1
మేము ఓడలో ఇటలీ వెళ్లాలని నిర్ణయమైంది . వారు పౌలు ను మరికొందరు ఖైదీలను ఆగస్టస్ సైనికదళం లోని శతాధిపతిగా అయిన జులియస్ అనే అతనికి అప్పగించారు.
2
ఆసియా తీరం పక్కగా పట్టణాల మీదుగా ప్రయాణించే ఆద్రముత్తియా పట్టణపు ఓడ ఎక్కి మేము బయలు దేరము. మాసిదోనియాలోని థెస్సలోనిక పట్టణము వాడైన ఆరిస్తారకూ మాతో కూడా ఉన్నాడు.
3
మరునాడు సీదోనుకు వచ్చాము. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపి ,అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు.
4
అక్కడ నుండి బయలు దేరిన తర్వాత ఎదురు గాలి కొట్టడం చేత సైప్రస్ దివి చాటుగా ఓడను నడిపించాము.
5
తర్వాత కిలియకు పంఫులియాకు ఎదురుగాఉన్న సముద్రం దాటి లుకియా పట్టణమైన మూర(మైరా)కు చేరాం.
6
అక్కడ శతాదిపతి ఇటలి వెళ్లబోతున్న అలెగ్జాండ్రియా పట్టణపు ఓడను చూసి అందులో మమ్ములను ఎక్కించాడు.
7
చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి కినిదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడను నడిపించాము.
8
అతి కష్టం తో దానిని దాటించి, 'సురాక్షిత ఆశ్రయాలు ' అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియా పట్టణం ఉంది.
9
చాలా కాలం గడిచింది. యూదుల ఉపవాసా దినము కూడా అప్పటికి గడిచిపోయింది. ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.
10
అప్పుడు పౌలు " సోదరులారా , ఈ ప్రయాణము వలన సరుకులకు , ఓడను మాత్రమే కాకా మనకు ప్రాణ హాని, తీవ్ర నష్టం కలగబోతుందని నాకు అనిపిస్తోంది". అని వారిని హెచ్చరించాడు.
11
అయితే శాతాధిపతి పౌలు చెప్పింది కాక , నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు.
12
పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకులమైనది కాక పోవడం చేత అక్కడ నుండి బయలు దేరి వీలైతే ఫినిక్షు చేరి అక్కడ చలి కాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. అది క్రేతు లోని నైరుతి వాయువ్యా దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.
13
అంతే గాక దక్షిణపు గాలి మెల్లగా విసరడం తో వారు తమ ఆలోచన సరైనది భావించి లంగారెత్తి, క్రేతు తీరం లో దను నడిపించారు.తుఫాను
14
కొంచం సేపటికి ఉఉరుకులోను అనే పెను గాలి క్రేతు మీద నుండి విసిరింది.
15
ఓడ దానిలో చిక్కుకొని పోయి గాలికి ఎదురుగా నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకొని పోయాము .
16
తరువాత కావుదా అనే ఒక చిన్న ద్వీపం చాటుగాదాని నడిపించము. బహు కష్టం గా ఓడను కాపాడుకోగల్గము.
17
దానిని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ హిట్టు బిగించి కట్టారు. సూర్తిస్ అనే ఇసుక తిప్ప మీద పడతమేమో అని భయపడి,ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొని పోయారు.
18
గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలు పెట్టారు.
19
మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.
20
కొన్ని రోజులు పాటు సూర్యుడు గాని , నక్షత్రాలు గాని కనపడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించి పోయింది.
21
వారు చాలా కాలం పోస్టులు ఉండడం వలన పౌలు వబల్లమధ్య నిలువబడి, అయ్యాలరా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరుకుండానే ఉండవలసినది. అప్పుడు హాని, నష్టం కలగపోయిది.
22
ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొనడి. ఓడకే కాని, మిలో ఎవరికి ప్రాణ హాని కానీ కలుగదు.
23
నేను ఎవరివాడనో, ఎవరిని సేవిస్తున్నానో, దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలువబడి, పౌలు బయపడకు.
24
నీవు కైసర్య ముందు నిలవబడవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణిస్తున్న వారినందరిని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో అన్నాడు.
25
కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగుతుందని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను.
26
అప్పటికి మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉందని చెప్పాడు.
27
పద్నాలుగవ రాత్రి మేము ఆండ్రియా సముద్రం లో ఇటు అటు కొట్టుటకు పోతుండగా, ఆ రాత్రి వేళా షిప్పు నావికుడు ఎదో ఒక దేశం దగ్గర పడుతున్నది గ్రహించి,
28
ఐరన్ గుండు కట్టిన తాడు వేసి చూసి, సుమారు నూట ఇరవై అడుగుల లోతు అని తెలుసుకున్నారు. ఇంకా కొంత దూరం వెళ్లిన తర్వాత మరలా గుండు వేసి చూసి తొంభై అడుగుల లోథాని తెలుసుకున్నారు.
29
అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటుందేమో అని భయపడి , వారు ఓడ అడుగు నుండి నాలుగు లాంగర్లును వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకుని ఉన్నారు.
30
అయితే ఓడ వారు ఓడ విడిచి పారిపోవలని ఆలోచించి, లాంగర్లు వేయబోతుండగా నటించి సముద్రంలో పడవను దింపివేశారు.
31
అందుకు పౌల్ " మీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొరు" అని శాతాధిపతి తో సైనికులతో చెప్పాడు.
32
వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాన్ని ఒడ్డు కు పోనిచ్చారు.
33
తెల్లవారిచుండగా పౌలు ," పదునాలుగు రోజుల నుండి మీరేమి ఆహారం తీసుకొనక పస్తులున్నారు.
34
కాబట్టి ఆహారము తినమని మిమ్మలను బతిమాలు చున్నాను. ఇది మీ ప్రాణానికి బలాన్ని ఇస్తుంది. మిలో ఎవరి తల నుండి వెంట్రుక రాలదు " అని చెప్పి ఆహారం తీసుకొనమని ప్రతి ఒక్కరిని బతిమలాడాడు.
35
ఈ మాటలు చెప్పి , ఒక రొట్టె పట్టుకొని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దానిని విరచి తినసాగారు.
36
అప్పుడు వారు అంతా ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు.
37
ఓడలో ఉన్నవారంతా రెండు వందల డెబ్భై ఆరు మంది ఉన్నాము.
38
వారు ఆహారం తిని బలము తెచ్చుకున్న తర్వాత , సరుకులను సముద్రం లో పారవేసి, ఓడలో బరువు తగ్గించారు.
39
సూర్యుడు ఉదయించిన తర్వాత అది ఏ ప్రదేశంమో వారు కనుక్కోలేకపోయారు. ఒడ్డు గలా సముద్ర పాయను చూసి, సాధ్యమైతే ఓడను అందులోకి తోయాలని ఆలోచించారు.
40
కాబట్టి లాంగర్లు తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచి పెట్టి, చుక్కనుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలి కెత్తి క్రమంగా అద్దరికి నడిపించారు.
41
కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోటు ఇసుకలో ఇరుక్కుపోయింది . అందువల్ల ఓడ ముందు భాగం కూరుకపోయి కదలలేదు .వెనుక భాగము అలల దెబ్బకు బద్దలు అయి పోతూ ఉంది.
42
ఖైదీలలో ఎవరూ ఈదు కొని పారిపోకుండేలా వారిని హతము చేయాలనే ఆలోచన సైనికులకు కలిగింది కానీ,
43
శాతాధిపతి పౌలు ను రక్షించాలని కోరి , వారి ఆలోచనతో అంగీకరించలేదు. ఈత వచ్చిన వారు ముందు సముద్రం లో దూకి ఈదుకుంటూనూ,
44
మిగిలిన వారు ఓడ చెక్క పలకలు , ఇతర వస్తువుల సహాయం తో నూ ఒడ్డు కు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధముగా అందరమూ తప్పించుకొని సురక్షితముగా ఒడ్డుకు చేరాము.