అధ్యాయం 21

1 నంగులు అయులును ఉట్టూటు ఓడ ఏరి పోయి కోసుకొను మరన్నాడు రోదుకును అటుండు పతురకును వందికీరో 2 అప్పుడు పినికోకు ఓగురు ఒండు ఓడ పాతు అత్తు ఏరి ప్రయానం సేందో 3 కుప్రకు ఎదురుగా వందుకిరో, అత్తును ఎడిక్కీ జాయ ఉట్టుటు.సిరియ జాయ ఓయి,తూరుకో దిగుజుకిరో ; ఆటి ఓడ సరుకులు దిగుమతి సేయాదు. 4 నంగులు విశ్వాసులును కండుగుండు ఎగునాలు అయిలచ్చి ఇందో అయిలు- నిను యెరూషలేము కోరు కాలు ఎక్కిమాన ఇండు ఆత్మ ద్వారా పౌలోటీ సోన్నుసు. 5 ఆ దినాoగులు గాడిచినాక ప్రయాణము సేయందిగా విశ్వాసులు. అస పొండు మక్కులొటి కలసిగుండు నంగులొటి ఊరు గాడిల్ దాకా వంచు .సముద్ర మచ్చుకు ఒనప్పుడు అడ్డేరు కలుసుగుండు మెకరించి ప్రార్థన సేందో. 6 అప్పుడు నంగులు ఓడను ఏరికిరో, అయిలు అస అస ఉటుకు తిరిగి ఎల్లిపోసు. 7 నంగులు తూరు నుండి సేందిక్కురు ప్రయాణము ముగించు కిరో, తొలిమాయికి వందు కిరో, సహోదరులును ఎన్నిగెన్నగా కీరంగా ఇండు అయిలున కేటు అయిలచ్చి ఒండు దినము ఇంచు. 8 మర్నాడు నంగులు ప్రయాణము సేందు కైసరయకు వందికిరో, ఏగుమంది బెరుమొనుసులుకోరు ఒండు ఇంగురు సువార్తికుడు పిలిప్పుట ఉ టచ్చుకు వందు అదోటి ఇందో. 9 కన్యాలు ఆగారాయ నాలాలు ఫుల్లుమార్లు అత్తుకు ఇంచు, అయిలు ప్రవసించురాయ. 10 నంగులు అనేక దినాలు అటి ఇందో, అగబు ఇంగురు ఒండు ప్రవక్త యూదయకోరుండు వంచు. 11 అదు నంగ్లచ్చుకు వందు పౌలు నడికట్టు వంకుండు, అస కియ్యిలును కాల్లును కట్టుగుండు యోరుసలేముకోరు యూదులు ఈ నడి కట్టిక్కురు మొనుసును ఇన్నగ బందించాదు, యుదేతరుల కియ్యికి అప్పగించాదిండు పరిశుద్దాత్మ సొన్నుసు. 12 ఈ కేటప్పుడు నంగులును అటిక్కురాయిను యోరుసలేముకు ఓగుమానా ఇండు అత్తును కేటుగుండో. 13 పౌలు ఇది ఎందాతుకు? నింగ్లు అగుదు నటగుండెను బద్దలు సేయక్కురంగా? నాను ప్రభువైన యేసునామము నిమిత్తము యోరుసలేముకోరు బంధింప బుగింగా మాత్రమే గాక సొత్తోగిత్తుకు సిద్ధంగా కిరిండు సొన్నుసు. 14 అదు ఒప్పుగారుదోసు నంగులు ప్రభువు చిత్తము జరుగు బేకిండు సమ్మా ఇందో. 15 ఆ దినాంగ్లు అయినప్పుడు నంగులుకు బేకాసిక్కురు సామాను ఎత్తుగుండు యోరుసలేముకు ఎల్లిపోనో. 16 కైసరయ నుండి కొంతమంది శిష్యులు నంగులొటి వందు నంగలున 'మ్నాసోను' ఇంగురు అస ఉటుకు అసుగుండు ఓసు. మిన్ని, విశ్వాసముగా ఇక్కిరాయికో ఇదు ఒండు . 17 నంగులు యోరూసలేముకు వందప్పుడు సహోదరులు నంగులును సంతోసమోటి అసుగుంచు. 18 మర్నాడు బెరుమొనుసులు అడ్డేరు అటుకు వందికీదు పౌలు కూడా నంగులొటి యాకోబు ఇంగురాలచ్చుకు వంచు. 19 అదు అయిలున ఎన్నగ కీరంగా ఇండు కేకుసు, అస పరిచర్య వలన దేవురు యుదేతరులుకోరు సేందిక్కురుత అయిలికి వివరంగా సొన్నుసు. 20 అయిలు కేటు దేవురున మహిమపరసుసు అత్తును పాతు సహోదరుడా, యూదులుకోరు దేవురును నమ్ముగుండు ఇక్కిరాయ ఎత్తున వేలమంది కీదో పాకంకరల్యా? అయిలు అడ్డేరు ధర్మశాస్త్ర మందు ఆశ ఇక్కిరాయ. 21 యుదేతరులచ్చి నివసించురు యూదులు అదుగు సిన్నాయిలుకు సున్నతి సేయింగు దిండు, నంబుట ఆచారాలను పాటించింగుదిండు, నీను సొన్ని కీరాయిండు అయిలు అడ్డేరు మోషేను ఉట్టూడు బేకిండు నీను సొన్ని కీరాయిండు అయిలు నిన్ను గురించి కబురు కేటుగుండు కీదు. 22 కాబట్టి నంబరు ఏంచేయంబు? నీను వందిక్కురు విషయము అయిలు ఖచ్చితంగా కేటుగుండిక్కాదు. 23 కాబట్టి నంగులు నీకు సొండ్రు తీరి సేయి. మ్రొక్కుబడి ఇక్కరు నాలాలు మొనుసులు నంగ్లచ్చి కీదు. 24 ఇయిలున నిన్నొటి అసుగుండు పో. అయిలోటి కలసి శుద్ధి సేందుగో.అయిలికి తలకాయ మెగురు వంగిచ్చుగిత్తుకు అగురు లక్కకుడు. అన్నగ సేందిగా నిన్ను గురుంచి కేటుగుండిక్కీదు నిజము అల్లా ఇండు అడ్డేరు తెలుజుగాదు 25 అయితే విశ్వసించిక్కురు యుదేతరుల విసయము కో విగ్రహాలకు అర్పించిక్కురుత రగుతను, గొంతు పిసుకుటు కొండ్రోటిక్కుత, జారత్వమును మానుబేకిండు నిర్ణయం సేందు అయిలికి రాసునో. ఇండు సొన్నుసు. 26 కాబట్టి పౌలు అమర్నాడు మొక్కుబడి ఇక్కురు ఆ మొనుసులను పెరుగోటి అసుగుండు పో, అయిలోటి కలుసుగుండు శుద్ధి సేందుగో, గుడికోకు ఓయి, అయిలు అడ్డేరు పక్షణమున కానుక అర్పించురు దాకా శుద్ది., దినాంగులు నెరవేర్చాకి ఇండు సొన్నుసు. 27 ఏగు దినాంగులు పూర్తి ఆగురప్పుడు ఆసియాకోరుండు వందిక్కురు యూదులు గుడికోరు అత్తును పాతు, బలంతంగా పుడుసుగుండు అటిక్కురు జనాంగులు అడ్డేరు కలవర బూచ్చు. 28 ఇశ్రాయేలీయులారా ,వందు సహాయము సేయంగో . ప్రజలకు ధర్మశాస్త్రమునకు స్థలమునకు విరోదంగా అడ్డేరుకు, అడ్డిచోట భోదించక్కురాలు ఇదే. మేనుకు ఇదు గ్రీకు అయిలున గుడికోకు అసుగుండు వందు ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రము సేందుసు ఇండు కూతోడుసు. 29 ఎపేసు మొనుసు త్రోపిము అత్తుకు మినిగల్లి పౌలోటి కలసి ఇక్కురుదు అయిలు పాకుసు కాబట్టి పౌలు అత్తును కూడా గుడికోకు అసుగుండు వంచిండు అయిలు భావించుసు. 30 పట్టణము అడ్డి గందరగోళంగా కీదు. జనాంగులు గుంపులు గుంపులుగా ఉరికెత్తుగుండు వందు, పౌలును పుడుసుగుండు గుడికోరుండు గడ్లికి ఇగుతూటు వాకిలున మూసోడుసు. 31 అయిలు అత్తును కొండ్రోడిత్తుకు ప్రయత్నము సేందుసు. యెరూషలేము నగరము అడ్డి అల్లకల్లోలంగా కీదిండు ప్రధాన సైన్యాధికారికి సమాచారం వంచు. 32 వెంటనే అదు సైనికులను, శతాధిపతులను పెరుగోటి అసుగుండు ఓయి అయిలచ్చుకు ఉరికెత్తుగుండు వంచు. అయిలు ఆ అధికారిని, సైనికులను పాతు పౌలును మొతురుదు ఆపుసు. 33 అదు వందు పౌలును పుడుసుగుండు, రెండు సంకెళ్ళొటి అత్తును బందించంగో ఇండు ఆజ్ఞ కుర్తి, ఇదు ఏదు ఎంచేందుసు ఇండు కేకుసు. 34 జనాంగులు వివిధ రకాలుగా కుతోడు గుండు అల్లరి సేయందిగా అత్తుకు నిజము తెలిల్లా పౌలును కోటకోకు అసుగుండు పొంగో ఇండు ఆజ్ఞ కుడుకుసు. 35 పౌలు మెటుకులు మేనుకు వందప్పుడు జనాంగులు గుంపులుగా పోగాయి దాడికి దిగుసు సైనికులు అత్తును పెచ్చుగుండు ఓగురుదు వంచు. 36 ఎందాతుకు ఇండిగా అత్తును కొండ్రోడాంగో ఇండు ఆ జనాంగులు కూతోట గుండు అయిలు పెరుగోటి ఓసు. 37 అయిలు పౌలును కోటకోకు అసుగుండు ఓగందిగా అదు ఆ సేనాధిపతిని నాను నిన్నొటి ఒండు వాత సొన్ను గచ్చా ఇండు కేకుసు. అత్తుకు అదు నీకు గ్రీకు భాష గొర్త 38 ఇత్తుకు మినిగల్లి నాలు వేలమంది ఉద్యమకారులను అసుగుండు ఆడివికోకు ఓయిక్కురు ఐగుప్తియుడవు నినే ఇండు కేకుసు. 39 అత్తుకు పౌలు, నాను కిలియకోరు తార్సు పట్టణముకు సెందిక్కురు యూదుడను. ఒండు మహపట్టణపు పౌరుడను. నాకు ఈ జనాంగులోటి వాచ్చురు అవకాశము తాయిండు నిన్న కేటుగక్కిరి. 40 అదు అత్తుకు అనుమతి కుడుకుసు. అప్పుడు పౌలు మెటికిలి మేని నిలుబూదు జనాంగులుకు కియ్యిలోటి సైగ సేందుసు. అయిలు నిమ్మలాసు అదు హెబ్రీ భాసకోరు ఇన్నగ ఇంగుసు.