మనం చేసే నీతి క్రియలు రహస్యంగా ఉండాలి (6:1-4).
రహస్యంగా చేసే ప్రార్థన తండ్రి వద్దనుండి ప్రతిఫలం పొందుతుంది (6:6).
మన తండ్రికి మన అక్కరలు ఏమిటో తెలుసు గనుక ప్రార్థనలో విస్తారమైన మాటలు పలుకవద్దని యేసు చెప్పాడు (6:7-8).
తండ్రి చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టుగా భూమియందును నెరవేరాలని ప్రార్ధించాలి (6:10).
మన ఋణస్తులను మనం క్షమించకపోతే దేవుడు మన ఋణాలను క్షమించడు (6:15).
మనం ఉపవాసం చేస్తున్నట్టు ఇతరులకు కనబడేలా కాక, రహస్యమందున్న తండ్రికి కనబడేలా చేస్తే తండ్రి ప్రతిఫలమిస్తాడు (6:16-18).
పరలోకంలో మన నిధి దాచుకోవాలి. ఎందుకంటే అది నాశనం కాదు, దొంగలు దోచుకోరు (6:19-20).
మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది (6:21).
దేవుడు, సంపద అనే ఇద్దరు యజమానులలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలి (6:24).
ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని మనం చింతించకూడదు. ఎందుకంటే, పక్షులను పట్టించుకొనే దేవుడు వాటికంటే శ్రేష్టమైన మనలను మరింత ఎక్కువగా పట్టించుకుంటాడు (6:25-26).
మనం చింతించడం వల్ల ఒక మూర ఎత్తు పెరగలేమని యేసు గుర్తు చేస్తున్నాడు (6:27).
మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటగా వెదకాలి. అప్పుడు మన భూలోక అవసరాలు మనకు అనుగ్రహించబడతాయి (6:33).