Chapter 17

1 వారు అంఫిపోలి, అపోల్లోనియ పట్టణాలమీదుగా థెస్సలోనీక పట్టణానికి వచ్చారు.అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను.పౌలు తన అలవాటు 2 ప్రకారం అక్కడికి వెళ్లి మూడు విశ్రాంతి దినాలు లేఖనాలలో నుండి వారితో తర్కించాడు. 3 క్రీస్తు హింసలు అనుభవించిన తరువాత మృతులలో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను తెరిచి వివరించెను.నేను మీకు ప్రకటించే క్రీస్తే యేసు అని వివరించెను. 4 కొంతమంది వ్యక్తులు ఆ మాటలను అంగీకరించి పౌలు సీలల తో కలిశారు,వారిలో భక్తి పరులైన గ్రీకువారు,చాలా మంది ప్రముఖమైన ఆడవారు ఉన్నారు. 5 అయితే ఆ బోధకు సమ్మతించని యూదులు అసూయతో నిండిపోయి,ఊరిలో తిరిగే కొంతమంది పనికిరాని పోకిరి వాళ్ళను వెంటతీసుకుని పోయి,సమూహముగా కూడి పట్టణమంత పెద్దగా అల్లరి చేస్తూ,యాషోను ఇంటి 6 మీద పడి పౌలు,సీలలను జనం మధ్యకు తీసుకుని వెళ్లాలని అనుకున్నారు.అయితే వారు కనబడక పోయేసరికి,అక్కడున్న యాషోనును మరికొంత మంది సహోదరుల్ని ఆ పట్టణ అధికారుల దగ్గరకు ఈడ్చుకునిపోయి,భూలోకాన్ని తలక్రిందులు చేసిన వీరు 7 ఇక్కడికి కూడా వచ్చారు,యాషోను వీరిని తన ఇంట్లో పెట్టుకొనెను.వీరంత యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ,కైసరు చట్టాలకు విరోదంగా నడుచుకుంటున్నారూ అని కేకలు వేసెను. 8 ప్రజలు,అధికారులు ఈ మాటలు విని అనదోళనపడ్డారు. వారు యాషోను దగ్గర,మిగతా వారి 9 దగ్గర జామిను తీసుకొని విడుదల చేసెను. 10 శిస్యులు పౌలు అదే రాత్రి సీలతో కూడా బెరయ ఊరికి పంపించెను. వారు వచ్చి సమాజ మందిరములోకి వెళ్లెను .వీరు థెస్సలొనీకలో ఉన్న వారి 11 కంటే చాలా ఉద్దాతమైన మనసు గలవారు.ఎందుకనగా వీరు శ్రద్ధతో వాక్యాన్ని అనుసరించు వారు పౌలు సీల చెప్పిన లేఖనాలు అలా 12 ఉన్నాయో లేదో తరచు తర్కిస్తూ వచ్చెను.అందుచేత వారిలో చాలామంది నమ్మారు.ప్రముక గ్రీకులలోకూడా చాలా మంది విశ్వసించారు. 13 అయితే పౌలు బెరయ లో కూడా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని థెస్సలొనీకలోని యూదులు తెలుసుకొని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రేపి 14 కలవరపరిచారు.వెంటనే శిస్యులు పౌలును సముద్రం వరకు పంపారు. సీల,తిమోతీలు అక్కడే ఉండిపోయారు.పౌలును సాగనంపడానికి 15 వెళ్లిన వారు అతనిని ఏథెన్సు వరకు తీసుకుని వచ్చారు.సీల ,తిమోతి సాధ్యమైనంత త్వరగా తమ దగ్గరకు రావాలని,పౌలు వారిని పంపెను. 16 పౌలు ఏథెన్సు వారికోసం ఎదురుచూస్తున్నాడు.అయితే ఆ పట్టణం లో ఉన్న విగ్రహాలను చూసిన తరువాత పౌలు హృదయం బహు పరితపించి పోయెను. 17 అందుచేత సమాజ మందిరములోను,దేవునిని ఆరాధించే వారితోను,అంగడి వీధుల్లో తనను కలిసికొనే వారితోను ప్రతిరోజు చర్చిస్తూ వున్నాడు. 18 ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు.కొంతమంది, ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి అని చెప్పుకున్నారు.అతడు యేసును గూర్చి,చనిపోయినవారు తిరిగి బ్రతకడం గురించి ప్రకటించాడు కాబట్టి మరి కొంతమంది, ఇతడు మనకు తెలియని దేవుని గురించి ప్రచారం చేస్తున్నాడు అని చెపుకొనిరి. 19 వారు అతనిని తీసుకుని అరేయొపగు అను సభ యొద్దకు తీసుకునిపోయి,నీవు చెప్తున్న ఈ కొత్త కధ మేము తెలుకోవచ్చునా?అని నీవు కొన్ని వింత మరియు 20 తెలియని విషయాలు మాకు వినిపిస్తున్నావు.అందుచేత వీటి భావమేమిటో మాకు తెలుసుకోవాలని ఉన్నది అని చెప్పెను.ఏథెన్సు 21 వారు,మరియు విదేశీయులు ఎదో ఒక కొత్త విషయం చెప్పడంలో,వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు. 22 పౌలు అరేయొపగు సభనుద్దేశించి' ఏతెన్సు వారలరా ,మీరు అన్నీ విషయాల్లో చాలా భక్తి పరులని నేను గమనిస్తున్నాను. నేను మార్గమున పోవుచుండగా మీరు పూజించే వాటిని 23 చూసినప్పుడు,అక్కడ నాకు ఒక బలిపీఠం కనబడెను.అయితే దాని మీద 'తెలియని దేవునికి' అని రాసి ఉండెను.కాబట్టి మీరు తెలియకుండ దేనిని ఆరాదిస్తున్నారో దానినే మీకు తెలియజేయుచున్నాను. 24 ప్రపంచాన్ని దానిలోని సమస్తాన్ని కలుగజేసిన దేవుడు,తానే ఆకాశానికి, భూమికి ప్రభువు కాబట్టి చేతితో చేసిన ఆలయాలలో నివశింపడు, ఆయన అందరికి 25 ప్రాణమును తక్కిన వాటన్నిటినీ దయచేసినవాడు. కాబట్టి మనుషులు తమకు ఏదోఒక అవసరం ఉన్నట్టుగా చేతులతో చేసే సేవలను ఆయన అంగీకరించడు. 26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతట నివశించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించెను మరియు నివశించడానికి 27 సరిహద్దులను నియమించేను.అందుచేత వారు దేవుణ్ణి వెతికి కనుగొనాలి నిజానికి ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. 28 మనం ఆయనలో నివసిస్తున్నాం ,గనుక మన ప్రతి అవసరత ఆయనలో ఉన్నది . మనమాయన పిల్లలమని ఇదివరకే మనతో కొంతమంది చెప్పియున్నారు 29 .కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనానైపుణ్యాలతో,చెక్కిన బంగారు,వెండి,రాతిబొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు. 30 ఆ అజ్ఞాన సమయములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను.ఇప్పుడైతే అందరు పశ్చాత్తాప పడాలని అందరికి ఆజ్ఞాపించెను.ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చాలని ఒక 31 రోజు నిర్ణయించెను. మృతుల్లో నుండి ఆయనను లేపినాడు కాబట్టి దీనిని నమ్మడానికి అందరికి ఆధారం కలుగజేసేను. 32 మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి వారు విన్న పుడు,వారిలో కొంతమంది దానిని 33 ఎగతాళి చేసారు .ఇంకొంత మంది దానిని గూర్చి మరలా వింటామని అడిగారు ,అంతట పౌలు వారి దగ్గరనుండి వెళ్లి 34 పోయెను.అయితే కొంత మంది వారితో చిరి విశ్వసించారు,వారిలో అరేయొపగీతు వాడైన దియొనూసియ,దమరి అనే ఒక స్త్రీ, వీరితోపాటు మరికొంత మంది వున్నారు.