అధ్యాయము 17

1 ఏగు పాత్రలను కియ్యికోరు పుడుసుగుండిక్కిరు ఏగు దేవదూతలుకోరు ఒండాలు వందు నన్నోటి "తన్ని అడ్డిమేని కొందుగుండిక్కిరు మహావేశ్యకు శిక్ష విధించురుదు నీకు కాటిక్కాకి. 2 ఆయమ్మోటి తర్రి మేనిక్కిరు రాజులు వ్యభిచారము సేందుసు. తర్రి మేని నివసించురాయ మద్యము మత్తుకోరు మునుగోసు." ఇంగుసు 3 నాను అప్పుడు ఆత్మ స్వాదీనముకోకు ఓని. ఆ దూత నన్ను ఒండు అరణ్యముకోకు అసుగుండు ఓసు. అటి ఒండు పొమ్మిల్లిన పాతి. ఆయమ్మ ఒండు ఎర్రగా ఇక్కిరు మృగం మేని కొందుగుండు కొందుగుండు కీదు. ఆ మృగమునకు ఏగు తలలు పొత్తు కొమ్మలు కీదు. అస ఒడుము అడ్డి దేవురుకు అవమానకరమగు పేర్లు రాసి కీదు. 4 ఆ పొమ్మిల్లి ఊదారంగు, ఎర్రగా ఇక్కిరు బట్లు కట్టుగుండు కీదు. బంగారం, రత్నాలు, ముత్యాలోటి అలంకరించుగుండు కీదు. ఆయమ్మట కియ్యికోరు ఒండు బంగారు పాత్ర కీదు. ఆ పాత్రకోరు హేయమగు కార్యాలు, లైంగిక అవినీతికి సంబందించిక్కిరు అపవిత్రపు పనులు కీదు. 5 ఆయమ్మట నుదిటి మేని ఆయమ్మట పేరు ఇన్నగ రాసి కీదు. అత్తుకు రహస్యమగు అర్థము కీదు. " ఇది మహా బబులోను. తర్రి మేనిక్కిరు వేశ్యలు అడ్దేరుకు, అసహ్యమగు అడ్డికి ఇది తాయి." 6 ఆ పొమ్మిల్లి పరిశుద్దుల రగుతును, యేసుకు హతసాక్షులుట రగుతును కుడుసు మత్తుగా ఇక్కిర్త పాతి. అత్తును పాతు నాను ఆశ్చర్యపోని. 7 అప్పుడు ఆ దూత నన్నోటి ఇన్నగ ఇంగుసు. " నీను ఎందాతుకు ఆశ్చర్యబూద? ఈయమ్మకు సంబందించిక్కిరు రహస్యాన్ని, ఏగు తలలు పొత్తు కొమ్ములు ఇందు ఈ పొమ్మిల్లిన పెచ్చక్కురు కౄరమృగానికి సంబదించిక్కిరు రహస్యాన్ని నీకు తెలుపాకి. 8 నీను పాతిక్కిరు ఆ మృగం పూర్వం ఇంచు కానీ ఇప్పుడు ఇల్లా. కానీ అది ఉల్లికి ఇక్కిరు అగాధం కోరుండు మేనుకు వారిత్తుకు సిద్దంగా కీదు. తర్వాత అది నాశనముకు ఓక్కుదు. ఒండప్పుడు ఇంచు, ఇప్పుడు ఇల్లారుదు, మిన్ని వార్రు మృగాన్ని పాతు తర్రు మేని నివసించురాయ, సృష్టి ప్రారభముండు దేవురుట జీవగ్రంధముకోరు అస పేర్లు ఇల్లారాయ ఆశ్చర్యపోక్కుదు. 9 ఇత్తుకు జ్ఞానము కలిగిక్కురు మనసు అవసరం. ఆ మృగమునకు ఇక్కిరు ఏగు తలలు ఆ పొమ్మిల్లి కొందుగుండిక్కిరు ఏగు గుట్టలు. 10 ఇంకా ఏగు రాజులు కీదు. అయిలుకోరు అంజాలు నాశనమాసు. ప్రస్తుతం ఒండాలు కీదు. చివరాలు ఇంకా వారిల్లా. అదు వందప్పుడు కొంతకాలం ఇక్యాదు. 11 ఒండప్పుడు ఇందు ఇప్పుడు ఇల్లారుదు అయిక్కిరు ఈ క్రూరమృగం ఆ ఏగాలుకోరు ఒండాలు. కానీ ఎట్టోవ రాజు కూడా అదే. నాశనమునకు ఓగురుదు అదే. 12 నీకు కండుబూదిక్కిరు ఆ పొత్తుకొమ్ములు పొత్తాలు రాజులు. అయిలికి ఇత్తుకు మినిగల్లి రాజ్యం ఇల్లా. కానీ కౄరమృగం ఏలురప్పుడు అయిలు ఒండు గంటసేపు రాజులుతీరి అధికారం చెలాయించాదు. 13 ఇయిలుకు ఒండే మనసు ఇక్యాదు. ఇయిలు అస శక్తిన అధికారాన్ని మృగానికి అంకితం సేయాదు. 14 ఇయిలు గొర్రెకుట్టితో యుద్దము సేయాదు కానీ అయన అయిలున ఓడించాదు. ఎందాతుకు ఇండిగా గొర్రెకుట్టి ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు, ఆయనోటి ఇక్కిరాయ పిలుపును అందుగుండిక్కిరాయ, ఎన్నిక అయిక్కిరాయ, నమ్మకముగా ఇక్కిరాయ." 15 ఆ దూత ఇంకా నన్నోటి ఇన్నగ సొన్నుసు. "ఆ వేశ్య కొందుగుండిక్కిరు స్థలము నీను పాతిక్కిరు జలాలు ప్రజల్నీ, జన సముహాలును, జనాంగ్లు, వివిధ భాషలు వాచ్చురాయిలను సూచించాదు. 16 నీను పాతిక్కిరు పొత్తు కొమ్ములు పాతికీరా అల్యా, అయిలు ఆ మృగమును ఆ వేశ్యను ద్వేషించాదు. ఆ యమ్మట కర్రిన తింగాదు. నెరుపు ఓటు ఆ యమ్మను చుట్టూడాదు. 17 ఎందాతుకు ఇండిగా అస ఉద్దేశాలును అయిలు నెరవేర్చుబేకిండు దేవురు అస హృదయాలుకోరు ఎక్యాదు. అత్తుకోసం అయిలు ఏకీభవించి రాజ్యమును మృగానికి కుడికిత్తుకు అనుమతించాదు. 18 ఇక నీను పాకక్కురు ఆ పొమ్మిల్లి తర్రిమేనిక్కిరు రాజులున పరిపాలించక్కురు మహా నగరమే.