అద్యాయం - 21

1 నంగులు అయిలున ఉట్టుటు ఓడ ఏరి నేరుగా ఓయి కోసుకు,మరునాడు రొదుకు,అటి నుంచి పతర రేవుకు వందు కీరో. 2 అటి పేనీకే బయలు దేరక్కురు ఒండు ఓడును పాతు అత్తు కోరు ఓనో. 3 అది మీన ఓగందిగా కుప్ర ఇంగురు ఊరూ కండు బూచ్చు అత్తుకు కుడి పక్కుకు ప్రయాణము సేందొ, సిరియ జాయి ఓయి,తూరుకో దిగిజు కీరో. అటి ఓడు కోరిక్కూరు సరుకు వంగురిధు యించు. 4 నంగులు అటిక్కురు శిష్యులను కలుసుగుండు అటి ఏగు దినాంగ్లు కీరో. అయిలు ఆత్మ ద్వారా నీను యెరూసలేము కోరూ కాలు ఎక్కిమాన ఇండు పౌలోటి సొన్నుసు. 5 ఆ దినాంగులు అయి పోయి నప్పుడు నంగులు ప్రయాణము సేందప్పుడు అయి లడ్డేరు పొండు మక్కులొటి వందు నంగులున ఊరు గడ్లి వరుకు సాగనంప్పుసు.అయిలు,నంగ్లు సముద్ర తీర మంచి మోకాలుమీని ప్రార్థన సేందు ఒండాలచ్చుండు ఇక్కోండాలంచి సెలవు వంక్కుండో. 6 నంగులు ఓడ ఏరి నప్పుడు అయిలు అస ఊటుకు తిరిగి ఎల్లిపోసు. 7 నంగ్లు తూరునుంచి ప్రయాణము సేందొ, తోలేమాయి వందు,అటిక్కురు విశ్వాసులోటి వాచ్చికీరో అయిలచ్చి ఒండు దిినము కీరో. 8 మరునాడు బయలుదేరి కైసరయకు వందు కీరో,అపోస్తులులు నిప్పించిక్కురు ఏగు మంది కోరు ఓండాలు సువార్తికుడు ఫిలప్పు ఊటచ్చుకు వందు అదోటి కీరో. 9 ప్రవచన వరము ఇక్కురు నాలు ఫుల్లు మార్లు అత్తుకు కీదు. అయి లడ్డేరు కన్నికులు. 10 నంగులు అటి చాలా దినాంగులు కీరో.అగబు ఇంగురు ఒండు ప్రవక్త యూదాయ కోరుండు వంచు. 11 అదు వందు పౌలుట నడికట్టు వంకుండు,అదోటి ఆస కీయిలను కాళ్ళును కట్టుగుండు యెరూషలేము కోరిక్కురు యూదులు ఈ నడికట్టు ఇక్కురు మొనుసున ఇన్నుగ బందించి యూదా జాతి అల్లారాయి కీయిలుకు అప్పగించాదిండు పరిశుద్దాత్మ సోన్నక్కి దిండు సొన్నుసు. 12 ఈ వాతులు కేటప్పుడు నంగ్లు, అటిక్కురాయ యెరూషలేముకు ఓగు మానాయిండు పౌలును బ్రతిమాలు గుండు కీరో. 13 కానీ పౌలు,ఇదేేందాదు?నింగ్లు అగుదు నట గుండెను బద్దలు సేయక్రంగా?నాను ప్రభు యేసు నామం నిమిత్తము యేరూసలేము కోరు బంధ కాలుకు మాత్రమే అల్ల,సొత్తో గిత్తుకు సిద్దంగా కీరి ఇండు సొన్నుసు. 14 అదు ఈవాతులు అంగీకరించ్చిల్లా నంగ్లు ప్రభుచిత్తం జరుగ బేకిండు సుమ్మా కీరో. 15 ఆ దినాంగులు అయిపోయి నప్పుడు నంగులుకు బేకాసిక్రు సామాను ఎత్తు గుండుయేరుసలోముకు ఎల్లిపోనో. 16 కైసరయ కోరుండు కొంతమంది శిష్యులు నంగ్లోటి వందు నంగులున మ్నాసోను ఇంగురు అస ఊటుకు అసుకుండు ఓసు.మిన్నీ,విశ్వాసముగా ఇక్కురాయకో యిదు ఓండు. 17 నంగులు యేరుసలేముకు వందప్పుడు విశ్వాసులు నంగులున సంతోసమొటి అసుగుంచు. 18 మరునాడు బెరుమోనుసు లడ్డేరు అటుకు వందు కీదు పౌలు కూడా నంగ్లోటి యాకోబు ఇంగురాలచ్చుకు వంచు. 19 అదు అయిలున ఎన్నగ కీరంగా ఇండు కేకుసు,అస పరిచర్యా వలన దేవురు యూదా జాతి అల్లారాయ కోరు సేందిక్రిత అయిలికి వివరముగా సొన్నుసు. 20 అయిలు కేటు దేవురున మహిమ పరుసుసు అత్తునుపాతు -సోదరా,యుదులు కోరు దేవురును నమ్ముగుండిక్కురాయ ఎత్తన వేలమంది కీదో పాకక్కిరల్లా?అయిలడ్డేరు దర్మశాస్రము నందు ఆశ ఇక్కురాయ. 21 యూదా జాతి అల్లారాయ కొరిక్కురు యూదులు అస మక్కులుకు సున్నతి సేయమానంగా ఇండు,నంబుట ఆచారప్రకారం నర్దుగూడుదు ఇండు, నీను సొన్ని కీరా యిండు అయిలడ్డేరు మోసేను ఉట్టుడు బేకిండు నీను సొన్నక్ర ఇండు అయిలు నిన్ను గురించి కబురు కేటు గుండు కీదు. 22 కాబట్టి నమ్రు ఎంచేయంబు?నీను వందిక్కురు విసయము అయిలు ఖచ్ఛింతంగా కేటు గుండిక్కాదు. 23 కాబట్టి నంగ్లు నీకు సొండ్రు తీరి సెయి. మ్రొక్కుబడి ఇక్కురు నాళాలు మొనుసులు నంగలచ్చి కీదు. 24 ఈయిలున నిన్నోటి ఆసుగుండుపో. అయిలోటి కలసి సుద్ది సేందుగో. అయ్య తలకాయ మెగురు వంగిచ్చు గిత్తుకు ఆగురు లక్కకుడు.అన్నగ సేందిగా నిన్ను గురించి కేటిక్కుదు నిజము అల్లా ఇండు అడ్డేరు తెలుజుగాదు. 25 అయితే విశ్వసిచ్చక్కురు యూదా జాతి అల్లారాయ విసయము కోరు అయిలు విగ్రహములకు అర్పించిక్కురు రగుత గొంతు పిసికి కొండ్రోడిక్కుత,జారత్వమును ఉట్టూడు బేకిండు నిర్ణయం వంకుండు కీరో ఇండు రాసి కీరో ఇండు సొన్నుసు. 26 పౌలు మరునాడు ఆ మొనుసులును పెరుగోటి అసుగుండు ఓసు,అయిలోటి కూడా శుద్దిసేందుగుండు,గుడికోకు ఓసు,అయిలుకో ప్రతి ఓండాలు కొరకు అర్పించువరుకు శుద్ధిదినములు నెరవేర్చంబు యిండు సొన్నుసు. 27 ఏగునాలు పూర్తి ఆగార్ధు మిన్నే ఆసియాకోరుండు వందిక్రు యూదులు గుడికోరు అత్తును పాతు,అయిలు జనాంగ్లున పురికొలిపి పౌలును బందిక్కుసు. 28 ఇశ్రాయేలు జనాంగు లారా!నంగ్లోటి సహకరించంగో. ఇదు అడ్డి ప్రాంతాలు తిరుజు ఇశ్రాయేలు జనాంగ్లు గురించి,మోసె దర్మశాస్రమును గురించి యెరూషలేము కోరిక్కురు గుడినిగురించి వేరుగా అడ్డేరుకు సొన్నికీదు. ఇప్పుడు గ్రీకాయలన కొంతమందిన గుడికోకు అసుకుండు ఓయి,ఈ పవిత్ర స్థలమును ఆపవిత్రం సేందుసు. ఇండుగట్టిగా సొన్నుసు. 29 ఎపేసు ఇంగురు త్రోపీము అత్తుకు మిన్నే పౌలొటి కలిసి ఇక్కురుదు అయిలు పాకుసు కాబట్టి పౌలు అత్తున గుడికోకు అసుగుండు వంచిండు అయిలు బావించుసు. 30 పట్టణమడ్డి గలిబలిగా కీదు.జనాంగ్లు గుంపులు గుంపులుగా ఉరుకెత్తుగుండు వంచు,పౌలును పుడుసుగుండు గుడికోరుండు గడ్డికి ఇగుతూటు వాకిలి మూసోడుసు. 31 అయిలు అత్తును కొండ్రోడిత్తుకు ప్రయత్న సేందుసు. యెరూషలేము నగరము అడ్డి అల్లరల్లరిగా కీదిండు సైన్యాదికారికి సామాచారము వంచు. 32 అదు సైనికులున,శతాదిపతిన పెరుగోటి ఆసుకుండు అయిలచ్చుకు ఉరికెత్తుగుండు వంచు. అయిలు ఆ అధికారిని,సైనికులును పాతు పౌలును మొతురుదు ఆపుసు. 33 అదు వందు పౌలును పుడుసుగుండు,రెండు గొలుసోటి అత్తును బందించంగో ఆజ్ఞ కుడుకుసు, ఇదేదు?ఎందాదు సేందుసు ఇండు కేకుసు. 34 అయితే జనము కేకులు ఓడందిగా అల్లరిగా యిందిగా అత్తుకు నిజము తెలుసుగుదు కష్టమాసు పౌలును కోటకోకు ఆసుగుండు పోంగు ఇండు ఆజ్ఞ కుడుకుసు. 35 పౌలు మెటికీలు మీనుకు వందప్పుడు జనాంగ్లు గుంపులుగా పోగాయి దాడి సేయింగ వంచు సైనికులు అత్తును పెచ్చుకుండు వంచు. 36 ఎందాతుకు ఇండిగా అత్తును కొండ్రోడు బేకిండు ఆ జనము కూతోటు అయిలు బెరుగోటి వంచు. 37 అయిలు పౌలును కోటకొకు అసుగుండు ఓగందగా అదు ఆ సేనాధిపతిని నాను నిన్నొటి ఒండు వాత సొన్నచ్చ?ఇండు కేకుసు. అత్తుకు అదు నీకు గ్రీకు బాష గోర్త?. 38 అత్తుకు మిన్నే నాలుగు వేలమంది యుద్ధము సేయురాయలును అడివికోకు అసుకుండు ఓయిక్కురు ఐగుప్తు మొనుసు నీనె?యిండు కేకుసు. 39 అత్తుకు పౌలు,నాను కిలియకోరు తార్స్ ఊరుకు సెంద్ధిక్రు యూదుడను. ఒండు మహా పట్టణపు పౌరుణ్ణి. నాకు ఈ జనాంగ్లోటి వాచ్చిత్తుకు అవకాశము తా ఇండు నిన్ను కేటగక్కిరి ఇంగుసు. 40 అత్తుకు అదు అనుమతి కుడుకుసు. అప్పుడు పౌలు మేటికీలు మీని నిలుబూదు జనాంగులుకు కియ్యేటి సైగ సేందుసు. అయిలు నిమ్ములుమాసు అదు హెబ్రీ బాష కోరు ఇన్నగ సొన్నుసు.