అధ్యాయము 19

1 ఈ విషయాలు జరిగిక్కిరు తర్వాత అనేక మంది వాచ్చక్కురు తీరి ఒండు బెరూ శబ్దం పరలోకముకోరుండు నాకు వినుబూచ్చు. "హల్లెలూయ! రక్షణ, మహిమ, బలప్రభావాలు నంబురు దేవురుటాదే. 2 ఆయనట తీర్పులు సత్యముగాను న్యాయముగాను కీదు. అస లైంగిక అవినితోటి భులోకమును బ్రష్టత్వంకోకు దొబ్బుటిక్కిరు మహా వేశ్యను అయన శిక్షించుసు. ఆ యమ్మ ఒలికించిక్కిరు అస సేవకుల రగుతుకు అయన ప్రతీకారం సేందసు." 3 రెండవ రక్కా అయిలు అడ్డేరు "హల్లెలూయ! ఆ నగరముండు పొగ కలకాలం మేనుకు ఎద్దిందుగుండె ఇక్యాదు" ఇంగుసు. 4 అప్పుడు ఆ ఇరువత్తు నాలు బెరుమొనుసులు ఆ నాలు ప్రాణులు సాష్టాంగబూదు సింహాసనం మేని కొందుగుండిక్కిరు దేవురుకు "ఆమెన్, హల్లెలూయ!" ఇండు సొన్ని ఆయనను పూజించుసు. 5 అప్పుడు తిరిగి "దేవురుట దాసులు, ఆయనకు భీతుగురాయ, గొప్పాయిలు అనామకులును అడ్డేరు ఆయనను స్తుతించంగో" ఇండు ఒండు స్వరము వినుబూచ్చు. 6 తర్వాత అనేకమంది వాచ్చురు తీరి, అనేక జలపాతాల గర్జనతీరి, బలముగా వార్రు ఉరుముల ధ్వనితీరి ఒండు స్వరము ఇన్నగ వినుబూచ్చు. "హల్లెలూయ! అద్దెకి మేని ఏలిక అయిక్కిరు నంబురు ప్రభువు అగు దేవురు పరిపాలించక్కుదు." 7 గొర్రెకుట్టిట కన్యాలు ఉత్సవ సమయము వంది కదు. పెండ్లికుమార్తె సిద్దబూదు కీదు. కాబట్టి మనం సంతోషించి ఆనందించంభంగా. ఆయనకే మహిమ ఆపాదించంభంగా." 8 ఆ యమ్మకు ప్రకాశవంతమగు, పవిత్రమగు అందంగా ఇక్కిరు బట్లు ధరించుగిత్తుకు కుడుకుసు. అందముగా ఇక్కిరు బట్లు ఇండిగా పరిశుద్దుల నీతి కార్యాలు. 9 అప్పుడు ఆ దూత నన్నోటి ఇన్నగ ఇంగుసు. "గొర్రెకుట్టిట కన్యాలు విందుకు ఆహ్వానం అందించిక్కిరాయ దీవెన పొందుగుండిక్కిరాయ ఇండు రాయి." అదే ఇంకా "ఇయి నిజంగా దేవురుట వాతులే"ఇంగుసు. 10 అత్తుకు నాను అత్తును పూజించిత్తుకు అదు మినిగల్లి సాష్టాంగ బుదోని. కానీ అదు "అన్నగ సేయిమానా! యేసుకు సాక్షులుగా ఇక్కిరు నీకు నిట సోదరులకు నాను తోటి దాసుడను మాత్రమే." ఇంగుసు. 11 తర్వాత పరలోకము తెరుజుగుండిక్కిత పాతి. అప్పుడు పారంగో! వలెండు ఇక్కిరు గుర్రం ఒండు నాకు కండుబూచ్చు. అదిమేని కొందుగుండిక్కిరాలు మొనుసుట పేరు 'నమ్మకము ఇక్కిరాలు, సత్యవంతుడు.' అయన న్యాయంగా తీర్పు సొన్నుగుండు యుద్దము సేయాదు. 12 ఆయనట కండ్లు నెరుపు జ్వాలలుగా కీదు. ఆయనట తలమేని అనేక కిరీటాలు కీదు. ఆయనకు మేని ఒండు పేరు రాసి కీదు. అది ఆయనకు తప్ప వేరాయికి తెలిమాదు. 13 అయన ధరించిక్కిరు బట్లు రగుతకోకు ముంచి వంగిక్కిదు. 'దేవురుట వాక్కు' ఇంగురు పేరు ఆయనకు కీదు. 14 ఆయనకు పెరిగిల్లె పరలోక సేనలు వలెండు ఇక్కిరు నార బట్లు ఓటుగుండిక్కిరు వలెండు ఇక్కిరు గుర్రాలు మేని ఏరి ఓగక్కుదు. 15 వివిధ జాతి జనాంగులును మొతిత్తుకు ఆయనట వాయికోరుండు పదునుగా ఇక్కిరు సాకు గడ్లికి వారక్కుదు. అయన ఇనుము లాఠీవోటి అయిలున పరిపాలించాదు. సర్వాధికారియగు దేవురుట తీక్షణమగు ఆగ్రహపు ద్రాక్షగానుగ తిట్టిన ఆయనే మిక్యాదు. 16 ఆయనట బట్లు మేని, తొడ మేని 'రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు' ఇంగురు పేరు రాసి కీదు. 17 అప్పుడు ఒండు దూత సూర్యబింబముకోరు నిలుబూదిక్కిత నాను పాతి. 18 అదు గట్టిగా కూతోటు మేని ఎగురక్కురు కుంజులును కూడుసు. "భాంగో, దేవురు ఏర్పాటు సేందిక్కిరు మహా విందును ఆరగించంగో. రాజులుట కర్రి, సైన్యాధిపతులుట కర్రి, బలముగా ఇక్కిరాయులుట కర్రి, గుర్రాలుట కర్రి, అదిమేని స్వారీ సేయిరాలుట కర్రి, స్వతంత్రులు, బానిసలూ, పలుకుబడి ఇల్లారాయ, గొప్పాయిలుగా ఇక్కిరు మొనుసులుట కర్రి వందు తినంగో" ఇంగుసు. 19 మరియు ఆ గుర్రముమేని కొందుగుండిక్కిరాలోటిను ఆయన సేనలోటి యుద్దము సేయిత్తుకు ఆ క్రూరమృగమును తర్రిమేనిక్కిరు రాజులును అయిలుట సేనలును కూడుగుండు ఇక్కిత పాతి. 20 అప్పుడు ఆమృగమును , అదు మినిగల్లి సూచక క్రియలు సేందు అస ముద్రను ఓటుగుండిక్కిరాయిలున ఆ మ్రుగపు ప్రతిమకు నమస్కరించిక్కిరాయిలున మోస పరిచిక్కిరు ఆ అబద్దప్రవక్తయు, పుడుసుగుండు అయి రెండాలున గంధకమోటి మండు నెరుపుగుండముకోకు పాన్తోటే ఓడుసు. 21 మిగిలిక్కిరాయ అయిలుట గుర్రం మేని కొందుగుండిక్కిరు మొనుసుట వాయికోరుండు వందిక్కిరు సాకోటి సొత్తోసు. అయిలుట కర్రిన కుంజులు అడ్డి వరుగారా తింగుసు.