అధ్యాయము 1

1 తీయోఫియా యేసు అదు ఎన్నుగుండిక్కురు అపొస్తలుల కు పరిశుద్దాత్మొటి ఆజ్ఞకురథప్పుడు 2 తరువాత అదు పరలోకంకోకు హీరోహణము అయిక్కురు డినంవరకు అదు సేందికుదు,బోధించిక్కుదు అడ్డి నట మిన్నీ గ్రంద్దం కోరు రాసికిరి. 3 అదు బాధ బూదిక్కిరు తరువాత నాబిది దినములు పాటు అయిలికి కాండబూదు ,దేవురుట రాజ్యం గురించి సొంనుగుండు, శ్యానా రూజువులు కాటిచుకుండు అయిలీకు అత్తకు అదే సజీవంగా కట్టిచ్చుకుండి కీదు. 4 అదు అయిలున కలుసుకుండు ఇనగ ఆజ్ఞ కుడుకుసు, నింగులు యెరూషలేము న ఉట్టూటు ఓగుమానంగా. నన్నద్వారా గా కెటిక్కురు తేపు టా వాగ్దానం కోసము పాతుగుండు ఇరంగో. 5 యోహాను తన్ని కోరు బాప్తీసము తంచు గాని కొద్దీ దినాలుకోరు పరిశుద్దాత్మొటి బాప్తీసము పొందాకంగా. 6 అయిలు కూడుగుండప్పుడు, ప్రభు, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యమును పునరుద్దరించ్యాకా? ఇండు శిశ్యులు కెటిగ్యా అదు, 7 కాలాలు సమయాలు తేపు అసకీలుకోరు ఎచ్చుగుండుకిదు. అత్త తెలుసుకుదు నింగట పని అల్లా. 8 ఇండిగ్యా అరిశుద్ధాత్మ నింగ్లు మెనుకు వందప్పుడు నింగ్లు శక్తి పొందాకంగా.అత్తుకు నింగ్లు, యెరూషలేము కోరు, యూదాయ సమరయ దేశాలకోరు, ప్రపంచమడ్ద నాకు సాక్షులుగా ఇక్యాకంగా ఇండు ఇండికిదు. 9 ఈవాతులూ సొన్నీ , అయిలు పాతుగుండు ఇందిగాఅదు హీరోహణమాసు. అప్పుడు ఒండూ మేఘము వందూ అయిలీకి కండుభూగారుకుండా అత్త వాంకుండూ ఎళ్లిపోసు. 10 అదు ఓగాందీగా అయిలు ఆకాశం జయా అదేపనిగా పాతుగుండుకిదు. అప్పుడు వల్లబట్టలు ఓటుకుండిక్యారయా రెండాలు అయ్యచ్చి నిలుబుధు 11 గలిలయ నివాసులారా, నింగులు ఎందాతుకు ఆకాశం జయా పాకక్కురంగా? నింగలచ్చుఉండు పరలో కంకోకూ ఆరోహణమైన ఈ యేసు ఏ విదంగా పరలోకంకోకు ఓగుదు పతికిరంగూ అవిదంగానే పెరుక్కు వారదు ఎండు అయ్యోటి సోనికీదు. 12 అప్పుడు అయ్యా అలీవ్ తోట ఇంగురు పేరిక్కుదు గుట్టనుండి యెరూషలేము కు తిరిగి ఎల్లిపోసు. ఆ గుట్ట ఎరుషాలేముకు విశ్రాంతి రోజుకు నడుదుగుండు ఓగురత్తన దూరం కో కీదు. 13 అయ్య ఊరుకోకు వందు, అయ్య బుజ్జురు రూమ్ కోకు ఓసు. అయ్యదిణ్డగ్యా, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, భర్తలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకో బు, దేశభక్తుడు అయిన సీమోను, యాకోబు కుమారుడు యూదా. 14 ఇయ్య, ఇయోటికూడా కొంతమంది పొంబిళ్ళయా, యేసు తాయి మరియ, ఇంకా అదుగు తెమ్మినాయ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన సేందు గుండు కీదు. 15 ఆ రోజులుకోరు సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశ్యమై ఇందప్పుడు పేతురు అసమద్యకోరు నిండ్రగుండు, 16 తెమ్మినయె, యేసును పుడుసుకుండిక్కిఱాయి కి దావు కాటిచ్చికురు యూదాను గురించి పరిశుద్దాత్మ దావీదు ద్వారా గా మిన్నీ లేఖనం కో సోన్నితిరి జరగసికిదు. 17 ఇదు నమ్మురుకోరు ఓండు మోనుసుగా లెక్కకోకు వందు ఈ పరిచర్య కో భాగం పొందికీదు. 18 ఈ యూదా ద్రోహాఁ వలన సంపాదిచ్చికిర్ ల్యక్కోటి ఓండు కొల కొండుగుండు కీదు. అదు తలకిందులుగా బూదు ఒడుము పగిలిపోయి పేగులు బేలికి వందుకీదు. 19 ఈ విషయం యెరూషలేము కొ పేకక్కురాయి కు అడ్డేరుకు తెలిసుకీదు. అత్తుకు అయ్య అస వాతులు కోరు ఆ కొల్లనా అకెల్దమ ఈగ్యాదు. అస అర్థము రక్తభూమి. అత్తుకు ఆధారంగా 20 అస ఊడు నాశనమైపోగుమిటికి, అవుల్లి యాదూ కాపురం ఇక్కారుగుండా ఓగుమిటికి, అస ఉద్యోగము ఏరేఆలు వాంకిమిటికీ, ఇండు కీర్తనలు గ్రంథం కోరు. రాశి కీదు. 21 యోహాను బాప్తీసము కుర్తుపుడునుండు ప్రభువైన దెవురు యేసు నమ్మురచినుంచి పరలోకం కోకు ఓయిక్కురు రోజు వరకు, 22 అదు నమ్మురు మద్యకోరు ఇక్కిరు కాలమడ్డి నమ్మురోటి కలిసి ఇక్కిరాయకోరు ఓండు నమ్మురోటికుడా అదు పునరుత్థానం గురించి సాక్షిగా ఇక్కసికిదు ఇండు కీదు. 23 అప్పుడు అయ్య యూస్తు, బర్సబ్బా ఇంగురు ఏరే పేర్లు యిక్కురు యేసేపునూ, మత్తియనూ నిలుపిచ్చు ఈనగా ప్రార్థనసేన్దుకీదు 24 అడ్డేరుటామనసు తెలిసిక్కురు దేవురె, 25 అదిక్కురు తలముకోకూ ఓగింగా యూదా దావు ఉట్టూటూ. ఓగారసుకుండిక్కురు ఈ పరిచార్యకోరూ అపొస్తలత్వంకోరు పాలు పంచీకింగా ఈ రెండాలుకోరు ఏత్త ఎంచుకుండుకిరాయో సొన్ను. 26 తరువాతి శిష్యులు ఇయులు కోసం పేపర్లు కొ రాసి ఓటీగా మత్తీయ పేరోటీ పేపరు వందికిదు అత్తుకూ అత్త పదకొండు మంది శిషులోటి కలిపి లెక్కోటికీదు.