Matthew 1

మత్తయి 01 సామాన్య వ్యాఖ్య

నిర్మాణం, ఆకృతి

కొందరు కొన్ని అనువాదాలు పాతనిబంధనలోని కొన్ని వచనాలను ఎత్తి రాసేటప్పుడు పేజీలో కొద్దిగా కుడి వైపున వచ్చేలా రాస్తారు. ULT 1:23 దగ్గర ఇలా చేసింది.

ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు

వంశావళి

వంశావళి అంటే ఒక మనిషి పూర్వీకుల జాబితా. యూదులు ఈ వంశావళులను ఎవరు రాజు కావాలి అని నిర్ణయించడం కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే రాజు కొడుకే రాజు కావాలి. ముఖ్యమైన మనుషులు తమ వంశావళులను రాసి పెట్టుకుంటారు.

ఈ అధ్యాయంలో ముఖ్యమైన భాషాలంకారాలు

కర్మణి వాక్య ప్రయోగాలు

కర్మణి వాక్య ప్రయోగాలు ఈ అధ్యాయంలో మత్తయి ఉద్దేశ పూర్వకంగా చేశాడు. మరియకు ఎవరితోనూ లైంగిక సంబంధం లేదని చెప్పడం ఇందులో ఉద్దేశం. ఆమె పరిశుద్ధాత్మ మూలంగా యేసును గర్భంలో ధరించింది. ఇది అద్భుతం. అనేక భాషల్లో కర్మణి వాక్యాలు ఉండవు. కాబట్టి అనువాదకులు అలాటి భాషల్లో ఇదే సత్యాలను వెల్లడించడానికి మార్గాలు వెదకాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 1:1

General Information:

రచయిత యేసు వంశావళితో అరంభిస్తున్నాడు. అయన దావీదు రాజు, అబ్రాహాము సంతానం వాడు అని చూపించడానికి ఇలా చేశాడు. వంశావళి కొన్ని వచనాలు కొనసాగుతుందిమత్తయి 1:17.

The book of the genealogy of Jesus Christ

నీవు దీన్ని పూర్తి వాక్యంగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది యేసు క్రీస్తు పూర్వీకుల జాబితా.

Jesus Christ, son of David, son of Abraham

దావీదు రాజు, అబ్రాహాములకు, యేసుకు మధ్య చాలా తరాలు ఉన్నాయి. ఇక్కడ కుమారుడు అంటే ""వంశస్థుడు "" అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు క్రీస్తు, దావీదు వంశస్థుడు, అబ్రాహాము వంశస్థుడు.

son of David

కొన్ని సార్లు దావీదు కుమారుడు అనే దాన్ని ఒక బిరుదు నామంగా వాడారు. కానీ యేసు వచ్చిన వంశం చెప్పడానికి వాడినట్టు కనిపిస్తున్నది.

Matthew 1:2

Abraham was the father of Isaac

అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి, లేక అబ్రాహాముకు ఇస్సాకు కొడుకు లేక అబ్రాహాముకు ఇస్సాకుఅనే పేరున్న కొడుకు ఉన్నాడు. దీన్ని వివిధ రకాలుగా అనువదించ వచ్చు. ఎలా అనువదించినా యేసు పూర్వీకుల జాబితా అంతటిలోనూ ఒకే పధ్ధతి పాటిస్తే మంచిది.

Isaac the father ... Jacob the father

భూతకాల ప్రయోగాలను గమనించాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ఇస్సాకు ఫలానా అతనికి తండ్రి ..యాకోబు ఫలానా అతనికి తండ్రి (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 1:3

Perez ... Zerah ... Hezron ... Ram

ఇవి పురుషుల పేర్లు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-names)

Perez the father ... Hezron the father

ఇక్కడ భూతకాల ప్రయోగం అర్థం అయింది. ప్రత్యామ్నాయ అనువాదం: “పెరెసు ఫలానా అతనికి తండ్రి ..ఎస్రోము ఫలానా అతనికి తండ్రి "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 1:4

Amminadab the father ... Nahshon the father

ఇక్కడ భూతకాల ప్రయోగం అర్థం అయింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అమ్మీనాదాబు ఫలానా అతనికి తండ్రి .. నయస్సోను ఫలానా అతనికి తండ్రి "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 1:5

Salmon was the father of Boaz by Rahab

సల్మాను బోయజు తండ్రి, బోయజు తల్లి రాహాబు లేక "" సల్మాను రాహాబులు బోయజు తల్లిదండ్రులు

Boaz the father ... Obed the father

ఇక్కడ భూతకాల ప్రయోగం అర్థం అయింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""బోయజు ఫలానా అతనికి తండ్రి .. ఓబేదు ఫలానా అతనికి తండ్రి "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Boaz the father of Obed by Ruth

బోయజు ఓబేదు తండ్రి, రూతు ఓబేదు తల్లి. లేక ""బోయజు, రూతు ఓబేదు తల్లిదండ్రులు

Matthew 1:6

David the father of Solomon by the wife of Uriah

ఇక్కడ భూతకాల ప్రయోగం అర్థం అయింది. దావీదు సోలోమోను తండ్రి, సోలోమోనుతల్లి ఊరియా భార్య. లేక దావీదు ఊరియా భార్య సోలోమోను తల్లిదండ్రులు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

the wife of Uriah

విధవరాలైన ఊరియా భార్య. ఊరియా చనిపోయాక అతని భార్యకు సొలోమోను పుట్టాడు.

Matthew 1:7

Rehoboam the father of Abijah, Abijah the father of Asa

ఈ రెండు పదబంధాల్లోనూ భూతకాల ప్రయోగం అర్థం అయింది. ప్రత్యామ్నాయ అనువాదం: రెహబాము అబీయా తండ్రి. అబీయా ఆసా తండ్రి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 1:10

Amon

దీన్ని కొన్ని సార్లు “ఆమోసు” అని తర్జుమా చేస్తారు.

Matthew 1:11

Josiah was an ancestor of Jechoniah

పూర్వికుడు అనేదానికి మరింత స్పష్టమైన పదం వాడవచ్చు. పూర్వికుడు అనే పదం తాతల కంటే ఇంకా పూర్వం జీవించిన వాళ్ళకోసం మాత్రమే వాడాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెకొన్యా తాత యోషియా

at the time of the deportation to Babylon

వాళ్ళని బలవంతంగా బబులోనుకు తీసుకుపోయినప్పుడు లేక బబులోనీయులు వాళ్ళను ఓడించి బబులోనుకు తీసుకుపోయినప్పుడు. బబులోనుకు వెళ్ళినదెవరో మీ భాషలో స్పష్టంగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు లేక యూదయలో నివసించిన ఇశ్రాయేలీయులు అని రాయవచ్చు.

Babylon

ఇక్కడ బబులోను దేశం అని అర్థం, కేవలం బబులోను నగరం మాత్రమే కాదు.

Matthew 1:12

After the deportation to Babylon

అదే పదం వాడండి మత్తయి 1:11.

Shealtiel was an ancestor of Zerubbabel

షయల్తియేలు జెరుబ్బాబేలు తాత.

Matthew 1:15

Connecting Statement:

రచయిత యేసు వంశ వృక్షం పూర్తి చేశాడు. అది 1:1 దగ్గర మెదలైంది. మత్తయి 1:1.

Matthew 1:16

Mary, by whom Jesus was born

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యేసుకు జన్మనిచ్చిన మరియ (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

who is called Christ

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఎవరినైతే మనుషులు క్రీస్తు అని పిలిచారో (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 1:17

fourteen

14 (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-numbers)

deportation to Babylon

ఇక్కడ వాడిన పదాలే వాడండి మత్తయి 1:11.

Matthew 1:18

General Information:

ఇక్కడ కథనంలో కొత్త అంశం మొదలౌతున్నది. రచయిత యేసు పుట్టుక అంశాలను వర్ణిస్తున్నాడు.

His mother, Mary, was engaged to marry Joseph

అయన తల్లి మరియ, యోసేపును పెళ్లాడబోతున్నది. సాధారణంగా తల్లిదండ్రులే తమ పిల్లల పెళ్ళిళ్ళు కుదురుస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: మరియ తల్లిదండ్రులు, యేసు తల్లి మరియను యోసేపుకిచ్చి వివాహం చేయ సంకల్పించారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

His mother, Mary, was engaged

మరియకు యోసేపుతో నిశ్చితార్థం జరగక ముందే యేసు పుట్టలేదని స్పష్టంగా తెలిసేలా అనువాదం ఉండాలి. ప్రత్యామ్నాయ అనువాదం: యేసుకు తల్లి కాబోతున్న మరియకు నిశ్చితార్థం జరిగింది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

before they came together

వాళ్ళకి పెళ్లి కాకముందు. అంటే మరియ యోసేపులకు లైంగిక సంబంధం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: వారిద్దరూ ఏకం కాక మునుపు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-euphemism)

she was found to be pregnant

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఆమె గర్భవతి అని గ్రహించారు. లేక ఆమె గర్భవతి కావడం తటస్థించింది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

by the Holy Spirit

పరిశుద్ధాత్మ ప్రభావం మరియ ఎవరితోనూ లైంగిక సంబంధం లేకుండానే గర్భం దాల్చేలా చేసింది.

Matthew 1:19

Joseph, her husband

యోసేపు మరియను ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే నిశ్చితార్థం జరిగాక యూదులు ఆ ఇద్దరినీ భార్యాభర్తలు గానే ఎంచుతారు, వాళ్ళు కలిసి ఉండకపోయినా. ప్రత్యామ్నాయ అనువాదం: యోసేపు, మరియను వివాహం చేసుకోనున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

divorce her

పెళ్లి ప్రతిపాదన మానుకోవాలనుకున్నాడు.

Matthew 1:20

As he thought

ఎందుకంటే యోసేపు అనుకున్నాడు.

appeared to him in a dream

యోసేపుకు కలలో కనిపించాడు.

son of David

ఇక్కడ కుమారుడు అంటే ""సంతతి వాడు.

the one who is conceived in her is conceived by the Holy Spirit

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: పరిశుద్ధాత్మ మరియ గర్భవతి అయ్యేలా చేశాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 1:21

She will give birth to a son

ఎందుకంటే దేవుడు దేవదూతను పంపాడు. దేవదూత పుట్టబోయేది మగ పిల్లవాడు అని చెప్పాడు.

you will call his name

అతనికి పేరు పెట్టాలి. లేక అతనికి ఈ పేరు పెట్టాలి. ఇది ఆజ్ఞ.

for he will save

అనువాదకుడు ఫుట్ నోట్ పెట్టాలి. ""'యేసు’ అనే పేరుకు రక్షించే ప్రభువు” అని అర్థం.

his people

ఇది యూదులను సూచిస్తుంది.

Matthew 1:22

General Information:

రచయిత ప్రవక్త యెషయా వాక్కులు ప్రస్తావిస్తూ యేసు జననం లేఖనాల ప్రకారం జరిగిందని చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-background)

All this happened

ఇవి దేవదూత మాటలు కావు. మత్తయి ఇక్కడ దేవదూత చెప్పిన దాని ప్రాముఖ్యత వివరిస్తున్నాడు.

what was spoken by the Lord through the prophet

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ప్రభువు పూర్వకాలం ప్రవక్తకి రాయమని చెప్పిన విషయం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

the prophet

అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. మత్తయి ఇక్కడ యెషయా గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ప్రవక్త యెషయా. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 1:23

Behold ... Immanuel

ఇక్కడ మత్తయి ప్రవక్త యెషయా మాటలు రాస్తున్నాడు.

Behold, the virgin

గమనించండి. ఎందుకంటే నేను చెప్పేది సత్యం, ప్రాముఖ్యం కూడా: కన్య

Immanuel

ఇది పురుషుని పేరు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-names)

which means, ""God with us.

ఇది యెషయా గ్రంథం కాదు. మత్తయి ఇక్కడ ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం చెబుతున్నాడు. దీన్ని వేరే వాక్యంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ పేరుకు అర్థం 'మనతో ఉన్న దేవుడు.'

Matthew 1:24

Connecting Statement:

రచయిత యేసు పుట్టుక సంభవాల వర్ణన కొనసాగిస్తున్నాడు.

as the angel of the Lord commanded

దేవదూత యోసేపుకు మరియను తన భార్యగా చేసి కొమ్మని, బాలునికి యేసు అని పేరు పెట్టమని చెప్పాడు.

he took her as his wife

అతడు మరియను వివాహమాడాడు.

Matthew 1:25

he did not know her

ఇది సభ్యోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: అతడు ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకోలేదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-euphemism)

to a son

మగ శిశువుకు ""ఆమెకుకుమారుడు.""యోసేపు అసలు తండ్రిగా అర్థం రాకుండా చూసుకోండి.

Then he called his name Jesus

యోసేపు ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాడు.