు పరిశుద్ధాత్మను తన ప్రజలను నడిపించడానికీ, వారికి బోధించడానికీ, ఆదరించడానికీ, దేవుని చిత్తం జరిగించేలా సిద్ధపరచడానికీ పంపించాడు.
  • పరిశుద్ధాత్మ యేసును నడిపించాడు, యేసులో విశ్వాసం ఉంచినవారిని ఆయన నడిపిస్తాడు.

అనువాదం సూచనలు:

  • ఈ పదం "పరిశుద్ధ” “ఆత్మ" పదాలను అనువదించడానికి ఉపయోగించే పదాలతో సరళంగా అనువదించబడవచ్చు.
  • ఈ పదం "శుద్ధ ఆత్మ” లేదా "పరిశుద్ధుడైన ఆత్మ" లేదా "దేవుడైన ఆత్మ" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

(చూడండి: పరిశుద్ధ, ఆత్మ, దేవుడు, ప్రభువు, తండ్రియైన దేవుడు, దేవుని కుమారుడు, కానుక)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 01:01 అయితే దేవుని ఆత్మ నీటిమీద ఉన్నాడు.
  • 24:08 యేసు బాప్తిసం పొంది నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ పావురం ఆకారంలో ప్రత్యక్షం అయ్యాడు, ఆయనమీద వాలాడు.
  • 26:01 సాతాను శోధనలు జయించిన తరువాత యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయ ప్ప్రాంరాంతానికి తిరిగి వెళ్లి అక్కడ నివసించాడు.
  • 26:03 యేసు చదివాడు, "దేవుడు తన ఆత్మను నాకు అనుగ్రహించాడు, పేదలకు సువార్త ప్రకటించడానికీ, ఖైదీలకు విడుదల ఇవ్వడానికీ, చూపులేనివారికి చూపు ఇవ్వడానికీ, అణగారిన వారికి విడుదల ఇవ్వడానికి ఆయనను పంపాడు.
  • 42:10 "కాబట్టి మీరు వెళ్లి సమస్త మనుష్యులను శిష్యులుగా చెయ్యండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొన వలెనని బోధించడం ద్వారా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసం ఇవ్వండి."
  • 43:03 వారంతా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, వారు ఇతర భాషలలో మాట్లాడడం ఆరంభించారు.
  • 43:08 "యేసు తాను వాగ్దానం చేసినట్టే పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు మీరు చూస్తూ వింటూ ఉన్నవాటిని పరిశుద్ధాత్మ జరిగిస్తున్నాడు."
  • 43:11 పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీలో ప్రతి ఒక్కరూ దేవుడు మీ పాపాలు క్షమించేలా పశ్చాత్తాప పడి యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. తరువాత అయన మీకు పరిశుద్ధాత్మ అనే కానుకను అనుగ్రహిస్తాడు."
  • 45:01 అతడు (స్తెఫను) మంచి పేరుగలవాడు. పరిశుద్ధాత్మతో జ్ఞానంతో నిండిన వాడు.

పదం సమాచారం:

  • Strong's: H3068, H6944, H7307, G40, G4151

పరిశుద్ధుడు

నిర్వచనం:

"పరిశుద్ధుడు" అనేది బిరుదు నామం. బైబిల్లో ఇది దేవుని పేరు.

  • పాత నిబంధనలో, బిరుదు నామం అనేది తరచుగా "ఇశ్రాయేలు పరిశుద్ధుడు" అనే సందర్భంలో వస్తుంది.
  • కొత్త నిబంధనలో, యేసును కూడా "పరిశుద్ధుడు" అన్నారు.
  • "పరిశుద్ధుడు" అనే మాటను కొన్ని సార్లు బైబిల్లో దేవదూతకు ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • అక్షరార్థంగా ఈపదం " పరిశుద్ధ" (‘డు’ విభక్తి కలపగా వచ్చింది) అనేక భాషలు (ఇంగ్లీషు) దీన్ని అనువదించడం అన్వయ నామవాచకంతో రాస్తారు.
  • ఈ పదాన్ని ఇలా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పరిశుద్ధుడైన దేవుడు” లేక “ప్రత్యేకించబడిన."
  • "ఇశ్రాయేలు పరిశుద్ధుడు " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. " ఇశ్రాయేలు ఆరాధనచేసే పరిశుద్ధ దేవుడు” లేక “ఇశ్రాయేలుపై పరిపాలన చేసే పరిశుద్ధుడు."
  • ఈ పదాన్నిఉపయోగించి అనువదించడం మంచిది. ఒకే పదం లేక పదబంధం ఉపయోగగించాలి.

(చూడండి: పరిశుద్ధ, దేవుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2623, H376, H6918, G40, G3741

పరిశుద్ధుడు, పరిశుద్ధులు

నిర్వచనము:

“పరిశుద్ధులు” అనే ఈ మాటకు “పవిత్రులైనవారు” అని అక్షరార్థము కలదు మరియు యేసునందు విశ్వసించినవారిని సూచిస్తుంది.

  • ఆ తదుపరి సంఘ చరిత్రలో ఒక వ్యక్తి తాను చేసిన మంచి కార్యముల కొరకు తనకు “పరిశుద్ధుడు” అనే బిరుదును ఇచ్చెడివారు, కాని క్రొత్త నిబంధన కాలములో ఈ పదమును ఆ విధముగా ఉపయోగించెడివారు కాదు.
  • యేసునందు విశ్వసించినవారు పరిశుద్ధులు లేక పవిత్రులైనవారైయున్నారు, వారు చేసిన కార్యములను బట్టి కాదు గాని, యేసు క్రీస్తు యొక్క రక్షణ కార్యమునందు వారు విశ్వాసమును బట్టి వారు పరిశుద్ధులైయున్నారు. ఆయానే వారిని పరిశుద్ధులనుగా చేయువాడైయున్నాడు.

తర్జుమా సలహాలు:

  • “పరిశుద్ధులు” అని తర్జుమా చేయుటలో “పవిత్రులైనవారు” లేక “పరిశుద్ధ ప్రజలు” లేక “యేసునందు పరిశుద్ధ విశ్వాసులు” లేక “ప్రత్యేకించబడినవారు” అని కూడా చేర్చవచ్చును.
  • ఒక క్రైస్తవ గుంపుకు సంబంధించిన ప్రజలను మాత్రమె సూచించే పదమును వాడకుండా జాగ్రత్తపడండి.

(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధత)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2623, H6918, H6922, G40

పరిసయ్యుడు, పరిసయ్యులు

వాస్తవాలు:

పరిసయ్యులు యేసు యేసు కాలములో యుదా మత నాయకుల చాలా ప్రాముఖ్యమైన, శక్తివంతమైన జనుల గుంపైయుండెను.

  • వారిలో అనేకులు మధ్య తరగతి వ్యాపారస్థులు మరియు వారిలో మరికొందరు యాజకులుగా ఉండిరి.
  • యూదుల నాయకులైన పరిసయ్యులందరూ మోషే ధర్మశాస్త్రమునకు, ఇతర యూదుల ఆజ్ఞలకు మరియు ఆచారములకు విధేయత చూపుటలో ఎక్కువగా కఠినముగా ఉండేవారు.
  • వారు ఎక్కువగా వారి చుట్టూ ఉన్నటువంటి అన్యులకు ప్రభావితము చూపకుండా, వారికి వేరుగా యూదులందరూ జీవించాలనే ఆలోచనను ఎక్కువగా కలిగియుండిరి. “పరిసయ్యుడు” అనే పేరు “ప్రత్యేకించబడుట” అనే పదమునుండి వచ్చినది.
  • పరిసయ్యులు మరణించిన తరువాత జీవితము ఉందని నమ్ముదురు; వారు దూతలున్నాయని మరియు ఇతర ఆత్మీకమైన జీవులు ఉన్నాయని కూడా నమ్ముదురు.
  • పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు యేసును మరియు ఆదిమ క్రైస్తవులను ఎదురించిరి.

(ఈ పదములను కూడా చుడండి: యూదా మత నాయకులు, ధర్మశాస్త్రము, సద్దూకయ్యులు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G5330

పరీక్ష, పరీక్షలు, పరీక్షించు

నిర్వచనం:

ఒక వ్యక్తి బలాలు, బలహీనతలు బయట పెట్టే దుర్లభం లేక బాధాకరమైన అనుభవాన్ని "పరీక్ష" అనే పదం సూచిస్తున్నది.

  • దేవుడు తన ప్రజలను పరీక్షలకు గురి చేస్తాడు., అయితే ఆయన పాపం చేసేలా శోధించడు. సాతాను అయితే ప్రజలను పాపం చేసేలా శోధించుతాడు.
  • దేవుడు కొన్ని సార్లు మనుషుల పాపం బయట పెట్టేటందుకు పరీక్షలు పెడతాడు. పరీక్ష ఒక వ్యక్తిని పాపం నుండి పాపం తొలగించి దేవునికి దగ్గర చెయ్యడానికి ఉపయోగ పడుతుంది.
  • బంగారం, ఇతర లోహాలు అగ్ని పరీక్ష మూలంగా అవి ఎంత శుద్ధమైనవో దృఢమైనవో తెలుస్తాయి. దేవుడు బాధాకరమైన పరిస్థితులను తన ప్రజలను పరిక్షించడానికి వాడుకుంటాడు.
  • "పరీక్షకు గురి చెయ్యడం" అంటే, "దేన్నైనా లేక ఎవరినైనా వారి విలువైను రుజువు చెయ్యడానికి" పూనుకోవడం.
  • దేవుణ్ణి పరీక్షకు గురి చెయ్యడం అనే సందర్భంలో ఆయనను మన కోసం ఒక అద్భుతం చేసేలా అడగడం. ఇది తన కరుణను అలుసుగా తీసుకోవడమే..
  • దేవుణ్ణి పరీక్షకు గురి చెయ్యకూడదని యేసు సాతానుతో చెప్పాడు. దేవుడు సర్వ శక్తిమంతుడు, అయన అన్నిటికీ ప్రతివారికీ పైగా ఉన్న పరిశుద్ధ దేవుడు.

అనువాదం సలహాలు:

  • "పరీక్ష" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "సవాలు” లేక “కష్టాలు అనుభవించేలా చెయ్యడం” లేక “చేవ ఎలాటిదో చూడడం."
  • "పరీక్ష" అనే దాన్ని అనువదించడం, "సవాలు” లేక “కష్ట తరమైన అనుభవం ."
  • "పరీక్షకు గురి చెయ్యడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పరీక్ష” లేక “సవాలు విసరడం” లేక “తనను రుజువు చేసుకొమ్మని చెప్పడం."
  • దేవుణ్ణి ఈ సందర్భంలో పరీక్షిస్తున్నాడు అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "దేవుడు తన ప్రేమ రుజువు చేసుకొమ్మని చెప్పడం."
  • కొన్నిసందర్భాల్లో దేవుడు "పరీక్ష" పెడుతున్నప్పుడు కాకపోతే "శోధించు" అనే అర్థం వస్తుంది.

(చూడండి: శోధించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5713, H5715, H5749, H6030, H8584, G1242, G1263, G1303, G1957, G3140, G3141, G3142, G3143, G4303, G4828, G6020

పవిత్ర స్థలము (మందిరము)

నిర్వచనము:

“పవిత్ర స్థలము” అనే ఈ మాటకు “పరిశుద్ధ స్థలము” అని అక్షరార్థము మరియు దేవుడు పవిత్రపరచిన లేక పరిశుద్ధపరచిన స్థలమును సూచించును. సంరక్షణను మరియు భద్రతను అనుగ్రహించే స్థలమును కూడా ఈ పదము సూచించును.

  • పాత నిబంధనలో “పవిత్ర స్థలము (మందిరము)” అనే ఈ పదమును ప్రత్యక్ష గుడారమును లేక “పరిశుద్ధ స్థలము” “అతి పరిశుద్ధ స్థలము” ఉండే దేవాలయ భవనమును కూడా సూచించుటకు ఉపయోగించబడినది.
  • దేవుడు పరిశుద్ధ స్థలమును (లేక మందిరమును) తన ప్రజల మధ్యన నివసించే స్థలముగా సూచించియున్నాడు.
  • తన ప్రజలకు సంరక్షణ స్థలముగా లేక తన ప్రజలకొరకు భద్రత కలిగిన స్థలముగా ఆయన తననే “పవిత్ర స్థలము (లేక మందిరము)” అని పిలుచుకొనియున్నాడు.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమునకు “ప్రత్యేకించబడిన స్థలము” లేక “పరిశుద్ధ స్థలము” అని ప్రాథమిక అర్థము కలిగియున్నది.
  • సందర్భానుసారముగా, “పవిత్ర స్థలము (లేక మందిరము)” అనే ఈ మాటను “పరిశుద్ధ స్థలము” లేక “పరిశుద్ధ భవనము” లేక “దేవుని నివాస పవిత్ర స్థలము” లేక “సంరక్షణతో కూడిన పరిశుద్ధ స్థలము” లేక “భద్రతా యొక్క పరిశుద్ధ స్థలము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “మందిర తులము (షెకెలు)” అనే మాటను “ప్రత్యక్ష గుడారము వద్ద ఇచ్చే ఒక విధమైన షెకెలు” లేక “దేవాలయమును సంరక్షించుటకు పన్ను చెల్లించుటలో షెకెలును ఉపయోగించెడివారు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • గమనిక: ఈ పదము యొక్క తర్జుమా ఈ ఆధునిక కాలమునందు ఆరాధించుటకు ఉపయోగించే ఒక గదిని సూచించకుండ జాగ్రత్తపడండి.

(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, ప్రత్యేకించబడుట, ప్రత్యక్ష గుడారము, పన్ను, దేవాలయము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H4720, H6944, G39

పవిత్రపరచు, పవిత్రపరచును, పవిత్రీకరణ

నిర్వచనము:

పవిత్రపరచుట అనగా ప్రత్యేకించబడుట లేక పరిశుద్ధపరచుట. పవిత్రీకరణ అనగా పరిశుద్ధపరచు యొక్క ప్రక్రియయైయున్నది.

  • పాత నిబంధనలో కొంతమంది ప్రజలు పవిత్రీకరించబడిరి మరియు వస్తువులు పవిత్రీకరణ చేయబడ్డాయి, లేక దేవుని సేవకొరకు ప్రత్యేకపరచబడ్డాయి.
  • యేసునందు విశ్వసించిన ప్రజలను దేవుడు పవిత్రీకరణ చేయునని క్రొత్త నిబంధన బోధించుచున్నది. అనగా, ఆయన వారిని పరిశుద్ధపరచును మరియు తనకు సేవ చేయుటకొరకు వారిని ప్రత్యేకపరచును.
  • యేసును నమ్మిన విశ్వాసులు కూడా దేవుని కొరకు తమ్మునుటాము పవిత్రీకరించబడాలని, వారు చేయు ప్రతి కార్యమునందు పరిశుద్ధముగా ఉండాలని ఆజ్ఞాపించబడిరి.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, “పవిత్రపరచు” అనే పదమును “ప్రత్యేకించు” లేక “పరిశుద్ధపరచు” లేక “పవిత్రపరచు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ప్రజలు తమ్మునుతాము పవిత్రపరచుకొనినప్పుడు, వారు తమ్మునుతాము పరిశుద్ధపరచుకొనుచున్నారు మరియు దేవుని సేవకొరకు తమ్మునుతాము సమర్పించుకొనుచున్నారు. పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించబడిన “పవిత్రత” అనే పదమును ఈ అర్థముతో ఉపయోగించబడియున్నది.
  • దీని అర్థము “పవిత్రత” అయినప్పుడు, ఈ పదమును “దేవుని సేవ కొరకు ఎవరినైనా (లేక దేనినైనా) సమర్పించు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్భానుసారముగా, “మీ పవిత్రీకరణ” అనే ఈ మాటను “మిమ్మును పరిశుద్ధపరచుట” లేక “(దేవుని కొరకు) మిమ్మును ప్రత్యేకించుకొనుట” లేక “మిమ్మును పరిశుద్ధపరచునది” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: పవిత్రత, పరిశుద్ధత, ప్రత్యేకించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6942, G37, G38

పశ్చాత్తాపపడు, పశ్చాత్తాపపడును, పశ్చాత్తాపపడెను, పశ్చాత్తాపము

నిర్వచనము:

“పశ్చాత్తాపపడు” మరియు “పశ్చాత్తాపము” అనే ఈ పదములు పాపమునుండి వెనుదిరుగుటను గూర్చి మరియు దేవుని వైపుకు తిరుగుటను గూర్చి సూచించును.

  • “పశ్చాత్తాపపడుట” అనే మాటకు “ఒకరి మనస్సును మార్చుకొనుట” అని అక్షరార్థము కలదు.
  • పరిశుద్ధ గ్రంథములో “పశ్చాత్తాపపడు” అనే మాటకు సాధారణముగా మానవ ఆలోచన విధానమునుండి మరియు క్రియా విధానమునుండి మరియు పాప స్వభావమునుండి బయటకు వచ్చుట, మరియు దేవుని విధానములో ఆలోచించుట మరియు క్రియలు చేయు వైపునకు మరలుట అని అర్థము.
  • ప్రజలు తమ పాపముల విషయమై నిజంగా పశ్చాత్తాపము చెందుతారో, దేవుడు వారిని క్షమిస్తాడు మరియు ఆయనకు విధేయులు కావడానికి వారికి సహాయము చేస్తాడు.

తర్జుమా సలహాలు:

  • “పశ్చాత్తాపపడు” అనే ఈ మాటను “(దేవుని వైపుకు) తిరుగుకొనుము” లేక “పాపమునుండి మరలి దేవుని వైపుకు తిరుగుకొనుట” లేక “దేవుని వైపుకు తిరుగుట, పాపమునుండి మరలుట” అని అర్థములనిచ్చే మాటలతో అనువదించవచ్చును.
  • అనేకమార్లు “పశ్చాత్తాపము” అనే ఈ పదము “పశ్చాత్తాపపడు” అనే క్రియా పదముగా తర్జుమా చేయబడుతుంది. ఉదాహరణకు, “దేవుడు ఇశ్రాయేలుకు పశ్చాత్తాపమును ఇచ్చియున్నాడు” అనే ఈ మాటను “దేవుడు ఇశ్రాయేలు పశ్చాత్తాపపడునట్లు చేసియున్నాడు” అని తర్జుమా చేయుదురు.
  • “పశ్చాత్తాపము” అనే ఈ పదమును తర్జుమా చేయు వేరొక విధానములో “పాపమునుండి వెనుదిరుగుట” లేక “దేవుని వైపుకు తిరిగి, పాపమునుండి తప్పుకొనుట” అనే మాటలు కూడా వినియోగిస్తారు.

(ఈ పదములను కూడా చూడండి: క్షమించు, పాపము, తిరుగు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 16:02 దేవునికి అవిధేయత చూపించి అనేక సంవత్సరములైన తరువాత మరియు వారి శత్రువులు ద్వారా నలగగొట్టబడిన తరువాత, ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపము పొందిరి మరియు తమను రక్షించమని దేవునిని అడిగిరి.
  • 17:13 దావీదు తన పాపమునుబట్టి పశ్చాత్తాపపడ్డాడు మరియు దేవుడు తనను క్షమించాడు.
  • 19:18 వారు పశ్చాత్తాపపడకపోతే దేవుడు వారిని నాశనము చేయునని వారు (ప్రవక్తలు) ప్రజలను హెచ్చరించిరి.
  • 24:02 అనేకమంది ప్రజలు యోహాను ప్రకటించే మాటలను వినుటకు అరణ్యమునకు తరలివచ్చిరి. “దేవుని రాజ్యము సమీపించియున్నది, పశ్చాత్తాపపడుడి “ అని ఆయన వారిక ప్రకటించుచూ వచ్చెను!
  • 42:08 “ప్రతియొక్కరు తమ పాపముల కొరకై పాప క్షమాపణ పొందుటకు ప్రతియొక్కరు పశ్చాత్తాపపడాలి అని నా శిష్యులు ప్రకటించుదురని లేఖనములలో వ్రాయబడియున్నది.”
  • 44:05 “అందుచేత ఇప్పుడు పశ్చాత్తాపపడుడి మరియు దేవునివైపుకు తిరుగుడి, తద్వారా మీ పాపములు కడుగబడుతాయి.”

పదం సమాచారం:

  • Strong's: H5150, H5162, H5164, G278, G3338, G3340, G3341

పస్కా

వాస్తవాలు:

“పస్కా” అనునది మతపరమైన ఒక పండుగ, దీనిని యూదులు తమ పూర్వికూలైన ఇస్రాయేలియులను ఐగుప్తు బానిసత్వములోనుండి ఏ రీతిగా రక్షించాడో అని జ్ఞాపకము చేసికొనుటకు ప్రతి సంవత్సరము ఈ పండుగను ఆచరిస్తారు.

  • దేవుడు ఇస్రాయేలియుల ఇళ్లను “దాటి వచ్చాడని” మరియు వారి కుటుంబములో మగ శిశువులను చంపక, ఐగుప్తీయుల మగ శిశువులను చంపిన వాస్తవ సంఘటననుండి ఈ పండుగ పేరు వచ్చింది.
  • ఈ పస్కా పండుగలో పులియని రొట్టెలు, ఎటువంటి మచ్చలేని పరిపూర్ణమైన గొర్రెపిల్లను వధించి, దానిని బాగుగా కాల్చి వండిన ఒక ప్రత్యేకమైన భోజనము ఉంటుంది. ఇస్రాయేలియులు ఐగుప్తు దేశమునుండి విడిపించబడక మునుపు రాత్రి వారు తినిన భోజనమును ఈ పదార్థములన్నియు వారికి జ్ఞాపకము చేయును.
  • దేవుడు ఇస్రాయేలియుల ఇళ్లను ఎలా “దాటి వెళ్ళాడో”, ఎలా వారిని ఐగుప్తులో బానిసత్వమునుండి విడిపించాడో జ్ఞాపకము చేసికొని ఆచరించు క్రమములో ఈ భోజనమును ప్రతి సంవత్సరము భుజించాలని దేవుడు ఇస్రాయేలియులకు చెప్పాడు.

అనువాద సలహాలు:

  • “పస్కా” అను పదమును “దాటి” మరియు “వెళ్ళెను” అను పదముల కలయిక ద్వారా అనువాదము చేయబడియుండెను లేదా ఈ అర్థము వచ్చేడి ఇతర పదముల కూర్పు ద్వారా అనువదించబడియున్నదని చెప్పబడియుండెను.
  • ప్రభువు దూత వారి ఇళ్లను దాటి, వారి మగ శిశువులను రక్షించుట అను సంఘటనను వివరించుటకు ఉపయోగించబడిన పదములకు ఈ పండుగకు పెట్టిన పేరుకే స్పష్టమైన అనుబంధము కలిగియున్నట్లయితే ఎంతో సహాయకరముగా ఉంటుంది.

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణములు:

  • 12:14 ప్రతి సంవత్సరము పస్కాను ఆచరించుకొనుట ద్వారా బానిసత్వమునుండి వారు విడుదల మరియు ఐగుప్తీయుల మిద ఆయన విజయమును జ్ఞాపకము చేసికొనవలెనని దేవుడు ఇస్రాయేలియులకు ఆజ్ఞాపించెను.
  • 38:01 ప్రతి సంవత్సరము యూదులు పస్కా పండుగను ఆచరిస్తారు. అనేక శతాబ్దముల క్రితము దేవుడు వారి పూర్వికులను ఐగుప్తు బానిసత్వమునుండి ఎలా రక్షించాడో అని తెలియజేయుటకే ఈ ఆచారము నేలకోనినది.
  • 48:09 యేసు పస్కాను తన శిష్యులతో ఆచరించాడు.
  • 48:09 దేవుడు రక్తమును చూచినప్పుడు, ఆయన వారి ఇళ్లను దాటి వెళ్ళెను మరియు వారి మొదటి సంతాన మగ శిశువులను చంపలేదు. ఈ సంఘననే పస్కా అని పిలుతురు.
  • 48:10_ యేసు మన పస్కా గొర్రెపిల్లయైయున్నాడు. ఆయన పరిపూర్ణుడు మరియు పాపరహితుడైయున్నాడు, మరియు పస్కా పండుగ ఆచార సమయములోనే ఆయనను చంపిరి.

పదం సమాచారం:

  • Strong's: H6453, G3957

పాతాళం, మృతుల లోకం

నిర్వచనం:

పదాలు "పాతాళం” “మృతుల లోకం" అనే మాటలను బైబిల్లో మరణం, చనిపోయిన తరువాత వారి ఆత్మలు వెళ్ళే స్థలం చెప్పడానికి ఉపయోగిస్తారు. రెండింటి అర్థాలు ఒకటే.

  • హీబ్రూ పదం "మృతుల లోకం" పాత నిబంధనలో సాధారణంగా మరణ స్థలం చెప్పడానికి తరచుగా ఉపయోగిస్తారు.
  • కొత్త నిబంధనలో, గ్రీకు పదం "పాతాళం" అనేది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆత్మలుండే స్థలాన్ని సూచిస్తున్నది. ఈ ఆత్మలు పాతాళంలోకి "దిగి పోతారు." కొన్ని సార్లు ఇది పరలోకానికి “ఎక్కి పోవడానికి” భిన్నమైనదిగా చెప్పారు. యేసుపై విశ్వసించిన వారి ఆత్మలు అక్కడ ఉంటాయి.
  • "పాతాళం," "మరణం" ఈ రెంటికీ ప్రకటన గ్రంథంలో సంబంధం ఉంది. అంత్య కాలంలో, రెండవ మరణం, పాతాళం ఈ రెంటినీ నరకం అనే అగ్ని సరస్సులో పడవేస్తారు.

అనువాదం సలహాలు

  • పాత నిబంధన పదం "మృతుల లోకం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మృతుల స్థలం” లేక “చనిపోయిన ఆత్మలు ఉండే స్థలం." కొన్ని అనువాదాల్లో "గుంట” లేక “మరణం,"అని సందర్భాన్ని బట్టి తర్జుమా చేశారు.
  • దీన్ని కొత్త నిబంధన పదం "పాతాళం" అని కూడా తర్జుమా చెయ్యవచ్చు. "విశ్వసించని మృతుల ఆత్మలు ఉండే చోటు” లేక “మృతుల చిత్ర హింస స్థలం” లేక “విశ్వసించని మృతుల స్థలం."
  • కొన్ని అనువాదాలు "మృతుల లోకం” “పాతాళం," అని లక్ష్య భాష సంప్రదాయాన్ని బట్టి ఉపయోగిస్తాయి. (చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా).
  • ఒక్కొక్క పదాన్ని వివరిస్తూ కూడా అనువదించ వచ్చు. ఉదాహరణకు "మృతుల లోకం, చనిపోయిన వారు ఉండే స్థలం” “పాతాళం, మృత్యు లోకం."

(అనువాదం సలహాలు: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: మరణం, పరలోకం , నరకం , సమాధి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7585, G86

పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం

నిర్వచనం:

“పాపం” అనే పదం దేవుని చిత్తానికీ, ధర్మాలకూ విరుద్ధముగా చేసే చర్యలనూ, ఆలోచనలనూ, మాటలనూ సూచిస్తుంది. దేవుడు మనలను చేయమని కోరినదానిని చెయ్యకుండా ఉండడం అని కూడా ఈ పదం సూచిస్తుంది.

  • దేవునికి లోబడకుండా ఉండే పనులూ లేదా దేవుణ్ణి సంతోషపరచకుండా ఉంచే పనులు, ఇతర ప్రజలకు తెలియ విషయాలు సహితం ఏమైనా అవి పాపం అని పరిగణించబడుతాయి
  • దేవుని చ్తితానికి విరుద్ధమైన ఆలోచనలూ, క్రియలూ “పాపభూయిష్టమైనవి.”
  • ఆదాము పాపము చేసినందున సమస్త మనుష్యులందరూ “పాప స్వభావంతో” పుట్టారు. ఆ స్వభావం వారిని నియంత్రించి, వారు పాపము చేయడానికి కారణం అవుతుంది.
  • “పాపి” అంటే పాపాలు చేసే వ్యక్తి అని అర్థం. అందుచేత ప్రతీ మనుష్యుడు పాపియైయున్నాడు.
  • కొన్నిమార్లు “పాపులు” అనే పదం ధర్మశాస్త్రమునకు లోబడని ప్రజలనూ, తాము భావించిన ప్రజలనూ సూచించడానికి పరిసయ్యుల వంటి మతసంబంధమైనవారి చేత ఉపయోగించబడింది.
  • “పాపి” అనే పదం ఇతర ప్రజలకంటే అతి హీనమైన ప్రజల కోసం కూడా ఉపయోగించబడింది. ఉదాహరణకు, ఈ బిరుదు ఎక్కువగా సుంకం వసూలు చేసేవారికీ, వ్యభిచారులలూ ఇవ్వబడింది.

అనువాదం సూచనలు:

  • “పాపం” అనే పదం “దేవునికి అవిధేయత” లేదా “దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం" లేదా "దుష్టప్రవర్తన, దుష్టతలంపులు" లేదా "చెడు క్రియలు" అని అనువదించబడవచ్చు.
  • “పాపం" పదం “దేవునికి అవిధేయత” లేదా “తప్పు చేయడం” అని కూడా అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, “పాపభూయిష్టమైన” అనే పదం “పూర్తిగా చెడు చెయ్యడం" లేదా "దుష్టత్వం" లేదా చేయుట” లేక “దుష్టత్వము” లేక “అనైతికత” లేక “చెడు” లేక “దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి “పాపి” అనే పదం “పాపములు చేయు వ్యక్తి” లేదా “తప్పులు చేయు వ్యక్తి” లేదా "దేవుని అవిధేయత చూపించే వ్యక్తి” లేదా “ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకొనే వ్యక్తి” అని అర్థం వచ్చే వాక్యాలతో గాని లేదా పదాలతోగానీ అనువదించబడవచ్చు.
  • “పాపులు” అనే పదం “అత్యంత పాపాత్ములైన ప్రజలు” లేదా “పాపాత్ములుగా పరిగణించబడిన ప్రజలు” లేదా “అనైతిక ప్రజలు” అనే అర్థం వచ్చే వాక్యాలతో గానీ లేదా పదాలతోగానీ అనువదించబడవచ్చు.
  • “సుంకం వసూలు చేసేవారు, పాపులు" పదం అనువాదంలో “ప్రభుత్వం కోసం డబ్బును పోగుచేసేవారు, పాపాత్ములైన ఇతర ప్రజలు" లేదా అత్యంత పాపాత్ములైన ప్రజలు, సుంకం వసూలు చేసేవారు సహితం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • ఈ పదం అనువాదంలో పాప సంబంధమైన ప్రవర్తన, ఆలోచనలూ, ఇతర వ్యక్తులు చూడని, లేదా యెరుగని సంగతులను గురించి కూడా తెలియచేసేవిధంగా ఉండేలా చూడండి.
  • “పాపం” పదం సాధారముగా ఉండాలి, "దుష్టత్వం," "చెడు” అనే పదాలకు భిన్భినంగా ఉండాలి.

(చూడండి: అవిధేయత, చెడు, శరీరము, సుంకం వసూలు చేసేవాడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 03:15 “ప్రజలు పాపపు క్రియలు చేయుటనుబట్టి నేను ఇక ఎన్నటికి నేలను శపించను, లేక ప్రజలు పాపాత్ములుగా ఉన్నప్పటికీ ప్రళయము చేత వారిని నాశనం చేయను అని వాగ్దానము చేయుచున్నాను” అని దేవుడు చెప్పాడు.
  • 13:12 వారు పాపము చేసినందున, దేవుడు వారి విషయమై చాలా కోపపడి, వారిని నాశనము చేయాలని ప్రణాళిక చేశాడు.
  • 21:01 ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యములు దేవునికి విరుద్ధముగా పాపము చేసియున్నాయి. దేవుడు సీనాయి వద్ద ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను వారు ఉల్లంఘించారు.
  • 21:13 మెస్సీయ పరిపూర్ణుడైయుండును, ఆయనయందు ఎటువంటి పాపము ఉండదని అని ప్రవక్తలు కూడా చెప్పారు. ఆయన ప్రజల పాపాల కొరకై శిక్షను భరించడానికి చనిపోయాడు.
  • 35:01 ఒక రోజున యేసు అనేక సుంకపు గుత్తాదారులకు మరియు ఆయన బోధను వినడానికి వచ్చిన అనేకమంది పాపులకు బోధించుచుండెను.
  • 38:05 యేసు గిన్నె ఎత్తికొని, “దీనిని త్రాగుడి. ఇది పాపముల నిమిత్తమై క్షమాపణ కొరకు చిందించబడే క్రొత్త నిబంధన సంబంధమైన నా రక్తమైయున్నది” అని చెప్పాడు.
  • 43:11 “మీలో ప్రతియొక్కరు పశ్చాత్తాపపడి, యేసు నామమున బాప్తిస్మము పొందవలెను, తద్వారా దేవుడు మీ పాపములను క్షమించును” అని పేతురు వారికి జవాబిచ్చాడు.
  • 48:08 మన పాపముల కొరకు మనమందరము చనిపోవలసినవారమైయున్నాము!
  • 49:17 మీరు క్రైస్తవులైనప్పటికి, మీరు పాపము చేయడానికి మీరు శోదించబడతారు. అయితే దేవుడు నమ్మదగినవాడు మరియు మీరు మీ పాపములను ఒప్పుకొనినట్లయితే, ఆయన మిమ్మును క్షమించును. మీరు పాపానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆయన మీకు బలమును ఇచ్చును.

పదం సమాచారం:

  • Strong's: H817, H819, H2398, H2399, H2400, H2401, H2402, H2403, H2408, H2409, H5771, H6588, H7683, H7686, G264, G265, G266, G268, G361, G3781, G3900, G4258

పిలుపు, పిలుపులు, పిలుపు, పిలిచాడు

నిర్వచనం:

"పిలుపు” “బయటకు పిలుపు"అంటే దేన్నైనా ఎవరినైనా గట్టిగా పిలవడం. "పిలవడం"అంటే ఎవరినైనా పేరుపెట్టి రమ్మనడం. దీనికి ఇతర అర్థాలు కూడా ఉన్నాయి.

  • "బయటికి పిలవడం"అంటే ఎవరినైనా గట్టిగా పిలిచి, అరిచి చెప్పడం. దీనికి ఈ అర్థం కూడా ఉంది. ఎవరినైనా ముఖ్యంగా దేవుణ్ణి సాయం కోసం అడగడం.
  • తరచుగా బైబిల్లో, "పిలుపు"అనే దాని అర్థం "రప్పించు” లేక “రమ్మని ఆజ్ఞ ఇచ్చు” లేక “రమ్మని అడుగు."
  • దేవుడు ప్రజలను తన ప్రజలుగా ఉండమని పిలుపునిస్తున్నాడు. అది వారి "పిలుపు."
  • దేవుడు మనుషులకు "పిలుపు"ఇచ్చినప్పుడు వారు దేవునిచే నియమించ బడిన తన పిల్లలుగా, సేవకులుగా ఎన్నుకోబడిన ప్రజలుగా యేసు మూలంగా కలిగే తన రక్షణ సందేశం ప్రకటించే వారుగా అవుతారు.
  • ఈ పదాన్ని ఎవరికైనా పేరు పెట్టే సందర్భంలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, "అతని పేరు యోహాను అని పిలిచారు,"అంటే, "అతడు యోహాను అనే పేరు గలవాడు” లేక “తన పేరు యోహాను"అని అర్థం.
  • "పేరుతొ పిలవడం"అంటే ఎవరినైనా వేరొకరి పేరుతో పిలవడం. దేవుడు తన ప్రజలను తన పేరుతో పిలిచాడు.
  • మరొక మాట, "నేను నిన్ను పేరుతొ పిలిచాను"అంటే దేవుడు ఇదమిద్ధంగా ఒక మనిషిని ఎన్నుకొన్న విషయం.

అనువాదం సలహాలు:

  • ఈ "పిలుపు"అనే దాన్ని ఒక పదంతో అనువదించ వచ్చు. "పని అప్పగించు,"ఇందులో కావాలని ఒక ఉద్దేశంతో పిలుపునివ్వడం.
  • "నీకు మొర్ర పెట్టాను"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నీ సహాయం కోసం అడిగాను” లేక “అత్యవసరంగా నిన్ను ప్రార్థించాను."
  • దేవుడు "పిలిచాడు" మనలను తన సేవకులుగా పిలిచాడు అని బైబిల్ చెప్పినప్పుడు దాన్ని ఇలా అనువదించవచ్చు. "మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు.” లేక “తన సేవకులుగా మనలను నియమించాడు.”
  • "నీవు అతన్ని ఈ పేరుతో పిలవాలి"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు., "నీవు అతనికి పేరు పెట్టాలి."
  • "తన పేరు పిలిచాడు"అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తన పేరు ఇది.” లేక “అతడు పేరు పెట్టాడు."
  • "బయటికి పిలుపునివ్వడం" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "గట్టిగా పిలవడం” లేక “అరవడం” లేక “పెద్ద స్వరంతో పిలవడం." దీని అనువాదం ఒక వ్యక్తి కోపగించుకున్నట్టుగా ధ్వనించకుండా జాగ్రత్తపడండి.
  • "నీ పిలుపు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నీ ఉద్దేశం” లేక “మీ కోసం దేవుని ఉద్దేశం” లేక “మీకోసం దేవుని ప్రత్యేకమైన పని."
  • "ప్రభువు పేరున పిలుపు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రభువుకేసి చూసి ఆయనపై ఆధారపడండి,” లేక “ప్రభువుపై నమ్మకముంచి ప్రభువుకు లోబడు."
  • "దేనికోసమైనా పిలుపు"అనే మాటను ఇలా అనువదించ వచ్చు. "అధికారికంగా అడుగు” లేక “కోరు” లేక “ఆజ్ఞ ఇచ్చు."
  • "నా పేరుతొ నిన్ను పిలిచాను"అనే మాటను ఇలా అనువదించ వచ్చు, "నీకు నా పేరు ఇచ్చాను, నీవు నాకు చెందిన వాడివని కనపరిచాను."
  • దేవుడు, "నిన్ను పేరు పెట్టి పిలిచాను," అన్నప్పుడు ఇలా అనువదించ వచ్చు, "నిన్ను ఎరిగి నిన్ను ఎన్నుకున్నాను."

(చూడండి: ప్రార్థించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H559, H2199, H4744, H6817, H7121, H7123, G154, G363, G1458, G1528, G1941, G1951, G2028, G2046, G2564, G2821, G2822, G2840, G2919, G3004, G3106, G3333, G3343, G3603, G3686, G3687, G4316, G4341, G4377, G4779, G4867, G5455, G5537, G5581

పిల్లలు, బిడ్డ, సంతానం

నిర్వచనం:

"బిడ్డ" పదం ("పిల్లలు" బహువచనం) ఒక స్త్రీ పురుషుల సంతానాన్ని సూచిస్తుంది. ఈ పదం సాధారణంగా వయసులో చిన్నవానినీ, ఇంకా పూర్తిగా ఎదగని యువజనునీ సూచించడానికి తరచుగా ఉపయోగించబడింది. "సంతానం" పదం ప్రజలు లేదా జంతువుల జీవసంబంధమైన సంతతి వారిని సాధారణంగా సూచిస్తుంది.

  • బైబిలులో, శిష్యులూ, వెంబడించే వారు కొన్నిసార్లు "పిల్లలు" అని పిలువబడ్డారు.
  • "పిల్లలు"అనే పదం తరచుగా ఒక వ్యక్తి సంతానాన్ని సూచిస్తూ ఉపయోగించబడింది.
  • "విత్తనం" పదం కొన్నిసార్లు సంతానానికి చిత్ర రూపకంగా చూపించడానికి ఉపయోగించబడింది.
  • బైబిలులో తరచుగా "సంతానం" అనే పదం "పిల్లలు" లేదా "సంతానం" అని ఒకే అర్థాన్ని కలిగియుంది.
  • "పిల్లలు" పదం ఏదైనా ఒకదాని గుణలక్షణాలు కలిగియున్నట్టు సూచించవచ్చు.

కొన్ని ఉదాహరణలు ఇలా ఉంటాయి:

  • వెలుగు పిల్లలు.

  • విధేయత పిల్లలు.

  • సాతాను పిల్లలు.

  • ఈ పదం సంఘాన్ని సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, కొన్నిసార్లు కొత్త నిబంధన యేసునందు విశ్వాసం ఉంచిన ప్రజలను "దేవుని పిల్లలు" అని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • "పిల్లలు"అనే పదం ఒక వ్యక్తి మునుమనవళ్ళను లేదా గొప్ప మునుమనవళ్ళను మొదలైన వారిని సూచిస్తున్నప్పుడు "సంతానం" అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, "పిల్లలు" అనే పదాన్ని "లక్షణాలు కలిగియున్నవ్యక్తులు" లేదా "వారిలా ప్రవర్తించే వ్యక్తులు" అని అనువదించవచ్చు.
  • సాధ్యమైనంత వరకు "దేవుని పిల్లలు" పదం అక్షరాలా అనువదించబడవచ్చు ఎందుకంటే దేవుడు మన పరలోకపు తండ్రి అనేది బైబిలులో ప్రాముఖ్యమైన అంశం. "దేవునికి చెందిన వ్యక్తులు" లేదా "దేవుని ఆత్మీయ పిల్లలు" అనేది సాధ్యమైన అనువాదం.
  • యేసు తన శిష్యులను "పిల్లలు,"అని పిలిచినప్పుడు ఇది "ప్రియమైన స్నేహితులు" లేదా "నా ప్రియమైన శిష్యులు" అని కూడా అనువదించబడవచ్చు.
  • పౌలు, యోహాను యేసు నందు విశ్వాసులను "పిల్లలు" అని సూచించినప్పుడు ఇది "ప్రియమైన సహా విశ్వాసులు" అని కూడా అనువదించబడవచ్చు.
  • "వాగ్దాన పుత్రులు” అనే వాక్యం "దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందిన ప్రజలు" అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: సంతతి వాడు, విత్తనం, వాగ్దానం, కుమారుడు, ఆత్మ, విశ్వసించు, ప్రియమైన)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H7908, H7909, H7921, G730, G815, G1025, G1064, G1471, G3439, G3515, G3516, G3808, G3812, G3813, G3816, G5040, G5041, G5042, G5043, G5044, G5206, G5207, G5388

పునరుత్థానము

నిర్వచనము:

“పునరుత్థానము” అనే ఈ పదము చనిపోయిన తరువాత తిరిగి బ్రతికి వచ్చే క్రియను సూచించును.

  • ఎవరైనా పునరుత్థానము చెందుట అనగా ఆ వ్యక్తిని తిరిగి సజీవుడగునట్లు చేయుట అని అర్థము. కేవలము దేవుడు మాత్రమె దీనిని చేయగల సమర్థుడు.
  • “పునరుత్థానము” అనే ఈ మాట అనేకమార్లు యేసుక్రీస్తు చనిపోయిన తరువాత ఆయన తిరిగి సజీవుడైన విధమును గూర్చి తెలియజేయును.
  • “నేనే జీవమును మరియు పునరుత్థానమును” అని యేసు చెప్పిన మాటకు అర్థము ఏమనగా, ఆయనే పునరుత్థానము చెందుటకు ఆధారము మరియు ప్రజలకు తిరిగి జీవమును ప్రసాదించుటకు ఆధారమునైయున్నాడు.

తర్జుమా సలహాలు:

  • ఒక వ్యక్తి “పునరుత్థానము’ అనే ఈ మాటను అతను “తిరిగి జీవమును పొందియున్నాడు” లేక అతను “చనిపోయిన తరువాత తిరిగి జీవమును కలిగియుండుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఈ వాక్యము యొక్క అక్షరార్థము ఏమనగా “పైకి లేపుట” లేక “(మరణమునుండి) పైకి లేపే క్రియ” అని అర్థము. ఈ పదమును అనువాదము చేయుటకు ఇవన్నియు ఇతర విధానములుగా పరిగణించవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: జీవము, మరణము, లేపుట)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 21:14 మెస్సయ్యా మరణ పునరుత్థానముల ద్వారా, దేవుడు పాపులను రక్షించి, క్రొత్త నిబంధనను ఆరంభించుటకు తన ప్రణాళికను సంపూర్తి చేయును.
  • 37:05నేను జీవమును మరియు పునరుత్థానమునైయున్నాను” అని యేసు చెప్పెను. నాయందు విశ్వసించిన ప్రతియొక్కరు మరణించినను వారు జీవించుదురు.

పదం సమాచారం:

  • Strong's: G386, G1454, G1815

పునరుద్దరించుట, పునరుద్ధరించును, పునరుద్ధరించబడెను, సమాధానపరచబడుట

నిర్వచనము:

“పునరుద్దరించుట” మరియు “సమాధానపరచబడుట” అనే ఈ రెండు మాటలు శత్రువులుగా భావించుకొనే ఇద్దరు వ్యక్తుల మధ్యన “సమాధానపరచుటను” సూచించును. “సమాధానపరచుట” అనగా సమాధానపరిచే క్రియయైయున్నది.

  • పరిశుద్ధ గ్రంథములో ఈ పదము సాధారణముగా దేవుడు తననుతాను తన ప్రజలతో తన కుమారుడైన యేసు క్రీస్తు బలియాగము ద్వారా సమాధానపరచుకొనును.
  • పాపమునుబట్టి మనుష్యులందరు దేవుని శత్రువులైయున్నారు. అయితే ఆయన కనికర ప్రేమనుబట్టి, దేవుడు యేసు ద్వారా తనతో సమస్త జనములు సమాధానపరచబడు మార్గమును అనుగ్రహించియున్నాడు.
  • వారి పాపములకు క్రయధనముగా యేసు బలియాగమునందు నమ్మికయుంచుట ద్వారా ప్రజలందరు క్షమాపణ పొందుదురు మరియు దేవునితో సమాధానమును కలిగియుందురు.

తర్జుమా సలహాలు:

  • “పునరుద్ధరిద్దరించబడుట” అనే ఈ మాటను “సమాధానపరచుట” లేక “సరియైన మంచి సంబంధములను పునర్మించుట” లేక “స్నేహితులగుటకు కారణమగుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “సమాధానపరచబడుట” అనే ఈ పదమును “సరియైన సంబంధములను పునర్మించుట” లేక “సమాధానపరచుట” లేక “శాంతికరమైన విషయాలకు కారణమగుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: సమాధానము, బలియాగము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2398 , H3722 , G604 , G1259 , G2433 , G2643, G2644

పునర్ స్థాపించు, పునర్ స్థాపించును, పునర్ స్థాపించబడెను, పునర్ స్థాపనము

నిర్వచనము:

“పునర్ స్థాపించు” మరియు “పునర్ స్థాపనము” అనే మాటలు ఏదైనా తన పూర్వ స్థితికి తిరిగి వచ్చుటను మరియు ఉత్తమ స్థితియందు ఉండుటను సూచిస్తుంది.

  • రోగగ్రస్తమైన శరీర అవయవమును పునర్ స్థాపించినప్పుడు, దాని అర్థము అది “స్వస్థతపొందినది” అని అర్థమునైయున్నది.
  • పునర్ స్థాపించబడిన సంబంధము “సమాధానపరచబడియున్నది.” దేవుడు పాపసంబంధమైన ప్రజలను పునర్ స్థాపించును మరియు వారిని ఆయన వద్దకు తిరిగి రప్పించుకొనును.
  • ప్రజల తమ స్వంత దేశమునందు పునర్ స్థాపించబడినట్లయితే, వారు ఆ దేశమునాకు “తిరిగి వచ్చారు” లేక “వెనక్కి తీసుకు రాబడియున్నారు” అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, “పునర్ స్థాపించు” అనే మాటను తర్జుమా చేయు విధానములో “పునరుద్ధరణ” లేక “తిరిగి చెల్లించుట” లేక “తిరిగి వచ్చుట” లేక “స్వస్థత” లేక “వెనక్కి తిరిగి వచ్చుట” అనే మాటలను కూడా ఉపయోగించుదురు.
  • ఈ మాటకు ఇతర మాటలను మనము చూచినట్లయితే, “క్రొత్తదిగా చేయు” లేక “మరొకమారు క్రోత్తదానివలె చేయుము” అనే మాటలను వినియోగిస్తారు.
  • ఆస్తిపాస్తులు తిరిగి “పునర్ స్థాపించబడినప్పుడు”, అది దానికి సంబంధించిన యజమానునికి “సరిచేయబడినది” లేక “తిరిగి ఇవ్వబడినది” లేక “వెనక్కి ఇవ్వబడినది” అని అర్థము.
  • సందర్భానుసారముగా, “పునర్ స్థాపనము” అనే ఈ మాటను “పునరుద్ధరణ” లేక “స్వస్థపరచబడుట” లేక “సమాధానపరచబడుట” అని కూడా తర్జుమా చేయుదురు.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7725, H7999, H8421, G600, G2675

పులియని రొట్టె

నిర్వచనము:

“పులియని రొట్టె” అనునది “పులియనిపదార్థముకలిగినదానితో” గాని లేదా “ఏ ఇతర పులియని పదార్థముతో” గాని చేయబడనిదానికి సూచనగా ఉన్నది. ఈ విధమైన రొట్టె పొంగదు ఎందుకంటే దీనిలో పొంగచేసే పులియనిపదార్థము ఏది ఉండదు.

  • దేవుడు ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రయేలీయులను బయటికిరప్పించినప్పుడు, వారి రొట్టెలు పొంగేవరకు ఎదురుచూడకుండా త్వరగా ఐగుప్తును విడిచి పారిపొమ్మని వారికీ ఆజ్ఞాపించెను. అందువలన వారు పులియనిరొట్టెలను భుజించారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం వారు ఐగుప్తునుండి విడిపింపబడినదానికి గుర్తుగా పస్కా పండుగలో ఈ పులియని రొట్టెలను తినేవారు.
  • పులియుట అనునది పాపమునకు గుర్తుగా ఉంది కావున, “పులియని రొట్టె” ఆనేది ఒక వ్యక్తి తన జీవితంనుండి పాపమును తీసివేసుకొని దేవున్ని ఘనపరచడాన్ని సూచిస్తుంది.

తర్జుమా సలహాలు:

  • ఇంకా కొన్ని అనువాదాలలో ఈ పులియుట అనేపదం “పులియని పదార్థం కలుపబడని రొట్టె ” లేదా “పొంగని రొట్టె” అని చెప్పబడింది.
  • “పులిసేగుణంలేని పదార్థం, పులియని పదార్థం” అనేదానిని ఎలా అనువదించాలి అనేది ఈ పదం యొక్క అనువాదంలో స్థిరముగా నిర్ధారించారు.
  • కొన్ని సందర్భాలలో, “పులియని రొట్టె” ను “పులియని రొట్టెల పండుగ” అని కూడా అనువదించవచ్చు.

(దీనిని చూడండి: రొట్టె, ఐగుప్తు, విందు, పస్కా పండుగ , దాసుడు, పాపము, ఈస్టు)

బైబిల్ వచనములు:

పదం సమాచారం:

  • Strong's: H4682, G106

పెంతకోస్తు, వారముల పండుగ

వాస్తవాలు:

“వారముల పండుగ” అనునది పస్క పండుగ అయినతరువాత యాభై రోజులకు చేసే యూదుల పండుగయైయున్నది. దీనిని తరువాత కాలములో “పెంతకోస్తు” అని సూచించిరి.

  • వారముల పండుగ అనునది ప్రథమ ఫలముల పండుగయైన తరువాత ఏడు వారములకు (యాభై రోజులు) సంబంధించినదియైయున్నది. క్రొత్త నిబంధన కాలములో ఈ పండుగను “పెంతకోస్తు” అని పిలిచిరి, ఈ పేరునకు “యాభై” అని అర్థము కలదు.
  • వారముల పండుగ అనునది ధాన్యపు కోతకాలము యొక్క ఆరంభమును ఆచరించుటకు పెట్టటమైనది. ఈ సమయములోనే దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలియులకు మొట్ట మొదటిగా ధర్మశాస్త్రమును రెండు పలకల మీద ఇచ్చినదానిని గుర్తుచేయుచున్నది.
  • క్రొత్తనిబంధనలో పెంతెకోస్తు రోజు అనునది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది, ఎందుకనగా ఈ రోజుననే యేసు విశ్వాసులందరూ ఒక వినూతనమైన రీతిలొ పరిశుద్ధాత్మను పొందుకొనియున్నారు.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేలాలి)

(ఈ పదాలను కూడా చూడండి: పండుగ, ప్రథమ ఫలములు, కోత, పరిశుద్ధాత్ముడు, లేవనెత్తడం)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H2282, H7620, G4005

పేరు

నిర్వచనం:

“పేరు” (నామం) అనే పదం ఒక నిర్దిష్టమైన వ్యక్తి లేదా వస్తువు పిలువబడే పదాన్ని సూచిస్తుంది. అయితే బైబిలులో "పేరు" పదం అనేక భిన్నమైన అంశాలను సూచించడానికి అనేక భిన్నమైన విధానాలలో ఉపయోగించబడింది.

  • “కొన్ని సందర్భాలలో "పేరు" పదం "మన కోసం పేరు సంపాదించుకొందాము" అనే వాక్యంలో ఉన్నట్లు వ్యక్తి ప్రసిద్ధిని సూచిస్తుంది.
  • ”పేరు” అంటే ఒకదాని జ్ఞాపకం అని కూడా సూచిస్తుంది. ఉదాహరణకు, “విగ్రహాల పేర్లను కొట్టివేయండి” అంటే వాటి జ్ఞాపకం లేకుండా, ప్రజలు వాటిని పూజించకుండా ఆ విగ్రహాలను నాశనం చెయ్యండి అని అర్థం.
  • ”దేవుని పేరున” మాట్లాడుతున్నాను అంటే ఆయన శక్తితోనూ, ఆయన అధికారంతోనూ లేదా ఆయన ప్రతినిధిగా మాట్లాడుతున్నాను అని అర్థం.
  • “ఆకాశం క్రింద మరి యే నామమున మనం రక్షణ పొందలేము” అనే వాక్యంలో ఉన్నట్టు ఒకని “పేరు” అతని పూర్తి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

(చూడండి: అన్యాపదేశం)

అనువాదం సూచనలు:

“ఆయన మంచి పేరు” లాంటి మాటను “ఆయన మంచి కీర్తి” అని అనువదించబడవచ్చు.

  • ”పేరులో” దేనినైనా చెయ్యడం అనే మాటను “అధికారంతో” లేదా “అనుమతితో” లేదా ఆ వ్యక్తి “ప్రతినిధిగా” చెయ్యడం అని అనువదించబడవచ్చు.
  • ”మనకోసం పేరు సంపాదించుకొందము” అనే వాక్యం “అనేకులు మనల్ని తెలుసుకొనేలా చేసుకొందాం” లేదా “మనం ప్రాముఖ్యం అని అనేకమంది తలంచేలా చేసుకొందాం” అని అనువదించబడవచ్చు.
  • ”ఆయన పేరున ప్రార్థించండి” అనే వాక్యం “పేరును పిలవండి” లేదా “ఆయనకు పేరునివ్వండి” అని అనువదించబడవచ్చు.
  • ”నీ పేరును ప్రేమించువారు” అనే వాక్యం “నిన్ను ప్రేమించువారు” అని అనువదించబడవచ్చు.
  • ”విగ్రహాల పేర్లు కొట్టివెయ్యండి” అనే వాక్యం “వాటిని జ్ఞాపకంలోనికి తెచ్చుకొనకుండా అన్య విగ్రహాలను నాశనం చెయ్యండి” లేదా “అబద్ధపు దేవుళ్ళను ఆరాధించకుండ మనుష్యులను నిలువరించండి” లేదా “మనుష్యులు వాటిని గురించి ఇకమీదట తలంచకుండా విగ్రహాలన్నిటిని పూర్తిగా నాశనం చెయ్యండి” అని అనువదించబడవచ్చు.

(చూడండి: పిలుపు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5344, H7121, H7761, H8034, H8036, G2564, G3686, G3687, G5122

ప్రతిష్ట

నిర్వచనం:

పదాలు "ప్రతిష్ట" "ప్రతిష్ట కలిగించడం” అంటే ఎవరికైనా నైనా గౌరవం, ప్రతిష్ట, లేక మన్నన కలిగించడం.

  • ప్రతిష్ట ను సాధారణంగా రాజు, దేవుడు వంటి ఎవరైనా ఉన్నత హోదా, ప్రాధాన్యత ఉన్న వారికి ఇస్తారు.
  • దేవుడు క్రైస్తవులు ఇతరులకు ప్రతిష్ట కలిగించాలని దేవుడు చెప్పాడు.
  • పిల్లలు వారి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, అంటే వారికి లోబడడం ద్వారా గౌరవించాలి.
  • "ప్రతిష్ట” “మహిమ" అనే పాదాలను తరచుగా కలిపి ఉపయోగిస్తారు, ముఖ్యంగా యేసును గురించి చెప్పేటప్పుడు. ఒకే దాన్ని రెండు రకరకాలుగా చెప్పడం.
  • దేవుణ్ణి ఘన పరచడం అంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన్ను స్తుతిస్తూ ఆయనకు లోబడం ద్వారా గౌరవం చూపుతూ అయన ఘనతను ప్రతిబింబించే విధంగా జీవిస్తూ ఉండాలి.

అనువాదం సలహాలు:

  • అనువదించడంలో ఇతర పద్ధతులు. "గౌరవం” లేక “ప్రఖ్యాతి” లేక “ఉన్నత స్థితి."
  • "ప్రతిష్ట" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రత్యేక గౌరవం చూపడం” లేక “స్తుతి కలిగేలా చెయ్యడం” లేక “ఉన్నతమైన మన్నన కలిగేలా” లేక “గొప్ప విలువ."

(చూడండి: అప్రతిష్ట, మహిమ, మహిమ, స్తుతి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1420, H1921, H1922, H1923, H1926, H1927, H1935, H2082, H2142, H3366, H3367, H3368, H3372, H3373, H3374, H3444, H3513, H3519, H3655, H3678, H5081, H5375, H5457, H6213, H6286, H6437, H6942, H6944, H6965, H7236, H7613, H7812, H8597, H8416, G820, G1391, G1392, G1784, G2151, G2570, G3170, G4411, G4586, G5091, G5092, G5093, G5399

ప్రత్యక్ష గుడారం

నిర్వచనం:

ప్రత్యక్ష గుడారం అనేది ఒక ప్రత్యేకమైన గుడారం వంటి నిర్మాణం. అక్కడ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల ఎడారిలో ప్రయాణించిన కాలంలో ఎడారిలో దేవుణ్ణి ఆరాధించారు.

  • దేవుడు ఇశ్రాయేలీయులకు వివరంగా సూచనలు ఇచ్చాడు. పెద్ద గుడారం నిర్మించాలి. అందులో రెండు గదులు ఉండి, దానిచుట్టూ బయటి అవరణ ఉండాలి.
  • ఇశ్రాయేలీయులు ఎడారిలో వివిధస్థలాలు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి చోటా యాజకులు ప్రత్యక్ష గుడారాన్ని వారి మరుసటి మజిలీకి మోసుకుపోతారు. తరువాత వారు మరలా వారి కొత్త మజిలీ మధ్య భాగంలో దాన్ని నిలబెడతారు.
  • ప్రత్యక్ష గుడారాన్ని కలప ఫ్రేములతో కట్టి గుడ్డ, మేక వెంట్రుకలు, జంతువుల చర్మాలతో చేసిన తెరలతో కప్పుతారు. బయటి ఆవరణం చుట్టూ తెరలు గోడలుగా ఉపయోగ పడతాయి.
  • ప్రత్యక్ష గుడారం రెండు భాగాలు పరిశుద్ధ స్థలం (అక్కడ సాంబ్రాణి వేసే బలిపీఠం ఉంది), అతి పరిశుద్ధ స్థలం (అక్కడ నిబంధన మందసం ఉంచారు).
  • ప్రత్యక్ష గుడారం ఆవరణలో దహన బలిపీఠం ఉంది. అక్కడ హోమం చేసే జంతుబలి అర్పణలు ఆచార రీతిగా కడిగే నీరు ఉన్న గంగాళం ఉంది.
  • యెరూషలేములో సొలోమోను ఆలయం నిర్మించాక ప్రత్యక్ష గుడారం ఉపయోగించడం ఇశ్రాయేలీయులు మానుకున్నారు.

అనువాదం సలహాలు:

  • "ప్రత్యక్ష గుడారం" అంటే "నివాస స్థలం." అనువదించడంలో ఇతర పద్ధతులు, "శుద్ధగుడారం” లేక “దేవుడు నివసించే గుడారం” లేక “దేవుని గుడారం."
  • ఈ పదం అనువాదం "ఆలయం"ను సూచించే పదాలకు భిన్నంగా ఉండేలా చూసుకోండి.

(చూడండి: బలిపీఠం, ధూప బలిపీఠం, నిబంధన మందసం, ఆలయం, గుడారం of సమావేశం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H168, H4908, H5520, H5521, H5522, H7900, G4633, G4634, G4636, G4638

ప్రత్యేకించండి

నిర్వచనము:

“ప్రత్యేకించండి” అనే ఈ మాటకు ఒక నిర్దిష్టమైన ఉద్దేశమును నెరవేర్చుటకు ప్రత్యేకించుట అని అర్థము. దేనినైనను లేక ఎవరినైనా ఒకరిని “ప్రత్యేకించుట” అనగా దానిని లేక ఆ వ్యక్తిని “ప్రక్కకు పెట్టుట” అని అర్థము.

  • ఇశ్రాయెలీయులు దేవుని సేవకొరకు ప్రత్యేకించబడిరి.
  • దేవుడు పౌలును మరియు బర్నబాను చేయమనిన పనికొరకు వారిని ప్రత్యేకించుడి అని పరిశుద్ధాత్ముడు క్రైస్తవులకు ఆజ్ఞాపించెను.
  • దేవుని సేవకొరకు “ప్రత్యేకించబడిన” విశ్వాసి దేవుని చిత్తమును నెరవేర్చుటకు “సమర్పించబడియున్నాడు”.
  • “పరిశుద్ధత” అనే పదమునకున్న అనేక అర్థములలో దేవునికి సంబంధించి యుండుటకు ప్రత్యేకించబడియుండుట మరియు లోక పాప మార్గములనుండి వేరు చేయబడుట అని అర్థము.
  • ఒకరిని “పవిత్రీకరించుట” అనగా దేవుని సేవకొరకు ఆ వ్యక్తిని ప్రత్యేకించుట అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • “ప్రత్యేకించు” అనే పదమును తర్జుమా చేయు అనేక విధానములలో “విశేషముగా ఎన్నుకొనుట” లేక “మీ మధ్యనుండి ప్రత్యేకించుట” లేక “విశేషమైన పనికొరకు ప్రక్కకు తీసి ఏర్పరచుకొనుట” అనే మాటలను కూడా చేర్చుదురు.
  • “ప్రత్యేకింఛబడియుండుట” అనే ఈ మాటను “దేనినుండైనా వేరు చేయబడుట” లేక “(దేనికొరకైన) విశేషముగా నియమించబడుట” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: పరిశుద్ధత, పరిశుద్ధపరచబడుట, నియమించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2764, H4390, H5674, H6918, H6942, H6944, G37, G38, G40, G873

ప్రధాన యాజకుడు

నిర్వచనం:

"ప్రధాన యాజకుడు" అంటే ఇశ్రాయేలు యాజకుల నాయకుడుగా ఒక సంవత్సరం పటు నియమించ బడిన ప్రత్యేక యాజకుడు.

  • ప్రధాన యాజకునికి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అతడు ఒక్కడే ఆలయం అతి పరిశుద్ధ భాగం లోకి ప్రత్యేక బలి అర్పణ కోసం సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళగలడు.
  • ఇశ్రాయేలీయులకు అనేకమంది యాజకులున్నారు. అయితే ఒక సమయంలో ఒక ప్రధాన యాజకుడు మాత్రమే ఉంటాడు.
  • యేసును బంధించినప్పుడు కయప అధికారిక ప్రధాన యాజకుడు. కయప మామ అన్న పేరుకూడా కొన్ని సార్లు ప్రస్తావించబడింది. ఎందుకంటే అతడు మొదటి ప్రధాన యాజకుడు, బహుశా ఇతనికి ప్రజలపై ఇంకా అదుపు, అధికారం ఉండవచ్చు.

అనువాదం సలహాలు:

  • "ప్రధాన యాజకుడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అధికారిక యాజకుడు” లేక “అత్యున్నత హోదాగల యాజకుడు."
  • ఈ పదాన్ని "ప్రధాన యాజకుడు" అని కాకుండా “ముఖ్య యాజకుడు” అని అనువదించేలా జాగ్రత్త పడండి.

(చూడండి: అన్న, కయప, ప్రధాన యాజకులు, యాజకుడు, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 13:08 తెరవెనుక గదిలోకి ప్రధాన యాజకుడు తప్ప ఎవరూ ప్రవేసించ రాదు. ఎందుకంటే దేవుడు అందులో నివసించాడు.
  • 21:07 రానున్న మెస్సియా పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు అయన దేవునికి పరిపూర్ణమైన బలి అర్పణ గావించాడు.
  • 38:03 ప్రధాన యాజకుని నాయకత్వంలో యూదు నాయకులు యూదాకు ముఫ్ఫై వెండి నాణాలు ఇచ్చి యేసుకు ద్రోహం తలపెట్టాలని చెప్పారు.
  • 39:01 సైనికులు యేసును ప్రధాన యాజకునిఇంటికి తీసుకుపోయారు. అక్కడ అతడు ఆయన్ను ప్రశ్నించాలి.
  • 39:03 చివరకు ప్రధాన యాజకుడు యేసును సూటిగా చూస్తూ అడిగాడు. "నీవు మెస్సియావా, సజీవ దేవుని కుమారుడవా, చెప్పు?"
  • 44:07 మరుసటిరోజు, యూదు నాయకులు పేతురు, యోహానులను ప్రధాన యాజకుడు ఇతర మత నాయకుల దగ్గరికి తెచ్చారు.
  • 45:02 కాబట్టి మత నాయకులు స్తెఫనును బంధించి ప్రధాన యాజకుడు ఇతర యూదుల నాయకుల దగ్గరికి తెచ్చారు. కొందరు అబద్ధ సాక్షులు స్తెఫను గురించి సాక్ష్యం చెప్పారు.
  • 46:01 ప్రధాన యాజకుడు సౌలు దమస్కులోని క్రైస్తవులను బంధించి యెరూషలేముకు తీసుకురావడానికి అనుమతి ఇచ్చాడు.
  • 48:06 యేసు గొప్ప ప్రధాన యాజకుడు. ఇతర యాజకులవలె కాక అయన తానే లోక ప్రజలందరి పాపాల కోసం ఏకైక బలి అర్పణగా తననే అర్పించుకున్నాడు. యేసు పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు ఎందుకంటే ఏ కాలంలో నైనా ఎవరైనా చేసిన ప్రతి పాపం తనపై వేసుకున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H7218, H1419, H3548, G748, G749

ప్రభురాత్రి భోజనం

నిర్వచనం:

అపొస్తలుడైన పౌలు ఉపయోగించిన “ప్రభురాత్రి భోజనం” అనే పదం యూదా నాయకులు యేసును పట్టుకొన్న రాత్రి ఆయన తన శిష్యులతో భుజించిన పస్కా భోజనాన్ని సూచిస్తుంది.

  • ఈ భోజన సమయంలో యేసు పస్కారొట్టెను విరిచి అది త్వరలో కొట్టబడి చనిపోబోతున్న తన శరీరం అని చెప్పాడు.
  • ద్రాక్షరస పాత్రను ఆయన తన రక్తం అని చెప్పాడు. పాపం కోసం బలిగా చనిపోతుండగా త్వరలో చిందింపబడబోతున్నదని చెప్పాడు.
  • తన శిష్యులు కలిసి ఈ భోజనాన్ని చేస్తున్న ప్రతీసారి ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించాడు.
  • యేసులో విశ్వాసుల కోసం ప్రభురాత్రి భోజనం ఒక క్రమమైన ఆభ్యాసంగా ఉండాలని కొరింథియులకు రాసిన చివరి పత్రికలో పౌలు మరింత స్థిరపరచాడు.
  • ఈ రోజున సంఘాలు తరుచుగా వినియోగిస్తున్న “ప్రభు సంస్కారం” అంటే ప్రభురాత్రిభోజనం అని అర్థం. “చివరి భోజనం” అని కూడా కొన్ని సార్లు వినియోగించారు.

అనువాదం సూచనలు:

  • ఈ పదం “ప్రభువు భోజనం” లేక “మన ప్రభువైన యేసు భోజనం” లేక “ప్రభువైన యేసు జ్ఞాపకార్ధ భోజనం” అని అనువదించవచ్చు.

(చూడండి: పస్కా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1173, G2960

ప్రభువు దినం, యెహోవా దినం

వర్ణన:

పాత నిబంధన పదం "యెహోవా దినం " అనే దాన్ని దేవుడు ప్రజలను వారి పాపాలకు శిక్షించే ఇదమిద్ధమైన సమయాలను సూచించడానికి ఉపయోగిస్తారు.

  • కొత్త నిబంధన పదం "ప్రభువు దినం " సాధారణంగా అంత్యకాలం లో యేసు ప్రభువు న్యాయాధిపతిగా తిరిగి వచ్చే సమయాన్ని సూచిస్తున్నది.
  • భవిషత్తులో అంతిమ తీర్పు, పునరుత్థానం సమయాన్ని ఇది కొన్ని సార్లు "అంత్య దినం"గా సూచిస్తుంది. ప్రభువు యేసు న్యాయాధిపతిగా పాపులను శిక్షించి తన శాశ్వత పరిపాలన నెలకొల్పుతాడు.
  • ఇందులో "రోజు" అనే పదం కొన్ని సార్లు అక్షరార్థంగా ఒక రోజు, లేక ఒక రోజు కన్నా సుదీర్ఘమైన"సమయం” లేక “సందర్భం" అని అర్థం ఇస్తాయి.
  • కొన్ని సార్లు ఇది శిక్షను సూచిస్తుంది. నమ్మనివారిపై " కుమ్మరించ బడే దేవుని ఆగ్రహం" అని అర్థం ఇస్తుంది.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, ఇతర పద్ధతుల్లో అనువదించడం ఇలా. "యెహోవా దినం " అనే దానిలో " యెహోవా సమయం” లేక “యెహోవా తన శత్రువులను శిక్షించే కాలం” లేక “యెహోవా ఆగ్రహ సమయం" అనే అర్థాలున్నాయి.
  • తర్జుమా చేసే ఇతర పద్ధతులు "ప్రభువు దినం" "ప్రభువు తీర్పు సమయం” లేక “మనుషులకు తీర్పు తీర్చడానికి యేసు ప్రభువు యేసు న్యాయాధిపతిగా తిరిగి వచ్చే కాలం."

(చూడండి: రోజు, తీర్పు దినం, ప్రభువు, పునరుత్థానం, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3068, H3117, G2250, G2962

ప్రభువైన యెహోవా, యెహోవా దేవుడు

వాస్తవాలు:

పాతనిబంధనలో “ప్రభువైన యెహోవా” పదం ఏకైక నిజ దేవుణ్ణి సూచించడానికి తరుచుగా వినియోగించబడింది.

  • ”ప్రభువు” అనే పదం దైవికబిరుదు, “యెహోవా” అనే పదం దేవుని వ్యక్తిగత పేరు.
  • ”యెహోవా” అనే పదం “యెహోవా దేవుడు” రూపంలో ఉండడానికి “దేవుడు” అనే పదంతో జతచెయ్యబడింది.

అనువాదం సూచనలు:

  • దేవుని వ్యక్తిగత పేరు అనువాదం కోసం “యెహోవా” పదంలోని కొంత రూపం వినియోగిస్తే, “ప్రభువైన యెహోవా,” “యెహోవా దేవుడు” వంటి పదాలు అక్షరాలా అనువదించాలి. దేవుణ్ణి చూపిస్తున్న ఇతర సందర్భాలలో “ప్రభువు” అనే పదం ఏవిధంగా అనువదించబడిందో గమనించాలి.
  • కొన్న భాషలలో పేరు తరువాత బిరుదు ఉంచుతారు, ఈ పదాన్ని “యెహోవా ప్రభువు” అని అనువదిస్తారు. ప్రాజెక్టు బాషలో సహజమైనదానిని ఆలోచించాలి: “ప్రభువు” అనే బిరుదు “యెహోవా” అనే పదానికి ముందు వస్తుందా లేక వెనుక వస్తుందా చూడాలి.
  • ”యెహోవా దేవుడు” అనే పదం “యెహోవాగా పిలువబడే దేవుడు” లేక “సజీవుడైన దేవుడు” లేక “దేవుడనైన నేను” అని భాషాంతరం చెయ్యవచ్చు.
  • ”యెహోవా” అనే పదం “ప్రభువు” లేక “ప్రభువు” అని భాషాంతరం చేసే సాంప్రదాయంలో అనువాదం ఉంటే, “ప్రభువైన యెహోవా” అనే పదాన్ని “ప్రభువు దేవుడు” లేక “ప్రభువుగా ఉన్న దేవుడు” అని అనువదించవచ్చు. “యజమాని ప్రభువు” లేక “దేవుడైన ప్రభువు” అనేవి ఇతర అనువాదాలు.
  • ”ప్రభువైన యెహోవా” అనే పదాన్ని “ప్రభువు ప్రభువు” అనే పదంగా భాషాంతరం చెయ్యకూడదు, ఎందుకంటే సాంప్రదాయంగా ఈ రెండు పదాల అక్షర రూపం వ్యత్యాసాన్ని చదివేవారు గమనించలేక పోవచ్చును. అసాధారణంగా కనిపించవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: దేవుడు, ప్రభువు, ప్రభువు, యెహోవా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H136, H430, H3068, G2316, G2962

ప్రవక్త, ప్రవచనం, భవిష్యత్తును చెప్పడం, దీర్ఘదర్శి, ప్రవక్త్రిని

నిర్వచనం:

“ప్రవక్త” అంటే ప్రజలకు దేవుని సందేశాన్ని చెప్పేవాడు. ఈ కార్యాన్ని చేసే స్త్రీని “ప్రవక్తిని” అని పిలుస్తారు.

  • తరచుగా ప్రవక్తలు ప్రజలు తమ పాపములనుండి తిరిగి దేవునికి విధేయులు కావాలని హెచ్చరించారు.
  • “ప్రవచనము” అంటే ప్రవక్త మాట్లాడే సందేశం అని అర్థం. “ప్రవచించడం” అంటే దేవుని సందేశాన్ని చెప్పడం అని అర్థం.
  • తరచుగా ప్రవచన సందేశము భవిష్యత్తులో జరగబోవుదానిని గురించి ఉంటుంది.
  • పాత నిబంధనలోనున్న అనేక ప్రవచనములు ఇప్పటికే నెరవేర్చబడియున్నాయి.
  • బైబిలులో ప్రవక్తల చేత రాయబడిన అనేక గ్రంథాలు కొన్ని సార్లు "ప్రవక్తలు" అని సూచించబడతాయి.
  • ఉదాహరణకు, “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే ఈ మాట హెబ్రీ లేఖనములన్నిటిని సూచిస్తుంది, దీనిని “పాత నిబంధన” పిలుస్తాము.
  • “దీర్ఘదర్శి” లేక “చూచే వ్యక్తీ” అనే పదం ప్రవక్త కోసం వాడబడింది.
  • కొన్నిమార్లు “దీర్ఘదర్శి” పదం అబద్దపు ప్రవక్తను లేదా శకునము చెప్పే అభ్యాసాలను జరిగించేవాడిని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • “ప్రవక్త” పదం “దేవుని ప్రతినిధి” లేదా “దేవుని కొరకు మాట్లాడే వ్యక్తి” లేదా “దేవుని సందేశములను మాట్లాడే వ్యక్తి” అని అనువదించబడవచ్చు.
  • “దీర్ఘదర్శి” పదం “దర్శనములు చూసే వ్యక్తి” లేదా “దేవుని నుండి భవిష్యత్తును చూడగలిగే మనుష్యుడు” అని అనువదించవచ్చు.
  • “ప్రవక్తినులు పదం “దేవునికి స్త్రీ ప్రతినిధి” లేదా “దేవుని కొరకు మాట్లాడే స్త్రీ” లేదా “దేవుని సందేశాలను మాట్లాడే స్త్రీ” అని అనువదించబడవచ్చు.
  • “ప్రవచనము” పదం అనువాదంలో “దేవుని నుండి సందేశము” లేదా “ప్రవక్త సందేశము” అని ఉండవచ్చు.
  • “ప్రవచించడం” పదం “దేవుని నుండి మాటలను పలుకడం” లేదా “దేవుని సందేశాన్ని చెప్పు" అని అనువదించబడవచ్చు.
  • “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే అలంకారిక వాక్యము, “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల పుస్తకములు” లేదా “దేవుడు గురించీ, తన ప్రజలను గురించి వ్రాయబడిన ప్రతీది, ఇందులో ప్రవక్తలు బోధించినవి మరియు దేవుని కట్టడలు" ఉన్నాయి.
  • అబద్ధపు దేవుని ప్రవక్తను (లేక దీర్ఘదర్శిని) సూచించేటప్పుడు, దీనిని “అబద్ధ ప్రవక్త (దీర్ఘదర్శి)” లేదా “అబద్దపు దేవుని ప్రవక్త (లేక దీర్ఘదర్శి)” లేదా “బయలు ప్రవక్త” అని తర్జుమా చేయవలసిన అవసరత ఉంటుంది.

(చూడండి: బయలు, శకునము, అబద్దపు దేవుడు, అబద్ద ప్రవక్త, నెరవేర్చడం, మోషే ధర్మశాస్త్రము, దర్శనము)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 12:12 ఐగుప్తీయులు చనిపోయారని ఇశ్రాయేలీయులు చూచినప్పుడు, వారు దేవునియందు విశ్వాసముంచిరి మరియు మోషే దేవుని ప్రవక్త అని విశ్వాసం ఉంచారు.
  • 17:13 దావీదు చేసిన పనినిబట్టి దేవుడు కోపగించుకొనెను, ఇందుచేత దావీదు చేసిన పాపము ఎంత ఘోరమైనదని చెప్పుటకు దేవుడు నాతాను ప్రవక్తను దావీదునొద్దకు పంపించాడు.
  • 19:01 ఇశ్రాయేలీయుల చరిత్రయందంతంటిలో దేవుడు వారియొద్దకు ప్రవక్తలను పంపెను. దేవుని నుండి వచ్చు సందేశములను ప్రవక్తలు విని, ఆ దేవుని సందేశములను వారు ప్రజలకు వినిపించారు.
  • 19:06 ఇశ్రాయేలు రాజ్యము యొక్క సమస్త ప్రజలందరూ మరియు బయలు దేవతకు సంబంధించిన 450 మంది ప్రవక్తలు కర్మెలు పర్వతము వద్దకు వచ్చిరి.
  • 19:17 అనేకసార్లు ప్రజలు దేవునికి విధేయత చూపలేదు. వారు అనేకమార్లు ప్రవక్తలను అగౌరపరచారు, మరియు కొన్నిమార్లు వారిని హతమార్చారు.
  • 21:09 మెస్సయ్యా కన్య మరియ గర్భాన జన్మిస్తాడని ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు.
  • 43:05 “అంత్యదినములలో, నా ఆత్మను కుమ్మరించెదను” అని దేవుడు చెప్పిన మాటను యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడి, నెరవేర్చబడెను.
  • 43:07 “నీవు పరిశుద్ధుని సమాధిలో ఉండనివ్వవు” అని చెప్పబడిన ప్రవచనమును నెరవేర్చావు.
  • 48:12 దేవుని వాక్యమును ప్రకటించిన మోషే గొప్ప ప్రవక్త. అయితే యేసు అందరిలో గొప్ప ప్రవక్త. ఆయనే దేవుని వాక్యమైయుండెను.

పదం సమాచారం:

  • Strong's: H2372, H2374, H4853, H5012, H5013, H5016, H5017, H5029, H5030, H5031, H5197, G2495, G4394, G4395, G4396, G4397, G4398, G5578

ప్రాణం (ఆత్మ), స్వయం

నిర్వచనం:

ప్రాణం పదం సాధారణంగా ఒక వ్యక్తి యొక్క భౌతికేతర భాగాన్ని సూచించవచ్చు లేదా ఇతరులనుండి భిన్నంగా ఒక వ్యక్తిగా తన గురించి తనకు ఉన్న అవగాహనను ప్రత్యేకించి సూచిస్తుంది.

  • “ప్రాణం," "ఆత్మ" పదాలు రెండు భిన్నమైన అంశాలుగా ఉండవచ్చు లేదా ఆ రెండు పదాలు ఒక అంశాన్ని సూచిస్తుండవచ్చు.
  • ఒక వ్యక్తి మరణించినప్పుడు, తన ప్రాణం తన శరీరాన్ని విడిచి వెళ్లిపోతుంది.
  • “శరీరానికి భిన్నంగా "ఆత్మ" పదం"దేవునితో సంబంధపరచబడేదిగా" ఉండే శరీరభాగంగా చెప్పవచ్చు.
  • "ఆత్మ" పదం కొన్నిసార్లు పూర్తి వ్యక్తిని సూచించడానికి అలంకారికంగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, "పాపాలు చేయు ఆత్మ" అంటే "పాపాలు చేసే వ్యక్తి" అని అర్థం. "నా ఆత్మ అలసిపోయింది" అంటే "నేను అలసిపోయాను" అని అర్థం.

అనువాదం సూచనలు:

  • “ఆత్మ" పదం "ఆంతరంగిక స్వయం" లేదా "అంతరంగిక వ్యక్తి" అని అనువదించబడవచ్చు.
  • కొన్ని సందర్భాలలో “నా ప్రాణము” అనే పదం “నేను” లేదా "నన్ను" అని అనువదించబడవచ్చు.
  • “ప్రాణము” పదం "వ్యక్తి" లేదా "అతడు" లేదా "అతనిని" అని అనువదించబడవచ్చు.
  • కొన్ని భాషలలో “ప్రాణం" లేదా “ఆత్మ” అనే పదాల అంశాల కోసం ఒకే పదం ఉండవచ్చు.
  • హెబ్రీ 4:12వ వచనములో “ప్రాణము మరియు ఆత్మను విభజించునంతగా” అనే అలంకారిక పదం ఉపయోగించబడింది, అంటే “అంతరంగిక వ్యక్తిని లోతుగా వివేచించడం" లేదా "అంతరంగిక వ్యక్తి చేయడం" అర్థం.

(చూడండి: ఆత్మ)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5082, H5315, H5397, G5590

ప్రాయశ్చిత్తం

నిర్వచనము:

“ప్రాయశ్చిత్తం” అనే ఈ పదము దేవుని న్యాయమును నెరవేర్చుటకు లేక ఆయన ఉగ్రతను చల్లార్చుటకు చేయబడిన బలియాగమును సూచిస్తుంది.

  • యేసు క్రీస్తు త్యాగపురితమైన రక్తము యొక్క అర్పణయనునది సర్వమానవాళి పాపముల కొరకు దేవునికి చేయబడిన ప్రాయశ్చిత్తం లేక పరిహారం.
  • సిలువలో యేసు మరణము పాపమునకు విరుద్ధముగా దేవుని ఉగ్రతను చల్లార్చినది. ఈ కార్యము ద్వారా దేవుడు ప్రజలను దయతో చూడడానికి మరియు వారందరూ నిత్యజీవము చేర్చడానికి గొప్ప అవకాశమును కల్పించింది.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమును “సమాధానము కలిగించు” లేక “దేవుడు పాపములను క్షమించుటకు మరియు ప్రజలకు దయను చూపుటకు చేసే కార్యము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “పాప నివృత్తి” అనే ఈ పదము “ప్రాయశ్చిత్తం” అనే పదమునకు చాలా దగ్గరి సంబంధముంటుంది. ఈ రెండు పదములు ఏ విధముగా ఉపయోగించబడుతాయనే పోలిక చెప్పడం చాలా ప్రాముఖ్యము.

(ఈ పదములను కూడా చూడండి: ప్రాయశ్చిత్తం, నిత్యత్వం, క్షమించు, హోమము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G2434, G2435

ప్రాయశ్చిత్తం మూత

నిర్వచనం:

"ప్రాయశ్చిత్తం మూత"అంటే నిబంధన మందసాన్ని కప్పే బంగారపు పై మూత. అనేక ఇంగ్లీషు అనువాదాల్లో దీన్ని "ప్రాయశ్చిత్తం మూత" అని కూడా అంటారు.

  • ప్రాయశ్చిత్తం మూత 115 సెంటిమీటర్లు పొడవు 70 సెంటిమీటర్లు వెడల్పు.
  • ప్రాయశ్చిత్తం మూతపై రెండు బంగారం కెరూబులు వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతూ నిలిచి ఉంటాయి.
  • మూతపై చాచిన కెరూబుల రెక్కల మధ్యనుంచి తాను ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కోసం వారిని కలుసుకుంటాయనని యెహోవా చెప్పాడు. ప్రధాన యాజకుడు మాత్రమే ప్రజల ప్రతినిధిగా యెహోవాను కలుసుకోగలుగుతాడు.
  • కొన్ని సార్లు ప్రాయశ్చిత్తం మూతను "కరుణా పీఠం"అన్నారు. ఎందుకంటే అది పాపపూరితమైన మానవులను విమోచించడం కోసం దిగివచ్చిన దేవుని కరుణను చాటుతున్నది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని తర్జుమా చేయడంలో ఇతర పద్ధతులు. "దేవుడు వాగ్దానం చేసిన విమోచన సూచన అయిన మందసం మూత” లేక “దేవుడు ప్రాయశ్చిత్తం చేసే స్థలం” లేక “దేవుడు క్షమించి తిరిగి పూర్వ స్థితి కలిగించే స్థలం అయిన మందసం మూత."
  • దీన్ని "పరిహారం చేసే స్థలం" అని కూడా అనవచ్చు.
  • ఈ పదాన్ని అనువదించే మార్గాలు "ప్రాయశ్చిత్తం,""పరిహారం,” “విమోచన."

(చూడండి: నిబంధన మందసం, ప్రాయశ్చిత్తం, కెరూబులు, పరిహారం, విమోచించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3727, G2435

ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం చేయు, ప్రాయశ్చిత్తాలు, ప్రాయశ్చిత్తం చేసి

నిర్వచనం:

పదాలు "ప్రాయశ్చిత్తం” “ప్రాయశ్చిత్తం" మనుషుల పాపాల పరిహారానికి దేవుడు ఒక బలి అర్పణ సిద్ధం చేసి పాపం పై తన ఆగ్రహం చల్లారే ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని సూచిస్తున్నాయి.

  • పాత నిబంధన కాలంలో, దేవుడు ఇశ్రాయేలీయులు పాపాలకు జంతు బలి అర్పణ రక్తం మూలంగా తాత్కాలిక ప్రాయశ్చిత్తం జరగడానికి అనుమతించాడు.
  • కొత్త నిబంధనలో రాసినట్టుగా, సిలువపై క్రీస్తు మరణం పాపానికి ఏకైక శాశ్వత ప్రాయశ్చిత్తం.
  • యేసు చనిపోయాక, మనుషులకు వారి పాపం మూలంగా రావలసిన శిక్ష రాకుండా తన త్యాగ పూర్వక మరణం ద్వారా ప్రాయశ్చిత్తం జరిగించాడు.

అనువాదం సలహాలు:

  • "ప్రాయశ్చిత్తం" అనే పదాన్ని ఒక పదం లేక పదబంధంతో అనువదించడం మంచిది."వెల చెల్లించు” లేక “దాని కోసం డబ్బు కట్టు” లేక “ఎవరి పాపాలైనా క్షమించబడేటందుకు” లేక “ఏదైనా నేరానికి పరిహారం"
  • "ప్రాయశ్చిత్తం"ఇలా అనువాదం చెయ్యవచ్చు "చెల్లింపు” లేక “పాప బలి అర్పణ వెల చెల్లించు” లేక “క్షమాపణ అనుగ్రహించు."
  • ఈ పదాన్నిడబ్బు చెల్లింపు అర్థం ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోండి.

(చూడండి: ప్రాయశ్చిత్తం మూత, క్షమించు, పరిహారం, సమాధాన పరచు, విమోచించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3722, H3725, G2643

ప్రార్థించు, ప్రార్థన

నిర్వచనం:

“ప్రార్థించు,” “ప్రార్థన” అనే పదాలు దేవునితో మాట్లాడడానిని సూచిస్తున్నాయి. ఈ పదాలు అబద్ధపు దేవునితో మాట్లాడుటకు ప్రయత్నించు ప్రజలను కూడా సూచించడానికి ఉపయోగించబడుతున్నాయి.

  • ప్రజలు మౌనముగా ఉండి ప్రార్థించవచ్చు, వారి ఆలోచనలతో దేవునితో మాట్లాడవచ్చు, లేదా వారు గట్టిగా అరిచి ప్రార్థించవచ్చు, వారి స్వరముతో దేవునితో మాట్లాడవచ్చును. దావీదు కీర్తనల గ్రంథములో తన ప్రార్థనలను వ్రాసికొనినట్లుగా కొన్నిమార్లు ప్రార్థనలను వ్రాస్తూ ఉంటారు.
  • ప్రార్థనలో కనికరము కోసం దేవునిని అడుగడం, సమస్యనుండి బయటకి రావడంలో సహాయం అడుగడం, నిర్ణయాలు చెయ్యడంలో జ్ఞానం కోసం వేడుకోవడం ఉంటాయి.
  • తరచుగా రోగులైన వారిని స్వస్థపరచమని ప్రజలు దేవునిని వేడుకుంటారు లేదా అవసరతలలో ఉన్నవారికి సహాయము చేయమని దేవునికి ప్రార్థిస్తారు.
  • ప్రజలు దేవునికి ప్రార్థన చేయునప్పుడు ఆయనను స్తుతిస్తారు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారు.
  • ప్రార్థనలో దేవునితో మన పాపములను ఒప్పుకొనుటయు, మనలను క్షమించమని ఆయనను అడగుటయు ఉంటుంది.
  • దేవునితో మాట్లాడం అంటే మన ఆత్మ ఆయన ఆత్మతో సంభాషించుచున్నప్పుడు, మన భావోద్రేకాలను ఆయనతో పంచుకొంటున్నప్పుడు, ఆయన సన్నిధిని ఆనందించుచుండగా అది ఆయనతో "సహవాహం" అని పిలువబడుతుంది.
  • ఈ పదం "దేవునితో మాట్లాడడం" లేదా "దేవునితో సంభాషించడం" అని అనువదించబడవచ్చు. ఈ పదం అనువాదంలో మౌనంగా ఉండే ప్రార్థన అర్థం జతచెయ్యబడాలి.

(చూడండి: అబద్ధపు దేవుడు, క్షమించు, స్తుతించు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 06:05 ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థించెను, మరియు ఆమె కవల పిల్లలతో గర్భవతి కావడానికి దేవుడు అనుమతించాడు.
  • 13:12 అయితే మోషే వారికొరకు ప్రార్థించెను, మరియు దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను మరియు వారిని నాశనము చేయలేదు.
  • 19:08 ఆ తరువాత బయలు ప్రవక్తలు “బయలు దేవత, మా ప్రార్థనలు ఆలకించు” అని బయలుకు ప్రార్థించారు .
  • 21:07 యాజకులు కూడా ప్రజల కొరకు దేవుని ప్రార్థించిరి.
  • 38:11 మీరు శోధనలోనికి వెళ్ళకుండునట్లు ప్రార్థన చేయమని యేసు తన శిష్యులకు తెలియజేసెను.
  • 43:13 శిష్యులు అపొస్తలుల బోధను వింటూనే ఉన్నారు, అందరు కలసి సమయాన్ని గడిపారు, కలసి భోజనము చేశారు, మరియు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసికొనియున్నారు.
  • 49:18 ఇతర క్రైస్తవులతో కలిసి ఆరాధన చేయమని, ఆయన వాక్యమును ధ్యానము చేయమని, ప్రార్థించాలని దేవుడు మీతో చెపుతున్నాడు, మరియు ఆయన మీకు చేసిన కార్యములను ఇతరులతో పంచుకొనుమని చెపుతున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H559, H577, H1156, H2470, H3863, H3908, H4994, H6279, H6293, H6419, H6739, H7592, H7878, H7879, H7881, H8034, H8605, G154, G1162, G1189, G1783, G2065, G2171, G2172, G3870, G4335, G4336

ప్రియమైన

నిర్వచనం:

"ప్రియమైన" అనే ఈ పదం మన ప్రేమను చూరగొన్న, ఇష్టమైన ఎవరినైనా చెప్పడానికి వాడే మాట.

  • "ప్రియమైన" అక్షరాలా దీని అర్థం "ప్రేమను చూరగొన్న వాడు” లేక “ప్రేమించిన వాడు."
  • దేవుడు యేసును "ప్రియమైన కుమారుడు" గా చెప్పాడు.
  • క్రైస్తవ సంఘాలకు తమ ఉత్తరాల్లో అపోస్తలులు తరచుగా వారి సాటి విశ్వాసులను "ప్రియమైన" వారుగా సంబోధించారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రేమించాడు” లేక “ప్రేమించిన వాడు” లేక “బాగా ప్రేమించాడు,” లేక “చాలా ప్రియమైన వాడు."
  • మాట్లాడే సందర్భాలలో సన్నిహిత స్నేహితుడు, అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నా ప్రియ స్నేహితుడు” లేక “నా సన్నిహిత స్నేహితుడు." ఇంగ్లీషులో సహజంగా "నా ప్రియ స్నేహితుడు, పౌలు” లేక “పౌలు, నా ప్రియ స్నేహితుడు." ఇతర భాషలలో వివిధ రకాలుగా దీన్ని అంటారేమో.
  • ఈ పదం "ప్రియమైన" అనేది దేవుని ప్రేమ అనే అర్థంలో నుండి వచ్చింది. ఇది షరతులు లేని, స్వార్థ రహితమైన, త్యాగ పూర్వకమైనది.

(చూడండి: ప్రేమ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H157, H1730, H2532, H3033, H3039, H4261, G25, G27, G5207

ప్రేమ, ప్రియమైన

నిర్వచనం:

మరొక వ్యక్తిని ప్రేమించడం అంటే ఆ వ్యక్తిని గురించిన శ్రద్ధ తీసుకోవడం, అతనికి ప్రయోజనకరమైన పనులు చెయ్యడం. “ప్రేమ” అనే పదం కోసం వివిధ అర్థాలు ఉన్నాయి, కొన్ని భాషలు వివిధ పదాలను వినియోగించడం ద్వారా వ్యక్తీకరిస్తాయి.

  1. దేవుని నుండి వచ్చిన ప్రేమ తన వరకూ ప్రయోజనం చేకూర్చక పోయినప్పటికీ ఇతరుల క్షేమం మీదనే దృష్టి నిలుపుతుంది. ఇటువంటి ప్రేమ ఇతరులు ఏమి చేసినప్పటికీ వారిని గురించిన శ్రద్ధ తీసుకొంటుంది, దేవుడు తానే ప్రేమ, నిజమైన ప్రేమకు ఆధారం.
  • పాపం, మరణం నుండి మనలను రక్షించడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా యేసు ఇటువంటి ప్రేమను చూపించాడు. త్యాగసహితంగా ఇతరులను ప్రేమించడానికి తన అనుచరులకు నేర్పించాడు.
  • మనుష్యులు ఇతరులను ఇటువంటి ప్రేమతో ప్రేమించినప్పుడు ఇతరుల వర్ధిల్లడానికి కారణమైన వాటిని గురించి తలంచే విధానాలలో కార్యాలను జరిగిస్తారు. ఈ విధమైన ప్రేమలో ఇతరులను క్షమించడం ఉంటుంది.
  • అనువాదం వివరణ భిన్నమైన అర్థాన్ని సూచించకపోయినట్లయితే తప్పించి ULT లో “ప్రేమ” అనే పదం ఇటువంటి త్యాగసహితమైన ప్రేమను సూచిస్తుంది.
  1. కొత్తనిబంధనలో మరొక పదం సహోదరప్రేమను లేదా స్నేహితునితో లేదా కుటుంబ సభ్యునితో ప్రేమను సూచిస్తుంది.
  • స్నేహితులు లేదా బంధువుల మధ్య ఉన్న సహజ మానవ ప్రేమను ఈ పదం సూచిస్తుంది.
  • ”విందులో అత్యంత ప్రాముఖ్యమైన స్థలాలలో కూర్చోవడం వారికి ఇష్టం” అనే సందర్భాలలో కూడా ఈ పదం ఉపయోగించబడవచ్చు. వారికి “చాలా ఇష్టం” లేదా “అధికంగా కోరుతున్నారు” అని అర్థం.
  1. “ప్రేమ” అనే పదం ఒక స్త్రీ, పురుషుల మధ్యలో ఉన్న మొహపూరిత ప్రేమ అని కూడా సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • అనువాదం వివరణలో మరొక విధంగా ప్రస్తావించకపోయినట్లయితే , ULT లో “ప్రేమ” అంటే దేవుని నుండి వచ్చిన త్యాగసహితమైన ప్రేమ అని సూచిస్తుంది.
  • కొన్ని భాషలలో దేవునికున్న నిస్వార్ధ ప్రేమ, త్యాగసహిత ప్రేమ కోసం ప్రత్యేకమైన పదం ఉండవచ్చు. ఈ పదం “సమర్పించబడిన, విశ్వసనీయ శ్రద్ధ” లేదా “నిస్వార్ధ శ్రద్ధ” లేదా “దేవుని నుండి ప్రేమ” అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు. దేవుని ప్రేమను అనువదించడానికి వినియోగించే పదంలో ఇతరుల ప్రయోజనం కోసం ఒకరు తమ సొంత ఇష్టాలను వదులుకోవడం, ఇతరులు ఏమి చేసినప్పటికీ వారిని ప్రేమించడం అనే భావం వచ్చేలా అనువదించేలా చూడండి.
  • కొన్నిసార్లు "ప్రేమ" కోసం ఉపయోగించే ఇంగ్లీషు పదం కుటుంబసభ్యులు, స్నేహితులకోసం కలిగియుండే లోతైన శ్రద్ధను వివరిస్తుంది. కొన్ని భాషలు ఈ పదం “చాలా ఇష్టం” లేదా “శ్రద్ధ కలిగియుండడం” లేదా “బలమైన ఆపేక్షకలిగియుండడం” అనే పదాలతో అనువదించబడవచ్చు.
  • ఒకదాని కోసం బలమైన ప్రాధాన్యతను వ్యక్తీకరించడానికి “ప్రేమ” అనే పదం వినియోగించబడిన సందర్భములలో, ఈ పదం “బలంగా యెంచుకోవడం” లేదా “అధికంగా ఇష్టపడడం” లేదా “ఉన్నతంగా కోరుకోవడం” అని అనువదించబడవచ్చు.
  • కొన్ని భాషలలో భార్యా భర్తల మధ్య మోహపూరిత లేదా లైంగికసంబంధ ప్రేమను సూచించడానికి కూడా ఒక ప్రత్యేక పదం ఉండవచ్చు.
  • అనేక భాషలు “ప్రేమ”ను ఒక చర్యగా వ్యక్తీకరిస్తాయి. ఉదాహరణకు, “ప్రేమ సహించును, ప్రేమ దయ చూపించును” అనే వాక్యాలను “ఒకరు మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు, అతని పట్ల సహనాన్ని కలిగియుంటాడు, దయకలిగి యుంటాడు” అని అనువాదం చెయ్యవచ్చు.

(చూడండి: నిబంధన, మరణం, బలి, రక్షించడం, పాపం)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 27:02 ధర్మశాస్త్ర బోధకుడు దేవుని ధర్మశాస్త్రం విషయంలో జవాబిస్తూ, “నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించ వలెను” అని చెప్పాడు. మరియు నిన్ను వలే నీ పొ రుగువానిని ప్రేమించ వలెను.
  • 33:08 “ముండ్ల పోదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును, ధనమోహమును దేవుని కోసం ప్రేమను అణచివేయును.”
  • 36:05 పేతురు మాట్లాడుచుండగా, కాంతివంతమైన మేఘము వారి మీదకు వచ్చెను, మేఘములోనుండి ఒక స్వరము, “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను ప్రేమించుచున్నాను అని పలికెను.
  • 39:10 “సత్యమును ప్రేమించు ప్రతీవాడునూ నన్ను ప్రేమించును.”
  • 47:01 ఆమె (లుదియ)ప్రేమించెను, దేవుని ఆరాధించెను.
  • 48:01 దేవుడు లోకమును సృష్టించినపుడు, సమస్తము పరిపూర్ణంగా ఉండెను. పాపం అక్కడ లేదు. ఆదాము, హవ్వ ఒకరినొకరు ప్రేమించుకొన్నారు వారు దేవుని ప్రేమించారు.
  • 49:03 నిన్ను నీవు ప్రేమిస్తున్నట్టు గానే ఇతరులను ప్రేమించాలని ఆయన (యేసు) బోధించాడు.
  • 49:04 నీవు దేనినైనా, నీ సంపదనైనా ప్రేమించిన దాని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలని కూడా ఆయన (యేసు) నీకు బోధించాడు.
  • 49:07 దేవుడు పాపులను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని యేసు బోధించాడు.
  • 49:09 అయితే దేవుడు లోకములో ఉన్న ప్రతీవారినీ ప్రేమించాడు యేసునందు విశ్వాసముంచు వాడు తన పాపాల విషయంలో శిక్ష పొందక, దేవునితో శాశ్వితం జీవించేలా తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహించాడు.
  • 49:13 దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీతో సన్నిహిత సంబంధం కలిగియుండేలా నీవు యేసునందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H157, H158, H159, H160, H2245, H2617, H2836, H3039, H4261, H5689, H5690, H5691, H7355, H7356, H7453, H7474, G25, G26, G5360, G5361, G5362, G5363, G5365, G5367, G5368, G5369, G5377, G5381, G5382, G5383, G5388

బయలుపరచు, బయలు పరచబడడం, ప్రత్యక్షత

నిర్వచనం:

“బయలుపరచు” పదం ఏదైనా తెలియపరచబడడానికి కారణం కావడం అని అర్థం. “ప్రత్యక్షత” అంటే తెలియపరచబడినది అని అర్థం.

  • దేవుడు తాను సృష్టించిన ప్రతీ దాని ద్వారా తనను తాను బయలుపరచుకొన్నాడు, ప్రజలతో తాను మాట్లాడిన, లిఖిత పూర్వక సందేశాల ద్వారా బయలుపరచుకొన్నాడు.
  • దేవుడు తనను గూర్చి కలల ద్వారాను లేదా దర్శనముల ద్వారాను బయలుపరచుకొనియున్నాడు.
  • “యేసు క్రీస్తు నుండి ప్రత్యక్షత” ద్వారా సువార్తను తాను పొందుకొనియున్నానని పౌలు చెప్పినప్పుడు, యేసుక్రీస్తే స్వయాన తనకు సువార్తను గూర్చి వివరించియున్నాడని పౌలు అర్థం.
  • క్రొత్త నిబంధనలోని “ప్రకటన గ్రంథం" అంత్య కాలములో జరగబోయే సంభవాలను గూర్చి దేవుడు బయలుపరచాడు. దర్శనముల ద్వారా అపొస్తలుడైన యోహానుకు ఆయన బయలుపరచియున్నాడు.

అనువాదం సూచనలు:

  • “బయలుపరచు” పదం "తెలియపరచు" లేదా "బహిర్గతం చేయడం" లేదా "స్పష్టంగా చూపించడం" అనే పదాలతో ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, “ప్రత్యక్షత” పదం "దేవుని నుండి సమాచారం" లేదా "దేవుడు బయలుపరచిన సంగతులు" లేదా "దేవుని గురించిన బోధలు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు. అనువాదంలో "బయలుపరచు" అర్థం ఉండేలా చూడడం ఉత్తమం.
  • “ప్రత్యక్షత లేనప్పుడు” పదబంధం “దేవుడు తనను గూర్చి ప్రజలకు బయలుపరచనప్పుడు” లేదా “దేవుడు తన ప్రజలతో మాట్లాడనప్పుడు” లేదా “ప్రజల మధ్యలో సంభాషించని దేవుడు” అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: సువార్త, సువార్తలు, కల, దర్శనం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H241, H1540, H1541, G601, G602, G5537

బలిపీఠం, బలిపీఠాలు

నిర్వచనం:

బలిపీఠం అంటే ఎత్తుగా కట్టిన వేదిక. ఇశ్రాయేలీయులు జంతువులను ధాన్యాన్ని దేవునికి బలిగా దహించడానికి దీనిని ఉపయోగిస్తారు.

  • బైబిల్ కాలాల్లో, మామూలు బలిపీఠాలను తరచుగా తడిపిన మట్టిని కుప్పగా పోయడం ద్వారా గానీ, కొన్ని రాళ్ళను ఒకదానిపై ఒకటి జాగ్రత్తగా పేర్చి నిలబెట్టడం ద్వారా గానీ నిర్మిస్తారు.
  • కొన్ని ప్రత్యేక పెట్టె ఆకారపు బలిపీఠాలు కూడా కట్టారు. వాటిపై బంగారం, ఇత్తడి, లేక కంచు వంటి లోహాలను తాపడం చేసేవారు.
  • ఇశ్రాయేలీయుల పరిసరాల్లో నివసించే ఇతర ప్రజలు కూడా వారి దేవుళ్ళకు బలి అర్పణలు చెయ్యడానికి బలిపీఠాలు నిర్మించే వారు.

(చూడండి: ధూప బలిపీఠం, అబద్ధ దేవుడు, నైవేద్యం, బలి అర్పణ)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 03:14 నోవహు ఓడ నుండి బయటికి వచ్చి బలిపీఠం నిర్మించి అర్పించ దగిన కొన్ని రకాల జంతువులను బలి అర్పణ చేసాడు.
  • 05:08 వారు బలి అర్పణ స్థలానికి చేరుకున్నప్పుడు, అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు చేతులు కట్టి అతణ్ణి బలిపీఠం పై ఉంచాడు.
  • 13:09 యాజకుడు జంతువును వధించి దాన్ని బలిపీఠం పై దహించి వేసే వాడు.
  • 16:06 అతడు (గిద్యోను) ఒక కొత్త బలిపీఠం కట్టి దాన్ని దేవునికి ప్రతిష్టించాడు. విగ్రహం కోసం వాడిన బలిపీఠం పై అతడు దేవునికి బలి అర్పణ చేసాడు.

పదం సమాచారం:

  • Strong's: H741, H2025, H4056, H4196, G1041, G2379

బాప్తిసమిచ్చు, బాప్తిసం పొంది, బాప్తిసం

నిర్వచనం:

కొత్త నిబంధనలో "బాప్తిసమిచ్చు,” “బాప్తిసం "అనే పదాలు సాధారణంగా ఒక క్రైస్తవుడిని ఆచార పూర్వకంగా నీటిలో ముంచడం ద్వారా అతడు పాపం నుండి శుద్ధి, క్రీస్తుతో ఐక్యం అయ్యాడని చూపడానికి వాడతారు.

  • నీటి బాప్తిసంతో బాటు బైబిల్ "పరిశుద్ధాత్మ లో బాప్తిసం పొంది” లేక “అగ్నితో బాప్తిసం పొంది” సంగతులను చెబుతున్నది.
  • ఈ పదం "బాప్తిసం"ను బైబిల్లో గొప్ప హింసలు పొందడాన్ని సూచించడం కోసం ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • నీటితో బాప్తిసమిచ్చేది ఎలా చెయ్యాలనే విషయంలో క్రైస్తవుల్లో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. బహుశా ఈ పదాన్ని నీటిని రకరకాలుగా ఉపయోగించే పద్ధతులు కలిసి వచ్చేలా అనువదించడం మంచిది.
  • సందర్భాన్ని బట్టి, "బాప్తిసమిచ్చు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శుద్ధి చేయు,""నీరు పోసి""నీటిలో ముంచి,""కడిగి,” లేక “ఆత్మ సంబంధంగా శుద్ధి చేసి." ఉదాహరణకు, "నీకు నీటితో బాప్తిసమిచ్చుచున్నాను"అనే మాటను “నిన్ను నీటిలో ముంచుతున్నాను” అని అనువదించడం చెయ్యవచ్చు.
  • “బాప్తిసం "అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "శుధ్ధీకరణ,""నీరు పోయడం," "ముంచడం," "కడగడం,” లేక “ఆత్మ సంబంధమైన కడిగే పని” “కడుగు."
  • ఇది హింసల గురించి చెప్పే సందర్భం అయితే, "బాప్తిసం"అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తీవ్రమైన హింసలు ఎదురైన సమయం” లేక “తీవ్రమైన హింసల ద్వారా శుద్ధి."
  • బైబిల్ అనువాదంలో స్థానిక లేక జాతీయ భాషలో ఈ పదాన్ని అనువదించడం ఎలానో ఆలోచించండి.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: యోహాను (బాప్తిసమిచ్చే), పశ్చాత్తాప పడు, పరిశుద్ధాత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 24:03 యోహాను సందేశం ప్రజలు విన్నారు, వారిలో అనేక మంది వారి పాపాల విషయం పశ్చాత్తాప పడ్డారు. యోహాను వారికి బాప్తిసమిచ్చాడు. అనేక మత నాయకులు కూడా యోహనుతో బాప్తిసం పొందాలని వచ్చారు. అయితే వారు తమ పాపాల విషయం పశ్చాత్తాప పడలేదు, ఒప్పుకోలేదు.
  • 24:06 మరుసటి రోజు, యేసు యోహాను చేత బాప్తిసం పొందాలని వచ్చాడు.
  • 24:07 యోహాను యేసుతో ఇలా చెప్పాడు. "నీకు బాప్తిసం ఇవ్వడానికి నేను తగిన వాడిని కాదు. నీవే నాకు బాప్తిసం ఇవ్వాలి."
  • 42:10 కాబట్టి వెళ్ళండి ప్రజలందరినీ శిష్యులుగా చెయ్యండి. వారికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరున బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడాలని బోధించండి."
  • 43:11 పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీలో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడి యేసు క్రీస్తు పేరున బాప్తిసం పొందాలి. ఆ విధంగా దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు.”
  • 43:12 పేతురు చెప్పగా సుమారు 3,000మంది ప్రజలు విశ్వసించారు. యేసు శిష్యులు అయ్యారు. వారు బాప్తిసం పొంది యెరూషలేము సంఘంలో చేరారు.
  • 45:11 ఫిలిప్పు ఇతియోపీయుడు ప్రయాణిస్తూ నీరు ఉన్న చోటికి వచ్చారు. ఇతియోపీయుడు చెప్పాడు, "ఇదిగో! నీరు ఉంది! నేను బాప్తిసం పొందవచ్చా?"
  • 46:05 సౌలుకు తక్షణమే మరలా చూపు వచ్చింది. అననియ అతనికి బాప్తిసం ఇచ్చాడు.
  • 49:14 యేసు నిన్ను కూడా తనను విశ్వసించి బాప్తిసం పొందమని పిలుస్తున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: G907

బుద్ధి హీనుడు, బుద్ధిలేని, మూర్ఖత్వం

నిర్వచనం:

"బుద్ధి హీనుడు" అనే పదం తరచుగా తప్పు ఎంపికలు చేసేవానిని సూచిస్తుంది. ముఖ్యంగా అవిధేయత చూపించడానికి యెంచుకోనేవానిని సూచిస్తుంది. "బుద్ధిలేని" పదం ఒక వ్యక్తి గానీ లేదా అతని ప్రవర్తన గానీ జ్ఞానంగా లేదని వర్ణిస్తుంది.

  • బైబిలులో "బుద్ధి హీనుడు" పదం సాధారణంగా దేవుణ్ణి విశ్వసించని లేదా దేవునికి విధేయత చూపని వ్యక్తిని సూచిస్తుంది, దేవుణ్ణి విశ్వసించే వ్యక్తినీ మరియు దేవునికి విధేయత చూపే వ్యక్తిని ఇది వ్యతిరేకిస్తుంది.

  • కీర్తనలలో, ఒక బుద్దిహీనుడు దేవుని విశ్వసించని వాడు, దేవుని సృష్టిలో ఆయన ఋజువు అంతటినీ తృణీకరించే వాడు అని దావీదు వర్ణిస్తున్నాడు.

  • పాత నిబంధన పుస్తకంలోని సామెతల గ్రంథం కూడా బుద్ధిలేనివాడు లేదా బుద్ధిహీనులు ఎవరు, ఎలా ఉంటారు అనే అనేక వివరణలు ఇస్తుంది.

  • "మూర్ఖత్వం" పదం అజ్ఞానంగా ఉండే కార్యాన్ని సూచిస్తుంది ఎందుకంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. తరచుగా "మూర్ఖత్వం" పదంలో హాస్యాస్పదంగానూ లేదా ప్రమాదకరంగానూ ఉండే అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది.

అనువాదం సూచనలు:

  • "బుద్ధి హీనుడు" పదం "బుద్ధిలేని వ్యక్తి" లేదా "అజ్ఞాని అయిన వ్యక్తి" లేదా "జ్ఞానం లేని వ్యక్తి" లేదా "దైవభక్తి లేని వ్యక్తి" అని అనువదించబడవచ్చు.
  • "బుద్ధిలేని" పదం "అవగాహన లోపం" లేదా "అజ్ఞాని" అని ఇతరవిధానాలలో అనువదించబడవచ్చు.

(చూడండి: తెలివిగల)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H191, H196, H200, H1198, H1984, H2973, H3684, H3687, H3688, H3689, H3690, H5034, H5036, H5039, H5528, H5529, H5530, H5531, H6612, H8417, H8602, H8604, G453, G454, G781, G801, G877, G878, G3471, G3472, G3473, G3474, G3912

బోళం

నిర్వచనం:

బోళం ఒక నూనె లేక మసాల లాంటిది. ఆఫ్రికా, ఆసియాలో బోళం చెట్టునుండి వచ్చే జిగురునుండి తయారు చేస్తారు. ఇది సంబరానికి సంబంధించి ఉంటుంది.

  • బోళాన్ని సాంబ్రాణిలోనూ, పరిమళ ద్రవ్యాలోనూ, ఔషదాలలోనూ వినియోగిస్తారు, చనిపోయిన దేహాలను సమాధి చెయ్యడానికి సిద్ధపరచడానికి దీనిని వినియోగిస్తారు.
  • యేసు జన్మించినప్పుడు జ్ఞానులు తీసుకొనివచ్చిన బహుమతులలో బోళం ఒకటి.
  • యేసు సిలువవేయబడినప్పుడు ఆ బాధను మరచిపోడానికి ద్రాక్షారసంలో బోళాన్ని కలిపి ఇచ్చారు.

(చూడండి: సాంబ్రాణి, జ్ఞానులు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3910, H4753, G3464, G4666, G4669

భయం, భయాలు, భయపడు

నిర్వచనం:

"భయం” “భయపడు" అనేవి ఒక వ్యక్తి తనకు ఇతరుల నుండి బెదిరింపు, హాని కలుగుతుందనే భావన.

  • "భయం" అనేది అధికారంలో ఉన్న ఒక మనిషి పట్ల అద్భుతాశ్చర్యాలతో కూడిన గౌరవం అని కూడా అర్థం.
  • "యెహోవా భయం," "దేవుని భయం” “ప్రభువు భయం," అంటే దేవునిపట్ల గాఢమైన గౌరవం కలిగి ఆయనకు భయపడి లోబడడం. భయం కలిగేది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడని, అయన పాపాన్ని అసహ్యించుకుంటాడని తెలిసి.
  • బైబిల్ బోధించేది ఏమిటంటే ఒక వ్యక్తి యెహోవాపట్ల భయం కలిగి ఉంటే అతడు జ్ఞాని అవుతాడు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "భయం" అనే మాటను ఇలా అనువదించ వచ్చు. "భయపడు” లేక “లోతైన గౌరవం” లేక “సన్మానం” లేక “అద్భుతాశ్చర్యాలు కనపరచు."
  • "భయపడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "భీతి చెందు” లేక “హడలి పోవు” లేక “భయపడు."
  • వాక్యం "వారిపై దేవుని భయం వచ్చింది." అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "హటాత్తుగా వారు దేవుని పట్ల అద్భుతాశ్చర్యాలు, గౌరవంతో నిండిపోయారు.” లేక “తక్షణమే, వారు దేవుని పట్ల అబ్బురం, గౌరవ భావంతో నిండి పోయారు.” లేక “తరువాత, వారు దేవునికి భయపడ్డారు (అయన గొప్ప శక్తి)."
  • "భయపడకండి" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "భయపడకండి” లేక “భయపడవద్దు."
  • గమనించండి "యెహోవా భయం" కొత్త నిబంధనలో కనిపించదు. "ప్రభువు భయం” లేక “ప్రభువైన దేవుని భయం" అనే మాట ఉపయోగిస్తారు.

(చూడండి: అబ్బురం, అద్భుతాశ్చర్యాలు, ప్రభువు, శక్తి, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H367, H926, H1204, H1481, H1672, H1674, H1763, H2119, H2296, H2727, H2729, H2730, H2731, H2844, H2849, H2865, H3016, H3025, H3068, H3372, H3373, H3374, H4032, H4034, H4035, H4116, H4172, H6206, H6342, H6343, H6345, H6427, H7264, H7267, H7297, H7374, H7461, H7493, H8175, G870, G1167, G1168, G1169, G1630, G1719, G2124, G2125, G2962, G5398, G5399, G5400, G5401

మంచి వార్త, సువార్త

నిర్వచనం:

"సువార్త" అక్షరాలా దీని అర్థం "మంచి వార్త." ఇది మనుషులకు మేలు చేసే, సంతోషపెట్టే సందేశం లేక ప్రకటన.

  • బైబిల్లో, ఈ పదం సాధారణంగా సిలువపై యేసు బలి అర్పణ మూలంగా ప్రజలకు దేవుని రక్షణను సూచిస్తున్నది.
  • అనేక ఇంగ్లీషు బైబిళ్ళలో, "మంచి వార్త" ను సాధారణంగా అనువదించ వచ్చు "సువార్త"గా అనువదించారు. "యేసు క్రీస్తు సువార్త" "దేవుని సువార్త" "రాజ్య సువార్త" వంటి పడబంధాల్లో ఉపయోగించారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని రకరకాలుగా అనువదించవచ్చు. "మంచి సందేశం” లేక “మంచి ప్రకటన ” లేక “దేవుని రక్షణ సందేశం” లేక “దేవుడు యేసును గురించి బోధించిన విషయాలు."
  • సందర్భాన్ని బట్టి, దీన్ని అనువదించడం, "ఒక దాని గురించి మంచి వార్త/సందేశం” లేక “మంచి సందేశం నుండి” లేక “దేవుడు మనకు చెప్పిన మంచి మేళ్ళు” లేక “దేవుడు తాను మనుషులను రక్షించే విధానం గురించి చెప్పిన మాటలు."

(చూడండి: రాజ్యం, బలి అర్పణ, రక్షించు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 23:06 దేవదూత చెప్పాడు, "భయపడకండి, ఎందుకంటే మంచి వార్త మీకోసం తెచ్చాను. మెస్సియా, ప్రభువు బెత్లెహేములో పుట్టాడు!"
  • 26:03 యేసు చదివాడు, "దేవుడు నాకు తన ఆత్మ ఇచ్చాడు. పేదలకు సువార్త, ఖైదీలకు స్వాతంత్ర్యం, గుడ్డి వారికి చూపు, బాధితులకు విడుదల ప్రభువు అనుగ్రహ వత్సరం గురించిన మంచి వార్త ప్రకటించాడు.
  • 45:10 ఫిలిప్పు యేసు సువార్తను గురించి ఇతర లేఖనాల సహాయంతో వివరించాడు.
  • 46:10 తరువాత యేసును గురించిన సువార్త అనేక ఇతర స్థలాల్లో ప్రకటించడం కోసం పంపించాడు.
  • 47:01 ఒక రోజు , పౌలు తన స్నేహితుడు సీల ఫిలిప్పిపట్టణంలో యేసును గురించి సువార్త ప్రకటించారు.
  • 47:13 సువార్త యేసును గురించిన సువార్త వ్యాపించ సాగింది. సంఘం ఎదుగుతూ ఉంది.
  • 50:01 దాదాపు 2,000 సంవత్సరాలుగా లోకవ్యాప్తంగా ప్రజలెందరో మెస్సియా అయిన యేసును గురించిన సువార్త వింటున్నారు.
  • 50:02 యేసు భూమిపై ఉన్నప్పుడు ఇలా చెప్పాడు, "నా శిష్యులు దేవుని రాజ్యం గురించిన మంచి వార్త లోకంలో అన్ని చోట్లా, మనుషులకు ప్రకటిస్తారు. ఆ తరువాత అంతం వస్తుంది."
  • 50:03 అయన పరలోకానికి తిరిగి వెళ్లకముందు అంతకు ముందు ఎన్నడూ వినని వారికి క్రైస్తవులు సువార్త ప్రకటించాలని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: G2097, G2098, G4283

మంచిది, సరియైన, రమ్యమైన, సంతోషకరమైన, మెరుగైన, శ్రేష్ఠమైన

నిర్వచనం:

"మంచిది" అనే పదానికి సందర్భాన్ని బట్టి వివిధ అర్థాలున్నాయి. అనేక భాషలు వివిధ అర్థాలను అనువదించడం కోసం వివిధ పదాలను ఉపయోగిస్తాయి.

  • సాధారణంగా, ఏదైనా దేవుని గుణ లక్షణాలకూ, ఉద్దేశాలకూ, చిత్తానికీ సరిపడినట్లయితే అది మంచిది అవుతుంది.
  • "మంచిది" అంటే సంతోషకరమైనది, శ్రేష్ఠమైనది, సహాయకరమైనది, సరిపడినది, లాభకరమైనది, లేదా నైతికంగా సరియైనది అని అర్థం.
  • "మంచి" దేశం అంటే "సారవంతం” లేక “ఫలభరితం" అని అర్థం.
  • "మంచి" పంట అంటే "సమృద్ధి" అయిన పంట అని అర్థం.
  • ఒక వ్యక్తి తను చేసిన దానిలో “మంచి" గా ఉండగలడు అంటే అతని కార్యాచరణలో గానీ లేదా వృత్తిలోగానీ నిపుణుడుగా ఉన్నాడని అర్థం. ఉదాహరణకు "మంచి రైతు" అనే వాక్యం.
  • బైబిలులో "మంచి" అనే పదానికి సాధారణ అర్థం తరచుగా "దుష్టత్వం" అనే దానికి వ్యతిరేకంగా ఉంటుంది.
  • "మంచితనం" అంటే సాధారణంగా నైతికంగా మంచిగా ఉండడం లేదా తలంపులలోనూ, చర్యలలోనూ నీతిగా ఉండడం సూచిస్తుంది.
  • దేవుని మంచితనం అంటే ఆయన ప్రజలకు మంచివీ, ప్రయోజనకరమైన వాటిని అనుగ్రహించడం ద్వారా వారిని ఆశీర్వదించడానిని సూచిస్తుంది. ఇది అయన నైతిక పరిపూర్ణతను కూడా సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • లక్ష్య భాషలో "మంచిది" పదం కోసం సాధారణ పదాన్ని దాని సాధారణ అర్థం ఖచ్చితంగానూ, సహజంగానూ ఉన్న చోట ఉపయోగించాలి. ప్రత్యేకించి దుర్మర్గత పదానికి వ్యతిరేకంగా ఉన్న చోట ఉపయోగించాలి.
  • సందర్భాన్ని బట్టి, ఈ పదం "దయగల” లేక “శ్రేష్ఠమైన" లేదా “దేవునికి సంతోషాన్ఆని కలిగించే" లేదా నీతిమంతుడు" లేదా “నైతికంగా న్యాయబద్ధమైన" లేదా “ప్రయోజనకరమైన" పదాలు ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "మంచి భూమి" పదం "సారవంతమైన భూమి" లేదా “ఫలవంతమైన భూమి" అని అనువదించబడవచ్చు; "మంచి పంట" పదం "సమృద్ధియైన పంట" లేదా "విస్తారమొత్తంలో పంట" అని అనువదించబడవచ్చు.
  • "మంచి చెయ్యడం" అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించేదేదైనా చెయ్యడం, "దయగలిగి యుండండి" లేదా "సహాయం చెయ్యండి" లేదా మరొకరికి "ప్రయోజనం చేకూర్చండి" అని అర్థం.
  • "విశ్రాంతి దినమున మంచి చెయ్యడం" అంటే "విశ్రాంతి దినమున ఇతరులకు సహాయం చేసే క్రియలు చెయ్యండి" అని అర్థం.
  • సందర్భాన్ని బట్టి, "మంచితనం" అనే పదం "ఆశీర్వాదం” లేదా “దయ” లేదా “నైతిక పరిపూర్ణత” లేదా “నీతి” లేదా “పవిత్రత" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

(చూడండి: దుష్టత్వం, పరిశుద్ధమైన, లాభం, నీతిమంతుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 01:04 దేవుడు తాను సృష్టించినదంతా మంచిది ఉన్నట్టు చూశాడు.
  • 01:11 దేవుడు మంచి చెడుల తెలివిని ఇచ్చే చెట్టును మొలిపించాడు.”
  • 01:12 తరువాత దేవుడు చెప్పాడు, "నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు."
  • 02:04 "దేవుడు నీవు దీనిని తినినప్పుడు నీవు దేవుని వలే ఉంటావు, ఆయనకు వలే మంచి చెడుల తెలివిని కలిగి ఉంటావు."
  • 08:12 "మీరు దుష్ట తలంపుతో నన్ను బానిసగా అమ్మి వేశారు. అయితే దేవుడు దుష్టత్వాన్ని మంచి కోసం ఉపయోగించుకున్నాడు!"
  • 14:15 యెహోషువా మంచి నాయకుడు. ఎందుకంటే అతడు విధేయత కలిగి దేవునికి లోబడ్డాడు.
  • 18:13 ఈ రాజులు కొందరు మంచి మనుషులు. న్యాయంగా పరిపాలన జరిగిస్తూ దేవుణ్ణి ఆరాధించినవారు.
  • 28:01 "మంచి బోధకుడా నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి?" యేసు అతనితో చెప్పాడు. "నన్ను మంచి వాడని ఎందుకు పిలుస్తున్నావు?' మంచి వాడొక్కడే, ఆయన దేవుడు."

పదం సమాచారం:

  • Strong's: H117, H145, H155, H202, H239, H410, H1580, H1926, H1935, H2532, H2617, H2623, H2869, H2895, H2896, H2898, H3190, H3191, H3276, H3474, H3788, H3966, H4261, H4399, H5232, H5750, H6287, H6643, H6743, H7075, H7368, H7399, H7443, H7999, H8231, H8232, H8233, H8389, H8458, G14, G15, G18, G19, G515, G744, G865, G979, G1380, G2095, G2097, G2106, G2107, G2108, G2109, G2114, G2115, G2133, G2140, G2162, G2163, G2174, G2293, G2565, G2567, G2570, G2573, G2887, G2986, G3140, G3617, G3776, G4147, G4632, G4674, G4851, G5223, G5224, G5358, G5542, G5543, G5544

మందసం

నిర్వచనం:

ఈ పదం "మందసం"అక్షరాలా కొయ్యతో చేసిన నలుచదరం పెట్టెను చెప్పడానికి వాడతారు. దేన్నైనా భద్రంగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. మందసం పెద్దది చిన్నది అయి ఉండవచ్చు. దేనికి ఉపయోగిస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది.

  • ఇంగ్లీషు బైబిల్లో, ఈ పదాన్ని మొదటిగా చాలా పెద్దది అయిన, లోక వ్యాప్తమైన వరద నుండి తప్పించుకోడానికి నోవహు నిర్మించిన కొయ్యతో చేసిన నలుచదరం నావను సూచిస్తూ వాడారు. ఓడకు సమతలంగా ఉన్న అడుగు, పై కప్పు, గోడలు ఉన్నాయి.
  • ఈ పదాన్ని అనువదించడంలో "చాలా పెద్దనావ” లేక “ఓడ” లేక “రవాణా నౌక” లేక “పెద్ద పెట్టె ఆకారపు ఓడ."
  • ఈ హీబ్రూ పదాన్ని పెద్ద ఓడకు ఉపయోగిస్తారు. ఇదే పదాన్ని బుట్ట, లేక పెట్టె కోసం కూడా ఉపయోగిస్తారు. మోషే పసివాడుగా ఉండగా అతని తల్లి అతణ్ణి దాచి నైలు నదిలో వదిలిన బుట్ట లేక పెట్టె. అలాటి సందర్భంలో సాధారణంగా దీన్ని "బుట్ట" అని తర్జుమా చెయ్యవచ్చు.
  • "నిబంధన మందసం," అనే పద బంధంలో వివిధ హీబ్రూ పదాలు ఉపయోగిస్తారు. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"పెట్టె” లేక “మంజూష” లేక “కంటైనర్."
  • ఒక్కొక్క సందర్భంలో దీన్ని అనువదించడానికి ఎన్నుకునే పదం ప్రాముఖ్యం. ఆ వస్తువును దేనికి వాడతారో దాన్ని బట్టి ఉంటుంది.

(చూడండి: నిబంధన మందసం, బుట్ట)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H727, H8392, G2787

మనస్సాక్షి

నిర్వచనం:

మనస్సాక్షి ఒక వ్యక్తి యొక్క ఆలోచనలో ఒక భాగం, దీని ద్వారా అతడు ఏదైనా పాపకార్యాన్ని చేసినప్పుడు దాని గురించిన అవగాహన కలిగేలా దేవుడు చేస్తున్నాడు.

  • మనుషులు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలో సహాయపడడానికి దేవుడు వారికి ఒక మనస్సాక్షిని ఇచ్చాడు.
  • దేవుడు చెప్పిన దానికి లోబడుతున్న వ్యక్తికి "శుద్ధమైన” లేదా “నిర్మలమైన” లేదా “పరిశుద్ధమైన" మనస్సాక్షి ఉందని చెప్పబడుతుంది.
  • ఒక వ్యక్తి "నిర్మలమైన మనస్సాక్షి" కలిగియుంటే అతడు ఎలాటి పాపాన్ని దాచుకోలేడని అర్థం.
  • ఎవరైనా తమ మనస్సాక్షిని అలక్ష్యం చేసినట్లయితే మరియు అతడు పాపం చేసినప్పుడు ఎలాటి దోషభావాన్ని అనుభూతి చెందనట్లయితే అతని మనస్సాక్షి చెడు విషయంలో ఇకమీదట సున్నితంగా ఉండదని అర్థం. బైబిలు దీనిని "వాతవేయబడిన" మనస్సాక్షి అని పిలుస్తుంది. ఎర్రని ఇనుముతో "వాత పెట్టినది"గా ఉంటుంది. అటువంటి మనస్సాక్షి "మొద్దుబారినది," "కలుషితమైనది" అని కూడా పిలువబడుతుంది.
  • ఈ పదాన్నిఅనువదించడానికి సాధ్యమయ్యే విధానాలలో "అంతరంగ నైతిక మార్గదర్శి” లేదా “నైతిక ఆలోచన" అని ఉండవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G4893

మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు

నిర్వచనము:

“మనుష్య కుమారుడు” అనే బిరుదు యేసు తనను తాను సూచించుకొనుటకు ఉపయోగించిన మాటయైయున్నది. ఆయన అనేకమార్లు “నేను” అని ఉపయోగించుటకు బదులుగా ఈ పదమును ఉపయోగించియున్నాడు.

  • పరిశుద్ధ గ్రంథములో “మనుష్య కుమారుడు” అనే మాట ఒక మనుష్యుని సూచించుటకు లేక మనుష్యుని గూర్చి తెలియజేయుటకు ఉపయోగించియుండవచ్చును. దీనికి “మానవుడు” అని కూడా అర్థము కలదు.
  • పాత నిబంధన పుస్తకమైన యెహెజ్కేలు గ్రంథమంతటిలో దేవుడు యెహెజ్కేలును “నరపుత్రుడు” అని తరచుగా సంబోధించియుండెను. ఉదాహరణకు, “నరపుత్రుడా నీవు తప్పకుండ ప్రవచించాలి” అని ఆయన చెప్పెను.
  • “మనుష్య కుమారుడు” మేఘాల మీద వస్తున్నట్లుగా ప్రవక్తయైన దానియేలు గారు దర్శనము చూచిరి, ఈయన రాబోయే మెస్సయ్యా ఆయ్యుండెను.
  • మనుష్య కుమారుడు ఒకరోజున మేఘాల మీద రానైయున్నాడని యేసు కూడా చెప్పియున్నాడు. మేఘాల మీద మనుష్యకుమారుడు వచ్చును అనే ఈ విషయాలన్నియు యేసే మెస్సయ్యాయైన దేవుడు అని బయలుపరచుచున్నాయి.

తర్జుమా సలహాలు:

  • యేసు “మనుష్య కుమారుడు” అని ఉపయోగించినప్పుడు, ఈ మాటను “మనుజావతారుడిగా ఈ లోకమునకు వచ్చినవాడు” అని లేక “పరలోకమునుండి వచ్చిన మనుష్యుడు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • కొంతమంది అనువాదకులు అప్పుడప్పుడు, “నేను” లేక “నేనే” అనే పదాలను మనుష్య కుమారుడు అనే మాటతో కలిపి (నేను మనుష్య కుమారుడు) తర్జుమా చెస్తూ ఉంటారు, ఎందుకంటే యేసు తనను గూర్చి మాట్లాడుచున్నాడని తెలియజెప్పుటకు అలా చేస్తారు.
  • ఈ పదానికి చేసిన తర్జుమా తప్పుడు అర్థము ఇవ్వకుండా జాగ్రత్తపడండి (అనగా యేసు కేవలము మనుష్యుడు మాత్రమెనన్న భావన లేక అక్రమ సంబంధముగా వచ్చిన కుమారుడు అని అర్థము రాకుండా చూసుకోండి).
  • ఒక వ్యక్తిని సూచించి ఉపయోగించినప్పుడు, “మనుష్య కుమారుడు” అనే ఈ మాటను “నీవు మనుష్యుడవు” లేక “నీవు, మానవుడఫు” లేక “మనిషివి” లేక “మనుష్యుడవు” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: పరలోకము, కుమారుడు, దేవుని కుమారుడు, యెహోవ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H120, H606, H1121, H1247, G444, G5207

మన్నా

నిర్వచనం:

మన్నా తెల్లని గింజల్లా ఉండే ఆహార పదార్ధం, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడచిన తరువాత అరణ్యంలో 40 సంవత్సరాలు వారు భుజించదానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం.

  • మన్నా తెల్లని పొరల్లా కనిపిస్తుంది, ప్రతీ ఉదయం నేల మీద మంచుకింద ఉండేది. అది రుచికి తియ్యగానూ, తేనెలా ఉండేది.
  • ఇశ్రాయేలీయులు సబ్బాతు దినం తప్పించి ప్రతీ రోజు మన్నా పొరలను పోగుచేసుకొనేవారు.
  • సబ్బాతు దినానికి ముందు, రెండింతల మన్నాను పోగుచేసుకోవాలి, తద్వారా విశ్రాంతిదినాన్న వారు పోగుచేసుకోవలసిన అవసరం లేదు.
  • ”మన్నా” అంటే “ఇదేమి” అని అర్థం.
  • బైబిలులో, మన్నా అనే పదం “పరలోకం నుండి ఆహారం,” “పరలోకం నుండి ధాన్యం” అని కూడా సూచిస్తుంది.

అనువాదం సూచనలు

  • దీనిని “ఆహారపు సన్నని పోర” లేక “పరలోకం నుండి ఆహారం” అని అనువాదం చెయ్యవచ్చు.
  • స్థానిక లేక దేశీయ బైబిలు అనువాదంలో ఈ పదం ఏవిధంగా అనువదించబడిందో గమనించండి.

(చూడండి: తెలియనివాటిని అనువదించడం)

(చూడండి: రొట్టె, ఎడారి, గింజ, పరలోకం, సబ్బాతు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4478, G3131

మహిమ, మహిమగల, మహిమ పరచు

నిర్వచనం:

"మహిమ" అనే పదం విలువ, యోగ్యత, ప్రాముఖ్యత, ఘనత, తేజస్సు లేదా మహాత్త్యం అంశాల కుటుంబానికి చెందిన సాధారణ పదం. "మహిమపరచడం" అంటే ఏదైనా ఒకదానికి లేదా ఒక వ్యక్తికి మహిమను ఆపాదించడం లేదా ఏదైనా ఒక వస్తువు ఎంత మహిమగలదో లేదా ఎవరైనా ఒకవ్యక్తి ఎంత మహిమ గలవారో చూపించడం లేదా చెప్పడం.

  • బైబిలులో "మహిమ" పదం ప్రత్యేకించి దేవుణ్ణి వర్ణించదానిని ఉపయోగించబడింది, ఆయన లోకంలో ఏ ఒక్కరికంగె లేదా ఏ ఒక్క వస్తువు కంటే అధికమైన విలువ,, అధికమైన యోగ్యత, అధికమైన ప్రాముఖ్యత, అధికమైన ఘనత, అధికమైన తేజస్సు, అధికమైన మహాత్త్యం గలవాడు. ఆయన దైవస్గవభావం గురించిన ప్రతీది ఆయన మహిమను బయలుపరుస్తుంది.
  • దేవుడు చేసిన అద్భుత కార్యాలను గురించి చెప్పడం ద్వారా మనుష్యులు దేవుణ్ణి మహిమపరచవచ్చు. దేవుని దైవ స్వభావం ప్రకారం జీవించడం ద్వారా వారు దేవుణ్ణి మహిమ పరచవచ్చు. ఎందుకంటే ఆవిధంగా చెయ్యడం ఇతరులకు ఆయన విలువ, యోగ్యత, ప్రాముఖ్యత, ఘనత, తేజస్సు, మహాత్త్యం లను చూపిస్తుంది.
  • "ఏదైనా ఒక దానిలో మహిమ" అనే వ్యక్తీకరణకు ఏదైనా ఒకదానిలో అతిశయపడడం లేదా గర్వపడడం అని అర్థం.

పాత నిబంధన

  • పాత నిబంధనలో "యెహోవా మహిమ" అనే నిర్దిష్ట పదబంధం సాధారణంగా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో యెహోవా సన్నిధి విషయంలో గ్రాహ్యంకాగల ప్రత్యక్షతను సూచిస్తుంది.

క్రొత్త నిబంధన

  • తండ్రి అయిన దేవుడు యేసు యెంత మహిమ గలవాడో మనుష్యులకు సంపూర్తిగా వెల్లడి చెయ్యడం ద్వారా కుమారుడైన దేవుణ్ణి మహిమపరుస్తాడు.
  • క్రీస్తులో విశ్నవాసం ఉంచే ప్రతి ఒక్కరూ ఆయనతో మహిమ పరచబడతారు. "మహిమపరచబడడం" పదం ఉపయోగం విశిష్టమైన అర్థాన్ని తీసుకువస్తుంది. అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిన మనుష్యులు సజీవులుగా లేపబడతారు, ఆయన పునరుత్థానం తరువాత ప్రత్యక్షం అయినప్పుడు శారీరకంగా మార్పు చెంది యేసు వలే మార్పు చెందుతారు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "మహిమ" పదం "తేజస్సు" లేదా "మహాత్త్యం" లేదా "అద్భుతమైన గొప్పతనం" లేదా "అత్యంత ఉన్నతమైన విలువ" లాంటి ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "మహిమగల" పదం "సంపూర్ణ మహిమ" లేదా "అత్యంత ఉన్నతమైన విలువగలది" లేదా "ప్రకాశమానంగా వెలుగుతున్నది " లేదా "అద్భుతమైన మహాత్త్యం" అని అనువదించబడవచ్చు.
  • “దేవునికి మహిమ చెల్లించు" అనే వ్యక్తీకరణ "దేవుని గొప్పతనాన్ని ఘనపరచు" లేదా ఆయన తేజస్సును బట్టి దేవుణ్ణి స్తుతించు" లేదా దేవుడు యెంత గొప్పవాడో ఇతరులకు చెప్పు" అని అనువదించవచ్చు.
  • "మహిమ" అనే పదం "స్తుతి” లేదా "గర్వపడు" లేదా “అతిశయ పడు.” లేదా "సంతోషించు" అని అనువదించబడవచ్చు.
  • "మహిమ పరచు" పదం "మహిమ ఇవ్వు” లేదా “మహిమ తీసుకురా" లేదా “గొప్పగా కనిపింప చెయ్యి" అని కూడా అనువదించబడవచ్చు.
  • "దేవుణ్ణి మహిమ పరచు" పదబంధం "దేవుణ్ణి స్తుతించు" లేదా "దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడు" లేదా దేవుడు యెంత గొప్పవాడో చూపించు" లేదా "దేవుణ్ణి ఘనపరచు" (ఆయనకు విధేయత చూపించడం ద్వారా)" అని కూడా అనువదించబడవచ్చు.
  • "మహిమ పొందు" పదం "చాలా గొప్పగా చూపించబడు" లేదా "స్తుతించబడు" లేదా "హెచ్చించబడు" అని కూడా అనువదించబడవచ్చు.

(See also: ఘనత, మహాత్త్యం, హెచ్చించు, విధేయత చూపించు, స్తుతి)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 23:07 వెంటనే, పరలోకం దేవదూతలతో నిండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, పరలోకంలో దేవునికి మహిమ మరియు భూమి మీద ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం!"
  • 25:06 తరువాత సాతాను యేసుకు అన్ని లోక రాజ్యాలన్నటినీ, వాటి మహిమ అంతటినీ చూపించాడు. ఇలా చెప్పాడు, "నీవు నాకు మ్రొక్కి నన్ను ఆరాధించినట్లయితే వీటన్నిటినీ నేను నీకు ఇస్తాను."
  • 37:01 యేసు ఆ వార్త వినినప్పుడు "ఈ వ్యాధి ముగింపు మరణం కాదు, అయితే ఇది దేవుని మహిమ కోసమే" అని చెప్పాడు.
  • 37:08 యేసు ఇలా జవాబిచ్చాడు, "నీవు నాలో విశ్వాసం ఉంచినట్లయితే దేవుని మహిమ ను చూస్తావని నీతో చెప్పలేదా?"

పదం సమాచారం:

  • Strong's: H117, H142, H155, H215, H1342, H1921, H1922, H1925, H1926, H1935, H1984, H2892, H3367, H3513, H3519, H3520, H6286, H6643, H7623, H8597, G1391, G1392, G1740, G1741, G2620, G2744, G2745, G2746, G2755, G2811, G4888

ముందుగా నిర్ణయించబడుట, ముందుగా నిర్ణయించబడినది

నిర్వచనము:

“ముందుగా నిర్ణయించుట” మరియు “ముందుగా నిర్ణయించబడుట” అనే పదములు ఏదైనా కార్యము జరుగక మునుపే ప్రణాళికవేయుట లేక నిర్ణయించుటను సూచిస్తుంది.

  • ఈ పదము ప్రత్యేకముగా నిత్యజీవమును పొందుకొనుటకు దేవుడు ప్రజలను ముందుగానే నిర్ణయించియున్నాడని సూచిస్తుంది.
  • కొన్నిమార్లు “ముందుగా నియమించుట” అనే పదము కూడా ఉపయోగించబడినది, ఈ మాటకు కూడా ఏదైనా కార్యము జరుగక మునుపే నిర్ణయించుట అని అర్థము కలదు.

తర్జుమా సలహాలు:

  • “ముందుగా నిర్ణయించబడుట” అనే ఈ మాటను “ముందుగానే తీర్మానించుట” లేక “రానున్న సమయాన్ని లేక విధిని ముందుగా తీర్మానించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ముందుగా నిర్ణయించబడెను” అనే ఈ మాటను “ఎంతో కాలము క్రితమే నిర్ణయించబడియుండుట” లేక “రానున్న సమయాన్ని లేక విధిని ప్రణాళిక చేయుట” లేక “ఏదైనా కార్యము జరుగక మునుపే తీర్మానము చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “మనము ముందుగానే నిర్ణయించబడియున్నాము” అనేటువంటి వ్యాఖ్యను “మనము ఇలా ఉండాలని ఎంతో కాలము క్రితమే తీర్మానించబడియున్నాము” లేక “రానున్న కాలములో మను ఇలా ఉండాలని మనమిప్పటికే నిర్ణయించబడియున్నాము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఈ పదము యొక్క తర్జుమా “ముందుగా తెలిసికొనియుండుట” అను మాటకు విభిన్నముగా ఉండునట్లు చూచుకొనవలెనని సూచన.

(ఈ పదములను కూడా చూడండి: ముందుగా తెలిసికొనియుండుట)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G4309

మూలరాయి, మూలరాళ్లు

నిర్వచనం:

ఈ పదం "మూలరాయి" ఒక భవనం నిర్మాణంలో పునాది మూలన ఒక ప్రత్యేకమైన చోటు కోసం చెక్కిన పెద్ద రాయిని సూచిస్తున్నది.

  • భవనంలోని మిగతారాళ్లన్నీ మూలరాయితో సంబంధించి మలుస్తారు.
  • ఇది కట్టడం మొత్తానికీ ప్రాముఖ్యత, బలం, సామర్థ్యం గల రాయి.
  • కొత్త నిబంధనలో, విశ్వాసుల సమావేశాన్ని రూపకాలంకారికంగాఒక భవనంగా పోల్చారు. దానికి యేసు క్రీస్తు "మూలరాయి."
  • అదే విధంగా భవనం మూలరాయి భవనం అంతటికీ ఆధారంగా ఉండి మొత్తం భవనం ఆకృతిని నిర్ణయిస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు మూలరాయిగా విశ్వాసులు సంఘానికి పునాదిగా ఆధారంగా ఉంది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని "ముఖ్య భవనం రాయి” లేక “పునాది రాయి." అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.
  • లక్ష్య భాషలో ముఖ్య ఆధారంగా పునాదిగా ఉండే దాన్ని సూచించే పదం ఉందేమో చూడండి. అలా ఉంటే ఆ పదాన్ని ఉపయోగించ వచ్చు.
  • దీన్ని అనువదించే మరొక పద్ధతి, "భవనం మూల పునాది రాయిగా వాడే రాయి."
  • భవనం కోసం వాడిన రాళ్ళలో దృఢమైన, భద్రమైన పెద్ద రాయిని దీనికోసం ఉపయోగిస్తారు అని గుర్తు పెట్టుకోవడం ప్రాముఖ్యం

భవనం నిర్మించడానికి రాళ్లు ఉపయోగించక పోతే ఇక్కడ మరొకపదం ఉపయోగించాలి. "పెద్ద రాయి" ("బండ రాయి"). అయితే అందులో చక్కగా అమిరే రాయి, దాని కోసమే ప్రత్యేకంగా చేసినది అనే అర్థం రావాలి.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H68, H6438, H7218, G204, G1137, G2776, G3037

మ్రొక్కుబడి, మ్రొక్కుబడులు, మ్రొక్కుకొనెను

నిర్వచనము:

మ్రొక్కుబడి అనేది ఒక వ్యక్తి దేవునితో చేసుకున్న ప్రమాణము’. దేవునిని ప్రత్యేకముగా ఘనపరచుటకు లేదా దేవుని యెడల ఉన్న భక్తిని కనబరచుటకు మానవుడు ఏదైనా పని చేస్తాము అను ప్రమాణము చేస్తారు.

  • ఒక వ్యక్తి తన మ్రొక్కుబడి చేసిన తరువాత , అతను మొహమాటము లేకుండా తన మ్రొక్కుబడి చెల్లించాలి.
  • ఒక వ్యక్తి తన మ్రోక్కుబడిని కొనసాగించకపోతే ఆ వ్యక్తి దేవుని చేత తీర్పుతీర్చబడతాడు అని బైబిలు భోధించుచున్నది.
  • కొన్నిసార్లు ఒక వ్యక్తి తనను రక్షించడానికి లేదా తనకు అన్ని అనుకులపరచడానికి అయన చేసిన ప్రమాణాలను మార్చుకోవచ్చు.
  • అయితే దేవుడు తన మ్రొక్కుబడిలో చేసుకున్న విన్నపాలను అంగీకరించవలసిన అవసరం లేడు.

తర్జుమా సలహాలు:

  • సందర్భాన్ని ఆధారంచేసుకొని, “మ్రొక్కుబడి” అనేది “గంభీరమైన వాగ్ధానము” లేదా “దేవునితో చేసిన ప్రమాణము ” గా అనువదింపబడింది.
  • మ్రొక్కుబడి అనేది దేవునితో చేసే ప్రత్యేకమైన ప్రమాణము.

(దీనిని చూడండి: వాగ్ధానము, ప్రమాణము)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H5087, H5088, G2171

యాజకుడు, యాజకులు, యాజకత్వము

నిర్వచనము:

పరిశుద్ధ గ్రంథములో ఒక యాజకుడు దేవుని ప్రజల పక్షముగా దేవుని బలులు అర్పించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తియైయున్నాడు. “యాజకత్వము” అనునది యాజకుని స్థితిని లేక అతని ధర్మమును తెలియజేయు పదమునైయున్నది.

  • పాత నిబందనలో ఇశ్రాయేలు జనము కొరకు దేవుని యాజకులుగా ఉండుటకు ఆయన ఆహరోనును మరియు అహరోను సంతతిని ఎన్నుకొనెను.
  • “యాజకత్వము” అనునది లేవియుల సంతతిలో తండ్రినుండి కుమారునికి అందించే ఒక బాధ్యత మరియు ఒక హక్కుగా పరిగణించబడినది.
  • ఇశ్రాయేలు యాజకులు దేవాలయములో తమ కర్తవ్యములుతోపాటు ప్రజలు దేవునికి అర్పించు బలుల బాధ్యతను కూడా కలిగియుండిరి.
  • యాజకులు కూడా దేవుని ప్రజల పక్షముగా దేవుని దైనందిన ప్రార్థనలు అర్పించెడివారు మరియు ఇతర భక్తి సంబంధమైన ఆచారములను జరిగించెడివారు.
  • యాజకులు సంప్రదాయకమైన ఆశీర్వాదములను జనులపైన పలుకుతారు మరియు వారికి ధర్మశాస్త్రమును తెలియజేస్తారు.
  • యేసు కాలములో రెండు రకాల యాజకులు ఉండేవారు, వారిలో ప్రధాన యాజకులు మరియు మహా యాజకుడు ఉందురు.
  • యేసు దేవుని సన్నిధిలో మనకొరకు విజ్ఞాపనముచేసే “మహా ప్రధాన యాజకుడైయున్నాడు”. ఆయన తనను తాను పాపముకొరకు అంతిమ బలిగా అర్పించుకొనియున్నాడు. మనుష్య యాజకుల ద్వారా చేయబడే బలులు ఎప్పటికి అవసరములేదని ఈ మాటకు అర్థము.
  • క్రొత్త నిబంధనలో యేసునందు విశ్వాసముంచిన ప్రతియొక్కరు “యాజకులుగా” పరిగణించబడియున్నారు. వీరు తమకొరకు మరియు ఇతరులకొరకు విజ్ఞాపన చేయుటకు ప్రార్థనలో దేవునితో నేరుగా మాట్లాడుటకు యోగ్యులైయున్నారు.
  • పురాతన కాలములో బయలు దేవత అనేటువంటి అబద్ధపు దేవుళ్ళకు అర్పించిన ఇతర అన్య యాజకులు కూడా ఉండిరి.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా, “యాజకుడు” అనే ఈ పదమును “బలిని ఇచ్చువాడు” లేక “దేవుని మధ్యవర్తి” లేక “బలిని అర్పించు మధ్యవర్తి” లేక “దేవునికి ప్రాతినిధ్యం వహించుటకు ఆయన ఎన్నుకొనిన ఒక వ్యక్తి” అని కూడా తర్జుమా చేయవచ్చు.
  • తర్జుమా చేయబడిన “యాజకుడు” అనే ఈ పదము “మధ్యవర్తి” అనే పదమునకు విభిన్నమైనది మరియు వేరే అర్థమును కలిగియున్నది.
  • “ఇశ్రాయేలు యాజకుడు” లేక “యూదుడైన యాజకుడు” లేక “యెహోవ యాజకుడు” లేక “బయలు యాజకుడు” అని కొంతమంది అనువాదకులు ఎల్లప్పుడు చెప్పడానికి ప్రాధాన్యతనిస్తారు.
  • “యాజకుడు” అని తర్జుమా చేసిన ఈ పదము “ప్రధాన యాజకుడు”, “మహా యాజకుడు”, “లేవియుడు” మరియు “ప్రవక్త” అనే పదములకు విభిన్నముగా ఉండాలి.

(ఈ పదములను కూడా చూడండి: అహరోను, ప్రధాన యాజకులు, మహా యాజకుడు, మధ్యవర్తి, బలియాగము)

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 04:07 “మెల్కీసెదెకు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు.”
  • 13:09 ధర్మశాస్త్రమునకు అవిధేయత చూపించువారు దేవుని బలియర్పణగా గుడారపు ప్రవేశ ద్వారమునకు ముందు స్థలమునకు ఒక ప్రాణిని తీసుకొని రావలెయును. యాజకుడు ఆ ప్రాణిని వధించి, దానిని బలిపీఠము మీద దహించవలెను. ఒక జంతువు రక్తము బలిని అర్పించిన వ్యక్తి పాపమును కప్పుతుంది మరియు ఆ వ్యక్తిని దేవుని దృష్టిలో శుద్దునిగా కనబడునట్లు చేస్తుంది. దేవుడు మోషే అన్నయైన ఆహరోనును ఎన్నుకున్నాడు మరియు అహరోను సంతానము ఆయన యాజకులుగా ఉండిరి.
  • 19:07 అందుచేత, బయలు యాజకులు బలియర్పణను సిద్ధపరిచిరి, కాని అగ్నితో వారు దానిని దహించలేకపోయిరి.
  • 21:07 ఇశ్రాయేలు యాజకుడు ప్రజల పాపములకొరకు నియమించబడిన శిక్షకు బదులుగా ప్రజల పక్షముగా దేవుని బలులను అర్పించు వ్యక్తియైయున్నాడు. యాజకులు కూడ ప్రజల కొరకు దేవునికి ప్రార్థన చేసిరి.

పదం సమాచారం:

  • Strong's: H3547, H3548, H3549, H3550, G748, G749, G2405, G2406, G2407, G2409, G2420

యూదుడు, యూదదేశసంబంధ

వాస్తవాలు:

యూదులు అబ్రాహాము మనవడు యాకోబు సంతానం నుండి వచ్చిన ప్రజలు. "యూదుడు" అనే పేరు "యూదా" నుండి వచ్చింది.

  • ఇశ్రాయేలీయులు బబులోను ప్రవాసం నుండి యూదాకు తిరిగి వచ్చిన తరువాత ప్రజలు వారిని "యూదులు" అని పిలవడం ఆరంభించారు.
  • యేసు క్రీస్తు యూదుడు. అయితే, యూదు మత నాయకులు ఆయనను తిరస్కరించారు, ఆయన చంపబడాలని కోరారు.

(చూడండి: అబ్రాహాము, యాకోబు, ఇశ్రాయేలు, బబులోను, యూదు నాయకులు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 20:11 ఇశ్రాయేలీయులు ఇప్పుడు యూదులు అని పిలువబడుతున్నారు. వారిలో చాలా మంది తమ పూర్తి జీవితాలు బబులోనులో నివసించారు.
  • 20:12 కాబట్టి 70 సంవత్సరాల ప్రవాసం తరువాత, యూదులు ఒక చిన్న గుంపు యూదాలోని యెరూషలేం నగరానికి తిరిగి వచ్చారు.
  • 37:10 యూదులలో అనేకులు ఈ అద్భుతం కారణంగా యేసు నందు విశ్వాసం ఉంచారు.
  • 37:11 అయితే యూదుల మత నాయకులు ఈర్ష్యతో ఉన్నారు, కాబట్టి వారు యేసునూ, లాజరునూ కలిపి చంపడానికి పథకం వేశారు.
  • 40:02 "యూదుల రాజు" అని సిలువమీద యేసు తల మీదుగా రాయమని పిలాతు అజ్ఞాపించాడు.
  • 46:06 వెంటనే సౌలు "యేసు దేవుని కుమారుడు!" అని దమస్కు లో యూదులకు ప్రకటించడం మొదలు పెట్టాడు.

పదం సమాచారం:

  • Strong's: H3054, H3061, H3062, H3064, H3066, G2450, G2451, G2452, G2453, G2454

యూదులకు రాజు, యూదుల రాజు

నిర్వచనం:

“యూదుల రాజు” అనే పదం మెస్సీయ అయిన యేసును సూచించే బిరుదు.

  • ”యూదులకు రాజు” గా పుట్టినవానిని దర్శించడానికి బెత్లేహెంకు ప్రయాణమైన జ్ఞానులు వినియోగించినపుడు ఈ బిరుదును బైబిలు మొట్టమొదటి సారి నమోదు చేసింది.
  • దావీదు సంతానమైన తన కుమారుడు రాజుగా ఉంటాడని, తన పరిపాలన శాస్వితంగా ఉంటుందని దూత మరియకు తెలియజెప్పాడు.
  • యేసు సిలువ వేయబడడానికి ముందు రోమా సైనికులు యేసును “యూదులకు రాజు” అని హేళన చేసారు. ఈ బిరుదు ఒక చెక్క ముక్కపై రాసి యేసు సిలువకు పైగా దానిని కొట్టారు.
  • యేసు నిజముగా యూదులకూ, సమస్త సృష్టి మీదా రాజుగా ఉన్నాడు.

అనువాదం సూచనలు:

“యూదులకు రాజు” అనే పదాన్ని “’యూదుల పై రాజు” లేక “యూదుల మీద ప్రభుత్వం చేసే రాజు” లేక “యూదుల సరశ్రేష్ట పరిపాలకుడు” అని అనువదించవచ్చు.

  • ”రాజు” అనే మాట అనువాదంలో ఇతర స్థలాలో ఏవిధంగా అనువదించబడిందో చూడండి.

(చూడండి: సంతానం, యూడుడు, యేసు, రాజ్యము, దేవుని రాజ్యము, జ్ఞానులు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 23:09 కొంత కాలం అయిన తరువాత, దూర దేశములలోని జ్ఞానులు తూర్పు దిక్కున ఆకాశంలో ఒక అసహజమైన నక్షత్రాన్ని చూసారు. యూదులకు రాజు గా ఒక కొత్త రాజు పుడుతున్నాడని వారు గుర్తించారు.
  • ౩౯:12 “నీవు యూదులకు రాజువా?” అని పిలాతు యేసును అడిగాడు.
  • 39:12 రోమా సైనికులు యేసును కొరడాలతో కొట్టారు, రాజ వస్త్రాన్ని ధరింపజేశారు, ఒక ముళ్ళ కిరీటాన్ని ఆయనమీద పెట్టారు. “యూదులకు రాజు ను చూడండి” అని ఆయనను హేళన చేసారు!
  • 40:02 ఒక చెక్క ముక్క మీద “యూదులకు రాజు అని రాయించి సిలువమీద యేసు తలకుపైగా ఉంచాలని పిలాతు ఆజ్ఞాపించాడు.

పదం సమాచారం:

  • Strong's: G935, G2453

యూదేతరుడు, యూదేతరులు

వాస్తవాలు:

"యూదేతరుడు" అంటే యూదుడు కాని వాడు. యూదేతరులు అంటే యాకోబు సంతానం కానీ వారు.

  • బైబిల్లో, యూదేతరులను "సున్నతి లేని" అని అలంకారికంగా అంటారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు చేసినట్టుగా వారిలో అనేక మంది వారి మగపిల్లలకు సున్నతి చేయరు.
  • దేవుడు ఎన్నుకొన్న యూదులు అయన ప్రత్యేక ప్రజ. వీరు యూదేతరులను బాహ్యులుగా, దేవుని ప్రజలు కాని వారుగా ఎంచారు.
  • యూదులను "ఇశ్రాయేలీయులు” లేక “హెబ్రీయులు" అని ఆయా సమయాల్లో పిలిచారు. వారు ఇక మిగతా వారందరినీ "యూదేతరులు" అని పిలిచారు.
  • యూదేతరుడు అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "యూదుడుకాని వాడు” లేక “ఇశ్రాయేలు జాతికి చెందని వాడు" (పాత నిబంధన".
  • సాంప్రదాయికంగా, యూదులు యూదేతరులతో కలవరు, కలిసి భోజనం చెయ్యరు. ఇది ఆది సంఘంలో సమస్యలకు కారణం అయింది.

(చూడండి: ఇశ్రాయేలు, యాకోబు, యూదుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1471, G1482, G1484, G1672

యెహోవా

వాస్తవాలు:

దేవుడు మోషెతో మండుచున్న పొదలోనుండి మాట్లాడినప్పుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోనడానికి “యెహోవా” అనే పదమును ఆయన వ్యక్తిగత పేరుగ తెలియపరచారు.

  • “యెహోవా” అనే పదమునకు “ఉన్నవాడు” లేక “ఉనికి” కలిగియున్నాడని అర్థమిచ్చు పదమునుండి తీసుకొనబడియున్నది.
  • “యెహోవా” అను పదమునకు “ఆయన” లేక “నేను” లేక “కలుగజేయువాడు అని అర్థములు కలవు.
  • దేవుడు ఎల్లప్పుడూ జివిస్తున్నాడని మరియు జీవించును అని ఈ పేరు తెలియజేయుచున్నది. ఆయన సదాకాలము ఉన్నాడని దానికి మరియొక అర్థము కలదు.
  • ఆచరమును పాటించుచు, అనేక పరిశుద్ధ గ్రంథములలో “యెహోవా” అనే పదమునకు “ప్రభువు” అని ఉపయోగించబడియున్నది. యెహోవా పేరును తప్పుగా ఉచ్చరించెదమేమో అని యూదులు “యెహోవా” అనే పదము లేఖనలలో ఉపయోగించబడియున్న ప్రతి చోట “ప్రభువు” అని పలుకుటకు ప్రారంభించడం ద్వారా ఈ పధ్ధతి వచెనని చారిత్రాత్మకముగ ఉన్న వాస్తవ సంగతియైయున్నది. దేవుని వ్యక్తిగత నామమును (పేరును) గౌరవించులాగున మరియు హెబ్రీ భాషలో వాడబడు వేరొక “ప్రభువు” అనే పదమునకు కలుగు అర్థమును వేరుపరచులాగున ఆధునిక బైబిల్లలో “ప్రభువు” అనే పదమును పెద్ద అక్షరములలో వ్రాయబడియున్నది.
  • పాత నిబంధన గ్రంథములో ఉపయోగించబడిన హెబ్రీ భాషలో “యావ్హె” అని పిలువబడినట్లుగానే యుఎల్బి మరియు యుడిబి బైబిల్లలో కూడా ఈ పదమును అనువాదం చేసిరి.
  • “యావ్హే” అనే పదము క్రొత్త నిబంధన గ్రంథములో ఒక్క మారును కనుబడలేదు; పాత నిబంధన గ్రంథములోని వాక్య భాగమును సూచించుటకు “ప్రభువు” అనే గ్రీకు పదమును మాత్రమే ఉపయోగించబడియున్నది.
  • పాత నిబంధన గ్రంథములో, దేవుడు తనను గూర్చి మాట్లాడుచున్నప్పుడు, నామవాచకం ఉపయోగించడానికి బదులుగా ఆయన పేరునే ఉపయోగించారు.
  • దేవుడే అక్కడ మాట్లాడుచున్నాడని చదువరులకు సూచించడానికి యుఎల్బి బైబిల్లో “నేను” అనే నామవాచక పదమును ఉపయోగించియున్నారు.

తర్జుమా సలహాలు

  • “యహ్వే” అనే పదమును లేక వాక్యమును “నేనున్నాను” లేక “జీవించువాడు” లేక “ఉన్నవాడు” లేక “జీవించుచున్నవాడు” అని తర్జుమా చేయవచ్చును.
  • ఈ పదమును “యహ్వే” అని ఏరితిగా పలుకుతారో అదే విధముగా వ్రాయవచ్చును.
  • కొన్ని సంఘాల శాఖలలో “యహ్వే” అనే పదమును ఉపయోగించడానికి ఇష్టపడరు అందువలన సాంప్రదాయకంగా వచ్చిన పద్ధతి ప్రకారముగా “ప్రభువు” అనే పదమును ఉపయోగిస్తారు. ఈ పదమును గట్టిగా చదువుచున్నప్పుడు “ప్రభువు” అనే పదమునకుగల అర్థమును స్పురింప జేయవచ్చును అని ఇక్కడ గమనించతగిన ప్రాముఖ్యమైన సంగతియైయున్నది. “ప్రభువు” అనే పేరుకు (యహ్వే) మరియు “ప్రభువు” అనే బిరుదుకుగల వెత్యాసమును తెలియపరచుటకు కొన్ని భాషలలో ఆ పదముకు తోడుగా లేక వ్యాకరణ సంబంధమైన పదమును జోడిస్తారు.
  • వాక్య భాగములలో యహ్వే అనే పదము వచ్చినప్పుడు సాద్యమైనంతవరకు దానిని అలాగే ఉంచడము మంచిది అయితే వాక్య భాగము సహజంగా మరియు స్పష్టంగా అర్థం కావడానికి కొన్ని తర్జుమాలలో నామవాచక పదమును మాత్రమే ఉపయోగిస్తారు.
  • “యహ్వే సెలవిచ్చునది ఏమనగా” అని ఒక వాక్యమును ప్రారంభించవచ్చును.

(తర్జుమా సలహాలు: పేర్లను ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: దేవుడు, ప్రభువు, ప్రభువు, మోషె, తెలియప్రచడం)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 09:14 “నేను ఉన్నవాడను అని దేవుడు చెప్పెను. ‘ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని’ వారితో చెప్పమనెను. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా అని వారితో చేప్పమనెను. నిరంతరమూ నా నామము ఇదే.”
  • 13:04 అప్పుడు దేవుడు వారికి నిబంధన ఇచ్చి, “నీ దేవుడైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” అని సెలవిచ్చెను.
  • 13:05 “విగ్రహములను నీవు చేసికొనకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.”
  • 16:01 నిజమైన దేవుడైన యెహోవాను పూజించుటకు బదులుగా ఇశ్రాయేలీయులు కనానీయుల దేవతలను పూజించిరి.
  • 19:10 అప్పుడు ఏలియా, “అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడైన యెహోవా నీవు ఇశ్రాయేలీయుల దేవుడవనియు మరియు నేను నీ దాసుడననియు ఈ దినము తెలియపరచుము” అని ప్రార్థించెను.

పదం సమాచారం:

  • Strong's: H3050, H3068, H3069

యేర్పరచబడిన, కోరుకోండి, యేర్పరచబడిన ప్రజలు, యేర్పరచబడినవాడు, ఎన్నుకొను

నిర్వచనం:

"ఎన్నుకొన్న" పదం అక్షరాలా "ఏర్పరచబడినవారు" లేదా "ఏర్పరచబడిన ప్రజలు" అని అర్థం. దేవుడు తన ప్రజలుగా ఉండడానికి నియమించిన లేదా ఏర్పరచుకొన్నవారిని ఇది సూచిస్తుంది. "ఏర్పరచబడిన వాడు" లేదా "దేవుడు ఏర్పరచిన వాడు" పదం ఏర్పరచబడిన మెస్సీయా అయిన యేసును సూచిస్తున్న బిరుదు.

"కోరుకొన్న" అంటే ఒక దానిని లేదా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదా ఒకదాని విషయంలో నిర్ణయించుకోవడం. ప్రజలు తనకు చెందినవారుగా ఉండడానికీ, ఆయన సేవించడానికీ దేవుడు నియమించుకొన్న ప్రజలను ఈ పదం తరచుగా సూచిస్తుంది.

  • "కోరుకొనబడి ఉండడం" అంటే "యేర్పరచబడియుండడం" లేదా "నియమించబడియుండడం" లేదా ఏదైనా చెయ్యడం.
  • ప్రజలు పరిశుద్ధంగా ఉండడానికీ, ఉత్తమమైన ఆత్మ ఫలం ఫలించే ఉద్దేశం కోసం ఆయన చేత ప్రత్యేకంగా ఉండడానికీ దేవుడు ప్రజలను కోరుకొన్నాడు. అందుచేత వారు "యేర్పరచబడిన(వారు)" లేదా "ఎన్నుకొనబడినవారు" అని పిలువబడ్డారు.
  • దేవుడు తన ప్రజల మీద నాయకులుగా నియమించిన మోషే. రాజైన దావీదు వంటి నిర్దిష్టమైన ప్రజలను సూచించడానికి "యేర్పరచబడినవాడు" పదం కొన్నిసార్లు బైబిలులో ఉపయోగించబడింది. దేవుని చేత యేర్పరచబడిన ప్రజగా ఇశ్రాయేలు దేశాన్ని సూచించడానికి కూడా ఈ పదం ఉపయోగించబడింది.
  • "ఎన్నుకొన్న" పదం అక్షరాలా "యేర్పరచబడినవారు" లేదా "యేర్పరచబడిన ప్రజలు" అని అర్థం ఇచ్చే పురాతన పదం. ఈ పదం క్రీస్తులో విశ్వాసులను సూచించినప్పుడు ఆదిమ భాషలో ఇది బహువచనం.
  • పాత ఇంగ్లీషు బైబిలు అనువాదములలో "యేర్పరచబడిన (ప్రజలు )" పదాన్ని పాత, కొత్తనిబంధనలలో "ఎన్నుకొన్న" పదం ఉపయోగించబడింది. అనేక ఆధునిక అనువాదాలు "ఎన్నుకొన్న" పదం యేసులో విశ్వాసం ద్వారా దేవుని చేత రక్షించబడిన ప్రజలను సూచించడానికి కొత్తనిబంధనలో మాత్రమే ఉపయోగించబడింది. బైబిలులోని మిగిలిన చోట్ల ఈ పదం "యేర్పరచబడినవారు" అని అక్షరార్థంగా అనువదించబడింది.

అనువాదం సూచనలు:

  • "ఎన్నుకొన్న" పదాన్ని "యేర్పరచబడినవారు" లేదా "యేర్పరచబడినప్రజలు" అనే అర్థం ఇచ్చే పదంతో గానీ లేదా పదబంధంతో గానీ అనువదించడం ఉత్తమమైనది. "దేవుడు కోరుకొన్న ప్రజలు" లేదా "తన ప్రజలుగా ఉండడానికి దేవుడు నియమించిన వారు" అని కూడా అనువదించబడవచ్చు.
  • "కోరుకొనబడినవారు" పదబంధం "నియమించబడినవారు" లేదా "యేర్పరచబడినవారు" లేదా "దేవుడు కోరుకొన్న వారు" అని కూడా అనువదించబడవచ్చు.
  • "నేను నిన్ను కోరుకొన్నాను" పదబంధం "నేను నిన్ను నియమించాను" లేదా "నేను యేర్పరచుకొన్నాను" అని అనువదించబడవచ్చు.
  • యేసు క్రీస్తు విషయంలో "యేర్పరచబడినవాడు" పదం "దేవుడు కోరుకొన్నవాడు" లేదా "దేవుడు ప్రత్యేకంగా నియమించిన మెస్సీయా" లేదా "(ప్రజలను రక్షించడానికి) దేవుడు నియమించిన వాడు" అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: నియమించు, క్రీస్తు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H970, H972, H977, H1262, H1305, H4005, H6901, G138, G140, G1586, G1588, G1589, G1951, G4400, G4401, G4758, G4899, G5500

యేసు, యేసు క్రీస్తు, క్రీస్తు యేసు

వాస్తవాలు:

యేసు దేవుని కుమారుడు. "యేసు" అంటే "యెహోవా రక్షించును." "క్రీస్తు" అనే పదం ఒక బిరుదు అంటే "అభిషేకించబడిన వాడు." దీనికి మరొక పదం మెస్సీయా.

  • రెండు పేర్లు తరచుగా "యేసు క్రీస్తు” లేదా “క్రీస్తు యేసు" గా కలిసిపోయి ఉంటాయి. ఈ రెండు పేర్లు దేవుని కుమారుడు మెస్సీయా అని నొక్కి చెపుతున్నాయి, ప్రజలు తమ పాపాల కోసం శిక్షించబడకుండా రక్షించడానికి ఆయన వచ్చాడు.
  • అద్భుత రీతిలో, పరిశుద్ధాత్మ శాశ్వతుడైన దేవుని కుమారుడు మానవుడుగా జన్మించేలా చేశాడు. దేవుని దూత యేసు అయన తల్లి ఆయనకు "యేసు" అని పేరు పెట్టాలని చెప్పాడు. ఎందుకంటే అయన తన ప్రజలను వారి పాపాలనుండి రక్షించడానికి దైవసంకల్పంతో ఉన్నాడు.
  • యేసు అనేక అద్భుతాలు చేశాడు, ఆయన దేవుడూ, ఆయన క్రీస్తూ లేదా మెస్సీయా అని బయలుపరచుకొన్నాడు.

అనువాదం సూచనలు:

  • అనేక భాషలలో "యేసు,” “క్రీస్తు" పదాలు మూల భాషలో ఉన్నపదాలకు సాధ్యమైనంతవరకూ దగ్గరగా ధ్వనించేలా లేదా అక్షరాలూ ఉండే విధానంలో పలుకబడ్డాయి. ఉదాహరణకు, "జెసుక్రిస్టో," జెజస్ క్రిస్థస్" "యేసుస్ క్రిస్తస్," "హెసుక్రిస్టో" పదాలు ఇతర భాషలలో వివిధ రీతులలో అనువదించబడిన పేరులు.
  • "క్రీస్తు," అనే పేరుకు కొందరు అనువాదకులు "మెస్సియా" పదంలోని కొంత రూపాన్ని పూర్తిగా ఉపయోగించడానికి యెంచుకొన్నారు.
  • ఈ పేర్లు స్థానిక, జాతీయ భాషలలో ఏవిధంగా ఉచ్చరించబడాలో కూడా పరిశీలించండి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)

(చూడండి: క్రీస్తు, దేవుడు, తండ్రి అయిన దేవుడు, ప్రధాన యాజకుడు, దేవుని రాజ్యం, మరియ, రక్షకుడు , దేవుని కుమారుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 22:04 దేవదూత చెప్పాడు, "నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు.” అయన పేరు యేసు ఆయనే మెస్సియా అవుతాడు."
  • 23:02 "ఆయనకు యేసు (అంటే, 'యెహోవా రక్షించును') అని పేరు పెట్టు, ఎందుకంటే అయన ప్రజలను వారి పాపాలనుండి రక్షిస్తాడు."
  • 24:07 కాబట్టి యేసు ఏ పాపం చేయకపోయినా యోహాను ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు.
  • 24:09 ఒకే ఒక దేవుడు. అయితే తండ్రి అయిన దేవుడు మాట్లాడడం యోహాను విన్నాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చినప్పుడు కుమారుడైన యేసును. పరిశుద్ధాత్మనూ చూచాడు.
  • 25:08 యేసు సాతాను శోధనలకు లొంగ లేదు. కాబట్టి సాతాను ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.
  • 26:08 తరువాత యేసు గలిలయ ప్రాంతం అంతటా సంచారం చేశాడు, పెద్ద జన సమూహం అయన దగ్గరకు వచ్చారు. వారు అనేక మంది రోగులను, అవిటి వారిని, గుడ్డి వారిని, కుంటి, మూగ, చెవిటి వారిని తీసుకు వచ్చారు. యేసు వారిని స్వస్థపరిచాడు.
  • 31:03 తరువాత యేసు ప్రార్థన ముగించి శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. ఆయన నీటిపై నడుస్తూ సరస్సు మీద వారి పడవ దగ్గరకు వెళ్ళాడు!
  • 38:02 అతడు (యూదా) యూదు నాయకులు యేసు మెస్సియా అనే దానిని నిరాకరించారు అని విని ఆయన్ని చంపడానికి కుట్ర లో చేరాడు.
  • 40:08 తన మరణం ద్వారా యేసు మనుషులు దేవుని చెంత చేరడానికి మార్గాన్ని సిద్ధపరచాడు.
  • 42:11 తరువాత యేసు పరలోకం ఆరోహణం అవుతుండగా ఒక మేఘం ఆయనను వారికి కనబడకుండా చేసింది. యేసు కుడివైపున కూర్చుని అన్నిటిమీదా పరిపాలన చేస్తున్నాడు.
  • 50:17 యేసు ఆయన ప్రజలు నూతన భూమి మీద ఉంటారు ఉనికిలో ఉండే సమస్తం మీదా ఆయన శాశ్వతకాలం పరిపాలన చేస్తాడు. ఆయన ప్రతి కన్నీటి బిందువును తుడిచి వేస్తాడు. హింస, విచారం, ఏడ్పు, దుష్టత్వం, బాధ లేదా మరణం ఇక ఉండవు. యేసు తన రాజ్యాన్ని సమాధానం, న్యాయంతో పరిపాలిస్తాడు. ఆయన తన ప్రజలతో శాశ్వతకాలం ఉంటాడు.

పదం సమాచారం:

  • Strong's: G2424, G5547

యోగ్యమైన, యోగ్యత, అయోగ్య, యోగ్యరహిత

నిర్వచనం:

“యోగ్యమైన” అనే పదము గౌరవము లేక ఘనత పొందగలిగిన ఒకదానిని లేదా ఒక వ్యక్తిని వివరిస్తుంది. “యోగ్యత కలిగియుండడం” అంటే విలువైనదిగాను లేదా ప్రాముఖ్యమైనదిగాను ఉండడం అని అర్థం. “అయోగ్య” అనే పదానికి ఎటువంటి విలువలేనిది అని అర్థం.

  • యోగ్యత కలిగియుండడం అంటే అనగా విలువైనదిగా ఉండడం లేదా ప్రాముఖ్యమైనదిగా ఉండడం అని అర్థం.
  • “అయోగ్యముగానుండడం” అంటే ఎటువంటి విశేషమైన గమనానికి అర్హతలేకుండా ఉండడం అని అర్థం.
  • యోగ్యమైన అని భావించకుండా ఉండడం అంటే ఇతరులకంటే తక్కువ ప్రాముఖ్యమని యెంచడం లేదా దయనూ లేదా ఘనతనూ పొందే అర్హత కలదని భావించకుండ ఉండడం అని అర్థం.
  • “అయోగ్య,” “యోగ్యరహిత” పదాలు ఒకదానికొకటి సంబంధము కలిగియుంటాయి, అయితే విభిన్నమైన అర్థాలను కలిగియుంటాయి. “యోగ్యతలేని" విధంగా ఉండడం అంటే ఎటువంటి గుర్తింపుకైనా లేదా ఘనతకైనా అర్హతలేదని అర్థం. "యోగ్యరహితం” గా ఉండడం అంటే ఎటువంటి ఉద్దేశము లేదా విలువ లేకుండ ఉండడం అని అర్థం.

అనువాదం సూచనలు:

  • “యోగ్యమైన” అనే పదం “అర్హత” లేదా “ప్రాముఖ్యత” లేదా “విలువైన” అని అనువదించబడవచ్చు.
  • “యోగ్యత” అనే పదం “విలువ” లేదా “ప్రాముఖ్యత” అని అనువదించబడవచ్చు.
  • “యోగ్యత కలిగియుండు” అనే వాక్యమును “విలువను కలిగియుండడం” లేదా “ప్రాముఖ్యత కలిగియుండడం” అని అనువదించబడవచ్చు.
  • “దానికంటే యోగ్యత కలిగినది” అనే పదబంధం “దానికంటే విలువైనది” అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి “యోగ్యతలేని” అనే పదం “అప్రాముఖ్యత” లేక “అగౌరవము” లేక “అనర్హత” అని కూడా అనువదించబడవచ్చు.
  • “యోగ్యరహిత” అనే పదం “విలువలేనిది” లేదా “ఉద్దేశములేనిది” లేదా “యోగ్యతలేనిది” అని అనువదించబడవచ్చు.

(చూడండి: ఘనత)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H117, H639, H1929, H3644, H4242, H4373, H4392, H4592, H4941, H6994, H7939, G514, G515, G516, G2425, G2661, G2735

రక్తం

నిర్వచనం:

"రక్తం" ఎరుపు ద్రవం. మనిషి గాయపడితే అతని చర్మం గుండా బయటకు వస్తుంది. రక్తం వ్యక్తి మొత్తం శరీరానికి రక్తం జీవాధారమైన పోషకాలను అందిస్తుంది.

  • రక్తం జీవానికి సంకేతం. రక్తం చిందించినప్పుడు జీవాన్ని కోల్పోవడం లేక మరణం పొందడం జరుగుతుంది.
  • ప్రజలు దేవునికి బలి అర్పణలు చేసినప్పుడు వారు ఒక జంతువును వధించి దాని రక్తాన్ని బలిపీఠంపై పోసే వారు. ఆ జంతువు జీవం బలి అర్పణ అయిపోయింది అనే దానికి ఇది సంకేతం. మనుషుల పాపాలకు ఈ విధంగా వెల చెల్లించడం జరుగుతుంది.
  • సిలువపై తన మరణం ద్వారా యేసు రక్తం సంకేత రూపంగా ప్రజలను వారి పాపాల నుండి శుద్ధి చెయ్యడానికి తమ పాపాలకై వారు పొందవలసిన శిక్ష తప్పించడానికి మార్గం సిద్ధపరిచాడు.
  • "రక్తమాంసాలు" అనే మాట మానవులను సూచిస్తున్నది.
  • "స్వంత రక్తమాంసాలు" అనే మాట శారీరికంగా బంధుత్వం ఉన్న మనుషులను సూచిస్తున్నది.

అనువాదం సలహాలు:

  • లక్ష్య భాషలో రక్తం అనేదాన్ని చెప్పడానికి ఉపయోగించే పదం ఉపయోగించి ఈ పదాన్ని తర్జుమా చెయ్య వచ్చు
  • "రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రజలు” లేక “మానవులు."
  • సందర్భాన్ని బట్టి, "నా స్వంత రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నా స్వంత కుటుంబం” లేక “నా స్వంత బంధువులు” లేక “నా స్వంత ప్రజలు."
  • లక్ష్య భాష లో ఈ అర్థం ఇచ్చే పదం ఉంటే "రక్తమాంసాలు" అనే పదాన్ని ఆ మాట ఉపయోగించి అనువదించవచ్చు.

(చూడండి: శరీరం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 08:03 యోసేపు సోదరులు ఇంటికి తిరిగి వెళ్ళక ముందు వారు యోసేపు అంగీని చింపి దాన్ని మేక రక్తం లో ముంచారు.
  • 10:03 దేవుడు నైలు నదీజలాలను రక్తంగా మార్చాడు, అయితే ఫరో ఇంకా ఇశ్రాయేలీయులను వెళ్ళనియ్యలేదు.
  • 11:05 ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళ తలుపులపై రక్తం పూశారు. కాబట్టి అందరు లోపల ఉండగా దేవుడు ఆ ఇళ్ళు దాటిపోయాడు. గొర్రె పిల్ల రక్తం మూలంగా వారు భద్రంగా ఉన్నారు.
  • 13:09 బలి అర్పణ చేసిన జంతువు రక్తం ఆ వ్యక్తి పాపాన్ని కప్పివేసి అతన్ని దేవుని దృష్టిలో పరిశుభ్రం చేస్తుంది.
  • 38:05 తరువాత యేసు ఒక పాత్ర తీసుకుని ఇలా చెప్పాడు, "దీన్ని తాగండి. ఇది నా రక్తం పాపాల క్షమాపణ కోసం చిందించిన రక్తం మూలంగా అయిన కొత్త నిబంధన.
  • 48:10 ఎవరైనా యేసు, రక్తం పై విశ్వాసం ఉంచితే ఆయన ఆ మనిషి వ్యక్తి పాపం తీసి వేస్తాడు. దేవుని శిక్ష అతన్ని దాటిపోతుంది.

పదం సమాచారం:

  • Strong's: H1818, H5332, G129, G130, G131, G1420

రక్షకుడు, కాపాడువాడు

వాస్తవాలు:

“కాపాడేవాడు” పదం ఇతరులను అపాయము నుండి కాపాడే వ్యక్తినీ లేదా రక్షించే వ్యక్తినీ సూచిస్తుంది. ఇతరులకు బలాన్ని ఇచ్చే వ్యక్తినీ లేదా వారికోసం సమకూర్చే వ్యక్తినీ కూడా సూచిస్తుంది.

  • పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు రక్షకునిగా సూచించబడ్డాడు ఎందుకంటే ఆయన తరచుగా వారి శత్రువులనుండి కాపాడాడు, వారికి బలాన్ని ఇచ్చాడు, వారు జీవించడానికి వారికి కావలసిన వాటన్నినిటినీ సమకూర్చాడు.
  • పాత నిబంధనలో ఇశ్రాయేలు మీదకు దండెత్తి వచ్చిన ఇతర ప్రజా గుంపులకు వ్యతిరేకంగా వారిని నడిపించడం ద్వారా ఇశ్రాయేలీయులను కాపాడడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. ఈ న్యాయాధిపతులు కొన్నిసార్లు "కాపాడేవారు" అని పిలువబడ్డారు. పాతనిబంధనలోని న్యాయాధిపతులు గ్రంథం చరిత్రలో ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను పాలించిన కాలాన్ని నమోదు చేసింది.
  • క్రొత్త నిబంధనలో “రక్షకుడు” పదం యేసు క్రీస్తుకు బిరుదుగాను లేదా ఒక వర్ణనగాను ఉపయోగించబడింది. ఎందుకంటే మనుష్యులు తమ పాపం విషయంలో శాశ్వత శిక్షను పొందకుండా వారిని ఆయన రక్షిస్తున్నాడు. వారి పాపం చేత వారు నియంత్రించబడకుండా కూడా వారిని కాపాడుతున్నాడు.

అనువాదం సూచనలు:

  • సాధ్యమైతే, “రక్షకుడు” పదం “రక్షించు,” “రక్షణ” అనే పదాలకు సంబంధించిన పదాలతో అనువదించబడవచ్చు.
  • ఈ పదం “రక్షించువాడు” లేదా “రక్షించు దేవుడు” లేదా “అపాయమునుండి విడిపించువాడు” లేదా “శత్రువులనుండి కాపాడువాడు” లేదా “పాపమునుండి (ప్రజలను) రక్షించు యేసు” అనే ఇతర విధాలుగా అనువదించబడ వచ్చు.

(చూడండి: రాజు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3467, G4990

రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ

నిర్వచనం:

“రక్షించు” పదం ఒకరు హానికరమైన దానిని లేదా చెడును అనుభవించకుండ కాపాడుటను సూచిస్తుంది. “సురక్షితంగా ఉండడం" అంటే అపాయం నుండి లేదా ప్రమాదం నుండి సంరక్షించబడుట అని అర్థం.

  • భౌతిక అర్థంలో ప్రజలు రక్షించబడతారు, లేదా హాని, ప్రమాదం లేదా మరణం కాపాడబడగలరు.

  • ఆత్మీయ అర్థంలో ఒక వ్యక్తి “రక్షణ" పొందియున్నట్లయితే సిలువలో మరణించిన యేసు ద్వారా దేవుడు అతనిని క్షమించియున్నాడనీ, తాను చేసిన పాపముల కొరకు నరకంలో శిక్షించబడడం నుండి తప్పించబడియున్నాడని అర్థం.

  • ప్రజలు అపాయమునుండి ప్రజలను రక్షించవచ్చు లేదా కాపాడవచ్చు, అయితే దేవుడు మాత్రమే ప్రజలు తమ పాపాల విషయంలో శాశ్వతంగా శిక్షించబడడం నుండి వారిని రక్షించగలడు.

  • “రక్షణ” పదం దుష్టత్వం లేదా ప్రమాదం నుండి రక్షించబడియుండడానినీ లేదా కాపాడబడియుండడానినీ సూచిస్తుంది.

  • బైబిలులో "రక్షణ" పదం సాధారణంగా తమ పాపముల విషయంలో పశ్చాత్తాపపడి యేసు నందు విశ్వాసం ఉంచినవారికి దేవుని చేత ఆత్మీయమైనా, శాశ్వతమైన విడుదల అనుగ్రహించబడడానిని సూచిస్తుంది.

  • దేవుడు తన ప్రజలను భౌతిక సంబంధమైన శత్రువులనుండి రక్షించడానినీ లేదా విడుదల చెయ్యడానినీ కూడా సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • “రక్షించు” పదం “విమోచించు” లేదా “హాని నుండి తప్పించు” లేదా “హానికరమైన విధానమునుండి తీసివేయడం" లేదా “చనిపోవడం నుండి కాపాడడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

  • “తన ప్రాణమును కాపాడుకొనువాడు" వాక్యంలో, “రక్షించు” పదం “భద్రపరచు” లేదా “సంరక్షించు” అని అనువదించబడవచ్చు.

  • “సురక్షిత" పదం “ప్రమాదం నుండి కాపాడబడడం” లేదా “ఎటువంటి హాని జరుగని స్థలంలో" అని అనువదించబడవచ్చు.

  • “రక్షణ" పదం "రక్షించు" లేదా "కాపాడు" పదాలకు సంబంధించిన పదాలను ఉపయోగించి అనువదించబడవచ్చు. "దేవుడు ప్రజలను రక్షించును (వారి పాపాల కోసం శిక్షించబడడం)" లేదా "దేవుడు తన ప్రజలను కాపాడుతాడు (వారి శత్రువుల నుండి)" వాక్యాలలో ఉన్నవిధంగా అనువదించవచ్చు.

  • “దేవుడే నా రక్షణ” వాక్యం “నన్ను రక్షించువాడు దేవుడే” అని అనువదించబడవచ్చు.

  • “నీవు రక్షణ బావులనుండి నీటిని తోడుకొంటావు" వాక్యం “దేవుడు నిన్ను కాపాడుచున్నందున నీటివలె నీవు అలసట తీర్చుకొంటావు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: రాజు, విమోచకుడు, శిక్షించు, పాపం, రక్షకుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణ:

  • 09:08 మోషే తన తోటివారైన ఇశ్రాయేలీయులను రక్షించడానికి ప్రయత్నించాడు.
  • 11:02 దేవుడు తనయందు విశ్వసించిన ప్రతి యొక్క తొలిచూలు బిడ్డను రక్షించడానికి దేవుడు ఒక మార్గమును అనుగ్రహించాడు.
  • 12:05 “భయపడకండి! ఈరోజున దేవుడు మీ కొరకు యుద్ధము చేయును, మిమ్మును రక్షించును” అని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
  • 12:13 దేవుడు ఐగుప్తు సైన్యమునుండి ఇశ్రాయేలీయులను రక్షించి నందున, వారు దేవునిని స్తుతించుటకునూ, వారికి దొరికిన నూతన స్వాతంత్యమును బట్టి వేడుక చేసుకోడానికీ అనేకమైన పాటలు పాడారు,
  • 16:17 ఇశ్రాయేలీయులు పాపము చేయడం, దేవుడు వారిని శిక్షించడం, వారు పశ్చాత్తాపపడడం, మరియు దేవుడు వారిని రక్షించుటకు వారియొద్దకు విమోచకుడిని పంపించడం ఈ విధంగా అనేకమార్లు జరిగింది.
  • 44:08 “మీరు యేసును సిలువవేసియున్నారు, కాని దేవుడు ఆయనను తిరిగి సజీవునిగా చేసియున్నాడు. మీరు ఆయనను తిరస్కరించియున్నారు, కాని యేసు క్రీస్తు శక్తి ద్వారా తప్ప మరి ఏ మార్గాన రక్షణ పొందుటకు ఆవకాశము లేదు!”
  • 47:11 చెరసాల అధిపతి పౌలు సీల వద్దకు వణుకుతూ వచ్చి, “రక్షించబడుటకు నేను ఏమి చేయవలెను?” అని అడిగాడు. “ప్రభువైన యేసునందు విశ్వివాసం ఉంచుము, అప్పుడు నీవునూ, నీ కుటుంబమునూ రక్షించబడుదురు” అని పౌలు జవాబు చెప్పాడు.
  • 49:12 మంచి క్రియలు మిమ్మును రక్షించనేరవు.
  • 49:13 యేసునందు విశ్వసించిన ప్రతి ఒక్కరినీ, ఆయనను తమ రక్షకునిగా స్వీకరించిన ప్రతి ఒక్కరినీ దేవుడు రక్షించును. అయితే ఆయనందు విశ్వసించని వారినెవరిని కూడా ఆయన రక్షించడు .

పదం సమాచారం:

  • Strong's: H983, H2421, H3444, H3467, H3468, H4190, H4422, H4931, H6403, H7682, H7951, H7965, H8104, H8668, G803, G804, G806, G1295, G1508, G4982, G4991, G4992, G5198

రబ్బీ

నిర్వచనము:

“రబ్బీ” అను పదము అక్షరార్థముగా “నా యజమానుడు” లేక “నా బోధకుడు” అని అర్థము.

  • ఇది యూదుల మత బోధకుడిని సూచించుటకు ఉపయోగించబడిన గౌరవపూర్వకమైన పదమునైయున్నది, విశేషముగా దేవుని ధర్మశాస్త్ర బోధకుని పిలిచెదరు.
  • బాప్తిస్మమిచ్చు యోహానును మరియు యేసును కొన్నిమార్లు వారి శిష్యులు ద్వారా “రబ్బీ” అని పిలువబడిరి.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమును తర్జుమా చేయు విధానములో “నా యజమానుడు” లేక “నా బోధకుడు” లేక “గౌరవ ఉపాధ్యాయుడు” లేక “మత బోధకుడు” అనే మాటలను ఉపయోగిస్తారు. కొన్ని భాషలలో ఈ విధముగా అక్షరాలను పెద్దవిగా చేసి ఉపయోగిస్తారు, మరికొన్ని భాషలలో ఈ విధముగా ఉపయోగించరు.
  • తర్జుమా చేయు భాషలో బహుశః బోధకులని ఆ విధముగా సూచించి చెప్పే ప్రత్యెక విధానము ఉండకపోవచ్చు.
  • తర్జుమా చేసిన ఈ పదము యేసు ఒక పాఠశాల ఉపాధ్యాయుడనే అర్థము రాకుండా జాగ్రత్తపడండి.
  • “రబ్బీ” అనే పదము పరిశుద్ధ గ్రంథములోను మరియు జాతీయ లేక అనువాద భాషలో ఏ విధముగా అనువదించబడిందో ఒకసారి చూడండి.

(చూడండి: తెలియని వాటిని ఏ విధముగా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: బోధకుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G4461

రాయి, రాళ్లు, రాళ్లు రువ్వుట

నిర్వచనము:

రాయి అనేది చాలా చిన్న రాతి ముక్క. ఒకరి మీద “రాయిని” రువ్వుట అనగా ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశముతో ఆ మీదకి రాళ్ళను మరియు పెద్ద రాతి బండలను విసరుట అని అర్థము. “రాళ్ళను రువ్వుట” అనగా ఒకరి మీద రాళ్ళను రువ్వే సంఘటనను సూచించుట అని అర్థము.

  • పురాతన కాలములో రాళ్ళను రువ్వే కార్యక్రమము ప్రజలు చేసిన అపరాధముల కొరకు శిక్షగా ప్రజలను చంపే సర్వ సాధారణ విధానమైయున్నది.
  • ప్రజలు వ్యభిచారములాంటి పాపములు చేసినప్పుడు వారిపైన రాళ్ళను రువ్వాలని దేవుడు ఇశ్రాయేలు నాయకులకు ఆజ్ఞాపించియున్నాడు.
  • క్రొత్త నిబంధనలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యేసు క్షమించియున్నాడు మరియు రాళ్ళను రువ్వే ప్రజలను అడ్డగించాడు.
  • యేసును గూర్చి సాక్ష్యమిచ్చినందుకు పరిశుద్ధ గ్రంథములో మొట్ట మొదటిగా చంపబడిన వ్యక్తి స్తెఫెను, ఇతనిని రాళ్ళతో కొట్టి చంపారు.
  • లుస్త్ర పట్టణములో అపొస్తలుడైన పౌలు మీదకి రాళ్ళను విసిరారు, కాని అతనికి తగిలిన గాయములవలన అతను మరణించలేదు.

(ఈ పదములను కూడా చూడండి: వ్యభిచారము, చేయు, అపరాధము, మరణము, లుస్త్ర, సాక్ష్యము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H68, H69, H810, H1382, H1496, H1530, H2106, H2672, H2687, H2789, H4676, H4678, H5553, H5601, H5619, H6344, H6443, H6697, H6864, H6872, H7275, H7671, H8068, G2642, G2991, G3034, G3035, G3036, G3037, G4074, G4348, G5586

లోకం, లోకసంబంధ

నిర్వచనం:

“లోకం” పదం సాధారణముగా ప్రజలు జీవించే స్థలమైన విశ్వంలోని ఒక భాగమును - భూమిని, సూచిస్తుంది. “లోకసంబంధ” పదం ఈ లోకములో దుష్ట విలువలతోనూ, దుష్ట ప్రవర్తనలతోనూ జీవిస్తున్న ప్రజలను సూచిస్తుంది.

  • దీని సాధారణ భావనలో “లోకం” పదం ఆకాశాలనూ, భూమినీ, అందులోని సమస్త జీవరాశులనూ సూచిస్తుంది.
  • అనేక సందర్భాలలో “లోకం” పదం “లోకములోని ప్రజలు” అనే అర్ధాన్ని ఇస్తుంది.
  • కొన్నిమార్లు ఈ పదం దుష్ట ప్రజలనూ లేదా దేవునికి విధేయత చూపని దుష్ట ప్రజలను సూచిస్తున్నట్టు తెలుస్తుంది.* అపొస్తలులు కూడా “లోకం” పదాన్ని స్వార్థపూరితమైన ప్రవర్తనను లేక ఈ లోకములో భ్రష్ట విలువలతో జీవించే ప్రజలను సూచించడానికి ఉపయోగించారు. ఇందులో మానవ ప్రయత్నాల మీద ఆధారపడిన స్వనీతి భక్తి ఆచారాలు దీనిలో ఉన్నాయి.
  • "లోక సంబంధమైనవి" గా చెప్పబడే ఈ విలువల ద్వారా ప్రజలూ, వస్తువులూ ఈ విధమైన విలువలద్వారా వర్గీకరించబడ్డారు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “లోకం" పదం “విశ్వం" లేదా "ఈ లోకపు ప్రజలు” లేదా "లోకములోని భ్రష్ట సంగతులు” లేదా "లోకములో ప్రజల దుష్ట వైఖరులు" అని అనువదించబడవచ్చు.
  • “లోకమంతటా” పదం తరచుగా "అనేకులైన ప్రజలు" అనే అర్థాన్ని ఇస్తుంది, ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సూచిస్తుంది. ఉదాహరణకు, "లోకం అంతా ఐగుప్తుకు వచ్చింది" పదబంధం "చుట్టూ ఉన్న దేశములనుండి అనేకమంది ప్రజలు ఐగుప్తుకు వచ్చారు" లేదా “ఐగుప్తు చుట్టూ ఉన్న అన్ని దేశాల నుండి ప్రజలు ఐగుప్తుకు వచ్చారు" అని అనువదించబడవచ్చు.
  • “లోకమంతా రోమా జనాభా లెక్కలలో నమోదు కావడం కోసం తమ స్వంత గ్రామాలకు వెళ్ళారు" వాక్యం "రోమా సామ్రాజ్యము చేత పరిపాలించబడే ప్రాంతములలో జీవిస్తున్న అనేకమంది ప్రజలు" అని మరో విధంగా అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, “లోకసంబంధ" పదం “దుష్టత్వం" లేదా “పాపసంబంధమైన" లేదా స్వార్ధపూరిత" లేదా "దైవభక్తిలేని" లేదా "భ్రష్టత్వము” లేదా “ఈ లోకములోని ప్రజల భ్రష్ట విలువల ద్వారా ప్రభావితము చేయబడిన" అని అనువదించబడవచ్చు.
  • “లోకములో ఈ సంగతులు చెప్పడం" పదబంధం "లోకంలోని ప్రజలకు ఈ సంగతులు చెప్పడం" అని అనువదించబడవచ్చు.
  • ఇతర సందర్భాలలో “లోకములో” పదం “లోక ప్రజల మధ్య జీవించడం" లేదా దైవభక్తిలేని ప్రజల మధ్య నివసించడం" అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: భ్రష్టత్వము, పరలోకం, రోమా, దైవికంగా)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H776, H2309, H2465, H5769, H8398, G1093, G2886, G2889, G3625

వాగ్ధాన భూమి

వాస్తవాలు:

“వాగ్ధాన భూమి” అనే ఈ మాట కేవలము బైబిలు కథలలో మాత్రమె కనిపించును గాని, పరిశుద్ధ గ్రంథ వాక్య భాగములలో కనిపించదు. దేవుడు అబ్రాహాముకు మరియు తన సంతానమునకు ఇచ్చుటకు వాగ్ధానము చేసిన కానాను దేశమును సూచించుటకు ఉపయోగించబడిన పర్యాయ పదమునైయున్నది.

  • అబ్రాహాము ఊరు అనే పట్టణములో జీవించుచున్నప్పుడు, కానాను దేశములో నివసించమని దేవుడు తనకు ఆజ్ఞాపించెను. తను మరియు తన సంతానమైన ఇశ్రాయేలీయులందరు అనేక సంవత్సరములు అక్కడ నివసించిరి.
  • కానానులో భయంకరమైన కరువు కాలము వచ్చినప్పుడు ఆహారము లేనందున, ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు బయలుదేరి వెళ్ళిరి.
  • నాలుగు వందల సంవత్సరాల తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని తమ బానిసత్వములోనుండి విడిపించెను మరియు వారిని తిరిగి దేవుడు వారికి వాగ్ధానము చేసిన స్థలమైన కానానుకు తీసుకొని వచ్చెను.

తర్జుమా సలహాలు:

  • “వాగ్ధాన దేశము’ అనే ఈ మాటను “దేవుడు అబ్రాహాముకు ఇస్తానని చెప్పిన దేశము” లేక “దేవుడు అబ్రాహాముకు వాగ్ధానము చేసిన భూమి” లేక “దేవుడు తన ప్రజలకు వాగ్ధానము చేసిన భూమి” లేక “కానాను దేశము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • పరిశుద్ధ గ్రంథములో ఈ మాట లేక పదములు “దేవుడు వాగ్ధానము చేసిన భూమి లేక దేశము” అనే మాటలలో కనిపిస్తాయి.

(ఈ పదములను కూడా చూడండి: కానాను, వాగ్ధానము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 12:01 వారు (ఇశ్రాయేలీయులు) ఇక మీదట బానిసలుగా ఉండరు, మరియు వారు వాగ్ధాన దేశమునకు వెళ్ళుచున్నారు!
  • 14:01 దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనలో భాగంగా వారు ధర్మశాస్త్రమునకు కూడా విధేయులు కావాలని దేవుడు వారిని చెప్పిన తరువాత, దేవుడు వారిని సీనాయి పర్వతము నుండి కానాను దేశముగా పిలువబడే వాగ్ధాన దేశమునకు నడిపించుటకు ఆరంభించెను.
  • 14:02 దేవుడు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల సంతానమునకు వాగ్ధాన భూమిని ఇస్తానని వారికి వాగ్ధనాము చేసియుండెను, అయితే అక్కడ అనేక విభిన్న జనాంగములు నివాసము చేయుచూ ఉండిరి.
  • 14:14 ఆ తరువాత దేవ్దుడు ప్రజలను తిరిగి వాగ్ధాన దేశపు అంచువరకు నడిపించెను.
  • 15:02 ఇశ్రాయేలీయులు వాగ్ధాన దేశములోనికి ప్రవేశించుటకు, వారు తప్పకుండ యోర్దాను నదిని దాటి వెళ్ళవలసియుండెను.
  • 15:12 ఈ యుద్ధము జరిగిన తరువాత, దేవుడు ఇశ్రాయేలు ప్రతి గోత్రమునకు వాగ్ధాన దేశమును విభజించి ఎవరి భాగములను వారికి పంచిపెట్టెను.
  • 20:09 దేవుని ప్రజలు వాగ్ధాన భూమిని విడిచిపెట్టి వెళ్లాలని బలవంతముగావించబడిన ఈ సమయమునే నిర్గమము లేక వెలివేయబడుట అని పిలుతురు.

పదం సమాచారం:

  • Strong's: H776, H3068, H3423, H5159, H5414, H7650

వాగ్ధానం, వాగ్ధానం చేయబడిన

నిర్వచనం:

వాగ్ధానం ఒక క్రియాపదంగా ఉపయోగించబడినప్పుడు, "వాగ్దానం" పదం ఒక వ్యక్తి తాను చెప్పిన దానిని నెరవేర్చడానికి తనను తాను నిర్భంచుకొనే విధానంలో తాను ఏదైనా చేస్తానని చెప్పే చర్యను సూచిస్తుంది. నామవాచకంగా ఉపయోగించినప్పుడు "వాగ్దానం" పదం ఒక వ్యక్తి తాను చెయ్యడానికి తనను తాను నిర్భందించుకొనే పనిని సూచిస్తుంది.

  • దేవుడు తన ప్రజలకు చేసిన అనేక వాగ్దానాలను బైబిలు నమోదు చేసింది.
  • వాగ్దానాలు నిబంధనలవలే క్రమబద్దమైన ఒప్పందాలలో ప్రాముఖ్యమైన భాగమై ఉన్నాయి.

అనువాదం సూచనలు:

  • “వాగ్ధానం" పదం “సమర్పణ" లేదా “నిశ్చయత" లేదా "హామీ" అని అనువదించబడవచ్చు.
  • “ఏదైనా చేయడానికి వాగ్దానం చేయడం" పదబంధం “నీవు చేయబోయే పనిని తప్పకుండ చేస్తానని ఇతరులకు నిశ్చయత ఇవ్వడం" లేదా "ఏదైనా చెయ్యడానికి సమర్పించుకోవడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: నిబంధన, ప్రమాణం, శపథం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 03:15 “జనులు చేసే చెడ్డ పనులను బట్టి మరియొకమారు నేను నేలను శపించనని లేక జనులు నాకు పిల్లలైనప్పటినుండి వారు పాపులైనప్పటికిని ప్రళయమును రప్పించుట ద్వారా లోకమును నాశనము చేయనని నేను వాగ్ధానము చేయుచున్నాను.”
  • 03:16 దేవుడు తన వాగ్ధానమునకు చిహ్నముగా మొట్ట మొదటిగా ఆయన ఇంద్రధనుస్సును చేశాడు. ఆకాశములో ఇంద్రధనుస్సు కనిపించే ప్రతిమారు, దేవుడు తన ప్రజలపట్ల చేసిన వాగ్ధానమును జ్ఞాపకము చేసికొనును, ఆయన ప్రజలు జ్ఞాపకము చేసికొంటారు.
  • 04:08 దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, నీవు ఒక కుమారుని పొందుకుంటావు, ఆకాశములో నక్షత్రములవలె లెక్కలేనంత సంతానమును నీకు కలుగుదురు. అబ్రాహాము దేవుని వాగ్ధానమును నమ్మాడు.
  • 05:04”నీ భార్య శారాయి ఒక కుమారుని కనును, అతను వాగ్ధాన పుత్రుడు అనబడును.”
  • 08:15 దేవుడు అబ్రాహాముకిచ్చిన నిబంధన వాగ్ధానములు ఇస్సాకుకు, యాకోబుకు, యాకోబు పన్నెండు మంది కుమారులకు, వారి కుటుంబములకు అనుగ్లరహించబడ్డాయి.
  • 17:14 దావీదు దేవునికి అపనమ్మకస్థుడైనప్పటికిని, దేవుడు తనతో చేసిన వాగ్ధానముల విషయములో నమ్మకస్తుడై యుండెను.
  • 50:01 లోక అంతమున యేసు తిరిగి వస్తాడని ఆయన వాగ్ధానము చేసెను. ఆయన ఇప్పటికి తిరిగి రాకపోయినా, ఆయన తన వాగ్ధానమును నెరవేర్చుతాడు.

పదం సమాచారం:

  • Strong's: H559, H562, H1696, H8569, G1843, G1860, G1861, G1862, G3670, G4279

వారసత్వముగా పొందు, వారసత్వము, పిత్రార్జితం, వారసుడు

నిర్వచనం:

"వారసత్వముగా పొందు" అంటే దేన్నైనా విలువైనదాన్ని తల్లిదండ్రులనుండి లేక ఇతరుల నుండి వారితో ప్రత్యేక సంబంధం మూలంగా పొందు. "వారసత్వము" అంటే సంక్రమించినది.

  • వారసత్వము అంటే డబ్బు, భూమి లేక ఇతర రకాల ఆస్తులు.
  • ఆత్మ సంబంధమైన వారసత్వము అంటే దేవుడు యేసుపై నమ్మకముంచిన వారికి ఆశీర్వాదాలతో సహా ప్రస్తుత జీవం తనలో వారికి నిత్య జీవం.
  • బైబిల్ దేవుని ప్రజలను అయన వారసత్వముగా పిలుస్తున్నది. అంటే వారు ఆయనకు చెందిన వారు. వారు అయన విలువైన ఆస్తి.
  • అబ్రాహాము సంతానం కనాను ప్రదేశం వారసత్వముగా పొందుతారని అది వారికి శాశ్వతకాలం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు.
  • అలంకారికంగా లేక ఆత్మ సంబంధమైన రీతిలో దేవునికి చెందిన వారితో అయన "వారసత్వముగా పొందు దేశం" గురించి చెప్పాడు. అంటే వారు వర్థిల్లి శారీరిక, ఆత్మ సంబంధమైన రెండు విధాలుగా దేవుని దీవెనలు పొందుతారు.
  • కొత్త నిబంధనలో, యేసులో నమ్మకముంచిన వారితో "వారసత్వముగా పొందు రక్షణ” “వారసత్వముగా పొందు నిత్య జీవం" గురించి దేవుడు వాగ్దానం చేశాడు. "వారసత్వముగా పొందు దేవుని రాజ్యం" అని వ్యక్త పరిచారు. ఆత్మ సంబంధమైన వారసత్వము శాశ్వతకాలం ఉంటుంది.
  • ఈ పదాలకు ఇతర అలంకారిక అర్థాలు ఉన్నాయి.
  • జ్ఞానం గల ప్రజలు "మహిమను వారసత్వముగా పొందుతారు" న్యాయవంతులైనవారు "మంచివాటిని వారసత్వముగా పొందుతారు."
  • "వారసత్వముగా పొందు వాగ్దానం" అంటే దేవుడు తనవారికి ఇస్తానని వాగ్దానం చేసినవి.
  • ఈ పదాన్ని నెగెటివ్ గా కూడా ఉపయోగిస్తారు. మూర్ఖత్వం అవిధేయత గల మనుషులు "గాలిని వారసత్వముగా పొందుతారు” లేక “మంద బుద్ధి వారసత్వముగా పొందుతారు." అంటే వారు వారి పాపపూరితమైన క్రియల పర్యవసానంగా శిక్ష, వ్యర్థమైన జీవితం పొందుతారు.

అనువాదం సలహాలు:

  • ఎప్పటిలాగానే లక్ష్య భాషలో వారసుడు, లేక వారసత్వము సూచించే పదాలు ఉంటే వాటిని వాడాలి.
  • సందర్భాన్ని బట్టి, ఇతర పద్ధతులుకూడా వాడాలి. "వారసత్వముగా పొందు" అనే మాటని ఇలా అనువదించ వచ్చు "పుచ్చుకొను” లేక “కలిగియుండు” లేక “ఆస్తి సంక్రమించు."
  • "వారసత్వము" అనువదించడం పద్ధతులు. "వాగ్దానం చేసిన” లేక “ఆస్తి స్వాధీనం."
  • ఇది దేవుని ప్రజలను సూచిస్తుంటే వారసత్వము అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆయనకు చెందిన విలువైన దాన్ని."
  • "వారసుడు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. ఒక పదంతో, లేక పదబంధంతో. "తండ్రి ఆస్తిపాస్తులు పొందే హక్కు ఉన్న కొడుకు” లేక “ (దేవుని) ఆత్మ సంబంధమైన ఆస్తిపాస్తులు, ఆశీర్వాదాలు వ్యపొందడానికి ఎన్నుకొనబడిన వ్యక్తి."
  • "స్వాస్థ్యం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుని నుండి ఆశీర్వాదాలు” లేక “వారసత్వముగా పొందే ఆశీర్వాదాలు."

(చూడండి: వారసుడు, కనాను, వాగ్దాన దేశం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 04:06 అబ్రాము కనాను చేరుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, "నీ చుట్టూ చూడు. నీకు నీ సంతానానికి నీవు చూస్తున్న దేశం అంతా వారసత్వముగా ఇస్తాను."
  • 27:01 ఒక రోజు యూదు చట్టప్రవీణుడు యేసును పరీక్షిస్తూ అడిగాడు "బోధకా, నిత్య జీవం వారసత్వముగా పొందాలంటే నేను ఏమి చెయ్యాలి ?"
  • 35:03 "ఒక మనిషికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తన తండ్రితో చెప్పాడు. 'నా వారసత్వము ఇప్పుడు నాకు కావాలి!' కాబట్టి తండ్రి తన ఆస్తులు ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు."

పదం సమాచారం:

  • Strong's: H2490, H2506, H3423, H3425, H4181, H5157, H5159, G2816, G2817, G2819, G2820

విజ్ఞాపన చేయు, విజ్ఞాపన

నిర్వచనం:

"విజ్ఞాపన చేయు” “విజ్ఞాపన" అంటే ఎవరినైనా మరొకవ్యక్తి పక్షంగా ప్రాధేయపడు. బైబిల్లో సాధారణంగా ఇతరుల కోసం ప్రార్థన చేయడం అనే అర్థం వస్తుంది.

  • “విజ్ఞాపన చెయ్యడం” “ఒకరి కోసం విజ్ఞాపన చేయు" అంటే దేవుణ్ణి ఇతరుల మేలుకై ప్రార్థించడం.
  • మనకోసం పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నాడు అంటే అయన మనకోసం దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని బైబిల్ బోధిస్తున్నది.
  • ఒక వ్యక్తి ఇతరుల కోసం విజ్ఞాపన చెయ్యడం అంటే అధికారంలో ఉన్నవారిని వేడుకోవడం.

అనువాదం సలహాలు:

  • "విజ్ఞాపన చేయు" దీన్ని అనువదించడానికి ఇతర పద్ధతులు. "బ్రతిమాలు” లేక “(ఎవరినైనా) ఏదైనా చెయ్యమని ప్రాధేయపడు (వేరొకరి కోసం)."
  • "విజ్ఞాపనలు" అనే నామ వాచకాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"విజ్ఞప్తి” లేక “విన్నపం” లేక “అత్యవసర ప్రార్థనలు."
  • "విజ్ఞాపన చేయు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఫలానా వారి మేలు కోసం” లేక “ఒకరి పక్షంగా వేడుకొను” లేక “దేవుని సహాయం కోసం” లేక “దేవుని దీవెన కోసం (ఎవరికైనా)."

(చూడండి: ప్రార్థించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6293, G1783, G1793, G5241

విడిచి పెట్టు, విడిచి పెట్టిన, విడువబడిన

నిర్వచనం:

"విడిచి పెట్టు" అంటే ఎవరినైనా వదిలి వెయ్యడం, లేక దేన్నైనా మానుకోవడం. "విడిచి పెట్టబడిన" అంటే ఒకరు వేరొకరిని వదిలెయ్యడం.

  • ప్రజలు దేవుణ్ణి "విడిచి పెట్టడం" అంటే వారు ఆయనను వదిలి నమ్మక ద్రోహం చేశారు అని అర్థం.
  • దేవుడు ప్రజలను "విడిచి పెట్టడం" అంటే అయన వారికి సహాయం చెయ్యడం మానుకున్నాడు. వారిని తిరిగి తన దగ్గరకు రప్పించడానికి వారు హింసలు అనుభవించేలా చేశాడు.
  • ఈ పదానికి వేరొక అర్థం కూడా ఉంది. కొన్నిటిని త్యజించడం, అంటే దేవుని బోధలను వదిలిపెట్టడం, లేక అనుసరించక పోవడం.
  • "విడిచి పెట్టిన" అనేదాన్ని భూత కాలంలో ఉపయోగిస్తారు. "అతడు నిన్ను విడిచి పెట్టాడు." లేక విడిచిపెట్ట బడిన ఎవరి గురించి అయినా చెప్పడానికి ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి ఈ పదం అనువదించడంలో ఇతర పద్ధతులు. "వదిలెయ్యడం” లేక “నిర్లక్ష్యం” లేక “చాలించుకోవడం” లేక “వదిలి వెళ్ళడం” లేక “దూరం వెళ్ళిపోవడం,"
  • దేవుని చట్టాన్ని "విడిచి పెట్టు" అనే మాటను ఇలా అనువదించ వచ్చు " దేవుని చట్టం ధిక్కరించు." ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. దేవుని బోధలు, ఆజ్ఞలు "విడిచి పెట్టడం” లేక “చాలించుకోవడం” లేక “లోబడడం మానుకోవడం."
  • "విడిచి పెట్టు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు "పరిత్యజించు” లేక “వదిలి పెట్టు."
  • విడిచి పెట్టేది వస్తువునా లేక మనిషినా అనే దాన్ని బట్టి అనువదించడంలో వివిధ పదాలు ఉపయోగించాలి.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H488, H2308, H5203, H5428, H5800, H5805, H7503, G646, G657, G863, G1459, G2641,

వినయపూర్వకమైన, వినయ భావం

నిర్వచనం:

"వినయపూర్వకమైన" అంటే తాను ఇతరుల కన్నా గొప్ప అని ఎంచుకోని గుణం. అతడు గర్వం గల అహంకారి కాదు. వినయ భావం అనేది వినయపూర్వకమైన లక్షణం.

  • దేవుని ఎదుట వినయపూర్వకమైన ప్రవర్తన అంటే తన గొప్పతనం, జ్ఞానం, పరిపూర్ణతతో పోల్చుకుంటే బలహీనత, లోపం ఉన్నట్టు గమనించడం.
  • ఒక వ్యక్తి వినయపూర్వకమైనవాడైతే అతడు తనకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటాడు.
  • వినయ భావం అంటే స్వంత అవసరాల కంటే ఇతరుల అవసరాలకై శ్రద్ధ చూపడం.
  • వినయ భావం అంటే తగ్గింపు గుణంతో ఒక వరాలు, సామర్థ్యాలు ఇతరుల కోసం వాడడం.
  • "వినయపూర్వకంగా ఉండడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గర్వం లేకుండా."
  • "దేవుని ఎదుట వినయపూర్వకంగా ఉండు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"దేవుని గొప్పతనాన్ని గుర్తించి నీ చిత్తాన్ని దేవునికి లోబరచు."

(చూడండి: గర్వం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 17:02 దావీదు వినయమనస్కుడు, న్యాయవంతుడైన మనిషి. దేవునిపై నమ్మకముంచి ఆయనకు లోబడ్డాడు.
  • 34:10 "దేవుడు గర్వం గల వారిని అణచి వేస్తాడు. ఎవరైతే వినయపూర్వకంగా ఉంటాడో వారిని పైకెత్తుతాడు."

పదం సమాచారం:

  • Strong's: H1792, H3665, H6031, H6035, H6038, H6041, H6800, H6819, H7511, H7807, H7812, H8213, H8214, H8215, H8217, H8467, G858, G4236, G4239, G4240, G5011, G5012, G5013, G5391

విమోచించు, విమోచకుడు, విమోచన

నిర్వచనం:

“విమోచించు” పదం ఇంతకు ముందే బానిసత్వంలో లేదా మరొకరి హక్కుకింద ఉన్నదేనినైనా లేదా ఎవరినైనా తిరిగి కొనడాన్ని సూచిస్తుంది. "విమోచకుడు" అంటే దేనినైనా లేదా ఎవరినైనా విమోచించినవాడు అని అర్థం.

  • ప్రజలను లేక వస్తువులను ఏ విధముగా విమోచించాలనే దానిని గురించి దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలను ఇచ్చాడు. ఉదాహరణకు ఎవరైనా ఒకరు క్రయధనము చెల్లించుట ద్వారా బానిసత్వములోనున్న ఒక వ్యక్తిని విడిపించ వచ్చు తద్వారా ఆ బానిస స్వతంత్రుడవుతాడు. "క్రయధనం" పదం కూడా ఈ అభ్యాసాన్ని సూచిస్తుంది. * ఒకరి భూమి అమ్మబడినట్లయితే, ఆ వ్యక్తి యొక్క బందువు ఆ భూమిని “విమోచించవచ్చు” లేదా “తిరిగి కొనవచ్చు”, తద్వారా అది కుటుంబములోనే ఉండిపోతుంది.
  • ఇటువంటి అభ్యాసాలు పాప బంధకములలో ఉన్న ప్రజలను దేవుడు ఏ విధంగా విమోచిస్తాడో చూపిస్తాయి. యేసు సిలువ మీద చనిపోయినప్పుడు, ప్రజల పాపాలన్నిటి కోసం పూర్తి వెల చెల్లించాడు. రక్షణ కోసం ఆయనయందు విశ్వాసముంచినవారందరిని విమోచించాడు. దేవుని ద్వారా విమోచించబడిన ప్రజలందరూ పాపమునుండీ, దాని శిక్షనుండీ విడిపించబడి, స్వతంత్రులయ్యారు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “విమోచించు” పదం “తిరిగి చెల్లించడం" లేదా "తిరిగి కొనడం" అని అనువదించబడవచ్చు.
  • “విమోచన” పదం “క్రయధనం" లేదా "స్వేచ్చ కోసం వెల" లేదా "తిరిగి చెల్లించడం" అని అనువదించబడవచ్చు.
  • “క్రయధనం, " “విమోచించు” పదాలు ప్రాథమికంగా ఒకే అర్థాన్ని కలిగియున్నాయి. కాబట్టి కొన్ని భాషలు ఈ పదాల అనువాదం కోసం ఒకే పదాన్ని కలిగియుంటాయి. అయితే "క్రయధనం" దేనినైనా లేదా ఎవరినైనా "విమోచించడానికి" అవసరమైన చెల్లింపు అని కూడా అర్థం. "విమోచించు" పదం వాస్తవంగా చెల్లించవలసిన దానిని ఎప్పటికీ సూచించదు.

(చూడండి: స్వేచ్చ, క్రయధనం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1350, H1353, H6299, H6302, H6304, H6306, H6561, H7069, G59, G629, G1805, G3084, G3085

విలాపం, పరితపించడం, విలపించడం

నిర్వచనం:

“విలాపం”, “విలపించడం” అనే పదాలు దుఃఖం, విచారం లేక శోకంతో కూడిన బలమైన వ్యక్తీకరణను సూచిస్తుంది.

  • కొన్ని సార్లు దీనిలో పాపం గురించిన పశ్చాత్తాపం, లేక ప్రమాదంలో ఉన్న ప్రజల కోసం కరుణ ఉన్నాయి.
  • విలపించడంలో మూలగడం, ఏడ్వడం లేక రోదించడం ఉంటాయి.

అనువాదం సూచనలు:

  • “విలాపం” అనే పదాన్ని “లోతుగా దుఃఖించడం” లేక “శోకంతో రోదించడం” లేక “విచారంగా ఉండడం” అని అనువదించవచ్చు.
  • ”విలపించడం” (లేక “విలాపం”) అనే పదం “గట్టిగా రోదించడం, ఏడ్వడం” లేక “లోతైన విచారం” లేక “విచారకరమైన వెక్కిళ్ళ యేడ్పు” లేక “విచారంతో కూడిన మూలుగులు” అని అనువదించవచ్చు.

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H56, H421, H578, H592, H1058, H4553, H5091, H5092, H5594, H6088, H6969, H7015, H8567, G2354, G2355, G2870, G2875

విశ్వసనీయ, విశ్వాస్యత, అవిశ్వసనీయ, అవిశ్వాస్యత, నమ్మదగిన

నిర్వచనం:

దేవుని పట్ల "విశ్వసనీయంగా" ఉండడం అంటే దేవుని ఉపదేశాల ప్రకారం స్థిరంగా జీవించడం అని అర్థం. ఆయనకు విధేయత చూపడం ద్వారా సద్భక్తి కలిగి ఉండడం అని అర్థం. విశ్వసనీయంగా ఉండడంలోని స్థితి లేక షరతు "విశ్వాస్యత" గా ఉంటుంది.

  • ఒక వ్యక్తి విశ్వసనీయంగా ఉండడం దేవుడు తన వాగ్దానం ఎప్పుడూ నిలబెట్టుకోడానికీ మరియు ఇతర ప్రజలకు ఎల్లప్పుడూ తన బాధ్యతలు నెరవేర్చడానికీ నమ్మదగిన వాడుగా ఉండడం.
  • ఒక విశ్వసనీయ వ్యక్తి ఒక కర్తవ్యాన్ని అది పెద్దదీ మరియు కష్టమైనదీ అయినా దానిని చెయ్యడంలో పట్టుదలతో ఉంటాడు.
  • దేవుని పట్ల విశ్వసనీయత అంటే దేవుడు మనలను చెయ్యమని కోరే దానిని స్థిరంగా చేస్తూ ఉండడం.

"అవిశ్వసనీయ" పదం అంటే దేవుడు వారికి అజ్ఞాపించిన వాటిని చెయ్యని ప్రజలను వర్ణిస్తుంది. అవిశ్వసనీయ స్థితి లేదా ఆచరణ "అవిశ్వాస్యత" గా ఉండడం అంటారు.

  • ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను పూజించడం ఆరంభించినప్పుడు మరియు ఇతర విషయాలలో దేవునికి అవిధేయత చూపినప్పుడు వారు "అవిశ్వసనీయులు" అని పిలువబడ్డారు.
  • దాంపత్యంలో వ్యభిచారం చేసిన వారు తన భార్యకు లేదా భర్తకు "అవిశ్వసనీయలు" గా ఉన్నారు.
  • దేవుడు ఇశ్రాయేలీయుల అవిధేయ ప్రవర్తనను వర్ణించడానికి "అవిశ్వాస్యత" పదాన్ని ఉపయోగించాడు. వారు దేవునికి విధేయత చూపించడం లేదు లేదా ఆయన ఘనపరచడం లేదు.

అనువాదం సూచనలు:

  • అనేక సందర్భాలలో, "విశ్వసనీయ" పదం "సద్భక్తితో ఉన్నవారు" లేదా "సమర్పించబడివారు" లేదా "ఆధారపడదగినవారు" అని అనువదించబడవచ్చు.
  • ఇతర సందర్భాలలో, "విశ్వసనీయ" పదం "విశ్వసించడానికి కొనసాగడం" లేదా "విశ్వసించడంలోనూ మరియు దేవునికి విధ్వయత చూపడంలో పట్టుదల కలిగియుండడం" అని అర్థం ఇచ్చే పదంతో అనువదించబడవచ్చు.
  • "విశ్వాస్యత" పదం "విశ్వసించడంలో పట్టుదల కలిగియుండడం" లేదా "సద్భక్తి" లేదా "ఆధారపడదగిన తత్వం" లేదా "దేవుణ్ణి విశ్వసించడం మరియు ఆయనకు విధేయత చూపించడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, "అవిశ్వసనీయ" పదం "విశ్వసనీయులు కాదు" లేదా "విశ్వాసం ఉంచనివారు" లేదా "సద్భక్తి లేనివారు" అని అనువదించబడవచ్చు.
  • "అవిశ్వసనీయ" పదం "(దేవుని పట్ల) విశ్వాసనీయులు కానివారు" లేదా "అవిశ్వసనీయ ప్రజలు" లేదా "దేవునికి అవిధేయత చూపేవారు" లేదా "దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయు ప్రజలు" అని అనువదించబడవచ్చు.
  • "అపనమ్మకత్వం" పదం "అవిధేయత" లేదా "విశ్వాస ద్రోహం" లేదా "విశ్వసించకపోవడం, విధేయత చూపించకపోవడం" అని అనువదించబడవచ్చు.
  • కొన్ని భాషలలో, "అవిశ్వసనీయ" పదం "అపనమ్మకం" కొరకైన పదంతో సంబంధపరచబడి ఉంటుంది.

(చూడండి: వ్యభిచారం, విశ్వసించు, అవిధేయత, విశ్వాసం, విశ్వసించు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 08:05 చెరసాలలో సైతం యోసేపు దేవుని పట్ల విశ్వసనీయంగా కొనసాగాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు.
  • 14:12 అయినప్పటికీ, దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తన వాగ్దానం విషయంలో విశ్వసనీయంగా ఉన్నాడు.
  • 15:13 దేవునికి విశ్వసనీయంగా ఉంటామని మరియు ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రజలు దేవునికి వాగ్దానం చేశారు.
  • 17:09 దావీదు న్యాయంతో మరియు విశ్వసనీయతతో అనేక సంవత్సరాలు యేలుబడి చేశాడు మరియు దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అయితే అతని జీవితం ఆఖరు భాగంలో దావీదు దేవునికి వ్యతిరేకంగా ఘోరమైన పాపం చేశాడు.
  • 18:04 దేవుడు సొలోమోనుమీద కోపగించుకొన్నాడు మరియు సోలోమోను అవిశ్వాస్యతకు శిక్షగా సొలోమోను మరణం తరువాత ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా చీలిపోతుందని ఆయన వాగ్దానం చేశాడు.
  • 35:12 " పెద్ద కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు. 'ఈ సంవత్సరాలు అన్నీ నీ కోసం విశ్వసనీయంగా పని చేశాను!"
  • 49:17 అయితే దేవుడు విశ్వసనీయుడు మరియు నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు.
  • 50:04 అంతము వరకూ నీవు నా పట్ల విశ్వసనీయంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు."

పదం సమాచారం:

  • Strong's: H529, H530, H539, H540, H571, H898, H2181, H4603, H4604, H4820, G569, G571, G4103

విశ్వసించు, విశ్వసించారు, విశ్వాసి, నమ్మకం, అవిశ్వాసి, అవిశ్వాసులు, అపనమ్మకం

నిర్వచనం:

"విశ్వసించు” “ఒక దానిపై నమ్మకం ఉంచు"అనే వాటికి సంబంధం ఉంది. అయితే అర్థాల్లో కొద్దిగా తేడా ఉంది.

1. విశ్వసించు

  • దేన్నైనా విశ్వసించడం అంటే అది నిజం అని నమ్మి దానిపై ఆధార పడడం.
  • ఎవరినైనా విశ్వసించడం అంటే ఆ వ్యక్తి నిజం చెబుతున్నాడని గుర్తించడం.

2. ఒకదానిపై నమ్మకం ఉంచు

  • "ఒకదానిపై నమ్మకం ఉంచు"అంటే దానిపై, లేదా ఆ వ్యక్తిపై "ఆధార పడు." అంటే ఆ వ్యక్తి తాను ఎవరినని చెబుతున్నాడో అది వాస్తవం అని నమ్మడం. అతడు ఎప్పుడూ సత్యం పలుకుతాడని, తాను వాగ్దానం చేసినది తప్పక నెరవేరుస్తాడని నమ్మడం.
  • ఒక వ్యక్తి దేన్నైనా నిజంగా విశ్వసించినట్టయితే అతడు అలాటి తన నమ్మకాన్ని వెలిబుచ్చే పనులు చేస్తాడు.
  • "ఒక దానిలో విశ్వాసం కలిగి ఉండు"అనే పదబంధం సాధారణంగా "నమ్మకం ఉంచు"అనే అర్థాన్నే ఇస్తుంది.
  • "యేసులో విశ్వసించు” అంటే అయన దేవుని కుమారుడు అని నమ్మడం. దేవుడు తానే మానవుడుగా వచ్చి మన పాపాలకు వెల చెల్లించడానికి బలి అర్పణగా చనిపోయాడు. అంటే రక్షకుడుగా ఆయనపై నమ్మకముంచి ఆయనకు ఘనత కలిగే విధంగా జీవించడం. బైబిల్లో "విశ్వాసి"అనే పదం యేసు క్రీస్తును రక్షకుడుగా విశ్వసించి ఆధారపడే వారికి వర్తిస్తుంది.
  • "విశ్వాసి"అనే దానికి అక్షరాలా "నమ్మే వ్యక్తి"అని అర్థం.
  • "క్రైస్తవుడు"అనే ఈ పదం ఎట్టకేలకు విశ్వాసులకు ఒక ఒక బిరుదు నామంగా తయారైంది. ఎందుకంటే వారు క్రీస్తును విశ్వసించి ఆయన బోధలను అనుసరించడం చేశారు. ఈ పదం"అపనమ్మకం"దేన్నైనా లేక ఎవరినైనా నమ్మకపోవడాన్ని సూచిస్తున్నది.
  • బైబిల్లో "అపనమ్మకం"అనేది విశ్వాసం లేక పోవడాన్ని, యేసును రక్షకుడుగా నమ్మకముంచకపోవడాన్ని సూచిస్తున్నది.
  • ఒక వ్యక్తి యేసును విశ్వసించక పొతే అతణ్ణి "అవిశ్వాసి"అన్నారు.

అనువాదం సలహాలు:

  • "విశ్వసించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అది నిజం అని తెలియకపోవడం” లేక “అది సరియైనది అని తెలియడం."
  • "ఒక దానిలో నమ్మకం ఉంచు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పూర్తిగా నమ్మకముంచు” లేక “నమ్మకముంచి లోబడు” లేక “పూర్తిగా ఆధారపడి అనుసరించు."
  • కొన్నిఅనువాదాలు "యేసు విశ్వాసి” లేక “క్రీస్తు విశ్వాసి"అని రాయడానికి ఇష్టపడ వచ్చు.
  • ఈ పదాన్ని ఒక పదం లేక పదబంధం ఉపయోగించి కూడా తర్జుమా చెయ్య వచ్చు. "యేసులో నమ్మకం ఉంచే వాడు” లేక “యేసును నమ్మి ఆయనకోసం జీవించే వాడు."
  • దీన్ని అనువదించే ఇతర పద్ధతులు, "విశ్వాసి""యేసును అనుసరించే వాడు” లేక “యేసును ఎరిగి ఆయనకు లోబడే వాడు."
  • "విశ్వాసి"అనేదిఏ క్రీస్తు విశ్వాసికైనా వాడే సాధారణ పదం. "శిష్యుడు” “అపోస్తలుడు"అనే వాటిని ఇదమిద్ధంగా యేసు జీవించి ఉన్నప్పుడు ఆయన్ను ఎరిగి అనుసరించిన వారిని సూచించడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు. ఈ పదాలను వేరువేరుగా చూపడం కోసం రకరకాలుగా అనువదించడం మంచిది.
  • అనువదించడానికి ఇతర పద్ధతులు. "అపనమ్మకం""విశ్వాసం లేక పోవడం” లేక “నమ్మక పోవడం."
  • ఈ పదం "అవిశ్వాసి"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యేసుని విశ్వసించే మనిషి” లేక “యేసును రక్షకుడుగా నమ్మకముంచిన వాడు."

(చూడండి: విశ్వసించు, అపోస్తలుడు, క్రైస్తవుడు, శిష్యుడు, విశ్వాసం, నమ్మకముంచు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 03:04 నోవహు ప్రజలను రానున్న వరద గురించి హెచ్చరించి దేవుని వైపు తిరగమని వారికి చెప్పాడు. అయితే వారు అతణ్ణి విశ్వసించలేదు.
  • 04:08 అబ్రాము దేవుని వాగ్దానం విశ్వసించాడు అబ్రాము న్యాయవంతుడు అని దేవుడు ప్రకటించాడు. ఎందుకంటే అతడు దేవుని వాగ్దానాన్ని విశ్వసించాడు.
  • 11:02 దేవుడు తనలో విశ్వాసం ఉంచిన వారి తొలి సంతానాన్ని రక్షించే విధానం చెప్పాడు.
  • 11:06 అయితే ఈజిప్టు వారు విశ్వసించలేదు దేవుని ఆజ్ఞలకు లోబడలేదు.
  • 37:05 యేసు చెప్పాడు, "నేనే పునరుత్థానం, జీవం. ఎవరైతే నాలో నమ్మకం ఉంచుతారో వారు చనిపోయినా బ్రతుకుతారు. నన్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ ఎన్నటికీ మరణించరు. నమ్ముతున్నావా ?"
  • 43:01 తరువాత యేసు పరలోకానికి తిరిగి వెళ్ళిపోయాక అయన వారికీ అజ్ఞాపింనట్టు శిష్యులు యెరూషలేములో నిలిచి పోయారు. విశ్వాసులు ఎడతెగక సమకూడి కలిసి ప్రార్థించారు.
  • 43:03 విశ్వాసులు అందరూ కలిసి ఉన్న సమయంలో హటాత్తుగా వారున్న ఇల్లు బలమైన గాలి వంటి శబ్దంతో నిండిపోయింది. తరువాత అగ్ని జ్వాలల వలె అందరు విశ్వాసుల తలలపై కనిపించాయి.
  • 43:13 ప్రతిరోజూ, మరింత మంది ప్రజలు విశ్వాసులు అయ్యారు.
  • 46:06 ఆ రోజున అనేకమంది ప్రజలు యెరూషలేములో యేసును అనుసరించే వారిని హింసించడం మొదలు పెట్టారు. కాబట్టి విశ్వాసులు వేరే ప్రాంతాలకు పారిపోయారు. అయినప్పటికీ యేసును గురించి వారు వెళ్ళిన అన్ని చోట్లా ప్రకటించారు.
  • 46:01 స్తెఫనును చంపిన మనుషుల బట్టల దగ్గర కావలి ఉన్న యువకుడు సౌలు. అతడు అప్పటికి యేసును విశ్వసించలేదు. కాబట్టి విశ్వాసులను హింసించాడు.
  • 46:09 యెరూషలేములో హింస మూలంగా కొందరు విశ్వాసులు పారిపోయారు. వారు అంతియొకయలో యేసును గురించి ప్రకటించారు. అంతియొకయలో విశ్వాసులను మొదట "క్రైస్తవులు"అని పిలిచారు.
  • 47:14 వారు సంఘాల్లో విశ్వాసులను ప్రోత్సహిస్తూ బోధిస్తూ అనేక ఉత్తరాలు రాశారు.

పదం సమాచారం:

  • Strong's: H539, H540, G543, G544, G569, G570, G571, G3982, G4100, G4102, G4103, G4135

విశ్వాసం

నిర్వచనం:

సాధారణంగా, "విశ్వాసం" పదం ఒకరి మీద లేదా ఒకదాని మీద నమ్మకం, విశ్వాసం లేదా ధైర్యం ఉంచడాన్ని సూచిస్తుంది.

  • ఒకరియందు "విశ్వాసం కలిగియుండడం" అంటే అతడు చెప్పినదీ, అతడు చేసినదీ నిజం, నమ్మదగినది అని విశ్వసించడం.
  • "యేసునందు విశ్వాసం కలిగియుండడం" అంటే యేసును గురించి దేవుని బోధలు అన్నీ విశ్వసించడం. ముఖ్యంగా మనుష్యులు యేసులోనూ, వారి పాపం నుండి శుద్ధి చేయడానికీ, వారి పాపం కారణంగా వారు అర్హులైన శిక్షనుండి కాపాడడానికీ ఆయన బలి అర్పణలో విశ్వాస ముంచడం అని అర్థం.
  • యేసులో నిజమైన విశ్వాసం లేదా నమ్మకం ఒక వ్యక్తి మంచి ఆత్మ ఫలాలు లేదా ప్రవర్తనల కలిగిస్తాయి ఎందుకంటే పరిశుద్ధాత్మ వానిలో ఉన్నాడు.
  • కొన్ని సార్లు "విశ్వాసం" అంటే సాధారణంగా "విశ్వాస సత్యాల" వ్యక్తీకరణగా యేసును గురించిన ఉపదేశాలన్నిటినీ సూచిస్తుంది.
  • "విశ్వాసం కాపాడుకోవడం” లేక “విశ్వాసం త్యజించడం" సందర్భాలలో "విశ్వాసం" పదం యేసు బోధలపై నమ్మకం ఉంచే స్థితిని సూచిస్తున్నది.

అనువాదం సూచనలు:

  • కొన్ని సందర్భాల్లో "విశ్వాసం" అనే పదం "నమ్మకం" లేదా "దృఢవిశ్వాసం" లేదా "ధైర్యం" అని అనువదించబడవచ్చు.
  • కొన్ని భాషలలో ఈ పదాలు "విశ్వసించు" అనే క్రియా రూపాలను ఉపయోగించి అనువదించబడతాయి. (చూడండి: భావనామాలు)
  • "విశ్వాసం ఉంచాలి" పదబంధం "యేసులో విశ్వాసం ఉంచుతూ ఉండాలి" లేదా "ఎసులో విశ్వసించడం కొనసాగించాలి" అని అనువదించబడవచ్చు.
  • "వారు విశ్వాసం లోతైన సత్యాలను గట్టిగా పట్టుకోవాలి" అనే వాక్యం "యేసు గురించి వారికి బోధించబడిన సత్యాలన్నిటిని విశ్వసిస్తూ ఉండాలి" అని అనువదించబడవచ్చు.
  • "విశ్వాసంలో నా నిజ కుమారుడు" అనే వాక్యం "అతడు నా కుమారుడు లాంటివాడు, ఎందుకంటే యేసులో విశ్వాసముంచడానికి నేను అతనికి బోధించాను" లేదా "యేసులో విశ్వాసముంచుతున్న నా నిజమైన ఆత్మీయ కుమారుడు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: విశ్వసించు, నమ్మకమైన వాడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 05:06 ఇస్సాకు యువకుడుగా ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించాడు. "నీ ఏకైక కుమారుడు ఇస్సాకును తీసుకుపోయి నాకు బలిగ అర్పించు."
  • 31:07 అప్పుడు అయన (యేసు) పేతురుతో, "నీవు అల్ప విశ్వాసివి, ఎందుకు సందేహపడ్డావు?" అని అన్నాడు.
  • 32:16 యేసు ఆమెతో, "నీ విశ్వాసం నీకు స్వస్థత కలుగజేసింది, సమాధానంతో వెళ్ళు" అని చెప్పాడు.
  • 38:09 తరువాత యేసు పేతురుతో, "సాతాను మీ అందరినీ కోరుకొంటున్నాడు, అయితే పేతురూ, నీ విశ్వాసం విఫలం కాకూడదని నేను నీ కోసం ప్రార్థించాను" అని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H529, H530, G1680, G3640, G4102, G6066

విశ్వాసం లేని, విశ్వాస రాహిత్యం

నిర్వచనం:

"విశ్వాసం లేని" అంటే విశ్వాసం లోపం లేక విశ్వసించక పోవడం.

  • దేవునిపై విశ్వాసం లేని వారిని వర్ణించడానికి ఈ పదం ఉపయోగిస్తారు. వారి నమ్మకంలేమి వారి క్రియల్లో అనైతిక విధానాల్లో విశదం అవుతుంది.
  • ప్రవక్త యిర్మీయా ఇశ్రాయేలువారు విశ్వాసం లేకుండా దేవునికి అవిధేయత చూపుతున్నారని నేరం మోపాడు.
  • వారు విగ్రహాలను ఆరాధించి నిజ దేవునికి లోబడని, ఆయన్ని పూజించని ఇతర నిర్దేవ ప్రజల సమూహాల విధానాలు పాటించారు.

అనువాదం సలహాలు

  • సందర్భాన్ని బట్టి, "విశ్వాసం లేని" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"అవిశ్వసనీయత” లేక “విశ్వసించని” లేక “దేవునికి అవిధేయత” లేక “నమ్మకం లేని."
  • "విశ్వాసరాహిత్యం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"అపనమ్మకం” లేక “అపనమ్మకత్వం” లేక “తిరుగుబాటు వ్యతిరేకంగా దేవుడు."

(చూడండి: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: విశ్వసించు, విశ్వసనీయత, ధిక్కరించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G571

వ్యభిచారం, వ్యభిచార సంబంధమైన, వ్యభిచారి, వ్యభిచారిణి, వ్యభిచారులు, వ్యభిచారిణులు

నిర్వచనం:

ఈ పదం"వ్యభిచారం"అనేది పెళ్లి అయిన వ్యక్తి తన భార్య/భర్త లేక భర్త కాని వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని సూచిస్తున్నది. వారిద్దరూ ఆ విషయంలో అపరాధులే. "వ్యభిచార సంబంధమైన"అనే ఈ పదం ఎవరైనా ఈ పాపం జరిగించే మనస్తత్వం అనే అర్థం కూడా ఇస్తున్నది.

  • "వ్యభిచారి"అనే ఈ పదం సాధారణంగా వ్యభిచారం చేసే మనిషిని సూచిస్తున్నది.
  • కొన్ని సార్లు “వ్యభిచారిణి"అనే పదం ప్రత్యేకించి వ్యభిచారం చేసే స్త్రీకి వాడతారు.
  • వ్యభిచారం ఒక భర్త, భార్య చేసుకున్న వివాహ నిబంధనను భంగం చేస్తున్నది.
  • దేవుడు ఇశ్రాయేలీయులకు వ్యభిచారం చేయవద్దని అజ్ఞాపించాడు.
  • "వ్యభిచార సంబంధమైన"అనే ఈ పదం తరచుగా అలంకారికంగా దేవునికి ఇశ్రాయేలుజాతి అపనమ్మకాన్ని సూచించడానికి వాడతారు. ప్రత్యేకించి అబద్ద దేవుళ్ళ ఆరాధన విషయంలో.

అనువాదం సలహాలు:

  • లక్ష్య భాషలో "వ్యభిచారం"అనే అర్థం ఇచ్చే పదం లేకపోతే ఈ పదాన్ని ఇలా అనువదించ వచ్చు. "వేరొకరి భార్యతో లైంగిక సంబంధం” లేక “వేరొక వ్యక్తి భార్య/భర్తతో సన్నిహితంగా ఉండడం."
  • కొన్ని భాషల్లో వ్యభిచారం గురించి చెప్పడానికి సూటి అయిన పదం లేకపోవచ్చు. అలాటి చోట "వేరొకరి భార్య/భర్తతో పండుకోవడం” లేక “తన భార్యకు అపనమ్మకంగా ఉండడం." (చూడండి: సభ్యోక్తి)
  • "వ్యభిచార సంబంధమైన"అనే పదం అలంకారికంగా వాడినప్పుడు దాన్ని అక్షరార్థంగా అనువదించడం మంచిది. ఆ విధంగా దేవుని అవిధేయులను దేవుడు అపనమ్మకమైన భార్య/భర్తతో పోలుస్తున్నాడు.
  • లక్ష్య భాషలో సరైన అర్థం రాకపోతే, అలంకారికంగా "వ్యభిచార సంబంధమైన "అనే పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"అపనమ్మకమైన” లేక “అవినీతిపరుడు” లేక “అపనమ్మకమైనభార్య/భర్త."

(చూడండి: జరిగించు, నిబంధన, లైంగిక అవినీతి, శయనించు, నమ్మకమైన వాడు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 13:06 "వ్యభిచారం చెయ్యవద్దు."
  • 28:02 "వ్యభిచారం చెయ్యవద్దు.”
  • 34:07 "మతనాయకుడు ఇలా ప్రార్థించాడు, దేవా, ఈ మనిషిలాగా నేను పాపిని కాదు గనక-అలాటి దొంగలు, అన్యాయం చేసే మనుషులు, వ్యభిచారులు, లేక ఆ పన్ను వసూలుదారుడు వంటి వాణ్ణి కానందుకు నీకు వందనాలు.'"

పదం సమాచారం:

  • Strong's: H5003, H5004, G3428, G3429, G3430, G3431, G3432

శక్తి, శక్తిగల, శక్తివంతంగా

నిర్వచనం:

"శక్తి" పదం కార్యాలను చెయ్యగలిగే లేదా జరిగేలా చూసే సామర్ధ్యాన్ని సూచిస్తుంది. తరచుగా గొప్ప బలాన్ని సూచిస్తుంది. "శక్తులు" కార్యాలను జరిగేలా చేసే సామర్ధ్యం కలిగిన మనుష్యులను లేదా ఆత్మలను సూచిస్తుంది.

  • "దేవుని శక్తి" పదం సమస్తాన్ని చెయ్యగల దేవుని శక్తిని సూచిస్తుంది, ప్రత్యేకించి మనుష్యులకు చెయ్యడానికి సాధ్యం కాని కార్యాలను చెయ్యగల దేవుని శక్తిని సూచిస్తుంది.
  • దేవుడు తాను చేసిన సమస్తం మీదా సంపూర్ణ శక్తిని కలిగియున్నాడు.
  • దేవుడు తాను కోరుకున్న దానిని చెయ్యడానికి తన ప్రజలకు శక్తిని ఇస్తాడు, తద్వారా వారు ప్రజలను స్వస్థపరుస్తారు లేదా ఇతర ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు, దేవుని శక్తి ద్వారా వారు వీటిని చేస్తారు.
  • యేసూ, పరిశుద్దాత్మడూ దేవుడు కనుక వారు కూడా ఈ శక్తినే కలిగియున్నారు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి "శక్తి" పదం "సామర్ధ్యం" లేదా "బలం" లేదా "సమర్ధత" లేదా అద్భుతాలు చేయడానికి శక్తి" లేదా "నియంత్రణ" అని అనువదించబడవచ్చు.
  • "శక్తులు" పదం "శక్తివంతమైన జీవులు" లేదా ఇతరులను నియంత్రించు వారు" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

(చూడండి: పరిశుద్ధాత్ముడు, యేసు, అద్భుతం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 22:05 దూత వివరించాడు, "పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, దేవుని శక్తి నీ మీదకు వచ్చును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అవుతాడు, దేవుని కుమారుడు అవుతాడు.
  • 26:01 సాతాను శోధనలను జయించినతరువాత, యేసు పరిశుద్ధాత్మ శక్తి నిండుకొనినవాడై గలిలయ ప్రాంతాలకు తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన నివాసం చేశాడు.
  • 32:15 వెంటనే శక్తి ఆయనలోనుండి వెళ్ళిపోవడం ఆయన గుర్తించాడు.
  • 42:11 మృతులలోనుండి ఆయన లేచిన తరువాత నలుబది రోజులకు ఆయన తన శిష్యులతో "పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చిన తరువాత తండ్రి మీకు శక్తి ని అనుగ్రహించేంతవరకూ మీరు యెరూషలేములో నిలిచియుండండి" అని చెప్పాడు.
  • 43:06 “ఇశ్రాయేలు మనుష్యులారా, మీరు చూచినవిధంగానూ, మీకు తెలిసిన విధముగానూ యేసు దేవుని శక్తి చేత గొప్ప సూచకక్రియలనూ, అనేక అద్భుతాలనూ జరిగించిన వాడు.
  • 44:08 పేతురు జవాబిచ్చాడు, "మీ ముందు నిలబడిన ఈ మనిషి యేసు క్రీస్తు శక్తి చేత స్వస్థపరచబడ్డాడు.

పదం సమాచారం:

  • Strong's: H410, H1369, H2220, H2428, H2429, H2632, H3027, H3028, H3581, H4475, H4910, H5794, H5797, H5808, H6184, H7786, H7980, H7981, H7983, H7989, H8280, H8592, H8633, G1411, G1415, G1756, G1849, G1850, G2478, G2479, G2904, G3168

శతాధిపతి, శతాధిపతులు

నిర్వచనం:

శతాధిపతి రోమా సైన్యాధిపతి. వంద మంది సైనిక బృందం తన ఆజ్ఞ కింద ఉంటారు.

  • దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "వంద మంది మనుషుల నాయకుడు” లేక “సైన్యాధిపతి” లేక “వందమంది పై అధికారి."
  • ఒక రోమా శతాధిపతి యేసుదగ్గరకు వచ్చి తన సేవకుని స్వస్థతకై అర్థించాడు.
  • యేసు సిలువ శిక్షను పర్యవేక్షించిన శతాధిపతి యేసు చనిపోయిన విధానం చూసి అబ్బుర పడ్డాడు.
  • దేవుడు యేసును గురించి సువార్త వివరించడానికి శతాధిపతి దగ్గరికి పేతురును పంపాడు.

(చూడండి: రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1543, G2760

శరీరం

నిర్వచనం:

బైబిల్లో, "శరీరం" అంటే అక్షరాలా మెత్తని కణజాలంతో ఉండే మానవ లేక జంతు భౌతికశరీరం.

  • బైబిల్ "శరీరం" అనే దాన్ని అలంకారికంగా కూడా అందరు మానవులను, లేక ప్రాణులను చెప్పడానికి ఉపయోగించింది.
  • కొత్త నిబంధనలో, "శరీరం" అనే మాటను మానవుల పాపపూరితమైన స్వభావం గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. వారి ఆత్మ సంబంధమైన స్వభావానికి భిన్నమైన అంశాన్ని చెప్పడానికి ఈ మాటను తరచుగా ఉపయోగిస్తారు.
  • "స్వంత రక్తమాంసాలు" అనే మాటను ఎవరైనా శారీరికంగా మరొకవ్యక్తితో బంధుత్వం ఉన్న, అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, మనవలు మెదలైన వారిని సూచించడానికి ఉపయోగిస్తారు.
  • "రక్తమాంసాలు" అనే దాన్ని ఒక వ్యక్తి పూర్వీకులు, లేక సంతానం అని తర్జుమా చెయ్యవచ్చు.
  • "ఒక శరీరం" అనే మాట శారీరికంగా ఒక పురుషుడు, స్త్రీ వివాహం ద్వారా కలవడాన్ని సూచించడానికి కూడా వాడతారు.

అనువాదం సలహాలు:

  • జంతువుల శరీరం చెప్పిన సందర్భంలో "శరీరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ”శరీరం” లేక “చర్మం” లేక “మాంసం."
  • సాధారణంగా ప్రాణులు అందరికీ కలిపి ఉపయోగించినప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "జీవులు” లేక “ప్రాణమున్న ప్రతిదీ."
  • సాధారణంగా ప్రజలు అందరి గురించీ చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రజలు” లేక “మానవులు” లేక “జీవిస్తున్న ప్రతి ఒక్కరూ."
  • "రక్తమాంసాలు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "బంధువులు” లేక “కుటుంబం” లేక “చుట్టాలు” లేక “కుటుంబం తెగ." కొన్ని సందర్భాల్లో ఇలా తర్జుమా చెయ్యవచ్చు"పూర్వీకులు” లేక “సంతానం."
  • కొన్ని భాషల్లో ఈ మాట ఒకే విధమైన అర్థం ఉండవచ్చు "రక్తమాంసాలు."
  • "ఒకే శరీరం అవుతారు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "లైంగికంగా ఏకం కావడం” లేక “ఏక శరీరం ” లేక “శరీరంలో ఆత్మలో ఏకం కావడం." ఈ మాట అనువాదం మీ భాష, సంస్కృతిలో అంగీకారయోగ్యంగా ఉందో లేదో చూసుకోండి. (చూడండి: సభ్యోక్తి) దీన్ని అలంకారికంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక పురుషుడు, ఒక స్త్రీ "ఏక శరీరం" కావడం కాకుండా అక్షరాలా ఒక వ్యక్తి అయిపోవడం.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H829, H1320, H1321, H2878, H3894, H4207, H7607, H7683, G2907, G4559, G4560, G4561

శరీరం, శరీరాలు

నిర్వచనం:

ఈ పదం “శరీరం” అక్షరాలా ఒక వ్యక్తి లేక జంతువు భౌతిక శరీరాన్ని సూచిస్తున్నది. ఈ పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. ఇంగ్లీషులో బృందం అనే అర్థం వస్తుంది.

  • తరచుగా ”శరీరం” అనే ఈ పదం మనిషి, లేక జంతువు శవాన్ని సూచిస్తున్నది. కొన్ని సార్లు "మృత దేహం" లేక "శవం"అనే అర్థం ఇస్తుంది.
  • యేసు శిష్యులకు తన చివరి పస్కా భోజనం సమయంలో చెప్పాడు, " (రొట్టె) నా శరీరం,"ఇది వారి పాపాల వెల చెల్లించడానికి విరిగిపోనున్న (మరణించ బోతున్న) తన భౌతిక శరీరం."
  • బైబిల్లో, క్రీస్తు శరీరం అయిన క్రైస్తవుల సమూహాన్ని ఇది సూచిస్తుంది.
  • భౌతిక శరీరానికి అనేక భాగాలు ఉన్నాయి. అలానే "క్రీస్తు శరీరం"లో అనేకమంది వ్యక్తిగతంగా సభ్యులు ఉన్నారు.
  • వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి ప్రత్యేకంగా క్రీస్తు శరీరంలో విధులు ఉంటాయి. సమూహం సహాయంతో కలిసి పని చేసి దేవునికి మహిమ కలిగేలా ఆయన్ను సేవించాలి.
  • యేసు “శరీరానికి, అంటే తన విశ్వాసులకు శిరస్సు" (నాయకుడు). శిరస్సు తన శరీరానికి ఆజ్ఞలు ఇచ్చినట్టే యేసు తన "శరీరంలో అవయవాలు"అయిన క్రైస్తవులకు మార్గ దర్శకత్వం చేసి నడిపిస్తాడు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని అనువదించడం లో అతి శ్రేష్టమైన మార్గం లక్ష్య భాషలో భౌతికశరీరం ఉపమానం ఉపయోగించడమే. ఈ పదం అభ్యంతరకరమైన పదం కాకుండా జాగ్రత్త పడండి.
  • మొత్తంగా విశ్వాసులను ఉద్దేశించి రాసేటప్పుడు కొన్ని భాషల్లో "ఆత్మ సంబంధమైన క్రీస్తు శరీరం"అని రాయడం మరింత సహజంగా సవ్యంగా ఉంటుంది.
  • యేసు "నా శరీరం,"అన్నప్పుడు దీన్ని అక్షరాలా అనువదించడం, అవసరమైతే ఒక నోట్ సాయంతో వివరించడం మంచిది.
  • కొన్ని భాషల్లో మృత దేహాన్ని సూచించడానికి “శవం” వంటి వేరే పదం ఉండవచ్చు. కాబట్టి ఆమోదయోగ్యమైన, అర్థ వంతమైన పదం ఉపయోగించడం మంచిది.

(చూడండి: శిరస్సు, ఆత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H990, H1320, H1460, H1465, H1472, H1480, H1655, H3409, H4191, H5038, H5085, H5315, H6106, H6297, H7607, G4430, G4954, G4983, G5559

శాపం, శపించి, శాపాలు, శపించడం

నిర్వచనం:

ఈ పదం "శాపం" అంటే ఒక వ్యక్తికి ఏదైనా హాని జరిగేలా పలకడం.

  • శాపం అంటే ఎవరికైనా, దేనికైనా హాని తలపెట్టడం.
  • ఎవరినైనా శపించడం అనే మాట వారికి హాని జరగాలని కోరుకోవడం.
  • అది శిక్ష లేక ఇతర హానికరం అయినవి ఎవరికైనా జరగాలని పలకడం.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్నిఅనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"హాని కలిగించడం” లేక “కీడు జరిగేలా ప్రకటించు” లేక “చెడు సంభవించేలా శాపం పెట్టడం."
  • దేవుడు తనకు అవిధేయులైన ప్రజలపై శాపాలు పంపించే సందర్భంలో ఇలా అనువదించ వచ్చు, "హాని సంభవించడానికి అనుమతి ఇచ్చి శిక్షించు."
  • ఈ పదం "శపించి" అనేదాన్ని ఇలా అనువదించ వచ్చు, "(వ్యక్తి) ఎక్కువ ఇబ్బంది పడేలా చెయ్యడం."
  • పద బంధం “శపితుడు" ను ఇలా అనువదించ వచ్చు, "ఒక వ్యక్తి గొప్ప దురవస్థలు అనుభవించేలా."
  • పద బంధం, "నేలను శపించి" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, " నేల సారవంతంగా ఉండదు."
  • "నేను పుట్టిన దినాన్ని శపించి" అనే దాన్ని అని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నేనెంత దురవస్థలో ఉన్నానంటే నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది."
  • అయితే, లక్ష్య భాషలో "శపితుడు" అనే అర్థం ఇచ్చే పదం ఉంటే దాన్ని వాడడం మంచిది.

(చూడండి: దీవించు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 02:09 దేవుడు సర్పంతో చెప్పాడు, "నీవు శాపానికి గురి అయ్యావు!"
  • 02:11 "ఇప్పుడు నేల శపించబడింది. నీవు ఆహారం కోసం నీవు కష్టపడాలి."
  • 04:04 "నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను. నిన్ను శపించే వారిని శపిస్తాను."
  • 39:07 తరువాత పేతురు ఒట్టు పెట్టుకుని ఆ మనిషిని నేనెరిగి ఉంటే దేవుడు నాకు శాపం పెట్టు గాక."
  • 50:16 ఆదాము, హవ్వలు లోబడలేదు గనక పాపం లోకంలోకి ప్రవేశించింది. దేవుడు లోకాన్ని శపించి దాన్ని నాశనం చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H422, H423, H779, H1288, H2763, H2764, H3994, H5344, H6895, H7043, H7045, H7621, H8381, G331, G332, G685, G1944, G2551, G2652, G2653, G2671, G2672, G6035

శాస్త్రి, శాస్త్రులు

నిర్వచనము:

శాస్త్రులు అధికారులైయుండిరి, వీరు తమ చేతులు ద్వారా మత సంబంధమైన పత్రాలను వ్రాయుటకు లేక ప్రాముఖ్యమైన ప్రభుత్వ సమాచారమును నకలు చేయుటయు లేక ఏదైనా విషయాలను వ్రాయుటకు బాధ్యతను వహించియుండిరి. యూదా శాస్త్రికి మరొక పేరు కలదు, అదేమనగా “యూదుల ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యపొందినవాడు.”

  • శాస్త్రులు పాత నిబంధన పుస్తకాలను తిరిగి ఎత్తి వ్రాయుటకు మరియు వాటిని భద్రపరచుటకు బాధ్యతను కలిగియుండిరి.
  • వారు దేవుని ధర్మశాస్త్రము మీద వ్యాఖ్యాన సహితమైన మత సంబంధమైన అభిప్రాయాలను మరియు వ్యాఖ్యలను చేయుచుండిరి, మరియు వీరు వాటిని నకలు చేసి, భద్రపరచుచుండిరి.
  • కొన్నిమార్లు శాస్త్రులు చాలా ప్రాముఖ్య ప్రభుత్వ ఆధికారులైయుండిరి.
  • బైబిలు గ్రంథములో ప్రాముఖ్యమైన శాస్త్రులలో బారూకు మరియు ఎజ్రాలు ఉండిరి.
  • క్రొత్త నిబంధనలో “శాస్త్రులు” అనే పదమును “ధర్మశాస్త్ర బోధకులు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • క్రొత్త నిబంధనలో శాస్త్రులు సాధారణముగా “ఫరిసయ్యులు” అనే మతసంబంధమైన గుంపులో ఒక భాగమైయుండిరి, మరియు ఈ రెండు గుంపులవారి పేర్లను బైబిలు గ్రంథములో తరచుగా పేర్కొనిరి.

(ఈ పదములను కూడా చూడండి: ధర్మశాస్త్రము, ఫరిసయ్యుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H5608, H5613, H7083, G1122

శిష్యుడు, శిష్యులు

నిర్వచనం:

"శిష్యుడు" అంటే ఒక బోధకునితో ఎక్కువ సమయం గడుపుతూ అతని నుండి అతని గుణ లక్షణాలు, బోధ నేర్చుకుంటూ ఉండే వాడు.

  • యేసుతో వెళ్తూ అయన బోధలు వింటూ ఆయనకు లోబడుతూ ఉండే వారిని "శిష్యులు" అన్నారు.
  • బాప్తిసమిచ్చే యోహానుకు కూడా శిష్యులు ఉన్నారు.
  • యేసు పరిచర్య కాలంలో అనేక మంది శిష్యులు ఆయన్ని వెంబడించి అయన బోధలు విన్నారు.
  • యేసు ఎన్నుకొన్న పన్నెండు మంది శిష్యులు ఆయనకు అత్యంత సన్నిహితమైన అనుచరులు; ఈ మనుషులకు "అపోస్తలులు" అని పేరు వచ్చింది.
  • యేసు పన్నెండు అపోస్తలులను "శిష్యులు” లేక “పన్నెండు మంది" అని పిలిచే వారు.
  • యేసు పరలోకానికి వెళ్లకముందు అయన తన శిష్యులు ఇతరులకు బోధించాలని, వారిని యేసు శిష్యులుగా చెయ్యాలని అజ్ఞాపించాడు.
  • ఎవరైనా యేసుపై విశ్వాసం ఉంచి అయన బోధలకు లోబడితే అలాటి వారిని యేసు శిష్యుడు అని పిలవ వచ్చు.

అనువాదం సలహాలు:

  • "శిష్యుడు" అనే దాన్ని ఒక పదంతో లేక పదబంధంతో అనువదించ వచ్చు. "అనుచరుడు” లేక “విద్యార్థి” లేక “ఛాత్రుడు” లేక “నేర్చుకునే వాడు."
  • ఈ పదం అనువాదం ఒక తరగతి గదిలో కూర్చుని ఉండే విద్యార్థి అనే అర్థం రాకుండా ఉండేలా చూసుకోవాలి.
  • ఈ పదం అనువాదం "అపోస్తలుడు" అనే మాటకు కూడా వేరుగా ఉండేలా చూడండి.

(చూడండి: అపోస్తలుడు, విశ్వసించు, యేసు, యోహాను (బాప్తిసమిచ్చే), పన్నెండు మంది)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 30:08 అయన (యేసు) ఆ ముక్కలను తన శిష్యులకు ఇచ్చి ప్రజలకు పంచమన్నాడు. శిష్యులు ఆ ఆహారం, పంచి పెట్టిన కొలది అది అయిపోవడం లేదు!
  • 38:01 దాదాపు మూడు సంవత్సరాల తరువాత యేసు మొదటిగా బహిరంగ బోధ ప్రకటించడం మొదలు పెట్టి తన శిష్యులతో తాను చనిపోవడానికి ముందు యెరూషలేములో వారితో కలిసి పస్కా అచరించాలని కోరాడు.
  • 38:11 తరువాత యేసు తన శిష్యులతో కలిసి గేత్సేమనే అనే చోటికి వెళ్ళాడు. యేసు తన శిష్యులతో వారు శోధనలోకి ప్రవేశింసించకుండేలా ప్రార్థించమని చెప్పాడు.
  • 42:10 యేసు తన శిష్యులతో, "సర్వాధికారం పరలోకంలోను, భూమిమీదా నాకు ఇవ్వ బడింది” అని చెప్పాడు. కాబట్టి వెళ్లి ప్రజలు సమూహాలను శిష్యులుగా చెయ్యండి. వారికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల నామంలో బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ వారు లోబడాలని వారికి నేర్పించండి" అని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H3928, G3100, G3101, G3102

శుద్ధమైన, కడుగు

నిర్వచనం:

"శుద్ధమైన" పదం సాధారణంగా ఒకని నుండి/ఒకదాని నుండి మురికిని గానీ లేదా మరకలను తొలగించడం లేదా మొదటి స్థానంలో ఎటువంటి మురికి లేదా మరక లేకుండా ఉండడం అని సూచిస్తుంది. "కడుగు" పదం ప్రత్యేకంగా ఒకరి నుండి/ఒకదాని నుండి మురికినీ లేదా మరకనూ తొలగించే చర్యను సూచిస్తుంది.

  • "శుద్ధపరచు" అంటే దేనినైనా "శుద్ధి"గా చెయ్యడం. ఇది "కడుగు” లేదా “పవిత్రపరచు" అని కూడా అనువదించబడవచ్చు.
  • పాత నిబంధనలో, దేవుడు ఇశ్రాయేలీయులకు ఆచార పరమైన " శుద్ధజంతువులు" ఏమిటో “అశుద్ధ" జంతువులు ఏమిటో చెప్పాడు. శుద్ధ జంతువులు మాత్రమే ఆహారానికీ, లేదా బలి ఇవ్వడానికీ అనుమతించబడతాయి. ఈ సందర్భంలో "శుద్ధిచెయ్యడం" పదం దేవునికి బలిగా ఉపయోగించడం కోసం జంతువు అనుమతించబడిందని అర్థం.
  • నిర్దిష్ట చర్మ రోగాలు ఉన్న వ్యక్తి అది ఇక అంటువ్యాధిగా ఉండకుండా స్వస్థత పొందేంత వరకూ ఆశుద్ధుడిగానే ఉంటాడు. ఆ వ్యక్తి తిరిగి "శుద్ధుడు"గా ప్రకటించబడడం కోసం చర్మం శుద్ధి కోసం సూచనలకు విధేయత చూపించాలి.
  • కొన్నిసార్లు "శుద్ధ" అనే పదం నైతిక శుద్ధిని సూచిస్తూ అలంకారికంగా ఉపయోగించబడుతుంది. అంటే పాపం నుండి "శుద్ధి" కావడం అని అర్థం.

బైబిలులో "అశుద్ధం" పదం ప్రజలు తాకడానికీ. తినడానికీ, బలి అర్పించడానికీ పనికిరానివని దేవుడు ప్రకటించిన వాటిని అలంకారికంగా సూచిస్తుంది.

  • దేవుడు "శుద్ధమైన" జంతువులను గురించీ, "ఆశుద్ధమైన" జంతువులను గురించీ ఇశ్రాయేలీయులకు సూచనలు ఇచ్చాడు. అశుద్ధమైన జంతువులు తినడానికి గానీ లేదా బలి అర్పించడానికి గానీ ఉపయోగించడానికి అనుమతించబడవు.
  • కొన్ని నిర్దిష్ట చర్మ రోగాలు ఉన్న ప్రజలు స్వస్థత పొందేంత వరకూ "అశుద్ధులు" గా ఉంటారు.
  • ఇశ్రాయేలీయులు అశుద్ధమైన దానిని ఏదైనా తాకినట్లయితే వారు కొంత కాలంపాటు ఆశుద్దులుగా యెంచబడతారు.
  • అశుద్ధమైన వాటిని ముట్టుకోవడం, లేదా తినడం గురించి దేవుని ఆజ్ఞలకు లోబడడం ఇశ్రాయేలీయులను దేవుని సేవకై ప్రత్యేక పరుస్తుంది.
  • శారీరక, ఆచార పరమైన అశుద్ధత నైతిక అశుద్ధతకు సంకేతంగా ఉంది.
  • "అశుద్ధమైన ఆత్మ" మరొక భాషా రూపంలో ఒక దురాత్మను సూచిస్తుంది.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "శుద్ధమైన" లేదా "పవిత్రమైన" (మురికిగా ఉండకుండా ఉండడం భావంలో) కోసం సాధారణంగా ఉపయోగించే పదాలతో అనువదించబడవచ్చు.

  • "ఆచారపరంగా శుద్ధిగా ఉండడం" లేదా "దేవునికి అంగీకారంగా ఉండడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

  • "శుద్ధీకరణ" ను "కడగడం" లేదా "పవిత్రపరచడం" అనువదించ వచ్చు.

  • "శుద్ధి," "శుద్ధి చెయ్యడం" కోసం ఉపయోగించే పదాలు అలంకారిక భావంలో కూడా అర్థం అయ్యేలా చూడండి.

  • "అశుద్ధం" పదం "శుద్ధంగా లేకపోవడం" లేదా "దేవుని దృష్టిలో పనికిరానిది" లేదా ""శారీరకంగా అశుద్ధమైనది" లేదా "మలినమైనది" అని అనువదించబడవచ్చు.

  • ఒక దయ్యాన్ని ఆశుద్ధమైన ఆత్మగా సూచిస్తున్నప్పుడు "అశుద్ధం" పదం "దుష్టమైనది" లేదా "అపవిత్రమైనది" అని అనువదించబడవచ్చు.

  • ఈ పదం అనువాదం ఆత్మ సంబంధమైన అశుద్ధత అర్దాన్ని అనుమతించాలి. తాకడానికీ, తినడానికీ, లేదా బలిఅర్పించడానికీ పనికిరానివిగా దేవుడు ప్రకటించిన దేనినైనా ఇది సూచించగలిగియుండాలి.

(చూడండి: మలినం, దయ్యం, పరిశుద్ధ, బలి అర్పణ)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1249, H1252, H1305, H2134, H2135, H2141, H2398, H2548, H2834, H2889, H2890, H2891, H2893, H2930, H2931, H2932, H3001, H3722, H5079, H5352, H5355, H5356, H6172, H6565, H6663, H6945, H7137, H8552, H8562, G167, G169, G2511, G2512, G2513, G2839, G2840, G3394, G3689

శుద్ధమైన, శుద్ధపరచు, శుద్ధీకరణ

నిర్వచనం:

“శుద్ధమైన" అంటే ఎటువంటి పొరపాటు లేకుండా ఉండడం, లేదా ఉండకూడనిదేదీ కలుపబడకుండా ఉండడం అని అర్థం. ఒక దానిని శుద్దీకరించడం అంటే దానిని మలినపరచేదానిని గానీ లేదా కలుషితం చేసేదానిని గానీ తొలగించడం అని అర్థం.

  • పాతనిబంధన ధర్మాలకు సంబంధించి "శుద్ధి పరచు" మరియు "శుద్దీకరణ" పదాలు ఒక వస్తువు లేదా వ్యక్తిని వ్యాధి, శరీర ద్రవాలు లేదా శిశు జననం లాంటి వాటి వలన ఆచారపరమైన అపరిశుభ్ర పరచబడినప్పుడు వాటినుండి శుభ్రపరచడాన్ని ప్రధానంగా సూచిస్తుంది.
  • ప్రజలు పాపము నుండి సాధారణంగా జంతు బలి ద్వారా శుద్ధి చెయ్యబడడం గురించి చెప్పే ధర్మాలు పాతనిబంధనలో ఉన్నాయి. ఈ కార్యాలు కేవలం తాత్కాలికమైనవీ, బలులు తిరిగి తిరిగి పునరావృతం చెయ్యవలసి వచ్చేది.
  • క్రొత్త నిబంధనలో శుద్ధి చెయ్యబడడం అంటే తరచుగా పాపం నుండి శుద్ధి చెయ్యడడం అని సూచిస్తుంది.
  • మనుష్యులు, యేసునూ, ఆయన బలియాగాన్నీ విశ్వసించడం ద్వారా పశ్చాత్తాపపడడం, దేవుని క్షమాపణను పొందుకోవడం ద్వారా మాత్రమే పాపం నుండి సంపూర్తిగానూ, శాశ్వతంగానూ శుద్ధి చెయ్యబడతారు.

అనువాదం సూచనలు:

  • “శుద్దిపరచు" పదం "శుద్ధి చెయ్యి" లేదా శుభ్రపరచు" లేదా "సమస్త మలినం నుండి శుభ్రపరచడం" లేదా "సమస్త పాపం నుండి తొలగిపోవడం" అని అనువదించబడవచ్చు.
  • “తమ శుధ్ధీకరణ కాలము ముగిసిన తరువాత” అనే వాక్యం "అవశ్యకమైన దినములు వారు ఎదురు చూడడం ద్వారా తమ్మును తాము శుద్ధి పరచుకొన్న తరువాత" అని అనువదించబడవచ్చు.
  • “పాపములనుండి శుధ్ధీకరణ అనుగ్రహించబడింది" పదబంధం "ప్రజలు తమ పాపం నుండి సంపూర్తిగా శుద్ధి చెయ్యబడడం కోసం ఒక మార్గం అనుగ్రహించబడింది" అని అనువదించబడవచ్చు.
  • “శుధ్ధీకరణ” పదం “శుభ్రపరచడం” లేదా “ఆత్మీయంగా కడుగబడుట” లేదా “ఆచారపరంగా శుధ్ధీకరించబడుట” అని వివిధ విధాలుగా అనువదించబడవచ్చు.

(చూడండి: ప్రాయశ్చిత్తం, శుద్ధి, ఆత్మ)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1249, H1252, H1253, H1305, H1865, H2134, H2135, H2141, H2212, H2398, H2403, H2561, H2889, H2890, H2891, H2892, H2893, H3795, H3800, H4795, H5343, H5462, H6337, H6884, H6942, H8562, G48, G49, G53, G54, G1506, G2511, G2512, G2513, G2514

శేషము

నిర్వచనము:

“శేషము” అనే పదము అక్షరార్థముగా ఒక పెద్ద గుంపునుండి లేక జనసంఖ్య ఉన్నటువంటి ప్రజలనుండి “విడువబడిన” లేక “మిగిలిపోయిన” వస్తువులనుగాని లేక ప్రజలనుగాని సూచించును.

  • అనేకమార్లు “శేషము” అనే ఈ పదము అనేక శ్రమల ద్వారా దేవునికి విధేయత చూపిన కొద్దిమందిని లేక అపాయకరమైన పరిస్థితి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న ప్రజలను సూచిస్తుంది.
  • కానానులోని వాగ్ధాన దేశమునకు తిరిగి జీవించుటకు మరియు బయటవారినుండి అనేక దాడులను ఎదుర్కొనుచు జీవిస్తున్న శేష జనాంగముగా యూదుల గుంపును యెషయా సూచించియున్నాడు.
  • దేవుని కృపను పొందుకొనుటకు ఆయన ద్వారా ఎన్నుకొనబడిన “శేషించబడిన” ప్రజలను గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు.
  • “శేషము” అనే ఈ పదము నమ్మకముగా ఉండని లేక నమ్మకముగా జీవించని లేక ఎన్నుకొనబడని ఇతర ప్రజలను సూచించుటకు ఉపయోగించబడియున్నది.

తర్జుమా సలహాలు:

“ఈ ప్రజల శేషము” అనేటువంటి ఈ మాట “మిగిలిన ఈ ప్రజలు” లేక “నమ్మకముగా ఉండిన ప్రజలు” లేక “విడువబడిన ప్రజలు” అని కూడా తర్జుమా చేయుదురు.

  • “శేషించబడిన ప్రజలందరు” అనే ఈ మాటను “మిగిలిన ప్రజలందరు” లేక “శేషించబడిన ప్రజలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3498, H3499, H5629, H6413, H7604, H7605, H7611, H8281, H8300, G2640, G3005, G3062

శోధించు, శోధన

నిర్వచనం:

ఎవరినైనా శోధించడం అంటే ఆ వ్యక్తి ఏదైనా తప్పు చెయ్యమని ప్రేరేపించు.

  • శోధన అంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసేలా నడిపించేది.
  • మనుషులు వారి స్వంత పాపపూరితమైన స్వభావం మూలంగా, లేక ఇతరుల మూలంగా శోధన ఎదుర్కొంటారు.
  • సాతాను మనుషులు దేవుణ్ణి ధిక్కరించేలా ఆయనకు వ్యతిరేకంగా చెడ్డ పనులు చేసేలా ప్రేరేపిస్తాడు.
  • సాతాను యేసును పాపం చెయ్యడానికి ప్రేరేపించాడు. అయితే యేసు సాతాను శోధనలకు లొంగలేదు. పాపం చెయ్యలేదు.
  • ఎవరైనా "దేవుణ్ణి శోధించడం” అంటే ఆయన్ని ఏదైనా తప్పు చెయ్యమని కాదు. అతడు తలబిరుసుగా అవిధేయతతో దేవుడు తనను శిక్షించేలా చేసుకుంటున్నాడు. దీన్ని "దేవుణ్ణి పరీక్షిస్తున్నాడు" అని కూడా రాయవచ్చు.

అనువాదం సలహాలు:

  • "శోధించు" అనే మాటను ఇలా కూడా అనువదించ వచ్చు. "పాపం చేసేలా ప్రోత్సహించు” లేక “మరులు గొలుపు” లేక “పాపం చెయ్యాలని కోరుకోవడం."
  • "శోధనలు" అనే మాటను అనువదించడంలో ఇతర మార్గాలు "ఆకర్షించే విషయాలు” లేక “ఎవరినైనా పాపం చేసేలా ప్రోత్సహించడం” లేక “ఏదైనా తప్పు చేసేలా ఒకడు కోరుకునేలా చెయ్యడం.
  • "దేవుణ్ణి శోధించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుణ్ణి పరీక్షకు గురి చెయ్యడం” లేక “దేవునికి పరీక్ష కలిగించడం” లేక “దేవుని సహనాన్ని పరిక్షించడం” లేక “దేవుడు తనను శిక్షించే పరిస్థితి కల్పించడం” లేక “తలబిరుసుగా దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉండడం."

(చూడండి: ధిక్కరించు, సాతాను, పాపం, పరీక్ష)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 25:01 తరువాత సాతాను యేసు దగ్గరికి వచ్చి ఆయనను పాపం చేసేలా శోధించాడు.
  • 25:08 యేసు సాతాను శోధనలకు లొంగలేదు.
  • 38:11 యేసు తన శిష్యులకు వారు శోధనలో పడకుండా ప్రార్థించాలని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H974, H4531, H5254, G551, G1598, G3985, G3986, G3987

సంఘం, సంఘం

నిర్వచనం:

కొత్త నిబంధనలో, "సంఘం" పదం స్థానికంగా యేసునందు విశ్వాసుల గుంపును సూచిస్తుంది. వీరు ప్రార్థన చెయ్యడానికీ, ప్రకటించబడిన దేవుని వాక్యాన్ని వినడానికీ క్రమంగా కలుసుకొంటారు. పెద్ద అక్షరంతో ఆరంభం అయ్యే "సంఘం" పదం తరచుగా క్రైస్తవులందరినీ సూచిస్తుంది.

  • ఇది అక్షరాలా ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం కలుసుకోడానికి "వెలుపలికి పిలువబడిన" ప్రజల సంఘం లేదా సమాజాన్ని అక్షరాలా సూచిస్తుంది. * ఈ పదం అన్ని ప్రదేశాలలో క్రీస్తు శరీరంలోని విశ్వాసులందరినీ సూచించడానికి ఉపయోగించబడింది. స్థానిక సంఘంనుండి భిన్నంగా ఉండడానికి కొందరు బైబిలు అనువాదకులు "సంఘం" పదంలోని మొదటి అక్షరాన్ని పెద్ద అక్షరంగా ఉంచారు.
  • తరచుగా ఒక పట్టణంలోని విశ్వాసులు ఒకరి గృహంలో కలుసుకొంటారు. ఈ స్థానిక సంఘాలకు "ఎఫెసులోని సంఘం" అన్నట్లుగా ఆ పట్టణం పేరు ఇవ్వబడుతుంది.
  • బైబిలులో "సంఘం" అంటే ఒక కట్టడాన్ని సూచించడం లేదు.

అనువాదం సూచనలు:

  • "సంఘం" అనే పదం "గుంపుగా కలవడం" లేదా “సంఘం" లేదా "సమాజం" లేదా గుంపుగా కలిసే వారు" అని అనువదించబడవచ్చు.
  • ఈ పదాన్ని అనువదించడానికి ఉపయోగించే పదం లేదా పదబంధం కేవల ఒక చిన్న గుంపును మాత్రమే కాక విశ్వాసులందరినీ సూచించేదిగా కూడా ఉండాలి.
  • "సంఘం" పదం అనువాదం ఒక కట్టడాన్ని సూచించేలా ఉండకుండా జాగ్రత్త పడాలి.
  • పాత నిబంధనలో "సంఘం" పదాన్ని అనువదించడానికి ఉపయోగించిన పదం కూడా దీనిని అనువదించడానికి ఉపయోగించబడవచ్చు.
  • దీన్ని స్థానిక, జాతీయ బైబిలు అనువాదంలో ఇది ఏవిధంగా అనువదించబడిందో కూడా పరిశీలించండి.

(చూడండి: తెలియని వాటిని అనువదించడం ఎలా)

(చూడండి: సంఘం, విశ్వసించు, క్రైస్తవుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 43:12 పేతురు వాక్యాన్ని బోధించినప్పుడు సుమారు 3,000 మంది ప్రజలు విశ్వసించారు, యేసు శిష్యులు అయ్యారు. వారు బాప్తిసం పొందారు, యెరూషలేము సంఘంలో భాగం అయ్యారు.
  • 46:09 అంతియొకయలో ఎక్కువమంది యూదులు కాదు. అయితే మొదటి సరిగా వారిలో అనేక మంది విశ్వాసులు అయ్యారు. బర్నబా, సౌలు ఈ కొత్త విశ్వాసులకు యేసును గురించి మరింత బోధించడానికీ సంఘాన్ని బలపరచడానికి అక్కడికి వెళ్లారు.
  • 46:10 కాబట్టి అంతియొకయలో సంఘం బర్నబా, సౌలు కోసం ప్రార్థించి వారిపై చేతులు ఉంచారు. తరువాత వారిని సువార్త ప్రకటించడానికి అనేక ఇతర స్థలాలకు పంపారు.
  • 47:13 యేసు సువార్త వ్యాపిస్తూ సంఘం పెరుగుతూ వచ్చింది.
  • 50:01 దాదాపు 2,000 సంవత్సరాలు, లోకమంతటా మరింత మంది ప్రజలు యేసును గురించిన సువార్త విన్నారు. సంఘం ఎదుగుతూ ఉంది.

పదం సమాచారం:

  • Strong's: G1577

సంఘకాపరి, సంఘకాపరులు

నిర్వచనము:

“సంఘకాపరి” అను పదము అక్షరార్థముగా అదే పదమైన “కాపరి” అని అర్థము. విశ్వాసుల గుంపు కొరకు నియమించబడిన ఆత్మీయ నాయకునికి బిరుదుగా దీనిని ఉపయోగించేదరు.

  • ఆంగ్ల తర్జుమాలలో “పాస్టర్” (సంఘకాపరి) అని ఎఫేసి పత్రికలో మాత్రమె ఒకసారి కనబడుతుంది.
  • తర్జుమా చేయబడిన “కాపరి” అను పదమే అనేకచోట్ల కనబడుతుంది.
  • మరికొన్ని భాషలలో “పాస్టర్” (సంఘకాపరి) అనే పదమును “సంఘకాపరి” అను పదములాగానే ఉపయోగిస్తారు.
  • “మంచి కాపరి” అని యేసును సూచించుటకు ఉపయోగించబడిన పదము కూడా ఒకే పదమునైయున్నది.

తర్జుమా సలహాలు:

  • అనువాద భాషలో “కాపరి” అని పదముతోనే ఈ పదమును తర్జుమా చేయడము ఉత్తమము.
  • ఈ పదమును అనువాదము చేయు వేరొక విధానములలో “ఆత్మీయ కాపరి” లేక “కాపరిగానున్న క్రైస్తవ నాయకుడు” అనే మాటలు కూడా ఉంటాయి.

(ఈ పదాలను కూడా చూడండి: కాపరి, గొర్రెలు)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H7462, G4166

సత్యమైన, సత్యం

నిర్వచనం:

"సత్యం" పదం వాస్తవాలనూ, సంఘటనలనూ, వాస్తవానికి సంబంధించిన ప్రకటనలనూ సూచిస్తుంది. నిజమైన (సత్యమైన) వాస్తవాలు విశ్వం నిజంగా ఉందని వివరిస్తాయి. సత్యమైన సంఘటనలు వాస్తవంగా జరిగిన సంఘటనలు. నిజమైన ప్రకటనలు వాస్తవ లోకం ప్రకారం అబద్దపు ప్రకటనలు కాదు.

  • "నిజమైన" సంగతులు నిజమైనవి, యదార్ధమైనవి, అసలైనవి, న్యాయబద్ధమైనవి, వాస్తవమైనవి.
  • సత్యం అంటే సత్యం అయిన అవగాహనలు, నమ్మకాలు, వాస్తవాలు లేదా ప్రకటనలు.
  • ప్రవచనం "నెరవేరింది” లేదా “జరుగుతుంది" అంటే అది ముందుగా ఊహించి చెప్పినట్టుగా నిజంగా జరిగింది లేదా ఆ విధంగా జరుగుతుంది అని అర్థం.
  • బైబిలులో "సత్యం" విషయమైన భావనలో ఆధారపడదగిన, లేక విశ్వసనీయ విధానంలో చెయ్యడం గురించిన భావన ఉంది.
  • యేసు చెప్పిన మాటలలో దేవుని సత్యం వెల్లడి బయలు పడింది.
  • బైబిలు సత్యమై ఉంది. ఇది దేవుని గురించి సత్యమైన దానిని బోధిస్తుంది. ఆయన చేసిన సమస్తం గురించి బోధిస్తుంది.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, వివరించబడిన దానిని బట్టి "సత్యం" పదం "నిజమైన" లేదా "వాస్తవమైన" లేదా సరియైన" లేదా "నిశ్చితమైన" లేదా "యదార్ధమైన" అని అనువదించబడవచ్చు.
  • "సత్యం" పదం "సత్యమైనది" లేదా "వాస్తవం" లేదా "నిశ్చయం" లేదా "సూత్రం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "నెరవేరింది" అనే పదబంధం "నిజంగా జరుగుతుంది" లేదా "నెరవేరుతుంది" లేదా "ఊహించినట్లుగా జరుగుతుంది" అని అనువదించబడవచ్చు.
  • "సత్యం చెప్పు" లేదా "సత్యం మాట్లాడు" వాక్యాలు "సత్యం అయినదానిని మాట్లాడు" లేదా "నిజంగా జరిగినదానిని చెప్పు" లేదా "నమ్మదగిన వాటిని మాట్లాడు" అని అనువదించవచ్చు. * "సత్యం అంగీకరించు" వాక్యం "దేవుని గురించి సత్యం అయినదానిని విశ్వసించు" అని అనువదించవచ్చు.
  • "దేవుణ్ణి ఆత్మలోనూ, సత్యంలోనూ ఆరాధించు" వాక్యంలో "సత్యంలో" పదం "దేవుడు మనకు బోధించిన దానికి నమ్మకంగా విధేయత చూపించు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: విశ్వసించు, విశ్వసనీయత, నెరవేర్చు, లోబడు, ప్రవక్త, అవగాహన)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 02:04 సర్పం స్త్రీకి ఇలా జవాబిచ్చింది, "అది నిజం! మీరు చనిపోరు."
  • 14:06 వెంటనే కాలేబు, యెహోషువా, అనే ఇద్దరు గూఢచారులు, చెప్పారు, "అది నిజం, కనాను వాసులు పొడవైన బలమైన వారు., అయితే మనం తప్పనిసరిగా వారిని ఓడించగలం!"
  • 16:01 ఇశ్రాయేలీయులు నిజమైన దేవుడు అయిన యెహోవాకు బదులు కనానీయుల దేవుళ్ళను పూజించడం ఆరంభించారు.
  • 31:08 వారు యేసును ఆరాధించారు, "నిజముగా నీవు దేవుని కుమారుడవు" అన్నారు.
  • 39:10 "నేను దేవుణ్ణి గురించిన సత్యం చెప్పడానికి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ నా మాట వింటారు." పిలాతు అన్నాడు, "సత్యం" అంటే ఏమిటి?"

పదం సమాచారం:

  • Strong's: H199, H389, H403, H529, H530, H543, H544, H551, H571, H935, H3321, H3330, H6237, H6656, H6965, H7187, H7189, G225, G226, G227, G228, G230, G1103, G3303, G3483, G3689, G4103, G4137

సద్దూకయ్యుడు, సద్దూకయ్యులు

నిర్వచనము:

సద్దూకయ్యులు అనేవారు యేసు క్రీస్తు కాలములో యూదా మత యాజకుల రాజకీయ గంపుకు చెందినవారు. వారు రోమా పరిపాలనను సమర్ధించిరి మరియు వీరు పునరుత్థానమునందు విశ్వసించినవారు కారు.

  • అనేకమంది సద్దూకయ్యులు ప్రధాన యాజకత్వమును మరియు మహా యాజకత్వమును పొంది, శక్తివంతమైన నాయకత్వమును కలిగి, ఉన్నత వర్గపు యూదులును మరియు శ్రీమంతులునైయుండిరి.
  • సద్దూకయ్యుల కర్తవ్యాలలో బలియర్పణలులాంటి యాజక పనులు మరియు దేవాలయమును చూచుకొను పనులను కలిగియుండిరి.
  • సద్దూకయ్యులు మరియు ఫరిసయ్యులు యేసును సిలువ వేయుటకు బలముగా రోమా నాయకులను ప్రభావితము చేసిరి.
  • మతపరమైన ఈ రెండు గుంపులకు విరుద్ధముగా వారి కపటం మరియు స్వార్థమును గూర్చి యేసు మాట్లాడిరి.

(ఈ పదములను కూడా చూడండి: ప్రధాన యాజకులు, కౌన్సిల్, మహా యాజకుడు, వేషధారి, యూదా నాయకులు, ఫరిసయ్యులు, యాజకుడు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G4523

సబ్బాతు

నిర్వచనము:

“సబ్బాతు” అనే ఈ పదము వారపు రోజులలో ఏడవ రోజును సూచించును, ఈ దినము విశ్రాంతి దినముగాను మరియు ఈ దినమందు ఎటువంటి పని చేయకూడదని, దీనిని ప్రత్యేకించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.

  • దేవుడు ఆరు రోజులలో సర్వ సృష్టిని సృష్టించిన పిదప, ఆయన ఏడవ రోజున విశ్రాంతి తీసుకొనియున్నాడు. అదే విధముగా, దేవునిని ఆరాధించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన దినముగా ఏడవ రోజును ప్రత్యేకపరచాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.
  • “సబ్బాతు దినమును పరిశుద్ధ దినముగా ఉంచాలనే” ఆజ్ఞ దేవుడు ఇశ్రాయేలీయులకొరకు రాతి పలకలపైన వ్రాసి మోషేకి ఇచ్చిన పది ఆజ్ఞలలో ఒకటైయుండెను
  • రోజులను లెక్కపెట్టే యూదుల పధ్ధతిని మనము అనుసరించినట్లయితే, సబ్బాతు దినము శుక్రవారము సంధ్యవేళ ఆరంభమై, శనివారము సంధ్యవేళకు ముగియును.
  • పరిశుద్ధ గ్రంథములో కొన్నిమార్లు సబ్బాతును కేవలము సబ్బాతు అని మాత్రమే పిలవకుండా “సబ్బాతు దినము” అని కూడా పిలిచిరి.

తర్జుమా సలహాలు:

  • ఈ మాటను “విశ్రాంతి దినము” లేక “విశ్రాంతి కొరకు నియమించబడిన దినము” లేక “పనిచేయని దినము” లేక “విశ్రాంతి తీసుకొను దేవుని దినము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని చూపించుటకు కొన్ని తర్జుమాలలో ఈ పదమును ఎత్తి చూపిస్తారు, ఉదాహరణకు, “సబ్బాతు దినము” లేక “విశ్రాంతి దినము”.
  • ఈ పదమును స్థానిక లేక జాతీయ భాషలో ఏ విధంగా అనువదించబడిందో గమనించండి.

(దీనిని కూడా చూడండి: తెలియని వాటిని ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: విశ్రాంతి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:05 “ఎల్లప్పుడు సబ్బాతు దినమును పరిశుద్ధముగా ఆచరించండి. అనగా, ఆరు రోజులలో మీ సమస్త పనులన్నియు చేసుకొని, ఏడవ రోజున నన్ను ఘనపరచుటకు మరియు మీరు విశ్రాంతి తీసుకొనుటకు సబ్బాతు దినమును ఆచరించండి.
  • 26:02 యేసు తన చిన్న వయస్సులో నివసించిన స్థలమైన నజరేతు పట్టణమునకు వెళ్ళెను. సబ్బాతు రోజున, ఆయన ఆరాధన స్థలమునకు వెళ్ళెను.
  • 41:03 యేసును సమాధి చేసిన ఆ మరుసటి రోజు సబ్బాతు దినమైయుండెను, మరియు యూదులు ఆ దినమున సమాధి దగ్గరకి వెళ్ళుటకు అనుమతించబడలేదు.

పదం సమాచారం:

  • Strong's: H4868, H7676, H7677, G4315, G4521

సమర్పించు, ప్రతిష్టించి, ప్రతిష్ఠ

నిర్వచనం:

సమర్పించు అంటే దేన్నైనా లేక ఎవరినైనా దేవుని సేవకు ప్రతిష్టించు అని అర్థం. ప్రతిష్టించిన ఒక వ్యక్తిని లేక వస్తువును దేవునికి పరిశుద్ధంగా, ప్రత్యేకంగా ఎంచుతారు.

  • ఈ పదం అర్థం "పవిత్రీకరణ” లేక “పరిశుద్ధపరచడం." అయితే మరికొంత అర్థం కలుస్తుంది. పథకం ప్రకారం ఎవరినైనా దేవుని సేవకు ప్రత్యేక పరచడం.
  • వస్తువులు దేవునికి ప్రతిష్టించేవి బలి జంతువులు, ప్రత్యక్ష గుడారంలోని దహన బలిపీఠం మొదలైనవి.
  • దేవునికి ప్రతిష్టించిన వ్యక్తులు యాజకులు, ఇశ్రాయేలు ప్రజలు, తొలిచూలు మగ బిడ్డ.
  • కొన్ని సార్లు ఈ పదం "సమర్పించు" అనే దానికి, "శుద్ధి చేయు," అనే అర్థమే ఉంటుంది. ముఖ్యంగా అది మనుషులను, వస్తువులను దేవుని సేవకు ఇవ్వడంలో వారు దేవునికి శుద్ధం గాను, అంగీకారయోగ్యం గాను ఉండేలా చెయ్యాలి.

అనువాదం సలహాలు:

  • "సమర్పించు" అనే పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. " దేవుని సేవకు కేటాయించు” లేక “దేవుణ్ణి సేవించడానికి శుద్ధి చేయు."
  • ఈ పదాలు "పరిశుద్ధ” “పవిత్రీకరణ" ఎలా అనువదించ వచ్చో గమనించండి.

(చూడండి: పరిశుద్ధ, శుద్ధ, పవిత్రీకరణ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2763, H3027, H4390, H4394, H5144, H5145, H6942, H6944, G1457, G5048

సమాజ మందిరము

నిర్వచనము:

సమాజ మందిరము అనునది దేవునిని ఆరాధించుటకు యూదులందరూ కలిసి ఒక దగ్గర కూడుకొనే భవనము.

  • పురాతన కాలములలో, సమాజ మందిర ఆరాదన కార్యక్రమాలలో ప్రార్థన సమయములు, వాక్య పఠనము, మరియు లేఖనములను గూర్చిన బోధ ఉండేది.
  • యూదులు తమ తమ స్వంత పట్టణములలో దేవునిని ఆరాధించుటకు మరియు ప్రార్థించుటకు అవకాశముండునట్లు సమాజ మందిరములను నిర్మించుటకు ఆరంభించిరి, ఎందుకంటే వారిలో అనేకులు యెరూషలేములోని దేవాలయమునకు ఎంతో దూరములో నివసించేవారు.
  • యేసు అనేకమార్లు సమాజ మందిరములో మాట్లాడియున్నాడు మరియు అనేకులను స్వస్థపరిచియున్నాడు. “సమాజ మందిరము” అనే మాట అక్కడ కూడుకునే ప్రజల గుంపును సూచించుటకు అలంకార ప్రాయముగా కూడా ఉపయోగించేవారు.

(ఈ పదములను కూడా చూడండి: స్వస్థపరచు, యెరూషలేము, యూదుడు, ప్రార్థించు, దేవాలయము, దేవుని వాక్యము, ఆరాధన)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H4150, G656, G752, G4864

సర్వ శక్తిమంతుడు

వాస్తవాలు:

"సర్వ శక్తిమంతుడు "ఈ పదానికి అక్షరాలా"పూర్తి శక్తివంతమైన"అని అర్థం; బైబిల్లో, ఇది ఎప్పుడూ దేవునికి వర్తిస్తుంది.

  • "సర్వ శక్తిమంతుడు” లేక “సర్వ శక్తిగల వాడు"అనే బిరుదునామం దేవునికి చెందినది. ప్రతి దాని పైనా ఆయనకు పూర్ణ శక్తి, అధికారం ఉన్నదని వెల్లడించే పదం.
  • దేవుని బిరుదు నామాలు "సర్వ శక్తిమంతుడైన దేవుడు," "దేవుడు సర్వ శక్తిమంతుడు,“ “ప్రభువు సర్వ శక్తిమంతుడు,“ “ప్రభువైన దేవుడు సర్వ శక్తిమంతుడు"అనే వాటిని ఇది వర్ణిస్తుంది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు."పూర్ణ శక్తివంతమైన “లేక “పూర్తిగా శక్తివంతమైన వాడు” లేక “పూర్ణ శక్తివంతమైన దేవుడు."
  • ఈ మాటను అనువదించే విధానాలు "ప్రభువైన దేవుడు సర్వ శక్తిమంతుడు."దీనికి "దేవుడు, శక్తిగల అధిపతి” లేక “శక్తివంతమైన సార్వభౌమ దేవుడు” లేక “ప్రతి దాని పైనా అధికారం గల యజమాని అయిన దేవుడు."

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: దేవుడు, ప్రభువు, శక్తి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7706, G3841

సర్వోన్నతుడు

వాస్తవాలు:

“సర్వోన్నతుడు” అనే పదం దేవునికి బిరుదు. ఇది ఆయన గొప్పతనాన్ని లేక అధికారాన్ని సూచిస్తుంది.

  • ఈ పదం అర్థం “సార్వభౌముడు” లేక “సర్వాదికారి” అనే పదాల అర్థం ఒకేలా ఉంటుంది.
  • ఈ బిరుదులో ”ఉన్నతమైన” అనే పదం భౌతిక ఎత్తును గానీ లేదా దూరాన్ని గానీ సూచించడం లేదు. గొప్పతనాన్ని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • ఈ పదాన్ని “సర్వోన్నతుడైన దేవుడు” లేక అత్యంత సర్వాదికారి దేవుడు” లేక “ఉన్నతుడైన దేవుడు” లేక “అత్యంత గొప్పవాడు” లేక “సర్వాదికారియైన వాడు” లేక “అందరికంటే గొప్పవాడైన దేవుడు” అని అనువదించవచ్చు.
  • ”ఉన్నతుడు” లాంటి పదం వినియోగించినప్పుడు, అది భౌతికమైన ఎత్తు లేక పొడవులను సూచించేదిగా ఉండకూడదు.

(చూడండి: దేవుడు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5945, G5310

సహవాసం

నిర్వచనం:

సాధారణంగా, "సహవాసం" అంటే ఒకే విధమైన ఆసక్తులు అనుభవాలు గల వారి మధ్య ఉండే స్నేహ పూర్వకమైన కలయికలు.

  • బైబిల్లో, "సహవాసం" అనే మాట క్రీస్తు విశ్వాసుల కలయికను సాధారణంగా సూచిస్తున్నది.
  • క్రైస్తవ సహవాసం అంటే విశ్వాసుల మధ్య వారికి క్రీస్తు, పరిశుద్ధాత్మల మూలంగా ఉండే సంబంధం.
  • ఆది క్రైస్తవులు వారి సహవాసాన్ని దేవుని వాక్కు వినడం, కలిసి ప్రార్థన చేయడం వారికి ఉన్నవి కలిసి పంచుకోవడం కలిసి భోజనాలు చేయడం ద్వారా వ్యక్త పరిచే వారు.
  • క్రైస్తవులు క్రీస్తు తన త్యాగ పూర్వక సిలువ మరణం మూలంగా దేవునికి, తమకు మధ్య అంతరం తొలగించినందువల్ల వారి విశ్వాసం మూలంగా దేవునితో సహవాసం ఏర్పరచుకుంటారు.

అనువాదం సలహాలు:

  • అనువదించే పద్ధతులు. "సహవాసం" అంటే "కలిసి పంచుకోవడం” లేక “సంబంధం కలిగి ఉండడం” లేక “స్నేహ సంబంధాలు” లేక “క్రైస్తవ సమాజం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2266, H8667, G2842, G2844, G3352, G4790

సాక్షం, సాక్షమివ్వడం, సాక్షి, ప్రత్యక్ష సాక్షి

నిర్వచనం:

ఒక వ్యక్తి "సాక్షం" ఇచ్చినప్పుడు తనకు తెలిసిన దానిని గురించి ఒక ప్రకటన చేస్తున్నాడు, తన ప్రకటన వాస్తవం అని తెలియచేస్తున్నాడు. "సాక్ష్యం ఇవ్వడం" అంటే సాక్ష్యం చెప్పడమే.

  • తరచుగా ఒక వ్యక్తి తాను నేరుగా అనుభవించిన దాని గురించి "సాక్ష్యం ఇస్తాడు."
  • "అబద్ధసాక్షం" ఇచ్చే వాడు జరిగిన దానిని గురించి సత్యం చెప్పడం లేదు.
  • కొన్నిసార్లు "సాక్ష్యం" పదం ఒక ప్రవక్త ప్రవచించే దానిని సూచిస్తుంది.
  • కొత్త నిబంధనలో, ఈ పదం తరచుగా యేసు అనుచరులు యేసు జీవితం, మరణం, పునరుత్థానం గురించిన సంఘటనలను గురించి సాక్ష్యం ఇవ్వడానిని సూచిస్తుంది.

"సాక్షి" పదం జరిగిన దానిని వ్యక్తిగతంగా అనుభవించిన వ్యక్తిని సూచిస్తుంది. సాధారణంగా సాక్షి అంటే తమకు తెలిసినది వాస్తవం అని సాక్ష్యం ఇచ్చేవాడని అర్థం. "ప్రత్యక్ష సాక్షి" పదం వాస్తవానికి అక్కడ ఉన్నాడని, జరిగినదానిని చూచాడని నొక్కి చెపుతుంది.

  • ఒక దానిని గురించి "సాక్ష్యం ఇవ్వడం" అంటే అది జరగడానిని చూడడం అని అర్థం.
  • న్యాయ విచారణలో సాక్షి "సాక్ష్యాన్ని ఇస్తాడు" లేదా "సాక్షాన్ని కలిగియుంటాడు."
  • సాక్షులు తాము చూసిన దానినీ, వినిన దానిని గురించిన సత్యాన్ని గురించి చెప్పవలసి ఉన్నారు.
  • జరిగిన దాని గురించి సత్యం చెప్పని సాక్షి "అబద్ధసాక్షి" అని పిలువబడతాడు. అతడు "అబద్ధసాక్షం ఇచ్చాడు” లేదా “అబద్ధ సాక్షం కలిగియున్నాడు" అని అతని గురించి చెప్పవచ్చు.
  • "ఇద్దరి మధ్య సాక్షిగా ఉండు" అంటే ఒక ఒప్పందం చెయ్యబడినదానికి రుజువుగా ఉండే వస్తువు లేదా వ్యక్తి అని అర్థం. ప్రతి ఒక్కరూ చెయ్యడానికి వాగ్దానం చేసినదానిని వారు చేసేలా సాక్షి చూస్తాడు.

అనువాదం సూచనలు:

  • "సాక్షమివ్వడం” లేదా “సాక్షం చెప్పడం" పదం “వాస్తవాలు చెప్పడం" లేదా "చూచినదానిని, వినిన దానిని చెప్పడం" లేదా "వ్యక్తిగత అనుభవం నుండి చెప్పడం” లేదా "రుజువు ఇవ్వడం" లేదా "జరిగిన దానిని చెప్పడం" అని అనువదించబడవచ్చు.

  • "సాక్షం" పదం "జరిగిన దానిని నివేదించడం" లేదా "వాస్తవాన్ని గురించిన ప్రకటన" లేదా "రుజువు" లేదా "చెప్పబడిన దానిని" లేదా "ప్రవచనం" అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు.

  • "వారికి సాక్ష్యం వలే" పదబంధం "సత్యం అయిన దానిని చూపించడం" లేదా "సత్యమైన దానిని వారికి రుజువు పరచడం" అని అనువదించబడవచ్చు.

  • "వారికి వ్యతిరేకంగా సాక్షం ఇవ్వడంవలే" పదబంధం "వారి పాపాన్ని వారికి చూపించేది" లేదా "వారి వేషధారణను బయలు పెట్టడం" లేదా "వారు తప్పు అని రుజువు చేసేది" అని అనువదించబడవచ్చు. * "అబద్ధసాక్షం ఇవ్వడం" అనే వాక్యం "ఒక విషయం గురించి చెడు సంగతులు చెప్పడం" లేదా సత్యం కాని సంగతులను ప్రకటించడం" అని అనువదించబడవచ్చు.

  • "సాక్షి" లేదా “ప్రత్యక్ష సాక్షి" పదం "ఒక వ్యక్తి చూడడం" లేయా "అది జరగడం చూచిన వ్యక్తి" లేదా "(ఆ సంగతులను) చూచిన వారు, వినిన వారు" అని అర్థం ఇచ్చే పదం లేదా పదబంధంతో అనువదించబడవచ్చు.

  • "ఒక సాక్షి" పదం "నిశ్చితం" లేదా "మన వాగ్దానానికి గురుతు" లేదా "అది సత్యం అని సాక్ష్యం ఇచ్చేది" అని అనువదించబడవచ్చు.

  • "మీరు నాకు సాక్షులు" వాక్యం "మీరు ఇతరులకు నాగురించి చెపుతారు” లేదా "నేను మీకు బోధించిన సత్యాలను మీరు ఇతరులకు బోధిస్తారు" లేదా "మీరు చూసిన నా క్రియలు, నేను బోధించగా వినిన సంగతులు ప్రజలకు మీరు చెపుతారు" అని అనువదించబడవచ్చు.

  • "సాక్షం ఇవ్వడం" పదం "చూసిన దానిని చెప్పడం" లేదా “సాక్షమివ్వడం” లేదా "జరిగిన దానిని చెప్పడం" అని అనువదించబడవచ్చు.

  • ఒక దానికోసం "సాక్షిగా ఉండడం" పదబంధం "ఒక దానిని చూడడం" లేదా "జరిగిన దానిని అనుభవించడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: నిబంధన మందసం, అపరాధ భావం, న్యాయాధిపతి, ప్రవక్త, సాక్షం, సత్యం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 39:02 ఇంటిలోపల యూదునాయకులు యేసును న్యాయ విచారణకు నిలబెట్టారు. వారు అనేక మంది అబద్ధసాక్షులను తీసుకొనివచ్చారు. వారాయనను గురించి అబద్ధాలు చెప్పారు.
  • 39:04 ప్రధాన యాజకుడు తన వస్త్రాలను కోపంగా చింపుకుని గట్టిగా అరిచాడు. "మనకు ఇక వేరే సాక్షులతో పనేముంది? తాను దేవుని కుమారుడు అని అతడు చెప్పడం మీరు విన్నారు గదా. మీ తీర్పు ఏమిటి ?"
  • 42:08 "లేఖనాల్లో కూడా రాసి ఉంది, ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడి వారి పాపాలకు క్షమాపణ పొందాలని నా శిష్యులు ప్రకటిస్తారు. వారు యెరూషలేములో మొదలు పెట్టి, తరువాత అన్ని ప్రజలు సమూహాలకూ ప్రకటిస్తారు. మీరు వీటికి సాక్షులు."
  • 43:07 " దేవుడు యేసును మరలా సజీవుడుగా లేపాడు జీవం అనే సత్యానికి మేము సాక్షులం."

పదం సమాచారం:

  • Strong's: H5707, H5713, H5715, H5749, H6030, H8584, G267, G1263, G1957, G2649, G3140, G3141, G3142, G3143, G3144, G4303, G4828, G4901, G5575, G5576, G5577, G6020

సాతాను, దెయ్యం, దుష్టుడు

వాస్తవాలు:

దెయ్యం దేవుడు సృష్టించిన ఆత్మ అయినప్పటికీ, అది దేవునికి విరుద్ధముగా తిరస్కారము చేశాడు మరియు దేవునికి శత్రువుగా మారాడు. దెయ్యమును “సాతాను” మరియు “దుష్టుడు” అని కూడా పిలుస్తారు.

  • దెయ్యం దేవుణ్ణి మరియు దేవుడు సృష్టించిన ప్రతిదానిని సహ్యించుకుంటుంది ఎందుకంటే వాడు దేవుని స్థానమును పొందుకోవాలని మరియు దేవునిలా ఆరాధించబడాలని కోరుకుంటాడు.
  • దేవునికి విరుద్ధముగా తిరస్కారము చేయునట్లు సాతాను ప్రజలను ప్రేరేపిస్తాడు.
  • దేవుడు ప్రజలను సాతాను నియంత్రణనుండి రక్షించుటకు తన కుమారుడైన యేసును పంపించాడు.
  • “సాతాను” అను పేరుకు “అపవాధి” లేక “శత్రువు” అని అర్థము.
  • “దెయ్యము” అను పదమునకు “ఆరోపి” అని అర్థము.

తర్జుమా సలహాలు:

  • “దెయ్యం” అనే పదమును “ఆరోపి” లేక “దుష్టుడు” లేక “దుష్టాత్మలకు రాజు” లేక “ప్రధాన దుష్టాత్మ” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “సాతాను” అనే పదమును “విరోధి” లేక “అపవాది” లేక వాడు దెయ్యము అని చూపించే ఇతర పేర్లతో తర్జుమా చేయుదురు.
  • ఈ పదాలన్ని దెయ్యము మరియు దుష్టాత్మ అనే పదాలకు విభిన్నముగా తర్జుమా చేయుదురు.
  • ఈ పదాలన్నిటిని స్థానిక లేక జాతీయ భాషలో ఎలా తర్జుమా చేశారో గమనించండి.

(చూడండి: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: దెయ్యము, దుష్టాత్మ, దేవుని రాజ్యము, శోధించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణములు:

  • 21:01 హవ్వను మోసగించిన పామే సాతాను. మెస్సయ్యా వచ్చి సాతానును సంపూర్ణముగా ఓడించునని వాగ్ధానము చేయబడియుండెను.
  • 25:06 ఆ తరువాత సాతాను యేసుకు ఈ లోక రాజ్యములన్నిటిని మరియు వాటి వైభవమును చూపించెను. అంతేగాకుండా, “నీవు నాకు నమస్కరించి, నన్ను ఆరాధించినయెడల నేను వీటన్నిటిని ఇచ్చెదను” అని చెప్పెను.
  • 25:08 యేసు సాతాను శోధనలకు లోబడలేదు గనుక సాతాను ఆయనను వదిలిపెట్టి వెళ్ళెను.
  • 33:06 అందుచేత యేసు “విత్తనము దేవుని వాక్యము” అని వివరించెను. మార్గము అనేది దేవుని వాక్యము వినే వ్యక్తి అని అర్థము, అయితే ఆ వ్యక్తి దేవుని వాక్యమును అర్థము చేసుకోడు, మరియు దెయ్యము వానినుండి దేవుని వాక్యమును తీసివేయును.
  • 38:07 యూదా రొట్టెను తీసుకొనిన తరువాత, సాతానుడు వానిలోనికి ప్రవేశించెను.
  • 48:04 హవ్వ సంతానములో ఒకరు సాతానుని తలను నలగగొట్టుదురు, మరియు సాతాను తన మడిమకు గాయము చేయును అని దేవుడు వాగ్ధానము చేసియుండెను. సాతాను మెస్సయ్యాను చంపును అని దీని అర్థము, కాని దేవుడు మరల ఆయనను తిరిగి సజీవునిగా చేయును, మరియు మెస్సయ్యా సాతాను శక్తిని నలగగొట్టును.
  • 49:15 దేవుడు నిన్ను సాతాను యొక్క చీకటి రాజ్యములోనుండి బయటికి తీసుకొని వచ్చి, దేవుని వెలుగు రాజ్యములోనికి ప్రవేశపెట్టును.
  • 50:09 “గురుగులు దుష్టునికి సంబంధించిన ప్రజలను సూచిస్తుంది. గురుగులను విత్తిన శత్రువు దెయ్యమును సూచిస్తుంది.”
  • 50:10 “లోకాంతము సంభవించినప్పుడు దూతలన్నియు దుష్టునికి సంబంధించిన ప్రతియోక్కరిని ఒక్క దగ్గరికి పోగు చేస్తారు మరియు వారిని అగ్నిలోనికి పారవేస్తారు, అక్కడ పండ్లు కొరుకుటయు మరియు ఏడ్పును ఉండును.”
  • 50:15 యేసు తిరిగి వచ్చినప్పుడు, ఆయన సాతానును మరియు తన రాజ్యమును సంపూర్ణముగా నాశనము చేయును. ఆయన సాతానును మరియు దేవునికి లోబడక వానిని అనుసరించే ప్రతియొక్కరిని నరకములోనికి పడవేసి, శాశ్వతముగా కాల్చివేయును.

పదం సమాచారం:

  • Strong's: H7700, H7854, H8163, G1139, G1140, G1141, G1142, G1228, G4190, G4566, G4567

సియోను కుమార్తె

నిర్వచనం:

"సియోను కుమార్తె" అంటే అలంకారికంగా ఇశ్రాయేలు ప్రజలు అని అర్థం. దీన్ని సాధారణంగా ప్రవచనాలలో ఉపయోగిస్తారు.

  • పాత నిబంధనలో, "సియోను" అనే పేరును యెరూషలేము పట్టణాన్నినికి మరొక పేరుగా తరచుగా ఉపయోగిస్తారు.
  • ఇశ్రాయేలును సూచించడానికి "సియోను” “యెరూషలేము" రెంటిని ఉపయోగిస్తారు.
  • ఈ పదం "కుమార్తె" అనేది ఆప్యాయత సూచించే పదం. రూపకాలంకారంగా తన ప్రజల పట్ల దేవుని సహనం, శ్రద్ధలను సూచించడం కోసం దీన్ని వాడతారు.

అనువాదం సలహాలు:

  • అనువదించడంలోని పద్ధతులు "సీయోను నుండి నా కుమార్తె ఇశ్రాయేలు,” లేక “నా కుమార్తె వంటి సియోను ప్రజలు” లేక “సియోను, నా ప్రియ ఇశ్రాయేలు ప్రజ."
  • ఈ పదం "సియోను" అనే మాటను బైబిల్లో చాలా సార్లు ఉపయోగించారు గనక ఇలానే వాడడం మంచిది. అనువాదంలో దీని అలంకారిక, ప్రవచనాత్మక అర్థాల వివరణ ఇస్తే మంచిది.
  • ‘కుమార్తె" అనే పదాన్ని చదివే వారు సరిగా అర్థం చేసుకుంటారు అనుకుంటే అనువాదంలో అలానే ఉంచితే మంచిది.

(చూడండి: యెరూషలేము, ప్రవక్త, సియోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1323, H6726

సిలువ

నిర్వచనం:

బైబిల్ కాలాల్లో, సిలువ అంటే నిలువు కొయ్యతో చేసిన గుంజ నేలలో పాటి అడ్డం కొయ్యతో చేసిన దూలాన్ని దానిపై అమరుస్తారు.

  • కాలంలో రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం నేరస్థులను సిలువకు కట్టి వేయడం లేక మేకులతో కొట్టి చనిపోయే వరకు ఉంచడం అనే శిక్ష విధించే వారు.
  • యేసుపై అయన చెయ్యని తప్పు నేరాలు మోపి రోమాప్రభుత్వం ఆయనకు సిలువ మరణ శిక్ష విధించింది.
  • గమనించండి. క్రాస్ అనే క్రియా పదానికి నది లేక సరస్సు వంటి దేన్నైనా దాటి అవతలికి పోవడం.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని లక్ష్య భాషలో సిలువ ఆకారం అనే అర్థం ఇచ్చే ఏ పదాన్ని అయినా ఉపయోగించి అనువదించ వచ్చు.
  • సిలువ అనే పదాన్ని మరి ఏదైనా మరణ శిక్ష విధించే “కొరత వేయడం” వంటి పరికరం పేరును ఉపయోగించి తర్జుమా చేయ వచ్చేమో చూడండి.
  • ఈ పదం బైబిల్ అనువాదంలో స్థానిక లేక జాతీయ భాషలో ఎలా అనువదించ వచ్చో చూడండి.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: సిలువ వేయు, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 40:01 తరువాత సైనికులు యేసును హేళన చేసి ఆయనను సిలువ వేయడానికి తీసుకుపోయారు. వారు ఆయన చనిపోనున్న సిలువను ఆయనచే సిలువ మోయించారు.
  • 40:02 సైనికులు యేసును “కపాలం” అనే చోటికి తీసుకుపోయారు. అయన చేతులు కాళ్ళు సిలువకు కొట్టారు.
  • 40:05 యూదు నాయకులు, గుంపులో ఇతరులు యేసును దూషించారు. వారు ఆయనతో ఇలా చెప్పారు "నీవు దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగి వచ్చి నిన్ను నీవు రక్షించుకో. ఆ తరువాత మేము నిన్ను విశ్వసించుతాము."
  • 49:10 సిలువపై యేసు చనిపోవడంలో అయన నీ శిక్ష తనపై వేసుకున్నాడు.
  • 49:12 యేసు దేవుని కుమారుడు అని నివు నమ్మాలి. అయన నీకు బదులుగా సిలువపై చనిపోయిన తరువాత దేవుడు ఆయన్ను మరలా బ్రతికించాడు.

పదం సమాచారం:

  • Strong's: G4716

సిలువ వేయు, సిలువ వేయబడిన

నిర్వచనం:

ఈ పదం "సిలువ వేయు" అంటే ఎవరినైనా సిలువకు కొట్టి అతడు అక్కడ బాధలు పడి గొప్ప హింసాత్మక మరణం పొందేలా చేయడం.

  • మరణ శిక్ష పొందుతున్న వాణ్ణి సిలువ కు మేకులతో కొడతారు. సిలువ వేయబడిన మనిషి రక్తం పోవడం, లేక ఊపిరి అందక చనిపోతాడు.
  • ప్రాచీన రోమా సామ్రాజ్యం భయంకర నేరస్థులకోసం, లేక వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిని శిక్షించడానికి ఈ మరణ శిక్ష అమలు పధ్ధతి తరచుగా ఉపయోగిస్తారు.
  • యూదు మత నాయకులు రోమా గవర్నర్ ను యేసును సిలువ వేసేలా తన సైనికులకు అజ్ఞాపించమని అడిగారు. సైనికులు యేసును సిలువకు మేకులతో కొట్టారు. అయన ఆరు గంటలు బాధ అనుభవించి ఆపైన చనిపోయాడు.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "సిలువ వేయు" ఇలా అనువదించ వచ్చు, "సిలువపై వధించడం” లేక “సిలువకు మేకులతో కొట్టడం ద్వారా చంపడం."

(చూడండి: సిలువ, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 39:11 అయితే యూదు నాయకులు, జన సమూహం "అతన్ని (యేసు) సిలువ వేయండి! అని అరిచారు"
  • 39:12 తిరుగుబాటు చేస్తారేమో నని గుంపుకు భయపడి పిలాతు యేసును సిలువ వేయమని తన సైనికులను ఆదేశించాడు. అతడు యేసు క్రీస్తు సిలువ శిక్షలో ముఖ్య పాత్రధారి.
  • 40:01 తరువాత సైనికులు యేసును హేళన చేసి ఆయన్ను సిలువ వేయదానికి తీసుకుపోయారు. వారు అయన చనిపోనున్న మోయు సిలువ ను ఆయనచే మోయించారు.
  • 40:04 యేసును ఇద్దరు దోపిడీ దొంగల మధ్య సిలువ వేశారు.
  • 43:06 "ఇశ్రాయేలు మనుషులారా, యేసు దేవుని శక్తి మూలంగా అనేక మహా సూచనలు, అద్భుతాలు చేసిన వాడుగా మీరు చూశారు, గ్రహించారు. అయితే మీరు ఆయనను సిలువ వేసి చంపారు.!"
  • 43:09 "మీరు సిలువ వేసిన మనిషి యేసు."
  • 44:08 పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు. "మీ ఎదుట నిలుచున్న ఈ మనిషి యేసు మెస్సియా శక్తి చేత స్వస్థత పొందాడు. మీరు సిలువ వేసిన యేసును దేవుడు మరలా లేపాడు!"

పదం సమాచారం:

  • Strong's: G388, G4362, G4717, G4957

సీయోను, సీయోను పర్వతం

నిర్వచనము:

వాస్తవానికి, “సీయోను” లేదా “సీయోను పర్వతం” అనే పదం దావీదు రాజు యెబూసీయులనుండి వశము చేసికొనిన కోటను లేదా బలమైన దుర్గమును సూచిస్తున్నది. ఈ రెండు పదాలు యెరూషలేమును సూచించే పదాలుగా మారాయి.

  • యెరూషలేము మహానగరం సీయోను పర్వతం మరియు మోరియా పర్వతం అనే రెండు కొండల కొంత కాలమైన తరువాత, “సీయోను” మరియు “సీయోను పర్వతము” అనే ఈ రెండు పదములు యెరూషలేము పట్టణమును మరియు ఈ రెండు పర్వతములను సూచించుటకు సాధారణ పదాలుగా ఉపయోగించబడియున్నాయి. కొన్నిసార్లు అవి యెరూషలేములోనున్న మందిరాన్ని కూడా సూచించుచున్నాయి. (చూడండి: అన్యాపదేశంగా చెప్పు వాక్కులు)
  • దావీదు సీయోనుకు లేదా యెరూషలేముకు “దావీదు పట్టణం” అనే పేరు పెట్టాడు. ఇది దావీదు స్వంత స్థలమైన బెత్లెహేముకు వేరుగా ఉంటుంది. ఈ బెత్లెహేమును కూడా దావీదు పురముగా పిలువబడుతుంది.
  • “సీయోను” అనే పదము ఇశ్రాయేలును లేక దేవుని ఆత్మీయ రాజ్యమును లేక దేవుడు నూతనముగా నిర్మించబోవు క్రొత్త పరలోక యెరూషలేమును సూచించుటకు ఇతర అలంకారిక విధానములలో కూడా ఉపయోగించబడింది,

(దీనిని చూడండి: అబ్రాహాము, దావీదు, యెరూషలేము, బెత్లెహేము, యెబూసీయులు)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H6726

సున్నతి చేయడం, సున్నతి చేయబడిన, సున్నతి, సున్నతి పొందని, సున్నతి లేని

నిర్వచనం:

"సున్నతి చేయడం" అనే పదం అంటే ఒక పురుషుని లేదా ఒక మగబిడ్డ మర్మాంగం కొనను కోసి వేయడం. సున్నతి ఆచార కర్మను ఈ సందర్భంలో నిర్వహించవచ్చు.

  • అబ్రాహాముకు తన కుటుంబంలోనూ, సేవకులలోనూ ఉన్న ప్రతి మగవానికి వారితో దేవుని నిబంధనకు గుర్తుగా సున్నతి చేయాలని దేవుడు అజ్ఞాపించాడు.
  • అబ్రాహాము సంతానం వారి కుటుంబాలలో ప్రతి తరంలో పుట్టిన ప్రతి మగబిడ్డకు సున్నతి జరిగించడం కొనసాగించాలని దేవుడు అజ్ఞాపించాడు.
  • "హృదయ సున్నతి” అనే వాక్యం "కత్తిరించి వేయడం" లేక “ఒక వ్యక్తిలోనుండి పాపాన్ని తొలగించడం” అనే చిత్ర రూపక అర్థాన్ని సూచిస్తుంది.
  • ఆత్మ సంబంధమైన భావంలో, "సున్నతి చేయబడిన వారు" అంటే వారు దేవుని ప్రజలు అనీ, యేసు రక్తం ద్వారా దేవుడు వారి పాపం నుండి వారిని శుద్దులనుగా చేసాడనీ సూచిస్తుంది.
  • "సున్నతి లేనివారు" అంటే శారీరకంగా సున్నతి జరగని వారు అని సూచిస్తుంది. ఆత్మ సంబంధమైన సున్నతి లేని వారినీ, దేవునితో సంబంధం లేని వారినీ అలంకారికంగా సూచిస్తుంది.

"సున్నతి పొందనివారు" మరియు "సున్నతిలేకపోవడం" పదాలు శారీరకంగా సున్నతి పొందని పురుషులను సూచిస్తుంది. ఈ పదాలు అలంకారికంగా కూడా ఉపయోగించబడతాయి.

  • ఐగుప్తు దేశానికి కూడా సున్నతి అవసరం అయ్యింది. కాబట్టి సున్నతి లేని వారి చేతిలో ఐగుప్తు ఓడిపోయిన సంగతిని గురించి దేవుడు చెపుతున్నప్పుడు "సున్నతి లేనివారు" అని ఐగుప్తువారు తిరస్కరించిన ప్రజలను గురించి చెపుతున్నాడు.

  • "సున్నతి పొందని హృదయం" లేదా "హృదయంలో సున్నతి లేని వారి" గురించి బైబిలు సూచిస్తుంది. ఇది ఈ ప్రజలు దేవుని ప్రజలు కారనీ, వారు మూర్ఖముగా అవిదేయులై ఉన్నారని అలంకారికంగా చెపుతుంది.

  • భాషలో సున్నతి కోసం ఒక పదం ఉపయోగించబడినట్లయితే లేదా తెలిసినట్లయితే "సున్నతి లేని" పదాన్ని "సున్నతి పొందనివారు" అని అనువదించవచ్చు.

  • "సున్నతి లేని" అనే వ్యక్తీకరణ సందర్భాన్ని బట్టి "సున్నతి పొందని ప్రజలు" లేదా "దేవునికి చెందని ప్రజలు" అని అనువదించబడవచ్చు.

  • "దేవుని ప్రజలు కారు" లేదా “దేవునికి చెందని వారివలె తిరుగుబాటు చేసినవారు” లేదా "దేవునికి చెందిన వారు అని ఎటువంటి సూచనా లేనివారు" అని ఇతర భాషారూపాలలో దీనిని అనువదించవచ్చు.

  • "హృదయంలో సున్నతి లేని" అనే వ్యక్తీకరణ "మూర్ఖముగా తరుగుబాటు" లేదా "విశ్వసించడానికి నిరాకరించు" అని అనువదించబడవచ్చు. అయితే ఆత్మ సంబంధమైన సున్నతి భావన ప్రాముఖ్యం కనుక వీలునుబట్టి వ్యక్తీకరణను లేదా ఇలాంటి పదాన్నే ఉంచడం మంచిది.

అనువాదం సూచనలు:

  • లక్ష్య భాష సంస్కృతిలో మగవాళ్ళకు సున్నతి చెయ్యడం ఉన్నట్లయితే దీనిని సూచించడానికి ఉపయోగించే పదాన్ని ఈ పదం కోసం ఉపయోగించాలి.
  • "చుట్టూ కత్తిరించు” లేదా “వృత్తంలో కత్తిరించు” లేదా “మర్మాంగం కొనభాగాన్ని కత్తిరించు" అని ఇతర విధాలుగా అనువదించవచ్చు.
  • సున్నతి గురించి తెలియని సంస్కృతుల్లో దీన్ని ఫుట్ నోట్ లేదా పదకోశంలో వివరించడం అవసరం కావచ్చు.
  • ఈ పదం స్త్రీలను సూచించకుండా ఉండేలా చూడండి. మగ వారికే అని అర్థం ఇచ్చే పదం లేదా వాక్యంతో అనువదించడం అవసరం కావచ్చు.

(చూడండి: తెలియని వాటిని అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, నిబంధన)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 05:03 "నీవు నీ కుటుంబంలో ప్రతి మగవాడికి సున్నతి చేయాలి."
  • 05:05 ఆ రోజున అబ్రాహాము తన ఇంటిలో ప్రతి మగవాడికి సున్నతి చేయించాడు.

పదం సమాచారం:

  • Strong's: H4135, H4139, H5243, H6188, H6189, H6190, G203, G564, G1986, G4059, G4061

సువార్తికుడు, సువార్తికులు

నిర్వచనం:

"సువార్తికుడు" అంటే ఇతరులకు యేసు క్రీస్తును గురించిన సువార్త చెప్పేవాడు.

  • అక్షరార్థంగా "సువార్తికుడు" అంటే "శుభవార్త ప్రకటించే వాడు ఎవరైనా."
  • యేసు తన అపోస్తలులను యేసు పాపాలకోసం చేసిన బలి అర్పణ పై నమ్మకముంచడం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్న సువార్త ప్రకటించమని పంపించాడు.
  • క్రైస్తవులు అందరూ సువార్త ప్రకటించాలని హెచ్చరిక ఉంది.
  • కొందరు క్రైస్తవులకు ఇతరులకు సువార్త ప్రకటించే ప్రత్యేక ఆత్మ సంబంధమైన వరం ఉంటుంది. వీరికి సువార్త ప్రకటన అనే వరం ఉంది. వీరిని "సువార్తికులు" అన్నారు.

అనువాదం సలహాలు:

  • "సువార్తికుడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సువార్త ప్రకటించే వారు” లేక “సువార్త బోధకుడు” లేక “సువార్త (యేసును గురించి) ప్రకటించే వ్యక్తి” లేక “సువార్త ప్రకటించే వాడు."

(చూడండి: మంచి వార్త, ఆత్మ, వరం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2099

సూచక క్రియ, సూచక క్రియలు, నిరూపణ, జ్ఞప్తి చేయుట

నిర్వచనము:

సూచక క్రియ అనునది ఒక విశేషమైన అర్థమును తెలియజేసే ఒక సంఘటన, ఒక విషయము, లేక ఒక క్రియయైయున్నది

  • “జ్ఞాపకాలు” అనేవి ప్రజలు కొన్నిటిని జ్ఞాపకము చేసికొనుటకు విశేషముగా అనేకమార్లు వాగ్ధానము చేయబడిన వాటినిగూర్చి జ్ఞాపకము చేసికొనుటకు సహాయము చేయుట ద్వారా ప్రజలకు “జ్ఞాపకము” చేసే సూచక క్రియలుయైయున్నవి.
  • దేవుడు ఆకాశములో సృష్టించిన ఇంద్రధనస్సు అనేది ఒక సూచక క్రియయైయున్నది, ఇది దేవుడు ఇంకెప్పటికీ ప్రపంచమంతటిని ప్రళయము ద్వారా మనుష్యులను నాశనము చేయనని చెప్పిన వాగ్ధానమును ప్రజలకు జ్ఞాపకము చేయుచున్నది.
  • దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికకు సూచనగా వారి కుమారులందరు సున్నతి చేయించుకోవాలని ఆయన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను.
  • సూచక క్రియలు దేనిని గూర్చియైన విషయాన్ని తెలియజేస్తాయి లేక దేనినిగూర్చియైన ఎత్తి చూపుతాయి.
  • బెత్లెహేములో జన్మించిన శిశువును మెస్సయ్యాగా ఎలా గుర్తించాలనే ఆనవాళ్ళను దూత గొర్రెల కాపరులకు తెలియజేసెను.
  • మత నాయకులు బంధించాలనుకున్న యేసును బంధించుటకు యూదా ఒక సూచనగా యేసు నుదుటిపైన ముద్దు పెట్టెను.
  • సూచక క్రియలు ఏదైనా ఒక విషయము నిజమని నిరూపిస్తాయి.
  • ప్రవక్తల ద్వారా మరియు అపొస్తలుల ద్వారా జరిగిన మహత్కార్యములన్నియు వారు మాట్లాడుచున్నది దేవుని సందేశమని నిరూపించే సూచక క్రియలైయుండెను.
  • యేసు చేసిన మహత్కార్యములన్నియు ఆయన నిజముగా మెస్సయ్యేనని నిరూపించిన సూచకక్రియలైయున్నవి.

తర్జుమా సలహాలు:

  • సందర్భానుసారముగా ‘సూచక క్రియ” అనే పదమును “సైగ” లేక “గురుతు” లేక “మార్కు” లేక “ఆధారము” లేక “నిరూపణ” లేక “సంజ్ఞ” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “చేతులతో సూచక క్రియలు చేయుట’ అనే ఈ మాటను “చేతులతో చేసే చలనము” లేక “చేతులతో చేసే సంజ్ఞ” లేక “సంజ్ఞలు చేయుము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • కొన్ని భాషలలో దేనినైనా నిరూపించే “సూచక క్రియ” కొరకు బహుశ ఒకే పదము ఉండిఉండవచ్చు మరియు “సూచకక్రియ” కొరకు ఇంకొక పదము మహత్కార్యము అని చెప్పవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: మహత్కార్యము, అపొస్తలుడు, క్రీస్తు, ఒడంబడిక, సున్నతి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H6161, H6725, H6734, H7560, G364, G880, G1213, G1229, G1718, G1730, G1732, G1770, G3902, G4102, G4591, G4592, G4953, G4973, G5280

సైయములకధిపతియైన యెహోవా, సైయములకధిపతియగు దేవుడు, పరలోక సైన్య సమూహము, సైన్యములకు ప్రభువు

వాస్తవాలు:

దేవుని అధికారమునకు లోబడు వెలది దూతలపైన ఆయనకున్న అధికారమును సూచించు విధముగా “సైయములకధిపతియైన యెహోవా” లేక “సైయములకధిపతియగు దేవుడు” అనే నామములు ఆయనకు బిరుదులుగా ఉన్నాయి.

  • జన సమూహమును లేక లెక్కలేనన్ని నక్షత్రములు వంటి గొప్ప సంఖ్యలోవున్న అనేక వాటిని సూచించడానికి “సైన్యము” అనే పదము ఉపయోగించబడియున్నది. దురాత్మలతో సహా అనేక విధములైన ఆత్మలను సూచించడానికి ఈ పదమును ఉపయోగించవచ్చును. అది దేనిని సూచించుచున్నదో అని అక్కడి సందర్భము స్పష్టికరిస్తుంది.
  • “సైయములకధిపతియైన యెహోవా” అనే వాక్యము నక్షత్రములను, గ్రహములను మరియు ఆకాశ శక్తులను కూడా సూచిస్తుంది.
  • క్రొత్త నిబంధనలో, “సైయములకధిపతియైన ప్రభువు” అనే పదము “సైయములకధిపతియైన యెహోవా” అని అర్థమును స్పురింప చేయుచున్నది కానీ క్రొత్త నిబంధనలో “యహ్వే” అని అర్థమిచ్చు హెబ్రీ పదము ఉపయోగించబడలేదు గనుక దానిని ఆలాగు తర్జుమా చేయలేరు.

తర్జుమా సలహాలు

  • “సమస్త దూతలను ఏలువాడగు యెహోవా” లేక “దూతల సైన్యమును ఏలువాడగు యెహోవా” లేక “సమస్త సృష్టిని ఏలువాడగు యెహోవా” అని “సైయములకధిపతియైన యెహోవా” అనే వాక్యమును తర్జుమా చేయగలరు.
  • “సైయములకధిపతియైన దేవుడు” మరియు “సైయములకధిపతియైన ప్రభువు” అనే వాక్యములలో వాడబడిన “సైయములకధిపతియైన” అనే పదమును “సైయములకధిపతియైన యెహోవా” అనే పదమును తర్జుమా చేయుటకు పైన చెప్పబడిన విధముగానే చేయవలెను.
  • కొన్ని సంఘాలలో “యహ్వే” అనే పదమును ఉపయోగించడానికి ఇష్టపడరు అందువలన సాంప్రదాయకంగా వచ్చిన పద్ధతి ప్రకారముగా “ప్రభువు” అనే పదమును ఉపయోగిస్తారు. ఇటువంటి సంఘములకొరకు, “సైయములకధిపతియైన యెహోవా” అనే పదమునకు బదులుగా “సైయములకధిపతియైన ప్రభువు” అని తర్జుమా చేయగలరు.

(ఈ పదములను కూడా చూడండి: దూత, అధికారము, దేవుడు, ప్రభువు, ప్రభువు, యెహోవా ప్రభువు, యహ్వే)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H430, H3068, H6635

సోదరుడు

నిర్వచనం:

"సోదరుడు" అనే పదం కనీసం ఒక జీవసంబంధమైన తల్లినిగానీ లేదా తండ్రిని గానీ పంచుకొనే ఒక మగ తోబుట్టువును సూచిస్తుంది.

  • కొత్త నిబంధనలో "సోదరులు" అనే పదం ఒకే గోత్రంలో, కుటుంబంలో, వృత్తిలో లేదా ప్రజా గుంపులో సభ్యులుగా బంధువులకూ, లేదా సహచరులకూ సాధారణ సూచనగా కూడా ఉపయోగించబడింది.
  • కొత్తనిబంధనలో అపొస్తలులు తరచుగా తోటి క్రైస్తవులను, స్త్రీ పురుషులనూ సహితం సూచించడానికి "సోదరులు" పదం ఉపయోగించారు.
  • కొన్ని సార్లు కొత్త నిబంధనలో, ఈ పదం "సోదరి"ని స్పష్టంగా సాటి క్రైస్తవురాలు అయిన స్త్రీని సూచించడానికి అపోస్తలులు ఉపయోగించారు. లేదా పురుషులూ, స్త్రీలనూ కలిపి నొక్కి చెప్పడానికి ఉపయోగించారు. ఉదాహరణకు, యాకోబు తాను "ఒక సోదరుడు లేక సోదరి ఆహారం, వస్త్రాల అవసరతలో ఉన్నారు" అని సూచిస్తున్నప్పుడు విశ్వాసులందరి గురించి మాట్లాడుతున్నాడు.

అనువాదం సూచనలు:

  • సహజమైన లేదా జీవసంబంధమైన సోదరుని గురించి సూచించేటప్పుడు, అది తప్పు అర్థం ఇవ్వనట్లయితే, లక్ష్య భాషలో ఉపయోగించబడే అక్షరార్థమైన పదంతో అనువదించబడవచ్చు.
  • పాత నిబంధనలో ముఖ్యంగా, ఒకే కుటుంబం, తెగ, లేదా ప్రజా సమూహంలోని సభ్యులను సూచించడానికి సాధారణంగా "సోదరుల" పదం ఉపయోగించబడినప్పుడు "బంధువులు" లేదా కుటుంబ సభ్యులు" లేదా "తోటి ఇశ్రాయేలీయులు" అని ఉపయోగించవచ్చు.
  • క్రీస్తులో సాటి విశ్వాసిని గురించి చెప్పే సందర్భంలో ఈ పదం "క్రీస్తులో సోదరుడు” లేదా “ఆత్మ సంబంధమైన సోదరుడు" అని అనువదించబడవచ్చు.
  • మగవారినీ, స్త్రీలనూ సూచిస్తున్నప్పుడు "సోదరుడు"అనే పదం తప్పు అర్థం ఇస్తుంది. అప్పుడు మరింత సాధారణ సంబంధాన్ని సూచించే పదం ఉపయోగించ వచ్చు, ఈ పదంలో పురుషులూ, స్త్రీలూ కలిసి ప్రస్తావించబడతారు.
  • ఈ పదం పురుషులూ, స్త్రీలు అయిన విశ్వాసులను సూచించదానికి "తోటి విశ్వాసులు" లేదా "క్రైస్తవ సోదరులు, సోదరీలు" అని అనువదించబడవచ్చు.
  • పదంఉపయోగించబడిన సందర్భంలో అది మగవారిని మాత్రమే సూచిస్తుందా లేదా పురుషులూ స్త్రీలూ ఇద్దరూ ప్రస్తావించబడ్డారా అని పరిశీలించండి.

(చూడండి: అపోస్తలుడు, తండ్రియైన దేవుడు, సోదరి, ఆత్మ)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H251, H252, H264, H1730, H2992, H2993, H2994, H7453, G80, G81, G2385, G2455, G2500, G4613, G5360, G5569

హీబ్రూ, హెబ్రీ

వాస్తవాలు:

"హెబ్రీ" ప్రజలు అబ్రాహాము నుండి ఇస్సాకు, యాకోబు ద్వారా వచ్చిన వారు. హెబ్రీయుడు అని మొదటగా బైబిల్లో పిలిచిన వ్యక్తి అబ్రాహాము.

  • "హీబ్రూ" అంటే హెబ్రీయులు మాట్లాడిన భాష. ఎక్కువ భాగం పాత నిబంధన హీబ్రూ భాషలో రాశారు.
  • బైబిల్లో చాలా చోట్ల హెబ్రీవారిని "యూదు ప్రజలు” లేక “ఇశ్రాయేలీయులు" అని కూడా పిలిచారు. ఈ పదాలు మూడు ఒకే ప్రజా సమూహం అని మనసులో పెట్టుకుని ఈ మూడు పదాలను వేరువేరుగా ఉంచడం మంచిది..

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఇశ్రాయేలు, యూదుడు, యూదు నాయకులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5680, G1444, G1445, G1446, G1447

హృదయం, హృదయాలు

నిర్వచనం:

బైబిల్లో, "హృదయం" అనే పదాన్ని ఒక వ్యక్తి ఆలోచనలు, భావాలు, అభిలాషలు, లేక సంకల్పం మొదలైన వాటిని చెప్పడానికి తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు.

  • "కఠిన హృదయం" అనే మాటకు సాధారణంగా ఒక వ్యక్తి తలబిరుసుగా దేవునికి లోబడకుండా ఉండడం అని అర్థం.
  • "నా హృదయమంతటితో” లేక “హృదయపూర్వకంగా" అంటే ఏదైనా చెయ్యడంలో ఏదీ దాచుకోకుండా పూర్ణ అధికారిక ఒప్పందంతో, ఇష్టంతో పనిచెయ్యడం.
  • "హృదయానికి పట్టించుకోవడం" అంటే దేన్నైనా సీరియస్ గా తీసుకుని తన జీవితానికి అన్వయించుకోవడం.
  • "పగిలిన హృదయం" అనే మాట గొప్ప విచారంలో ఉన్న మనిషిని వర్ణించేది. అలాటి వ్యక్తి లోతైన గాయం తగిలి మానసికంగా కుంగిపోయిన వాడు.

అనువాదం సలహాలు

  • కొన్ని భాషల్లో కడుపు, కాలేయం వంటి వివిధ శరీరభాగాలు ఇందుకు వాడతారు.
  • కొన్ని భాషలు ఒక పదం, ఇతర భాషలు వేరొక పదం ఈ సంగతి చెప్పడానికి వాడవచ్చు.
  • కొన్ని భాషల్లో "హృదయం" లేక ఇతర శరీరభాగాలు ఈ అర్థం ఇవ్వకపోతే ఆ "ఆలోచనలు” లేక “భావాలు” లేక “అభిలాషలు” వెల్లడి పరచే అక్షరాలా అలాటి పదాలు ఉపయోగించాలి.
  • సందర్భాన్ని బట్టి, "నా హృదయమంతటితో” లేక “హృదయపూర్వకంగా" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నా శక్తి అంతా ఉపయోగించి” లేక “నా పూర్ణ శ్రద్ధతో” లేక “సంపూర్తిగా” లేక “పరిపూర్ణమైన అధికారిక ఒప్పందంతో."
  • "హృదయానికి పట్టించుకోవడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సీరియస్ గా తీసుకోవడం” లేక “సంపూర్ణంగా దానిపై దృష్టి పెట్టడం."
  • "కఠిన హృదయం " అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తలబిరుసుగా తిరుగుబాటు చేసిన” లేక “లోబడడానికి నిరాకరించు” లేక “ఎడతెగక దేవుణ్ణి ధిక్కరించడం."
  • "పగిలిన హృదయం" అనే దాన్ని "గొప్ప విచారం” లేక “లోతైన గాయం" అని తర్జుమా చెయ్యవచ్చు.

(చూడండి: కఠిన)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1079, H2436, H2504, H2910, H3519, H3629, H3820, H3821, H3823, H3824, H3825, H3826, H4578, H5315, H5640, H7130, H7307, H7356, H7907, G674, G1282, G1271, G2133, G2588, G2589, G4641, G4698, G5590

హెచ్చరించు, హెచ్చరిక

నిర్వచనం:

"హెచ్చరించు" పదం అంటే సరియైన దానిని చేయమని ఒకరిని బలంగా ప్రోత్సహించడం, పురిగొల్పడం అని అర్థం.

  • హెచ్చరిక ఉద్దేశం ఇతరులు పాపం చేయకుండా ప్రేరేపించడం, దేవుని చిత్తాన్ని అనుసరించేలా ప్రేరేపించడం.
  • క్రైస్తవులు ఒకరినొకరు కఠినంగానూ, అసంబంధంగానూ కాక ప్రేమలో హెచ్చరించుకోవాలని కొత్త నిబంధన బోధిస్తుంది.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "హెచ్చరించు" పదం "బలంగా పురికొల్పు" లేదా "ప్రేరేపించు" లేదా "సలహా ఇవ్వు" అని కూడా అనువదించబడవచ్చు.
  • ఈ పదం అనువాదం చెయ్యడంలో హెచ్చరించే వ్యక్తి కోపంగా ఉన్నట్టు సూచించకుండా చూడండి. ఈ పదం బలాన్నీ, గంభీరతనూ చూపించాలి, కోపంతో కూడిన ప్రసంగాన్ని కాదు.
  • ఎక్కువ సందర్భాల్లో "హెచ్చరించు" అనే పదాన్ని ఉత్తేజపరచడం, తిరిగి హామీ ఇవ్వడం, ఆదరించడం వంటి అర్థాన్ని ఇచ్చే "ప్రోత్సహించు" అనే పదానికి భిన్నంగా అనువదించాలి.
  • సాధారణంగా ఈ పదం ఎదుటి వాని చెడు ప్రవర్తన విషయంలో హెచ్చరించడం, సరిచెయ్యడం అనే అర్థాన్ని ఇచ్చే "మందలించు" అనే పదానికి భిన్నంగా అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G3867, G3870, G3874, G4389

హెచ్చించు, ఘనమైన, హెచ్చించిన, ఘనత

నిర్వచనం:

హెచ్చించు అంటే ఎవరినైనా ఉన్నతంగా స్తుతించడం ప్రతిష్ట కలిగించడం. దీనికి ఈ అర్థం కూడా ఉంది. ఎవరినైనా ఉన్నత స్థానంలో ఉంచడం.

  • బైబిల్లో, "హెచ్చించు" అనే మాటను తరచుగా దేవుణ్ణి ఘనపరచడంలో ఉపయోగిస్తారు.
  • ఒక వ్యక్తి తనను హెచ్చించుకోవడం అంటే అతడు తన గురించి గొప్పగా గర్వంగా అహంకారం గా అనుకుంటున్నాడు.

అనువాదం సలహాలు:

  • "హెచ్చించు" అనే దానిలో "ఉజ్వలంగా స్తుతి” లేక “గొప్ప ప్రతిష్ట కలిగించు” లేక “గొప్ప చేయడం” లేక “గొప్ప చేసి మాట్లాడడం."
  • కొన్ని సందర్భాల్లో దీన్ని ఒక పదంతో అనువదించ వచ్చు, లేక పదబంధంతో అంటే "ఉన్నత స్థానంలో ఉంచడం” లేక “ఎక్కువ ప్రతిష్ట కలిగించడం” లేక “గర్వంగా మాట్లాడడం."
  • "నిన్ను నీవు హెచ్చించుకో వద్దు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నీ గురించి నీవు గొప్పగా ఊహించుకోవద్దు ” లేక “నీ గురించి డంబాలు పలక వద్దు."
  • "తమను తాము హెచ్చించుకునే వారు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తమ గురించి గొప్పలు చెప్పుకునే వారు” లేక “తమ గురించి డంబాలు పలకడం."

(చూడండి: స్తుతి, ఆరాధన, మహిమ, డంబాలు, గర్వం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1361, H4984, H5375, H5549, H5927, H7311, H7426, H7682, G1869, G5229, G5251, G5311, G5312

హేయము, హేయ క్రియలు, హేయమైన

నిర్వచనం:

"హేయము"అనే పదాన్ని తీవ్రమైన అసహ్యం కలిగించే దాన్ని చెప్పడానికి వాడారు.

  • ఈజిప్టు వారు హెబ్రీయులను "హేయము"గా ఎంచారు. అంటే ఈజిప్టు వారు హెబ్రీయులను "హేయము"గా ఎంచి వారితో పొత్తు పెట్టుకునేందుకు, వారికి దగ్గరగా నివసించడానికి ఇష్టపడలేదు.
  • బైబిల్ "యెహోవాకు హేయము"అని చెప్పిన కొన్ని విషయాలు అబద్ధం, గర్వం, నర బలి, విగ్రహ పూజ, హత్య, వ్యభిచారం, స్వలింగ సంపర్కం వంటి లైంగిక క్రియలు.
  • యుగాంత కాలం గురించి యేసు తన శిష్యులకు బోధిస్తూ, దానియేలు ప్రవక్త చెప్పినట్టు "నాశనం కలిగించే హేయవస్తువు"ను దేవునిపై తిరుగుబాటుగా నిలుపుతారని, అయన ఆరాధన స్థలాన్ని మైల పరుస్తారని చెప్పాడు.

అనువాదం సలహాలు:

  • "హేయము"అనే పదాన్ని "దేవునికి అసహ్యం"లేక "నీచమైనది"లేక "హేయమైన కర్మ కాండ"లేక "చాలా చెడ్డ పని"అని తర్జుమా చెయ్యవచ్చు.
  • సందర్భాన్ని బట్టి "అలా చెయ్యడం హేయము"అనే దాన్ని "బహు అసహ్యకరం"లేక "చెప్పరానంత అసహ్యం"లేక "ఎంత మాత్రం ఆమోద యోగ్యం కానిది" లేక "పరమ అసహ్యం పుట్టించేది" అని తర్జుమా చెయ్య వచ్చు.
  • "హేయవస్తువు" అనే మాటను "ఒక దాన్ని అపవిత్ర పరచి మనుషులకు గొప్ప హాని కలిగించేది"లేక "గొప్ప విషాదం మిగిల్చే అసహ్యకరమైనది"అని తర్జుమా చెయ్య వచ్చు.

(చూడండి: వ్యభిచారము, మైల పరచు, నాశనకరమైన, అబద్ద దేవుడు, బలి అర్పణ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H887, H6292, H8251, H8262, H8263, H8441, G946