1
ఆపైన హేరోదు రాజు విశ్వసనీయత మైన సమాజంలో కొంతమందిని హింసించాడు.
2
యోహాను తమ్ముడైన యాకోబును కత్తి తో చంపించాడు.
3
ఇది యూదులకు నచ్చినందున పేతురు ను కూడా పట్టుకొని బంధించాడు. అవి పొంగని రొట్టెల పండుగ రోజులు.
4
అతనిని పట్టుకొని కారాగరంలో వేసి, తిరుణాలు తరువాత జనులముందుకు తెచ్చుటకుఁ పూనుకొని, అతనికి కాపలాగా జట్టుకు నాలుగు గా నాలుగు జట్లు నియమించారు.
5
పేతురును చెరసాలలో ఉంచారు. సంఘం అయితే అతని కోసం అత్యాశక్తితో ప్రార్ధన చేసెను.
6
హేరోదు అతనిని ప్రశ్నించడానికి తీసుకురావాలని అనుకొనుచున్న సమయాన ఆ రాత్రి పేతురు రెండు బంధకాల సంకెళ్లాలో ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రపోవు చుండెను. కావాలి వారు చెరసాల వద్ద కాపలా కాస్తున్నారు.
7
అకస్మాత్తుగా ప్రభువు దూత పేతురు కి కనబడింది. అతఁడున్న గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ను తట్టి త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల సంకెళ్ళ ఊడి పడ్డాయి.
8
దూత అతనితో," నీ అడుము కట్టుకొని, చెప్పులు తొడుగుక్కో" అని చెప్పాడు. పేతురు అలానే చేసాడు. ఆ పైన "నీ పై బట్ట వేసుకొని నాతో రా" అన్నాడు.
9
అతడు బైటకు వచ్చి దూత వెళ్లి, జరిగినది నిజమని తెలియక తాను కల కంటున్నాననుకొన్నాడు.
10
వ కావలిని, 2వ కావలిని దాటి వూరి లోకి ఇనుప తలుపు దగ్గర కు రాగ తలుపు దానంతట అదే తెరుచుకుంది.వారు బైటకు వెళ్లి వీధి దాటిన తరువాత దూత అతనిని దాటి వెళ్ళిపోయింది.
11
పేతురు తేరుకుని ప్రభువు తన దూత పంపి హేరోదు నుండి, యూదుల అందరి చేతుల నుండి తనను విడిపించాడని తెలుసుకొని
12
మార్కు అను పేరుగల యోహను తల్లి ఐన మరియ ఇంటికి వెళ్లినప్పటికి చాలామంది అక్కడ ప్రార్ధ న చేస్తున్నారు.
13
అతడు తలుపు తట్టినపుడు రోడా అనే పని పిల్ల తలుపు దగ్గరకు వచ్చి
14
పేతురు గొంతు గురుతు పట్టి సంతోషంతోతలుపు తీయకుండానే లోపలికి పరిగెత్తి పోయి పేతురు తలుపు వద్ద ఉన్నాడని చెప్పింది
15
అందుకువారు 'నీవు పిచ్చిదానివి'అనిరి.అయితే తను చెప్పింది నిజము చెప్పినప్పుడు అతని దూత అయి ఉండ వచ్చు అనిరి .
16
పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు చూసి ఆశ్చర్య పోయిరి.
17
అతడు నెమ్మది గా ఉండమని చేతితో సైగ చేసి ప్రభువు తనను ఎలా జైలు నుండి బైటకు తీసుకు వచ్చింది చెప్పి యకోబుకు, సోదరులుకు యీ విషయం తెల్పమని అతడు వేరొక చోటికి వెళ్లెను.
18
తెల్లవారగానే పేతురు యామై నాడో అని సైనికులు యంతో గాబరా పడ్డారు.
19
హేరోదు అతని కోసం వెదికి కనబడక పోయెసరికి కావాలి వారిని ప్రశ్నించి వారికి మరణ శిక్ష విధించెను. ఆ తరువాత హేరోదు యూదా య నుండి వెళ్లి కైసరయ లో నివాససించెను .
20
తూరు , సిదోను వాసులపై హేరోదు కు చాలా కోపం వచ్చింది. వారంతా కలసి, రాజు దగ్గరకు వెళ్లారు. రాజుకు నచ్చజెప్పి సహాయం చేయమని వారు రాజభవన పర్యవేక్షకుడైన బ్లాస్తూను వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశము నుండి వీరు దేశానికి ఆహారం వస్తోంది.
21
నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజ వస్త్రములు ధరించి సింహసనము కూర్చుని వారికి ఉపన్యాసము ఇచ్చారు
22
ప్రజలు" ఇది దేవుని స్వరమే గాని మనిషి ది స్వరము కాదు" అని కేకలు వేశారు.
23
అతడు దేవుడికి మహిమ ఈవ్వనందున వెంటనే ప్రభువు దూ త అతనికి ఘోర వ్యాధి కలుగ జేసేను. అతడు పురుగులు పడి చచ్చెను.
24
దేవుని వాక్యం అంతకంతకూ వ్యాపించెను.
25
బర్నబా సౌలు యెరూషాలేము లో తమ సేవ నెరవేర్చిన తరువాత మార్కు అనే పేరున్న యోహాను ను వెంటపెట్టుకొని వచ్చారు.