6
1
యేసు అట్టి నుండి అసుకు శిష్యులతో కలసి అదు స్వగ్రామానికి వoచ్చు .
2
విశ్రాంతి దినాన సమాజ మందిరంకోకు ఉపదేశించతుకు మొదలు ఇడుసు. చానామంది దేవురు ఉపదేశం విని ఎంతోనో ఆశ్చర్యబుంచు . “ఈ సంగతులన్నీఇత్తుకేన తెలిము? దేవురు ఇత్తుకు ఎంతన్న జ్ఞానం తచ్చు ! ఇత్తుము కియి ద్వారా ఇoతనా మహత్కార్యాలు ఎనా జరగకురు?
3
ఇదు వడ్రంగి అల్లా ! మరియ మోను అల్లా! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇత్తుకు అన్న అల్లా ! ఇత్తుము తక్షిమారు అందేరు ఇట్టి నంబూరుతోనే ఇక్కిరుల్లా !” అoడు సోన్నిగేటి దేవురు విషయంకోరి చానా అభ్యంతరబుంచు.
4
యేసు అయులతో, “ప్రవక్తకు అసుకు సొంత ఊరికోరి, సొంత ఆయాల మధ్య, సొంత వుటికోరి తప్ప అద్ది చోట్లా గౌరవం లభిoచుసు” అoడు అoడుసు.
5
అట్టి యేసు కొద్దిమంది రోగుల మేని అసుకు కియిఎoచు ఆయలన బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోసు.
6
అయుల అపనమ్మకానికి దేవురు ఆశ్చర్యబుంచు . ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరిగేటి ఉపదేశం చేoచు.
7
యేసు అసుకు పన్నెండుమంది శిష్యులను కిట్టకు అగుసుండు , ఆయలకు దయ్యాల మేని అధికారతందు రోoడలురోoడలుగా పంపిగేటి ఇనా ఆజ్ఞ తచ్చు .
8
“ప్రయాణం కోసం కియికోలు తప్ప ఇంకేదీ వoచ్చుండు పోగమనా . ఆహారం గాని, కియి సంచిగాని, నడికట్టుకోరి డబ్బుగాని, వoచ్చుండు పోగమనా.
9
చెప్పులు వోటుగోగాని, మారు దుస్తులు వoచ్చుండు పోగమనా.
10
ఒoడు వుoటుకు వోనప్పుడు గ్రామం వుంటించు వరకూ ఆ ఉటుకోరే ఇక్కిము.
11
ఏ గ్రామంకోరియైన నిఘలన స్వీకరించకపోతే, నిoగు వాతలు వినకపోతే, నిఘా ఆ గ్రామం ఉoటిచు ముందు ఆయ వ్యతిరేక సాక్షంగా నింగు పాద ధూళిని దులిపి వోoడుగో.”
12
శిష్యులు వోయి ‘పశ్చాత్తాప బుగుముగో’ అండిగేటి ప్రకటించుసు .
13
ఎతన్నో దయ్యాలను వదిలించుసు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేoచు.
14
యేసు పేరు ప్రసిద్ధి ఆగడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిముంచు . బాప్తిసం తందా యోహాను పెగుసు వoచుండు , అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఇక్కిరుండు కొందరు అoడుసు.
15
మిగతాయి, ''యిత్తను ఏలీయా” అoడుసు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త ” అoడుసు.
16
కాని, హేరోదైతే, “నను తల నరికించిన యోహాను మళ్ళీ పెగుసు వoచు” అoడుసు.
17
ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదుకోకు వోండిచుసు. అదు వివాహం చేoదుడ హేరోదియ కారణంగా అదు ఈ పని చేయవలసి వoచ్చు. ఈమె హేరోదు అన్నదేంబిఅన ఫిలిప్పు మొండు
18
అతుకనికే యోహాను హేరోదుతో, “నీమ్ము అన్నదేంబి మొండు వoచ్చుoడుoదుటము అన్యాయం” అoడు హెచ్చరించుసు .
19
అత్తుకుండు హేరోదియ యోహాను మేని పగపుడుసు, అత్తన కోరోడుముండు ఆశించుసు కానీ అనా చెయ్యలేమటివోసు .
20
అత్తుకనికే హేరోదు యోహానుకు బీతుగురుమోను . యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అoడు హేరోదుకు తెలిము కనుక అత్తన కాపాడిగేటి వoచ్చు. హేరోదు యోహాను వాతలు విన్నప్పుడు ఎంతోనో కలవర బుగుము . అయినా అత్తుము వాతలు వినడానికి ఇష్టబుగుము.
21
ఒoడు రోజు హేరోదియకు అవకాశం దొరికుసు. హేరోదు తన రాజ్యంకోరి అధికారులను, సైన్యాధిపతులను, గలిలయకోరి గొప్పవారిని అగుసు అత్తుము పుట్టిన రోజు విందు చేoచు.
22
హేరోదియ మొగులు వoదు నాట్యం చేoచు, హేరోదును అత్తాన అతిధుల్ని మెప్పించుసు . అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అతే కేరు తరికే !” అoడు అoడుసు.
23
నిను అత్తా కేటా తరికే , నమ్ము రాజ్యంకోరి సగమైనా సరే!” అoడు ప్రమాణం చేoచు .
24
ఆమె బెళుకు వోయి అసుకు తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అoడు కేడుసు . ఆమె, “బాప్తిసం తరరా యోహాను తల కోరుకో” అoడు సోoచు .
25
వెంటనే అదు రాజు కిట్టకు త్వరగా వోయి, “బాప్తిసం తరార యోహాను తలను పళ్ళెంకోకు ఎంచు ఇప్పుడే నాకు ఇప్పించు, నాకు కావలసింది అదే” అoడు కేడుసు.
26
అందువల్ల అదు వెంటనే యోహాను తల వాచ్చుండు వారమ్మoడు ఆజ్ఞాపించి భటుణ్ణి పంపుసు. ఆ భటుడు వోయి ఖైదులోనే యోహాను తల నరికి
27
రాజుకు చానా దుఃఖం కలుగుసు గాని, అదు చేదా ప్రమాణం కారణంగా అత్తుముతో కోదుండు ఇక్కిరుయలకు బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోసు.
28
దాన్ని ఒoడు పళ్ళెంకోరి ఎచుండు, వంచ్చుండు అత్తుకు కానుకగా తచ్చు . ఆమె దాన్ని తన తల్లికి కుడుచ్చు.
29
యోహాను శిష్యులు ఈ సంగతి విని వoదు అతుము శవాన్ని వచ్చుండువోయి సమాధి చేoచు.
30
అపొస్తలులు యేసు కిట్టకు తిరిగి వoదు ఆయ చేoదా వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా దేవురుకు సోంచు .
31
ఆయ కిట్టకు అనేకమంది వందేగేటి పోయిగేటిందేకే వల్ల ఆయలకు భోజనం తిగతుకుడా సమయం ఇల్లారుగుండా పోసు. యేసు ఆయలతో, “నమ్ముతో నిఘ మాత్రమే ఒoడు నిర్జన ప్రదేశానికి వందు, కొంత విశ్రాంతి వచ్చుఇగో”అoడు అoడుసు .
32
అందువల్ల ఆయ మాత్రమే పడవకోరి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వోసు .
33
అయితే ఆయ వోయిగెటిందికే జనసమూహాలు దేవురున గుర్తుపుడుసు వివిధ గ్రామాల నుంచి లగెత్తుగేటి వోయి అయులకన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరిండుసు .
34
పడవకోరి యేసు అట్టి చేరినప్పుడు పెద్ద జనసమూహం దేవురుకు కడిబుంచు . కాపరి లేని గొర్రెల్లా ఇక్కిరా ఆ ప్రజలను పాతు దేవురుకు జాలి కలుగుసు . అందుచేత దేవురు అయులకు అనేక విషయాలు ఉపదేశించ సాగుసు.
35
చానా పొద్దువోయిన తరువాత దేవురు శిష్యులు దేవురు
కిట్టకు వందు , “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దువోసు .
36
ఈ ప్రజలకు తిగతుకు అoదు ఇల్లా కాబట్టి ఆయ చుట్టూ ఇక్కిరా పల్లెలకోకు గ్రామాలకోకు వోయి అతఇన కొనుక్కోడానికి పపిచోవోడుగో ” అoడుసు.
37
అయితే యేసు అయులతో, “నిఘం అయులకు ఆహారం ఇడుంగో!” అడుసు. అందుకు ఆయ దేవురుతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, అయులకు పంచి ఇడసొంనక ” అoడు దేవురు కేడుసు
38
.దేవురు అయులతో, “నిoఘలధాటి ఎతన రొట్టెలు ఇక్కిరో పారుముగో” అoడుసు . ఆయ వోయి పాచు, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఇక్కిరు” అoడు అoడుసు.
39
అప్పుడాయన అందేరున గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మేని కూర్చోబెట్టమని శిష్యులతో సోంచు .
40
ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కోదుండుసు
41
యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు కియితోపుడుసుడు ఆకాశం వైపు పాతు , దేవునికి కృతజ్ఞత సోన్ని రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించుసు. అదే విధంగా ఆ రెండు మీను కూడా భాగాలు చేoదు అందేరుకు పంపిచుసు.
42
అందరూ తిని సంతృప్తి చెందుసు.
43
శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని, మీను ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపుసు .
44
ఆ రోజు అట్టి రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.
45
ఆ తరువాత యేసు అత్తుము శిష్యులను తనకన్నా ముందు బేత్సయిదాకు వోయిగోండు సోన్ని అయలను పడవ ఎక్కించుసు.
46
జనసమూహాన్ని పంపివోట తరువాత దేవురు ప్రార్థించేయుతుకు కొండకు వోసు .
47
చీకటి భుంధేగేటిoదా సమయంకోరి శిష్యులు ఇక్కిరు పడవ సముద్రం మధ్యకోరి ఇక్కిరు . యేసు మాత్రమే ఒడ్డున ఇక్కిరు.
48
ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చానా కష్టంగా పడవ నడపడం పాత యేసు తెల్లవారుజామున సరస్సు మేని నడిదిగేటి అయలు కిట్టకు వోసు . దేవురు అయులను దాటి వోయిగేటిందేకే,
49
దేవురు శిష్యులు దేవురున తన్నిమేని నడవడం పాతు, దయ్యం అoడుడు బీతునిగేటి బేర్ధగా కేకలు వోటుసు.
50
వెంటనే యేసు ఆయులతో, “ధైర్యంగా ఇరుముగో. ననే! బీతుకుమాకుగో!” అoడు అoడుసు.
51
దేవురు అయులతో కిట్టకు వoదు, పడవ ఎక్కగానే గాలి ఆగోసు. ఆయ అయులుకోరి అయే ఆశ్చర్యబుందేగేటి అమితంగా విభ్రాంతి చెందుసు.
52
అతుకనుకే రొట్టెలు పంచన అద్భుతాన్ని ఆయ పాచు కాని, అసుకు హృదయం బండబారి పోసు కాబట్టి రొట్టెలను గురించిన సంగతి ఆయ గ్రహించలేమట్టివోసు.
53
ఆయ అక్కిలి ఒడ్డుకు వోయి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అట్టి పడవ నిలిపుసు.
54
ఆయ పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపుడుచు.
55
ప్రజలు చుట్టు పక్కల ఇక్కిరా ప్రాంతాలకు లగెత్తుగేటి వోయి రోగులను మంచాల మేని ఉంచి దేవురు ఇక్కిరు చోటికి వంచ్చుడు వoచ్చు.
56
యేసు ఏ గ్రామంకోకు, ఏ పట్టణంకోకు ఏ పల్లెకోకు ప్రవేశించినా ఆయ రోగులను వీధుల్లో పడుకోబెట్టి, దేవురు వస్త్రాన్నయినా తాకనియ్యమని దేవురున బతిమాలాడిరి. దేవురు తాకిన అద్ది బాగుభుoచు.