1 అల్లరి తగ్గిపోయాక ,పౌలు యేసు శిషులునా దగ్గురుకు కూటు ప్రోత్సహ వాతులు సొన్ని అయ్యచుండు ఒయ్యారాకిండు సొన్ని మాసిదోనియ కు బయలుదేరుసు. 2 ఆ వూర్లు అడ్డీ తిరుజు అటి విశ్వాసులు నా ప్రోత్సహించు టూ గ్రీసు కు వందు కీదు. 3 అదు అటి మూడు మాదిందు మల్లా పడవమిని సిరియా కు ఓగసికిండు బావించుకుండుక్కీదు కానీ అటి యూదులు అదుమీని కుట్ర సేయక్కుదు ఇండు తెలుసు కుండు తిరిగి మాసిదోనియ కు ఓగింగా నిర్ణయించుకుండుక్కీదు . 4 ఫుర్రస్ మగు , బెరయ ఊరు కు చెందిక్కురు సోపత్రు ,థెస్సలోనిక మొనుసులు అరిస్తార్కు ,సెకందు, దెర్బె ఊరూ మోనుసు గాయి ,తిమోతి, ఆసియా దేశాలకు సెందిక్కురు తుకికు, త్రోఫిము లు అదోటి ఆసియా వరకు వందుకీదు. 5 ఇండిగ్యా ఐయడ్డేరు మిన్నేపోయి త్రోయ ఇంగురు ఊరు కోరు నంగులుకోసం ఎదురు పాకక్కిదు. 6 నంగులు పాసిపోగారు పిండోటి సెయిరు పండుగ రోజులు ఐపోనుపట్లి పడవ ఎక్కి ఫిలిప్పి ఉట్టుటూ అంజు రోజులు ప్రయాణం సేందు త్రోయ కు సేరుగుండు ఐయ్యచి ఏగు దినాలు గడిపికీరో . 7 ఆదివారాం నాడు నంగులు రొట్టె వడికింగా సమకూడు గుండపుడు పౌలు తల్లారి ఓగసికుదు కాబట్టి అదు అయ్యోటి మొబ్బుకో వరకు విస్తరించి వాఁచుకుండూ అటే ఇచ్చు. 8 నంగులు అడ్డేరు ఇక్కుదు ఊడు రూమ్ కోరు శ్యానా దీపాలు కీదు . 9 పౌలు శ్యానాసేపు ప్రసంగం సోనందిగా కిటికో కొంచుండిక్కురు ఐ తుకు ఇంగురు పాయిము కెరు గాడ వరుకుకోకూ మునిగి జోగి ,మూడో అంతస్తు నుంచి జారీ తర్రికి బూదు సోత్తో కీదు. 10 అప్పుడు పౌలు తర్రికి పోయి అదుమీని భూదుగుండు కౌగిలించు కుండు , నింగులు బాధ బుగురు పనిల్లా . ఎందాతుకిండుగ్యా అదు పెగిసే కీదు ఇండు ఐయ్యోటి సోనిక్కీదు . 11 అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టి విరచి తెల్లవారెవరకు వారితో మాట్లాడేను. 12 ఐతుకుని బ్రతికించాక వారికి చాలా ఆదరణ కలిగింది. మళ్ళీ వచ్చినప్పుడు అక్కడివారికి ఎప్పుడు వారితో మాట్లాడుటకు వచ్చారు కనుక వారి దగ్గర నుండి ఆ ప్రాంతం వెళ్లుటకు సిద్ధపడిరి.అప్పుడు యేసు వచ్చి వారితో ఇట్లనెను. 13 నంగులు పడవ ఎక్కి అస్సు ఇంగురు ఊరుకు పోయి అటి పౌలున ఎక్కించుకుండు మిన్నే బయల్దేరూ కీరో .అదు ఆటువరకు నడుదుగుండు వారసికిఇండు ఉద్ధేసుమోటి పౌలు నంగులనా ఆ విధంగా అదేశించు కీదు. 14 అస్సులో అదు నంగులొటి కలిసి తరువాత నంగులడ్డేరు కలిసి మితిలేనే వందుక్కిరో. 15 అటుండు బయలుదేరి మర్నాడుకు కీయోసు ద్విపానికి ఎదురు గా వచ్చాము. మర్నాడు కు సమొసు చేరుగుండు ఆ తరువాత రోజుకు మిలేతు కు చేరుగుండు కీరో . 16 సాధ్యమానిగా పెంతుకోస్తూ రోజున యెరూషలేము కో ఇక్కసికిండు పౌలు త్వరపడక్కిండు అత్తుకు ఆసియా కో కాలయాపన సేయారుకుండా ఎఫెసు కు వెళ్ళిపొగసికిండు అదు నిర్ణయించుకుండు కీదు . 17 అదు మిలేతు నుంచి ఎపేసి సంఘముకోరిక్కురు బెరుమొ నుసులుకు కబురు అంపూటు కూడిచ్చుగుంచు. 18 అయిలు అదచ్చుకు వందప్పుడు అయిలోటి ఇన్నగా ఇంగుసు నాను ఆసియాకోరు కాలుఎచ్చిక్కురు దినముమొ దులుగుండు, ఎల్లకాలము నింగ్లచ్చి ఎన్నగా నర్దుగుండుకీరేనో నింగ్లికే గోర్తు. 19 యూదుల కుట్ర వలన నాకు ఎత్తునో కష్టమంచు, దుఃఖము సంభవించుసు. ప్రభుసేవ సంపూర్ణంగా నమ్మకముగా సేంది. 20 ప్రయోజనకరుమగుత్త ఏత్తను ఒలిసెక్కారుగుండా బహిరంగ ముగానే, ఊటూట తిరుజు నింగ్లుకు తెలియతీరి సొన్నికీరి. 21 దేవురు మినిగల్లీ మారుమనస్సు భూదు నమ్రు ప్రభువైన యేసుక్రీస్తు నందు నమ్మకము ఎక్కిబేకిండు సొన్నుసు, యూదలకును గ్రీసుదేశ స్తులకును ఎన్నగ సాక్షము సొన్నికీరోనో ఇలడ్డి నింగ్లుకు గోర్తు. 22 ఇదో ,ఇప్పుడు నాను ఆత్మ నిర్బంము కో యెరూషలేము కు ఓగాక్కిరి, అటి ఎందాదు జరగాదో నాకు తెలిమాదు. 23 నాను కష్టాలు, చెరశాలు ఎదురుగా కీదిండు పరిశుద్దాత్మ నాకు ప్రతి పట్టణముకోరు మిన్నే సొన్న క్కుదు. ఇదుమాత్రము నాకుగొర్తు. 24 అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్షము సొన్నిత్తుకోరు నట ఉరుకు ను, నాను ప్రభువైనయేసు వలన పొందిన పరిచర్యను, పూర్తి సేయిబేకిండు నటపాన్తును నాకెత్తున మాత్రము ఇష్టముగా ఎంచిగిల్లా. 25 ఇద్దో దేవురుట రాజ్యము గురించి సొన్నుగుండు నాను నింగ్లు కోరు తిరుజుగుండు ఇంది; నింగ్లుకో ఏదును ఇకనుంచి నట మొగతను పాకమాటంగా ఇండు నాకుగొర్తు. 26 కాబట్టి నింగుట నాశనము విసయముకోరు నానుదోషిని అల్లా ఈమాను నింగ్లే సాక్షము ఇండు సొన్నక్కిరి. 27 దేవురుట సంకల్పము అడ్డి నింగ్లుకు సొన్నారుగుండా నానెందు ఒలిసెచ్చుగిల్లా. 28 ప్రభువు అస సొంత రగుతు కుర్తు సంపాదించుగుండిక్కురు సంఘమును కాయిత్తుకు పరిశుద్దాత్మ నింగ్లున ఏత్తుకు అద్యక్షులుగా నియమించుసో ఆ మంద అడ్డిన గురించి, నింగ్లు మట్టుకు నింగ్లున గురించి జాగ్రత్త బుగంగో. 29 నాకు గొర్తు, నాను ఓనప్పుడు తోడేలుట స్వభావము ఇక్కిరాయ నింగ్లుకోకు ప్రవేశించాదు. అయిలు మందకు జాలి కాటుమాదు. 30 అత్తినే అల్లాది శిస్యులున అయిలోటి ఇగుతుగుండు ఓగిత్తుకోసం వక్ర వాతుతులు వాచ్చురు మొనుసులు నింగ్లుకోరుండు బయలుదేరాదు. 31 కాబట్టి నాను మూడువాటకాలు నామారి పగమారి కన్ను కోరు తన్నికార్చికీరి ప్రతిమొనుసుకు బుద్దిసొన్నికీరి నింగ్లు గుర్తు సేందుగుండు జాగ్రత్తగా ఇరొంగో. 32 ఇప్పుడు దేవురుకును ఆయన కృపావాక్యమునకును నింగ్లున అప్ప గించక్కిరి, ఆయన నింగ్లుకు క్షేమాభివృద్ది సేయిత్తుకు, పరిశు ద్దంగా ఇక్కురు అడ్డేరుకు స్వాస్థ్యము తారింగా సమర్ధుడు 33 వెండినిగాని, బంగార్తునుగాని, బట్టలు నుగాని ఏదచ్చి నాను ఆశించిల్లా. 34 నట అవసరతలు కోసము నన్నచ్చి ఇక్కిరాయ కోసము నానుకష్టబూదు పనిసేందిక్కుదు నింగ్లుకు గొర్తు. 35 నింగ్లు ఇన్నగా ప్రయాస బుగొంగు పని కీకాగు మాటారాయికి సహాయము సేయంగో "వంకురుదు కన్న కుడుకురుదే ధన్యము" ఇండు ప్రభువైనయేసు సొన్నిక్కురు వాతులు గుర్తు సేందు గొంగు అడ్డివిసయాలుకోరు నింగ్లుకు మాదిరి కాటిచ్చికీరిండు సొన్నుసు 36 అదు ఇన్నగా సొన్ని మోకరించి అడ్డేరోటి కలసి ప్రార్థన సేందుసు. 37 అప్పుడు అయిలడ్డేరు చాలా అగుసు. 38 నింగ్లు ఇక నట మొగతను పాకుమాటంగా ఇండు అదు సొన్నిక్కురు వాతుకు అగుదూడుసు. పౌలు మెడిమీని బూదు అత్తును ముద్దుఎచ్చుగుంచు, అయిలు ఓడ వరకు అత్తును సాగనంపుసు.