7
1
యెరూషలేము నుండి వoదా కొందరు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ యేసు చుట్టూ గుమికూడుసు.
2
ఆయ దేవురు శిష్యుల్లకోరి కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కేవిగారుగుండా భోజనం చేయడం గమనించుసు.
3
పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం అసుకు కియిల్ని ఆచారరీతిగా కేవిగారుగుండా భోజనం చేయమధు .
4
ఆయ బెళ్లి నుండి వoదప్పుడు స్నానం చేయరాగుండా భోజనం చేయమాదు. గిన్నెలు, కుండలు, ఇతర ఇత్తడి పాత్రలు, భోజనపు బల్లలు సహా శుద్ధి చేయడం అనే అనేకమైన ఆచారాలను ఆయ కచ్చితంగా పాటిoచకకు.
5
పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసుతో, “నింఘ శిష్యులు బేరియల సంప్రదాయాన్ని పాటించరాగుండా అశుద్ధమైన కేయిలతో అత్తూకు భోజనం చేయుకురు ?” అoడు యేసును కేడుసు.
6
యేసు ఆయులతో, “ ‘ఈ ప్రజలు వాతలతో నన్ను గౌరవిoచకరు కాని, అసుకు హృదయం నాకు చానా దూరంగా ఇక్కిరు.
7
ఆయ మానవ కల్పితమైన నియమాలను దేవురు ఉపదేశంగా బోధిoచుసు కాబట్టి ఆయ ఆరాధన వ్యర్థం,’ అoడు కపట వేషధారులైన నింఘల గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే!
8
నింఘు దేవురి ఆజ్ఞల్ని తోసిపుచ్చి మోంచురు సంప్రదాయాలకు కట్టుబడుతున్నారు.
9
నింగు సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంకోరి నింగ్హ సిద్ధహస్తులు.
10
మోషే, ‘నింగు తల్లిదండ్రుల్ని గౌరవించుముండు, తల్లిని, తండ్రిని దూషించన అయులకు శిక్ష మరణదండన’ అoడు నియమించుసు.
11
కానీ మీరైతే, ఒoడు వ్యక్తి అసుకు తల్లితో, తండ్రితో ‘నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా ‘కొర్బాన్’ (అంటే దైవార్పితం)’ అoడు సొన్నిగేటి
12
ఇంక ఆ వ్యక్తి అత్తుము తల్లిదండ్రుల కోసంఇంకందు చేయనక్కర ఇల్లాండు సోoచు.
13
నింగ్హ నింగు బేరియల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవురు ఆజ్ఞ మీరకరంగా. ఇలాంటివి ఇంకతోనో నింగ్హ చేయకరంగా.
14
అప్పుడు యేసు ప్రజలందేరున అత్తుము కిట్టకు అగుసు , “నను సొన్నoదు ప్రతి ఒoడు విని అర్థం చేoదుగో!
15
బేలి నుండి మోoచము ఉలికి వోగుమనికే అoదు అత్తన అపవిత్రం చేయమాదు.
16
మోంచముకోరి నుండి బెళుకు వారధు అత్తుము అపవిత్రం చేoదదే” అoడు అడుసు.
17
దేవురు జనసమూహన్ని వుంటిచు వుంటుకోకు ప్రవేశించిన తరువాత దేవురు శిష్యులు ఆ ఉపమానం గురించి దేవురున కేడుసు .
18
దేవురు ఆయులతో, “నింగ్హ ఇంత అజ్ఞానులా! బెలి నుండి మోంచంము వoదేకే అదు అపవిత్రం చేయాల్లాండు నింగ్హ గ్రహించలేమటగ?
19
అది మోంచము హృదయంకోకు వోగామాదు. వోరుగుకోకు వోయి అట్టి నుండి బేలికి వoదుడకుల్లా” అoడు సోంచు. (ఈ విధంగా సోన్నడం ద్వారా అద్ది ఆహార పదార్ధాలూ తిగతుకు పవిత్రమైనవే అoడు యేసు సూచించుసు).
20
దేవురు మళ్ళీ ఈ విధంగా అoడుసు, “మోంచము నుండి బెళుకు వారధు అత్తుమున అపవిత్రం చేయాకు.
21
అతుకనుకే మోంచము హృదయంకోరి నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు,
22
వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బెళుకు వారాకు.
23
ఇయద్దీ ఉలినుంచి బెళుకు వoదు మోంచమున అపవిత్రం చేయకు.”
24
యేసు ఆ ప్రాంతం వుoటిచు తూరు, సీదోను ప్రాంతంకోరి ఒoడు ఉటుకు వోసు. అదు అట్టి ఇంధాటే ఎత్హుకు తెలిముకుడదుండు దేవురు ఉద్దేశం. కాని, దేవురు అయులకు కoడిబుగారగుండా ఇక్కిల్లెమటివోసు .
25
ఒoడు స్త్రీ యేసు గురించి విని వoదు దేవురున కాళ్ళమేని బుంచు. ఆమె మొగులుకు దయ్యం పుడుసుండుఇక్కిరు .
26
ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంకోరి పరుముంచు గ్రీసు దేశస్తురాలు. అత్తుము మొగులుకోరి నుండి ఆ దయ్యాన్ని వోగామోతసోన్ని యేసును బతిమలాడుసు.
27
అందుకు యేసు అత్తుముతో, “మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం వమ్చుండు నాయ్యీకు వోడడం తగదు” అoడు అoడుసు.
28
అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లదిగిలి ఇక్కిరా నాయ్యీకు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తిగాకుల్లా!” అoడు జవాబు తచ్చు.
29
అప్పుడాయన ఆమెతో, “ఈ వాత సొన్నoదువల్ల ఇక నిను నిశ్చింతగా వోగోచు. దయ్యం నిమ్ము మొగులుకు వోటించుపోసు” అoడుసు.
30
ఆమె వుటుకు వోయి అత్తుము మొగులు అతుము మంచంమేని బుందుండు ఇక్కిటము పాచు. దయ్యం ఆమెను వుంటిచుపోసు.
31
యేసు తూరు, సీదోను ప్రాంతం నుంచి బయలుదేరి దెకపొలి ప్రాంతం గుండా గలిలయ సముద్రం కిట్టకు వoచ్చు.
32
అట్టి కొందరు చెవుడు, నత్తి ఇందా మోచురు దేవురు కిట్టకు వంచ్చుండు వందు అత్తుము మేని కియ్యి ఎకిసోoన్ని వేoడిసు.
33
యేసు అత్తా జనంకోరి నుండి పక్కకి వంచ్సుండు అతుము వేళ్ళు అతని చెవుల్లో ఇచ్చుసు. ఉమ్మివేసి అతుము నాలుకను ముట్టుసు .
34
అప్పుడు దేవురు ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, “ఎప్ఫతా” అoడు అత్తుముతో అoడుసు . ఆ వాతకు, “తెరిచిగో !” అoడు అర్థం.
35
వెంటనే అత్తుము చెవులు తెరిచుండుసు. అత్తుము నాలుక సడలి తేటగా వాసితటము మొదలు ఇట్టుసు .
36
ఆ సంగతి ఎత్తుముతోను సొంనమనoడు అత్తుముతో ఆజ్ఞాపించుసు కాని, ఎంత కఠినంగా అయులుకు ఆజ్ఞాపించుసో అంతన్న ఎక్కువగా ఆయ అoత చాటించుసు.
37
ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలుగుసు. ఆయ, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిoచకరు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు వాసితలాగా చేయకరు” అoడు సోన్నిగేటి ఇంచ్చు.