అధ్యాయము 5

1 ఏగు ముద్రలు ఓటిక్కిరు గ్రంధము అప్పుడు సింహాసనం మేని కొందుగుండిక్కురు ఆయనట కియ్యికోరు ఏగు ముద్రులోటి గట్టిగా మూసిక్కిరు ఒండు గ్రంధమును పాతి. ఆ గ్రంధము గడ్లి ఉల్లి రాసి కీదు. 2 బలవంతుడగు ఒండు దేవదూత " ఆ గ్రంధము ముద్రలు వంగి అత్తును తెరుసురు యోగ్యుడు ఏదు?" ఇండు గట్టిగా ప్రకటన సేయందిగా పాతి. 3 కానీ ఆ గ్రందాన్ని తెరిసిత్తుకు గానీ, పాకిత్తుకు గానీ తర్రిమేని తర్రి దిగిలి ఏత్తుకు సామర్థ్యం ఇల్లారుదోసు. 4 ఆ గ్రందాన్ని తెరిసిత్తుకు గానీ పాకిత్తుకు గానీ సామార్ద్యం ఇక్కిరాయ ఏదు కండుబుగారుదోసు నాను ఎక్కువగా అగిది. 5 అప్పుడు ఆ బెరుమొనుసులుకో ఒండాలు నన్నోటి, " అగుమానా, పారు, ఏగు ముద్రులను వంగి ఆ గ్రందాన్ని తెరిసిత్తుకు యూదా గోత్ర సింహము, దావీదు చిగురు అగు వ్యక్తి జయించుసు" ఇంగుసు. క్రీస్తు ఆ గ్రంధమును విప్పురుదు 6 సింహాసనానికి ఆ నాలు ప్రాణులకు బెరుమొనుసులకు మద్యకోరు గొర్రెకుట్టి నిలుబూదిక్కిత నాను పాతి. ఆ గొర్రెకుట్టి వధ అయిక్కిరు గొర్రెకుట్టి తీరి కీదు. ఆ గొర్రెకుట్టికి ఏగు కొమ్మలు, ఏగు కండ్లు కీదు. ఆ కండ్లు తర్రి అడ్డికి ఓయిక్కిరు దేవురుట ఏగు ఆత్మలు. 7 గొర్రెకుట్టి వందు సింహాసనము మేని కొందుగుండిక్కిరి ఆయనట కల్గీయి కోరుండు ఆ గ్రందాన్ని వంకుండు కీదు. మొనుసుల విమోచనకు బెరుమొనుసుల ఆరాధన 8 ఆ గ్రంధమును వంకుండప్పుడు ఆ నాలు ప్రాణులు, ఇరువత్తు నాలు బెరుమొనుసులు ఆ గొర్రెకుట్టి మినిగల్లి సాష్టాంగబూచ్చు. ఆ ఇరువత్తు నాలు బెరుమొనుసులుట కియ్యికోరు విణేలను, ధూపమోటి నిండి ఇక్కిరు బంగారు పాత్రలు కీదు.ఆ ధూపము పరిశుద్దుల ప్రార్థనలు. 9 ఆ బెరుమొనుసులు " ఆ గ్రందమును పుడుసుగుండు అస ముద్రలు తెరిసిత్తుకు నీను సామార్ద్యము ఇక్కిరాలు. నీను వదింప బూదికీరా. ప్రతి వంశముకోరుండు, ప్రతి భాష వాచ్చిరాయికోరుండు, ప్రతి జాతికోరుండు, ప్రతి జనాంగ్లుకోరుండు నిట రగుతును కుర్తు దేవురు కోసం మొనుసులను కొండికీరా. 10 నంగుట దేవురుకు సేవసేయిత్తుకుఅయిలున ఒండు రాజ్యముగాను, యాజకులుగాను సేందికీరా. కాబట్టి అయిలు భూలొకమును పరిపాలించాదు" ఇండు ఒండు పిది పాట పాడుసు. 11 ఇంకా నాను పాతుగుండు ఇందిగా సింహాసనాన్ని, ఆ ప్రాణులను, బెరుమొనుసులను ఆవరించి ఇక్కురు బెరూ దూతల బృంద స్వరం వినుపించుసు. అయిలుట సంఖ్య కోట్లకొలదిగా కీదు. 12 అయిలు " వధ అయిక్కిరు గొర్రెకుట్టి ప్రభావము, ఐశ్వర్యమూ, జ్ఞానమూ, ఘనతా, మహిమయూ, స్తోత్రము పొందిగిత్తుకు యోగ్యుడు" ఇండు బెరూ స్వరమోటి సొన్నక్కుదు. 13 అప్పుడు పరలోకముకోరును, తర్రి మేని, తర్రి దిగిలి, సముద్రముకోరును సృష్టి అగు ప్రతి ప్రాణి, అత్తు కోరిక్కిదు అడ్డి " సింహాసనము మేని కొందుగుండిక్కిరు ఆయనకూ, గొర్రెకుట్టికి, మహిమా, ఘనతా,స్తోత్రము, పరిపాలించిత్తుకు అధికారము కలకాలం కలుగబేకు గాకా!" ఇంగుర్తా నాను కేటి. 14 ఆ నాలు ప్రాణులు "ఆమెన్" ఇండు సొన్నుసు. ఆ బెరుమొనుసులు సాగిలిబూదు పూజించుసు.