1
ఇటలీ పాటలమఅనబడిన పాటలములో శతాధిపతియిన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలొ ఉండెను.
2
అతడు తన ఇంటివారందరితోకూడా దేవునియందు భయభక్తులు గలవాడైయు౦డి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్ధన చేయువాడు.
3
పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి -కొర్నేలీ , అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను .
4
అతడు దూతవైపు తేరి చూచి బయపడి -ప్రభువా ,యే మని అడిగెను .అందుకు -నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకర్థముగా చేరినవి.
5
ఇప్పుడు నీవు యొప్పెకు మనుష్యులను పంపి,పేతురు అను మారు పెరుగల సీమోనునుపిలిపించుము ;
6
అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని యింట డిగియున్నాడని అతనితో చెప్పెను
7
అతనితో మాట్లాడిన ధూత వెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి .
8
వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను .
9
మరునాడు వారు ప్రయణమైపోయి పట్టణమునకు సమీపపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.
10
అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను;ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై .
11
ఆకాశము తెరవబడుటయు ,నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను .
12
అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్ఫాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశపక్షులును, ఉండెను
13
సమయములో "పేతురు,నిద్రనుండి లేచి చంపుకొని తిను " అనే ఒక శబ్దము పేతురుకి వినిపించింది.
14
అయితే పేతురు "వద్దు ప్రభూ.నిషిద్ధమైన దానిని అపవిత్రమైన దానిని నేనెప్పుడూ తినలేదు "అని జవాబిచ్చారు .
15
'ఎవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనవద్దు' అని మళ్ళీ పేతురు రెండవ సారి ఆస్వరం అతనికి వినబడింది.
16
ఈ విధంగా మూడుసార్లు జరిగింది . వెంటనే ఆ పాత్ర ఆకాశనికి తిరిగి వెళ్ళిపోయింది
17
పేతురుకి వచ్చిన దర్శనము ఏమిటో అని తనలో తాను ఆలోచించుకొంటూ అయోమయంలో కొర్నేలీ పంపిన మనుషులు సీమోను ఇంటి కోసం వాకబు చేసి తలుపు దగ్గర నిలబడి
18
"సీమోను పేతురు అనే పేరు ఉన్నవారు ఎవరైనా ఇక్కడుంటున్నాడా "?అని అడిగాడు .
19
పేతురు ఆ దర్శనము విషయమై ఇంకను ఆలోచించుండగా ఆత్మ "-ఇదిగో ముగ్గురు మనష్యులు నిన్ను వేదకుచున్నారు .
20
వారితో వెళ్ళడానికి బయపడవద్దు .వారిని నేనె పంపాను "అని అతనితో చెప్పాడు .
21
పేతురు ఆ మనుష్యుల దగ్గరకి దిగి వెళ్లి "మీరు వెదికే వాణ్ణి నేనె .మీరెందుకు వచ్చారు ;?అని అడిగాడు .
22
అందుకు వారు-నీతిమంతుడును దేవునికి బయపడువాడును ,యూద జనులందరివలన మంచి పేరు పొందినవాడునైన ,శతాధిపతియగు కొర్నేలీ యను ఒక మనుష్యుడున్నాడు ;అతడు నిన్ను తన యింటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడేనని చెప్పిరి;ప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి అతిథ్యమిచ్చెను.
23
మరునాడు అతడు లేచి ,వారితోకూడా బయలుదేరేను;యొప్పెవారైన కొందరు సహోదరులను వారితోకూడా వెళ్లిరి.
24
మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి .అప్పుడు కొర్నేలీ తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని యు౦డెను .
25
పేతురు లోపలికి రాగ కొర్నేలీ అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను.
26
అందుకు పేతురు -నీవు లేచి నిలుపుము ,నేనుకూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి.
27
అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి ,అనేకులు
28
కూడిఉండుట చూచెను .
అప్పుడతడు -అన్యజాతివాడితో సహవాసము చేయుటయినను ,అట్టివాని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును .అయితే ఏమనుష్యుడును నిషేధింపదగనివాడైనను అపవిత్రుడనియినను చెప్పకూడదు అని దేవుడు నాకు చూపించి ఉన్నాడు .
29
కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చితిని గనుక ,ఎందునిమ్మితము నన్ను పిలవ నంపితిరో దానిని గూర్చి అడుగు చున్నానని వెయితి చెప్పెను .
30
అందుకు కొర్నేలీ -నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలుకొని యీవేళవరకు నేను ఇంట ప్రార్ధన చేయుచుండగా ప్రకాశమనమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి .
31
కొర్నేలీ ,నీ ప్రార్ధన వినబడెను ;నీ ధర్మకార్యములు ఎవుని సముఖమందు జ్ఙానాపకముంచబడి ఉన్నవి గనుక నీవు య్యొప్పెకు వర్తమానము పంపి .
32
పేతురు అను మారు పెరు గల సీమోనును పిలిపించుము ;అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియూన్నాడు అని నాతో చెప్పెను .
33
వెంటనే నిన్ను పిలిపించితిని ;నీవు వచ్చినది మంచిది .ప్రభువు నీకు అజ్ఞాపించినవన్నీయు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియూన్నామని చెప్పెను అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను .
34
దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యూన్నాను .
35
ప్రతి ములోను ఆయనకు బయపడి నీతిగా నుడుచుకొనువానిని ఆయన అంగీకరించును .
36
సుక్రీస్తు అందరికి ప్రభువు ఆయనద్వారా దేవుడు సమాద్ధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు .
37
యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును .
38
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషెకించినను నదియే. దేవుడు ఆయనకు తోడైయు౦డెను గనుక ఆయన మేలు చేయుచు ,అపవాదిచేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను .
39
ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులమూ .ఆయనను వారు మ్రానును వ్రేలాడదీసి చంపిరి.
40
దేవుడాయనను మూడవ దినమున లేపి ,
41
ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే ,అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మేక్ ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహహించెను
42
ఇదియుగాక ఎవుడు సజీవులకును మృతులకును న్యాయదిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్షమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను .
43
ఆయనయందు విశ్వాసముంచువాడేవాడో వాడు ఆయన నామము మూలాముగా పాపక్షమాపన పొందునని ప్రవక్తలందరు ఆయానగూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను .
44
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరికి పరిశుద్ధాత్మ డిగెను .
45
సున్నతిపొందిన వారిలో పేతురుతోకూడా వచ్చిన విశ్వాసులందరు ,పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సైతము కుమ్మరించి బడుట చూచి విభ్రాంతినొందిరి.
46
ఏలయనగా భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి .
47
అందుకు పేతురు -మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆట్టంకము చేయగలడా అని చెప్పి .
48
యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండమని వారతని వేడుకొనిరి .