అధ్యాయము 14

1 తర్వాత నాను పాతుగుండు కీరి. నాకు ఎదురుగా సీయోను పర్వతం మేని గొర్రెకుట్టి నిలుబూదిక్కిదు నాకు కండుబూచ్చు. ఆయనోటి కూడా 1,44,౦౦౦ మంది కీదు. అయిలు అడ్డేరుట నొసల్ల మేని ఆయనట పేరూ, అయన తండ్రిట పేరూ రాసి కీదు. 2 అప్పుడు విస్తారమైన తన్ని బుగురుతీరి, బెరూ ఉరుముల శబ్దముతీరి పరలోకముకోరుండు ఒండు శబ్దం వార్త కేటి. తంతి వాయిద్యాలు వాయించురాయ ఒండే సారిగా వాయించక్కురు శబ్దంతీరి అది కీదు. 3 అయిలు అడ్డేరు సింహాసనం మినిగల్లి, ఆ నాలు ప్రాణులు మినిగల్లి, బెరు మొనుసులు మినిగల్లి ఒండు పిది పాట పాడుసు. భూలోకముకోరు విమోచన జరిగిక్కిరు 1,44,౦౦౦ మంది తప్ప ఇంకేదు ఆ పాటను కెచ్చుగుమాదు. 4 ఇయిలు పొమ్మిల్లాయోటి లైంగిక సంబంధం మూలంగా అయిలు అపవిత్రత సేందుగారాయ. లైంగికంగా అయిలును పవిత్రంగా ఇక్కిరాయ. ఇయిలు గొర్రెకుట్టి ఓయిక్కిరు చోటుకెల్లా ఓయి ఆయనను అనుసరించుగుండు కీదు. మొనుసులుకోరుండు దేవురు కొరకు, గొర్రెకుట్టి కొరకు మిన్ని ఫలాలుగా విమోచన జరిగిక్కిరాయ. 5 అబద్దము ఇంగురుదు ఇస వాయికోరుండు వామాదు. ఇయిలు నిందారహితులు. 6 అప్పుడు ఇంకొండు దూతను పాతి. అదు ఆకాశముకోరు ఎగరక్కుదు. తర్రుమేని నివసించురు అడ్దేరుకు ప్రతీ దేశానికీ, తెగకు, ప్రతీ భాష వాచ్చిరాయికి, ప్రతి జాతికి ప్రకటించిత్తుకు అదచ్చి శాశ్వత శుభవార్త కీదు. 7 అదు "నింగ్లు దేవురుకు భీతుగొంగో. ఆయనను కీర్తించంగో. అయన మొనుసులకు తీర్పు సొన్నురు సమయము వంచు. కాబట్టి తర్రు, ఆకాశము ,సముద్రమును తర్రిమేని తన్ని ఊటలును సృష్టించిక్కిరు ఆయనను పూజించంగో." ఇండు గట్టిగా సొన్నుసు. 8 ఇంకొండు దూత, ఇండిగా రెండో దూత అదు బెరుగోటే వంచు. "నాశనమాసు! అస లైంగిక విచ్చల విడితనమింగురు సారాయిన తర్రిమేనిక్కిరు జనాంగులు అడ్దేరుకు కుడిపించిక్కిరు మహా బాబులోను నాశనమాసు! ఆ సారాయినే ఎక్కువ రాసు వార్రుతీరి ఎత్తెందు ఎక్కిసు." ఇండు సొన్నుసు. 9 తర్వాత మూడో దూత ఇయిలికి పెరిగిల్లే వందు బెరూ స్వరమోటి ఇన్నగ సొన్నుసు. "ఆ క్రూర మృగాన్ని గానీ అస విగ్రహామును గానీ పూజించిగా అస ముద్రను అస నుదటి మేనో కియ్యి మేనో ఓటుగుండిక్కిరాలు. 10 అదు దేవురుట రాసు పాత్రకో కల్తీ ఇల్లారుగుండా తయారు సేందు వాతిక్కురు దేవురుట రాసు మద్యాన్ని కుడికాదు. పరిశుద్ద దేవదూతల మినిగల్లి, గొర్రెకుట్టి మినిగల్లి నెరుపు గందకాలు అత్తును బాధించాదు. 11 అయిలుట యాతనకు సంబదించిక్కిరు పొగ కలకాలం ఎద్దిందుగుండు ఇక్యాదు. ఆ క్రూర మృగాన్ని గానీ అస విగ్రహాన్ని గానీ పూజించిక్కిరాయ, అస ముద్రను ఓటుగుండిక్కిరాయ నామారి పగమారి అశాంతోటి ఇక్యాదు. 12 దేవురుట ఆదేశాలు పాటించురాయ, యేసును విశ్వసించిక్కిరాయ, పరిశుద్దులు సహనమోటి కొనసాగుబేకు. 13 అప్పుడు పరలోకముకోరుండు ఒండు స్వరము నాకు ఇన్నగ వినుబూచ్చు "ఇన్నగా భా. ఇక నుంచి ప్రభువుకోరు ఇందు సొత్తోగురాయ దీవెన పొందుగుండిక్కిరాయ. "నిజమే, అయిలు అస శ్రమ ప్రయాసాలు అడ్డి ఉట్టూటు విశ్రాంతి పొందుగాదు. ఎందాతుకు ఇండిగా అయిలు సేందిక్కిరు పనులు అయిలు పెరుగోటే వారాదు. 14 మల్లా నాను పాతప్పుడు ఒండు వలెండు ఇక్కిరు మేఘం కండుబూచ్చు. ఆ మేఘం మేని మనుష్యకుమారుని తీరి మొనుసు కొందుగుండు కీదు. ఆయనట తలమేని బంగారు కిరీటం కీదు. ఆయనట కియ్యికోరు పదునుగా ఇక్కిరు కొల్లి కీదు. 15 అప్పుడు ఇంకొండు దూత గుడికోరుండు గడ్లికి వందు మేఘం మేని కొందుగుండిక్కిరు మొనుసోటి బెరూ స్వరమోటి ఇన్నగ ఇంగుసు, "పంట అరుకురు సమయము వందుకీదు. తర్రు పంట పండుసు. నిట కొల్లీటి అరుకుదు మొదులెక్కి". 16 అప్పుడు మేఘం మేని కొందుగుండిక్కిరు మొనుసు తర్రి మేనుకు కొల్లి ఇసురుసు. వెంటనే తర్రు మేని అరుకుదు జరుగుసు. 17 అత్తునుకోరే పరలోకం ఆలయంకోరుండు ఇంకొండు దూత గడ్లికి వంచు. అస కియ్యికోరు కూడా ఒండు పదునుగా ఇక్కిరు కొల్లి కీదు. 18 ఇంకొండు దూత బలిపీటంకోరుండు గడ్లికి వంచు. ఇత్తుకు నెరుపు మేని అధికారం కీదు. ఇదు పదునుగా ఇక్కిరు కొల్లిన కియ్యికోరు పుడుసుగుండిక్కిరు దూతను బెరు కూతోటు కూడుసు, "తర్రుమేని ద్రాక్ష పళ్ళు పండుసు. పదునుగా ఇక్కిరు నిట కొల్లోటి ద్రాక్ష గుత్తులు అరుకు" ఇంగుసు. 19 అప్పుడు ఆ దూత అస కొల్లిన తర్రు మేనుకు ఇసురుసు తర్రిమేనిక్కిరు ద్రాక్షా గుత్తులను అరుకుసు. అత్తును దేవురుట ఆగ్రహము ఇంగురు గొప్ప ద్రాక్ష గానుగ తొట్టెకోకు ఓటూడుసు. 20 పట్టణానికి గడ్లి ఆ ద్రాక్ష గానుగ తొట్టెకోరు ద్రాక్షలు మిక్కిదు జరుగుసు. అత్తుకోరుండు రగుతు గుర్రం కళ్ళెం అడ్డి ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళు వరకు ప్రవహించుసు.