అధ్యాయము 3

1 మళ్ళీ నంగ్లు గురించి నంగ్లు గొప్పలు సొన్ను రుదు మొదలు ఎచ్చామా? కొంతమందికి అవసరమాతీరి, నింగ్లుకు గాని, నింగ్లచ్చుండు గాని పరిచయ లేఖలు నంగ్లుకు అవసరమా? 2 నంగుట పరిచయ లేఖ నింగ్లే. ఈ లేఖ నంగుట హృదయాలు మేని రాసి ఇందిగా, జనాంగులు అడ్డేరు తెలు జుగుండు సదువు గక్కుదు. 3 అది కెళ్లు ఇంగురు పలక మేని సిరావోటి రాసిక్కుదు అల్లా. మెత్తని హృదయాలు ఇంగురు పలకల మేని జీవం ఇక్కురు దేవురుట ఆత్మోటి, నంగుట సేవ ద్వారా క్రీస్తు రాసిక్కురు ఉత్తరంగా నింగ్లు కండుబూగక్కురం గా. 4 క్రీస్తు ద్వారా దేవురు మేని నంగ్లుకు ఇంతారు నమ్మకము కీదు. 5 నంగుట సొంత సామర్థ్యమోటి ఎందాదన్నా సేయాకో యిండు అల్లా. నంగుట సామర్థ్యం దేవరచ్చుండు కలుగుసు. 6 ఆయనే నంగులున పిదు ఒడంబడికకు సేవకులు గా నంగ్లుకు అర్హత కలిగించుసు. ఇండిగా అక్షరముకు అల్లా, ఆత్మకే సేవకులం. అక్షరం కొండ్రోడాదు గాని ఆత్మ పెకిక్కాదు. 7 మొనుసులను కొండ్రోడురు సేవ, కెళ్లు మేని చెక్కిక్కురు అక్షరాలకు సంబందిక్కుదు ఆసా, ఎత్తునో గొప్పగా కీదు. అత్తుకే మోషేట ముఖ ప్రకాశము తగ్గిపోగందిగా సరే, ఇశ్రాయేలీయులు అస ముఖమును నేరుగా పాకారుదోసు. 8 ఇన్నగాసా ఆత్మ సంబంధమైన సేవ మరి ఇంకెత్తన గొప్పగా ఇక్కాదో. 9 శిక్షా విధికి కారణమగు సేవ ఇత్తన గొప్ప గా ఇందిగా, నీతికి కారణమగు సేవ మరిఇంకెత్తునో గొప్పగా ఇక్కాదు. 10 అపారమైన మహిమ ఇత్తుకు ఇక్కురు వలన ఒండప్పుడు మహిమగా ఇంచు, ఇప్పుడు మహిమ ఇల్లారు దాసు. 11 గతించి ఓగురుదు గొప్పగా ఇందిగా, ఎప్పుడు ఇక్కు రుదు ఇంకా దండిగా గొప్పగా ఇక్కాదు. 12 తగ్గిపోగురు మహిమను ఇశ్రాయేలీయులు నేరుగా పాకారుగుండా మోషే అస ముఖము మేని ముసుకు ఓటుగుండుసు. 13 నంగ్లు అన్నగ సేయారుగుండా, నిరీక్షణ ఇక్కి రాయిగా బహు ధైర్యముగా వాచ్చక్కురో. 14 అయితే అయిలుట మనుస్సులు ముసుకుకోరే కీదు. ఇప్పటి వరకు అయిలు పాతనిబంధన సదువురప్పుడు ఆ ముసుకు అన్నగే కీదు. ఎందాతుకు ఇండిగా క్రీస్తు కోరు అత్తును వంగోడుసు. 15 అయితే ఇప్పటికి అయిలు మోషేట గ్రంథమును సదువురు ప్రతిసారి అస హృదయాలు మేని ముసుకు ఇంకా కీదు. 16 అయిలు ఎప్పుడు ప్రభువు జాయ తిరుగాదో అప్పుడు దేవురు ఆ ముసుకును వంగోడాదు. 17 ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఏటి ఇక్కాదో అటి స్వేచ్ఛ ఇక్కాదు. 18 నంబురు అడ్డేరు ముసుకు ఇల్లారు ముఖ మోటి ప్రభువుట మహిమను పాతుగుండు, ఆ మహిమ యొక్క పోలికకోకు క్రమక్రమంగా మారుగుండు కీరో. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరగక్కుదు.