అధ్యాయము 11

1 నాను క్రీస్తు తీరి ప్రవర్తించురు ప్రకారం నింగ్లు నంతిరి ఇరంగో. 2 నింగ్లు అడ్డి విషయముకోరు నన్న జ్ఞాపకం సేందుగుండు,నాను నింగ్లుకు ఉపదేశించిక్కురు పద్ధతలను అనుసరించక్కురంగా యిండు నింగ్లున మెచ్చు గక్కిరి. 3 నింగ్లు తెలుజుగురుదు ఎందాదిండిగా, అమికేరుకు తల క్రీస్తు, పొంబిల్లికి తల ఆమికేరు, క్రీస్తుకు తల దేవురు. 4 అస తల కప్పుగుండు ప్రార్థన సేయిరు ఆమికేరు అస తలను అవమానం సేందురు తీరి ఆక్కుదు. 5 అస తలను కప్పుగారుగుండా ప్రార్థన సేయిరు, ఇల్లాదిందిగా ప్రవచించురు పొంబిల్లి అస తలను అవమాన ము సేందురు తీరి ఆక్కుదు. ఎందాతుకు ఇండిగా ఆ యమ్మ తల గోరిగించుకుండిక్కురాయితో సమానం. 6 అస తల కప్పు గు మాటారు పొంబిల్లి అస తల మెగురు కత్తిరించుగు భేకు. అన్నగ కత్తిరించుగుదు ఇల్లాదిందిగా పూర్తిగా మెగురు వంగో డుదు ఆ యమ్మకు అవమానామాసా ఆయమ్మ తల కప్పుగు బేకు. 7 ఆమికేరు దేవురుట పోలిక, ఆయనట మహిమ. కాబట్టి అదు అస తలను కప్పుగుమాదు. పొంబిల్లి ఆమికేరు కు మహిమ. 8 అదు ఎన్నగ ఇండిగా, పొంబిల్లి ఆమికేరుకోరుం డు కలిగి కీదు గాని ఆమికేరు పొంబిల్లికోరుండు కలిగిల్లా. 9 పొంబిల్లిన ఆమికేరుకోసం సృష్టించి కీదు గాని ఆమికేరున పొంబిల్లికోసం అల్లా. 10 కాబట్టి దేవదూతల కారణం గా పొంబిల్లికి తల మేని ఒండు అధికార సూచన ఇక్కిబేకు. 11 అయితే ప్రభువుకో పొంబిల్లికి వేరుగా ఆమికే రు, ఆమికేరుకు వేరుగా పొంబిల్లి ఇక్కిమాదు. 12 ఎన్నగ పొంబి ల్లి ఆమికేరుండు కలిగి కీదో, అన్నగే ఆమికేరు పొంబిల్లి మూ లంగా కలిగి కీదు. అయితే సమస్తము దేవురు నుండి కలిగి కీదు. 13 నింగ్లే సొన్నంగో. పొంబిల్లి తల కప్పుగారుగుండా దేవురుకు ప్రార్థన సేయిరుదు నల్లాదేనా? 14 ఆమికేరు తల మెగురు పెంచుగురుదు అత్తుకు అవమాణ మిండు, 15 దేవురు పొంబిల్లికి తల మెగురు పైటకొంగుగా తంది కీదు కాబట్టి ఆయమ్మ అత్తును పెంచుగురుదు ఆయమ్మకు ఘనత యిండు నింగ్లుకు గొర్తు. 16 ఈ విషయముకోరు వేరే వాదనలు సేయిరాలు, నంగ్లుకోరు గాని, దేవురుట సంఘము కోరు గానీ ఇత్తుకు వ్యతిరేకంగా ఎంతారు ఆధారము ఇల్లా యిండు తెలుజుగొంగు. 17 నింగ్లుకు ఈ ఆజ్ఞతందు నింగ్లున ఎందు మెచ్చుగురుతిల్లా. ఎందాతుకు ఇండిగా నింగ్లు సమావేశం ఆగుదు ఎక్కువ కీడుకే కారణమాగక్కుదు గానీ ఎక్కువ మేలుకు అల్లా. 18 మిన్ని సంగతి, నింగ్లు సమావేశమానప్పుడు నింగ్లుకోరు కక్షలు కీదిండు వినుబూచ్చు. కొంతమట్టుకు ఇది నిజమే ఇండిగక్కిరి. 19 నింగ్లుకోరు నిజంగా యోగ్యులు ఏదో తెలిబేకు ఇండిగా నింగ్లుకోరు భిన్నాభిప్రాయాలు ఇక్కాసిక్కి దే. 20 నింగ్లు అడ్డేరు సమావేషమాయి కలుసు గుండు తింగురుదు ప్రభు నామారి కలి అల్లా. 21 ఎందాతుకు ఇండిగా నింగ్లు ఆ కలి తింగురప్పుడు ఒండాలు కంటే ఒండా లు మిన్నిగా అయిలు మట్టుకు అయిలే తింగక్కుదు. ఒండా లు కలి పెస్తుగుండు కీదు ఇంకొండాలు నల్లక తిండ్రు మత్తుకో రు మునుగోసు. 22 ఎందాదిదు? తిండ్రు కుడికిత్తుకు నింగ్లుకు ఊడు ఇల్య? దేవురుట సంఘమును చిన్న చూపు పాతు ఎందాదు ఇల్లాయిండు అవమాన పరచాకంగా? నింగ్లోటి ఎందాత సొన్నుబేకు? నింగ్లున మెచ్చుగుబేకు ఇండుగాకంగా? ఈ విషయముకోరు నింగ్లున మెచ్చుగుమాటి. 23 నాను నింగ్లుకు అప్పగించిక్కురుత ప్రభువే నాకు తంచు. ప్రభు యేసును శత్రువులు పుడుసుగుండిక్కు రు నామారి, ఆయన ఒండు రొట్టెను కియ్యికోరు పుడుసు గుండు. 24 స్తుతులు చెల్లించురుదు ఆనప్పుడు అత్తును ఒడు సు, 'ఇది నింగ్లు కోసరమగు నట ఒడుము. వంకుండు తింగం గో. నట జ్ఞాపకార్దంగా ఇత్తును సేయంగో' యిండు సొన్నుసు. 25 కలి తింగురుదు ఆనప్పుడు అన్నగే ఆయన పాత్రను కియ్యికోరు పుడుసుగుండు, 'ఈ పాత్ర నట రగుతు మూలంగా సేందిక్కురు పిదు ఒడంబడిక. నింగ్లు ఇత్తును కుడుకురు ప్రతిసారి నన్ను జ్ఞాపకం సేందుగిత్తుకు ఇత్తున సేయంగో ఇంగుసు. 26 నింగ్లు ఈ రొట్టెను తిండ్రు, ఈ పాత్రకోరు దు కుడుకురు ప్రతిసారి ప్రభువు వార్రు దాకా ఆయనట మర ణమును ప్రకటించక్కురంగా. 27 కాబట్టి ఏదన్నా అయోగ్యముగా ప్రభువు రొట్టెను తిండ్రు ఆయనట పాత్రకోరుదు కుడికాదో అయిలు ప్రభువు శరీరం, ఆయనట రగుతు విషయముకోరు అపరాధులు ఆక్కుదు. 28 కాబట్టి ప్రతిఒండాలు అత్తుకు అదే పరీక్షించుగుండు ఆ రొట్టెను తిండ్రు, ఆ పాత్రకోరుదు కుడుకు బేకు. 29 ఎందాతుకు ఇండిగా ప్రభువుట ఒడుము గురించి సరైన అవగాహన ఇల్లారుగుండా అత్తును తిండ్రు, కుడుకురాలు అదుగుమేనుకు శిక్షను ఎత్తేందుగక్కుదు. 30 ఈ కారణం చేత నింగ్లుకోరు చాలామంది నీరసంగా, అనారోగ్యంగా కీదు. చాలామంది సొత్తోసు. 31 అయితే నంబురును నంబురే పరిశీలన సేందు గుండు ఇందిగా నంబురు మేనుకు తీర్పు వామాదు. 32 నంబు రు తీర్పు బూదిక్కురు లోకుమోటి శిక్షకు గురి ఆగారుగుండా ప్రభువు నంబురును శిక్షించి సరిదిద్దక్కుదు. 33 కాబట్టి నా సోదరీ సోదరులారా, నింగ్లు కలి తింగిత్తుకు వందప్పుడు ఒండాలు కోసం ఒండాలు తట్టుగు బేకు. 34 నింగ్లు ఇన్నగ కలుసుగురుదు నింగ్లు మేనుకు తీర్పు వారిత్తుకు కారణం ఆగారుగుండా, కలి పెస్తుగుండిక్కురాలు అస ఊటుకోరే కలి తిండ్రు వారూబేకు. నింగ్లు రాసిక్కురు మిగతా సంగతులను నాను నింగ్లచ్చుకు వందప్పుడు సరిసే యాకి.