Introduction to translationAcademy

అనువాదం అకాడెమీ పరిచయం

This section answers the following question: అనువాదం అకాడెమీ అంటే ఏమిటి?

అనువాదం అకాడెమీకి స్వాగతం

ఈ "అనువాదం అకాడెమీ" ప్రతివారూ ఎక్కడైనా బైబిల్ విషయాన్నీ తమ స్వభాషలోకి ఉన్నత నాణ్యత గల అనువాదాలు చేసేటందుకు. తమను సమర్థులుగా చేసుకొనేందుకు ఉద్దేశించబడింది అనువాదం అకాడెమీ ప్రతి అవసరానికీ తగినట్టు మలుచుకోగాలిగిన రీతిలో తయారైంది. దీన్ని ప్రణాళికాబద్ధమైన విధంగా ముందడుగు విధానంలో ఉపయోగించుకునే వీలుంది. లేదా దీన్ని అప్పటికప్పుడు నేర్చుకొనేందుకు (లేక అవసరమైతే రెండు విధాలుగానూ) ఉపయోగించుకోవచ్చు. దీని నిర్మాణం క్రమసోపానాల రీతిలో ఉంటుంది.

అనువాదం అకాడెమీలో ఈ క్రింది విభాగాలున్నాయి:

  • పరిచయం - అనువాదం అకాడెమీనీ అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టుని పరిచయం చేస్తుంది.
  • ప్రక్రియ కరదీపిక - "తరువాత ఏమిటి?" అనే ప్రశ్నకు జవాబు.
  • అనువాదం కరదీపిక – అనువాదం సిద్ధాంతం అనువాద ఆచరణ నియమాలకు తోడ్పడుతుంది.
  • తనిఖీ కరదీపిక – తనిఖీ సిద్ధాంతం, ఆచరణాత్మక అంశాలు, శ్రేష్ట పద్ధతులను వివరిస్తుంది.

బైబిల్ ని తర్జుమా ఎందుకు చేస్తాము?

This section answers the following question: బైబిల్ ని తర్జుమా చెయ్యడం ఎందుకు?

నీకు బైబిల్ అనువాదకునిగా శిక్షణనివ్వడమే ఈ అనువాదం అకాడెమీ ఉద్దేశం. నీ స్వభాషలోకి బైబిల్ తర్జుమా చేసి నీ స్వజాతి ప్రజలను యేసు శిష్యులుగా ఎదిగేలా చెయ్యడం చాలా ప్రాముఖ్యమైన పని. నీవు ఈ పని పట్ల నిబద్ధత కలిగి ఉండాలి, నీపై ఉన్న బాధ్యతను సీరియస్ గా తీసుకోవాలి. ప్రభువు నీకు సహాయం చెయ్యాలని ప్రార్థించాలి.

దేవుడు బైబిల్లో మనతో మాట్లాడాతాడు. తన వాక్కును హిబ్రూ, అరమేయిక్, గ్రీకు భాషల్లో రాయడానికి బైబిల్ రచయితలను ఆయన ప్రేరేపించాడు. దాదాపు 40మంది వేరువేరు రచయితలు క్రీ. పూ. 1400 నుం డి క్రీ. శ. 100 వరకూ బైబిల్ రాశారు. మధ్య ప్రాచ్యంలో, ఉత్తర ఆఫ్రికాలో ఐరోపాలో రాసిన వివిధ వ్రాత ప్రతులున్నాయి. ఈ భాషల్లో తన వాక్కును గ్రంథస్తం చెయ్యడం ద్వారా ఆ కాలంలో ఆనాటి ప్రజలు తన వాక్కును అర్థం చేసుకొనేలా దేవుడు చూశాడు

ఈనాడు నీ దేశంలో ప్రజలకు హిబ్రూ, అరమేయిక్, గ్రీకు భాషలు అర్థం కావు. కానీ దేవుని వాక్కును వారి భాషలోకి తర్జుమా చేస్తే వారు అర్థం చేసుకోగలుగుతారు!

"మాతృభాష" లేదా "హృదయ భాష" అంటే ఒక మనిషి బాల్యంలో మొట్టమొదటగా తన ఇంట్లో మాట్లాడిన భాష. ఈ భాష వారికి ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. వారు తమ లోతైన భావాలను వ్యక్తం చేయడానికి ఈ భాషనే వాడతారు. ప్రతి ఒక్కరూ తమ హృదయ భాషలో దేవుని వాక్కును చదవాలని మా ఆశయం..

అన్నిభాషలు ప్రముఖ్యమే, ప్రశస్తమైనవే. మీ దేశంలో మాట్లాడే జాతీయ భాష ఎంత ముఖ్యమో తక్కువ మంది మాట్లాడే భాష కూడా అంటే ముఖ్యం. అవి కూడా అంటే బాగా అర్థాన్ని వ్యక్తపరచగలవు. ఎవరూ కూడా తన భాషలో మాట్లాడడానికి సిగ్గు పడనక్కర లేదు. కొన్ని సార్లు ఈ అల్పసంఖ్యాక వర్గాలు తమ భాష విషయంలో బిడియపడి ఆ దేశంలో అధిక సంఖ్యలో ఉన్న వారి సమక్షంలో దాన్ని మాట్లాడడానికి జంకుతారు. అయితే జాతీయ భాష విషయంలో స్వతహాగా స్థానిక భాష కన్నా మరింత ప్రాముఖ్యం, మరింత ప్రతిష్టాత్మకం, మరింత విద్యా సంబంధం, ఏమీ లేదు. ప్రతి భాషలోనూ దానికదే విలక్షణమైన నాజూకు అర్థ భేదాలు, అర్థ అంతరాలు ఉంటాయి. మనకు ఏది అన్నిటికన్నా సౌకర్యమో దాన్ని ఉపయోగించాలి. దేని సహాయంతో సర్వ శ్రేష్టంగా ఇతరులతో మాటలాడగలుగుతామో దాన్ని ఎంచుకోవాలి.

మూలం. టాడ్ ప్రైస్ Ph.D. CC BY-SA 4.0"బైబిల్ అనువాదం,సిద్ధాంతం, ఆచరణ" నుండి తీసుకోన్నారు.


అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టు

This section answers the following question: అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టు అంటే ఏమిటి?

అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టు ఉనికిలో ఉన్న కారణం మేము ప్రతి భాషలోనూ ప్రతిబంధకాలు లేని బైబిల్ విషయం అందుబాటులో ఉండాలని కోరుకోవడమే.

యేసు తన శిష్యులకు ప్రతి ప్రజా జాతివారినీ తనకు శిష్యులనుగా చెయ్యమని చెప్పాడు:

"అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.'" (మత్తయి 28:18-20 ULT)

అన్ని భాషల వారూ పరలోకంలో ఉంటారని వాగ్దానం ఉంది:

"ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు." (ప్రకటన 7:9 ULT)

దేవుని వాక్కును ప్రతి ఒక్కడూ తన హృదయ భాషలో అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం.

”కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తును గురించిన మాట ద్వారా కలుగుతుంది. (రోమా 10:17 ULT)

దీన్ని చేయడమెలా?

ప్రతి భాషలోనూ ప్రతిబంధకాలు లేని బైబిల్ సమాచారం? అనే గమ్యాన్ని సాధించడం ఎలా?

మేము చేసేది ఏమిటి?

  • విషయం - మేము సృష్టించి ఉచితమైన, ప్రతిబంధకాలు లేని బైబిల్ విషయాన్నీ సృష్టించి అనువాదం కోసం దాన్ని అందుబాటులో ఉంచుతాము. వనరులు అనువాదాల పూర్తి జాబితా కోసం చూడండి http://ufw.io/content/ కొన్ని నమూనాలు:

    • ఓపెన్ బైబిల్ కథలు - కాలక్రమానుగత మినీ-బైబిల్. ఇందులో 50 ముఖ్య బైబిల్ కథలు సృష్టి మొదలుకుని ప్రకటన వరకూ, సువార్తీకరణ, శిష్యత్వమూ తదితర ప్రయోజనాల నిమిత్తం అచ్చులో, ధ్వనిరూపంలో వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. (చూడండి. http://ufw.io/stories/).
    • ** బైబిల్ ** - ఏకైక దైవ ప్రేరిత, లోప రహిత, అన్ని అవసరాలకు చాలిన, సాధికారికమైన దేవుని వాక్కును ఓపెన్ లైసెన్సు ప్రతిబంధకాలు లేని అనువాదాన్ని వాడకం కోసం, పంపిణికోసం అందుబాటులోకి తెచ్చాము (చూడండి http://ufw.io/bible/).
    • అనువాదం నోట్సు - భాషపరమైన, సాంస్కృతిక, వాక్య వివరణ సహాయకాలను అనువాదకులకు అందించాలి. ఇవి ఓపెన్ బైబిల్ కథలకు, బైబిల్ కు ఉన్నాయి. (చూడండి http://ufw.io/tn/).
    • అనువాదం ప్రశ్నలు - ప్రతి వాచక తునకకు అనువాదకులు, తనిఖీ చేసేవారు అడగదగిన ప్రశ్నలు ఉన్నాయి. తమ అనువాదం సరిగా అర్థం అవుతున్నదా లేదా అని సరి చూసుకోడానికి ఇవి పనికొస్తాయి. ఓపెన్ బైబిల్ కథలకు బైబిల్ కి అందుబాటులో ఉన్నాయి. (చూడండి http://ufw.io/tq/).
    • అనువాదం పదాలు - కొద్ది పాటి వివరణతో కూడిన ప్రాముఖ్య బైబిల్ పదాల జాబితా, క్రాస్ రిఫరెన్సులు, అనువాద సహాయకాలు. ఓపెన్ బైబిల్ కథలకు బైబిల్ కి ఉపకరిస్తాయి. (చూడండి http://ufw.io/tw/).
  • పరికరాలు - అనువాదం, తనిఖీ, పంపిణి పరికరాలు మేము తయారు చేస్తాం. ఇవి ఉచితం ఓపెన్ లైసెన్సు కింద ఉన్నాయి. ఈ పరికరాల పూర్తి జాబితా కోసం చూడండి http://ufw.io/tools/ for a complete list of tools. ఈ క్రింద కొన్ని నమూనాలు ఉన్నాయి.

    • Door43 - ఇది ఆన్ లైన్ అనువాద వేదిక. వ్యక్తులు అనువాదం, తనిఖీ, విషయ నిర్వహణ రంగాల్లో ఒకరికొకరు సహకరించుకోవచ్చు. ఇది అన్ ఫోల్దింగ్ వర్డ్ లో భాగం. (చూడండి https://door43.org/).
    • అనువాదం స్టూడియో - ఇది మొబైల్ ఆప్. డెస్క్ టాప్ ఆప్ కూడా. ఇక్కడ అనువాదకులు ఆఫ్ లైన్ అనువాదాలు చేయవచ్చు. (చూడండి http://ufw.io/ts/).
    • అనువాదం కీ బోర్డు - ఇది వెబ్, మొబైల్ ఆప్. ఏ భాషలకు దాని ప్రత్యేకమైన కీ బోర్డు లేదో వాటికి ప్రత్యేక కీ బోర్డును సృష్టించుకుని వాడడానికి వాడకందారులకు సహాయపడుతుంది. (చూడండి http://ufw.io/tk/).
    • అన్ ఫోల్దింగ్ వర్డ్ ఆప్ - అనువాదాలను పంచిపెట్టడానికి వాడే మొబైల్ ఆప్. (చూడండి. http://ufw.io/uw/).
    • అనువాదం కేంద్రకం - బైబిల్ అనువాదాన్ని సమగ్రంగా తనిఖీ చేయడానికి ఉపయోగపడే ప్రోగ్రాం. (చూడండి http://ufw.io/tc/).
  • శిక్షణ - మాతృ భాష అనువాదక బృందాలకు శిక్షణ ఇచ్చే వనరులు మేమూ సృష్టిస్తాం. అనువాదం అకాడెమీ (ఈ వనరు) మా ప్రాథమిక శిక్షణ పరికరం. మాదగ్గర ధ్వని రికార్డింగులు ఇతర శిక్షణ వనరులు ఉన్నాయి. శిక్షణ సరంజామా పూర్తి జాబితా కోసం చూడండి. http://ufw.io/శిక్షణ/


విశ్వాస ప్రమాణం

This section answers the following question: మేము నమ్మేదేమిటి?

ఈ పత్రం అధికారిక ప్రతి ఇక్కడ ఉంది. http://ufw.io/faith/.

ఈ పత్రాన్ని రచించడంలో పాల్గొన్న సంస్థలన్నీ ఈ విశ్వాస ప్రమాణానికి, ఈ క్రింద ఇచ్చిన ఇతర ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయి unfoldingWord, Nicene Creed, మరియు Athanasian Creed; ఇంకా Lausanne Covenant.

క్రైస్తవ విశ్వాసాన్ని రెండు భాగాలుగా విభజించ వచ్చని మేము నమ్ముతున్నాము అవసరమైన నమ్మకాలు మరియు అనుబంధ నమ్మకాలు (రోమా 14).

అవసరమైన నమ్మకాలు

అవసరమైన నమ్మకాలు అంటే యేసు క్రీస్తును అనుసరించే వారంతా ఎప్పటికీ రాజీ పడలేనివి, నిర్లక్ష్య పెట్టనివి.

  • కేవలం బైబిల్ మాత్రమే దైవ ప్రేరణ కలిగిన, లోపరహితమైన, అన్నిటికీ చాలిన, అధికారిక దైవ వాక్కు అని మేము నమ్ముతున్నాము (1 తెస్సలోనిక 2:13; 2 తిమోతి 3:16-17).

  • ఒకే దేవుడు, శాశ్వత ఉనికి కలిగినవాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని మేము నమ్ముతున్నాము: తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ (మత్తయి 28:19; యోహాను 10:30).

  • యేసు క్రీస్తు దైవత్వాన్ని మేము నమ్ముతున్నాము (యోహాను 1:1-4; ఫిలిప్పి 2:5-11; 2 పేతురు 1:1).

  • యేసు క్రీస్తు మానవత్వాన్ని, ఆయన కన్య జననాన్ని, పాపా రహిత జీవనాన్ని ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చిందించిన రక్తం ద్వారా ఆయన చేసిన ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తాన్ని ఆయన శారీరిక పునరుత్థానాన్ని తండ్రి కుడి వైపుకు ఆయన ఆరోహణాన్ని మేము నమ్ముతున్నాము (మత్తయి 1:18,25; 1 కొరింతి 15:1-8; హెబ్రీ 4:15; అపో.కా.1:9-11; అపో.కా. 2:22-24).

  • ప్రతి వ్యక్తీ స్వతహాగా పాపి అనీ శాశ్వత నరకానికి పాత్రుడనీ మేము నమ్ముతున్నాము (రోమా 3:23; యెషయా 64:6-7).

  • రక్షణ అనేది దేవుని ఉచిత వరం అనీ అది యేసు క్రీస్తు త్యాగపూర్వక మరణ పునరుత్థానాల మూలంగా సిద్ధించిందనీ, అది కేవలం విశ్వాస మూలంగా కృప ద్వారానే లభించిందని, నీతిక్రియల మూలంగా కాదని మేము నమ్ముతున్నాము (యోహాను 3:16; యోహాను 14:6; ఎఫెసి 2:8-9, తీతు 3:3-7).

  • నిజమైన విశ్వాసం తోబాటు పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ మూలంగా కలిగే పునర్జన్మ ద్వారా వస్తుందనీ మేము నమ్ముతున్నాము (యాకోబు 2:14-26; యోహాను 16:5-16; రోమా 8:9).

  • ప్రస్తుతం పరిశుద్ధాత్మ యేసు క్రీస్తును అనుసరించిన వారందరిలో నివసిస్తున్నాడని, భక్తిగల జీవితం గడపడానికి ఆయనే శక్తినిస్తాడని పరిశుద్ధాత్మ పరిచర్య ఇదేనని మేము నమ్ముతున్నాము (యోహాను 14:15-26; ఎఫెసి 2:10; గలతి 5:16-18).

  • యేసుక్రీస్తు లో విశ్వాసులందరికీ అంటే అన్ని భాషల, జాతుల, ప్రజా సమూహాల వారందరికీ ఆత్మ సంబంధమైన ఐక్యత ఉన్నదని మేము నమ్ముతున్నాము (ఫిలిప్పి 2:1-4; ఎఫెసి 1:22-23; 1 కొరింతి 12:12,27).

  • యేసు క్రీస్తు వ్యక్తిగత శారీరిక పునరాగమనాన్ని మేము నమ్ముతున్నాము (మత్తయి 24:30; అపో.కా. 1:10-11).

*రక్షణ పొందిన, నశించిన వారిద్దరూ తిరిగి లేస్తారని, రక్షణ లేని వారు నరకంలో శాశ్వత శిక్ష కోసమూ రక్షణ పొందిన వారు దేవునితో పరలోకంలో శాశ్వత ధన్యత కోసమూ తిరిగి లేస్తారని మేము నమ్ముతున్నాము (హెబ్రీ 9:27-28; మత్తయి 16:27; యోహాను 14:1-3; మత్తయి 25:31-46).

అనుబంధ నమ్మకాలు

అనుబంధ నమ్మకాలు అంటే లేఖనాల్లో తక్కినవి అన్నీ. అయితే యథార్థంగా క్రీస్తును అనుసరించేవారికి వీటి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. (ఉదా. బాప్తిసం, ప్రభువు బల్ల, సంఘారోహణం మొ..). మేము సౌజన్యంతో ఇలాటి వాటిలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడానికి సమ్మతించి ప్రతి ప్రజలోనూ మనుషులను శిష్యులుగా చేయాలన్న ఉమ్మడి లక్ష్యం వైపుకు కలిసి సాగుతాము. (మత్తయి 28:18-20).


అనువాద సూచనలు

This section answers the following question: ఏ సూత్రాల ఆధారంగా మనం తర్జుమా చేస్తాము?

ఈ పత్రం అధికారిక ప్రతి లభ్యమయ్యే చోటు http://ufw.io/సూచనలు/.

అనువాదంలో వాడే సూత్రాలనూ, ప్రక్రియలనూ సూచించే ఈ ప్రకటనను అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టులో భాగస్తులుగా ఉన్న అన్ని సంస్థలు, రచనలో పాల్గొన్న రచయితలు అందరూ ఆమోదించారు. ( https:// unfoldingword.bible చూడండి ). అనువాద కార్యకలాపాలన్నీ ఈ ఉమ్మడి సూచనల ఆధారంగానే జరుగుతాయి.

  1. శుద్ధమైన — శుద్ధమైన రీతిలో అనువాదం చెయ్యండి. మూల వాచకం శైలినుండి తొలగిపోకుండా మూలంలో ఉన్న అర్థాన్ని మార్చకుండా, దానికి ఏమీ కలపకుండా తర్జుమా చెయ్యండి. తర్జుమా చేసిన విషయం మూల వాచకంలో ఉన్న దానిని ఎంత నమ్మకంగా వీలైతే అంత నమ్మకంగా కచ్చితంగా వెల్లడి చెయ్యాలి. అంటే మూలం చదివిన వారికి ఎలా అర్థం అయిందో దానికి సాధ్యమైనంత దగ్గరగానన్న మాట. (చూడండిఅర్థవంతమైన అనువాద సృష్టి)
  2. స్పష్టమైన — సాధ్యమైనంత అవగాహన సృష్టించడం కోసం ఎలాంటి భాషా నిర్మాణం అవసరమో దాన్ని వాడండి. మూల వాచకంలోని భావాన్ని సాధ్యమైనంత స్పష్టంగా వెల్లడి చేసేందుకు అందులో కనిపించే ఆకృతిని కూర్పును మార్చడం గానీ అవసరమైన మేరకు ఎక్కువ, లేక తక్కువ పదాలు వాడడం గానీ చెయ్యండి. (చూడండిఅర్థవంతమైన అనువాద సృష్టి)
  3. సహజ — మీ భాష వాడకంలో ఆయా సందర్భాల్లో సహజ రీతిని ప్రతిబింబించే శక్తివంతమైన భాషా శైలులను ఉపయోగించండి. (చూడండిసహజ అనువాద సృష్టి)
  4. మూల విధేయ — మీ అనువాదంలో ఏ విధమైన రాజకీయ, వర్గ సంబంధమైన, భావజాలపరమైన పక్షపాతం లేకుండా చూసుకోండి. మూల బైబిల్ భాషల్లోని పదజాలానికి విధేయమైన కీలక పదాలనే వాడండి.. తండ్రియైన దేవునికీ కుమారుడైన దేవునికీ ఉన్న సంబంధాన్ని వర్ణించడానికి బైబిల్ పదాలకు సమానార్థకమైన సామాన్య పదాలనే వాడండి. అవసరమైన చోట ఫుట్ నోట్ ల సాయంతో ఇతర అనుబంధ వనరుల సాయంతో స్పష్టికరించ వచ్చు.(చూడండి మూల విధేయ అనువాద సృష్టి)
  5. *అధికారికమైన — మూల భాష బైబిల్ వాచకాలను అనువాదానికి అత్యున్నత అధికారంగా ఎంచి ఉపయోగించండి. ఇతర భాషల్లోని ఆధారపడదగిన బైబిల్ సమాచారాలను మధ్యంతర వాచకాలుగా స్పష్టికరణ కోసం వడ వచ్చు (చూడండిఅధికారిక అనువాద సృష్టి)
  6. చారిత్రాత్మకమైన — చారిత్రాత్మక సంఘటనలను వాస్తవాలను శుద్ధ రీతిలో తెలియజేయండి. మూల వాచకాలను అందుకున్న మొదటి చదువరులకు ఉద్దేశించిన సందేశాన్ని వారిని పోలిన స్థితిగతులు సందర్భాలు లేని నేటి చదువరులకు అర్థమయ్యేలా చెయ్యడానికి అవసరమైన అదనపు సమాచారం ఇవ్వాలి. (చూడండిచారిత్రాత్మక అనువాద సృష్టి
  7. సమానార్థక — మూల వాచకంలో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందులోని భావావేశాలు, ప్రవృత్తులు వ్యక్తమయ్యేలా తర్జుమా చెయ్యండి. సాధ్యమైనంతవరకు మూల వాచకంలోని వివిధ సాహిత్య రీతులను, అంటే కథనం, పద్యం, హెచ్చరిక వాక్కులు, ప్రవచనం మొదలైన వాటిని మీ భాషలో సమానార్థకమైన విధానంలో సరిపోయిన శైలిలో తర్జుమా చెయ్యండి. (చూడండిసమానార్థక అనువాద సృష్టి)

అనువాద నాణ్యతను గుర్తించడం, నిర్వహించడం

అనువాదం నాణ్యత సాధారణంగా అనువాదం మూల అర్థానికి ఎంత వరకు విధేయంగా ఉన్నదనే దాన్ని సూచించేది. అంతేగాక అనువాదం ఎంత సులభంగా అర్థం అవుతున్నది, లక్ష్య భాష మాట్లాడే వారికి ఏ మేరకు ఉపయోగపడుతున్నది అనే దాన్ని గురించినది. మేము సూచిస్తున్న వ్యూహం లక్ష్య భాష మాట్లాడే సమూహం యొక్క భాషాభాగాలను, భావప్రసరణ రీతులను సరి చూసుకుంటూ వెళ్ళడం, అదే సమయంలో అనువాదం ఆ ప్రజా సమూహంలోని సంఘానికి విధేయంగా ఉండాలి..

ఇలా చెయ్యడంలో ఇదమిద్ధమైన దశలు రకరకాలుగా ఉండవచ్చు. అవి అనువాద భాష పైనా అనువాద ప్రాజెక్టు సందర్భం పైనా ఆధారపడి ఉంటాయి. సాధారణంగా లక్ష్య భాష మాట్లాడే వారు, ఆ భాషాసమూహం లో ఉన్న సంఘ నాయకత్వం తనిఖీ చేసిన దాన్ని మంచి అనువాదం అనవచ్చు:

  1. శుద్ధం, స్పష్టం, సహజం, సమానార్ధకం — మూల భాషలో ఉద్దేశించిన భావానికి అనుగుణంగా ఉండి, ఆ ప్రజా సమూహంలోని సంఘం ఆమోదం కలిగి, భౌగోళిక, చారిత్రాత్మక సంఘంతో అనుగుణంగా ఉంది తద్వారా :
  2. సంఘ ఆమోద ముద్ర పొందిన - సంఘం ధృవీకరణ పొంది సంఘం వాడుకుంటున్న అనువాదం. (చూడండిసంఘ ఆమోదిత అనువాదసృష్టి)

అనువాదం పని ఈ క్రింది విధంగా కూడా ఉండాలని మేము సలహా ఇస్తున్నాము:

  1. సహకారిక — సాధ్యమైనంతవరకూ మీ భాష మాట్లాడే ఇతర విశ్వాసులతో కలిసి తర్జుమా, తనిఖీ, పంపిణి పని చేయండి. ఎంత మందికి వీలైతే అంతమందికి అందుబాటులో ఉండేలా ఎంత నాణ్యత వీలైతే అంత నాణ్యత ఉండేలా చూడండి. (చూడండి సహకారిక అనువాదసృష్టి)
  2. నిరంతరాయ — అనువాదం పని ఎన్నటికీ పూర్తి కాదు. భాషా ప్రవీణులను అనువాదంలో మరింత మెరుగైన రీతిలో సమాచారం చేరవేయడానికి, తర్జుమాకు మెరుగులు దిద్దడానికి సలహాలు ఇమ్మని చెప్పండి. అనువాదదోషాలను కనిపించినప్పుడల్లా సరిదిద్దాలి. అంతేకాక అప్పుడప్పుడూ అనువాదాన్ని సమీక్షించుకుంటూ ఒక వేల నూతన అనువాదం, లేదా అనువాదం పునర్విమర్శ అవసరమేమో చూసుకోవాలి. ప్రతి భాషా సమూహంలోను అనువాద కమిటీ ఒకటి ఉండి ఈ పనిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ ఉండాలని మా అభిప్రాయం. అన్ ఫోల్దింగ్ వర్డ్ ఆన్ లైన్ పరికరాలను ఉపయోగించుకుని అనువాదానికి మార్పులు, చేర్పులు త్వరగా సులభంగా చేస్తుండవచ్చు. (చూడండినిరంతరాయ అనువాదసృష్టి)

స్వేచ్చాయుత లైసెన్సు

This section answers the following question: అన్ ఫోల్దింగ్ వర్డ్ సమాచారాన్ని ఉపయోగించుకోవడంలో వినియోగదారులకు ఎలాటి స్వేచ్ఛ ఉంది?

స్వేచ్ఛకు లైసెన్సు

ప్రతి భాషలోనూ**ప్రతిబంధకాలు లేని బైబిల్ విషయాన్నీ **పొందగలిగే స్వేచ్ఛ. భౌగోళిక సంఘానికి ఇలాటి “ప్రతిబంధకాలు లేని” , స్వేచ్ఛతో కూడిన బైబిల్ విషయాల అందుబాటు అవసరం. సంఘానికి “ప్రతిబంధకాలు లేని” రీతిలో విషయం అందుబాటులోకి వస్తే ఈ ఉద్యమాన్ని ఇక ఎవరూ ఆపలేరని మాకు తెలుసు. ఈ [  4.0 అంతర్జాతీయ లైసెన్సు] (http://creativecommons.org/licenses/by-sa/4.0/) బైబిల్ విషయం అనువాదం కోసం, పంపిణి కోసం అవసరమైన మార్గాలన్నీ అందుబాటులోకి వస్తాయి. వేరే విధంగా చెప్పానంత వరకూ బైబిల్ విషయమంతా CC BY-SA లైసెన్సు కింద ఉంటుంది..

*Door43 కొరకైన అధికారిక లైసెన్సు దగ్గర లభ్యం అవుతున్నది.

4.0 అంతర్జాతీయ లైసెన్సు (CC BY-SA 4.0)

ఇది మనుషులు చదవగలిగిన సంక్షిప వివరణ మాత్రమే. (ఇది అసలు లైసెన్సుకు ప్రత్యామ్నాయం కాదు) license.

మీకు ఈ క్రింద చెప్పిన వాటికి స్వేచ్ఛ ఉంది:

  • పంచుకోవడం — ఏ మాధ్యమంలోనైనా కాపీలు తీసుకుని మరలా ఏ మాధ్యమంలోనైనా, స్వరూపంలోనైనా పంపిణి చేయడానికి.
  • మలుచుకోవడం — వేరుగా కలగలుపు చేసుకోవడం, ప్రసారం చేయడం, రూపాంతరం చెందించడం, ఉన్న విషయానికి మరింత చేర్చడం.

ఏ ఉద్దేశంతోనైనా, వ్యాపార ఉద్దేశంతో కూడా కావచ్చు.

లైసెన్సు లోని నిబంధనలను మిరి మీరనంత వరకూ లైసెన్సు ఇచ్చేవాడు ఈ స్వేచ్ఛను ఉపసంహరించుకోలేడు.

ఈ నిబంధనల కింద:

  • ఆపాదింపు — మీరు మొదట రాసిన వాడికి తగిన విధంగా గుర్తింపును ఆపాదించాలి. ఆ లైసెన్సు కు లింకు ను చెప్పాలి. మీరు ఏమైనా మార్పులు చేస్తే వాటిని పేర్కొనాలి. ఏదో ఒక సహేతుకమైన రీతిలో దీన్ని చెయ్యాలి. కానీ లైసెన్సు ఇచ్చిన వ్యక్తి నిన్ను గానీ ని వాడకాన్ని గానీ సమర్థించినట్టు ఉండకూడదు.
  • ** యథాతథ పంచుకోలు** —ఉన్న దాన్ని కలగలిపి మార్చినా రూపాంతరం చెందించినా దానికి అదనంగా కలిపినా నీవు చేసిన పని అంతటినీ మూలం ఏ లైసెన్సు కింద ఉన్నదో అదే లైసెన్సు లో పంపిణి చెయ్యాలి.

అదనంగా ఎలాంటి ప్రతిబంధకాలు ఉండకూడదు — ఈ లైసెన్సు వాడకందారులకు అనుమతి నిస్తున్న వాటిని పరిమితం చేసేటందుకు ఎలాంటి చట్టపరమైన, సాంకేతికమైన, అంశాలు విధించకూడదు..

సూచనలు:

పబ్లిక్ డొమెయిన్ లో ఉన్న ప్రచురణల విషయాల లో ఎలాంటి లైసెన్సు నిబంధనలు పాటించనక్కర లేదు. లేక నీవు దాన్ని వాడుకోవడం లో మినహాయింపులు, పరిమితులు ఉన్నప్పుడు కూడా.

ఎలాంటి వారెంటిలూ ఉండవు. నీవు కోరిన వాడకానికి అవసరమైన అన్ని అనుమతులూ ఈ లైసెన్సు ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకు పబ్లిసిటీ, ప్రైవసీ లేక నైతిక హక్కులూ మొదలైనవి నీవు ఈ మూలాన్ని వాడుతున్నావు అనే దానికి పరిమితి విధించా వచ్చు.

మూలంలో నుండి మలిచి తయారు చేసే వాటిని గురించి ఆపాదింపు ప్రకటన ఇలా ఉండవచ్చు: “Door43 వరల్డ్ మిషన్ కమ్యూనిటి సృష్టించిన ఈ అంశం http://door43.org/, లో అందుబాటులో ఉన్నది. దీన్ని   4.0 అంతర్జాతీయ లైసెన్సు కింద విడుదల చేస్తున్నాము. (http://creativecommons.org/licenses/by-sa/4.0/ ). ఈ అంశాన్ని మూలానికి భిన్నంగా కొన్ని మార్పులు చేసాం. ఈ మార్పులను మూలం రచయితలు సమర్థించలేదు.

Door43 రచయితల ఆపాదింపు

Door43 లోకి ఏదైనా సమాచారాన్ని తెచ్చుకునేటప్పుడు, మూలాన్ని అది ఎక్కడ అందుబాటులో ఉన్నదో ఆ స్వేచ్చాయుతమైన లైసెన్సులో నిర్దేశించిన రీతిగా ఆపాదించడం జరగాలి. ఉదాహరణకు, ఓపెన్ బైబిల్ కథల్లో ఉన్న బొమ్మలను స్పష్టంగా ఆ ప్రాజెక్టుకు ఆపాదించడం చూడవచ్చు. ముఖ్య పేజీ.

Door43 రచయితలు దీనిని ఒప్పుకుంటున్నారు ఇక్కడి ప్రతి పేజీలోనూ పునశ్చరణ చరిత్రలో దానికదే కనిపిస్తున్న ఆపాదింపు వారి పనికి సరిపోయిన ఆపాదింపు. అంటే Door43యొక్క ప్రతి రచయితనూ "Door43 వరల్డ్ మిషన్ సమాజంగ" గా, లేక ఆ అర్థం ఇచ్చేలా చూపించాలి. ప్రతి రచయిత రాసిన సమాచారం అంతా ఆ రచన పునశ్చరణ చరిత్రలో కనిపించాలి.

మూల గ్రంథాలు

మూల గ్రంథాలను ఈ క్రింది లైసెన్సుల్లో ఏదో ఒకటి ఉంటే వాడుకోవచ్చు:

మరింత సమాచారం కోసం Copyrights, Licensing, and Source Texts](../../translate/translate-source-licensing/01.md) చూడండి.


గేట్ వే భాషల వ్యూహం

This section answers the following question: ప్రతి భాషనూ చేరుకోవడం ఎలా?

*ఈ పత్రం తాలూకు అధికారిక ప్రతి దగ్గర లభిస్తుంది.

వివరణ

గేట్ వే భాషలు వ్యూహం యొక్క ఉద్దేశం భౌగోళిక సంఘంలోని 100% ప్రజాసమూహలకు బైబిల్ విషయం అందుబాటులోకి తెచ్చి దానిని కాపీరైటు బంధకాల నుండి విడిపించి వారు చక్కగా అర్థం చేసుకునే భాషలో అందుబాటులోకి తేవడం (అంటే విస్తృత వాడకంలో ఉన్న భాష). దీనితో బాటు ప్రతిబంధకాలు లేని శిక్షణ భాషలోకి అనువాదం చేసి, వారికి పూర్తిగా అర్థమయ్యే భాష (వారి మాతృ భాష)లోకి వారు అనువాదం చేసుకోగలిగేలా సిద్ధపరచడం. "గేట్ వే భాష" అంటే విస్తృతమైన వ్యవహారం ఉండి, రెండవ భాష మాట్లాడే వారి మూలంగా వారి స్వభాషకు అనువాదం చేసుకోడానికి కావలసిన విషయం పెద్ద భాష.

ప్రపంచ పరిధిలో "గేట్ వే భాషలు"అంటే తక్కువ సంఖ్యలో ఉండి, వాటి సహాయంతో విషయాన్నీ తక్కిన అన్ని భాషల్లోకీ అనువాదం ద్వారా అందించగలిగిన భాష. దీన్ని ఈ రెండు భాషలూ మాట్లాడే వారు చేస్తారు. ఉదాహరణకు ఫ్రెంచ్ అనేది ఒక గేట్ వే భాష. ఆఫ్రికాలో వారి వారి స్వభాషలు మాట్లాడుతూనే ఫ్రెంచ్ మాట్లాడే ప్రజా సమూహాల వారికి విషయం అందుబాటులోకి తెచ్చేలా అనువదించ వీలున్న భాషలు. దీన్ని ఇలా రెండు భాషలూ మాట్లాడేవారు తమ స్వభాష లోకి అనువాదం చేస్తారు. .

దేశం స్థాయిలో చూస్తే, ఒక దేశంలోని గేట్ వే భాషలు అంటే తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ మంది మాట్లాడే భాషలు. ప్రతి అల్ప సంఖ్యాక భాషలో తమ దేశంలో ఉండే రెండు భాషలూ మాట్లాడే వారికి(అంటే వలస రావడం అనే కారణం కాకుండా), విషయాన్నీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం. ఉదాహరణకు ఉత్తర కొరియాలో ఇంగ్లీషు గేట్ వే భాష. ఉత్తర కొరియాలో నివసించే ప్రజలంతా విషయాన్ని ఇంగ్లీషులోనుండి వారి భాషలోకి అనువాదం చేసుకోవడం ద్వారా దాన్ని అందుబాటులోకి తెచ్చుకుంటారు..

దీని ప్రభావం

ఈ నమూనా వల్ల రెండు ముఖ్య ఫలితాలు ఉన్నాయి. మొదటిది, ఇది అన్ని భాషలకూ విషయాన్నీ తమ భాషలోకి “లాక్కోగలిగేలా” తోడ్పడుతుంది. ప్రపంచం లోని అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండేలా ఇలాటి చిన్న భాషలను “నెట్టడం” జరుగుతున్నది (ఒక గేట్ వే భాష). రెండవది, అనువాదం చేయవలసిన విషయాన్నీ ఇది పరిమితం చేస్తుంది. ఎందుకంటే అనువాదం అనేదాన్ని ఒక్క గేట్ వే భాషలోకి చేస్తే సరిపోతుంది. తక్కిన చిన్న భాషలన్నీ కేవలం బైబిల్ విషయాన్నీ మాత్రం తర్జుమా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకనే ఏ భాషా కూడా అనువాద సహాయకలను అర్థం చేసుకోడానికి వాటిపై ఆధారపడదు.


జవాబులు పొందడం

This section answers the following question: నా ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?

జవాబులు పొందడం ఎలా

ప్రశ్నలకు జవాబులు కనుగొనడానికి అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి:

** అనువాద అకాడెమీ* - ఈ శిక్షణ కరదీపిక http://ufw.io/ta దగ్గర దొరుకుతుంది. ఇక్కడ చాలా సమాచారం లభ్యం అవుతూ ఉంది. అవేమంటే:

  • పరిచయం – అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టు పరిచయం.
  • ప్రక్రియ కరదీపిక - “తరువాత ఏమిటి?”అనే ప్రశ్నకు జవాబు.
  • అనువాద కరదీపిక –అనువాదం సిద్ధాంతం, ఆచరణ సంబంధిత మౌలిక వివరణ, సహాయకాలు.
  • తనిఖీ కరదీపిక –మౌలిక తనిఖీ సిద్ధాంతం, శ్రేష్ట ఆచరణ విషయాల గురించిన వివరణ.
  • ఇష్టాగోష్టి చర్చ - Team43 సమాజం సభ్యులతో కలిసి మీ ప్రశ్నలను "#helpdesk" లో ఉంచండి, మీ ప్రశ్నలకు వాస్తవిక జవాబులు పొందండి. (sign up at http://ufw .io/team43)
  • CCBT చర్చావేదిక - సాంకేతిక, వ్యూహాత్మక, అనువాదానికి, తనిఖీకి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు పొందవచ్చు, https://forum.ccbt.bible/
  • సహాయ కేంద్రం - మీ ప్రశ్నలను [email protected] కు ఈ మెయిల్ చెయ్యండి.