అధ్యాయం 16

1 ఆయన అదుగు శిష్యులకు ఇనుగ సొన్నుసు, "ఒండు ధనవంతుడచ్చి ఒండు అధికారి కీదు. అదు ఆ ధనవంతుడుట వూడు లెక్క విషయాలు పాతుగురాలు. అదు అస ఆస్తిన పాడు సెయ్యకుదు ఇండు ఫిర్యాదు ధనవంతుడుకు వందుకీదు. 2 అదు ఆ అధికారిన కూటూ "నిన్ను గురించి నాను కేకాదు ఎందాదు? నీట పనికి సంబంధించిక్కిరు లెక్క అడ్డీ అప్పగించు. ఇక మేని నీను నిర్వహనాధికారిగా ఇక్కింగ వీలు ఇల్లా" ఇండుసు. 3 అప్పుడు అదు ఇనుగ ఇండుగుండుసు "యజమాని నాన్న నిర్వాహణ పనికో నుండి వాంగోడక్కుదు. ఇప్పుడు నానెందాదు సెయ్యషికీ? తవ్వకం పని నాకు కీకామాదు. భిక్షమెత్తసికిండుగ్యా నాకు అవమానం. 4 నన్న ఈ నిర్వహకత్వపు పని నుండి తొలగించిక్కురు తర్వాతా నాలాలు అస వూళ్ళుకోకు నన్న కూడూరు తీరీ ఎనుగ సెయ్యషికో నాకు తెలుసు" ఇనుగుండుసు. 5 ఆ తరువాత అదు అదుగు యజమానికి బాకీ ఇక్కురాయడ్డేరునా కూడుసు. ఒండాలోటి "నట యజమానికి నీను ఎత్తున బాకీ కీరా" ఇండు కేకుసు. 6 "మూడు వేల లీటర్ల నూనె" ఇండు అదు జవాబు కుడుకుసు. ఈ అధికారి ఆ వ్యక్తోటి "నిట పత్రంకో పోదునెంజు నూరు లీటర్లు ఇండు రాసుకో " ఇండుసు. 7 "నీను ఎత్తున బాకీ కీరా?" ఇండు ఇంకొండాలున కేటుగ్య అదు "నూరు మాణికల గోధుమలు" ఇండు సొన్నుసు. నిర్వాహణ అధికారి అదోటి "నిట పత్రంకో ఎనభై మాణికలు ఇండు రాసుకో "ఇండుసు. 8 న్యాయం తప్పి వ్యవహరించిక్కురు ఆ అధికారి తెలివైన పని సేందుకీదిండు యజమాని అత్త మెచ్చుగుండుసు. ఈ లోక సంబంధులు అదుగు మొనుషులుట విషయంకో ఎత్తునో తెలివిగా వ్యవహరించాదు. ఈ విషయంకో అయ్య దేవురుట ప్రజలు కన్నా తెలివైన ఆయా. 9 అన్యాయమైన ధనమోటి జతగాళ్ళున సంపాదించుకోంగో. ఎందాతుకు ఇండుగ్యా ఆ ధనం నింగులున వుట్టూటు ఓనుపట్లీ అయ్య అస శాశ్వతమైన నివాసాలుకోరు నింగులున చేర్చుగాదిండు నింగులోటి సొన్నక్కిరి. 10 చిన్న చిన్న విషయాలు కోరు నమ్మకంగా ఇక్కురాలు బెరి విషయాలు కోరు కూడా నమ్మకంగా ఇక్యాదు. చిన్న విషయాలు కోరు అన్యాయంగా ఇక్కురాలు బెరి విషయాలు కోరు కూడా అన్యాయంగానే ఇక్యాదు. 11 కాబట్టి నింగులు అన్యాయమైన ధనం విషయం కోరే నమ్మకంగా ఇల్లూటించా, ఇంక న్యాయమైన ధనం నింగులుకు యాదు తారాదు? 12 నింగులు వేరేస ధనం విషయంకో నమ్మకంగా ఇల్లూటించా నింగుట సొంతమైనది నింగులుకు యాదుతారాదు? 13 ఏ సేవకుడు రెండాలు యజమానులకు సేవ చేయుమాదు. అదు ఒండాలున ద్వేషించి రెండో యజమానిన ప్రేమించాదు. ఇల్లూటించా ఒండాలుకు కట్టుభూదు ఇందు ఇంకొండాలున చిన్న చూపు పాకాదు." 14 ధనం న ప్రేమించురు పరిసయ్యులు ఈ వాతులడ్డీ కేటు ఆయనన ఎగతాళి సేంచు. 15 ఆయన అయ్యోటి ఇనుగ ఇండుసు. "నింగులు మొనుషులుట దృష్టికో నీతుమంతులు ఇండు ఇనుపిచ్చుగురాయే గానీ దేవురుకు నింగుట హృదయాలు తెలుసు. మొనుషులు ఘనంగా ఎంచుదు దేవురుకు అసహ్యం. 16 బాప్తీస్మం కుడుకురు యోహాను వార్రు వరకూ ధర్మశాస్త్రమూ ప్రవక్తల బోధలూ కీదు. అప్పటి నుంచి దేవురుట రాజ్య సువార్త ప్రకటన జరుగుతూనే కీదు. ప్రతి ఒండాలు ఆ రాజ్యంకో బలవంతంగా చొరభూదుగుండూ కీదు. 17 ధర్మశాస్త్రంకో ఒండు పొల్లాయినా తప్పి పోవడం కన్నా ఆకాశం, భూమీ నశించి పోవడమే తేలిక. 18 పొండుకు విడాకులు కురుతు ఇంకొండు స్త్రీన కన్యాలు సేందుగు రాలు వ్యభిచారం సెయ్యక్కుదు. అనిగే విడాకులు వాంకుండిక్కురు స్త్రీన కన్యాలు సేందుగు రాలు వ్యభిచారం సేయక్కుదు. 19 ఒండు ధనవంతుడు ఇంచు. అదు ఊదారంగు వస్త్రాలూ, ఖరీదైన బట్టలూ ఓటుగందాలు. ప్రతిరోజు విలాసంగా జీవించందాదు. 20 లాజరు ఇంగురు నిరుపేద కూడా ఇఖందాలు. లాజరుకు ఒడుమడ్డీ కురుపులుండేవి. ఇదు ధనవంతుడుట వూటు గుమ్మం మిన్ని భూదు ఇక్యాంధాలు. 21 ధనవంతుడుట భోజన బల్ల మేని నుంచి తర్లికి భుగురు రొట్టె ముక్కలోటి అస కలి పెసి తీర్చుగింగా ప్రయత్నం సేయందాలు. అత్తునే అల్లాదే వీధి నాయలు వందు అస కురుపులు నాకందాదు. 22 ఆ నిరుపేద సొత్తోసు. దేవదూతలు వందు అత్త అబ్రాహాముకు సన్నిహితంగా ఇక్కింగ వాంకుండు ఓసు. తర్వాత ధనవంతుడు కూడా సొత్తోసు. అత్త భూన్చెక్కుసు. 23 అదు పాతాళం కో యాతన భూగ్గుండు మేనికి తేరి పాతు దూరంగా ఇక్కురు అబ్రాహామునా అత్తుకు సన్నిహితంగా ఇక్కురు లాజరునా పాతు 24 "తేపునే అబ్రాహాము, నన్న కరుణించు. నాను ఈ మంటలు కోరు భూదు అల్లాడి పోగక్కిరీ. లాజరు అస వేలి కొనన తాన్నికో ముంచి నట నాలుక మేని చలింగా అత్త అంపూడు" ఇండు కేకలు ఎక్కుసు. 25 అత్తుకు జవాబుగా అబ్రాహాము "నాయనా, గుర్తుకు ఎతెందుగో, నీను జీవించి ఇందుపట్లీ నీకు ఇష్టమైనదంతా నీను అనుభవించుకీరా. అప్పుడు లాజరు ఎత్తునో కష్టాలు భూదుకీదు. ఇప్పుడు ఇటి అదు సేద ధీరక్కుదు. నీను యాతన భుగక్కురా. 26 అదల్లాదే ఇటి నుండి నిన్నచ్చుకు వారసికిండుగు రాయ ఓగారుకుండా అటిక్కురాయా నంగులచ్చుకు వారారుకుండా నింగులుకూ నంగులుకూ మధ్య బెరీ అగాధం కీదు," ఇండుసు. 27 అప్పుడదు "అనుగానిగ్యా తేపునే, నాకు అంజాలు సోదరులు కీదు. 28 అయ్య కూడా ఈ వెధనకరమైన స్థలంకు వారారుకుండా సాక్ష్యం తారింగా లాజరున నట వూటుకు అంపూడు ఇండు వేడుగక్కిరీ" ఇండుసు. 29 అత్తుకు అబ్రాహాము "అయ్యచ్చి మోషే, ప్రవక్తలూ కీదు. నిట సోదరులు అస వాతులు కేకసికి" ఇండుసు. 30 అదు "తేపునే, అబ్రహామా అనుగా ఇంగుమానా, సోత్తోఇక్కురాయ కోనుండి యాదైన ఓనుగ్యా అయ్య తప్పక పశ్చాత్తాపం భూక్కుదు" ఇండుసు. 31 అత్తుకు అబ్రాహాము అదోటి "మోషే, ప్రవక్తలూ సొన్నికురు వాతులు అయ్య కేకులూటించా సొత్తోయిక్కురాయాకోనుండి యాదైనా సజీవంగా ఎద్దిందు ఓనుగ్యాగోటు నమ్ముమాదు" ఇండు ఇండుసు.