Chapter 4

1 అత్కాడే'దేవుటే రోమనగ్గ అంతాడు ఇత్త వాగ్దానం ఇంక కొనసాగోరుమత్తస్కే,మీయా బేన్రీంకన్నా ఆ వాగ్దానం దక్కకుంట దెయ్తేబేలాన్ ఇంజో జాగర్త పర్మాటు. 2 దేవుట రోమాన్ దాన్ సెంకె ఇశ్రాయేలియుర్కీంకుప్రకటన జరగ్తాటేమనామ్కి జరగ్తే.గోని కేంజ్త దాన్కు ఓరు విశ్వాసం జోడిస్సిల్లోవోరికి ఆ ప్రకటన అడ్డగోలత్తే. 3 భూమి మొదిలిస్తగ్గాటునుమ్చి సృష్టీతె పన్కు అంత ముగిస్కాను ఓండు ఈలా కెత్తోండు."నన్న నా ఎక్కవ కోపంతోటే ఓరు నా రోమనగ్గ అందాలోరు ఇంజో ప్రమాణం తుంగ్తాను".అత్కు విశ్వసిస్త మనాడు ఆ రోమనగ్గ అంతాడు. 4 ఇంకొర్చోట ఏడోరోజీన్ సెంకె కెచ్చోరు "దేవుడు ఏడోరోజీన్ ఓని పన్కంత ముగిస్సి రోంతోండు"ఇత్తోండు . 5 జరుడ్డి "ఓరు నా రోమనగ్గ అందాలోరు"ఇంజో కెత్తోండు. వుట రోమనద్ది కొద్దిమంది అందానాంకి ఏర్పర్తే ఇందనద్దు నిజం అత్కాడు, 6 చేలమంది ఇశ్రా యేలియుర్కు దేవుట రోమానుదాన్ సెంకెకెత్త సువార్తతి కేంజ్కాను ఓరు విదేయతఇల్లో కార్నంతే దానాగ అందాలిల్లోరు కాబట్టి 7 దేవుడు "ఈ రోజు "ఇందాని ఒరో ప్రత్యేకమత్త రోజీను నిర్ణయిస్తోండు.మున్నే దీన్ సెంకె ప్రస్తావన జరగ్త చాలా కాలాత్కి,జరుడ్డి దావీది తోటే ఓండు తిరియ్తస్కే "ఈ రోజు "తి ఓండు నిర్దారణ తుంగ్తోండు.ఓండు ఇల కెత్తోండు,"మీరు మీ రుదయకీను కఠీనపర్సాకుండ నేండే ఓను మాట కేంజ్కుమేలు " 8 ఒర్వేలా యెహోషువా ఓర్కు రోమనద్దు ఈదగలుగ్కు దేవుడు ఇంకొర్రోజీన్ సెంకె కెత్తకుంట మంద్కోండు.పరిపూర్ణ విడవబర్ధతం విస్వాసిత్కి రోమటం 9 అత్కాడు దేవుటే జనాబ్తికి రోమటం నిల్లీ మిందే. 10 బారిత్కు దేవుడు ఓన్ పన్కంతతుంగి ముగిస్సి విశ్రాంతి తీసుకుట్టాటే ఓను విశ్రాంతితె అందనోండు గూడా ఓను పన్కంత ముగిస్సి విశ్రాంతితె 11 అం అత్కాడు,ఓర్దిస్తే అవిదేయతతే అర్దకుంట,ఆ విశ్రాంతితె అందనాంకి తొందర పర్దకాడు. 12 బారిత్కు దేవుటే వాక్కు బతికిమందనద్దు,క్రియాశీలకమత్తాదు,రెండంచ్కుమత్త బేలోంటే కస్సేరు కన్నా గూడా పదున్ మంజి పాండంతే నుంచి ఆత్మతీన్,కీల్కీ నుంచి మూల్గీను విడగోట్టనచ్చో శేక్తి మందన్ దిస్తే మంజోందే .అద్దు రుదయంతే మందాన్ ఆలోసన్కిన్ ఉద్దేశకీనుపరిసీలిస్సోందే. 13 ఓనికి తోపకాదకుంట మందనద్దు బేదు ఇల్లె.మనాడు లెక్క అప్పగిస్సాను దేవుటే దృష్టీత్కంత తేటంగ మిందే.దేవుటే మర్రీను కృప,కరుణతే తోటే విశ్వాసీత్కి విశ్రాంతి మిందే 14 ఆకాశాకీనాకే అత్త దేవుటే మర్రి,మన ప్రభువత్త యేసు ఇందాని తోల్తేపూజారు మనాంకు మిన్నోండు కాబట్టి మనాడు విస్వసిస్తదానీన్ గట్టిగ పెయ్ద్ కాడు. 15 బలహీనతకీన్ పెఇసి మన తోల్తేపూజార్తికి సానుభూతి మిందే.బారిత్కు ఓండు గూడా మన్దిస్తేఅన్ని విసియకీను పరీక్షా ఎదుర్కుట్టోమ్ డు.కాని ఓండు పాపమిల్లోవోండుగ మిన్నోండు. 16 మన అవస్రకీంకు ఓను కృపా కనికరకీంకు ధైర్యంతోటే కృపా సింహాసనంతే దగ్గేర్కి అంద్కాడు.