అధ్యాయము 2

1 సోదరీ సోదరులారా, నాను నింగ్లచ్చుకు వందు దేవురుట మర్మము గూర్చి భోదసేందప్పుడు మాటకారితన మును ఇల్లాదిందిగా గొప్ప తెలివిని ఉపయోగించిల్లా. 2 నింగ్లోటి ఇక్కురు సమయముకో నాను యేసుక్రీస్తును తప్ప, సిలువను అనుభవించిక్కురు యేసు క్రీస్తును తప్ప, మరి ఏత్తును తెలి సి ఇక్కుకూడుదిండు తీర్మానించుగుండి కీరి. 3 బలహీనుడుగా, భీతోటి, వణుకుగుండు నింగ్లచ్చి గడిపికీరి. 4 నింగుట విశ్వాసం మొనుసులుట జ్ఞాన ము మేని అల్లా, దేవురుట శక్తి మేని ఆధారుబూదు ఇక్కిభే కిండు నట ఆశ. 5 అత్తుకు నాను వాచ్చిగా, సువార్త ప్రకటించ గా, జ్ఞానమోటి నిండిక్కురు తీపి వాతలు వాచ్చారుగుండా, పరిశుద్దాత్మ, శక్తినే ప్రదర్శించికీరి. 7 ఆధ్యాత్మిక పరిణితి ఇక్కిరాయికి జ్ఞానమును భోదించక్కిరి. అది ఈ లోకానికి సెందిక్కురు జ్ఞానము అల్లా, వ్యర్థమాగురు ఈ లోకముకోరిక్కురు అధికారులుట జ్ఞానము అల్లా. 7 అది దేవురుట రహస్య సత్యము కోరిక్కురు జ్ఞానము. ఈ మరుగుగా ఇక్కురు జ్ఞానమును దేవురు లోకము ఉనికి కోకు వారార్తుకు మినిగల్లే నంబురుట ఘనత కోసం నియ మించు కీదు. 8 అత్తు గురించి ఈ యుగానికి సెందిక్కురు లోకాధి కారులుకోరు ఏత్తుకు తెలిమాదు. అది అయిలుకు తెలిసి ఇందిగా మహిమ స్వరూపి అయిన ప్రభువును సిలువ ఓడు రాయ అల్లా. 9 అత్తును గురించి 'దేవురు తనను ప్రేమించు రాయిలుకోసం ఎందాత సిద్ధపరచుకీదో అయి కన్నుకు కండు బూగుమాదు, చెవికి వినుభూగుమాదు, మొనుసుట హృద యం ఊహకు అందమాదు' యిండు రాసి కీదు. 10 నంబురుకు ఆసా దేవురు అయిలున అస ఆత్మ ద్వారా బయలు పరుసుసు. ఆ ఆత్మ అడ్డిన, చివరికి దేవురుట లోతుగా ఇక్కురు రహస్యాలను కూడా పరిశోధిం చాదు. 11 ఒండు మొనుసుట విషయాలు ఆ మొనుసుకోరిక్కు రు ఆత్మకే తెలియాదు గానీ ఇంకొండాలుకు ఎన్నగ తెలాదు? అన్నగే దేవురుట విషయాలు దేవురుట ఆత్మకు తప్ప మరి ఏత్తుకు తెలిమాదు. 12 దేవురు నంబురుకు ఉచితంగా దయసేందిక్కు రుత తెలిజుగిత్తు కోసం నంబురు లౌకికాత్మను అల్లా దేవుర చ్చుండు వందిక్కురు ఆత్మను పొందికీరో. 13 అయిలున నంగ్లు మొనుసు జ్ఞానం సొన్నురు వాతలోటి అల్లా ఆత్మసంబంధ మైన అయిలోటి సరిసేందుగుండు, ఆత్మ కెప్పిక్కురు వాతు లోటే భోదించక్కురో. 14 ఆత్మ సంబంది అల్లారు మొనుసు దేవు రుట ఆత్మ విషయాలును అంగీకరించుమాదు. ఎందాతుకు ఇండిగా అయ అత్తుకు బుద్ధిహీనంగా కండుబూక్కుదు. అ యిలున అధ్యాత్మికంగానే వివేచించాకో. కాబట్టి అదు అయి లున గ్రహించుమాదు. 15 ఆత్మ సంబంది అయిక్కురు మొనుసు అడ్డిన సరిగా అంచనా ఓడాదు గాని అత్తును ఏదూ సరిగా అంచనా ఓడుమాదు. 16 ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఏదు ఉపదేశించాదు? నంబురుకు ఆసా క్రీస్తు మనసు కీదు.