Chapter 7
1
ఈ సంగతి జరగ్తే తరవాతే భూమి నాలు దిక్కుకీను నాలువూరు దేవదూత నిల్లి మందటం నన్న ఊడ్తాను.ఓరు భూమితే పొర్రో నాలు దిక్కుకీను నుంచి తోలాను గాలి తోలకుంట బలంగా అడ్డుకుట్టోరు.అందువల్ల భూమితే పొర్రో గాని,సముద్రాతే పొర్రో గాని,బేను మారాతే పొర్రో గాని గాలి వాదటాంపు ఇల్లే.
2
మల్లోర్రో దూత తూర్పు దిక్కు నుంచి పొరోట్కు తేదటం నన్న ఊడ్తాను.ఓనికి బతికి మందాని దేవుటే ముద్ర మిందే.భూమిత్కు సముద్రాత్కు కీడు తుంగనాంకి అవకాశం మందాని నాలువురు దూతకీను తోటే ఓండు పెద్దగా
"
3
మమ్మ మా దేవుటే దాసుర్కీను నుదుటే పొర్రో ముద్ర వాటనచ్చో జేపు భూమిత్కు,సముద్రాత్కు,మారాకు,బేలోంటే కీడు తున్గొద్దు" ఇత్తోండు.
ఇశ్రాయేలు నౌటే మిగిలి మందాని లెక్క
4
ముద్ర పొందిమందనోరు లెక్క కెత్తనస్కే నన్న కేంజతాను.ఇశ్రాయేలు అన్ని గోత్రాకీను ముద్ర పొందతోరు లెక్క 1,44,000.
5
గోత్రాను సొప్పున ముద్ర పొందతోరు లెక్క.యూదా గోత్రాతే 12,000,రూబేను గోత్రాతే 12,000,గాడు గోత్రాతే 12,000,
6
ఆషేరు గోత్రాతే 12,000, నఫ్తాలి గోత్రాతే 12,000, మనష్షే గోత్రాతే12,000,
7
షిమ్యోను గోత్రాతే 12,000, లేవి గోత్రాతే 12,000, ఇస్శాఖారు గోత్రాతే 12,000,
8
జెబులూను గోత్రాతే 12,000, యోసేపు గోత్రాతే 12,000, బెన్యామీను గోత్రాతే 12,000. గొప్ప బాధాను కాలంతే నుంచి వత్తే.అన్యుర్కు.
9
ఆ పెరికె సింహాసనం మున్నె,గొర్రెపిల్లాతే మున్నె గొప్ప జనుర్కీను గుంపు నిల్లి మందటం నన్న ఊడ్తాను.ఈరీను లెక్క వాటనాంకు బేనోంకు గూడ వల్ల అయ్యో.పతి వంసాతే నుంచి పతి గోత్రాతే నుంచి,భూమితే పొర్రో మందాని అన్ని భాష తిరియనోరు నుంచి మనుసుర్కు మిందోరు.
10
ఈరంతా కలియి "రచ్చన సింహాసనం పొర్రో కుద్ది మందాని మా దేవుట్కు,గొర్రెపిల్లత్కి చెందీతే," ఇంజో దిక్కు పైసిదాయనాటే కెత్తోరు.
11
దేవదూత అంతా సింహాసనం సుట్టూ,పెద్దకీను సుట్టూ, ఆ నాలు జీవ్కీను సుట్టూ నిల్లి మిందోరు.ఓరంతా సింహాసనం మున్నె బోర్ల అరిసి ఓరు మొకోకు నేల్దే ఆనిస్సి
12
"ఆమెన్! మా వుట్కికీర్తి,మహిమ,గేనము,వందనాకు,గొప్పతానము,అధికారము,గొప్ప బలము బెస్కేటికి కలిగితాకు గాక"ఇంజో కెచ్చోరు దేవుటీను పూజిస్తోరు.
13
అస్కె ఆ పెద్దకీనౌటే ఒరోండు "తెల్లాటే గుడ్డ కెరిసి మందాని ఈరు బేనోరు?బెగ్గ నుంచి వత్తోరు?" ఇంజో నానీను తలపతోరు.
14
దానికి నన్న "అయ్యా,నీకే ఎరకా" ఇంజో కెత్తాను.అస్కె ఓండు నాతోటే ఈల కెత్తోండు,"ఈరంతా గొప్ప బాధకీను నుంచి వత్తోరే.ఈరు గొర్రె పిల్ల నెత్తూర్ తోటే ఓరు గుడ్డ ఉక్తోరు.వాన్టీను తెల్లగా తుంగతోరు
15
అందకాడే ఓరు దేవుటే సింహాసనం మున్నె మంజి పయాలు ముల్పే తేడా ఇల్లకుంటా ఓని గుడిదాగా ఓనికి సేవ తుంగో మిందోరు.సింహాసనంతే పొర్రో కుద్ది మందాని ఓండు ఓరు పొర్రో ఓనికి లోత్తీను ముచ్చి తోండు.
16
ఓరికి ఇంకా కరువు గాని ఏదమ్ము గాని వర్రో.ఎద్ది గాని గాడ్పు గాని ఓరికి తగలో.
17
బారిత్కు సింహాసనం మజ్జేతే కుద్ది మందాని గొర్రెపిల్ల ఓరికి గొల్లాలుగా మంతోండు.బతికిస్సాని ఏత్తే ఊటనగ్గ ఓరీను నడిపిస్సితోండు.ఓరి కండుకీను నుంచి కారాను పతి కండేరుసుక్కతీను ఓండే ఉమ్మితోండు."