అధ్యాయము 2

1 సోదరులారా నంగ్లు నింగ్లచ్చుకు వందిక్కితుకు లాభము వారారుగుండా ఓగిల్లా. ఇది నింగ్లుకు గొర్తు. 2 నంగ్లు భూదిక్కురు కష్టాలు అనుభవించిక్కురు సంగతలు, ఫిలిప్పికోరు అవమానాలు భూదిక్కురుదు నింగ్లుకు గొర్తు. నంగ్లుకు అడ్డి ఆటంకాలు వందప్పటికి నంగ్లు నంగుట దేవురు సహాయమోటి యేసు సువార్తను నింగ్లుకు భోదించిత్తుకు దైర్యము సేందుగుండో. 3 నంగ్లు తప్పు సొన్నిల్లా. దురుద్దేషమోటి సొన్నిల్లా నంగ్లు నింగ్లున మోసం సేయిబేకిండు ఎప్పుడు ఇండి గిల్లా. 4 దేవురు నంగుట యోగ్యతను గుర్తించి నంగ్లుకు సువార్తను అప్పగించుసు. నంగుట హృదయాలను పరిక్ష సేయురు దేవురును సంతోషం ఎక్కిబెకిండు పాకక్కురో కానీ, మొనుసులును అల్లా. 5 నంగ్లు పొగుడుదు ఉపయోగించిల్లా ఇండు నింగ్లుకు గొర్తు. స్వార్థం కోసం నంగ్లు దొంగుట వేసము ఓడిల్లా. ఇత్తుకు దేవురే సాక్షి. 6 నింగుట పొగడ్తులు గాని వేరాసా పొగడ్తులు గాని నంగ్లుకు అవసరము ఇల్లా. 7 క్రీస్తు అపోస్తులులముగా నంగ్లు నంగుట భారము నింగ్లి మేని మోపుదిల్లా. అమ్మ ఆస సిన్నేయిలున పాతుగురు తీరి నంగ్లున పాతుగుండు నింగుట విసయముకోరు దయోటి కీరో. 8 నంగ్లు నింగ్లున మనసుపూర్తిగా ప్రేమించక్కురో. కాబట్టి నింగ్లు నంగ్లుకు దగ్గర ఆనంగ. అదోటి సువార్తే అల్లాది, నంగుట జీవితాలును కూడా నింగ్లోటి పంచుగుండు కీరో. 9 సోదరులారా నంగుట శ్రమ, కష్టము నింగ్లుకు తప్పకుండా గుర్తుకు ఇక్కచ్చు. నంగ్లు దేవురుట సువార్తను నింగ్లుకు సొన్నప్పుడు నంగ్లు నింగ్లుకు బరువుగా ఇక్కుగూడుదిండు నామారి పగమారి పని సేందికిరో. 10 విశ్వాసులుగా ఇక్కురు నింగలచ్చి నంగ్లు ఎత్తన గానో పవిత్రంగా, నీతిగా, అపకీర్తి ఇల్లారుగుండా పెగిసి కీరో. ఇత్తుకు నింగ్లె సాక్షి. దేవురు కూడా సాక్షి. 11 నంగ్లు నింగ్లు అడ్దేరోటి, ఆవు అస సిన్నాయిలోటి ఎన్నగ యిక్కాదో అన్నగ కీరో. 12 నింగ్లుకు ఆత్మీయ శక్తిన తందు, నింగ్లును ఓదార్చుగుండు, దేవురుట రాజ్యముకోకు ఆహ్వానించక్కురో. అస మహిమకోరు నింగ్లుకు భాగము తార్రు దేవురుట మెప్పు పొందుగిత్తుకు నింగ్లున జీవించంగో ఇండు సొన్నక్కురో. 13 దైవ సందేశమును నింగ్లు నంగలచ్చుండు కేటు అత్తున మొనుసులుట సందేసంగా అల్లాది, దేవురుట సందేసంగా అంగికరించు కిరంగా. ఇన్నగ జరిగిత్తుకు నంగ్లు దేవురుకు ఎల్లప్పుడు కృతజ్ఞలము. అది నిజంగా దేవురుట సందేశం, అది భక్తి ఇక్కురు నింగ్లుకో పనిసేయాదు. 14 సోదరులారా యేసుక్రిస్తుకోరు ఐక్యత పొందిక్కురు యూదయాకోరు దేవురుట సంఘాలు తీరి నింగ్లు కూడా కష్టాలు అనుభవించు కీరంగా. యూదులు వలన ఆ సంఘాలు అనుభవించక్కురు కష్టాలే నింగ్లు నింగుట జనాంగులు వలన అనుభవించు కీరంగా. 15 ఆ యూదులు యేసు ప్రభువును, ప్రవక్తలను కొండ్రోడుసు, నింగ్లును ఎల్లిమొతూడుసు. అయిలు దేవురును అగిపిక్కుసు. మొనుసులు అడ్దేరుకు శెత్రువుగా జీవించుసు. 16 రక్షనను తార్రు సందేసమును యూదా జాతి అల్లారాయికి సొన్నారుగుండా నంగ్లున అడ్డగించుసు. ఇన్నగ సేందు అస పాపాలుకు అంతం ఇల్లారుగుండా పెచ్చుగుండు ఓసు. చివరకు దేవురుకు అయిలు మేని రాసు వందికీదు. 17 సోదరులారా కొంతకాలము నంగ్లు నింగ్లచ్చుండు తూరు ఇక్కురుదు వంచు. నంగుట ఒడుము మాత్రమే నింగ్లచ్చుండు తూరు కీదు. కాని నంగుట మనసు అల్లా. నింగ్లున పాకుభేకిండు నంగుట మనుసు కోరు చాలా కీదు. కనుక నంగ్లు ఎత్తనో ప్రయత్నము సేందో. 18 నంగ్లుకు నింగ్లచ్చుకు వారుభేకిండు కీదు. పౌలగు నాను ఎత్తనో రక్కా వారుభేకిండు ప్రయత్నం సేంది. కాని సైతాను నంగ్లున అడ్డగించుసు. 19 ఎందాతుకు ఇండిగా ఆశలు నింగ్లు మేని ఎచ్చుగుండు కీరో. నంగట ఆనందము నింగ్లే. నమ్రు యేసు క్రీస్తు ప్రభువు వందప్పుడు అయన మినిగల్లి గర్వభూగిత్తుకు కిరీటం నింగ్లే. 20 నంగ్లుకు కీర్తి వారిత్తుకు నిజంగా నింగ్లే కారణం. నింగ్లే నంగుట ఆనందము.