1 దాదాపు అదే కాలంకోరు రాజైన హేరోధు సంఘముకో ఇక్కురు కొంతమందిని బాధేక్కింగా బలంవంతన పూడుసుగుంచు. 2 యోహాను తోబుటైన యాకోబును కత్తోటి కొండ్రోడుసు. 3 ఇదు యూదులకు నచ్చుకీదిండు తెలుజుగుండు పేతు రును కూడా పుడుసుగుంచు. 4 అత్తును పుడుసుగుండు జైలుకోకు ఓటిక్కుసు. పస్కా పండుగ అయి పోయినప్పుడు జనంగలచ్చుకు అత్తును అసుగుండు అదు బేకిండు ఆలోచన సేందికీదు,అత్తుకు కావలిక్కినంగా నాలాలు సైనిక దళలును నియమిక్కుసు. 5 పేతురును జైలుకోరు ఎచ్చి కీదిండు,సంఘము అత్తు కొరకు ఎక్కువ ఆశక్తి ఇందు దేవురుకు ప్రార్థన సేయక్కుదు. 6 హేరోదు అత్తును గడ్లికి కూటుగుండు వారుబేకిండు ఇందిగా ,ఆ నామారే పేతురు రెండు బేడీలోటి కట్టోటి రెండలు సైనికులు మధ్య కోరు వరుగోసు, మల్లా కావిలిక్కురాయ వకిలిమినిగల్లీ జైలుకు కావాలి ఇంచు. 7 ఇద్ధోప్రభు దూత అదంచుకు వందు నిలుబుచ్చు,అదిక్కురు అయులు కోరు వెలుతురోటి నిండుపోసు. దూత పేతురును తట్టి బిరీన ఎద్దిరు ఇండు సోన్ని అత్తును ఎద్దుపించూసు బేడీలు అస కీయులుండు ఊడుపోసు. 8 అప్పుడు దూత అదోటి నీను నడుము కట్టుగుండు సెరువులు ఓటుకోయుండు సోన్నుసు. అదు అన్నగా సేందప్పుడు దూత నిట బట్టను మేనిఓటుగుండు నంబేరుగోటి భా ఇండు అదోటి సోన్నుసు. 9 అదు గడ్లికి వందు దూతోటి ఓసు, దూత అసుగుండు వందిక్కురు నిజంగా జరిక్కిదిండు తెలుసుగిల్లా,అత్తుకు దర్శనము వందికీదిండు ఇండుగుంచు. 10 మిన్ని కావిలిక్కురాయన రెండోవ కావిలిక్కురాయన దాటి గుండు ఊరుకోకుఓసు ఓయు ఇనుము వాకిలచ్చుకు వందప్పుడు అత్తుకు అదే అయులుకు తెర్జుగుంచు. 11 పేతురుకు తెలివందు ప్రభువు అదు దూతను అంపూటు హేరోధు కీయ కోరుండు,యూదులను జనంగుము నమ్మిని ఎచ్చు గుండుక్కురు చెడు ఉద్దేశాలడ్డి నుండి నన్ను తపించు కీదిండు ఇప్పుడు నాకు నిజంగా తెలుజు గుండికీరి. 12 ఇన్నగా ఆలోచించుగుండు అదు మార్కు ఇంగురు పేరు ఇక్కురు యోహాను అమ్మ మరియా ఊటుకువంచు,అటి అడ్డేరు కలుసుగుండు ప్రార్థన సేయక్కుదు. 13 అదు వాకిలచ్చి ఇందు వాకిలిను తట్టిందిగా,రోద అను ఓండు సిన్నాదు కేకింగా వంచు. 14 అయమ్మ పేతురు స్వరమును గుర్తు పుడుసు కీదు,సంతోషమోటి వాకిలి వంగారు గుండ ఉల్లికి ఉరికెత్తు గుండు ఓయు-పేతురు వాకిలచ్చి నిలుభూద కీదిండు సోన్నుసు. 15 అత్తుకు అయులు నీను 'పిచ్చియమ్మ ఇంగుసు!'అత్తుకె అదు సోన్నిక్కిదు నిజమిండు అయమ్మ ఖచ్చితంగా సోన్నప్పుడు అయ అస దూత ఇంగుసు. 16 పేతురు ఇంకను వాకిలిని మొతందిగా అయ వాకిలిని వంగి అత్తును పాటు ఆశ్చర్యపోసు. 17 అదు సుమ్మా ఇరంగో ఇండు అయు లికి సోన్నుసు,ప్రభువు అత్తును జైలుకోరుండు ఎన్నుగా అసుగుండు వంచో అయులికి వివరంగా సాన్ని యాకోబుకును అణా తెమ్మినాయుకి ఈలడ్డి సోన్నోగు ఇండు సొన్ని గడ్లికి ఓయు ఇంకొండు స్థలముకు ఎల్లిపోస్. 18 తెల్లారినప్పయూ పేతురు ఎందాసోఇండు సైనికులుకోరు జరిగిక్కురు గలిబిలి ఇత్తనా అత్తునా అల్లా. 19 హేరోదు అత్తుకోసరాము దేవినప్పుడు అదు కండుబుగిల్లా కావిలిక్కురాయన విచరించి కొండ్రోడ్రంగోఇండు సోన్నుసు.అప్పుడు హేరోదు యూదయ నుండి కైసరాయకు ఓయు అటి ఇంచు. 20 తూరియులమీదను సిదోనియులమీదను అత్తుకు దండిగా రాసు వంచు కాబట్టి అయులు ఒండేమనుసోటి రాజంచుకు వందు అంత:పురమునుకు మేని విచారణ చేయరాలగు బ్లాసును అయిలిజాయ కూటు గుండు సమాధానము బుగు బేకిండు కేటుగుంచు,ఎందాతుకిండిగా రాజు యొక్క దేశము కోరుండు అస దేశమునకు దావ్యము వారంచు. 21 సోన్నిక్కురు దినమందు హేరోదు రాజబట్టలు ఓటుగుండు న్యాయపీఠము మీని కొందుగుండు అయులిమిన్ని ఉపన్యాసం సేయందిగా. 22 జనాంగులు ఇదు దేవురుట స్వరమే గాని మొనుసులుట స్వరము అల్లా ఇండు కేకోడుసు. 23 అదు దేవురున మహిమ పరిచిల్లా అత్తి కె ప్రభువు దూత అత్తును మొతూసు పురుగులు బూదు పాన్తు ఉట్టూడుసు. 24 దేవురుట వాక్యము అంతు కాంతుకు వ్యాపించుగుండు ఓసు. 25 బర్నబాయు సౌలును అస పరిచర్య సేయుదు అయు పోయినప్పుడు మార్కు అను పేరిక్కూరు యోహానును పెరు గోటి అసుగుండు ఓయు యెరూషలేముకోరుండు తిరిగి వంచు.