అధ్యాయము14

1 ప్రేమ ఇక్కిత్తుకు ప్రయత్నము సెయ్యి. ఆత్మ సంబంధమైన వరాలను ఆశ ఇందు కోరుగొంగు. ముఖ్యంగా దేవురుట వాతలను ఉపదేశించురు వరమును కోరుగొంగ. 2 ఎందాతుకు ఇండిగా తెలిమాటారు భాషలోటి వాచ్చురాలు మొనుసులోటి అల్లా, దేవురోటి వాచ్చక్కుదు. అదు పలకురుదు ఏత్తుకు అర్థము ఆగుమాదు. అదు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలకక్కుదు. 3 అయితే దేవురుట వాతలు ఉపదేశించురాలు కేకురాలుకు క్షేమాభివృద్ది, హెచ్చరి క,ఆదరణ కలుగురు విధముగా మొనుసులోటి వాచ్చక్కుదు. 4 భాషోటి వాచ్చురాలు అత్తుకు మాత్రమే మేలు గాని ఉపదేశ ము సేయిరాలు సంఘానికి మేలు సేయాదు. 5 నింగ్లు అడ్డేరు తెలిమాటారి భాషలోటి వాచ్చు భేకిండు కోరుగక్కిరి గాని నింగ్లు దేవురుట మూలముగా ఉపదేశించురాలుగా ఇక్కిభేకిండు మరి దండిగా కోరుగక్కిరి. సంఘము అభివృద్ధి ఆగిత్తుకు భాషోటి వాచ్చురాలుకన్నా (అర్థం సొన్నిగే తప్ప) దేవురుట మూలంగా ఉపదేశించురాలు గొప్పాలు. 6 సోదరులారా, ఆలోచన సేయంగో. నాను నింగ్లచ్చు కు భాషోటి వాచ్చుగుండు వంది కీరి ఇండుగొంగు. నట వాత లు నింగ్లుకు అర్థము ఆగాది, జ్ఞానోపదేశం గాని, దేవురుట మూలంగా పలుకురు ఉపదేశం గాని ఇల్లాది ఇందిగా, నన్నోటి నింగ్లుకు ప్రయోజనము ఎందాదు? 7 నిర్జీవమైన వస్తువులై వేణువు ఊదిగా, వీణ వాయించిగా, అవి వేరు వేరు స్వరాలు పలకారుగుండా యిం దిగా వాడిక్కిరు వాయిద్యమేదో ఎన్నగ తెలాదు? 8 బాకా స్పష్టంగా వినుబుగారుగుండా ఇందిగా యుద్ధమునకు అడ్డేరు ఎన్నగ సిద్ధబూక్కుదు? 9 అన్నగే నింగుట నాలుకోటి స్పష్టమైన వాతులు పలకారుగుండా ఇందిగా కేకురాయిలుకు ఎన్నగ అర్థమాక్కుదు? అదు నింగులు గాలోటి వాచ్చురు తీరి ఇక్కా దు. 10 లోకంకోరు ఇత్తునో భాషలిందిగా, అయిలు అడ్డికి స్పష్టమైన అర్థాలు కీదు. 11 వాతులుకు అర్థం నాకు తెలాందిగా వాచ్చురాలు నాకు, అదు పరాయిజనాంగులుగా ఇక్కాకో. 12 నింగ్లు ఆత్మ సంబంధమైన వరాలు విషయముకోరు ఆశక్తి ఇందు సంఘం అభివృద్ధి సెందురు తీరి అయిలున విస్తరింప సేందుగొంగ. 13 తెలుమాటారు భాషో టి వాచ్చురాలు అత్తుకు అర్థం సొన్నురు సామర్థ్యము కోసం దేవురుకు ప్రార్థన సేయిభేకు. 14 నాను తెలిమాటారు భాషోటి ప్రార్థన సేందప్పుడు నట ఆత్మ ప్రార్థన సేయాదు గాని నట మనసు చురుకుగా ఇక్కిమాదు. 15 కాబట్టి నాను ఎచ్చేయి బేకు? నట ఆత్మోటి ప్రార్థించాకి, మనస్సోటి ప్రార్థించాకి. ఆత్మోటి పాడాకి, మన స్సోటి పాడాకి. 16 అన్నగ అల్లారుగుండా, నీను ఆత్మోటి మాత్ర మే స్తుతులు చెల్లించిగా నీను పలికిక్కుత గ్రహింపు ఇల్లారు మొనుసు నీను సొన్నిక్కురు కృతజ్ఞతలకు "ఆమెన్" యిండు సొన్నుమాదు. 17 నీకు నీనే నల్లక స్తుతులు చెల్లించాక గానీ మినిగల్లి మొనుసుకు మేలు వామాదు. 18 దేవురుకు స్తుతులు! నాను నింగ్లు అడ్డేరు కన్నా దండిగా తెలిమాటారు భాషలోటి వాచ్చాకి. 19 అయినా సంఘముకోరు తెలిమాటారు భాషోటి పొత్తువేలు వాతలు వాచ్చుర్తు కన్నా, వేరాయిలుకు ఉపదేశం దొరుకురు తీరి నట మనస్సోటి అంజు వాతలు సొన్నుదు నల్లాదు. 20 సోదరులారా, ఆలోచనకోరు సిన్నాయిలు తీరి ఇక్కిమానంగా. కెట్టాతు విషయముకోరు సిన్నాయిలు తీరి ఇరంగో గానీ తెలివి విషయముకోరు పరిణతి సెందిక్కురాయి గా ఇరంగో. 21 ధర్మశాస్త్రముకో ఇన్నగ రాసి కీదు, " తెలిమాటా రు భాషలు వాచ్చురు జనాంగులు ద్వారా, తెలిమాటారు మొనుసులు పెదవుల ద్వారా, ఈ జనాంగులోటి వాచ్చాకి. అయినప్పటికీ అయిలు నట వాత కేకుమాదు యిండు ప్రభు వు సొన్నక్కుదు." 22 కాబట్టి భాషలు విశ్వాసులకు అల్లా, అవిశ్వాసు లకే సూచన. దేవురుట మూలంగా ఉపదేశించురుదు అవిశ్వా సులకు అల్లా, విశ్వాసులకే సూచన. 23 సంఘము అడ్డేరు ఒండే సారి తెలిమాటారు భాషోటి వాచ్చురప్పుడు, గడ్లి మొనుసు లు లేక అవిశ్వాసులు ఉల్లికి వందు పాతిగా నింగ్లున వేర్రాయ యిండు సొన్నుగాదు. 24 అయితే అడ్డేరు దేవురుట మూలంగా ఉపదేశ ము సొన్నుగుండు ఇందిగా గడ్లి ఇక్కురు మొనుసు లేక అవి శ్వాసి ఉల్లికి వందు పాతిగా నింగ్లుట ఉపదేశం వలన అదు పాపి యిండు గ్రహించాదు, అడ్డేరుట మూలంగా అత్తుకు ఒప్పుదల కలుగాదు. 25 అప్పుడు అసా హృదయముకోరిక్కురు రహస్యాలు గడ్లికి బూక్కుదు. అప్పుడు అదు సాగిలిబూదు దేవురున ఆరాధించి, దేవురు నిజంగా నింగ్లుకోరు కీదు యిం డు ప్రకటించాదు. 26 సోదరులారా, ఇప్పుడు ఎందాదు జరగ క్కుదు? నింగ్లు సమావేశం అయినప్పుడు ఒండాలు ఒండు పాటను పాడుభేకిండు, ఇంకొండాలు దేవురుట వాతలు ఉప దేశించుభేకిండు పాకక్కుదు, ఇంకొండాలు దేవురు అత్తుకు బయలు పరిచిక్కుత ప్రకటించు భేకిండు పాకక్కుదు. ఒండా లు తెలిమాటారు భాషోటి వాచ్చిబేకు యిండు పాకందిగా ఇంకొండాలు అత్తుకు అర్థము సొన్నుభేకిండు పాకక్కుదు. సరే, అడ్డిన సంఘాభివృద్ది కోసం జరిగించంగో. 27 ఏదన్నా తెలిమాటారు భాషోటి వాచ్చినిగా, రెండాలు, అవసరమాసా మూడాలు మించారుగుండా, ఒండాలు తర్వాత ఒండాలు వాచ్చుభేకు. ఒండాలు అత్తుకు అర్థము సొన్నుభేకు. 28 అర్థం సొన్నురాలు ఇల్లాదిందిగా అదు సంఘముకోరు మైనముగా ఇక్కిభేకు. అయితే అదు అదోటి, దేవురోటి వాచ్చుగచ్చు. 29 దేవురుట మూలంగా ఉపదేశించురాయ రెండా లు మూడాలు వాచ్చచ్చు. మిగిలిక్కిరాయ ఆ ఉపదేశాన్ని వివేచనపూర్వకంగా కేకుభేకు. 30 అయితే అటి కొందుగుండిక్కు రు ఇంకొండాలుకు ఎందాదన్న బయలుబూచ్చ మిన్నాలు మౌనంగా ఇక్కిభేకు. 31 అడ్డేరు కెచ్చుగురు తీరి, హెచ్చరిక పొందుగురు తీరి నింగ్లు అడ్డేరు ఒండాలు తర్వాత ఒండాలు ఉపదేశం సొన్నచ్చు. 32 ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనము కోరు కీదు. 33 ఎందాతుకు ఇండిగా పరిశుద్ధుల సంఘములు అడ్డికోరు దేవురు శాంతి సమాధానాలు కలిగించురాలే గానీ గందరగోళము కలిగించురాలు అల్లా. 34 పొంబిల్లాయ సంఘసమావేశముకోరు మౌనంగా ఇక్కిభేకు. అయిలు లోబుగురు తీరి ఇక్కిభేకు. అయిలికి వాచ్చిత్తుకు అనుమతి ఇల్లా. ఇదే విషయమును ధర్మశాస్త్రము కూడా సొన్నక్కుదు. 35 అయిలు ఎందాదన్నా తెలుజుగుభేకు ఇండుగుండిగా అస ఊటుకోరు ఇక్కురు అదుగుమనాగును కేకాసికి. సంఘముకోరు పొంబిల్లి వాచ్చు రుదు అవమానకరం. 36 ఎందు, దేవురుట వాక్యం నింగ్లచ్చుండే బయలుదేరి కీదా? నింగ్లచ్చుకు మాత్రమే వందు కీదా? 37 ఏదన్నా అదు ప్రవక్త యిండు లేక ఆత్మీయ మొనుసు యిండు భావించిగా ఇటి నాను నింగ్లుకు రాసక్కు దు ప్రభువు సొన్నిక్కురు ఆజ్ఞలు యిండు అదు ఖచ్చితంగా తెలుజుగుభేకు. 38 తెలిమాటారాలు ఏదన్నా ఇందిగా అత్తును తెలిమాటారాలు తీరే ఇక్కాసికి. 39 కాబట్టి నా సోదరులారా, దేవురుట మూలంగా ఉపదేశించురుదు ఇంగురు వరమును ఆశోటి కోరుగొంగు. తెలిమాటారు భాషోటి వాచ్చురుత ఆపమానంగా. 40 అడ్డి మర్యాదగా, క్రమంగా జరిగించంగో.